చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శాసనసభ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhbDPUk3do3-XvBrmKL_w2I9V_tV-PiMgFwJ72I4JlMqvImdVF4OGbiSEF3QbFqsUJ61cPlvl-Fi0vQM65VtwHdzbgN37KAjzxC3-GFGWwfQ7D6DCL_9UGPK3EvhKSAXDjACnpxx8J-tvhB/s128/apthreeregions.jpg)
కేంద్రం నుండి వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు సవాలక్ష లోపాలతో కూడి ఉన్నది. ఆలోపాలను సవరించాలంటే, శాసనసభకు చర్చకే ఐదేళ్లు పట్తుంది. ఆబిల్లు తన లక్ష్యాలనే చెప్పలేదు. ఆర్ధికాంశాలను స్పష్టీకరించలేదు. డీమ్ డ్ టుబీ deemed to be అనే రాక్షస క్లాజ్ ఉంది. నిధులన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాదు అభివృధ్ధికి ఖర్చుచేశాయి. ఇప్పుడు అప్పులేమో జనాభా నిష్పత్తిలో పంచుకోవాలిట. హైదరాబాద్ అభివృధ్ధికై చేయబడిన అప్పును, చీపురుపల్లె వాసులు, రాయదుర్గం వాసులు, నల్లమలకొండల్లో నివసించే చెంచు ప్రజలు ఎందుకు నెత్తినేసుకోవాలి? విభజన కేంద్రం కోరికపై జరుగుతున్నది. సీమాంధ్ర ప్రజలు కోరటంలేదు. అలాటప్పుడు రాజధాని నిర్మాణఖర్చును కేంద్రం భరించాలి. కానీ కేంద్రం ఎంత కేటాయించబోతుందో, బిల్లులో ఏర్పాట్లు ఏవి? పది సంవత్సరాలు (2004 to 2014) నిద్రపోయి, ఆఖరు క్షణంలో తయారు చేసిన బిల్లులో అన్నీ లోపాలే.
ఏఅంశం గురించైనా శాసనసభ చర్చించకపోతే, దానిని చర్చించినట్లుగా భావిస్తారట. ఇంతకన్నా వేరే అన్యాయం వేరొకటి ఉంటుందా? సభలో గందరగోళం చెలరేగి చర్చ జరగకుండా వాయిదాలు పడినప్పుడు దానిలో ఆ గలాటాలో పాల్గొనని సభ్యుల తప్పేమి ఉంటుంది?
లోక్ సభలో కూడ ఈసమస్య
లోక్ సభలో కూడ ఈసమస్యఉంది. ఏచర్చలేకుండా వేలకోట్లరూపాయల కేటాయింపుల బిల్లులు గిలోటిన్ అవుతూ ఉంటాయి. అంటే ఆమోదించినట్లుగా భావించబడుతూ పాసయి పోతూ ఉంటాయి. కొన్ని సార్లు సరియైన చర్చ లేకుండానే, సభ్యులు మూజువాణీ వోటుతో బిల్లులని పాస్ చేస్తూ ఉంటారు.బిల్లును వెనక్కు పంపాలని శ్రీమతి విజయమ్మ గారు చేసిన డిమాండు
బిల్లును వెనక్కు పంపాలని శ్రీమతి విజయమ్మ గారు చేసిన డిమాండులో తప్పున్నట్లుగా తోచదు. బిల్లు కాపీలు అందరికి చేరి, సభ్యులు ఇప్పటికే దానిని ఇళ్ళవద్ద చదివి ఉన్నప్పుడు, అది చర్చించటానికి అనర్హం, తిప్పి పంపటమే సరియైనది, అని మెజారిటీ సభ్యులు భావించనపుడు, ఎవరైనా ఒక సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, చర్చించి గానీ, చర్చించకుండా గానీ (విషయాన్ని అంతా ఇప్పటికే బయట చీల్చి చెండాడటం జరిగింది కాబట్టి), బిల్లునుతిప్పి పంపిస్తూ తీర్మానం చేస్తే, స్పీకర్ కు దానిని తిప్పి పంపవలసిన బాధ్యత ఉంటుంది. తీర్మానం ఓడిపోతే చర్చ ఎలాగో ఉంటుంది.కేంద్రం మొండితనం
రాజకీయ స్వార్ధ కారణాల వల్ల కేంద్రంలోని అధికార పార్టీ, ముఖ్య ప్రతిపక్ష పార్టీ, రెండూ తెలంగాణను ఏకపక్షంగా ఇచ్చేసి కెసీఆర్ అనుగ్రహం పొందాలనే ఆరాటంతో ఉన్నాయి. సభ బిల్లును చర్చించినా, చర్చించక పోయినా, తిప్పి పంపినా పంపకపోయినా కేంద్రమంత్రివర్గం, రాష్ట్రపతి సోనియా మొండి నిర్ణయాన్ని అమలు పరిచి తీరుతారు. శాసనసభలో చర్చకు బిల్లును పంపటం అనేది ఒకనటన. శాసనసభపై గౌరవం ఉంచిచేస్తున్న పనికాదు. డీమ్ డ్ టుబీ క్లాజే దీనికి నిదర్శనం. రాష్ట్రపతికి కూడ తన కుమారుడికి బెంగాల్లో, కుమార్తెకు గెలిచేచోటా కాంగ్రెస్ టికెట్లు కావాలి. అందుకని ఆయనకూడ చిన్న చిన్న అభ్యంతరాలను చెప్తాడే తప్ప రాష్ట్రంలోని ఉభయపక్షాలకు న్యాయం చేయాలనే తపనను చూపడు. బ్రిటీష్ రాణికి వలెనే, మనరాష్ట్రపతి పాత్ర కూడ రబ్బర్ స్టాంపు పాత్రే. హంగ్ పార్లమెంట్ ఏర్పడ్డప్పుడే ఆయనకు కొంత విలువ తాత్కాలికంగా వస్తుంది.దురదృష్టవశాత్తు ఈవిషయంలో, సుప్రీంకోర్టు ధోరణికూడ విచిత్రంగా ఉన్నది. అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగాకనిపిస్తున్నప్పుడు, అన్యాయాన్ని సరిదిద్దటానికి ముందుగా చర్యలు ఆదేశించటంపోయి, జరిగింతరువాత రండి, అన్యాయం జరిగిందో లేదో అప్పుడు చూస్తాం అనటం సమంజసంగా నా గాడిద బుర్రకు తోచటంలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసాక, మళ్ళీ వాటిని అతికించటం ఎలాజరుగుతుంది. మానభంగం జరగబోతున్నదని ముందుగా సూచనలు కనిపిస్తున్నప్పుడు, అయిన తరువాత రండి, అప్పడు మానభంగం జరిగినట్లు ఋజువు చేసుకోండి, అంటే పోయిన మానం రాదు కదా. జరగబోయే నష్టం కొన్నిసార్లు irretrievable injustice (పునరుధ్ధరించటానికి వీలు కాని అన్యాయం) అవ్వచ్చు. అప్పుడు కూడ ముందు దిద్దుబాటు ఆదేశాలు ఇవ్వకపోటం న్యాయమా?
రాష్ట్ర ప్రజలు కోల్పోతున్న సువర్ణావకాశం
ఎలాగో విభజన తప్పనప్పుడు, సీమాంధ్రను మూడు రాష్ట్రాలుగా విభజన చేయాలనే తీర్మానాన్ని చేసి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలను సాధించుకోటం, మేలు. ఇది భవిష్యత్ లో రాబోయే పలు సమస్యలను రాకుండా చేస్తుంది. మూడు రాష్ట్రాల వల్ల కొన్ని కొత్త సమస్యలు వచ్చినా, ముందు రవాణా సమస్య పరిష్కారమౌతుంది. ప్రజలకు రాజధానులు అందుబాటిలోకి వస్తాయి. ముగ్గురికి మూడు హైకోర్టులు సాధించుకోవాలి. మూడు రైల్వే జోన్లు సాధించుకోవాలి. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండ, అన్ని ప్రాంతాలు అభివృధ్ది చెందుతాయి.తెలంగాణ మేధావుల ఉగ్రవాదం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEip12dLaFn7sOdK3SSNYnuIu8DovLEiZfrt3duExew-zWTCiEXN7W26YIUFqJP1gvEMZqdV_kG2iWs-Hg3H9pn1DtZbGih9ABuPbCCb5cZ9SpDpoDNN_3aG2yNh43tUK_oyYtcd0ZU3NQWQ/s198/goalokayusudarsanred.jpg)
శ్రీకోదండరాం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinrYDhcmtXnWnZbzHghcOYDCZ1AZxbjfdmPUEBJP-qnTPnkMBAm-KaLyIJ4ui6-eVgLO7ztxTp0-3UwZ3FtqeqB51ysm50JTy2V1xLHwOJG4C11EcP_A2Y7_K-5LOmbPWqgAsCL8AUhjiT/s128/kodandaram.jpg)
కవితావేశమా, బెదిరింపా
![]()
కెసీఆర్ పుత్రిక కవిత అన్నారుట.
తెలంగాణ అంశాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిసారీ క్రికెట్ ఆటతో పోల్చుతున్నారు. ఆయన బ్యాట్ పడితే బంతులకు బదులు బాంబులు వేస్తాము.
గతంలో కరీంనగర్ ఎంపీ శ్రీపొన్నం ప్రభాకర్ కిరణ్ హెలీకాప్టర్ ను మావోయిస్టుల సహాయంతో పేల్చి వేస్తామని బెదిరించారు.
మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామని వేరే చెప్పనవసరంలేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.