పై పోస్టల్ స్టాంప్ లో ఉన్నది స్వర్గీయ ఎ.కె. గోపాలన్, భారతీయ ప్రథమ లోక్ సభలో అనధికారిక ప్రతిపక్షనేత. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎమ్.పీ. ప్రథమ లోక్ సభలో నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీకి 364 సీట్లు ఉంటే, సభలో అతి పెద్ద ప్రతి పక్షమైన సీపీఐకి 16 సీట్లు ఉండేవి. సోషలిస్టు పార్టికి 12 ఉండేవి. నాటికి స్వతంత్ర పార్టీ, జనసంఘ్ (నేటి బిజేపీకి తల్లి) స్థాపించ బడలేదు. 1969వరకు లోక్ సభలో ప్రతిపక్ష నేత అనే శాల్తీ గుర్తించబడలేదు. 2014 లోక్ సభలో సీపీఐఎమ్ కి 9 సీట్లు, సీపీఐకి ఒక సీటు ఉన్నాయి. 2019 లోక్ సభలో ఎన్ని సీట్లు ఉంటాయి? ఈ విషయాలను నేను ఇప్పుడు వ్రాయటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, శ్రీనరేంద్ర మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది అనుకుంటున్నది సహజంగా అతి పెద్ద అఖిల భారత పార్టీ, సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు రాహుల్ గాంధీ. శ్రీ మన్మోహన్ సింగ్ పాలనకి విసిగి పోయిన ప్రజలు, కోటగుమ్మంలో తెల్లారి లేవగానే ఎవరు కనిపిస్తే వాడికి పట్టం కట్టాలనుకున్నారో ఏమో, ప్రజలు 2014 లో శ్రీ మోడీ గారికి పట్టాభిషేకం చేశారు. కానీ ఆయన ప్రజలు తనపై చూపిన నమ్మకాన్ని సిమెంటు చేసుకోలేకపోయారు. రాహుల్ గాంధీ 2 అవతారంలో జూలు విదిల్చి శ్రీ మోడీపైకి విరుచుకు పడుతున్న దశలో , ఇపుడు రాహుల్ గాంధీ అర్హతలను, అనుభవాన్ని, సైధ్ధాంతిక జ్ఞానాన్ని ప్రజలు పట్టించుకోకపోవటం మనకి సర్వత్రా కనిపిస్తుంది. మోడీకి రాహుల్ కి మూడవ ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల నేతలు పలువురు శ్రీ కెసీఆర్, మమతా బెనర్జీ, మాయావతీ, వంటి వారు ఎందరో ప్రధాని కావాలని కలలు కుంటున్నారు. శ్రీ మోడీ రాహుల్ లకు ఉన్న కొమ్ములు, మమతా మాయావతులకే లేని కొమ్ములు ఏమున్నాయి. మమతా మాయావతులు పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఢక్కామొక్కీలను తింటూ ఎంతో కొంత అనుభవాన్ని గడించారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా కూడా పనిచేసింది. స్మృతీ ఇరానీ లాంటి వాళ్ళు హచ్ ఆర్ డీ మంత్రిగానూ, నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగానూ పనిచేయకలిగినపుడు మమతా మాయావతులు ప్రధానమంత్రిగానో, హోం మంత్రిగానో పని చేయలేరా? అంటే, చేయగలరనే చెప్పాల్సి వస్తుంది. ఇంక సోనియాపుత్ర శాతకర్ణిగారు ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారు, వాగ్దానాలు బాగానే చేస్తున్నారు కానీ, వారసుడుగారు ఆర్ధికి వ్యవస్థఃఉ సరిగా అధ్యయనం చేసినట్లు కనపడదు. ఆయన ఆర్ధిక విషయాలపై చిదంబరంగారిపై కనపడుతున్నట్లు తోస్తుంది. అదికాక సోనియాజీ తిరిగి శ్రీ మన్మోహన్ సింగును ఆర్ధిక మంత్రిగా తీసుకురావచ్చు కూడు. శ్రీ మోడీగారు సీనియర్లందరినీ గట్టు మీద కూర్చో పెట్టినట్లుగా రాహుల్ పాతకాలపు యోధులను మూలకి నెట్టటం నైతికంగా బాగుండదు. భారత ఆర్ధిక వ్యవస్థ ఒక మేడిపండు లాటిది. దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుండు. 1991 తరువాత 2019 వరకు వచ్చిన ఆర్ధిక మంత్రులందరు (శ్రీ మోడీని కూడ మనం ఆర్ధిక మంత్రిగా భావించవచ్చు) ఇంచుమించుగా ఒకే విధమైన సంస్కరణలను , ఆర్ధిక విధానాలను పాటించటం వల్ల అదే సరియైన మార్గము అనే నమ్మకం మన ఆర్ధిక విశ్లేషకులకు, బ్యాంకర్లకు, విశ్వవిద్యాలయ మరియు బిజెనెస్ స్కూళ్ళ ప్రొఫెసర్లకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళకెవరికి సోషలిస్టు ఎకనామిక్సు తెలియకపోటం, దానిని విశ్వవిద్యాలయాల వాళ్ళు నేర్పక పోటం, పెట్టుబడిదారీ పుస్తక ప్రచురణాసంస్థలు అట్టి సోషలిస్టు ఆర్ధ శాస్త్ర పుస్తకాలను ప్రచురించకో పోటం ఈదుస్థితికి కారణం. ఇది పదివేల పేజీల విస్త్రృతి కలిగిని విషయాంశం. ఈలోగా నేను రాహుల్ గాంధీ గారిని వేడుకునే దేమిటంటే, మీరు ఒక వేళ ప్రధాని అయితే, కాబోయే ఆర్ధిక మంత్రిని రహస్య బ్యాలెట్ ద్వారా ఎంపీలను ఎన్నుకోమని కోరండి.
శ్రీ రాహుల్ గాంధీ వయనాడ్ కేరళనుండి లోక్ సభకి పోటీ చేయటం గురించి ఏమిచెప్తారు?
జవాబు- ఎవరు రెండు నియోజక వర్గాలనుండి పోటీచేసినా వారికి ఆత్మ విశ్వాసం కొరత ఉందనే చెప్పాలి. ఈ ఆత్మవిశ్వాసం కొరత మనం శ్రీమతి ఇందిరా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీనరేంద్ర మోడీ, శ్రీపవన కల్యాణ్, శ్రీచిరంజీవి, స్వర్గీయ శ్రీ ఎన్ టీ ఆర్ ఇలా ఎందరిలోనో చూడచ్చు. ఈవిషయాన్నే విలేఖరులు పవన్ గారిని అడిగినపుడు ఆవిషయాన్ని 2019 లో పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఈరెండు నియోజక వర్గాలనుండి పోటీచేయటంలో ప్రభుత్వానికి కొన్ని కోట్ల అదనపు ఖర్చు. మన నేతగారికి తప్ప మిగిలన అభ్యర్ధులకు కూడ అదనపు ఖర్చు. ఇదికాక రెవెన్యూ, పోలీసు వనరులు వృథా అవుతాయి.
శ్రీ రాహుల్ గాంధీని డీఎమ్ కె తమిళనాడు నుండి పోటీ చేయమని ఆహ్వానించింది కదా. అక్కడకి వెళ్ళకుండా కేరళకి పోయి కమ్యూనిస్టుల బుర్ర ఖరాబు చేయటం ఎందుకు.
జవాబు- శ్రీ ఎకె ఆంథోనీగారు రాహుల్ ని కేరళకి ఆహ్వానించి, తాము గెలిపిస్తామని హామీ ఇచ్చి ఉండవచ్చు. కానీ శ్రీరాహుల్ కేరళ సీపీఎమ్ నేతలను సంప్రదించి వారి సహకారాన్ని అర్ధించి ఉంటే, వారు బహుశా తమ అభ్యర్ధిని ఉపసంహరించుకునే వాళ్ళేమో. రాహుల్ జీ ఏకపక్షంగా వ్యవహరించటంలో కేరళ కాంగ్రెస్ నేతల వత్తిడి ఉండి ఉండచ్చు. వామ పక్షాలలో ఇతర లోపాలు ఎన్ని ఉన్నా వారు మత తత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం తప్పక అందిస్తారు. రుజువు- 2004 నుండి 2009 వరకు శ్రీ మన్నోహన్ ప్రభుత్వాన్ని వీపుపై మోసింది ఎవరు? కమ్యూనిస్టులే కదా. వారు గతంలో మతతత్వ శక్తులకు వ్యతిరేక పోరాటం నెపంతో ఇందిరా గాంధీని, దేవె గౌడని, ఐకె గుజ్రాల్ గారిని కూడ వీపుపై మోశారు. అనవసరంగా కమ్యూనిస్టులవీపుపై బరికి రాహుల్ తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది.
తెలుగు గడ్డపై ఉప్పెక్కటం అనే పదం ఉంది. పిల్లలు పెద్దవాళ్ళ వీపుపైకెక్కి అటూ ఇటూ తిప్పమని మారాంచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పెద్దవాళ్లే పిల్లలని ఉప్పెక్కమని ప్రోత్సహిస్తూఉంటారు. శేషాంధ్ర కమ్యూనిస్టులు పవన్ వీపుపై ఉప్పెక్కుతున్నారా? లేక పవన్ గారినే తమ వీపుపై మోస్తున్నారా ?
జవాబు- ఎలానైనా అనుకోవచ్చు. విషాదం ఎమిటంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనుభవం నుండి కమ్యూనిస్టులు ఏపాఠాన్నీ నేర్చుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్ వలెనే, పవన్ జనసేన కూడ బూర్జువా వర్గానికి చెందింది. ఆయన వీపుపై కెక్కినా, లేక ఆయనను వీపుపై కెక్కించుకొని మోసినా శ్రామిక వర్గానికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. పైగా జనసేనకి వోటు వేయమనటం ద్వారా వామపక్షాల కార్యకర్తలను విర్వీర్యం చేసినట్లు అవుతుంది. ఈవిషయాన్ని శ్రీ నారాయణ, శ్రీరామకృష్ణ, శ్రీ బీవీ రాఘవులు, శ్రీ మధు, శ్రీ ఏచూరి సీతారామం గ్రహించాలని లేని ఆదేవుడిని వేడుకుంటున్నాను. నామూఢ నమ్మకం ఏమిటంటే తాము గెలిచినా గెలవకపోయినా వామ పక్షాల కార్యకర్తలు తమపార్టీకి పనిచేయాలని కోరుకుంటారు కానీ, జనసేనకు పనిచేయాలని కోరుకోరు.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k @ g m a i l .com. No need to phone.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 944be
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. These questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.5 (half mark) for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.