నిజాం నవాబు పాలనను ఎంత నెత్తిన పెట్టుకున్నా, మైనారిటి వోటర్ల మద్దతు తో పాటుమెజారిటీ వోటర్ల మద్దతు కూడ అవసరం అని శ్రీవారు గుర్తించి నట్లు వారు వ్యవహరిస్తున్నారు.
ఈమధ్య శ్రీవారు నగరంలో రవీంద్రభారతిలో, శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారికి ఘన సన్మానం జరిపించారు. కెసిఆర్ గారు సిధ్ధాంతిగారి పల్లకీని మోశారు. శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారికి పసిడి కంకణ ధారణకూడ చేయించారు. ఛాయాచిత్ కూడ పత్రికల్లో వచ్చింది.
ఈనాడు 5-11-2013, 11వ పేజీ చూడండి. శ్రీవారివి కొన్ని సుభాషితాలు మచ్చుకి:--
ధర్మం పునాదులపైనే దేశం .
దేశంలో ధర్మాత్ములు 98% ఉన్నారు. విఛ్ఛిన్నం చేసే వారు, లఫంగాలు , కేవలం 2% మాత్రమే.
త్వరలోనే అయత చండీ యాగం చేయాలని యోచిస్తున్నాను. దేశంలో గతంలో ఒకే ఒక్క సారి అయత చండీయాగం జరిగింది.
గతంలో శ్రీశృంగేరీ పీఠాధిపతి గారు తన పుట్టిన రోజు యాగం చేశారు. నేను కూడా అలాటి యాగం చేయాలని తలపెట్టాను. శ్రీపాలకుర్తి నృశింహరామ సిధ్ధాంతి గారి అధ్వర్యం లోనే నేనీ యాగాన్ని నిర్వహిస్తాను.
శ్రీకెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రధమ దళిత ముఖ్యమంత్రిని ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు యజ్ఞాలు, యాగాలూ చేసి, ఆయజ్ఞఫలంతో, చివరకి తన కొడుకునో, కూతురునో , అల్లుడినో, ప్రజలపై రుద్దుతారా? మన్మోహన్ ప్రధాని అయినా, అధికారం మొత్తం సోనియా మాత చేతిలో ఉన్నట్లుగా, దళితుడికి ముఖ్యమంత్రి అయ్యే సౌభాగ్యాన్ని కెసీఆర్ ప్రసాదించినా, అది కేవలం తన గుమాస్తాగాయే, అని వ్రాయనవసరంలేదు.
శ్రీవారికి యజ్ఞయాగాదులపై మొదటినుండి మోజు ఉన్నది. అయితే , బిజెపిని మించి పోవాలనే తపన, ఈకోరికను ఇనుమడింప చేస్తున్నదా?
ఆ రెండు శాతం లఫంగాలు ఎవరో తెరాస నేత శ్రీ చంద్రశేఖరేంద్రుల వారు చెప్పలేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.