274 నా పిచ్చి కుదిరింది, ఈ రోకలిని నా తలకు చుట్టండి.
చర్చనీయాంశాలు: 275, షిర్దీ శాయిబాబా, జగద్గురువులు, మహర్షులు, నిర్వికల్ప సమాధి, నిర్గుణ పరబ్రహ్మం
ఇది నా పోస్టు నంబరు 267 http://problemsoftelugus.blogspot.in/search/label/267 కి వెళ్లటానికి క్లిక్ కి కొనసాగింపు.
మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది. పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి. పిచ్చి కుదరిన వాడు ఎవడైనా రోకలిని తలకు చుట్టమని అడుగుతాడా?
షిర్దీ శాయిబాబా ఉత్తమపురుషుడే కావచ్చు. కోరికలు తీర్చే దేవుడిగా కాక ఇతర విధాలుగా ఆరాధనీయుడే కావచ్చు. విశ్లేషణా శక్తి, ఆలోచనాబలం కలిగిన వారు షిర్దీ శాయిబాబా పరిమితులను గ్రహించి ఆయనను తగిన విధంగా ఆరాధించుకుంటారు, స్మరించుకుంటారు. అతికి వెళ్ళరు.
మనకి ప్రజలు తేలికగా మోసపోయే అమాయకులు, ఆశాపరులు (gullible) అయినపుడు, భక్తి వ్యాపారులు చెలరేగి పోతారు. శాయి అనుగ్రహం తమకు శాశ్వతంగా సమకూరిందని ప్రకటించుకొని, అలా తమకు శక్తులు సమకూరాయని బుకాయిస్తూ , లేని తమ శక్తులను అమ్మకానికి పెట్తారు. జనం వేలకు వేలు, లక్షలకు లక్షలు వదిలించుకుని, తాము మోసపోటమే కాకుండా, ఇతరులు మోసపోటానికి కూడ తాము వాహకులుగా, సమర్ధకులుగా, సాక్షులుగా పనిచేస్తూ గుర్రపు డెక్క తెగులును కాంగ్రెస్ గడ్డిని వ్యాపింప చేస్తారు.
సిధ్ధగురు అని తమకు తామే బిరుదు తగిలించుకోగానే సిధ్ధగురువులు అయిపోరు.
సద్ గురు అని తగిలించుకోగానే సద్ గురువులు అయిపోరు. నిజమైన సద్ గురువుఎవరంటే, తాను గురువును కాదు, కేవలం సహకార్మికుడను, సహశ్రామికుడను, మాత్రమే అని గ్రహించే వాడు. అంటే సద్ గురువు పీఠాలపై కూర్చొని ఇతరులను ఆశీర్వదించే పనికి దిగడు. మనకి గురువులెవరు ఉండరు. గురువు తప్పనిసరి అనుకుంటే ప్రకృతే మనకి గురువు అని తన సహకార్మికులకు నచ్చ్ చెప్పే నిజాయితీ గలవాడు.
మహర్షి అని తోక తగిలించుకోగానే , ఆతోకరాదు. మహా అంటే గొప్ప. ఏది గొప్ప, ఏది గొప్ప కాదు అనే వాటికి నిర్వచనాలు లేవు. ఎవరు ఋషి, ఎవరు ఋషి కాదు అనే దానికి కూడ నిర్వచనాలు లేవు.
మెళ్ళో ఎన్ని రకాల దండలు వేసుకున్నా మెడకు బరువు పెరుగుతుందే గానీ లాభ నష్టాలు ఉండవు.
మానవులకు గానీ, ఇతర మొక్కలకు, జంతువులకు గానీ, పెక్కు జన్మలున్నట్లు ఆధారాలు లేవు. ఎన్నో జన్మలనుండి పుణ్యం, పాపం, తరువాతి జన్మలకు క్యారీ ఫార్వర్డు అవుతాయి అనటానికి ఋజువులు లేవు. కాబట్టి ఈజన్మలో మనకు మరణానంద మహర్షుల వంటి గురువుల అవసరం ఉండదు. దీనర్ధం మనం నీతీ, నిజాయితీలు లేకుండా, క్రూరత్వానికి పాల్పడుతూ నేరగాళ్ళుగా తయారవ్వాలని కాదు. అసలు ఎవరు నేరగాడు, ఎవరు నేరగాడు కాదు, ఎవరు దొంగ, ఎవరు దొంగకాదు అనే వాటికి కూడ నిర్వచనాలు కూడ లేవు. పెద్ద మనుషులుగా కనపడుతూ నేరాలు చేసేవాళ్ళు మనకి కోకొల్లలు. వేషభాషలలో నేరగాళ్ళుగా కనపడుతూ హృదయమున్నవాళ్ళుకూడ మనకున్నారు. ఇవన్నీ సినిమాల్లో మనం చూ సే విషయాల్లాగా కనిపించినా, వాస్తవ ప్రపంచంలోకి కూడ ప్రవేశించాయి.
అయితే మనం దొంగ మహర్షులను గానీ, నిజం దొంగలను గానీ ద్వేషించ వలసిన పని లేదు. వీళ్ళందరిని తయారు చేసేది పెట్టుబడి దారీ విధానం. కాబట్టి ద్వేషించాల్సింది పెట్టుబడిదారీ విధానాన్ని.
గుండ్లు, నెత్తి ముడులు, గడ్డాలు, టోపీలు, మిరుమిట్లు గొలిపే గౌనులు, రంగుల స్కార్ఫులు, చేతుల్లో లాఠీలు, దండాలూ, ఇవన్నీ వేషాలే. అదనపు శక్తులనుగానీ, దివ్యత్వాన్ని గానీ ఇవ్వవు.
దేవుళ్ళు, దేవుళ్ళలాగా కనపడే కీర్తిశేషులు మనకి దర్శనమివ్వటం అనేది ఒక భ్రమ. Hallucination. ఈప్రపంచం అనే మయసభలో మనం దుర్యోధనుళ్ళు లాగా భ్రాంతులకు లోనై మిట్టలను నీటిగుంటలుగానూ, నీటి గుంటలను పొడి స్థలాలుగానూ భ్రమ పడరాదు.
తమకు దైవదర్శనాలు, కీర్తిశేషుల దర్శనాలూ, జరిగాయని చెప్పుకునే వారిలో చాలమంది, పెట్టుబడిదారీ కారణాలవల్ల అబధ్ధాలు ఆడుతున్నారని మనం గ్రహించటం అవసరం. భ్రమ పడిన వాళ్ళు కూడ, తాము భ్రమ పడిన సంగతిని గ్రహించలేక, ఆభ్రమల్లోంచే క్యాష్ ను సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు.
రోజుకి 12 నుండి 16 గంటల ఆధ్యాత్మిక సాధన లు, ధ్యానాలు, జపాల వల్లకూడ ఒరిగేది ఏమీ లేదు అని మనం గ్రహించాలి.
తన శరీరం, తన కుటుంబం, సమాజం, పేదలు, స్వంత నైపుణ్యాల పెంపుదల, సమాజానికి వీలైనంతవరకు తాను బరువుగా మారకుండా చూసుకోటం, వీటిని మించిన జప తప ధ్యాన సాధనలు మనిషికి అక్కరలేదు. తన కర్తవ్యాన్ని తాను సరిగా గుర్తించటం, దానిని తాను నిజాయితీగా , శాయశక్తులా నిర్వహించటం, ఇవి మనలను ధన్యులనుగా చేస్తాయి.
నిర్వికల్పసమాధి అనేది ఉంటుందా
జవాబు: గ్యాస్ అయి ఉండే అవకాశం ఉంది. అలాంటివేవి ఉండవు, అంటే ఇప్పుడు నమ్మేవారు నన్ను రాళ్ళతో కొడతారు. అయితే, ఎక్స్ట్రీమ్ కాన్ సన్ ట్రేషన్ (అత్యంత తీవ్రమైన చిత్తైకాగ్రత) సాధ్యమే. దీని వల్ల మనం స్పర్శా జ్ఞానాన్ని, బాహ్యస్మృతిని తాత్కాలికంగా కోల్పోవచ్చు. ఉత్తమమైన సంగీతాన్ని మనం విన్నపుడు, పాడుకున్నపుడు, గొప్ప గ్రంధాలను మనం చదివి జీర్ణించుకునే సమయంలో మనకీ స్థితి సంభవించ వచ్చు. అయితే ఇది తాత్కాలికమే. దీనిని మనం దివ్యానుభవంగా భావించరాదు.
బ్లాగులు అనేవి జీవిత స్వీయానుభవాలను వ్రాసుకోటానికి అవకాశమిస్తాయి కాబట్టి ఇక్కడ ఒకటి రెండు స్వీయానుభవాలను ప్రస్తావించటానికి పాఠకుల అనుమతితో పూనుకుంటున్నాను.
1. నాకు వివాహమైన కొత్తల్లో 1975లో నేను నాశ్రీమతితో కృష్ణాజిల్లా, ఎర్రు పాలెం మండలం, జమలాపురం లోని శ్రీవెంకటేశ్వరుడిని దర్శించటం జరిగింది. అక్కడకు నేను చేరిన సమయంలో పూర్తిగా శారీరికంగా, మానసికంగా, పెళ్ళి ఏర్పాట్లు, రాత్రి ముహూర్తాలు మొ|| వాటితో అలసి పోయి ఉన్నాను. అప్పటికి నేను 50% నాస్తికుడనే. పూర్తిగా మారలేదు. ఆ దైవ విగ్రహ సమ్ముఖంలోనే నా శరీరం పై దేవుడు పూని ఏవేవో మాట్లాడానుట. కొబ్బరికాయలు మొ|| కొట్టి నన్ను శాంతింప చేసారుట. శారీరికంగా, మానసికంగా అలసిపోయి ఉన్నపుడు ఇలాంటి బలహీనతలుసహజమే నన్ని ఆకాలం నాటి అర్ధ నాస్తికుడిగా అన్వయించుకున్నాను.
నేను పూర్తి నాస్తికుడనైనాక, 2012 ప్రాంతంలో, 80 ఏళ్ల మానాన్న గారి కోరికపై, ఆయనకు చూపటానికి నేను ఆయనను తీసుకుని జమలాపురం వెళ్ళాను. దర్శనానికి మనిషికి రూ. 20 టికెట్ అన్నారు. ఉచిత దర్శనం సమయం లేదో, మించి పోయిందో మొత్తానికి టికెట్ ఉంటేనే లోపలికి అన్నారు. నేను నా తలపై రూ. 20 ఖర్చు చేయలేక, ఒక టికెట్ మాత్రమే తీసుకుని , మా నాన్నగారిని లోపలికి పంపి నేను క్యూ మార్గంలో అయన సరిగా వెళ్తున్నాడో లేదో గమనిస్తూ నిల్చున్నాను. ఆసమయంలో యాత్రికుల సంఖ్య చాల స్వల్పంగా ఉంది. టికెట్ల బుకింగ్ క్లర్కు కూడ ఖాళీగా ఉన్నాడు.
నన్ను పిలిచి మిమ్ములను ఉచితంగా లోపలికి పంపిస్తాను, వెళ్ళండి అన్నాడు. ఆయనతో నేను, మీరెందుకులేండి నన్ను టికెట్ లేకుండా లోపలికి పంపి రిస్కు తీసుకోటం, నేనెలాగో లోపలికి పోయి లాభం పొందలేను, నేను లోపలికి వెళ్ళటం దండగ అన్నాను.
బుకింగు క్లర్కు:-- అదేమిటి? వింతగా ఉందే.
నేను:-- వింతేమీలేదు. నేను నాస్తికుడను కావటం వల్ల నేను ఆవిగ్రహాలలో దివ్య శక్తులను చూడలేను. అందుకే మీరులోపలికి వెళ్ళమన్నా వెళ్ళలేదు.
బుకింగు క్లర్కు:-- మీ అవతారం చూస్తుంటే, మీరు క్రీస్టియన్ మిషనరీలాగా కనిపిస్తున్నారు.
నేను:-- మీ ఏరియాలో క్రిస్టియన్ మిషనరీల సంచారం ఎక్కువగా ఉండటాన, మీకు నేను అలా కనిపించి ఉంటాను. నేను మీకు నా నాస్తికతను అంటగట్ట దలుచుకోలేదు. అయితే మీరు దేవుడిని నమ్ముతారు కాబట్టి, దేవుడిని నిర్గుణ పరబ్రహ్మంగా, ప్రకృతిలో అణువణువునా కనిపించే సర్వాంతర్యామిగా గుర్తిస్తే, ఇలా దర్శనానికో టికెట్టు, కొబ్బరికాయకో టికెట్టు, వంటివి కొనుక్కొని లోపలికి వెళ్ళకుండానే, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆనిర్గుణ పరబ్రహ్మాన్ని దర్శించుకోవచ్చు. ఈనిర్గుణ పరబ్రహ్మం హిందువులకి ఉన్నదనే విషయం తెలియక అన్యమతాలవారు, భారతీయులను విగ్రహారాధకులని హేళన చేస్తుంటారు. అయితే దానిని భారతీయులు పట్టించుకోనవసరం లేదు. వ్యాపారంగా మార్చబడనంత వరకు విగ్రహారాధనలో పెద్ద దోషమేమీ లేదు.
బుకింగు క్లర్క్:-- మీమాటలు ఆసక్తి కరంగానే ఉన్నాయి. కానీ మీరు క్రిస్టియన్ మిషనరీ అన్న అనుమానం నాకు తొలగలేదు. మీరు లోపలికి వెళ్లి స్వామికి నమస్కరించుకొని వస్తే నాకా అనుమానం తొలుగుతుంది, అని నన్ను లోపలికి వెళ్ళమని ప్రోత్సహించాడు. ఇపుడు మనపై ఒక అపనింద వచ్చింది కాబట్టి, ఒకసారి లోపలికి వెళ్ళి వస్తే పోలేదా, అని లోపలికి వెళ్ళి మాతండ్రిగారిని కలుసుకున్నాను. ఆయనతో పాటు , దేవతా విగ్రహాలను దర్శనం చేసుకున్నపుడు, నాకెలాంటి దేవుళ్ళు పూనటం జరగలేదు. అమరావతి మ్యూజియంలో బుధ్ధ విగ్రహాలను చూసినపుడు కలిగే భావమే కలిగింది. దర్శనం పూర్తి చేసుకున్న మా నాన్న గారితో కలిసి బయటకు వచ్చాను.
బాహ్య చైతన్యం కోల్పోయినంత మాత్రాన ఏదో దివ్యానుభవం కలిగిందని భావించరాదు. తాను రూప శబ్ద స్పర్శ రస గంధాది పంచ తన్మాత్రల సాయంతో దర్శించే-వినే-ఘ్రాణించే-తాకే-రుచిచూసే టార్జెట్లతో తాదాత్మ్యం పొందటం, గొప్ప ఆనందమేకాక నవరసానుభూతులను పొందటం అసాధారణమేమీ కాదు. కానీ వీటిలో దివ్యత్వమేమీ లేదు. అంతేకాదు, ఈపంచ తన్మాత్రల కతీతమైన, దివ్యత్వాలు కూడ లేవు. వీటిని గురువుద్వారా నేర్చుకోవాల్సిన అవసరమూ లేదు.
నిర్వికల్ప సమాధిని పొందిన వారిలో కొద్దిమంది మాత్రమే , ఈప్రపంచంలో మిగిలిన సాధకులను మానవులను ఉధ్ధరించటానికి తిరిగి వస్తారు అనేది కూడ ఒక బుకాయింపే. ఇంక, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళచ్చు, ఎప్పుడు కావాలంటే అపుడు మనం బయటకు రావచ్చు అనేది కూడ బుకాయింపే. గురువుకి కానుకలు సమర్పించుకుని, ఆయన సహాయంతో, ప్రతి వాళ్ళు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళచ్చు అనేది బుకాయింపు రాజం. ఈ పధ్ధతిలో జరిగేది ఒక తరహా కనికట్టు, హిప్నోటిజం అని మాత్రమే మనం అర్ధం చేసుకోవాలి.
Absolute realisation సంపూర్ణ జ్ఞానము అనేది ఎక్కడైనా ఉన్నదా
షిర్దీ శాయిబాబాకో మరో గురువుకో పూర్తిగా లొంగి పోతే సంపూర్ణ జ్ఞానం కలుగుతుందనేది ఒక భ్రమ. అసలు గురువుకే సంపూర్ణ జ్ఞానం కలిగిందా అనేది వివాదాస్పదం. ఎందుకంటే, సంపూర్ణ జ్ఞానం కలిగినపుడు ఏవ్యక్తి కూడ గురువుగా ఉండటానికి ఇష్టపడడు. సహసాధకుడుగా ఉండటానికి ఇష్టపడచ్చు. ఈ ఆధ్యాత్మిక అన్వేషణ అనేది గమ్యం లేని ప్రయాణం.
హిమాలయాలకు, కన్యాకుమారికి వెళ్తే ఏమన్నా వస్తుందా?
లోకానుభవం వస్తుంది. సొరంగ దృష్టి tunnel vision తగ్గుతుంది. కొంత ఒళ్ళు హూనం అయినా, ఎక్సర్ సైజు కలుగుతుంది కాబట్టి, శరీరంలో కొవ్వు కరిగి దేహం తేలిక పడుతుంది. కొంత డబ్బు ఖర్చవుతుంది.
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.