కెసీఆర్ యముడిని ప్రత్యేక తెలంగాణ నరకం సృష్టించమని అడుగుతాడు. KCR will ask for a separate telangANA hell in main hell!
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, తెలంగాణ, సీమాంధ్ర
Main hell is India. We can compare India to a train. Andhra Pradesh is an unreserved second class bOgi. Today telangANA is one compartment and SImAndhra is another compartment in AP. Tomorrow, there will be a separate telangANA coach and SImAndhra coach. If Center can give two big unreserved coaches, we can welcome it. But Sonia mAta is cutting one unreserved coach into two cells/shells with a saw. KCR will ask this arrangement in hell also.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికి ఇంగిత జ్ఞానం లేదని, రాజ్యాంగం అంటే కనీస అవగాహన లేదని కెసీఆర్ గారు అన్నారు. నిజమేనా?
జవాబు: కెసీఆర్ గారికి ఉన్నదా!
లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు రాజ్యాంగ రచయిత బీ.ఆర్.అంబేద్కర్ కన్నా ఎక్కువ తెలివితేటలున్నాయా అని కెసీఆర్ ప్రశ్నించారు. దీన్ని ఏమనాలి?
జవాబు: జయప్రకాశ్ నారాయణకు ఉన్నాయో లేవో కానీ, కెసీఆర్ కు ఉండచ్చు. లేదా ఆయన దృష్టిలో నిజాం నవాబుకు ఉండచ్చు.
సీమాంధ్ర పాలకులు చేసిన తప్పులు పొరపాట్ల వల్లనే ఇప్పుడు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని కెసీఆర్ అన్నారు. నిజమేనా?
సీమాంధ్రా పాలకులే కాదు , అఖిలభారత పాలకులు కూడ కలిసి చేసిన తప్పులు. అందరు కలసి హైదరాబాదుపై లక్షల కోట్లు వెచ్చించి మిగిలిన తెలుగు పట్టణాలను, గ్రామాలను ఘోరంగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఇపుడు కెసీఆర్ కు హైదరాబాదుకు 21వ శతాబ్దనిజాంగా ఆవిర్భవించాలని కోరిక పుట్టింది. ఆయనకు తెలంగాణ సుదూర చిన్న పట్టణాలు, గ్రామాలపై ప్రేమ లేదు. కెసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాకైనా తెలంగాణ సుదూర చిన్న పట్టణాలు, గ్రామాలపై దృష్టి పెట్తే మేలు. జరగబోయేది, క్రొత్త తెలంగాణా రాష్ట్రంలో, హైదరాబాదుపై పెత్తనానికి, తెలంగాణ స్థానిక నేతలైన శ్రీ దానం నాగేంద్ర, గౌడ్ లు, యాదవ్ లు మధ్య, ఉత్తర తెలంగాణ నంబర్ 1 భూకులం, దక్షిణ తెలంగాణా భూకులం నంబర్ 2 మధ్య కుమ్ములాట మొదలవుతుంది.
అలంపురంనుండి భద్రాచలం వరకు సీమాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారున్నారని, ఆంధ్రనేతలు ఇప్పుడు విషబీజాలు నాటవద్దని శ్రీ కెసీఆర్ గారన్నారు. దీన్ని ఏమనాలి?
సీమాంధ్రనేతలకు కెసీఆర్ ఆ అవకాశం ఎక్కడిచ్చాడు. ఆవిషబీజాలు నాటే పనిని కెసీఆర్ గారే గుత్తకు తీసుకున్నారు. అంతేకాదు, సీమాంధ్రనుండి తెలంగాణాకు తరలి వెళ్ళిన వారిలో పలువురు, నేడు ఫక్తు తెలంగాణ సమర్ధకులుగా మారి తెలుగు ప్రజలలో విషబీజాలను నాటే పనిలో కెసీఆర్ గారికి తోడ్పడుతున్నారు. సెటిలర్లలో కెసీఆర్ రగిలించిన అభద్రతా భావం, వారి స్థానిక స్వార్ధాలు దీనికి కారణం కావచ్చు. కెసీఆర్ పూర్వీకులుకూడ శ్రీకాకుళంనుండి తెలంగాణకు వలస వెళ్ళిన వాళ్ళే. ఇపుడు, కేసీఆర్ అలంపురంనుండి భద్రాచలం వరకు సీమాంధ్ర ప్రాంతం నుండి వెళ్ళిన సెటిలర్లను పరోక్షంగా బెదిరిస్తున్నట్లు మనం గుర్తించాలి. రిజర్వేషన్ లేని జనరల్ రైలు పెట్టెలో ముందు ఎక్కి తువ్వాలు పరచుకున్నవాడు, కొత్తవాళ్ళు ఎక్కకుండా, తలుపులు మూసేయాలంటాడు. ఒక్క అంగుళంకూడా జరగడు. పెట్టె మొత్తం నాదే అంటాడు.కెసీఆర్ కి అన్నీ పాకిస్థాన్ సృష్టికర్త జిన్నా లక్షణాలు కదా. అన్ని హామీలు ఇచ్చినట్లు కనిపిస్తాడు కానీ అన్నీ కపటం హామీలే.
మద్రాసు నుండి ఆంధ్రా రాష్ట్రం విడిపోయినపుడు ఆనాటి మద్రాసులో ఆంధ్రులు ఒక్కరోజు కూడ ఉండవద్దని రాజాజీ ఆగ్రహం వ్యక్తం చేశారని, కేసీఆర్ గుర్తు చేశారు. దీన్నేమనాలి?
రాజాజీ గారు నిజంగా అలా అన్నారో లేదో తెలియదు. అని ఉంటే, ఆయనకు శ్రీ ప్రకాశంగారి మీద ఉన్న అక్కసు వల్ల అలా అని ఉండవచ్చు. రాజాజీ గారికి, ప్రకాశంగారికి ఉన్న వివాదాలకు, --- కెసీఆర్ కు చంద్రాబాబునాయుడు గారికి ఉన్న వివాదాలకు కొన్ని పోలికలున్నా , నాటి స్వాతంత్ర్య యోధులైన రాజాజీ, ప్రకాశంలను --- నేటి వెన్నుపోటుదారులైన కెసీఆర్ - బాబు లను ఒకే గాట ఎలా కట్టేయ గలం?
పరోక్షంగా ఇక్కడ, కెసీఆర్ గారు హైదరాబాదు లోని సీమాంధ్రులకు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, 'మీరు హైదరాబాదులో ఒక్కరోజుకూడ ఉండవద్దనే.'
గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు ఉండద్దని కెసీఆర్ గారు అన్నారు. దీన్నేమనాలి?
హైదరాబాదులోని సీమాంధ్రుల భద్రత తన దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలని కెసీఆర్ కోరిక. అందరు తెరాసకు రక్షణ సుంకం చెల్లించాలని ఆయన అభిప్రాయం కావచ్చు. గవర్నర్ తానే సుంకాలను వసూలు చేసుకోటం ప్రారంభిస్తే? ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా.
ఇప్పుడున్న హైకోర్టును హైదరాబాదుకు ఇచ్చేసి ఆంధ్రలో మరో హైకోర్టును ఏర్పాటు చేయటమే మంచిది. హైకోర్టులోని న్యాయవాదులు ఇప్పటికే నిట్ట నిలువుగా చీలీపోయారు. అని కెసీఆర్ గారు అన్నారు. దీన్నేమనాలి?
కెసీఆర్ అడిగినా అడగక పోయినా, ప్రత్యేక హైకోర్టు కాలగమనంలో ఎలాగో ఏర్పడుతుంది. కెసీఆర్ లో కొద్ది నెలలు, లేదా ఒకటి రెండేళ్ళు ఓర్చుకునే శక్తి కూడా లేదు. కెసీఆర్ కాలధర్మం చెంది యముడి ముందుకు వెళ్ళినా, నరకంలో ప్రత్యేక తెలంగాణ నరకం ఇవ్వమని అగ్నిగుండాలు సృష్టిస్తాడు. యముడు , సోనియా గాంధీని, దిగ్గీని, శ్రీ నారాయణను, శ్రీ విద్యాసాగర్ రావును సలహాలడగాల్సి వస్తుంది.
కెసీఆర్ చేసిన ఇతర డిమాండ్ల సంగతి ఏమిటి?
ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. సోనియా రాజ్యం పోయి మోడీ రాజ్యం వస్తే, శ్రీకిషన్ రెడ్డి, కెసీఆర్ లు మార్చుకోబోయే వ్యాఖ్యానాలను మనం హైదరాబాదు తెరపై చూడాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.