అర్జునుడంటే, ద్రౌపదికి ప్రత్యేక ప్రేమ అనేవిషయం విజ్ఞులకు తెలుసు. మత్స్య యంత్రాన్ని భేదించిన వీరవరేణ్యుడిగా ఈ ప్రేమ ఎంతో సమర్ధనీయం కూడ. Readers know that, among Pandava five brothers, Draupadi has special love towards, the third Brother Arjuna. As a Great Archier who had conquered the Matsya-yantram (An archer has to, using his bows and arrows, strike the targeted fish which moves in a pool of water beneath on the ground), that special love towards Arjuna is appreciation-worthy and understandable. But what did Arjuna do to Draupadi in return to her Love?
కానీ అర్జునుడు ద్రౌపది యందు ఇటువంటి ప్రేమనే చూపించాడా? Did arjuna reciprocate draupadi's love in equal degree? సందేహాస్పదమే. మనవాడెక్కడి కెళ్ళినా, స్త్రీలను ఆకర్షించేవాడు. స్త్రీలచేత అమితంగా ఆకర్షింపబడేవాడు. (ఊర్వశి యెడల నిగ్రహంతో వ్యవహరించటానికి కారణం, ఆమె దేవవేశ్య, ముఖ్యంగా ఇంద్రుడి కచేరీకి చెందిన ఆస్తి. మాతృసమానురాలైన ఆమె కోరికను మన్నిస్తున్న సమయంలో, వెయ్యి కళ్ళున్న ఇంద్రుడికి పట్టు పడితే, శాపం గ్యారంటీ).
ధర్మజుడు ద్యూతంలో పరాజయం పొందాక, దుర్యోధన ప్రేరితుడైన దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేయటానికి ప్రయత్నించటం (ఆధునిక కాలంలో assault,molestation, rape వంటి నిర్వచనాల్లోకి తీసుకు రావచ్చు), పాండవ వనవాసం సినిమాలో, సావిత్రి ద్రౌపదిగా 'దేవా ! దీనబాంధవా!' అని పాడుతూ విలపించటం మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు.
అర్జునుడు ద్రౌపదికి కలిగించిన క్షోభను చూద్దాం. We shall see the agony created by Arjuna on Draupadi, by marrying Subhadra, without the knowledge of Draupadi:--
నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 211వ వచనం. సందర్భం: అర్జునుడు శ్రీకృష్ణ ప్రోద్బలంతో, దేవేంద్ర సమక్షంలో సుభద్రను వివాహమాడి, ఆమెను అపహరించుకొని ద్వారకనుండి ముకుంద ప్రేరితులైన దాశార్హవీరులతో, ఇంద్రప్రస్థానికి చేరుకొని, ఒకచెట్టునీడలో విశ్రమించి, సుభద్రతో ఇలా అంటున్నాడు.
మన మివ్విధంబనఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్రి యప్రియంబులు పలుకునో యప్పరమ పతివ్రత పలుకు నిక్కువంబగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గనుమని పనిచిన సుభద్రయు నిజేశ్వరు పంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన :
తేటగీతి పద్యం, ఇది చాల సుందరమైన పద్యం.
పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర,
విజయుఁ డయ్యెడు నీవును వీరపుత్ర
జనని వగుమని దీవించె సంతసంబు
తోడ వసుదేవ పుత్రి నాద్రుపదపుత్రి.
ఇక్కడ పాఠకులు గమనించవచ్చు. నన్నయ ద్రౌపదిని ఎంతో ఔదార్యవంతురాలిగా చిత్రించాడు. భర్త సవతిని తెచ్చాడు. తెలివిగా ముందామెను తనవద్దకు పంపి కాళ్ళమీద పడేశాడు. ఆమె దీవించమంది. ద్రౌపది కూడ హృదయపూర్వకంగానే దీవించింది. ఓ పంకజాక్షీ (సుభద్రా) నీ వతి ప్రతిపక్షవీర విజయుడౌతాడు. అర్జునుడు అయ్యాడు కదా!
నీవును వీరపుత్ర జనని వగుము. అభిమన్యుడి తల్లి అయ్యింది కదా!
వ్యాసుడిచ్చిన original treatment
అర్జునుడు ముందుగా సుభద్రను పంపించి, ఆమెచేత ద్రౌపది కాళ్ళమీద పడ వేయించి దీవెనలు కోరించటం వంటి సున్నితమైన ముందు చూపు మనకి కనిపించదు.వ్యాస భారతం, ఆదిపర్వం, 213వ ఆధ్యాయం, 15వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు
సంస్కృత వ్యాస భారతాన్ని సంపూర్ణంగా, వీలైనంత మూలానికి దగ్గరగా, 1899 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించిన కీర్తి శేషులు శ్రీకిశోర్ మోహన్ గంగూలీ అనువాదాన్ని చూడండి.
15 తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనమ్
తత్రైవ గచ్ఛ కౌన్తేయ యత్ర సా సాత్వతాత్మజా
సుబధ్ధస్యాపి భారస్య పూర్వబన్ధః శ్లదాయతే
16 తదా బహువిధం కృష్ణాం విలపన్తీం ధనంజయః
సాన్త్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృత్
17 సుభద్రాం త వరమాణశ్చ రక్తకౌశేయ వాససమ్
పార్ధః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపుః
18 సాధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ
భవనం శరేష్ఠమ్ ఆసాద్య వీర పత్నీ వరాఙ్గనా
వవందే పృథు తామ్రాక్షీ పృథాం భద్రా యశస్వినీ
19 తతో ఽభిగమ్య త్వరితా పూర్ణేందు సదృశాననా
వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమ్ ఇతి చాబ్రవీత్
20 ప్రత్యుత్థాయ చ తాం కృష్ణా స్వసారం మాధవస్య తామ్
శాస్వజే చావదత్ ప్రీతా నిఃసపత్నో ఽస్తు తే పతిః
తదైవ ముదితా భద్రా తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి
21 తతస్తే హృష్టమనసః పాణ్డవేయా మహారథాః
కున్తీ చ పరమప్రీతా బభూవ జనమేజయ
At last the hero went unto Draupadi. Draupadi, from jealousy, spoke unto him, saying, ‴Why tarriest you here, O son of Kunti? Go where the daughter of the Satwata race is! A second tie always relaxes the first one upon a faggot!‴ And Krishna lamented much in this strain. But arjuna pacified her repeatedly and asked for her forgiveness. And returning soon unto where Subhadra, attired in red silk, was staying, Arjuna, sent her into the inner apartments dressed not as a queen but in the simple garb of a cowherd woman. But arrived at the palace, the renowned Subhadra looked handsomer in that dress.వైబీరావు గాడిద షుమారు అనువాదం. అనువాదంలో లోపాలు ఏవైనా ఉంటే నావే. గంగూలీవి కావు.
The celebrated Bhadra of large and slightly red eyes first worshipped Pritha. Kunti from excess of affection smelt the head of that girl of perfectly faultless features, and pronounced infinite blessing upon her. Then that girl of face like the full moon hastily went unto Draupadi and worshipped her, saying, ‴I am your maid!‴ Krishna rose hastily and embraced the sister of Madhava from affection, and said, ‴Let your husband be without a foe!‴ Bhadra then, with a delighted heart, said unto Draupadi, ‴So be it!‴ From that time, O Janamejaya, those great warriors, the Pandavas, began to live happily, and Kunti also became very happy.
చివరికి హీరోగారు ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. ద్రౌపది అసూయతో ఇలా అన్నది: ఓ కుంతీ పుత్రా! ఇక్కడ ఎందుకు తారట్లాడతావు? ఆ శాత్వతి దగ్గరకే వెళ్ళు.(శాత్వత వంశీకురాలు అయిన ఆ శాత్వతి ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లు). ఎంత సుబధ్ధంగా మనం పీటముడి వేసినా, మొదట వేసిన ముడిపై రెండవ ముడి ఎక్కి సుఖంగా కూర్చుంటుంది. ఈవిధంగా ద్రౌపది కొంత తడవు చాల విలపించింది. కానీ అర్జునుడు ఆమెను శాంతింపచేయటానికి ప్రయత్నించాడు. క్షమాపణ వేడుకున్నాడు. (మొత్తానికి శాంతింపచేయటంలో విజయుడైనాడు).
తరువాత ఎర్ర చీరె కట్టుకున్న సుభద్ర దగ్గరకు వెళ్ళాడు. సుభద్రను మహారాణిగా కాక సాధారణ గోపాలక కాంత గా వేషం వేయించి, ద్రౌపది అంతఃపురానికి పంపాడు. ద్రౌపది అంతఃపురానికి గోపాలక కాంత వేషంలో వెళ్ళినా సుభద్ర ఎంతో అందంగా కనిపించింది.
ఇక్కడ గంగూలీగారు సుభద్రను పెద్ద ఎర్ర కళ్ళు ఉన్నట్లుగా (The celebrated Bhadra of large and slightly red eyes) అనువదించారు . నాకు సంస్కృతం పెద్దగా రాదు. పృథుతామ్రాక్షీ అనే విశేషణం అక్కడే ఉన్న కుంతికేమో నని నా అనుమానం.
సుభద్ర ముందు కుంతికి నమస్కరించింది. కుంతి ప్రేమతో సుభద్ర తల నిమిరి ఆమెకు అనంతమైన దీవెనలనిచ్చింది.
సుభద్ర తరువాత ద్రౌపదికి నమస్కరించింది. నేను నీ సేవకురాలిని అంది. ద్రౌపది వెంటనే నిలబడి, మాధవుడి చెల్లెలిని కౌగలించుకుని , ఆమెను దీవిస్తూ ఇలా అన్నది.
'నిఃసపత్నో ఽస్తు తే పతిః'. పైన ఇచ్చిన గంగూలీగారి అనువాదం ప్రకారం ‴Let your husband be without a foe!‴. అంటే నీ భర్తకు శత్రువులు ఉండకుండు కాక, అంటే శత్రుంజయుడు అగు కాక.
నాకు తెలిసిన సందర్భోచితమైన అనువాదం ఏమిటంటే, సపత్ని అంటే సవతి. నిః సపత్ని అంటే సవతులు లేకుండుట. ఓసుభద్రా , నీకైనా సవతుల బాధ ఉండకుండు కాక,అని దీవించింది అనుకున్నాను.
నా తప్పుకు సవరణ,క్షమాపణ: ద్రౌపదిమీద సానుభూతితో నేను పొరపాటు పడ్డాను. అధరసపత్న పదానికి సంస్కృతాంగ్ల నిఘంటువు rival అంటే పోటీదారు లేకపోటం అంటే నిర్జించిన శత్రువులు కలవాడు, అనే అర్థం ఇచ్చింది. సవతికూడ ఒకరకం పోటీదారే (భర్తృప్రేమను పంచుకోటంలో). ద్రౌపది నేను నిన్ను బాధ పెట్టనులే అని సుభద్రకు హామీ ఇచ్చింది అనే అర్థం నేను తీసుకున్నాను. సుభద్రకూడ నీవన్నట్లే జరుగును గాక అనటంలో నేను కూడ నిన్ను బాధ పెట్టనులే అని వాగ్దానం చేసిందా అనిపించింది.
సుభద్రకూడ, ద్రౌపదిని 'తామ్ ఉవాచైవమ్ అస్త్వ ఇతి' అని స్వస్తి పలికింది. గంగూలీ: So be it! నీవన్నట్లే అగునుగాక.
వైశంపాయనుడు,జనమేజయుడికి ఈకథ చెప్తున్నట్లు మనం మర్చి పోకూడదు. 'ఓజనమేజయా! అప్పటినుండి మహారథులైన పాండవులు ఆనందంగా జీవించటం మొదలు పెట్టారు. కుంతి కూడ ఎంతో సంతసించింది.'
వాగ్దానం చేసుకున్న ప్రకారమే, ద్రౌపదీ సుభద్రలు మంచి స్నేహంగానే వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఇద్దరు కలిసి మద్యం సేవించిన విషయాన్ని ఇంకో వ్యాసంలో ప్రస్తావిస్తాను.
21వ శతాబ్దపు పాలకుల ధర్మ పత్నులు, అధర్మపత్నులు
మనం 21వ శతాబ్దానికి వద్దాం. కేంద్ర మంత్రుల, ఎంపీల ఖాతాల సంగతులు మనకు తెలీదు కానీ, రాష్ట్రమంత్రులకు,శాసన సభ్యులకు, రెండు, అంతకన్నా ఎక్కువ ఖాతాలే ఉన్నాయని ఒకసారి మనరాష్ట్ర శాసనసభలో చర్చకు వచ్చినట్లు నాకు జ్ఞాపకం. ఆపైన, ఆనాటి సభాపతి శ్రీ సురేష్ రెడ్డి గారు ఒక విచారణా సంఘాన్ని నియమించి నట్లుకూడ నాకు గుర్తు. తరువాత ఎన్నికలు వచ్చాయి. శ్రీ సురేష్ రెడ్డిగారు సభాపతి పదవి నుండి దిగిపోయారు. కొత్త శాసనసభ వచ్చింది. కమిటీ ఏమైందో ఎవరికీ తెలీదు.శాసన సభ్యులకు, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, కేంద్రమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఉన్న ధర్మ పత్నులు, అధర్మ పత్నుల విషయం వోటు వేయవలసిన వోటర్లు , ముఖ్యంగా మహిళా వోటర్లు తెలుసుకోవలసిన అవసరం ఉందా లేదా , లేక ఇది పాలకుల ప్రైవేటు వ్యవహారమా ఇవి అన్నీ నాన్ -సెన్సా?
ఎంతమంది ద్రౌపదులు కుమిలి పోతున్నారో, కమిలి పోతున్నారో తమ వోట్లను సద్వినియోగం చేసుకోవలసిన \ చేసుకోదలచిన పౌరులు స్థానికంగా విచారించుకోవలసిన అవసరం ఉందేమో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.