చర్చనీయాంశాలు: రాష్ట్ర రాజకీయం, దేశరాజకీయం, కాంగ్రెస్, బిజెపి, జగన్
ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. తమ పరాజయం నిశ్చయమని సోనియా, రాహుల్ లకు ముందే తెలుసనుకోవాలి.
ఉత్తరాది మొత్తం లో కాంగ్రెస్ గల్లంతయితే, తెరాస సహాయం అవసరం అవుతుంది అని ఆమె నిర్ధారణకు రాబట్టే, ఆమె తెరాస, టీలీడర్ల గొంతెమ్మ కోరికలకంగీకరించి సీమాంధ్ర నేతలను పూచికపుల్లల్లా తీసి పారేసింది. ఇప్పుడు తెరాసను విలీనం చేసుకొని గానీ, పొత్తు (రహస్య లేక బహిరంగ) పెట్టుకొని గానీ తెలంగాణలో కాంగ్రెస్ ఊరట పొందుతుంది.
తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ ను మూడవ స్థానానికి నెట్టదా? తెలంగాణలో మోడీ కెరటం ఉండదా?
ఉండకూడదనేమీ లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ స్థాయిలో, తెలంగాణ రాష్ట్రంలో హిందూ మత పిచ్చి లేదు. రాష్ట్రంలో మతమార్పిడీ భారీస్థాయిలో జరిగి పోయింది. కాగితంమీద హిందువుల సంఖ్య అధికంగానే ఉన్నా, వాస్తవంగా అన్యమత వోటర్లు కూడ భారీగానే పెరిగారు. తెరాసనేత యజ్ఞాలు యాగాలు చేయించటం బిజేపి ప్రభావాన్ని తగ్గించేందుకే.
ధరల పెరుగుదల, అవినీతితో అసంతృప్తి చెందిన తెలంగాణ వోటర్లు ఎవరికి వోటు వెయ్యాలి? ఇక్కడ ఆం ఆద్మీ పార్టీ లేదు కదా?
2014 ఎన్నికలకు సంబంధించినంత వరకు, తెలంగాణ వోటర్లు ప్రత్యేక తెలంగాణను సమర్ధించిన పార్టీలకే వోటు వేస్తారని మనం నమ్మవచ్చు. అవినీతితో అసంతృప్తి చెందిన వాళ్ళు, బిజెపీకి వోటు వేసే అవకాశం ఉంది. ఇది తెలంగాణ టీడీపీని, జగన్ పార్టీని దెబ్బ తీయవచ్చేమోకానీ తెరాసను, కాంగ్రెస్ ను దెబ్బతీయదు.
మరి తెలంగాణ సీపీఐ సంగతేమిటి?
అది ఒక పులుసులో ముక్క. తెరాసతో, కాంగ్రెస్ తో అది పొత్తులు పెట్టుకోకపోతే కదా.
సీమాంధ్రలో పరిస్థితేమిటి?
విభజనలో జరిగిన అన్యాయం, ధరల పెరుగుదల, ఏకారణంతో చూచినా కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోక తప్పదు. రాష్ట్రంలో అవినీతి అనేది ఎప్పుడు ఎన్నికల్లో కీలకాంశంకాదు.
ఇప్పుడు గతంలో వీరప్ప మొయిలీ చెప్పిన , జగన్ తో బహిరంగ బేరం చేసుకునే పరిస్థితి వచ్చింది. (రహస్యంగా ఇప్పటికే బేరం జరిగి ఉండవచ్చు). జగన్ కు కొత్తాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్ని అప్పగించి, కేంద్రంలో తనకు సపోర్టు ఇచ్చే గట్టి ఏర్పాట్లను సోనియా చేసుకోవాల్సి వస్తుంది. 30 సీట్లు గెలిస్తే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం అని జగన్ చెప్పే పాత్ర ఇదే. జగన్ కు ఉమ్మడి బడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరిక. ఇప్పుడి చాంద్ బిస్కెట్ లాంటి సీమాంధ్ర ప్రదేశ్ తో తృప్తి పడటం ఎలా? పొత్తు పధ్ధతి లో జగన్ ను సీఎం చేస్తే ఢిల్లీకి సూట్ కెసులు ఆగిపోతాయి. తెలంగాణలో తెరాస కూడ సూట్ కేసులు పంపదు. టీలీడర్లు స్వంతంగా కాంగ్రెస్ ను గెలిపించకో కలిగితే, సూట్ కేసులకు లోటు ఉండదు.
బిజెపికి సూట్ కేసులు పంపాల్సిన పార్టీల సంఖ్య పెరుగుతూ ఉండగా, కాంగ్రెసుకు సూట్ కేసు రాష్ట్రాల సంఖ్య తగ్గుతున్నది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని బ్రతికిస్తే!
చిరంజీవి తన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆయన ప్రజల విశ్వాసం కోల్పోయాడు.
కిరణ్ కొత్త సమైక్యాంధ్ర పార్టీని పెట్తే?
అప్పుడు కిరణ్, జగన్, బాబు పార్టీల మధ్య హంగ్ అసెంబ్లీ సీమాంధ్రకు అస్థిరతను తెచ్చే అవకాశం ఉంది.
సీమాంధ్రలో బిజేపి పరిస్థితి మెరుగు పడదా?
మొదటి నుండి సీమాంధ్రలో బిజేపీ నామరూపాలు లేని పార్టీయే. మతం మార్చుకున్న వారు ఎక్కువగా ఉన్నందువల్ల మతతత్వాన్ని ప్రేరేపించే బిజేపీకి మద్దతు కష్టం. ఇక్కడి మేధావులలో వామ పక్షభావాలు ఉన్నాయి. వాటిని వోట్లుగా మార్చుకోటంలో, వామపక్షాలు విఫలమయ్యాయి. స్వర్గీయ ఎన్ టీ ఆర్ ఈ సంగతి గ్రహించే వామ పక్షాలను ఇబ్బంది పెట్టకుండా తెలివిగా వ్యవహరించే వాడు. ఒకసారి ఎన్ టీ ఆర్ నక్సలైట్లను దేశభక్తులని కూడా అన్నాడు.
సీమాంధ్రలో టీడీపీ అవకాశాలు మెరుగుకావా? బాబుకి ఇదే చివరి అవకాశం కాదా?
టీడీపీ ఎప్పటిలాగే రెండవ స్థానం దక్కించుకోవచ్చు.
సీమాంధ్ర లో ఆం ఆద్మీ పార్టీని, లోక్ సత్తాను ఎందుకు ప్రోత్సహించకూడదు?
శ్రీజయప్రకాశనారాయణ దృష్టి మొదటినుండి, హైదరాబాదులోని సీమాంధ్ర సెటిలర్లపై ఉంది. ఆయన గెలిచినకుకట్ పల్లి స్థానం కూడ హైదరాబాదు లో ఉన్నది. ఆయన సీమాంధ్రకు వలస వచ్చి సీమాంధ్రపై దృష్టి పెడ్తాడా లేదా అనేది చూడాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.