రేసు గుర్రం, లెజెండ్, మనం అనే మూడు సినిమాల మధ్య సమాన ధర్మం ఏమిటి?
చర్చనీయాంశాలు- తెలుగు సినిమాలు, విభజన
Telugu films are meant for Telugu audiences, there is no regional barrier for them and that was proved with the recent films. ... These films have become the highest grossers for the respective actors --Sunil Narang, Global Cinemas, Distributor of Legend and Manam, owner of some Multiplexes.
తెలుగు సారం- తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులకొరకు ఉద్దేశించ బడతాయి. వారి మధ్య ప్రాంతీయ అడ్డంకులేమీ లేవు. ఇటీవలి సినిమాలు ఈ విషయాన్నే ఋజువు చేశాయి. ... ఈ సినిమాలు సంబంధించిన నటులకు అత్యధిక వసూళ్ళ చిత్రాలుగా మారాయి. --సునీల్ నారంగ్, డిస్ట్రిబ్యూటర్ లెజెండ్, మనం చిత్రాలు. మరియు కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమాని.
This is proof that cinema is completely independent of politics. When a film releases, the audience just wants entertainment. -- N.V. Prasad, President of Telugu Film Chamber of Commerce.
తెలుగు సారం-- సినిమా అనేది పూర్తిగా రాజకీయాలకు అతీతమైనది అనటానికి ఇది ఋజువు. ఒక చిత్రం విడుదలైనపుడు, ప్రేక్షకులు కోరేది కేవలం వినోదం. -- ఎన్ వీ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు.
రాష్ట్ర విభజన జరిగాక తెలుగు చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని కొందరు భావించారు. కానీ అలాజరగలేదు. పైన వ్రాసిన రేసుగుర్రం, లెజెండ్, మనం సినిమాలు, ఒక్కోటి దాదాపు 50 కోట్లు చొప్పున వసూలు చేస్తున్నాయి, కాబట్టి తెలుగు సినీ పరిశ్రమకు ఢోకా లేదు, అని పైవారి భావం.
అల్లు అర్జున్ కో, బాలకృష్ణకో, ఇంకో నాగార్జునకో ఎవరికో ఎవరికో ఈ విధానం కెరియర్ బెస్ట్ వసూళ్ళు కలిగించ వచ్చేమో కానీ, ప్రజలకు సంబంధించినంత వరకు ఇది దారిదోపిడీయే.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
తెలుగు చిత్రపరిశ్రమకు పట్టిన చీడ తెగులుకు విభజనకు సంబంధం లేదు.
పై మూడు సినిమాలు 50 కోట్లు చొప్పున కొల్లగొట్టటాన్ని చూసినపుడు, నేటి బడా నిర్మాతలు, పంపిణీదారులు, తమ దోపిడి విద్యనుఎంత పరిపక్వం చేయగలిగారో అని ఆశ్చర్యపోక తప్పదు.
ప్రతి పట్టణంలో అత్యధిక సంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేసి, వేరే ఇతర సినిమాను విడుదల కానీకుండా, విడుదల అయిన వాటిని తీసేయించి, తమ సినిమాను విడుదల చేసి, పట్టణంలో మరి వేరే ఇతర దిక్కుమాలిన సినిమాలు ఏమీ లేవు, ఈదిక్కుమాలిన సినిమానే చూడక తప్పదు, అనే స్థితిని కల్పించినపుడు, 50 కోట్లేమి కర్మ ఎన్ని కోట్లైనా వసూలు అవుతాయి. ఇది గుత్తస్వామ్య దోపిడీ వ్యవస్థకి సంకేతమే తప్ప, ఇంక దేనికీ సంకేతం కాదు.
వినోదం కోసం జనం ఏదిక్కుమాలిన సినిమానైనా చూడటం ఒక పతనం కాగా, వారికి ఆ దిక్కుమాలిన సినిమాల్లో కూడ తమకు నచ్చిన తక్కువ దిక్కుమాలిన సినిమాను ఎంచుకునే స్వేఛ్ఛను కూడ లేకుండా చేయటాన్ని ఏమనాలి.
వ్యభిచారం, జూదం, సినిమాలు (నట, విట, జూదగాళ్ళకు) ఒక సమాన ధర్మం ఉంది. ఈమూడు వర్గాలకు జాతి, మత, కుల, ప్రాంతీయ, భాషా, హద్దులు ఉండవు.
కనుకనే బ్రెజిల్ లో వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలు జరిగినా, కానెస్ లోనో , లాస్ ఎంజెలెస్ లో నో, షాంఘైలోనో చిత్రోత్సవాలు జరిగినా, చైనాలోని మకాలుదీవి లో జూద పండుగలు జరిగినా, జాతి, మత, కుల, ప్రాంతీయ, భాషా, హద్దులు లేకుండానే విజయవంతమవుతాయి.
బ్రెజిల్ వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను చూడటానికి వచ్చిన ప్రేక్షకుల వినోదపు అవసరాలను తీర్చటానికి, అక్కడి వ్యభిచారిణులు, ఆంగ్లభాషలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారంటే, క్యాష్ ప్రపంచాన్ని క్యాష్ పరిపాలిస్తున్నట్లు అర్ధం అవుతుంది.
ప్రక్క ప్రక్కన ఎన్నో శతాబ్దాలుగా జీవిస్తూ, ఒకే భాష మాట్లాడుకునే 13 జిల్లాల వారికి, 10 జిల్లాల వారికి మధ్య చిచ్చు రేపింది ఎవరు. క్యాష్. క్యాష్. క్యాష్.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.