మనుస్మృతి 8వ ఆధ్యాయం, 1 నుండి 150 శ్లోకాలు. లా విద్యార్ధులకు ఉపయోగం.
Click.
or లేక ఇంకొక హోస్ట్ ayyo.x10.mx. నుండి.
Click.
మనుస్మృతిని పలు విశ్వవిద్యాలయాలలో న్యాయ శాస్త్ర విద్యార్ధులకు పాఠ్య గ్రంథంగా నిర్దేశించారు. ఒకసారి 8 వ ఆధ్యాయం, 22వ శ్లోకం చూద్దాం.
08-022
యద్రాష్ట్రం శూద్ర భూయిష్టం
నాస్తికా క్రాంతం అద్విజం
వినశ్యత్యాశు తత్కృత్స్నం
దుర్భిక్షం వ్యాధి పీడితం.
తాత్పర్యం: ఏరాజ్యం లో నయితే శూద్రులు మిక్కుటముగా ఉంటారో, ఏరాజ్యం అయితే నాస్తికులతో లుకలుకలాడుతూ ఉంటుందో, ఏదేశంలో అయితే ద్విజులు నివసించరో, ఆదేశం కరువు కాటకాలు, వ్యాధులతో బాధ పడుతూ ఉంటుంది.
వ్యాఖ్యానం : అమెరికాలో, ఇంగ్లండులో, రష్యాలో, బ్రాహ్మణులు ఉండరు. ఆదేశాల్లో నాస్తికులు బహుళంగానే ఉన్నారు. అక్కడ అధిక సంఖ్యాకులు శూద్రులే. మరి ఆదేశాలు సుభిక్షంగానే ఉన్నాయి. దీన్ని బట్టి మను స్మృతి ఎలాటి పుస్తకమో మనం అర్ధం చేసుకోవాలి.
భారత్ లో, ఆంధ్రప్రదేశ్ లో, ద్విజులు తగిన సంఖ్యలోనే ఉన్నారు. అయినా, భారత్ లో, ఆంధ్రప్రదేశ్ లో, కరువు కాటకాలు , వరదలు, బాగానే వస్తూ ఉంటాయి. దీని భావమేమి తిరుమలేశ?? ఒక దేశంలో, లేక, ఒకరాష్ట్రంలో, ఒకకులంవారో, ఒకమతంవారో, ఒకవృత్తివారో, ఎంతమంది ఉన్నారు అనేవిషయానికీ, ఆదేశంలో వచ్చే ప్రకృతి విపత్తులకూ, అనులోమ సంబంధంగానీ, విలోమసంబంధంగానీ, పరోక్ష సంబంధంగానీ ఉండదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.