283 స్వామీజీలకు భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ ఉన్నది, కానీ ప్రజలు స్వామీజీల అభిప్రాయాలను పాటించే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
చర్చనీయాంశాలు: 283, స్వామీజీలు, చంద్రబాబు, ముహుర్తాలు, కరువులు, విశాఖ
స్పష్టీకరణ: నేను బ్లాగ్ పోస్టులలో మతబోధకులు, స్వామీజీలు, రెవరెండ్లు, పాస్టర్లు, ఇమాంలు, క్లరిక్ లు, ఫకీర్లు, మొ|| పదాలను వాడినపుడు అవి అన్నిమతాల బోధకులకూ వర్తిస్తాయి. మార్క్సిజం, మతాలు అన్నిటినీ ప్రజలపాలిట మత్తు మందులు గానే, ట్రీట్ చేస్తుంది. ఎక్కువ తక్కువలు ఉండవు. కాబట్టి మీరు హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు, ఇతర మతాలను విమర్శించటం లేదు, అని కినుక వహించ వలదని పాఠకులకు ప్రార్ధన. ప్రతిసారీ అన్ని హోదాలను, పదవులను లిస్టు చేయటం సాధ్యం కాదు కనుక పాఠకులు తమ ఆలోచనా విస్తృతిని పెంచుకుంటారని ప్రార్ధిస్తున్నాను.
విశాఖ లోని స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారు ఈ క్రింది మాటలు అన్నారని పత్రికలలో, నెట్ లో , వార్తలు వచ్చాయి. (నోట్: షిర్దీ శాయిబాబాను దేవుడు కాదని చెప్పిన శ్రీ స్వరూపనాంద సరస్వతి గారు గుజరాత్ లోని ద్వారక వారు. ఈ విశాఖ స్వామీజీ స్వరూపానంద + ఇంద్ర = స్వరూపానందేంద్రుల వారు. అంటే స్వరూపానందు లలో కూడ ఇంకా గొప్పవాడు.). వీరన్నట్లుగా చెప్పబడుతున్న మాటలు నిజమే అయితే చాలా దురదృష్టకరం.
''..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన ప్రతీసారి రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. ...''
English gist: Every time Mr. Chandrababu Naidu takes over as Chief Minister, drought hoofs in the State.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్షాలు కురవటం లేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఎంతో మంది చనిపోయారు. ప్రతీ రోజూ చనిపోతూనే ఉన్నారు.
English gist: We are not getting rains, since Chandra Babu took over. Many people died on the day, he took oath. Everyday, (people) are dying.
సూర్యస్తమయం అయిన తరువాత ప్రమాణ స్వీకారం చేయడం పాలకులకు మంచిది కాదు. ... గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు కూడా ఇలాంటి దుష్ఫలితాలు చవిచూశారు.
English gist: It will not be good for rulers to take oath after sunset. ... Those who have taken oath thus in the past have tasted this type of perilous results.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
మతబోధకులు చెప్పేవాటిని మనం వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించటం మేలు.
మతబోధకులు కూడ వ్యక్తిగత, సామూహిక, వర్గ రాగ ద్వేషాలకు అతీతులు కాదు. తమ మతమే గొప్పదే, తాము నమ్మే విషయాలే నిజాలు, మిగిలినవన్నీ అబధ్ధాలు, సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్నది మాకనవసరం, మానమ్మకాలే మాకు ముఖ్యం అని వారిలో చాల మంది అనుకుంటున్నారు.
మతబోధకులు ప్రాచీన కాలం నుండి అనూచానంగా వస్తున్న మన ఆచారాలను, నమ్మకాలను, హేతువు అనే గీటు రాయితో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటు ఉండాలి. పొరపాట్లను దిద్దుకుంటూ ఉండాలి. పాత తప్పుడు నమ్మకాలను వదిలించుకోటంతో పాటు కొత్త ఉత్తమ నమ్మకాలను తగిలించుకోవచ్చు. అలా తగిలించుకునే వాటిని కూడ, మరల కొత్త సాక్ష్యాలు బయట పడ్డప్పుడు దిద్దుకోటానికీ, వదిలించుకోటానికీ వెనుకాడకూడదు.
మతబోధకులు స్మార్టు ఫోన్ లను, ఏసీ కార్లను, ఏసీ గదులను, హంసతూలికా తల్పాలనూ, గొప్ప సౌధాలను వాడటం నేర్చుకుంటున్నారు కానీ, అన్నిటికన్నా ముఖ్యమైన స్వాదుత్వాన్నీ, సాధుత్వాన్నీ వదులుకుంటున్నారు. వారు తరచుగా అలా చేస్తే , ప్రజలకు మతబోధకులపై నమ్మకం పోయే అవకాశం ఉంది.
భారతీయ రాజులకు, సుల్తానులకు, పాదుషాలకు వేయి సంవత్సరాల బానిసత్వ చరిత్ర ఉంది. వీరంతా మతబోధకులు నిర్ణయించిన ముహూర్తాలను, పధ్ధతులను పాటించి గద్దె నెక్కిన వారే. కానీ వారి కోటలు,సామ్రాజ్యాలు తురుష్కుల, పర్షియన్ల, అరబ్బుల, యూరోపియన్ల, మంగోలుల, ఫిరంగులు, తుపాకుల ముందు నిలువలేక మట్టిలో కలిసిపోయాయి.
సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసాడు కాబట్టి కరువులు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒక నిర్ హేతుకమైన నమ్మకం. ప్రమాణస్వీకారం పగలు చేసినా, రాత్రి చేసినా, ఇవి జరగచ్చు, జరగక పోవచ్చు. రెండిటికీ లింకు పెట్టటం అంటే బోడిగుండుకీ, బట్టతలకీ ముడి పెట్టటమే.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.