273 చైనా ఏదో ఒక రోజు కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమిస్తుందా?
చర్చనీయాంశాలు: 273, చైనా, కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్
తెలుగు అగ్రశ్రేణి పత్రికలలో రెండు శ్రీచంద్రబాబు నాయుడిగారిని, శ్రీ నరేంద్రమోడీ గారినీ, కీర్తిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండగా, మూడవది జగన్ కుటుంబ పత్రికగా ఉంది. తెలుగు పత్రికలు ఫుట్ బాల్ కి , టెన్నిస్ కి ఇచ్చే ప్రాధాన్యత, పొంచి ఉన్న చైనా ముప్పుకి ఇవ్వటం లేదు.
మన తెలుగు దిన పత్రికలకన్నా, హిందీ దినపత్రికలు ఒక వెంట్రుక వాసి మేలు. అవి కొన్నైనా జాతీయ విషయాలను మధ్యమధ్య ప్రస్తావిస్తూ ఉంటాయి. ఈరోజు , నవభారత్ టైమ్స్ పత్రిక చైనా కాశ్మీర్లో సింహ భాగాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ను తన భూభాగంగా చూపుతూ मानचित्र మానచిత్ర్ (మ్యాప్) ఒకటి ప్రపంచం మీదికి వదలి పబ్లిసిటీ ఇస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. దీనిని చైనా దీర్ఘకాలిక వ్యూహంగా మనం భావించ వచ్చు.
చైనాకు ఒక కల ఉంది. పశ్చిమ చైనా లోని తన రాష్ట్రాలనుండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదగా, పాకిస్థాన్ మీదగా కరాచీకి రైలుమార్గం, రోడ్డు మార్గం నిర్మించి, అరేబియా సముద్రం, సూయజ్ కాలువ ద్వారా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేయాలి. ఈకల నిజం కావాలంటే, జమ్ము కాశ్మీర్ ను చైనా ఏదో ఒకరోజు కబళించక తప్పదు.
http://m.nbt.in/text/details.php?storyid=37395766§ion=top-news నవభారత్ టైమ్స్ వారి వార్త చదవటానికి క్లిక్.
చైనాకు భారత్ అంటే గొప్పప్రేమ ఉందో లేదో తెలియదు కానీ, భారతీయులకు మటుకు చైనా వస్తువులంటే మహా మోజు. భారతీయ పారిశ్రామిక వేత్తలకు చైనా సందర్శన అంటే, మక్కా సందర్శించినంత ఆనందోత్సాహం కలుగుతుంది. చైనా విదేశాంగ మంత్రి ఈమధ్యనే భారత్ సందర్శించి వెళ్లారు. చైనాను సందర్శించే అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ పౌరులకు స్టేపుల్డ్ వీసాలు జారీ చేయటం ఒక ఘనకార్యంగా చిత్రించుకొని మరీ వెళ్ళారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గారు ఇపుడు చైనా యాత్రలో ఉన్నారు. ఆశుభ సందర్భంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ ను, కాశ్మీర్లో కొంత భాగాన్నీ తన భూభాగంగా చూపిస్తూ మ్యాపులను ప్రపంచం మీదికి వదిలింది.
उपराष्ट्रपति हामिद अंसारी चीन सरकार के न्योते पर इन दिनों पेइचिंग में हैं जहां भारत चीन के बीच पंचशील समझौते की 60वीं सालगिरह मनाई जा रही है। उल्लेखनीय है कि अंसारी की चीन यात्रा के दौरान ही लद्दाख में स्थित पेंगोंग झील में चीनी सेना के अतिक्रमण की एक कोशिश हुई थी जिसे पीछे धकेलने का दावा यहां सैन्य अधिकारियों ने किया है।
తెలుగు సారం: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చీనా ప్రభుత్వ ఆహ్వానం మీద పెకింగులో ఉన్నారు. అక్కడ భారత్ చైనా ల మధ్య 1954లో జరిగిన పంచశీల ఒప్పందం యొక్క 60 వ వార్షికోత్సవం జరుపుతున్నారు. ఉల్లేఖనీయమైన విషయమేమంటే, అన్సారీగారి చైనా యాత్ర సందర్భంలోనే చైనా లడఖ్ లోని ప్యాంగ్ యాంగ్ జిల్లాలోకి చైనా సేన అతిక్రమణ చేయటానికి ప్రయత్నించటం, దానిని భారతీయ సైన్యాధికారులు తిప్పి కొట్టటం జరిగింది.
अरुणाचल प्रदेश के 90 हजार वर्ग किलोमीटर और जम्मू कश्मीर के अक्साई चिन के 32 हजार वर्ग किलोमीटर इलाके पर चीन अपना दावा पिछले छह-सात दशकों से करता आया है।
తెలుగుసారం: అరుణాచల్ ప్రదేశ్ యొక్క 90 వేల చదరపు కిలోమీటర్లు, మరియు జమ్ము కశ్మీర్ లోని అక్సాయ్ చిన్ యొక్క 32 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తనదిగా గత 6 - 7 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నది.
చైనాతో మనం తక్షణమే యుధ్ధం చేయాలని ఏభారతీయుడూ కోరక పోవచ్చు. అదే సమయంలో, చైనానుండి ఇష్టం వచ్చినట్లుగా దిగుమతులకి దిగటం ద్వారా, మనం చైనాను ఎంతో బలోపేతం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. 1962 లోనే చైనా పంచశీల సిధ్ధాంతానికి చావుదెబ్బ కొట్టింది. చైనా పొడిచిన వెన్నుపోటుకు, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూగారు షాక్ కు తట్టుకోలేక ఆరోగ్యం క్షీణించి, అకాలమరణానికి గురి అయ్యారు. అలాంటి పంచశీల్ కు చైనా 60 వార్షికోత్సవం చేయటం ఏమిటి, వైస్ ప్రెసిడెంటు గారు దానికి హాజర్ కావటం ఏమిటి?
కొద్దిరోజుల క్రితం, మన వాణిజ్య మంత్రి శ్రీమతి సీతారామన్ గారు, చైనానుండి జరుగుతున్న విశృంఖల దిగుమతులను చూసి ఆశ్చర్యపోటమే కాక, చైనాకు మనం ఎందుకు వస్తువులను ఎగుమతి చేయలేక పోతున్నాము అని చాల బాధ పడింది.
భారత్ చైనాను తమ మార్కెట్లను తనకు తెరవమని యాచించటం మానలేదు. భారతీయ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి ప్రవేశించమని చైనాను బాగానే అడుక్కున్నారు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.