ఎన్నికలు అనేవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎన్నికలలో గెలిస్తేనే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని కూడ ఏమీ లేదు.గాంధీజీ లాంటి వాళ్ళు ఏఎన్నికలలో పోటీ చేయకుండానే, ప్రజాహృదయాలను దోచుకున్నారు. శ్రీ నరేంద్ర మోడీ తిరిగి గెలవటం కొరకు అనవసరంగా దేశ రక్షణ వ్యవహారాలను రాజకీయం చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది. Congress has no guts to enter Pakistan, kill terrorists, says PM Modi షుమారు తెలుగు- కాంగ్రెస్ కు పాకిస్థాన్ లోకి ప్రవేశించటానికి, ఉగ్రవాదులను చంపటానికి గట్స్ లేవు, అని శ్రీమోడీజీ అన్నట్లుగా దక్కన్ క్రానికల్. కామ్ ఒక హెడ్ లైన్ వేసింది. చదవాలముకునే వారికి లింకు. https://www.deccanchronicle.com/nation/current-affairs/070419/congress-has-no-guts-to-enter-pakistan-kill-terrorists-says-pm-modi.html. తెలుగులో ఒక సామెత ఉంది. అరిచే కుక్క కరవదు. కరిచే కుక్క అరవదు. A biting dog does not bark. A barking dog does not bite. మనకి మహాభారతంలో కర్ణుడు కనిపిస్తాడు. కర్ణుడికి యుద్ధమంటే మహా ప్రీతి. దుర్యోధనుడి ద్వారా ఆకోరికను నెరవేర్చుకున్నాడు. ఇంకో విషయం కూడ ఇక్కడ వ్రాయాలి. అరిచే కుక్క కరవదు అనే సామెత నిజమే అయినా, ఒక ముని ఒక పాముకి కరవద్దని సలహా ఇచ్చిన కథ గుర్తుకి వస్తుంది. ముని కరవద్దని చెప్పాడని ఒక పాము మనుషులని కరవటం మానేిందిట. అపుడు మనుషులు దానిని పట్టించుకోటం మానేయటమే కాక రకరకాలుగా దానిని హింసించి ఆనందించసాగారుట. పాము మళ్ళీ ముని దగ్గరకు వెళ్ళ మొర పెట్టుకుంది. ఆముని అన్నాడుట, నిన్ను కరవద్దన్నాను కానీ బుసకొట్టద్దన్నానా, బుస కొట్టు అని సలహా ఇచ్చాడుట. అప్పటినుండి పాము బుసకొట్టుతూ ప్రాణరక్షణ చేసుకుందట. అయితే ఈస్ట్రాటజీ కూడ మరీ ఎక్కువైతే, మనుష్యులు బుసలను పట్టించుకోరు. బుసకొట్టినా, కరిచినా, టైమింగ్ అనేది ముఖ్యం. ఏది ఏమైనా, సరిహద్దు సమస్యను ఎన్నికలలో ప్రత్యర్ధులపై పైచేయి సాధించటానికి వాడుకోక పోటం దేశానికి క్షేమకరం. కాంగ్రెస్ ని విమర్శించటానిక సమస్యలు కరువా. కాంగ్రెస్ లో వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయని కదా బీజేపీకి పట్టం కట్టింది. బీజేపీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా దానికి లభించే అవకాశం ఐదేళ్ళే కదా. మరల బంతి బీజెపీ కోర్టులోకి 2024 లో వస్తుంది కదా. ఈమాత్రం దానికి కాంగ్రెస్ కీ పాకిస్థాన్ కీ లింకు పెట్టటం న్యాయం కాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k @ g m a i l .com. No need to phone.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. lrece947
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some questions are actual Examination Questions, edited for brevity, and to facilitate easier comprehension. Questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.