చర్చనీయాంశాలు: bifurcation, విభజన, దేశ భద్రత, విమానదళం
కేంద్ర ప్రభుత్వం ఎంత నియంతృత్వ పధ్ధతిలో వ్యవహరిస్తున్నదో తెలుసుకోటానికి, రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును ఢిల్లీనుండి సరిహద్దు భద్రతాదళ విమానంలోరవాణా చేయటమే నిదర్శనం.
యుధ్ధ విమానాలు అనేవి అత్యవసర పరిస్థితులకు ఉద్దేశించినవి. యుధ్ధాలు , సాయుధ తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు, కాల్పులకు, బాంబు దాడులకు, సైనికులరవాణాకు, ఆయుధాలు, ఆహారం, మందుల రవాణాకు ఉద్దేశించినవి. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపరీతాలు జరిగిన ప్రత్యేక పరిస్థితులలో ఈ విమానాలను సైనికుల చేత సహాయక చర్యలు చేపట్టటానికి వినియోగించటంలో అర్ధం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్ర శాసన సభ చర్చించటానికి రాష్ట్రపతి 40 రోజులు గడువు ఇచ్చారు. అంటే దీనికి యుధ్ధ ప్రాధాన్యం లేనట్లే కదా. దీనిని ప్రత్యేకయుధ్ధ విమానంలో కాకుండా, సాధారణ ఎయిర్ ఇండియా విమానంలో తెచ్చి ఉంటే 1 లేక 2 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యం అయ్యేది కాదు.
ఈమాత్రం దానికి ప్రత్యేక యుధ్దవిమానాన్ని వాడటం ఎందుకు?
జవాబు: దీనిని సైకోఫ్యాన్సీ అనవచ్చు. తాము ఎంతో సమర్ధవంతంగా పని చేస్తున్నామని సోనియా ముందు నిరూపించుకోవాలన్న తాపత్రయం కావచ్చు. లేదా తెలంగాణ కాంగ్రెస్ నేతలను, తెరాస నేతలను , జోకొట్టటానికి కావచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.