హాన్స్ ఇండియా , ఆంగ్ల దిన పత్రిక, విజయవాడ ఎడిషన్, 24.12.2013.
ఈపత్రికను చూడగానే మనం ఆశించేది ఒకటి, అగోచరంగా ఉండి తరువాత ప్రస్ఫుటమయ్యేది మరొకటి.
స్వామి వివేకానంద
ఈ వ్యాసాన్ని చదువ దలుచుకున్నవారికి లింకు:
ఈ వ్యాసం పేరు: One ounce of practice equals 20,000 tonnes of big talk.
ఈవ్యాస రచయిత: ప్రొఫెసర్: వికెఆర్ వీ రావు, మాజీ భారత ఆర్ధికమంత్రి.
ఈవ్యాసం ఎలా ఉంది:
నా బ్లాగుల వలెనే, ఈవ్యాసాన్ని ఎంతమంది చదువుతారో తెలియదు.
వివేకానందా గారి ప్రసంగాలు RHETORIC తో నిండి ఉంటాయి. రెటారిక్ అంటే, ఇతరులను ఆకట్టుకోవాలని, వారి దృష్టిలో తాను గొప్పగా మెరిసి పోవాలని చేసే ప్రసంగాలు, వ్రాతలు, పనులు. రెటారిక్ ను ఎక్కువగా సేల్స్ మెన్లు వాడతారు. ప్రకటనలలో కొనుగోలుదారులను ఆకట్టుకొని, వారిచేత వస్తువులను కొనిపించాలనే దృష్టితో ఎక్కువగా రెటారిక్ వాడబడుతుంది. వాస్తవాల కన్నా అతిశయోక్తులు ఎక్కువగా ఉంటాయి. సేల్స్ మెన్ ల తరువాత రెటారిక్ వాడటంలో రాజకీయనేతలు ఆరితేరి ఉంటారు.
వివేకానంద గారి ప్రసంగాల్లో రెటారిక్ ఎందుకు ఎక్కువ?
స్వామీజీ లోకాన్ని ఎలా ఆకట్టుకోవాలో తెలిసిన వాడు. విశ్వమతమహాసభకు భారత్ నుండి, వివేకానంద గారు ఒక్కడు మాత్రమే వెళ్ళలేదు. ఇంకా ఐదుగురు వెళ్ళారు. జైన మతప్రతినిథిగా వీర్ చంద్ గాంధీ వెళ్ళారు. దివ్యజ్ఞాన సమాజంనుండి పిసి మజుందార్ గారు వెళ్ళారు. బ్రహ్మసమాజ్ ప్రతినిథి ఒకరు వెళ్ళారు. వైష్ణవమత ప్రతినిథి శ్రీ నరశింహాచార్య వెళ్ళారు. కాయస్థ సమాజం ఒకరిని పంపింది. అయితే వారు తమతమ మతాల గొప్పతనాన్ని తమ శక్తి కొలది వివరించుకున్నారు తప్ప , ఏం చెప్తే అవతలవాడిని ఆకట్టుకోవచ్చు అనే విషయంపై దృష్టి కేంద్రీకరించలేదు. వివేకానంద ఈకీలకాన్ని పట్టుకొని , తన స్వంతానికి వాడుకున్నారు.
ఆకీలకం ఏమిటంటే, 'విశ్వమతం'. హిందూమతం గురించి అక్కడక్కడ చెప్తూ, విశ్వమతాన్ని ప్రతిపాదించటం ద్వారా పాశ్చాత్యులు లొంగి పోతారు అని స్వామీజీ అర్ధం చేసుకున్నారు. అందుకే, స్వామీజీ అమెరికా వెళ్ళిన విశ్వమత మహాసభ అనంతర మొదటి మూడు నెలల ప్రసంగాలలో, ఇది కనిపిస్తుంది. తరువాత, దానికి ఝలక్ ఇచ్చారు.
పాశ్చాత్యుల దృష్టిలో విశ్వమతం అంటే, 'క్రైస్తవం'. వారికోరిక ఏమిటంటే , ప్రపంచం అంతా 'క్రైస్తవమయం' అయిపోవాలి. విశ్వమత మహాసభ నిర్వాహకుల్లో రెండవ టాప్ బాస్ అయిన రెవరెండ్ బారోస్ గారు, వివేకానంద సహాయంతో భారత్ ను క్రైస్తవంతో నింపవచ్చు అని ఆశించినట్లు కనిపిస్తుంది. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ అనే లోకోక్తిలాగ్ వారి స్నేహం చివరికి పరస్పర ద్వేషంగా పరిణమించింది.
వివేకానంద గురించి వ్రాయాలంటే కొన్ని వందల పేజీలు వ్రాయచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన చెప్పింది ఒకటి,చేసింది ఒకటి. ప్రసంగాలకు, ఆచరణలకు సంపూర్ణ వైరుధ్యం అడుగడుగునా మనకు కనపడుతుంది. అందుకే, ప్రొఫెసర్ వికెఆర్ వీ రావు గారి వ్యాస శీర్షిక One ounce of practice equals 20,000 tonnes of big talk ఉల్లంఘన వివేకానంద గారికి కనీసం 80% వర్తిస్తుంది.
కార్యశూరత వేరు, ప్రసంగ శూరత వేరు. జైన ప్రతినిథిగా వెళ్ళిన వీర్ చంద్ గాంధీగారు కార్యశూరులు. పబ్లిసిటీ దురద తక్కువ. ఆకాలంలో గుజరాత్ లో, భారత్ లో క్షామం. జనం ఆకలితో అల్లాడుతున్నారు. వీర్ చంద్ గాంధీగారు అమెరికాలో తిరిగి రెండు ఓడలనిండా గోధుమలను విరాళంగా సేకరించి భారత్ కు పంపారు. వివేకానంద గారు ప్రసంగ శూరులు కాబట్టి, ఒక ప్రసంగాల మార్కెటింగ్ సంస్థతో ఒప్పందంచేసుకొని తన ప్రసంగాలను హాళ్ళలో ఊరూరా నడిపించే ఏర్పాటు చేసుకున్నారు. డాలర్ల వర్షంకురిపించు కోవచ్చని ఆశించారు. ఆమార్కెటింగ్ సంస్థ వారే పత్రికల్లో మంచి పెయిడ్ న్యూస్ వచ్చేలా గా చూసుకున్నారు. ఆ ప్రసంగ మార్కెటింగ్ పెయిడ్ న్యూస్ ఫలితమే మనకు ఇబ్బడి ముబ్బిడిగా లభించే స్వామీజీ కి లభించిన ప్రసంశల క్లిప్పింగులు. తరువాత డాలర్లవిషయంలో స్వామీజీకి ఆ ప్రసంగ మార్కెటింగ్ సంస్థకు ఏవో తేడాలు వచ్చాయి. డాలర్లుపోయి స్వామీజీ ఘొల్లుమన్నారు. ఆసంస్థ తనను మోసగించిందని స్వామీజీ తెగతెంపులు చేసుకున్నాక, పత్రికలలో పొగడ్తలు తగ్గాయి.
నరేంద్ర మోడీగారు తన వేదిక మీద పెట్టుకోవాల్సింది, వివేకానంద నిలువెత్తు బొమ్మకాదు. వీర్ చంద్ గాంధీ బొమ్మ. 'పెరటి చెట్టు మందునకు కొరగాదు', అనే సామెత, 'చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు అనే సామెత ' ను నరేంద్రమోడీ గారు గుర్తుకు తెచ్చుకోవాలి.
వివేకానందజీ తమ మాటలను తానే ఎలా ఉల్లంఘించారో, వివేకానందగారు భారతదేశాన్ని వెయిట్ లిఫ్టింగ్ చేసిన మల్లయోధుడిగా కీర్తించ బడుతూ, తానే ఎలా చతికిల బడ్డారో తెలుసుకోవాలనుకునేవారు, ఎంతో శ్రమించి వ్రాసిన నా ఆంగ్ల బ్లాగ్ వివేకానందవైబి.బ్లాగ్ స్పాట్.కామ్ లో చూడచ్చు. click
సశేషం. మనకు ఈవివేకానంద ఊకదంపుడు 12.1.2014 నాటికి శిఖరాగ్రానికి చేరుకుంటుంది.
పెయిడ్ న్యూస్ 19వ శతాబ్దం నుండి, 20వ శతాబ్దానికి, అక్కడనుండి 21వ శతాబ్దానికి పాకింది.
నేడు భారత్, మరియు ఆంధ్రప్రదేశ్ లలో పెయిడ్ న్యూస్ ప్రచురించని పత్రిక గానీ, టీవీ ఛానెల్ గానీ లేవు. అలా ప్రచురించకపోతే అవి తమ వ్యాపారాలను చేయలేవు. యంత్రాలపై పెట్టుబడులు, కిరాయిలు, జీతాలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఛార్జీలు రావు. యూనివర్సిటీలు, కాలేజీల వార్తల్లో అధిక భాగం పెయిడ్ న్యూసే. సినిమా వార్తల్లో అధిక భాగం పెయిడ్ న్యూసే. ఎగ్జిబిషన్లు, ఆవిష్కరణల వార్తలు, షోరూంల ప్రారంభోత్సవ వార్తలు పెయిడ్ న్యూసే.
See this news on page 3 of Hans India daily dated 24.12.2013. Heading: Xmas bufet at City Hotel.
Name of the Hotel is Fortune Murali Park. Cost of the bufet is Rs. 475 (not broken pieces of earthen pot). At least, there is promise of serving with warmth. Bufet means, they throw the food on table. We have to eat. If a family of a husband, wife, two children go, Rs. 1,900 conch shells will fly. They have printed a photo of the bufet.
Mother tongue Telugu language:
హాన్స్ ఇండియాలో అదే 24.12.2013 సంచికలో, 3వ పేజీలో ఈవార్త చూడండి:
శీర్షిక: Xmas bufet at city hotel. పేరు Fortune Murali Park ట. ఖరీదు రూ. 475 రూపాయలే (కుండ పెంకులు కావు). కనీసం ఆప్యాయంగా వడ్డించటంకూడ లేదు. బఫెట్ అంటే ఆబల్లపై పడేసి ఉంటే తినాలి. ఒకభార్యా భర్త, ఇద్దరు పిల్లలు వెళ్ళారంటే, రూ. 1900 కుండ పెంకులు ఖర్చవుతాయి. ఫొటోకూడ వేశారు.
Day and night bazar for working women. అదే పేజీ. ఫొటోకూడ వేశారు.
కాబట్టి, అయ్యా, ఇదీ లోక ప్రవృత్తి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.