Justice should not only be done, but also appear to have been done. There is also another hackneyed cliche expression: Justice Delayed is Justice Denied. In India both these maxims are repeated quite often, but nothing really happens to demonstrate the first maxim or to prevent the second maxim from happening. It has also become a custom, for every Chief Justice of India to express his anguish about the cases pending since decades. I do not wish to say that they pay lip sympathy while lamenting about the pending cases, but I wish to highlight the apathy of the Government about the problems of the Judiciary. At the same time, when a CJI finds that the Government is irretrievably callous about the problems of the Indian Judicial System, notwithstanding his frequent appeals for initiating corrective measures, the right thing for him-her ought to be to resign. It is not correct to say that Resigning does not solve problems, or that resigning is cowardice or timidness, or that a courageous CJI should fight and work for rectification of the System. But ybrao-a-donkey views this problem, differently. If an unhappy CJI quits in disgust, public awareness will get enlightened. It will also enlighten the Advocates, about the seriousness of the problem. The succeeding new CJI will make a renewed effort for getting additional Judges, and establishment of additional courts. Probably, the new CJI may also have to quit. But, definitely there will be result after four or five CJIs quit. Govt. cannot for ever remain a silent spectator.
The problem is Supreme Court Justices too have their own personal ambitions and expectations. They do not want to unduly displease the Government of India . A token expression of resentment and dissent may be sufficient in their view.
న్యాయం జరగటమే కాదు జరిగినట్లుగా కనపడాలి
చర్చనీయాంశాలు: 297, న్యాయవాద వృత్తి, సుప్రీం కోర్టు, Supreme Court, Judiciary, Justice A.P. Shah, Justice Venkatachalaiah, Lr. Shri UU Lalit, Lr. Shri Gopal Subrahmaniam, Lr. Shri Ramjeth Malani
'
న్యాయం జరగటమే కాక న్యాయం జరిగినట్లుగా కనపడాలని న్యాయసూత్రం ఒకటుంది.
సుప్రీం కోర్టు తీవ్రమైన పని భారంతో బాధపడుతున్న మాట నిజమే. న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయవలసిన అవసరం కూడ ఉన్నది. న్యాయమూర్తుల నియామకం పారదర్శకంగా జరగాలనే ప్రజాభిప్రాయం కూడ ఉంది.
ప్రస్తుతం ఉన్న పధ్ధతిలో సిజెఐ తో పాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తుల కోలీజియం, అర్హులైన అభ్యర్ధుల పానెల్ ను తయారు చేసి కేంద్ర న్యాయ శాఖకు పంపుతుంది. సాధారణ పరిస్థితిలో అయితే కేంద్రం వాటిని ఆమోదించటం జరుగుతున్నది. ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత ను కాపాడుతుంది. కార్యనిర్వహణ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య సమతౌల్యానికి దోహదం చేస్తుంది.
ఇటీవల కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చాక రోజులు మారాయి. కోలీజియం వారు అంతకు ముందు కోటీశ్వర లాయర్ శ్రీ గోపాల్ సుబ్రహ్మణ్యంగారి పేరును సిఫార్స్ చేసి యున్నారు.
అయితే గుజరాత్ లో సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో శ్రీగోపాల్ సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టుకు ఎమికస్ క్యూరీ (సహాయకుడు) గా పనిచేసి యున్నందున, అందులో నిందితుడు, ఆరాష్ట్రం హోం శాఖ సహాయ మంత్రి శ్రీ అమీత్ షా పై కూడ విచారణ జరప వలసి వచ్చింది. ఇది గుజరాత్ ప్రభుత్వానికి, నాటి గుజరాత్ ముఖ్యమంత్రే నేటి ప్రధాని కావటంతో, నేటి కేంద్రప్రభుత్వానికీ కోప కారకం అయినట్లు కనిపిస్తుంది. ఫలితంగా కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారిని సంప్రదించకనే, శ్రీగోపాల్ సుబ్రహ్మణ్యం గారి నామినేషన్ ను తిరస్కరించింది. దీనితో అసంతృప్తి చెందిన సుబ్రహ్మణ్యం గారు తన నామినేషన్ ను సుకోప్రన్యామూ గారిని సంప్రదించకనే వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ శ్రీ ఆర్. ఎమ్. లోఢా, సుకోప్రన్యామూ గారికి విచారాన్ని కలిగించగా, వారు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన విషయం పాఠకులకు తెలిసినదే. అంతే కాక జస్టిస్ లోఢా మహాశయ్, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి భంగం కలుగ నివ్వనని వాకృచ్చి యున్నారు.
ఇంకా ఆ వేడి చల్లారనే లేదు. రేగిన దుమ్ము ఇంకా అణగనే లేదు. చేయబడిన గాయాలు మాననే లేదు. ఇపుడు బిజెపి జాతీయ అధ్యక్షుల వారైన శ్రీ అమీత్ షా (వీరి కేసులోనే తిరస్కరంచబడిన గోపాల్ సుబ్రహ్మణ్యం గారు ఏమికస్ క్యూరీ గా వ్యవహరించింది), గారి తరఫున వాదించిన కోటీశ్వర న్యాయవాది శ్రీ ఉదయ్ యు. లలిత్ గారిని సుప్రీంకోర్టు కోలీజియం, న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది. శ్రీ లలిత్ మహాశయ్, శ్రీజగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అవినీతి కేసులో వారి తరఫున, సినీస్టార్ సల్మాన్ ఖాన్ గారిపై ఉన్న క్రిమినల్ కేసులో వారి తరఫున , పంజాబు ముఖ్యమంత్రి శ్రీ అమరేంద్ర సింగు గారి తరఫున వారిపై నడచిన అవినీతి కేసులో, సైనిక దళాల మాజీ ప్రధాన అధికారి శ్రీవికే సింగు గారి మిలిటరీ సర్వీసు రికార్డులో వయసు మార్పిడీ కేసులో వారి తరఫున వాదించారుట.
సుప్రీం కోర్టు ఎప్పుడూ కోటీశ్వర లాయర్లనే న్యాయమూర్తులుగా, ఏమికస్ క్యూరీలు గా ఎందుకు ఎంపిక చేస్తుంది?
ఇది ఒక పెద్ద ప్రశ్ననా? జవాబు: అదే మన పెట్టుబడి దారీ విధానపు గొప్పదనం. సమర్ధులైన న్యాయవాదులుగా న్యాయమూర్తుల కనుసన్నలలోకి వెళ్ళాలంటే, మధ్యశ్రేణి న్యాయవాదులు అయితే సరిపోదు. కోట్లు ఫీజు తీసుకునే వారయితేనే సమర్ధుల క్రింద లెక్క. పిర్రలను చూసి పీటలు వేయటమంటే ఇదే. మధ్యశ్రేణి న్యాయవాదులు కొన్ని వందల మంది సుప్రీం కోర్టులోఉండ వచ్చును. అయితే వారి మెరిట్ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళే అవకాశాలు తక్కువ గా ఉంటాయి. ప్రెలిమినరీ స్క్రూటినీలో భాగంగా, సుప్రీంకోర్టు కోలీజియం వారు మధ్యశ్రేణి న్యాయవాదులకు లిఖిత పరీక్ష, నిశితమైన గ్రూప్ డిస్కషన్లు, వైవా వోస్ మొ|| స్వతంత్ర పర్యవేక్షకులచేత చేయిస్తే, ఎవరి కోటీశ్వర న్యాయవాదుల మెరిట్ ఎంతో, మధ్యశ్రేణిలో హై ప్రొఫైల్ కి తెగబడక, గుర్తింపుకు నోచుకోని న్యాయవాదుల మెరిట్ ఎంతో బయట పడుతుంది.

వైబీ గాడిద, అనుబంధ ప్రశ్న

కోటీశ్వర లాయర్లు కోట్లు ఎలా సంపాదించ కలుగుతున్నారు?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ (మరియు తెలంగాణ) లో ఒక వార్త బయటకు వచ్చింది. నదీ జలాల వివాదాల్లో రాష్ట్రాల వాదనలను సమర్ధవంతంగా ప్రజెంట్ చేసి ఆనదిలో నీళ్ళన్నీ తమకే రప్పించేలా చూడటానికి, వివాదాల్లో తేలుతూ ఉండే రాష్ట్రాలు తమ తమ అడ్వకేట్ జనరళ్ళను కాకుండా, లేక వారికి అదనంగా, బయట లాయర్లను వినియోగించటం గమనార్హం. అలా వినియోగించినపుడు కోట్లకొలది రూపాయలను చెల్లించటం అలవాటయ్యింది. ఎప్పుడైతే కోట్లు ఫీజుగా ముట్ట చెప్తున్నారో పైరవీలు పెరిగాయి. ఏలాయర్ సమర్ధుడు, ఏలాయర్ సమర్ధుడు కాడు, అనే వాటికి నిర్వచనాలు లేకపోటంతో, పైరవీకారుల పని తేలికయింది. శ్రామికుల ధర్మజలానికి, ఘర్మజలానికి సరియైన ఖరీదు కట్టేవాళ్ళులేరు కానీ, ఒక ఐఎఎస్ లేక ఐపి ఎస్ అధికారి తన జీవితమంతా 24x7x365 నిజాయితీగా సేవచేసి సంపాదించే మొత్తానికి ఎన్నో రెట్లు లాయర్లకు ఫీజుగా ముట్టచెప్పటం ఆలోచించ తగ్గ విషయం.
టెర్రరిజంలో పాల్గొంటూ అక్కడికక్కడే పట్టుపడ్డ ఉగ్రవాదుల తరఫున, అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన లంచావతారాలు తరఫున, స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్న క్రిమినల్ కేసులలో నిందితుల తరఫున, ముందూ వెనుకా చూచుకోకుండా, కోటీశ్వర న్యాయ వాదులు వాదించటమే కాక తాము చేసేది ఆంగ్ల న్యాయ తత్వ శాస్త్రం ప్రకారం చాల గొప్ప సేవ అనే, అలాంటి లాయర్ల వాదనలో ఎంతమేరకు బలం ఉంది?
జవాబు: ఇలాంటి వాదనను గతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన పత్రికలో ప్రఖ్యాత న్యాయ వాది శ్రీరాం జెఠ్ మలానీ గారు చేసినట్లు గుర్తు. పార్లమెంటుపై దాడిచేసిన ఉగ్రవాదుల తరఫున వాదించటంలోని సమంజసత్వాన్ని కొందరు విమర్శించినపుడు, శ్రీవారు ఈతరహా వాదనను చేసినట్లు నాకు గుర్తు.
ఈ తరహా వాదనలో కొన్ని సమంజసమైన విషయాలు ఉన్నాయి.
1. ఆంగ్లేయ న్యాయతత్వ శాస్త్రం (British Jurisprudence) ప్రకారం, న్యాయవాది, క్లయింటు దగ్గర ఫీజు తీసుకున్నప్పటికీ, క్లయింటు యొక్క నౌకర్ కాదు. కోర్టు యొక్క సహాయకుడు. కేసులో అసలేం జరిగింది అనే సత్యన్వేషణలో కోర్టుకు తోడ్పడతాడు. సైధ్ధాంతికంగా ఆలోచిస్తే ప్రతి న్యాయవాదీ కూడ ఏమికస్ క్యూరీనే.
2. ఇరు పక్షాల న్యాయవాదులూ, ఖచ్చితమైన న్యూట్రాలిటీ పాటించాల్సిందే.
3. ఏన్యాయవాది కూడ నిందితులను, పార్టీలను ప్రీ జడ్జి చేయకూడదు. తన వద్దకు వచ్చిన వ్యక్తి నేరస్థుడా కాదా అనేది నిర్ణయించాల్సింది కోర్టు కానీ, న్యాయవాది కాదు. కోర్టు శిక్ష విధించే వరకు, ప్రతినిందితుడు నిర్దోషి కిందే లెక్క కాబట్టి, లాయర్లు కోర్టు చేయాల్సిన పనిని తమ నెత్తిన వేసుకొని, ఆనిందితుడి కేసును వాదించటానికి నిరాకరించకూడదు. (ఇక్కడ రీడ్ బిట్వీన్ దీ లైన్స్ ఉంది: కోట్లు, లక్షలు ఫీజుగా ముట్ట చెప్తామని వచ్చే సిమెంటు కంపెనీల వాళ్లు, బొగ్గుల కంపెనీల వాళ్ళు, టెలీకాం కంపెనీల వాళ్ళు, అమీత్ షాలు, జగన్మోహన్ రెడ్లు, సల్మాన్ ఖాన్లు, మఠాల స్వాములు, ఉగ్రవాదులు, తండూరి చికెన్ లో పెట్టి స్త్రీలను కాల్చేవాళ్ళ కేసులను అసలు నిరాకరించకూడదు. ఏదైనా కేసు కాగితాలు తీసుకుని ఏ బక్కరైతో, శ్రామికుడో పొరపాటున తననాశ్రయించటానికి వస్తే, వాళ్ళను గేటు దగ్గర అటకాయించటానికి గేటు దగ్గర మంచి సాయుధపాణులైన గార్డులను పెట్టుకోవాలి).
4. ఇదే బ్రిటీష్ న్యాయతత్వ శాస్త్రం అడిగినంత ఫీజు అడ్వాన్సుగా ఇవ్వలేక పోయినా, కేసును హాయిగా తిరస్కరించుకోవచ్చని న్యాయవాదులకు అనుమతిస్తుంది. ఈవిషయంలో మనం నేను న్యాయ వాదులను తప్పు పట్టకూడదు. ఎందుకంటే, న్యాయవాదులకు ప్రభుత్వం జీతం ఇవ్వదు. వాళ్ళకీ సంసారాలు ఉంటాయి. కార్లుంటాయి. ఏసీ మిషన్లుంటాయి. జీవిత కాలంలో కనీసం 1.6 కిలోల బంగారమైనా పోగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మానవుడి ఎగ్జిస్టెన్షియలిజంలో ఒక భాగం. పెట్టుబడిదారీ సర్వైవలిజంలో ఒక భాగం.
సుప్రీం కోర్టులో అవినీతి సంగతి ఏమిటి?
సుప్రీం కోర్టులో అవినీతి ఉంది | లేదు, అనే కాన్ సెప్ట్ ఒక దేవతా వస్త్రం లాంటిది. ఒకమోసగాడు, ఒకరాజుదగ్గరకు వెళ్ళి తాను దేవతలు తప్ప మానవులు ధరించని వస్త్రాలు నేస్తానని నమ్మించి, ఖజానా ఖర్చుతో జల్సాలు చేసేశాడు. మధ్యలో రెండుసార్లు రాజు తన సేనానిని, మంత్రిని నేతగాడి విడిదికి పంపి దేవతా వస్త్రాలనేత ఎంతదూరం వచ్చిందో చెక్ చేయించాడు. నేతగాడు ఖాళీ మగ్గాలను చూపి, అవిగో చూశారా తయారవుతుంది, దేవతా వస్త్రం అన్నాడు. మంత్రి, సేనాని నోరెళ్ళ పెట్టి ఎక్కడా దేవతా వస్త్రం అన్నారు. నేతగాడు, ''కనిపించటంలేదా? అవి దేవతలకు, దేవతా లక్షణాలున్న పుణ్యాత్ములైన మానవులకే కనిపిస్తాయి.'' అన్నాడు.
ఇంకా కనిపించటంలేదంటే, తాము పాపాత్ములము అని ఋజువవుతుందని, మంత్రి, సేనాని నోళ్ళు మూసుకొని, నేతగాడు అద్భుతమైన దేవతా వస్త్రం నేస్తున్నట్లు రాజుకి చెప్పారు. కొన్నాళ్ళైనాక రాజుకూడ వెళ్ళి చూసాడు. నేతగాడు రాజుపై కూడ అదే టెక్నిక్ ప్రయోగించాడు. తనకు దేవతా వస్త్రం కనిపించటంలేదని, నేరగాడిని దండిస్తే, తాను పాపాత్ముడు కావటాన తనకుదేవతా వస్త్రం కనపడలేదని ప్రజలనుకుంటారని రాజు నేరగాడిని గొప్పగా సన్మానించి, ఆదేవతా వస్త్రాన్ని ధరించి ఏనుగు మీద ఊరేగటానికి సిధ్ధమయ్యాడు.
దిగంబరుడైన రాజు, తనను తాను దేవతా వస్త్రధారిగా సంభావించుకొని, ఏనుగుమీద ఊరేగుతుంటే, రాజోద్యోగులు, రాజభటులు జైజైలు కొట్టటం మొదలుపెట్టారు. లేకపోతే వారంతా తాము పాపాత్ములం అనుకోవాల్సి వస్తుంది. ఇలా రాజు కొంత దూరం వెళ్లాక చివరికి ఒక నాలుగేళ్ళ పిల్లవాడు రాజుకి గుడ్డల్లేవు అని వాదించటం మొదలు పెట్టాడు. ఈవిషయాన్ని రాజభటులు ఎక్కడ వింటారో, రాజుకి ఎక్కడ తెలుస్తుందో అని, ఆరాజు ఈపిల్లవాడిని ఎక్కడ జైల్లోపారేస్తాడో,అని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
చివరికి ఆనోటా ఈనోటా నలిగి నలిగి రాజు చెవికి చేరింది. రాజుకి బట్టల్లేవు అనే విషయాన్ని పిల్లలు అంగీరించినంత తేలికగా పెద్దలు అంగీరించకపోవటంతో సమస్య జటిలమైంది. చిట్టచివరికి రాజుకి తనను నేతగాడు మోసం చేశాడని అర్ధం అయ్యింది.
మన 25వ సుకోప్రన్యామూ శ్రీ జస్టిస్ వెంకటాచలయ్య గారు కోర్టులలో అవినీతి గురించి కొంత స్పష్టంగానే నిజాన్ని అంగీరించారు.
ఢిల్లీ హైకోర్టు భూత పూర్వ ఛీఫ్ జస్టిస్ శ్రీ ఎ.పీ.షా గారు అన్నట్లుగా చెప్పబడుతున్నమాటలు:
“...Our current appointments system, is out of step with democratic culture primarily because it lacks transparency and provides for no oversight. Choosing judges based on undisclosed criteria in largely unknown circumstances reflects an increasing democratic deficit...”
తెలుగుసారం: ... మన ప్రస్తుత నియామకాల వ్యవస్థ, మన ప్రజాస్వామిక సంస్కృతికి అనుగుణంగా లేదు. ఎందుకంటే దానిలో పారదర్శకత లేదు. దానిపై పర్యవేక్షణ లేదు. బహిర్గతం చేయని, అర్హతలు, అంశాల ఆధారంగా న్యాయమూర్తులను ఎంపిక చేస్తున్నప్పుడు, ఎంపిక వెనుక ఉండే పరిస్థితులు తెలియనపుడు, పెరిగిపోతున్న ప్రజాస్వామిక లోపాన్ని ప్రతిబింబిస్తుంది.

విశ్రాంత సుకోప్రన్యామూ జస్టిస్ జెఎస్ వర్మ గారు అన్నట్లుగా చెప్పబడుతున్నమాటలు:
“Every correspondence must be made public so that the CJI can be made accountable for the choice made.”
తెలుగు సారం: మార్పిడి జరిగిన ప్రతి లేఖను, కాగితాన్ని బహిర్గతం చేస్తే, చేయబడిన ఎంపికకు సుకోప్రన్యామూ గారిని బాధ్యుడిని చేయవచ్చు.
తెలుగు సారం: మార్పిడి జరిగిన ప్రతి లేఖను, కాగితాన్ని బహిర్గతం చేస్తే, చేయబడిన ఎంపికకు సుకోప్రన్యామూ గారిని బాధ్యుడిని చేయవచ్చు.
ఈ సందర్భంగా మనం, విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రెస్ కమీషన్ అధ్యక్షుడు, జస్టిస్ మార్కండేయ కట్జూ గారి అభిప్రాయాన్ని కూడ లెక్కలోకి తీసుకోవాలి.
''Under the judge's case, the judgment of Supreme Court, where it was said that the government can return a recommendation of the collegium once, but if the collegium reiterates that recommendation, then the government has to appoint,"
తెలుగు సారం: జడ్జీ కేసు క్రింద, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, కోలేజియం యొక్క సిఫారసును ప్రభుత్వం ఒకసారి వాపసు పంపవచ్చు, కానీ కోలీజియం మరల తన సిఫార్సును ప్రభుత్వానికి పంపిస్తే, అపుడు ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది.
''...In the Subrammaniam case, the government had returned the recommendation of the collegium at the time of the summer vacation of the Supreme Court, when there was no opportunity for the collegium to reconsider it, because most of the judges, including the chief justice were abroad. By the time the chief justice returned, Subramaniam had already gone to the public domain, levelling allegations and withdrawing his name. Instead, he should have been patient and not acted out of emotion, the chief justice even tried to persuade him. Had he kept silent, it would have added to his dignity, and he might have been appointed ...''
సుబ్రహ్మణ్యం కేసు విషయంలో, ప్రభుత్వం కోలీజియం యొక్క సిఫార్సులను , కోర్టు ఎండాకాలం శలవులలో ఉన్నప్పుడు వెనక్కి పంపింది. ఆసమయంలో కోలీజియంకు తన సిఫార్సును పునః పరిశీలించే అవకాశం దొరకలేదు. ఎందుకంటే, ఎక్కువ మంది జడ్జీలు , ఛీఫ్ జస్టిస్ తో కలిపి , విదేశాలలో ఉన్నారు. సిజెఐ గారు వెనక్కి వచ్చేసరికి, సుబ్రహ్మణ్యం గారు ఆరోపణలు చేస్తూ, తన నామినేషన్ ను వెనక్కితీసుకుంటూ, ప్రజాబాహుళ్యం లోకి వెళ్ళి పోయారు. అలాకాక, ఆయన ఓర్పుతో ఉండి ఉండ వలసినది. భావావేశానికి లోను కాకుండా వర్తించ వలసింది. సిజెఐ గారు ఆయనకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు. ఆయన (శ్రీ సుబ్రహ్మణ్యం) మౌనంగా ఉండి ఉంటే, అది ఆయన గౌరవానికి వన్నె తెచ్చేది. బహుశా ఆయన నియమించబడి ఉండే వాడేమో. ...
శ్రీ కట్జూ గారు, సుప్రీం కోర్టు కోలీజియం, కొత్తగా సిఫార్సు చేసిన, న్యాయవాది యుయు లలిత్ గారిపై వచ్చిన అమీత్ షా గారి న్యాయవాదిగా, నేరగాళ్ళకు మద్దతిచ్చాడు వంటి ఆరోపణలను త్రోసి పుచ్చారు. శ్రీ కట్జూగారి మాటలలో:
''..A lawyer should not be identified with his clients. An ethical principle in legal profession is that a lawyer cannot refuse a brief, unless, he is engaged elsewhere or the client is not able to pay his fees. Lalit is totally misconceived, people don't know him and they identified him with clients. ..''
తెలుగు సారం: ఒక లాయర్ ను, అతడి క్లయింట్లతో గాట కట్టేసి ఒకటిగా చూడకూడదు. (క్లయింటు నేరస్థుడైనంత మాత్రాన, అతడి లాయర్ నేరస్థుడు కాదు అని భావం కావచ్చు). న్యాయవాద వృత్తిలో ఒక నైతిక సిధ్ధాంతం ఏమిటంటే, లాయర్ తన వద్దకు వచ్చిన బ్రీఫులను (కేసులను) తిరస్కరించ కూడదు. మినహాయింపులు: అతడు వేరే చోట నిమగ్నమయి ఉండటం. లేదా క్లయింటు ఫీజు కట్టలేని స్థితలో ఉండటం. లలిత్ సరిగా అర్ధఁ చేసుకోబడలేదు. ప్రజలు అతడిని ఎరుగరు. వాళ్ళు అతడిని అతడి క్లయింట్లతో సమంగా గుర్తించారు.

వైబీరావు గాడిద అభిప్రాయం
క్లయింటు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి బ్రీఫులను తిరస్కరించవచ్చు, అనేదానిని ఏరకపు నైతిక సిధ్ధాంతం అనాలి? లాయర్ కూడ దరిద్రంతో బాధ పడుతున్నప్పుడు, క్లయింటు పేదవాడైనా కనికరించకపోటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కోట్లకు పడగ ఎత్తిన లాయర్లు పేదక్లయింట్లను కనీసం ఐదు శాతం మందినైనా స్వీకరించకుండా, తిరస్కరిస్తే దీనిలో వ్యాపార తత్వంగా మనం అర్ధంచేసుకోవాలేమో, నైతిక సిధ్ధాంతం అనలేమేమో.
క్లయింటు కోట్లు ఇస్తున్నాడు కాబట్టి , అతడు నేరగాడా కాదా అనే విషయంలో కళ్ళకు కనపడే సాక్ష్యాలను కూడ పట్టించుకోకుండా, కేవలం బ్రీఫ్ ను తిరస్కరించ కూడదు అనే మిషతో, కేసులను చేపట్టే లాయర్లను న్యాయ వాదులు అని ఎలా అనగలం? వారు అన్యాయ వాదులే. లేదా వారు వ్యాపారులే. తన క్లయింటు దోషి అని స్పష్టమైన సాక్ష్యాధారాలను , న్యాయ వాదులు రీజనబుల్ కేర్ తో గుర్తించ గలిగినపుడు, వారు ఆపనిచేసి క్లయింట్లను తిరస్కరించక పోగా, ఏదో ఒకరకం వాదనలతో తమ క్లయింట్లను రక్షించటానికి పూనుకుంటే, వారు కోర్టుల సమయాన్ని వృధా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు, లేక తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నట్లు, అనుకోటాన్ని మనం ఒక నైతిక సిధ్ధాంతంగా ఎందుకు భావించకూడదు. ఈవిషయాన్ని నేను ఖరాకండీగా వ్రాయటాన్ని, న్యాయవాదులను, న్యాయ మూర్తులను, న్యాయవాద విద్యార్ధులను అపార్ధం చేసుకోవద్దని ప్రార్ధిస్తున్నాను.
ముఖ్యంగా నిపుణులుగా, సమర్ధులుగా పేరుగాంచిన కోటీశ్వర లాయర్లకు , సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక కాగల అర్హత ఉన్న సీనియర్ న్యాయవాదులకి, తమ వద్దకు వచ్చే క్లయింట్లు నేరగాళ్ళా , అమాయకులా గుర్తించే శక్తి ఉండదు, ఉన్నా వాళ్ళు దాన్ని వాడి క్లయింట్ల బ్రీఫ్ ను తిరస్కరించ కూడదు, అని భావించటం సమంజసం కాదు. కోటీశ్వర లాయర్లు, న్యాయవాద వృత్తిని పవిత్రంగా భావించకుండా, న్యాయవాద వ్యాపారం చేసుకుంటూ, సత్యాన్ని కనుక్కునే భారాన్ని కోర్టుపైకి త్రోసేయటం గా భావించటం ఒప్పే అవుతుంది.
ఆంగ్ల న్యాయవేదాంతం British jurisprudence లో ఉన్న సిధ్ధాంతాలను మనం తూ చా తప్పకుండా పాటించాలనుకోటం, వ్యర్ధం.
ఇంకా ఉంది. సరిదిద్దాల్సింది కూడ ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.