చర్చాంశాలు: స్వామి వివేకానంద, సమాజం, ధూమపానం
చికాగో సర్వమతమహాసభకు హాజరైన భారతీయుల చిత్రం. మధ్యలో వ్యక్తే స్వామి వివేకానంద..
వివేకానందగారి గురించి మొదటిసారి వ్రాస్తున్నాం కాబట్టి, ఉపోద్ఘాతం introduction
స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను (Complete Works of Swami Vivekananda) అధికారికంగా శ్రీరామకృష్ణ మఠం వారు ప్రచురించారు. పలువురు ఇతరులు కూడ ప్రచురించారు. ఇది కాక, అంతర్జాలంలో కూడ శ్రీరామకృష్ణ మఠం వారి అధికారిక వెబ్ సైట్లలో ఇవ లభ్యంఅవుతున్నాయి. ఇవకాక రెండు మూడు లక్షల వ్యక్తులు కూడ, స్వామీ వివేకానంద సూక్తులను భారీగానే ఇంటర్నెట్లో ప్రపంచ ప్రజల కొరకు ఉంచారు. చదివిన వారు ఎంతో ప్రభావితం అవుతున్నారు. సంతోషమే.
కేంద్రప్రభుత్వం, పలు రాష్ట్రప్రభుత్వాలు, ఈ సంవత్సరాన్ని వివేకానంద 150వ జయంతిగా పండుగలు చేసుకుంటున్నాయి. రూ. 1500 కోట్లనుండి రూ. 2000కోట్లదాకా వ్యయం చేస్తున్నారు. టీషర్టులపై స్వామి వివేకానంద చిత్రాలను ముద్రించి కళాశాలల్లో పంచి పెట్తున్నారు. పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తున్నారు. స్వామీ వివేకానందగారిని యువకులకు రోల్ మాడెల్ (నమూనా ఆదర్శ పురుషుడు)గా పరిచయం చేస్తూ, ఆయన లాగా ఉండమని ప్రబోధిస్తున్నారు.
ప్రబోధించేవారిలో రాష్ట్రపతి, ప్రధాని, వంటి నేతలే కాక, న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఎఎస్ అధికారులు కూడ ఉంటున్నారు. వీరిలో ఎంత మంది శ్రీ స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను కూలంకషంగా చదివారో నేను చెప్పలేను. ఇళ్ళల్లో బీరువాల్లో అందంగా పేర్చుకునేవాళ్ళు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా మనం స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలలో (Complete Works of Swami Vivekananda) కొన్నటినైనా లోతుగా పరిశీలించి 'టంగుటూరు మిరియాలు నిజంగానే తాటికాయలంత ఉంటాయా' లేక మామూలు గానే ఉంటాయా తెలుసుకోటం తప్పుకాదనుకుంటాను.
స్వామీ వివేకానంద గారి రచనల్లో ఎపిజిల్స్ epistles(లేఖలు) ముఖ్యమైనవి. శ్రీవారు విదేశీయులకు, ముఖ్యంగా విదేశీ స్త్రీలకు వ్రాసినవి ఉన్నాయి. స్వదేశీయులకు వ్రాసినవీ ఉన్నాయి. స్వదేశీయులకు వ్రాసిన వాటిల్లో ,స్త్రీలకు వ్రాసినవి తక్కువ.
లేఖల్లో కొన్ని కీలకమైన ప్రదేశాల్లో కత్తిరింపులకు గురియైనాయి. అది కాక స్వామీ వివేకానంద గారు ఇతరులకు వ్రాసిన లేఖలే కాక స్వామి వారికి ఇతరులు వ్రాసిన లేఖలు ప్రచురించబడలేదు. పూర్తి వాస్తవ చిత్రం దృశ్యమానం అవ్వాలంటే, inbox లోపలికి-పెట్టె, outbox బయటికి పెట్టె రెండు ఉండాలి. inbox లోపలికి-పెట్టె ఉత్తరాలు ఎక్కడో నేలమాళిగల్లో మూలుగుతూ ఉండ వచ్చు. అవి ఇంక బయటికి వస్తాయని అనుకోలేము. లభ్యమైనవాటిని పరిశీలించి మనం కొంతవరకైనా సత్యాన్ని అన్వేషించ గలగాలి.
సన్యాసులను మనం ప్రాథమికంగా రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు.
1. పీఠాధిపతులు, జగద్గురువులు, పరమహంసలు, శంకరాచార్యలు, సరస్వతులు, భారతులు, మొ|| వీరు ప్రాథమికంగా స్థిర నివాసులు. చాతుర్మాస్యం అంటూ అప్పుడప్పుడూ క్యాంపులు నడిపినా, మౌలికంగా వీరు స్థిర నివాసులు.
2. చర సన్యాసులు. వీరిని కొందరు బైరాగులు అంటారు. ఆంగ్లంలో mendicants అనచ్చు.
పీఠాధిపతులకు స్థిరాదాయం, వివిధపేర్లతో నెపాలతో ప్రభుత్వ గ్రాంట్లు , ప్రజల ముఖ్యంగా వ్యాపారుల విరాళాలు, విదేశీ విరాళాలు, వద్దంటే డబ్బు లాగా వచ్చి పడుతు ఉంటాయి.
బైరాగులకు భిక్షాటనయే దిక్కు. పట్టెడన్నం దొరకటమే గొప్ప. ఈ పట్టెడన్నం కొరకే వారు పాపం నెత్తికి శాయిబాబాలాగా గుడ్డ చుట్టుకోటం, ఆయనను అనుకరించటం, నేడు జరుగుతున్నది. సత్రాల్లో, మఠాల్లో, ఫుట్ పాత్ లపై, గుడిమెట్లపై పండుకోటం, వాన,ఎండ,చలి, వంటి వాటిని తట్టుకోటం కోసం అనుకోండి, రకరకాల వ్యక్తులతో కలిసి తిరగవలసిరావటం వల్ల అనుకోండి, చుట్టలు, గంజాయి వంటి దురలవాట్లు అంటుకుంటాయి. ఈవిషయంలో వారిని పెద్దగా తప్పు పట్ట వలసిన అవసరం లేదు.
పీఠాధిపత్య సన్యాసుల్లో మనకి ఇంజనీర్లు, డాక్టర్లు, వంటి విద్యాధికులు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే స్కూల్ , కాలేజీ డ్రాప్ అవుట్ లే ఎక్కువ.
పీఠాధిపత్య సన్యాసుల్లో అహంభావం జాస్తి. పలువురు తాము బోధించటానికే పుట్టాము అనుకుంటూ ఉంటారు. సమాజం తమ కాళ్ళకు మొక్కాలి అనుకుంటారు. దేశనేతల చేతనైనా సరే, న్యాయాధీశులచేత నైనా సరే మ్రొక్కించు కుకోటానికి వెనుకాడరు.
ఇవన్ని తరువాత లోతుగా కవర్ చేసుకుందాము.
స్వామీ వివేకానంద గారి చుట్టలు
పీఠాధిపత్య సన్యాసులు, ముఖ్యంగా 120కోట్ల భారతీయులను పైకెత్తి లేపిన వాడుగా కీర్తించబడే శ్రీ స్వామీ వివేకానంద గారికి దురలవాట్లు ఉండకూడదని మనం ఆశించటం తప్పా? సన్యాసులకు, తప్పనిసరిగా ఉండాల్సిన గుణం ఇంద్రియ నిగ్రహం. సన్యాసి అంటే ఇంద్రియజిత్ లేక జితేంద్ర క్రింద లెక్క.
చుట్టపీకెలు చిన్న అలవాటే కావచ్చు. కానీ చుట్టపీకెల వంటి చిన్న అలవాటునే వదిలించుకో లేని వారు, జాతికి మార్గ దర్శకత్వం ఎలా వహించ కలుగుతారు?
శ్రీ స్వామీ వివేకానంద గారు త్వరగా అంటే 39 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. మధుమేహం (షుగర్ వ్యాధి) ముఖ్య కారణంగా చెప్పబడ్డా ఇతర జబ్బులు కూడ, చాలానే ఉన్నాయి. ఈజబ్బులు రావటానికీ, విషమించటానికీ, తొందరగా 39 ఏళ్లకే స్వర్గస్థులవటానికీ , చుట్టపీకెలు కూడా కారణభూతమని మనం ఎందుకు అనుకోకూడదు?
సాక్ష్యాలు, ఋజువులు, మిగిలింది రాబోయే పోస్టుల్లో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.