271 మేథావులతో ఎలా డీల్ చేయాలో తెలియని ప్రధాని, మానవ వనరుల మంత్రిణి మనకున్నారు!!
చర్చనీయాంశాలు: 271, ప్రధానమంత్రి, మానవ వనరుల మంత్రి, ఢిల్లీ యూనివర్సిటీ, నాలుగేళ్ళ డిగ్రీలు, మూడేళ్ళడిగ్రీలు
చిన్న చిన్న విషయాలకు నియంతృత్వపోకడలను చూపటం మన భారతీయులకి అలవాటు. తమ అధికార దర్పాన్ని పాలితులపై రుద్దాలి. అవతల వారి డిగ్నిటీని నేలకు రాసినా ఫరవాలేదు. ఢిల్లీయూనివర్సిటీలో ఇటీవల స్క్రాప్ చేసిన నాలుగు సంవత్సరాల డిగ్రీ పథకాన్నే తీసుకోండి. దీనిని బోధనా వృత్తిలో ఉన్నవారి గౌరవానికి భంగం కలుగకుండా, పరిష్కరించుకోతగిన మార్గం, ఈ గాడిద దృష్టిలో:
మూడేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(B), B.Com.(B), B.Sc.(B) లేక B.A.(T), B.Com.(T), B.Sc.(T) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(B) == B.A. (Bharat). లేదా B.Com.(T) అంటే B.Com.(Three years).
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి B.A.(I), B.Com.(I), B.Sc.(I) లేక B.A.(F), B.Com.(F), B.Sc.(F) డిగ్రీలను ఇవ్వవచ్చు. B.A.(I) == B.A. (International). లేదా B.Com.(I) అంటే B.Com.(International). లేదా B.A.(F)= B.A. (Four Years), B.Com.(F)= (B.Com Four years), B.Sc.(F) = B.Sc. (Four Years).
మొదటి మూడేళ్ళూ సిలబస్ ను కామన్ గా ఉంచుకొని క్లాసులనూ కామన్ గా నిర్ణయించుకోవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి కొంత అదనపు సిలబస్ ను, అదనపు పేపర్లనూ తగిలించవచ్చు. B.A.(I), B.Com.(I), B.Sc.(I) వారికి నాలుగో సంవత్సరంలో ఎంత అంతర్జాతీయ సమాచారాన్నైనా, నైపుణ్యాలనైనా, అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా బాదుకోవచ్చు. కోరిక ఉంటే మార్గం ఉంటుంది. దీనినే మనం సమన్వయం co-ordination అనచ్చు. అంతే కానీ కర్ర పెత్తనం, అధికార దర్ప ప్రదర్శనం కాదు.
'मैं किसी भी संस्था की स्वायत्तता का सम्मान करती हूं। फिर भी एक बार सबको याद दिलाना चाहूंगी कि संस्थाओं की स्वायत्तता लोगों की सेवा कर सकने के लिए दी जाती है। यह मामला छात्रों के हित से जुड़ा है। इसे व्यक्तिगत सम्मान का प्रश्न नहीं बनाना चाहिए।'
నేను సంస్థల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తాను. అయినా, ఒకసారి అందరి గుర్తుచేయాలనుకుంటున్నాను. ఏమంటే: సంస్థలకు స్వయం ప్రతిపత్తి ప్రజలకు సేవ చేయటానికి ఇవ్వబడుతుంది. ఈ సమస్య విద్యార్ధుల హితం తో ముడిపడి ఉంది. దీనిని వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా చేయకూడదు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
అంతర్జాతీయ ప్రాక్టీస్ కు, ముఖ్యంగా అమెరికన్ ప్రాక్టీస్ కు అనుగుణంగా, ఢిల్లీ యూనివర్సిటీ వారు ఈ మార్పును తలపెట్టారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే, ఢిల్లీయూనివర్సిటీకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించి ఉండవలసినది. వద్దనే విద్యార్ధులకు, అంతర్జాతీయ|అమెరికన్ ఆచారం గురించి తెలిసి ఉండక పోవచ్చు.
న్యాయశాస్త్రంలో ఒక ముఖ్యసూత్రం ఉంది. ఆడి ఆల్టెరిమ్ పార్టెమ్ అంటే, అవతల వాడు చెప్పేది వినండి, అని. ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన సైడ్ నించి ఏమి చెప్ప దలుచుకున్నాడో సరియైన హియరింగు ఇచ్చారా? ముందుగానే, ఆయన పాత హెచ్ ఆర్ డీ మంత్రి శ్రీ కపిల్ సిబాల్ గారి అనుచరుడు అనే అభిప్రాయంతో, ఆయన చెప్పేది ఏదీ వినకూడదు అనే నిర్ణయానికి వచ్చి, బలవంతంగా ఆయన మెడలు వంచుతున్నారా? మొదట నాలుగు సంవత్సరాలు డిగ్రీని ప్రవేశపెట్టటానికి యూజీసీ ఆయనకు అనుమతి నిచ్చిందా? యూజీసీ అనుమతి తీసుకోవలసిన చట్టపరమైన అవసరం ఉందని , ఆయనకు ముందుగా తెలుసా? తెలిసి కూడ ఆయన యూజీసీ అనుమతి తీసుకోకుండా తనంత తానే దూకుడు గా ముందుకు వెళ్ళాడా?
దేశంలో కొన్ని వందల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కూడ ఇతర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల కోర్సుకావలసిన వారు ఇతర యూనివర్సిటీలలో చేర వచ్చు. లేదా , ఢిల్లీ విశ్వవిద్యాలయమే, రెండు రకాల కోర్సులనూ అందజేస్తే, ఎవరికి కావలసినది వాళ్ళు ఎంచుకునే వాళ్ళు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసలేం జరిగిందో అర్ధం కావటం లేదు.
విద్యార్ధుల హితం అనేది ముఖ్యమే. కానీ, మూడు సంవత్సరాల కోర్సులోనే విద్యార్ధులకు హితం ఉందని యూజీసీ అధ్యక్షులవారూ, మానవవనరుల మంత్రిణి గారూ, ప్రధానమంత్రిగారూ ఎలా నమ్మారో వివరిస్తే బాగుండేది. మౌలికంగా ఆలోచిస్తే 10+2+4 అయినా, 10+2+3 అయినా విద్యార్ధులకు స్వదేశంలో కుటుంబపోషణ చేసుకునే నైపుణ్యాలను కలిగించాలి. ఆడిగ్రీలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంతర్జాతీయ ప్రమాణాలకూ, ఆచారాలకు, అనుగుణంగా లేవు, అని నిరాదరణకు గురి కాకూడదు. చాలా మంది విద్యార్ధులు 10+2+3 పధ్ధతిలో తమ డిగ్రీలను పూర్తిచేసినా, ఖాళీగానే ఉంటున్నారు. వీలైనన్ని ఎక్కువ కోర్సులను ప్రొఫెషనల్ కోర్సులుగా డిజైన్ చేయగలిగితే, నైపుణ్యాలను పెంచ గలిగితే, విద్యార్ధులు ఒక సంవత్సరం అదనంగా చదవటానికి వెనుకాడి ఉండేవాళ్ళు కాదేమో.
మన ప్రధాన మంత్రి గారి కుటుంబ పోషణా నైపుణ్యం సరియైన పరీక్షకు గురి కాబడలేదు. చాయ్ బండీ మానేశాక (ఎన్ని నెలలో తెలీదు), వారు పూర్తి స్థాయి ఆర్ ఎస్ఎస్ కార్యకర్తగా మారి, వారి నుండి పోషణను పొంది ఉన్నారనుకోవాలి. తల్లి దండ్రులను గానీ, భార్యను గానీ కుటుంబాన్ని ఏర్పరుచుకొని, పోషించే బాధ్యతను తీసుకుని ఉంటే, నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీ అవసరాన్నిగుర్తించే వారు.
ఇంక, మానవ వనరుల మంత్రిణి గారు 12 తరగతి స్థాయిలోనే టీవీ నటిగానో, ఏంకర్ గానో మారినందు వల్ల గ్లామర్ తో ధనార్జన చేయటం, తప్ప నైపుణ్యాలతో ధనార్జన చేయటం జరగలేదు. అందువల్ల నైపుణ్యాలను ప్రసాదించే డిగ్రీలను ఎలా తయారు చేయించాలో అనే విషయంపై శ్రధ్దవహించకుండా , విద్యార్ధులు మూడేళ్ళ కోర్సులు అడుగుతున్నారు కాబట్టి , గతంలో లాగానే ఆడిగ్రీలను వండి వడ్డిస్తే సరిపోతుందనుకున్నట్లున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నది కాబట్టి నైపుణ్యాల డిజైన్ ఇప్పుడు కుదరదు అనుకున్నట్లైతే, తమ నియంతృత్వ పోకడలతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ వంటి అనుభవజ్ఞులైన మేథావులను అవమానించకుండా, రెండు రకాల కోర్సులనూ అనుమతిస్తే పోయేది. విద్యార్ధులు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించేనాటికి, కుటుంబ పోషణా నైపుణ్యాలను ప్రసాదించే అదనపు సబ్జెక్టులను కొన్నిటిని జోడిస్తే సరిపోయేది.
ఇపుడు అసలేం జరిగిందో వివరించి, పదవినుండి తప్పుకోవాల్సిన నైతిక బాధ్యత, ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై ఉంటుందేమో. యూజీసీ అధ్యక్షుల వారికి కూడ , గతంలో నే తాను ఇంటర్ వీన్ కాకుండా, ఇంత ఆలస్యంగా ఎందుకు ఇంటర్వీన్ అయ్యారో వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. మొట్ట మొదటి సారి, నాలుగేళ్ళ డిగ్రీ ప్రతిపాదన ఢిల్లీయూనివర్సిటీవారు తెచ్చిన సమయంలోనే, తన అభ్యంతరాలను ఢిల్లీయూనివర్సిటీ వైస్ ఛాన్స లర్ కు ఎందుకు తెలియజేయలేదో చెప్పాలి. ఆఖరి నిమిషం దాకా ఎందుకు ఆగినట్లు?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.