269 తీసుకున్న బాకీని తిరిగ చెల్లిస్తున్నారా?
చర్చనీయాంశాలు: 269, బిజెపి, ఆటోరంగం, పరోక్షపన్నులు, ఎక్సైజు పన్ను, అరుణ్ జైట్లీ
ఈనాటి నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రికలోని క్రింది వార్తను చూడండి.
सरकार ने गाड़ियों और कंजयूमर ड्यूरेबल्स क्षेत्रों के लिए उत्पाद शुल्क में रियायत की समयसीमा 6 महीने के लिए बढ़ा दी है। इस कदम से कारों और कई उत्पादों की कीमतें बढ़ने की संभावना टल गई है।
తెలుగుసారం: ప్రభుత్వం వాహనాలు, మరియు కన్సూమర్ డ్యూరబుల్ రంగాలలో ప్రస్తుతం ఇస్తున్న ఎక్సైజు సుంకాల మినహాయింపులను ఆరు నెలల వరకు పొడిగించింది. ఈ చర్య వలన కార్లు మరియు పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయనే భావన నెమ్మది అయ్యింది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
భారత ప్రజలకు వ్యక్తి గత, లేక కుటుంబ ప్రైవేటు కార్ల అవసరం ఉందా? ఏరోడ్డు మీద చూసినా ఇళ్ళముందు కార్లను నిలిపి ఉంచటం (గ్యారేజీలేక గానీ, లోపల పెట్టుకోటానికి బధ్ధకం వల్లగానీ, ప్రతిసారీ కుదరకగానీ), అవి దుమ్ముకొట్టుకోటం మనం చూడచ్చు.
కన్స్యూమర్ డ్యూరబుల్స్ విషయానికి వస్తే, ప్రతి ఇంటికిటికీకి ఒక స్ప్లిట్ ఏసీ పెట్టె తగిలించి ఉంటుంది. వాటి ఫిల్టర్లను సరిగా శుభ్రం చేయరు. గాలి లీక్ కాకుండా పకడ్బందీగా కిటికీలలో, వెంటీలేటర్లలో కంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోరు.
ఇది డబ్బున్న వాళ్ళ, లేక వాయిదాలలో అప్పు పుట్టే వాళ్ళ స్థితి.
రోడ్ల ఇరుకు వల్ల నగరాలలో, పట్టణాలలో ట్రాఫిక్ మధ్య కార్లెక్కి ఎక్కడికి వెళ్ళాలి? కార్లు అనేవి మనకి రోజూ అవసరం లేదు.
వివాహాల సమయంలో ప్రదర్శనకు, అతిథులను రవాణా చేసుకోటానికి అవసరం కావచ్చు. కొన్ని యాత్రలకు అవసరం కావచ్చు. రైళ్ళలోనూ, బస్సులలోనూ మారుతూ ప్రయాణం చేయలేని వృధ్ధుల పాయింటు టూ పాయింటు రవాణాకి వాడుకోవచ్చు. రోగుల రవాణాకి ఎలాగో అంబులెన్సులు ఉంటాయి. సినీ నిర్మాతలు నటీనటులను లొకేషన్లకు తీసుకువెళ్ళటానికి గ్రూపు కార్లను వాడచ్చు.
ఏవిధంగా చూసినా, అంబాసెడర్ వంటి కార్లు, మహీంద్ర వారి వివిధరకాల జీప్ తరహా, మినీబస్ తరహా వాహనాలు, ఈ గ్రూప్ రవాణాకి సరిపోతాయి. ఇంకా మిగిలిన అవసరాలను, ఆటోలు, బైక్ లు తీరుస్తున్నాయి. అనవసరంగా మనం అంబాసెడర్ తయారు చేసే హిందూస్థాన్ మోటార్స్ ను మూతపడనిచ్చాము.
భారత్ లో మారుతి వంటి అతి చౌక కారునుండి బిఎమ్ డబ్ల్యూ , మెర్సిడెజ్ బెంజ్ వంటి కార్ల వరకు మనం తయారు చేయటం సంతోషకరమే అయినా అవి స్వదేశీ వినియోగానికి కాకూడదు. వాటిని ఎగుమతుల ద్వారా విదేశమారక ద్రవ్యం సంపాదించుకోటానికి వినియోగించుకోవాలి. ఎందుకంటే, ఈ బడా ఆధునిక కార్ల తయారీ దారులందరు, కార్లను మనకి అమ్మి సంపాదించే లాభాలను డివిడెండ్ల రూపంలో తమ స్వదేశాలకు ప్రతి ఏటా చెల్లింపులు చేస్తూ ఉంటారు. వారు కనీ సం తమ డివిడెండ్ల చెల్లింపులకు సరిపడేంత అయినా విదేశ మారకాన్ని సంపాదించటం అవసరం. దీని కొరకు వారు ఎగుమతి తత్వాన్ని అలవర్చుకోవాలి. భారత్ లో డొమెస్టిక్ మార్కెట్లను కొల్లగొట్టటం పరిమితం గానే చేసుకోవాలి. డొమెస్టిక్ మార్కెట్లలో అమ్మేటపుడు , ఎక్సైజు సుంకం తగ్గింపులు, మినహాయింపులు కోరకూడదు.
మనం ప్రైవేటు కార్లను ప్రోత్సహిస్తే దిగుమతి ఇంధనం బిల్లు పెరిగిపోయి చెల్లింపుల సంక్షోభానికి దారి తీయవచ్చు. మధ్య తరగతి కుటుంబాలు ఋణ గ్రస్తమవుతాయి. బ్యాంకులు తమ ఋణాలను వసూలు చేసుకోటానికి గూండాలను నియమించుకో వాల్సి వస్తుంది. (ఇది ఊహ కాదు!! చాల సర్వసాధారణం. ఋణాలు వసూలు చేసే గూండాలకే ముద్దు పేర్లు ఫ్యాక్టరర్లు, ఫర ఫెయిటర్లు.). నేడు ప్రయివేటు బ్యాంకింగు రంగంలో జనరేట్ అవుతున్న ఉపాధి అవకాశాలలో అధిక భాగం ఈతరహా కు చెందినవే.
పారిశ్రామిక వేత్తలనుండి మన రాజకీయ పార్టీలు ఎంత మొత్తంలో ఎన్ని దఫాలుగా విరాళాలు పొందుతున్నారో గానీ, ఏదో వంకపెట్టి వారికి కొత్త కన్ సెషన్లను ఇవ్వటం, పాత కన్ సెషన్లను పొడిగించటం, ఒక అలవాటుగా మారటమే కాక, ''తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం,'' అని వివరించటం అలవాటు అయింది.
శ్రీ అరుణ్ జైట్లీ స్వాముల వారి మాటలలో నే:
"...Short-term loss will benefit the economy in the long run. ..."
''...స్వల్పకాలిక నష్టము, ఆర్ధిక వ్యవస్థకు దీర్ఘ కాలిక లాభాన్ని సమకూరుస్తుంది. ...''
ఆహా!! అహహా!!
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.