చర్చనీయాంశాలు: ఆమ్ ఆద్మీ, దేశ రాజకీయాలు, చిరంజీవి, పాలకొల్లు
विनोद बिन्नी ने कहा कि उनके अनुभव के बावजूद मंत्रिमंडल में जगह न दिए जाने से वे काफी दुखी है. उन्होंने कहा, 'मेरा अपमान हुआ है. मैं कल बड़ा फैसला करूंगा.' click
ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో, శ్రీ వినోద్ బిన్నీ గారు , ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రిని ఓడించారు. సహజంగా, పెద్ద శత్రువుని మట్టి కరిపించారు కాబట్టి మంత్రి వర్గంలో స్థానం ఆశించటంలో తప్పులేదు. పాలకొల్లులో చిరంజీవిని ఓడించిన మహిళా శాసనసభ్యురాలు కూడ, మంత్రివర్గంలో స్థానం ఆశించింది. పాపం, ఆమెకు ఇవ్వలేదు. చిరంజీవి తన పార్టీని తుంగలో తొక్కినందుకు ఆయనకు కేంద్రమంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. సరే అది కాంగ్రెస్ సంస్కృతి అనుకోండి. కులాల సెట్టింగులో ఆమెకు అవకాశం దొరికినట్లులేదు. చిరంజీవికి దొరికింది.
ఇప్పుడు బిన్నీగారి విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ ట. అక్కడ అసంతృప్తి చెంది, ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చాడనుకోవాలి. పైన ఇచ్చిన లింకు ప్రకారం 'నాకు పెద్ద అవమానం జరిగింది. రేపు ఈవిషయంలో గొప్ప ఫైసలా చేస్తాను' అన్నట్లు ఉంది.
కొన్ని ఆంగ్ల పత్రికలలో వచ్చిన దాని ప్రకారం , ఆయన బుధవారం పత్రికల సమావేశంలో ఏవో సంచలనాత్మక విషయాలు బయట పెడ్తానన్నాడు.
ఆయనకు స్పీకర్ పదవి ఇవ్వగానే నీరు కారి పోయినట్లున్నాడు. ఇప్పుడు అంటున్నది:
मंत्री पद देना मुख्यमंत्री का विवेकाधिकार होता है। कोई भी काम देंगे तो हम करेंगे। हम देश सेवा के लिए आए हैं। राजनीति बदलने आए हैं। कोई नाराजगी कभी थी ही नहीं। click
'మంత్రి పదవి ఇవ్వటం ముఖ్యమంత్రి వివేకాధికారం. ఏపని ఇచ్చినా మేము చేస్తాము. మేము దేశసేవకు ఉన్నాము. రాజనీతిని మార్చటానికి వచ్చాము. నాకు ఎప్పుడూ నారాజ్ గీ (కోపం లేక అలక) లేదు.'
స్పీకర్ పదవి ఇవ్వచూపకుంటే, బిన్నిగారు ఏమన్నా బయట పెట్టే వాడేమో. పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బయట పెట్టడా?
ఈలోగా హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేగారు, ఆమ్ ఆద్మీ పార్టీ విదేశీ విరాళాలపై దర్యాప్తు చేయిస్తామన్నారు. ముంబాయి ఆదర్శ హౌసింగ్ సొసైటీలో జరిగిన స్కాం పై, ఎంక్వైరీ కమీషన్ ఇచ్చిన రిపోర్టును ఏమి చేయిస్తారు? ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రవాస భారతీయులు విరాళాలు పంపితే పంపి ఉండచ్చు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైతే దేశ ప్రజలు తీవ్ర నిరాశకు గురియౌతారు. కానీ విఫలం కాక తప్పదు. గతంలో, జనతా పార్టీ ప్రయోగంలాగానే, విపిసింగ్ గారి ప్రయోగంలాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడ విఫలం కాక తప్పదు. పెట్టుబడి దారీ విధానంలో ఇది అనివార్యం.విడతలు విడతల సోషలిజం (ఫేబియన్ సోషలిజం) కాకుండా, ప్రత్యక్ష సంపూర్ణ సోషలిజం వాగ్దానం చేసే పార్టీ మనకు అవసరం. అలాటి పార్టీకి మనం మూడింట రెండు వంతుల మెజారిటీని ఇవ్వవలసి ఉంటుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.