t95oc. శ్రీ ఎల్ కె అద్వానీ గారు భూత్ పూర్వ ఉపప్రధాన మంత్రిగారు. ప్రస్తుతం భాజపా మార్గదర్శక మండల్ మగ్నులు. ౨౦౧౪ నుండి ౨౦౧౯ మే వరకు ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి ఏమి మార్గదర్శకం చేసారో గానీ పబ్లిక్ డొమెయిన్ లో లేదు. ఇపుడు ౨౦౧౯ నుండి ౨౦౨౪ వరకు , తమ సహమార్గదర్శి శ్రీ మురళీ మనోహర్ జోషీ గారితో కలసి ఏమి మార్గదర్శకత్వం చేయబోతున్నారో మనం వేచి చుడ వలసింది. వారి ట్విటర్ పేజీగా చెప్పబడుతున్న, దానికి లింకు: https://twitter.com/_lkadvani?lang=en. ఈట్వీట్ పేజీ ౨౦౧౬నుండి దాదాపుగా మూగపోయింది. కారణమేమో తెలియదు.
ఆఖర్ ట్వీట్ గోమాత రక్షణ గురించి. మరి గేదె మాత రక్షణ గురించి, ఒంటె మాత రక్షణ గురించి ఎందుకు ట్వీట్ చెయ్యరు. వాటి పాలు మనం తాగటం లేదా ? ఏదైనా మతం ఒక జంతువును మాతగానూ ఇంకో రెండు జంతువులను పానికిరాని--మాతలు గా చూడటాన్ని సమ్యక్ జ్ఞానం అనచ్చా?
గౌరవ ప్రధానమంత్రి గారు https://www.ndtv.com/india-news/india-must-strive-to-be-developed-nation-by-2047-says-pm-narendra-modi-at-bjp-poll-manifesto-launch-2019715 ప్రకారం, ఏప్రిల్ ౮, ౨౦౧౯ నాడు బీజేపీ మానిఫెస్టో విడుదల చేస్తూ వాక్రుచ్చారు --౨౦౪౭నాటికి భారత్ అభివృధ్ధి చెందిన దేశం కావాలని, దానికి బిజెపీ పునాది వేస్తుంది. అదే హిందూత్వ హృదయ సామ్రాట్ వారు, https://timesofindia.indiatimes.com/elections/news/give-5-more-years-will-help-shed-developing-nation-tag-pm-modi/articleshow/68787001.cmsప్రకారం --నాకో ఐదేళ్ళివ్వండి. దేశానికి అభివృధ్ధి చెందుతున్న దేశం అనే టాగ్ లేకుండా చేసేస్తాను-- అని వక్కాణించారు. అంటే ౨౦౨౪ నాటికి భారత్ అభివృధ్ధి చెందిన దేశం అవుతుంది అనే కదా అర్ధం. ౨౦౨౪ నుండి ౨౦౪౭ వరకు ఏమి చేయాలి? శ్రీవారే చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది వోటర్లకు ఆయన దేవుడులాగా కనిపిస్తున్నాడు కాబట్టి.
Two decades have gone in 21st century but I had to work on the basic requirements of people which should have been addressed in 50s and 60s. ఇరవయ్యొకటో శతాబ్దంలో రెండు దశాబ్దాలు గడిచాయి. నేను ప్రజల ప్రాథమిక అవసరాలగురించి పనిచేయాల్సి వస్తున్నది. ఈపని యాభయ్యవ మరియు అరవయ్యవ దశకంలో చేయాల్సింది.
శ్రీవారి ఉద్దేశ్యం నెహ్రూగారిని తప్పు పట్టటం లాగా కనిపిస్తుంది. శ్రీవారు చరిత్రను మర్చిపోయారంటే గౌరవప్రదంగా ఉండదు. ౮౩కోట్ల మంది ప్రజలలో కూడ ఎంతమంది చరిత్ర చదివి ఉంటారో మనకి తెలీదు. 1947లో స్వతంత్ర భారత్ జనాభా ౩౩ కోట్లు. ౨౦౧౯లో ౧౩౦ కోట్లు. అంటే జనాభా నాలుగు రెట్లయింది. వందకోట్లు పెరిగింది. ఈ వందకోట్లు ఎలాపెరిగింది? కుటుంబ నియంత్రణను దిబ్బలో తొక్కటం వల్ల. ఎందుకు తొక్కారు? వోటు బ్యాంకులు దెబ్బతింటున్నాయి కాబట్టి. ఆమతం వాళ్ళ జనాభా పెరుగుతుందని ఈమతం వాళ్ళూ, ఈమతం వాళ్ళ జనాభా పెరుగుతుందని ఆమతం వాళ్ళు మీ ఇష్టం వచ్చి నట్లు పిల్లలను కనమని ప్రచారాలు చేసుకున్నారు.
ఈ ప్రచారాలకే ఇంకో గెలివి జోడించారు. జపాన్ మొ. దేశాలు వృధ్ధులతో నిండి పోతన్నాయి కాబట్టి భారత్ తన జనాభాతో మానవ వనరులతో ప్రపంచాన్ని శాసించవచ్చు, అని. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేయటం అంటే ఇవే కదా. ౧౯౬౨లో చైనా దండయాత్ర జరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థకు చావు దెబ్బతగిలింది. పంచవర్ష ప్రణాలికలు పట్టాలు తప్పాయి. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే, కాంగ్రెస్ వాళ్ళు దేశద్రోహులనుకోండి. మన దేశభక్త బీజేపీ వారుకూడ వేల కిలోమీటర్లను ఆక్రమించుకున్న చైనా నుండి ఎన్ని బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంటున్నారు? ఎవడైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్న ముష్కరుల వ్యాపారాలను అభివృధ్ధిచేయటం కోసం వాళ్ళు తయారు చేసే వస్తువులను బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి కొంటారా? రాజకీయనేతల బృందాలూ, వర్తక బృందాలూ చెనా సందర్శన చేసి వస్తారా?
ప్రశ్న-- అసలు అభివృధ్ధికి నిర్వచనం ఏమిటి? ఇది తెలుసుకోవాలనుకుంటే మనం వేల పేజీలు వ్రాసుకోవాలి. ఇంకో సారి వ్రాస్తాను. ఈలోగా ఈరోజు దక్కన్ క్రానికల్ లో రూటర్స్ వార్తా సంస్థ వారు గుజరాత్ లోని గిఫ్ఠ్ సిటీ గురించిన ఒక మంచి పరిశోథనాత్మక వ్యాసాన్ని ప్రచురించారు. ఇదే వ్యాసం రూటర్స్ ఇన్.రూటర్స్.కామ్ వారి వెబ్ సైట్ లో కూడ దొరికింది. ఇదిగో లింకు-- https://in.reuters.com/article/india-election-giftcity/indias-jobs-deficit-project-in-gujarat-struggling-to-create-employment-idINKCN1SU06T.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. trec1952526
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. Some actual examination questions have been abridged/modified for brevity.
These questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.