304 ఎవరి పంచె పోతుంది, ఎవరి పంచె మిగులుతుంది?
చర్చనీయాంశాలు: 304, Popularism, Communism, Assembly, కమ్యూనిజం, మార్క్సిజం, వెంకయ్యనాయుడు,బిజెపి
శ్రీచంద్రబాబు నాయుడు, శ్రీవెంకయ్యనాయుడు, శ్రీనరేంద్రమోడీ వంటి మాటల పులుల మధ్యపోటీ పెట్తే ఎవరు గెలుస్తారు? పదాల సెట్లుతయారు చేసి జోకులు వేయటంలో శ్రీ వెంకయ్యనాయుడుగారు దిట్ట. శ్రీనరేంద్రమోడీగారు మత సంబంధమైన విషయాలలో మాత్రమే ఇతరులకు నచ్చ చెప్పగలరు. శ్రీచంద్రబాబునాయుడుగారు, ఇతరులపై ప్రజలకు ఉండే అసంతృప్తిపై, అవసరానుగుణంగా వెన్నుపోట్లు పొడుచుకుంటూ నెగ్గుకొస్తున్నారు.
కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల కొరకు ఏర్పాటుచేసిన అవగాహనా తరగతులు ( ఓరియంటేషన్ ప్రోగ్రాం ) లో శ్రీ వెంకయ్యనాయుడు సర్, వేసిన ఒక జోక్ పరిశీలనార్హం.
ఆంధ్రజ్యోతి దినపత్రిక 19-7-2014 వచ్చిన వార్త ఆధారంగా పరిశీలిద్దాం. శ్రీ వెంకయ్యనాయుడిగారి ప్రబోధం:-
ఇంటిముందు పేడకళ్ళు కూడ ఎం.ఎల్.ఎ.నో, మునిసిపల్ ఛెయిర్మనో వచ్చి తీయాలని, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆపరిస్థితి తెచ్చింది రాజకీయ పార్టీలే. అన్నీ మేమే చేస్తామని రాజకీయపార్టీలు ఒకదాంతోఒకటి పోటీపడి ప్రజలను చెడగొడ్తున్నాయి. అన్నీ ఉచితంగా ఇస్తామని పోటీలుపడి హామీలు ఇస్తున్నాయి. మా నాన్న హయాంలో గ్రామాల్లో వానాకాలానికి ముందు, చెరువులు కాలువలు రైతులంతా కలసి బాగుచేసుకునే వాళ్ళు. నా హయాం వచ్చే సరికి ఆఊసే ఎవరూ ఎత్తటం లేదు. అన్నీ ఉచితంగా చివరికి పంచె మిగులుతుంది. న్యాయంగా రాబట్టుకోవాల్సిన ఆదాయం కూడ రాబట్టుకోకుండా ప్రతివాళ్ళూ పైనున్న వారి వద్దకు నిథుల కొరకు పరుగెత్తుతున్నారు. డబ్బులేకుండా అభివృధ్ధి చేయలేం. అభివృధ్ధితోపాటు సంక్షేమాన్ని కూడ సమతౌల్యం చేసుకోవాలి. ఆదాయం రాబట్టుకోవాలి. పేదల అవసరాలు తీర్చాలి.
వైబీరావు గాడిద అభిప్రాయం
ఈవిషయం శ్రీ వెంకయ్యనాయుడు గారు ఎన్నికలముందు తన ప్రెస్ కాన్ఫరెన్సులలో, ఎన్నికల ప్రచార సభలలో చెప్తే ఎంత బాగుండేది. కరపత్రాలు వేసి పంచి పెట్తే ఎంత బాగుండేది. శ్రీచంద్రబాబు నాయుడు, శ్రీనరేంద్రమోడీగారు కూడ ఈపేడకళ్ళ విషయాన్ని ఎన్నికల ముందు ఎక్కడా చెప్పలేదు.
విశాఖపట్నాన్ని లాస్ ఏంజల్స్ చేస్తామని వాగ్దానం చేసింది ఆంధ్ర ప్రదేశ్ బిజెపి యేనా కాదా?? విశాఖను లాస్ ఏంజలిస్ చేయగల బిజెపి మహామాంత్రికులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పంచాయితీలను, పురపాలకసంఘాలను, నడపలేరా? తగిన సమయంలో చెరువులను రిపేరు చేయించలేరా? మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిపథకం నిధులున్నాయిగా?
శ్రీవారికి కేంద్రం పట్టణాభివృధ్ధి శాఖా మంత్రిగా కేంద్రం ఢిల్లీలో ఒక పెద్ద బంగళాను ఇస్తుంది. ఈబంగళా ముందు పేడకళ్ళను ఎవరు తీస్తున్నారు? అయ్యగారు కర్నాటక తరఫునరాజ్యసభకు ఎన్నికయి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాబట్టి బెంగుళూరులో కూడ ఒకబంగళా ఉండి ఉండాలి. ఆబంగళా గేటు ముందు వీధిలోని పేడకళ్ళను ఎవరు తీస్తున్నారు. శ్రీమాన్ జీ కి హైదరాబాదులో కూడ ఒక బంగళా ఉండి ఉండవచ్చు. కెసీఆర్ దృష్టిలో శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు ఆంధ్రోడు కాబట్టి, ఆయన బంగళాముందు పేడకళ్ళను తీయవద్దని కెసీఆర్ ఆజ్ఞాపించకపోతే , అక్కడి పేడకళ్ళను కూడ మునిసిపల్ వారే తీస్తూ ఉండాలి. ఇన్ని బంగళాలముందు పేడకళ్ళను ప్రభుత్వం తీయించగలుగుతున్నపుడు, గ్రామ ప్రజల ఇళ్ళు చేసిన నేరమేమిటి?
పారిశ్రామికవేత్తలకు 10 సంవత్సరాల టాక్సు మినహాయింపు ఇస్తామని వాగ్దానం చేసింది ఆంధ్రప్రదేశ్ బిజేపీ యేకదా. సామాన్యుడు ఎండు మిరపకాయలు కొంటే, వాడి దగ్గర నాలుగు శాతం వ్యాట్ వసూలుచేసే ఈప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు 10 సంవత్సరాలపాటు టాక్సు ను కట్టక్కరలేదు, అంటే ఉచితంగా ఇచ్చినట్లేకదా. అపుడు శ్రీమాన్ జీ వెంకయ్య నాయుడు గారికి పంచె మిగులుతుందా, పోతుందా?
సామాన్య ప్రజలు రూ. 3.5 కోట్ల ఖరీదు చేసే లంబార్డో కారు ఉచితంగా ఇప్పించమని అడుగుతున్నారా? ఎంపీలకు చేయిస్తున్నట్లుగా , ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్ళి విదేశాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించమని అడుగుతున్నారా? మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు, మతప్రచారకులు, స్టార్లు, క్రికెటర్లు, ఘరానా లాయర్లు, ఘరానా డాక్టర్లు పోగు చేసుకున్న కిలోల కొద్దీ బంగారాన్ని తలా ఒక గ్రాము చొ|| ఉచితంగా పంచి పెట్టమని అడుగుతున్నారా? లేదే? ఇంకెందుకు నేతలకు పంచెలు ఊడిపోతాయి?
ప్రశ్న: మీరు అతిగా విమర్శిస్తున్నారు. ఈసమస్యను మీరు, మార్క్సిజంలో ఎలా పరిష్కరిస్తారో చెప్పండి.
జవాబు: అది సమస్య కానే కాదు. మార్క్సిజం లో ప్రజలకు అవసరమైనది ప్రతిదీ ఉచితమే. అవసరం లేని లంబార్డీ కార్లను, ప్రైవేటు జెట్లను, వ్యక్తిగత హెలికాప్టర్లను ఉత్పత్తి చేసే ప్రసక్తి లేనేలేదు. మార్కెట్ లో క్యాష్ ఉన్నవాడు, క్యాష్ ను భారీగా విసిరి పారేయటానికి సిధ్ధపడి, కొండమీద కోతి కావాలంటే, మార్కెట్ ఇకానమీ తెచ్చిస్తుంది. అలాంటి దైన్యం మార్క్సిజానికి ఎన్నటికీ ఉండదు.
మార్క్సిజాన్ని సరిగా అమలు చేయాలంటే ప్రైవేటు ప్రాపర్టీని రద్దు చేయక తప్పదు. ఉదాహరణకి ఒక సినిమా స్టూడియో యజమాని పుత్రుడు, సినిమా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మారి, థియేటర్లను కాప్చర్ చేసి, తెలుగు సినీ సామ్రాజ్యాన్ని దున్నేసిందే కాక, ఇంకో స్టూడియోను సిధ్ధం చేసుకోవటానికి 3,000 ఎకరాల భూమి కొన్నాడంటే ఏమనాలి? అదే 3000 ఎకరాలను ప్రజలసంపదగా మారిస్తే, ప్రజలకు అన్నీ సమకూరవా? పంచెలు మిగిలే పరిస్థితి ఎందుకు వస్తుంది?
మార్క్సిజమూ, నియంతృత్వమూ ఒకటి కాదు. గతంలో రష్యా, ఈస్టు యూరప్, చైనా, క్యూబా, నార్త్ కొరియాలలో కమ్యూనిజం పేరుతో జనం నెత్తిన టోపీ పెట్టింది నియంతృత్వం. మార్క్సిజానికీ ప్రజాస్వామ్యానికీ వైరుధ్యం లేదు. మార్క్సిజం ప్రజాస్వామ్యానికి అదనమే తప్ప, దానికి బదులుగా కాదు. Marxism is supplementary to democracy. मार्क्सवाद लोकतंत्र के लिए पूरक है. Marxism is not a substitute for democracy. मार्क्सवाद लोकतंत्र के लिए एक विकल्प नहीं है.
ప్రజాస్వామ్యంలో, నేతలను అదుపులో పెట్టుకునే బాధ్యత ప్రజలకు ఉన్నట్లే, మార్క్సిజంలో కూడ ఆబాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం ఇది సరిగా జరగకపోటానికి ముఖ్యకారణం, ప్రజలు పెట్టుబడిదారీ విధనానికి దాసులు కావటం. సరియైన వ్యక్తులను తమ ప్రతినిథులుగా ఎన్నుకోవాలనే తమ బాధ్యతను సరిగా నిర్వర్తించక పోవటం. ఎన్నికలకు ముందు చెప్పని విషయాలను తరువాత చెప్పటం, చెప్పిన విషయాలను ఏదో ఒక వంకతో నిర్వర్తించకపోవటాన్ని ప్రజలు ఒకసారి మన్నించి తిరిగి వారిని గెలిపిస్తే ఏదోలే ప్రజలు క్షమించారులే అనుకోవచ్చు. కానీ మరల మరల అవకాశాలు ఇచ్చుకుంటూ పోతుంటే, వంచించపడేది వాళ్ళే.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.