227 కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం మధ్య కన్ ఫ్యూజన్ తగ్గించటానికి ఒక సూచన
చర్చనీయాంశాలు: సంగీతం, కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం
కర్నాటక సంగీతం (దక్షిణ భారత్), హిందూస్థానీ సంగీతం (ఉత్తర భారత్) రెండూ భారతీయాలే అయినప్పటికీ, రెండూ సరిగమల పైనే ఆధారపడి నప్పటికీ, రెండిటి మధ్య పలు ఉమ్మడి అంశాలు ఉన్నప్పటికీ, ఆంధ్రా తెలంగాణా ల మధ్య తగాదా ల్లాగా, ఈరెండు సంగీతాల మధ్యలో కొన్ని తేడాల లోయలు కూడ ఉన్నాయి. వీటి వల్ల కొంత కన్ ఫ్యూజన్ ఏర్పడటం, రెండిటిలో నిష్ణాతులు కావాలని ప్రయత్నించటం తగ్గిపోతున్నది. ఈతేడాలను బ్రిడ్జి చేసే ప్రయత్నంలోనే సూచనా మాత్రమైన ఈవ్యాసాన్ని వ్రాయటం జరిగింది . సంగీతంలో ఎందరో నిష్ణాతులైన పెద్దలు ఉన్నారు. నా ఈ అభిప్రాయ వ్యక్తీకరణను అవిధేయతగా భావించ వలదని ప్రార్ధిస్తున్నాను.
ఇందులో వ్రాస్తున్న అంశాలు ప్రాధమికంగా వేణువు అనే కర్నాటక వాయిద్యం, సితార్ అనే హిందూస్థానీ వాయిద్యం యొక్క సాధనానుభవం పై ఆధారపడి వ్రాస్తున్నది. గాత్రసంగీతానికీ, ఇతర వాయిద్యాలకు ఇది కొన్ని మార్పులతో (mutatis mutandis)పనికి వస్తుంది.
సంగీతంలో , గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, కర్నాటక ఐనా, హిందూస్థానీ ఐనా, నేను గమనించింది ఏమిటంటే, సాధారణంగా మంద్ర మధ్యమం కిందికీ, తార పంచమం పైకీ వెళ్ళరు. ఈరెండు కనిష్ఠ, గరిష్ఠ హద్దుల మధ్యలో, సుమారు 26 / 27 స్వర స్థానాలు ఉన్నాయి. స్వరాలు ఏడే ఐనా, స్వర స్థానాలు 12 లేక 16 యే అయినా, మంద్ర సప్తకంలోకి కొన్ని, తార సప్తకంలోకి కొన్ని విస్తరించటం వల్ల 26 / 27 కి పెరిగాయి. సితార్ లే సాధారణంగా 20/21 మెట్లు ఉంటాయి. నేను చూసిన మేండలిన్ లో 17 మెట్లు ఉన్నాయి. మెట్లు లేక రంధ్రాలు ఎన్ని ఉన్నా, స్థానాలు 26/27 వస్తాయి.
మంద్ర స్వరాలను సూచించటానికి స్వరాల క్రిందొక చుక్క పెట్టటం ఆచారం.
తార స్వరాలను సూచించటానికి స్వరాల నెత్తినొక చుక్క పెట్టటం ఆచారం.
కర్నాటక సంగీతంలో స్వరాల శృతిలో భేదాన్ని సూచించటానికి , వర్కు మొదట్లోనే స్వరాల శృతులను వ్రాస్తారు. ఉదా: కల్యాణి: చరి, అంగా, ప్రమ, శుధై, కాని. చతుశృతి రిషభము, అంతరగాంధారం, ప్రతి మధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలి నిషాదం. వర్కు మధ్యలో ఎక్కడైనా భిన్నమైన శృతి వచ్చినపుడు ఉదాహరణకి ప్రతి మధ్యమం స్థానంలో శుధ్ధమధ్యమం వచ్చినపుడు, వికృత స్వరానికి గుర్తుగా నెత్తిన x గుర్తు పెట్టటం జరుగుతుంది.
హిందూ స్థానీ సంగీతంలో శుధ్ధ స్వరాలకు, కోమల స్వరాలకు మధ్య తేడా చూపించటానికి, కోమల స్వరానికి నెత్తిన ఒక చిన్న నిలువు గీతను గీయటం జరుగుతుంది.
ఈ బాధలన్నిటినీ తప్పించుకోటానికి, ఈక్రింది టేబుల్ సహాయ పడుతుందనుకుంటాను.
వైబీ గాడిద సూచిస్తున్న పధ్దతి | ||
---|---|---|
వైబీగాడిద పధ్ధతి वैबीराव गधा पध्धति | కర్నాటక कर्नाटक संगीत | హిందూస్థానీ हिंदूस्थानी संगीत |
మంద్రస్థాయి స్వరాలు (పాత పధ్ధతిలో క్రింద చుక్క) मंद्र स्थायि स्वर bass notes | ||
a ఎ,ఏ | శుధ్ధ మధ్యమం. (మంద్రం) | శు.మ. (మంద్రం)शुध्ध मध्यम (मंद्र) |
b బి | ప్రతి మధ్యమం (మంద్రం) | తీవ్ర్ మధ్యమ్ (మంద్రం)तीव्र मध्यम (मंद्र) |
c సీ | పంచమం (మంద్రం) | పంచమం (మంద్రం)पंचं (मंद्र) |
d డీ | శుధ్ధ ధైవతం (మంద్రం) | కోమల్ ధైవత్ (మంద్రం) कोमल् धैवत् मंद्र |
e ఈ | చతుశృతి ధైవతం (మంద్రం) | శుధ్ధ్ ధైవత్ (మంద్రం) शुध्ध धैवत् मंद्र |
f ఎఫ్ లేక ఫ | కైశికి నిషాదం (మంద్రం) | కోమల్ నిషాద్ (మంద్రం)कोमल् निषाद मंद्र |
g జీ | కాకలి నిషాదం (మంద్రం) | శుధ్ధ్ నిషాద్ (మంద్రం) शुध्ध निषाद मंद्र |
మధ్యస్థాయి స్వరాలు मध्य स्थायि स्वर | ||
h హెచ్ లేక హ | షడ్జం | షడ్జ్ षड्ज |
i ఐ లేక య | శుధ్దరిషభం | కోమల్ రిషభ్ कोमल् रिषभ |
j జె | చతుశృతి రిషభం | శుధ్ధరిషభ్ शुध्ध रिषभ |
k కె | సాధారణ గాంధారం | కోమల్ గంధార్ कोमल् गंधार् |
l ఎల్ లేక ల | అంతర గాంధారం | శుధ్ధ గంధార్ शुध्ध गंधार् |
m ఎమ్ లేక మ | శుధ్ధ మధ్యమం | శుధ్ధ మధ్యమ్ शुध्ध मध्यम |
n ఎన్ లేక న | ప్రతి మధ్యమం | తీవ్ర్ మధ్యమ్ तीव्र मध्यम |
o ఒ లేక ఓ | పంచమం | పంచమం पंचम |
p పీ | శుధ్ధ ధైవతం | కోమల్ ధైవత్ कोमल् धैवत |
q క్యు లేక కో | చతుశృతి ధైవతం | శుధ్ధ ధైవత్ शुध्ध धैवत |
r ఆర్ లేక రే | కైశికి నిషాదం | కోమల్ నిషాద్ कोमल् निषाद |
s ఎస్ లేక సే | కాకలీ నిషాదం | శుధ్ధ్ నిషాద్ शुध्ध निषाद |
తార స్థాయి స్వరాలు (పాత పధ్ధతిలో పైన చుక్క) तार स्थायि स्वर treble notes | ||
t టీ లేక ట | తార షడ్జం | తార్ షడ్జ్ तार षड्ज |
u యు | శుధ్ధ రిషభం (తారం) | కోమల్ రిషభ్ (తారం) कोमल रिषभ तार |
v వీ | చతుశృతి రిషభం(తారం) | శుధ్ధ్ రిషభ్ (తారం) शुध्ध रिषभ तार |
w వే | సాధారణ గాంధారం (తారం) | కోమల్ గంధార్ (తారం) कोमल् गंधार तार |
x షొ | అంతర గాంధారం (తారం) | శుధ్ధ్ గంధార్ (తారం) शुध्ध गंधार तार |
y యొ | శుధ్ధ మధ్యమం (తారం) | శుధ్ధ్ మధ్యమ్ (తారం) शुध्ध मध्यम तार |
z జొ | ప్రతిమధ్యమం (తారం) | తీవ్ర్ మధ్యమ్ (తారం) तीव्र मध्यम तार |
po పొ | పంచమం (తారం) | పంచమ్ (తారం) पंचम तार |
కొన్ని పరిశీలనలు
కన్ ఫ్యూజన్ రానంత వరకు స్వర సంకేత నామం అక్షరాన్ని ఏ గుణింతం లోనైనా వాడుకోవచ్చు. ఉదాహరణ: t లేక ట. ఇది పైన టేబుల్ లో చూస్తే తార షడ్జం. దీనిని ట గుణింతంలో ట, టా,టి, టీ,టు,టూ, టె, టే, టొ, టో, త, తా, తి, తీ, తు, తూ, తె, తే, తొ, తో, ఇలా ఉచ్చారణకు అసౌకర్యం కానంత వరకు , స్వరాన్ని పలకటానికి ఇబ్బంది కరం కానంత ఎలాగైనా వాడుకోవచ్చు.
పైన టేబుల్ లో చూడండి. k కె = సాధారణ గాంధారం. q క్యూ లేక కొ= చతుశృతి ధైవతం. ఇక్కడ మనం 'క' గుణింతాన్ని స్వేఛ్ఛగా వాడుకోలేం. అయినా కొన్ని సర్దుబాట్లు సాధ్యమే.
పైనే ఇంకోటి చూడండి. g జి = మంద్ర కాకలి నిషాదం. j జె = మధ్య చతుశృతి రిషభం. జ గుణింతాన్ని మనం రెండిటికీ వాడలేం. g జి కి గ గుణింతాన్ని వాడచ్చుకానీ, ఇది మనం అలవాటు పడ్డ గాంధారం గ అనే స్వరం తో కన్ ఫ్యూజన్ కి దారి తీయచ్చు. అందు వల్ల గ గుణింతాన్ని వాడటం కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. మంద్ర కాకలి నిషాదానికి g జీ లేక జు, మధ్య చతుశృతి రిషభానికి j జ, జె, జొ లను వాడుకోవచ్చు. ఇంగ్లీషు లో కన్ ఫ్యూజన్ లేదు, ఫ్లెక్సిబిలిటీ కూడ లేదు. తెలుగులో ఫ్లెక్సిబిలిటీ ఉంది.
కొన్ని మూర్ఛనల ఉదాహరణలు
మాయామాళవ గౌళ: పాత పధ్ధతి. ఆరోహణ: స,శురి,అంగ,శుమ, ప,శుధై,కాని,తార షడ్జం.
ఇదే మూర్ఛన వైబీరావు గాడిద పధ్ధతి: ఆరోహణ: హాయాలామా ఓపీసేటీ. అవరోహణ: టీసేపీఓ మాలాయాహా .
English: hilm opst. tspo mlih.
హిందూస్థానీ: మాయామాళవ గౌళను హిందూస్థానీలో భైరవ్ (పుంలింగ రాగం. భైరవి కాదు , అది వేరు) అంటారు. మూర్ఛన: హాయాలామా ఓపీసేటీ. అవరోహణ: టీసేపీఓ మాలాయాహా .
ఇపుడు మీరు గమనించే ఉంటారు, హిందూస్థానీ భైరవ్ లోనైనా, కర్నాటక మాయా మాళవ గౌళలో నైనా ఒకటే ఆరోహణ, అవరోహణ: హాయాలామా ఓపీసేటీ. టీసేపీఓ మాలాయాహా .
ఇంకొక ఉదాహరణ: కల్యాణి , యమన్ दूसरा उदाहरण: कल्याणी, और यमन. Second example kalyANi and yaman.
kalyaNi: hjln oqst, tsqo nljh.
కల్యాణి: హాజాలానా ఓకోసేటీ, టీసేకోఓ నలజహ.
యమన్ (హిందూస్థానీ): హాజాలానా ఓకోసేటీ, టీసేకోఓ నలజహ.
మంద్ర స్థాయినుండి, మధ్యస్థాయి మీదుగా తార స్థాయికి వెళ్ళటానికి: beg hjln oqst vxz.
తెలుగులో: బీ ఈ జీ హాజాలానా ఓకోసేటీ వీషోజో. జోషోవీ టీసేకోఓ నాలాజాహా జీఈ బీ.
బాటం టూ టాప్, లేక టాప్ టూ బాటం . వీణలోనైనా, సితార్ లోనైనా , వేణవులోనైనా, హార్మోనియం లేక కేసియో వంటి వాటిలో నైనా చక్కగా కవర్ అవుతుంది అని నమ్ముతున్నాను.
ఈ విధంగా కర్నాటక, హిందూ స్థానీ సంగీతాలను మిలాయించటం కుదురుతుంది. పైన చుక్క, కింద చుక్కల బాధ పోతుంది. సాగా కి అంగా కి (సాధారణ గాంధారానికి అంతర గాంధారానికి) తేడా తేలికగా చూప గలుగుతాము. సాగా = k. కె. అంగా = l. ల.
గ్రహ భేదం చేయాలనుకునేవారికి కూడ ఈపధ్ధతి ఉపయోగించ వచ్చు. ఇంకో సారి వివరిస్తాను.
ఇంకా కొంత ఉంది. సూచనలను, తీవ్ర విమర్శలను ఆహ్వానిస్తున్నాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.