కార్ల్ మార్క్స్ , తమిళనాడు, తెలంగాణ, శ్రీలంక, ప్రధాని, విదేశాంగ విధానం
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే
-- అనే కార్ల్ మార్క్స్ సూక్తి ఆచంద్రతారార్కమూ నిలిచి పోతుంది.
ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి విదేశయాత్రలంటే మహా ప్రేమ. వారు కొలంబోలో జరుగుతున్న కామన్వెల్త్ శిఖరాగ్ర సభకుకూడ, వెళ్ళటానికి సూటుకేసును సర్దుకుంటున్న , విఐపి విమానాలజోడును సిధ్ధం చేసుకుంటున్న సమయంలో, తమిళ మంత్రుల సలహాలకు తలఒగ్గి ,తమయాత్రను రద్దు చేసుకోటం గమనార్హం.
కాంగ్రెస్ యొక్క రాష్ట్రాల యూనిట్ల కన్నా, సంకీర్ణ భాగస్వాములైన ప్రాంతీయపార్టీలు గొప్పవి .
తమిళనాడు తమిళులకు తమ శ్రీలంక తమిళులపై ఎంత సోదర ప్రేమ ఉందో పరీక్షించటానికి ఒకమార్గం ఉంది. తమిళనాడు తమిళులకు తమ శ్రీలంక తమిళులపై ఉండే సోదర ప్రేమ , తెలంగాణ తెలుగువారికి తమ సీమాంధ్ర తెలుగు సోదరులపై ఉండే అసాధారణ ప్రేమకు భిన్నమైనది కాదు అని ఋజువు చేసుకోవచ్చు.
కేంద్రప్రభుత్వం శ్రీలంక తమిళ సోదరులకు onetime opportunity గా భారత పౌరసత్వం, తమిళనాడు చెన్నైలో రీసెటిల్ మెంట్, ఆఫర్ చేస్తూ ఒక పథకాన్ని సిధ్ధంచేసి, తమిళనాడు రాజకీయపార్టీలకు పంపాలి. ఎన్ని తమిళ పార్టీలు, శ్రీలంక తమిళ సోదరులకు ఆశ్రయం ఇవ్వటానికి ముందుకు వస్తాయో చూడాలి.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే -- అనే కార్ల్ మార్క్స్ సూక్తి నిస్సందేహంగా ఋజువు అవుతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.