289 భారతీయరైల్వేలను భద్రమైన ఫ్రిల్స్ లేని వానిల్లా రైల్వేలు గా ఉండనివ్వటమే మంచిది.
చర్చనీయాంశాలు: 289, రైల్వేలు, ప్రైవేటీకరణ, విదేశీకరణ, ధరల పెంపు
భారతీయ రైల్వేలు అమెరికా, చైనాల తరువాత, ప్రపంచంలో మూడవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్. భారతీయ రైల్వేలు కొన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికి, మొత్తం మీద ప్రజలకు ప్రశంసనీయమైన సేవ చేస్తున్నదనే చెప్పాలి.
మన ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోడీగారు, ఉధంపూర్ కట్రా రైల్వే లైన్ ను ప్రారంభిస్తూ మనకు రాబోయే రోజులను గురించిచెప్పారు.
''...We want the railway stations to have better facilities than airports. This is our dream and it is not a difficult thing to do and this is economically viable too. I have discussed it in detail with my Railway friends. You will see a change in near future.''
తెలుగు సారం: విమానాశ్రయాల కన్నా మెరుగైన సౌకర్యాలను మన రైల్వే స్టేషన్ లుకలిగి ఉండాలని మేము కోరుతున్నాము. (వైబీరావు గాడిద వివరణ: ఇక్కడ మోడీ గారి దృష్టిలో మేము అంటే బిజెపి అంటే శ్రీమోడీజీ కావచ్చు. ప్రజలు కోరేది విమానాశ్రయాలకన్నా మెరుగైన సౌకర్యాలు కాదు. గాడిదలులాగా జీవించే మామూలు మనుష్యులకి పనికి వచ్చే వ్యానీలా సౌకర్యాలు మాత్రమే.) ఇది మా కల. దీనిని చేయటం కష్టం కాదు. ఇది ఆర్ధికంగా కూడ సాధ్యమే. నేను మారైల్వే మిత్రులతో వివరంగా చర్చించాను.
''...In that, private parties would also be ready to invest because this is a good project economically and will benefit everyone. This would be a win-win situation project and we want to move ahead in this direction in the coming days...''
తెలుగు సారం: ... దానిలో ప్రైవేటు పార్టీలు కూడ పెట్టుబడి పెట్టటానికి సిధ్ధంగా ఉంటారు. ఎందుకంటే, ఇది ఆర్ధికంగా చాలా మంచి ప్రాజెక్టు. ప్రతివాళ్ళకు లాభం కలిగిస్తుంది. ఇది జయం-జయం స్థితి ప్రాజెక్టు. రాబోయే రోజులలో మేము ఈ దిశలో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము.
ప్రస్తుత హోం మంత్రి, భాజపా అధ్యక్షుడు శ్రీ రాజనాథ్ సింగు గారు లక్నోలో ఏప్రిల్ 2014 లో ప్రసంగిస్తూ ఏమి చెప్పారో చదవండి.
"...My party is not at all in favour of privatisation of Indian Railways. No such thing will happen when BJP comes to power at the Centre..."
తెలుగు సారం: నా పార్టీ భారత రైల్వేలను ప్రైవేటీకరించటానికి ఏమాత్రం అనుకూలం కాదు. బిజెపి అధికారంలోకి వస్తే అలాటిదేమీ జరుగదు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
దొడ్డిదారిలో ప్రైవేటైజేషన్ ను, విదేశీకరణను, ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీమోడీగారి మాటల బట్టి స్పష్టం అవుతున్నది. పిల్లి కాదు మార్జాలం అన్నట్లుంటుంది. మరి శ్రీ రాజ్ నాథ్ సింగు గారు లక్నోలో చేసిన ఎన్నికల వాగ్దానం సంగతి ఏమిటి?
రాజ్ నాథ్ సింగు బిజెపిలో అనామకుడు కాదు. మోడీ ట్రయంవరేట్ లేక మోడీ చతుషటయం లో ఉండే వాడే.
దేశ ప్రజలు ప్రైవేటు వారినీ, విదేశీయులను, తమరైల్వేలకు యజమానులుగా, వాటాదారులుగా, భాగస్వాములుగా, రైల్వేస్టేషన్ల పెత్తందారులుగా ఉండటానికి ఇష్ట పడరు. ప్రజలు తమ రైల్వేస్టేషన్లను ప్రజల ఆస్తిగా త్రికరణశుధ్ధిగా నమ్మి అక్కడ రాత్రి పూట ఉచితంగా పండుకుంటారు. దరిద్రులకు, దీనులకు, కిరాయిలు చెల్లించి లాడ్జీలలో , లౌంజీలలో బసచేయలేని వలసకూలీలకు, మన రైల్వేలు, బస్ స్టాండులు పెద్ద రక్షణాస్థలాలుగా ఉంటున్నాయి. దీనివల్ల, మధ్యతరగతి, ధనికతరగతి వారికి కొన్ని అసౌకర్యాలు కలిగినా, 120 కోట్ల జనాభా ఉన్న, భూమికి కరువున్న నిరుపేద దేశంలో మరో మెరుగైనా ఉచిత లేదా చాల చౌక 'వ్యానిలా ' (సాధారణ) ఏర్పాట్లు చేసేదాకా, పేదలకు అవి అండగా ఉండటం అనివార్యం. ప్రజలు రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, కోరుకుంటున్నది వ్యానిలా (సాధారణ) సౌకర్యాలే కానీ , ఎయిర్ పోర్టు సౌకర్యాలు కాదు. శ్రీమోడీగారికి, శ్రీరాజనాథ్ సింగుగారికి, సదానంద గౌడగారికి, రైల్వేలను అభివృధ్ధి చేయటం సాధ్యం కాకపోతే, చేతకాకపోతే, కేవలం భద్రత, మరియు సాధారణ సౌకర్యాలపై దృష్టిపెట్టి, ఈ 1826 రోజులను అంటే 2019 వరకు, గడిపేయాలి. స్వల్పంగా ప్రతి ఏడాదీ ఛార్జీలను పెంచుకుంటూ వెళ్ళినా ప్రజలు బాధ పడకపోవచ్చు. తరువాత ఏమి చేయాలి అనేది, 2019 ఎన్నికలలో బిజెపి ఓవరాల్ పెర్ ఫార్ మెన్సుని బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు.
పట్టాలను చేయం. పెట్టెలనుమాత్రమే చేస్తాం. లేక స్టేషన్ భవనాలను మాత్రమే చేస్తాం అనటంలో అర్ధం లేదు. ప్రైవేటు వాళ్ళు, విదేశీయులు, అరబ్బీ వాడు , ఒంటె కథలోని ఒంటే వంటి లాంటి వాళ్ళు. చలికి వణుకుతున్నది కదా అని కొంచెం మెడను టెంటులోకి పెట్టుకోనిస్తే, ఒంటె టెంటులోకి దూరి టెంటు యజమానినే గెంటి పారేసిన కథ మనకి ఇదే మొదటి అనుభవం కాబోదు. 17 వ శతాబ్దంలో జహంగీరుకు, కాలికట్ రాజు జామోరిన్ కు, చెన్నపట్టణంలో రెండవ వెంకటపతిరాయలకు, వ్యాపారాలను చేసుకోటానికి అనుమతికోసం, నజరానాలను సమర్పించుకున్న విదేశీయులు చివరికి భారత్ నుండి 1961 లో మెడపట్టి గెంటే దాకా బయటకు వెళ్ళలేదు.
ఈ బ్లాగ్ పోస్టును తిరగవ్రాయవలసి ఉన్నది. ఈలోగా కామెంట్లకు స్వాగతం. ముఖ్యంగా ఎయిర్ పోర్టు సౌకర్యాలు వద్దు లెండి, వ్యానిలా సౌకర్యాలు చాలు, అనేదానికి ఆమోదాన్ని కామెంట్లలో ''అవును'' అని వ్రాసి సూచించ వలసిందిగా పాఠకులకు విజ్ఞప్తి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.