245 విజయవాడ , గుంటూరు, మంగళగిరి ఏరియాలో భూ స్పెక్యులేషన్ మంటలు రేపుతున్నా నాయుడు ద్వయం
చర్చనీయాంశాలు: విజయవాడ, గుంటూరు, మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ, రాజధాని, సూర్యశక్తి, కెరటాలశక్తి, desalienation
తెలంగాణను బుజ్జగించే పని, కెసిఆర్ ను అదుపులో పెట్టేపని శ్రీ వెంకయ్యనాయుడు , కేంద్ర హోం మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగుకు వదిలేస్తే బాగుంటుంది. కారణం: శ్రీ వెంకయ్యనాయుడుని తెలంగాణ ప్రజలు, నేతలు, సీమాంధ్ర నేతగా పరిగణిస్తున్నారు. కనుక శ్రీ వెంకయ్య సత్యం చెప్పినా, అసత్యం చెప్పినా, తెలంగాణలో నిరసనలు రేగే అవకాశం ఉంది.
నాయుడు ద్వయం (శ్రీవెంకయ్యనాయుడు, శ్రీ చంద్రబాబు నాయుడు), వీళ్ళకి విగుంతె మంగళగిరి ప్రాంతంలో ఏమైనా బినామీ భూములు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కానీ, విగుంతె ప్రాంతంలో పేట్రేగిన భూముల స్పెక్యులేషన్ లో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. విశాఖ నుండి తిరుపతి వరకు జరుగుతున్న ఇళ్ళ స్థలాల స్పెక్యులేషన్లో సీమాంధ్ర భూకులాలు రెండు మూడే ముందంజలో ఉండటం గమనార్హం. మిగిలిన కులాల వారు సేల్స్ ఉద్యోగులుగానో, బ్రోకర్లుగానో నాలుగు రాళ్ళకోసం ఆశ పడుతున్నారు తప్ప వందలాది ఎకరాలు కొనే స్థితిలో లేరు. నాయుడు ద్వయం వారి సామాజిక వర్గం వారు ఈవిషయంలో అతి ముందంజలో ఉండటం గమనార్హం. వారు చేసే ప్రకటనలు పేదతరగతుల వారికి వంద గజాల స్థలాలకు కూడ నోచుకోకుండా చేస్తాయి.
కడపలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బుడగ పేలిపోయిందని తెలుగు అగ్రశ్రేణి పత్రిక వ్రాసింది. ఇంకా ఏ పట్టణంలో ఎంతమందికి గుండెలు పగిలి పోవాలో కొత్తరాజధాని ప్రకటన వస్తేగానీ తెలీదు. మొత్తం ౩0 దాకా పట్టణాలలో నగరాలలో స్పెక్యులేషన్ జరిగింది అనుకుంటే, కనీసం 25 పట్టణాలలో, నగరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థలాలు కొన్నవాళ్ళ గుండెలు పగలటం అలా ఉంచి, రాష్ట్రంలో బీడుగా పడిఉండే స్థలాలు కొన్ని లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇది వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనీసం పాలకూర మడో, దొండ పాదులో వేసే అవకాశాన్ని కూడ కోల్పోతాయి.
సీమాంధ్రను మూడు రాష్ట్రాలు చేయాలనే నా అభిప్రాయంలో మార్పులేదు. అపుడే మూడు రాజధానులు వస్తాయి. స్పెక్యులేషన్ వికేంద్రీకరణ జరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇపుడు ఎవరు బాగు పడుతున్నారు? టోల్ గేట్ల వాళ్ళు , ప్రైవేటు బస్సుల వాళ్ళు.
మన వెన్నుపోటు సార్వభౌమ ముఖ్యమంత్రిగారు, విజయవాడ ఎంపీ, అనంతపురం ఎంపీ (వీరిద్దరు, వీరి బంధువులు, పెద్ద ప్రైవేటు ట్రాన్స్పోర్టర్లు) కొరకు ఆర్టీసీని బలి చేసే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాలు ఏర్పడితే జాతీయ రహదారులు, రైలు మార్గాలపై వత్తిడి తగ్గి, ప్రజలు తమతమ పనులపై దృష్టి పెట్టుకునే అవకాశం కలుగుతుంది. మెట్రోకు పెట్టే పెట్టుబడితో కొన్ని వేల ఎకరాలలో వ్యవసాయాన్ని, పశుపోషణను పునరుధ్ధరించుకో వచ్చు.
లీటరు మంచి నీళ్ళ ఉత్పత్తి ఖర్చు కేవలం అయిదు పైసలే!!!!!!
మనం దృష్టి పెట్టాల్సింది మెట్రో పై కాదు. సూర్య శక్తి, సముద్రజలాల శుధ్ధి, కెరటాలలోంచి విద్యుత్ ఉత్పత్తి, శుధ్ధిచేసిన తీయని సముద్రపు నీటిని ఎగువకు పంపు చేయటం. దీనిని మనం ఏస్థాయికి తీసుకు వెళ్ళాలంటే, తెలంగాణవారికి కూడ మనం శుధ్ధి చేసిన సముద్రం నీటిని ఎగువకి పంపింగు చేయకలగాలి. దీనిని పగటి కలగా భావించ కూడదు. లీటరు మంచి నీళ్ళ ఉత్పత్తి ఖర్చు కేవలం అయిదు పైసలే!!!!!! కుడాంకులం అణు విద్యుత్ కేంద్రం వారు సముద్రపు నీటిని చవకగా శుధ్ధిచేసే, విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికను కనుక్కున్నారు. వారిని సంప్రదించి మనం ముందడుగు వేయాలి.
ఇలాంటి పనులకి వెంకయ్యలు, చంద్రబాబులు, జగన్ లు పనికి రారు. కానీ ఏం చేస్తాం, ఇపుడు మనకి ఉన్నది వారే కదా.
ఈనాటి తెలుగు చలన చిత్ర గీత శకలం
చిత్రం వెలుగునీడలు.
రచన మహాకవి శ్రీశ్రీ.
గానం ఘంటసాల. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు
శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
వ్రాయాల్సింది ఇంకా ఉన్నది. సరిదిద్ద వలసినది కూడ ఉన్నది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.