శేషాంధ్ర ప్రదేశ్ లో అన్ని లోక్ సభ మరియు శాసనసభా నియోజక వర్గాలలో, లోపభరితంగా అయినా పోలింగు ముగిసింది. ఈ అయిదు సంవత్సరాలు ప్రజలు సర్దుకుపోటానికి సిద్ధమైనారు. ఎందుకంటే, ఎవరికి కావలసిన తాయిలాలు వారికి అందాయి. ఫలితాల ప్రకటనకు ఇంకా నెలరోజుల టైము ఉంది. ఈలోగా, రాష్ట్ర పాలన ఆగి పోవలసినదేనా అనే ప్రశ్నకు తావిచ్చేలాగా వైయస్ ఆర్ పీ (జగన్ పార్టీ), బీజేపీలు , వారికి అనుకూలంగా ఈసీ ప్రవర్తించటం ఆశ్చర్యకరం. ఎన్నికల కోడ్ నెపంతో ఈనెల రోజులూ శేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేకుండా గడపాల్సిందేనా? మండు వేసవిలో రాయలసీమలో, పల్నాడులో, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలలో త్రాగునీటి ఎద్దడి పీడిస్తున్నది. పోలవరం నిర్మాణం ఈ ఎండాకాలంలో ఒక ఉపయోగకరమైన దశకు చేరి, జూన్ నాటికి మనం గ్రావిటి ద్వారా కొన్ని ప్రాంతాలకైనా త్రాగునీటిని, సాగునీటిని ఇచ్చుకోగలగాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తేకానీ వాళ్ళు పనులు చేయరు. ఖజానా ఖాళీ అయింది కాబట్టి పన్నులు వసూళ్ళపై దృష్టి పెట్టుకోవాలి. ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి అయినా, పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అయినా, కొంతమేరకైనా ఈవిషయాలపై సమీక్షలు నిర్వహించుకోటంలో తప్పు లేదు. ఆయన తన ఆశ్రిత గుత్తేదారులకు ఏవనా తప్పుడు బిల్లులు చెల్లిస్తే, ఒకవేళ ఆయన మే 23న గద్దె దిగాల్సి వస్తే, శ్రీచంద్రబాబు నాయుడు పై చర్యలు తీసుకునే అధికారం ఎలాగు కేంద్రప్రభుత్వానికి ఉంటంది. కొన్ని పరిమితుల లోపల కొత్తముఖ్యమంత్రికి కూడ ఉంటుంది.
ఎన్నికలలో అధికారులు, ఉద్యోగులు బాగా కష్టపడ్డారు. వారికి కూడ కొంత వరకు స్వల్ప విరామం అవసరం. కనుక శ్రీచంద్రబాబు అతిగా సమీక్షలు జరపకుండా, మధ్యే మార్గంలో వారిచేత ప్రజలకు పనులు చేయించుకోటం అవసరం. వీటికి జగన్ అడ్డు పడటం న్యాయంగా ఉండదు. పనిలో పనిగా, ఒక రచయితగా, శేషాంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాధికారులకు ఉద్యోగులకు నేను చేయగల మనవి ఏమిటంటే, నియమాలకు విరుద్ధంగా పై అధికారులు గానీ నేతలు గానీ ఎవరు ఆజ్ఞాపించినా, ఆ ఆజ్ఞలు నియమానికి వ్యతిరేకమని వారి దృష్టికి తీసుకు వెళ్ళి నియమానికి వ్యతిరేకమైనా చేయమంటారా అని లిఖిత ధృవీకరణను పొందటానికి ప్రయత్నించటం మేలు. కొన్ని రకాల ఆజ్ఞలను లిఖిత ధృవీకరణ లభించినా చేయకూడదు. ఇపుడు ఛీఫ్ సెక్రటరీ గా నియమించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు ముద్దాయిగా కోర్టులో నిలబడాల్సి వచ్చిన పరిస్థితులను అధికారుల సంఘాలు, ఉద్యోగుల సంఘాలూ, లోతుగా చర్చించుకొని వారు ఐక్యంగా కొన్ని చట్టబధ్ధమైన నియమాలను ఏర్పరుచుకోవాలి. ఎందుకంటే, రేపు శ్రీ జగన్ అధికారంలోకి వచ్చినా, ఢిల్లీలో శ్రీ రాహుల్ అధికారంలోకి వచ్చినా, అన్నీ నియమబధ్ధమైన ఆదేశాలే వస్తాయని లేదు. అధికారులు, ఉద్యోగులు గమనించాల్సింది ఏమిటంటే, తాము పనిచేయాల్సింది రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, నియమాల ప్రకారం. అంతేగానీ నేతల, పైఆధికారుల చట్టవిరుధ్ధమైన ఆదేశాల ప్రకారం కాదు. నిరుపేదల విషయంలో, తీవ్రం, ప్రాముఖ్యం లేని నియమాలనుండి, కొన్ని మినహాయింపులు ఇచ్చుకోటంలో అధికారుల ఉద్యోగులు పెద్ద తప్పు చేసినట్లవుతుందని నేను భావించను. ఎందుకంటే, నియమాల ప్రకారం పనిచేయటం అంటే, హృదయం లేకుండా, కర్కశంగా పనిచేయటమని కాదు. ఇంకా ఉంది.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k @ g m a i l .com. No need to phone. Some of the documents I have translated in the past: Sale Deeds, Sale Agreements, Wills, Lease Agreements, Police FIRs, Deadbody Inquest Reports, Legal Notices, Replies to Legal Notices, Marketing brochures, Employee Standing Orders, Court Judgements, Decrees etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. lrece9419
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.