చర్చనీయాంశాలు: bifurcation, విభజన, రాష్ట్ర రాజకీయం, కేంద్ర రాజకీయం
గురజాడ వారి కన్యాశుల్కంలో గిరీశం డైలాగ్ ఇది. డామ్న్ ఇట్ కథ అడ్డం తిరిగింది (ఎన్ సైలెంట్), గిరీశం డైలాగు. గీరీశం బుచ్చెమ్మను లేవదీసుకొని వెళ్ళిపోవాలని వేసుకున్న ప్రణాలిక సౌజన్యారావు సమయస్ఫూర్తితో భగ్నం కావటంతో , విచారంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
సీమాంధ్ర కేంద్రమంత్రుల పన్నాగాలు, సోనియా, మన్మోహన్ సింగ్ ల రాజకీయ అవసరాల వల్ల బెడిసి కొట్టాయి. కేంద్ర కేబినెట్ లో సీమాంధ్రేతర మంత్రులు , మంత్రులబృందం MOG సభ్యులు కేవలం డూడూ బసవన్నలే. సోనియా, మన్మోహన్ లను తృప్తి పరచటం తప్ప వేరే ఎజెండా ఏమీ లేదు.
సీమాంధ్ర కెంద్ర మంత్రుల అంచనా: రాయలతెలంగాణను సమర్ధిస్తే, కర్నూలు తెలంగాణకు వెళ్తుంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం, కర్నూలుకు రాజధాని ఇవ్వటం తప్పుతుంది. ఆప్రాంతం వారికి మధ్య మధ్య అయినా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వటం తప్పుతుంది. కేవలం చిత్తూరు, కడపల బలహీన రాయలసీమను, కోస్తాంధ్ర రాజకీయవేత్తలు బాగా ఆడించుకోవచ్చు.
విశాఖను రాజధాని చేసుకొని, అక్కడ భూములను, కైవసం చేసుకొని బిల్డింగ్ వ్యాపారాలు లాభసాటిగా చేసుకోవచ్చు. అని ఉత్తరాంధ్ర రాజకీయవేత్తలు అనుకున్నారు.
ఏలూరు రాజకీయవేత్తలకు విజయవాడ అయినా విశాఖ అయినా భూ, బిల్డర్ వ్యాపారాలకు సౌకర్యమే. కర్నూలు సౌకర్యం కాదు.
దక్షిణాంధ్ర రాజకీయవేత్తలకు విజయవాడ గుంటూరు మధ్యకానీ, ఒంగోలు సమీపంలో కానీ, భూ, బిల్డర్ వ్యాపారాలకు అనుకూలం. కర్నూలు సౌకర్యం కాదు. కర్నూలునుండి తప్పించుకోవాలనే క్షుద్ర ప్రయత్నమే రాయలతెలంగాణాను సమర్ధించటానికి కారణం. అయ్యో, ఒక ప్రాంతాన్ని అన్యాయంగా చీలుస్తున్నామే అనే దృష్టి వారికి లేదు.
కర్నూలు, అనంతపురం రాజకీయవేత్తలకు హైదారాబాదు భూ ధంధాలపై మోజు ఉన్నది. ఇప్పటికే వారు అక్కడ ఆపనిలో నిమగ్నం అయి ఉన్నారు. అందుకే వారు సర్పంచులచేత తూతూమంత్రం తీర్మానాలు చేయించి కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు.
తెలంగాణ నేతలు, ప్రజలు, తామేదో ఘన విజయం సాధించాం అని అనుకుంటూ ఉండ వచ్చు. ఇది అక్కడ రాబోయే వారి అంతర్గత తుఫానులముందు ప్రశాంతి మాత్రమే. పాకిస్థాన్ ప్రజలు ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నారు?
కథను అడ్డం తిప్పింది ఎవరు? నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ అంచనాలు. నాలుగింట్లోనూ కాంగ్రెస్ కు చుక్కెదురవుతుందన్న భయం కాంగ్రెస్ నేతలను ఆవహించింది. ఇంక ఆలస్యం చేయకూడదని ప్రధాని అనటంలో కూడా నిగూఢంగా కొంత ఈభయం దాగి ఉండవచ్చు. నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే, కోల్ గేట్ ను, టెలికాం కుంభకోణాన్ని ఇంకా ఇతర కుంభకోణాల్ని కెలికించి, ప్రధానిని, కొందరు కేంద్ర మంత్రులను,ఐయేయస్ అధికారులను తాత్కాలికంగా నైనా జైలుకు పంపే అవకాశం ఉన్నది. సోనియా పదివేలకోట్ల సంపదపై కూడ అనుమానంతో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. వాషింగ్ టన్ పోస్టు పత్రిక ఎందుకో వెనక్కు తగ్గింది.
కానీ మోడీ దుస్సాహసి. ఆయన పాకిస్థాన్ తో యుధ్ధం పెట్టుకోక పోతే, కుంభకోణాలను దున్నించే పనికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పడు జగన్ పడుతున్న బాధలను, సోనియా, మన్మోహన్ లు పడ వలసి రావచ్చు. అందుకే వారు, అంధ్రప్రదేశ్, కర్నాటకలు చేయి జారిపోకుండా చూసుకోటానికి నానాబాధలు పడుతున్నారు. కోస్తాలో కనీసం సగం సీట్లైనా వస్తాయి. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినా, టీకాంగ్రెస్ గెలిచినా లాభమే. అందుకే రాయలతెలంగాణపై టీఆర్ఎస్ ఒక్కరోజు బంద్ ప్రకటించగానే కేంద్రం దిగి వచ్చింది. మోడీ చేతిలో నరకబాధలు పడే కన్నా కెసీఆర్ కు లొంగి పోవటమే నయమని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుందేమో.
హైదరాబాదుకు యూటీ ఇవ్వకపోటంకూడ, ఈలొంగి పోటంలో భాగమే.
ఏది ఏమైతేనేం? ఉత్తరాంధ్ర , దక్షిణాంధ్ర, రాయలసీమ నేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒక ముతక, బాధాకరమైన సామెత ఉన్నది. తిండి-బట్ట ఇవ్వని తాగుబోతు మొగుడు మానం పగిలి పోయేలాగా గుద్దాడు, అనే లోకోక్తి వాడటం దుఃఖకరమైనా వాడక తప్పదు. తిండి బట్ట ఇచ్చే, తాగుబోతు కాని మొగుడు గుద్దటం చేతకాని వాడైనా ఫరవాలేదా, అని వాదించే వాళ్ళు ఉండ వచ్చు. సంసారులైన స్త్రీ పురుషులకు సందర్భానుగుణంగా తిండీ బట్టలు, గుద్దుళ్ళూ రెండూ కావాల్సిందే. హైదరాబాదులో 1956 నుండి 2013 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించి అభివృధ్ధి చేసిన సంస్థలు ఇప్పుడు సీమాంధ్ర నిరుద్యోగులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమరాజకీయ స్వార్ధం కోసం, కెసీఆర్ ను తృప్తి పరచటంకోసం, సీమాంధ్ర నిరుద్యోగులను చావు దెబ్బ కొట్టారు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని వల్ల సీమాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కెసీఆర్ కెటీఆర్ హరీష్ కవిత ల చేత తిట్టించుకోటం తప్ప.
ఇప్పడు ఏంచేయాలి?
స్వార్ధంకానీ, నిస్వార్ధంకానీ, మూడు ప్రాంతాల నేతలకు, ప్రజలకు కూడ కోరికలున్నాయి. అవి నెరవేరాలంటే మూడు రాష్ట్రాలు ఉత్తరాంధ్ర,దక్షిణాంధ్ర, రాయలసీమ తప్పనిసరి.ఇప్పుడైనా మూడు ప్రాంతాల నేతలు కళ్ళు తెరచి మూడు రాష్ట్రాలను ఏర్పరిస్తే తప్ప, ఇంక ఎంత మాత్రం కుదరదు అని కేంద్రానికి చెప్పాలి. కేంద్రం పట్టించుకోకపోతే, 2014 లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలి లేదా ఉమ్మడి అభ్యర్ధులను గెలిపించుకోవాలి. బలహీన వర్గాల ప్రజల పేదరిక నిర్మూలన పథకాలు దెబ్బతింటాయి కాబట్టి, సీమాంధ్ర రాష్ట్ర శాసన సభకు, ఎన్నికలను జరగనిచ్చి, మంత్రి వర్గాలను పనిచేయనివ్వాలి. మన పేదలకు, మన నిరుద్యోగులకు మనమే దెబ్బలు కొట్టుకోకూడదు. ఇంక, ఎంతమాత్రం అంతఃకలహాల రాజకీయాలను కొనసాగనీయకూడదు.
కేంద్రానికి నిరసనలను తెలపటానికి, ఆదాయపు పన్ను , కేంద్ర ఎక్సైజ్ పన్ను, సేవాపన్నుల చెల్లింపును వాయిదా వేసి ప్రత్యేకంగా సీమాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వద్ద జమ చేయాలి. విద్యార్ధులు తమ చదువు కోల్పోకూడదు. భౌతిక హింసకు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగ కూడదు. నేలమట్టమైన ఆస్తులను పునర్నిర్మించుకోవాలంటే, రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం పెంచ వలసి వస్తుంది.
ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు. కానీ Slow and steady wins the race అని ఋజువు చేయాలి.
సారాంశం: మూడు రాష్ట్రాలకన్న గత్యంతరం లేదు. ఉద్యమించటం నేతల విధి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.