చర్చనీయాంశాలు: consumers, personal finance management వినియోగదారులు, ధరలు, విద్యుత్, వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ

Picture is only for demonstration purpose. Not actual product.
ఈరోజు ఒక రజనీదీపాన్ని (night lamp) కొనుక్కొచ్చాను.ఇది 0.5 వ్యాట్లు. LED అని ముద్రింపబడి ఉన్నది. తయారీదారులు __ ఎలక్ట్రానిక్స్, ఇండియా అని ముద్రింపబడి ఉన్నది. ఊరు పేరుగానీ, రాష్ట్రం పేరు గానీ లేదు. ఎందుకు ముద్రించలేదో తెలియదు.
ఈనైట్ ల్యాంప్ వాడకానికి చాల బాగున్నది. చక్కని వెల్తురు ,కళ్ళకు పెద్ద బాధ కలిగించకుండా ఇస్తున్నది. డబ్బాపై ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం, మల్టీకలర్ లభ్యమౌతాయని ముద్రించారు. ఇంతవరకు సంతోషమే.
కీలకమైన గరిష్ఠ ముద్రిత ధర mrp విషయానికి వద్దాము. రూ 70 గా ముద్రించారు. డెభ్భయి రూపాయలు, ఎక్కువా తక్కువా అన్న విషయాన్ని పక్కన ఉంచితే, దానిని ఎలక్ట్రికల్ స్టోర్స్ వాడు 30 రూపాయలకి అమ్మాడు. రిటెయిలర్ గా వాడు 5 రూపాయలు లాభం వేసుకున్నా అది అతడికి రూ. 25కి పడి ఉండాలి. హోల్ సేలర్ కి ఎంతకి పడి ఉండాలి? రాష్ట్రస్థాయి డిస్ట్రిబ్యూటర్ కి ఎంతకు పడి ఉండాలి? ఫ్యాక్టరీనుండి బయటకు వచ్చేటప్పుడు దానికి తయారీదారు ఎంతకి బిల్లింగ్ చేసి ఉండాలి?
చట్టంలో గరిష్ఠ చిల్లర ధర ముద్రించమని ఉండటమే ఒక అనౌచిత్యం. ఎందుకంటే రాష్ట్రాలలో విభిన్నమైన స్థానిక పన్నులు ఉంటాయి. ఫ్యాక్టరీనుండి దేశంలోని వివిధ ప్రాంతాల రిటెయిలర్ల షాపుల వరకు కొన్ని 1 నుండి 1500 కిలోమీటర్ ల వరకు దూరం ఉండచ్చు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు తీవ్రంగా మారవచ్చు.
మధ్యలో ఎన్ని చేతులగుండా వస్తువులు వెళ్ళాయి అనేదాన్ని బట్టి (Number of intermediaries such as state level distributors, district level distributors, division/sub-division/taluq/block level whole-sale, semi-wholesale dealers, retailers) బట్టి ధర పెరుగుతూ పోతుంది.
ఫ్యాక్టరీ ధరపై ఎంత పెరిగింది అనే దాన్ని వినియోగదారు అంచనా వేసుకోగలగాలంటే, తయారీ దారు పేరు ___ ఎలక్ట్రానిక్స్ ఇండియా అని కాకుండా, ఊరు పేరు ముద్రించాలి. తమ ఫ్యాక్టరీ గేటునుండి బయటకు పంపేటపుడు ఆ వస్తువును ఏరేటుకి అమ్ముతున్నారో ముద్రించాలి.
ఇప్పుడు రూ. 20 నుండి రూ. 70 వరకు రిటెయిలర్ వినియోగదారుడి ముఖాన్ని చూసుకొని ఎంతకయినా అమ్మచ్చు. ఒకడికి రూ. 30కి ఇచ్చి వేరొకడికి రూ. 70కి అంటగట్టవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.