కాశ్మీర్ సమస్యకు ట్రంప్ గారు, అమెరికా దేశం పరిష్కారం చూపాలా? ♛భారతీయ కమ్యూనిస్టులు వివేక భ్రష్ఠ సంపాతానికి గురి అయనట్లు కనిపిస్తుంది. కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చెన్ అన్నట్లుగా కమ్యూనిస్టులేమిటి, పచ్చి బూర్జువా దేశమైన అమెరికా అధ్యక్షుడి ఇంటి ముందు ప్రార్ధనలు చేయటము ఏమిటి? ♛ట్రంపు ఏమైనా దేవుడా? ♛భారత దేశంలో ౧౦కిలోమీటర్ల దూరంలో నిరసనలు చేసినా అరెస్టు చేస్తారని నారాయణగారు వాపోయారు. అమెరికాలో అలా చేయరట. అందుకే ఆయన వైట్ హౌస్ ముందర తన గోడు వెళ్ళబోసుకున్నట్లు తోస్తుంది. ♛ఎవరైనా తమ మురికి బట్టలను తమ ఇంటిలోనే ఉతుక్కుంటారు. ఇతరుల ఇళ్ళకి వెళ్ళి ఉతకరు. మోడీ ప్రభుత్వంలో గానీ, గత యూపీఏ ప్రభుత్వంలో గానీ ఎన్ని లోపాలు ఉన్న మనం న్యాయ ఘంటలను మ్రోగించాల్సింది భారత్ లోనే. ♛కుదరనప్పుడు భారత్ లోనే బోలెడు అడవులు ఉన్నాయి. హాయిగా అరణ్యరోదనం చేసుకోవచ్చు.
Top-of-this-page
A | B | C | D | E | F | G | H | I | J |
K | L | M | N | O | P | Q | R | S | T |
U | V | W | X | Y | Z | -- | -- | -- | -- |
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 99530
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
go to topW
Wమహిళల పై వేధింపులు, నేటి దుస్థితి :
♛మహిళల పై వేధింపులలో భారత్ లో ఎవరూ వెనుకబడి లేరు.
♛సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరంజన్ గోగోయ్ పై కూడ ఒక దళిత మహిళను వేధించిన ఆరోపణలు వచ్చాయి.
♛దురదృష్టవశాత్తు, సుప్రీంకోర్టు మహిళలపై వేధింపుల విషయంలో తాను ఇచ్చిన మార్గదర్శంకాలను తమ సంస్థలో వచ్చిన వేధింపుల ఆరోపణల విషయంలోనే పాటించలేక పోయింది.
♛కోర్టు ధిక్కరణ నేరంలో ఇరుక్కుంటామనే భయంతో కాబోలు, ఈవిషయంలో ఎవరూ చెప్పుకోతగినంతగా ప్రతిస్పందించలేదు.
♛కీలకమైన కేసులను విచారిస్తున్న సమయంలో తన విధి నిర్వహణనుండి తనను అడ్డుకోటానికి ఇలాటి ఆరోపణలు చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బాధ పడ్డారు. నిజమే కావచ్చు. అదే సమయంలో, బాధిత మహిళ, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న తనకే న్యాయం జరగలేదంటే, ఈదేశంలో గ్రామీణులకు, పేదలకు ఇంకేమి న్యాయం జరుగుతుంది అని ఆవేదన చెందే అవకాశం ఉంది. (995)
go to topU
Uఉగ్రవాదం, ఒక దేశానికో సంస్థకో పరిమితం కాదు. :
♛అలాగే ఉగ్రవాదం కేవలం భారత్ కే పరిమితం కావటం లేదు. ఉగ్రవాదం విశ్వవ్యాప్తం.
♛తమదేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగినపుడు ప్రపంచమంతా తమను సమర్ధించాలని చైనాలాంటి దేశాలు ఆశిస్తున్నాయి.
♛కానీ భారత్ లో ఉగ్రవాద ఘటనలు జరిగినపుడు, అదే చైనా, ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా గుర్తించటానికి, భద్రతా మండలిలో అడ్డుపుల్లలు వేస్తున్నది.
♛భారత్ తో అన్యాయంగా ప్రవర్తిస్తే, భారత్ కన్నా చైనా యే ఎక్కువ నష్టపోతుంది. (995)
go to topM
Mమత పిచ్చికి మందు ఉండదా? :
♛మత పిచ్చికి అంధ విశ్వాసమే మూలం. తమ మతమే అన్ని మతాలకన్నా గొప్పది, తమ దేవుడే ప్రపంచంలోని దేవుళ్ళందిరి కన్నా గొప్పవాడు అనుకోటం ఒక అజ్ఞానం.
♛మాయమాటలు చెప్పి కానీ, డబ్బులిచ్చి కానీ, పశుబలంతో కానీ ఇతరులను తమ మతంలోకి తెచ్చుకోవాలనుకోటం, సమాజంలోని ఐక్యతను దెబ్బతీస్తుంది.
♛తన ప్రాణాలను ఇచ్చైనా తన మతాన్ని రక్షించుకోవాలనే వెర్రికి దారి తీసి సుసైడ్ స్క్వాడ్ లలో చేరేలా చేస్తుంది.
♛మత విద్వేషాలను ప్రోత్సహించే వారు తమ ప్రాణాలకు మంచి భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు. వారికి ప్రతిదీ బులెట్ ప్రూఫే.
♛చీమ కూడ దూరని భద్రతా ఏర్పాట్లే ఉన్నా, ఏదో ఒక బలహీన క్షణంలో తమ అనుయాయులే తమకు ద్రోహం చేయటంతో ప్రాణాన్ని కోల్పోతారు. (995)
go to topN
Nనెహ్రూ గారిని తిట్టీ, పటేల్ గారిని ఆకాశానికి ఎత్తీ ఎంతకాలం పబ్బం గడుపుకోవచ్చు? :
♛పటేల్ , నెహ్రూ ఇరువురూ ఉన్నతులే. వారి మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా, వారి మధ్య ఏరకమైన శత్రుత్వం ఉన్నట్లు కనిపించదు. వారిద్దరికీ ఎవరి గుణాలు వారికున్నాయి. ఎవరి లోపాలు వారి కున్నాయి. వాటిని ఇప్పుడు కెలుక్కోటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
♛పటేల్, నెహ్రూలు కాడెద్దుల వలె పని చేయటం వల్లనే భారత్ స్వాతంత్ర్యానంతర శైశవ సమస్యలను అధిగమించ కలిగింది.
♛నెహ్రూ గారు అసమర్ధుడే అయితే 1961లో పోర్చుగీసు వారినుండి గోవాను స్వాధీనం చేసుకోటం జరిగి ఉండేది కాదు.
♛నెహ్రూ గారు స్వాప్నికుడు. కొన్నిసార్లు మోసపూరితమైన లౌకిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక మోసపోయే వాడు. (995)
go to topE
Eఎన్నికలు, ఈ.వీ.ఎమ్ లు :
♛౨౦౧౯ లోక్ సభ ఎన్నికలలో ఈవీ ఎమ్ ల ద్వారా జరిగే ఎన్నికలలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ పాల్గొన టానికి నిరాకరించి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు.
♛ఇపుడైనా మించి పోయింది లేదు. రాబోయే బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఈవీఎమ్ లతో జరిగే ఎన్నికలలో తాము పాల్గొన బోమని, మమతా బెనర్జీ, ఆమె పార్టీ స్పష్టంగా ప్రకటించాలి.
♛ఓడిపోయిన తరువాత ఈవీఎమ్ , సీయీసీ లను నిందించటం, గెలిస్తే గమ్ముగా ఊరుకోటం వల్ల ప్రతి పక్షాలు అవకాశవాదులుగా నుుద్రవేయించుకుంటాయి.
♛ఈ విషయంలో ఆమె ఒక ప్రతిపక్ష ప్రతినిథి వర్గాన్ని సీయీసీ వద్దకు తీసుకువెళ్ళి , వారినుండి ఒకస్పష్టమైన సమాధాన్ని రాబట్టాలి.
♛సీయీసీ బ్యాలెట్ పధ్ధతికి వెళ్ళటం కుదరదని నిరాకరిస్తే, ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. (995)
go to topB
Bబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవిష్యత్తు :
♛బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) చాల సాహస వంతురాలు.
♛ఈ విషయం ఆమె ప్రకటన బట్టే తెలుస్తుంది. ఆమె ౨౭.౮.౨౦౧౯ నాడు కోల్ కత్తాలో ఒక రాలీలో ప్రసంగిస్తూ అన్నట్లుగా వచ్చిన వార్త : ' Today they are calling my brother, tomorrow they will call me. I am ready for that. I am ready to go to jail, but I am not willing to bow my head before BJP's communal politics. తెలుగు : ఈరోజు వాళ్ళు నా సోదరుడిని పిలుస్తున్నారు. రేపు వారు నన్ను పిలుస్తారు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నేను జైలుకి వెళ్ళటానికి సిధ్ధంగా ఉన్నాను. కానీ నేను బీజేపీ మతతత్వ రాజకీయాల ముందు తల వంచటానికి సిధ్ధంగా లేను.'
♛ఆమె ఇంకా ఇలా అన్నారు. "I think they are pushing the country towards a presidential form of government. I am predicting today that in the coming days, there will be one election, one leader, one political party, one emergency." తెలుగు : వారు దేశాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వంలోకి నెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఈరోజు ముందుగానే రాబోయేదాన్ని చెప్పుతున్నాను. ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు, ఒకే రాజకీయపార్టీ, ఒక అత్యవసర పరిస్థితి ఉండబోతున్నాయి.
♛మమతా బెనర్జీ ఉవాచ : They will not give food, not give jobs, they will give religion. What they are selling is blind faith in the name of religion, a marketplace of fake religion. There is nothing else happening in the country other than lots of junkets across the country and abroad. వాళ్ళు అన్నం పెట్టరు. ఉద్యోగాలు ఇవ్వరు. మతాన్ని ఇస్తారు. వాళ్ళు మతం పేరుతో అమ్మాలని ప్రయత్నిస్తున్నది 'గుడ్డి నమ్మకం' . నకిలీ మతానికి ఒక మార్కెట్. దేశ సంచారం, విదేశ సంచారం తప్ప ఈ దేశంలో ఇంకేమీ జరగటం లేదు.
♛రిజర్వు బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ౧.౭౬ లక్షల కోట్లు విడుదల చేయటాన్ని కూడ దీదీ తప్పు పట్టింది. ఇది న్యాయంగా కనిపించదు. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న నిధులకు సరిగా ఆడిట్ జరుగుతున్నట్లుగా కనిపించదు.
♛కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా, రిజర్వు బ్యాంకులో నిధుల కుంభకోణాలు జరిగితే తరువాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. మమతా బెనర్జీ ప్రధాన మంత్రిగా ఉన్నా రిజర్వు బ్యాంకు వద్ద ఉండే నిథుల విషయంలో అప్రమత్తత అవసరం. (995)
go to topK
Kకాశ్మీర్ సమస్యకు ట్రంప్ గారు, అమెరికా దేశం పరిష్కారం చూపాలా? :
♛భారతీయ కమ్యూనిస్టులు వివేక భ్రష్ఠ సంపాతానికి గురి అయనట్లు కనిపిస్తుంది. కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చెన్ అన్నట్లుగా కమ్యూనిస్టులేమిటి, పచ్చి బూర్జువా దేశమైన అమెరికా అధ్యక్షుడి ఇంటి ముందు ప్రార్ధనలు చేయటము ఏమిటి?
♛ట్రంపు ఏమైనా దేవుడా?
♛భారత దేశంలో ౧౦కిలోమీటర్ల దూరంలో నిరసనలు చేసినా అరెస్టు చేస్తారని నారాయణగారు వాపోయారు. అమెరికాలో అలా చేయరట. అందుకే ఆయన వైట్ హౌస్ ముందర తన గోడు వెళ్ళబోసుకున్నట్లు తోస్తుంది.
♛ఎవరైనా తమ మురికి బట్టలను తమ ఇంటిలోనే ఉతుక్కుంటారు. ఇతరుల ఇళ్ళకి వెళ్ళి ఉతకరు. మోడీ ప్రభుత్వంలో గానీ, గత యూపీఏ ప్రభుత్వంలో గానీ ఎన్ని లోపాలు ఉన్న మనం న్యాయ ఘంటలను మ్రోగించాల్సింది భారత్ లోనే.
♛కుదరనప్పుడు భారత్ లోనే బోలెడు అడవులు ఉన్నాయి. హాయిగా అరణ్యరోదనం చేసుకోవచ్చు. (995)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.