287 ఈ దేశంలో జరిగిన అభివృధ్ధి మీకు తెలుసా?
చర్చనీయాంశాలు: 287, అభివృధ్ధి, అంబానీలు, ఆకాశహర్మ్యాలు, Ambanis, Reliance
స్వాతంత్ర్యం వచ్చిం దగ్గర నుండి తమ పాలనలో ఎంతో గొప్ప అభివృధ్ధి జరిగిందని కాంగ్రెస్, బీజెపిలు డబ్బాకొట్టుకునే సంగతి మీకు తెలుసు. ఆ అభివృధ్ధి ఎక్కడ జరిగింది?
జవాబు: యాంటీలియా, ముంబాయిలో జరిగింది.
యాంటీలియా అంటే ఏమిటి?
జవాబు: ఇది దేశంలో అత్యంత సంపన్న పారిశ్రామిక వేత్త శ్రీముఖేష్ అంబానీ గారి నివాస గృహం.
దీని ప్రత్యేకత ఏమిటి?
హఫింగ్ టన్ పోస్ట్ అనే అమెరికా పత్రిక వారి ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస గృహం.
దీని ఖరీదెంత?
జవాబు: ఆ, ఎంతో లేదు లెండి. ఒక బిలియన్ డాలర్లే. అంటే లక్షకోట్ల రూపాయలే.
దీనిలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి?
జవాబు: ఆ ఎన్నో లేవు లెండి, ఇరవయి ఏడే.
ఈ భవనంలో, నివాసానికి ఎన్ని చదరపుఅడుగుల స్థలం ఉంది?
జవాబు: ఆ ఎంతో లేదు లెండి, 4 లక్షల చదరపు టడుగులే లెండి.
మనిషికి ఆరడుగుల స్థలం చాలంటారుగా? ఈయనకు 4 లక్షల చదరపు టడుగు లెందుకు?
జవాబు: ఈయనకి ఈ నాలుగు లక్షల చదరపు అడుగులే కాక, మొత్తం 27 అంతస్తులలో, 6 అంతస్తులను వాహనాల పార్కింగుకి ప్రత్యేకించారట. మూడు హెలీ పాడ్లు ఉన్నాయి. అంటే , భవనంపైన మూడు హెలీకాప్టర్లు దిగచ్చు. డాన్సుకి ఒక బాల్ రూమ్ ఉంది. దీని కప్పు క్రిస్టల్ అనే ఒక తరహా స్ఫటికంతో కవర్ చేశారుట. ఒక సినిమా హాలు, బార్ కూడ ఉన్నాయిట.
అర్ధం అయ్యింది.
జవాబు: ఏమి అర్ధం అయ్యింది?
జవాబు: ఈయన ఓఎన్ జీసీ మొ|| ప్రభుత్వ సంస్థలకు ఉద్దేశించిన నూనే బావుల స్థలాలనన్నిటినీ కొట్టేసి, తనకు అనుకూలమైన షరతులతో ఒప్పందాలు వ్రాయించుకొని, ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తుల సరఫరాను అదుపు చేస్తూ, తాను అమ్మే ఆయిల్ మరియు గ్యాస్ ధరలను తన ఇష్టం వచ్చినట్లుగా పెంచుకోనివ్వమని , లేకపోతే ఆపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకా అంటే, ఈసారి 27 అంతస్తులు కాకుండా 72 అంతస్తుల భవనాన్నినిర్మించుకోవాలని. ఈ బ్లాక్ మెయిల్ ఇంక ఆగదు.
లక్షాధికారైన లవణ మన్నమె కాని మెరుగు బంగారముల్ మింగబోడు, అంటారే?
జవాబు: అవును, లక్షాధికారైతే లవణమన్నం మాత్రమే తింటాడు. ముఖేష్ అంబానీ ఎన్ని లక్షలకోట్లకు అధికారియో కదా. మెరుగు బంగారాలు తప్ప అన్నం, చపాతీలు తినలేడు. అందుకని బ్లాకమెయిల్ చేయకుండా, లేక రాజకీయనేతలను, అధికారులను వశ పరుచుకోకుండా, ఆయనకు క్షణం కూడ గడవదు.
దీనికి పరిష్కారం లేదా?
జవాబు: ఉంది, మార్క్సిజమే పరిష్కారం. నూనె బావులను, ఆఫ్ షోర్ ప్లాట్ ఫారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తానే నడపాలి. బ్లాక్ మెయిలింగుకి లొంగకూడదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.