247 రాయలసీమ మరియు కోస్తాంధ్ర మధ్య ప్రయాణాలలో కష్టనష్టాలు
చర్చనీయాంశాలు: రాయలసీమ, కోస్తాంధ్ర, విభజన, రాజధాని, కర్నూలు, విగుంతె
తమతమ స్వార్ధాలవల్ల శ్రీ చంద్రబాబు, శ్రీ జగన్, మొ|| రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కొరకు కృషి చేయకపోటం దురదృష్టకరం. రాజధానిని విగుంతెలో పెట్టినా, కర్నూలులో పెట్టినా, అటువారిటు, ఇటువారటు, నల్లమల ఘాట్ లలో ప్రయాణం చేయక తప్పదు.
కర్నూలు మరియు గుంటూరు మధ్య ఉన్న రహదారి ప్రయాణం, రైలు ప్రయాణం, ఎన్నో కష్టనష్టాలతో కూడు కున్నదని, గతంలో కర్నూలును రాజధానిగా పెట్టుకున్నప్పుడు ఈ బాధలను భరించలేకే, తెలంగాణతో విలీనం అయ్యి హైదరాబాదుకు వెళ్ళి ఉంటారని నేను ఈ బ్లాగులో పలుచోట్ల వ్రాశాను. నేను నంద్యాలలోను, మహబూబ్ నగర్ జిల్లాలోని శాంతినగర్ ప్రాంతంలోనూ పనిచేసి ఉండటం వల్ల నాకు బాగా అనుభవం కలిగి ఈవిషయాన్ని వ్రాస్తున్నాను.
నేను వ్యక్తం చేస్తున్న అనుమానం కేవలం ఊహాగానం కాదు, సాధ్యమే అనే విషయాన్ని ఈరోజు ఈనాడులో వచ్చిన ఈక్రింది వార్త ఋజువు చేస్తుంది.
సాంకేతిక లోపంతో నిలిచిన గరీబ్ రథ్
గార్డు లేకుండానే కదిలిన రైలు
గిద్దలూరు, న్యూస్ టు డే: గిద్దలూరు నంద్యాల మార్గంలో బోగద సొరంగం వద్ద ఆదివారం మధ్యాహ్నం బెంగుళూరు నుండి పూరీ వెళ్తున్న గరీబ్ రథ్ రైలు కొంతసేపు నిలిచిపోయింది. జీ5 ఏసీ భోగీలో (ఏసీ భోగం ఉంటుంది కాబట్టి భోగీ అంటున్నాను) ఏసీ గాలి వెనక్కిరావటంతో ప్రయాణీకులు ఆందోళన చెంది ఛెయిన్ లాగారు. దాంతో రైలు నిలిచి పోయింది. అనంతరం కొందరుప్రయాణీకులు భయపడి రైలునుండి క్రిందకు దిగారు. వెంటనే గార్డు బోగీ వద్దకు చేరుకుని ప్రమాదమేమీ లేదని ప్రయాణీకులకు చెప్పి బోగీలోకి ఎక్కించారు.
అక్కడ నుండి గార్డు తన బోగీ వద్దకు వెళ్ళే లోపే వాకీటాకీ సిగ్నల్ పనిచేయకపోటంతో డ్రైవర్ రైలును పోనిచ్చేశారు. కింద ఉన్న గార్డు సొరంగం నుండి రహదారికి చేరుకుని అక్కడనుండి దిగువమెట్ట రైల్వే స్టేషన్ మాస్టరుకు సమాచారం అందించారు.
దిగువమెట్ట రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 12.45 కు వచ్చిన గరీబ్ రథ్, గార్డు వచ్చేంత వరకు ఆ స్టేషన్ లోనే నిలిచి పోయింది. గార్డు వచ్చిన అనంతరం, మధ్యాహ్నం 1.30కి అక్కడ నుండి ముందుకు కదిలింది.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే, ఏదో ఒకరోజుకి రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటమే, రెండు ప్రాంతాల వారికీ (కోస్తా, రాయలసీమ) శ్రేయస్కరం అని ఋజువవుతుంది.
ఈనాటి పాట శకలం
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం. రచన కొసరాజు. పాడింది ఘంటసాల.
అపాయమ్ము దాటడాని కుపాయమ్ము కావాలీ
అంధకార మలమినపుడు వెలుతురుకై వెదకాలీ
ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
మత్తువదలరా… నిద్దుర మత్తువదలరా !! మత్తు వదలరా !!
ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదువురా…!! మత్తు వదలరా !!
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.