♚■T21వ శతాబ్దపు వాహన యోగాలు, మహాభారత కాలపు వాహన యోగాలు ♞: ♛21వ శతాబ్దపు ప్రధానమంత్రులు , రాష్ట్రపతులు ఎక్కడకి బయలుదేరినా రాజు వెడలె రవితేజములలరా అన్నట్లుగా ఒక్కోటి 1500 కోట్లతో కొన్న ప్రత్యేక విమానాలు రెండు, దానిలోకి మంది మార్బలం, వంటవాళ్ళు , కమెండోలు, ఉంటారు. అదే రాష్ట్రాల ముఖ్యమంత్రులయితే హెలీ కాప్టర్ లేనిదే, అది చిన్న రాష్ట్రం అయినా అడుగు తీసి అడుగు వేయరు. ఢిల్లీ కానీ ప్రక్క రాష్ట్రాలకు కానీ వెళ్ళాలంటే, ప్రత్యేక విమానాలను అద్దెకి తీసుకోవాలి. ఇంక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్ ఎల్ ఏలు ఎవరైనా సరే వీలైనంత వరకూ ఎగరాల్సిందే కానీ నేల మీద నడవరు. అయితే ఈ హెలీకాప్టర్ల దురద, అద్దె విమానాల దురద, ఈనాటిది కావచ్చేమో కానీ, విదేశీ కార్ల రోగం మాత్రం స్వాతంత్ర్యం రాకముందే, ఆనాటి ముఖ్యమంత్రులు (ప్రధాన మంత్రి అని పిలిచేవాళ్ళు) గోవింద వల్లభ పంత్, కె బీ సిన్హా (బీహార్ కేసరి ) కాలంలోనే ఉండేదని ఒక చరిత్ర బుక్ లో చదివాను. గాంధీగారు వారిని నిరుత్సాహ పరచాలని చూసినా అది ఫలించలేదని కూడ ఉంది. ♝
♛మహాభారత కాలం అంటే షుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనే దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి నేటి వారికి ఉంటుందని నేను అనుకోను. అయినా నా దురద కొద్దీ వ్రాస్తున్నాను. వ్యాస మహాభారతం. ఆది పర్వం. సంస్కృత మహాభారతానికి మూడు వెర్షన్ల కన్నా ఎక్కువే ఉన్నాయి. బొంబాయి వెర్షన్. బెంగాల్ వెర్షన్. మద్రాసు వెర్షన్. ఈ వెర్షన్ల బట్టి అధ్యాయాల నంబర్లు, శ్లోకాల నంబర్లు మారవచ్చు. అందుచేత నేను ఈ క్రింద ఇచ్చే శ్లోకాన్ని, వెర్షన్ బట్టి వెతుక్కోవాలి.♝
♛దుర్యోధనుడికి పాండవులను లక్కఇంటిలో పెట్టి కాల్చాలని మహా కోరిక. పెరియార్, మాయావతి, త్రిపురనేని రామస్వామి వంటి వాళ్ళు మన సమాజంలోని చెడులన్నిటికీ బ్రాహ్మణులే కారణమనే దురభిప్రాయాన్ని కలిగించటం జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే బ్రాహ్మణులు తమ భార్యా బిడ్డల పొట్ట నింపుకోటానికి చక్రవర్తులు, మహారాజులు, రాజులు, రాజాలు, జమీందార్లు, భూస్వాములు చెప్పినట్లుగా ఆడటం జరిగింది కానీ వారికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. పోషకులకు కోపం వస్తే పెళ్ళాం పిల్లలు ఆకలితో మాడాలి కాబట్టి వాళ్ళు రాజులు ఆడించినట్లుగా ఆడారు. ♝
♛వ్యాస భారతం, ఆది పర్వంలో, దుర్యోధనుడు, పురోచనుడు అనే బ్రాహ్మణ మంత్రిని పిలిచి, ఆయనను ముందు పొగడ్తలతో ఉబ్బ కొట్టాడు. ఆ తరువాత ఈ శ్లోకం చెప్పాడు.♝
♛ స త్వం రాసభయుక్తేన స్యందనేనాశుగామినా।mules=rAsabha వారణావతమద్యైవ యథా యాసి తయా కురు.||1-156-8 ♝
♛రాసభయుక్తేన స్యందనేన అంటే కంచర గాడిదలు పూన్చిన రథం. దీనిలో నీవు ఆశు గామినా అంటే వేగంగా వారణావతం వెళ్ళు. దీన్ని స్వర్గీయ కిశోర్ మోహన్ గంగూలి గారు షుమారు ౧౯౦౦ సంవత్సరం ప్రాంతంలో ఇలా అనువదించారు.♝
♛Do that by which you may this very day reach Varanavata in a car drawn by swift mules. ♝
♛మ్యూల్ అంటే mule1 the offspring of a donkey and a horse (strictly, a male donkey and a female horse), typically sterile and used as a beast of burden.♝
♛మంత్రులుకూడ కంచర గాడిదలు పూన్చిన రథాలను వాడే వాళ్ళంటే, గుర్రాలకు ఎంతకరువుగా ఉండేదీ అర్ధం అవుతుంది. వాల్మీకి రామాయణంలో సీతను ఎత్తు కెళ్ళటానికి రావణుడు పుష్పక విమానం అంటే కంచర గాడిదల బండి లో వెళ్ళే వాడు. ♝
♛రాజులు, మహారాజులు, చక్రవర్తులు మటుకు గుర్రాలు (steeds) ని వాడే వాళ్ళు. ఆగుర్రాలు వేగవంతంగా పరుగెత్తుతాయా లేవా అని తేల్చుకోటానికి వాటి ముఖం మీద, చెవుల మీద, నెత్తి మీద, వీపుమీద సుడులను లెక్క పెట్టె వాళ్ళు. మహాభారతం, అరణ్య పర్వం నలచరిత్రలో ఈ శ్లోకాన్ని చూడండి. ♝
♛ఏకో లలాటే ద్వే మూర్ధ్ని ద్వౌద్వౌ పార్శ్వోపపార్శ్వయోః। ద్వౌద్వౌ వక్షసి విజ్ఞైర్యౌ ప్రయాణే చైక ఏవ తు ॥ 3-69-19 ♝
♛గంగూలీ గారు ఇలా అనువదించారు. How can these horses of mine, weak in strength and breath, carry us? And how shall we be able to go this longway by help of these?" BAHUKA (NALA) replied, "Each of these horses bears one curl on his forehead, two on his temples, four on his sides, four on his chest, and one on his back.♝
♛ఈ గుర్రాల్లో ప్రతిదాని నుదురు మీదా ఒక సుడి ఉంది. నుదురుకి రెండు పక్కలా రెండు సుడులు ఉన్నాయి. ప్రక్కల్న నాలుగున్నాయి. రొమ్ముపై నాలుగు సుడులున్నాయి. వీపుమీద ఒక సుడి ఉంది. ఇలా బాహుకుడు (నలుడు) రుతుపర్ణుడికి గుర్రాల లక్షణాలని చెప్పి, ఆయనను ఒకరోజులోనే దమయంతీ స్వయంవరానికి తీసుకెళ్ళాడు. ♝
♛ఈకాలం మంత్రులు, ప్రభుత్వ కార్పోరేషన్ల చెయిర్ మన్ లు, దేవస్థానాల ట్రస్టు బోర్డుల అధ్యక్షులు ఎవరైనా ఏసీ కారులు లేక పోతే కదలరు. మరి వాటి నెత్తిమీద, లలాటంలో, ప్రక్కన, రొమ్ముల మీద ఎక్కడన్నా సుడులుంటాయో అని వెతుక్కుంటారో లేదో మనకి తెలియదు. ♝
♛ఇంకా ఉంది. ♝
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No.
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.