చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శాసనసభ
రాష్ట్రవిభజనపై శాసనసభలో చర్చ ప్రారంభం అయ్యిందా కాలేదా అనేది వివాదాస్పదంగా మారింది.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj9cgFfCsucuZQdW59Xv0OM5WXKDgTu5g3mhjzQ7EXofuFYGigk8b6BkZp7NtOVjy8R-Csf7Wlh0FgILNQrObJfKU4moVsRMgkdcV9YBZvyalOheJnzxA-JhlQNjcWwKSEbY9swYJYM3Yif/s128/nadendlamanohar.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhSaRJHJDYdTAVxxc5J-JM3kn5t8XD_AsZKIOyKnIne93cQOqXR_rbzKDP7KqRNMd9_aTqkLcS-McltKTpVIEWSBKpy1Povb3OqDH-BiZoR8u-BjRpHc_ZCOtYZq3Z8cxmHIA9YPHLS5s4y/s128/kiran.jpg)
స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చ ప్రారంభం అయ్యింది అంటూ ఉండగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బిల్లును సభలో టేబుల్ చేయటం మాత్రమే జరిగింది, చర్చ ఇంకా ప్రారంభం కాలేదు, అంటున్నారు. ఏది ఎంత వరకు నిజం? ముందుగా
వైబీరావు గాడిద వ్యాఖ్య
మొదటి నుండి శ్రీ నాదెండ్ల మనోహర్ ధోరణి అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఆయన కాంగ్రెస్ అథిష్ఠానం అనుగ్రహం కొరకై పాకులాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయనను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయిస్తున్నది ఎవరు? బహుశా దిగ్విజయ్ సింగ్ కావచ్చు. కొత్త సీమాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కొరకో, లేక 2014లో కాంగ్రెస్ ఢిల్లీలో మరల అధికారానికి వస్తే కేంద్రంలో ఏదో ఒకపదవో ధ్యేయంగా, ఆయన పని చేస్తున్నారనే అభిప్రాయం కలుగక మానదు.టేబుల్ చేయటం జరిగిందనటం ఎంతవరకు సబబు?
స్థూలంగా చూస్తే ఢిల్లీనుండి వచ్చిన 300 కాపీల బిల్లులను శాసనసభ్యులకు పంచి పెట్టటం, వారికి దానిని చదువుకునేందుకు తగిన సమయాన్ని ఇవ్వటాన్ని మనం టేబుల్ చేయటం అనచ్చు. సభలో జరిగిన ఈకార్యక్రమాన్ని డెప్యూటీ స్పీకర్ శ్రీ భట్టి విక్రమార్క, అప్పటి శాసనసభా వ్యవహారాలమంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ఈకార్యక్రమాన్ని హైజాక్ చేశారు. కాపీలను సభ్యులకు పంచిపెట్టాక ముట్టినట్లు వారి ఎక్నాలెడ్జ్ మెంట్లు తీసుకున్నారో లేదో తెలియదు. ఆక్షణంలో సభలో లేనివారికి కాపీలను అందించారోలేదో తెలియదు. సభ్యులు వాటిని చదవటం, పరిశీలించుకోటం, తమ మనసులలో ఒక అభిప్రాయాలను ఏర్పరుచుకోటం జరగలేదు. ఇవేమీ జరగకుండానే ప్రతిపక్షనేత శ్రీచంద్రబాబునాయుడును మాట్లాడమంటే ఆయన ఏమి మాట్లాడతారు? గందరగోళం తరువాత సభవాయిదా వేయటం జరిగింది. దీనినే, డెప్యూటీస్పీకర్ , శాసనసభా వ్యవహారాలమంత్రి చర్చ ప్రారంభమయినట్లుగా ప్రకటించటం అసంగతం.శ్రీశ్రీధర్ బాబు చేసిన హైజాక్ చాలా కుట్రతో కూడినది. దీనికి ప్రతిచర్యగానే, కిరణ్ శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాలశాఖను వెనక్కులాక్కోవలసి వచ్చింది.
బిజినెస్ ఎడ్వైజరీ కమీటీ వారు చర్చప్రారంభం కావటానికి ఏతేదీని, ఏ ప్రొసీజర్ ను నిర్ణయించారు? ఈవిషయంలో అస్పష్టతలున్నాయి. ఈకమీటీ సమావేశంలోనే ,సభలో చర్చప్రారంభం అయ్యింది అని మనోహర్ ప్రకటించటం, ఆలూ లేదు చూలూ లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్లుగా తయారయింది.
సభలో చర్చ ప్రారంభం కావటానికి వైయస్ ఆర్ పీ పార్టీ, తెలుగుదేశం వారి అభ్యంతరాలను స్పీకర్ పట్టించుకోకపోవటంతో, వారు సభనడవటానికి ఆటంకం కల్పిస్తున్నారు. సభలో మెజారిటీ సభ్యులు సమైక్యతనే కోరుకుంటున్నప్పుడు, బిల్లుపై చర్చ జరగటం అసందర్భం అవుతుంది. ఈవిషయాన్ని ధృవపరుచుకోటానికి స్పీకర్ రహస్యబ్యాలెట్ ద్వారా వోటింగ్ తీసుకుంటే, అక్కడికా కార్యక్రమం అయిపోతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.