Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: అన్నాహజారే, మమతాబెనర్జీ, నరేంద్రమోడీ,సోనియాగాంధీ
మనం ప్రాంతీయ రాజకీయ కుడుధ్ధంలో పడిపోయి అఖిలభారత స్థాయిలో ఏమి జరుగుతున్నదో మరువరాదు.
.
కాంగ్రెస్ తో ప్రజలకు ముఖం మొత్తింది అనేది చేదునిజం.
నరేంద్ర మోడీ గారిపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. అవి అడియాసలు కావటానికి ఆయన ప్రధానమంత్రి అయినా ఐదేళ్ళు సరిపోతాయి.
2017 తరువాత ఏమిటని?
ప్రాంతీయ పార్టీల నేతలకు కూడ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనే కాక ప్రధానమంత్రి పదవి అందితే తీసుకుందామని కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఢిల్లీలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీగారు ప్రసంగించిన సభ విఫలమయింది అనటం న్యాయం కాదేమో.
జనాలను తృణమూల్ పార్టీ పోగేసుకొని తెస్తుందని శ్రీ అన్నాహజారె గారు అనుకున్నట్లున్నారు.
అన్నా హజారె గారి స్వఛ్ఛంద సంస్థ పోగేసుకొస్తుందని మమతాగారు అనుకున్నాట్లున్నారు.
ప్రాథమికంగా, జనాన్ని పోగేయటం అనేది తేలికైన పనేమీ కాదు. ఢిల్లీ వారు, ఈరంగంలో నిపుణులైన తిక్కాంధ్రులు, పిచ్చాంధ్రులు, వెర్రాంధ్రుల నుండి ఎన్నో పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. అది ఏమిటంటే బిరియానీ పొట్లాలను పంచి పెట్టటం. సభకు హాజరై ఇంటికి వెళ్ళాక ఒళ్ళు నొప్పులు పుట్తాయి కాబట్టి కనీసం 100 ml స్ట్రాంగ్ లేక 500 ml బలహీన మద్యం బాటిల్స్ ఏర్పాటు చేయటంలో శ్రధ్ధ తీసుకుంటేనే సభలు విజయవంతమౌతాయి. ఏమీ ఇవ్వకుండా ఎవరైనా ఎందుకు హాజరౌతారు?