చర్చనీయాంశాలు: ramayana, రామాయణం, సమాజం, కులవ్యవస్థ
వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాల ఉద్ గ్రంధం. నేటి కాలంలో సంస్కృతం చదివే వారే తగ్గిపోయారు. ఇంక, 24,000 శ్లోకాల ఉద్ గ్రంధాన్ని ఎవరు చదువుతారు?
వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకు సుదీర్ఘంగా మారటానికి పలు కారణాలు ఉన్నాయి. వాల్మీకి ప్రకృతి వర్ణనలలో దిట్ట. ఋతువులను, అడవులను, చెట్లను, పర్వతాలను, చంద్రుడిని, వెన్నెల రాత్రులను, ఇలా ప్రతిదాన్నీ అతి సత్యం, శివం, సుందరంగా, వర్ణించాడు. అయితే వాల్మీకి రామాయణం ఒక ఆకారానికి వచ్చాక గడచిన 2-3 వేల సంవత్సరాల కాలంలో , పురాణ ప్రచారకులు,ప్రబోధకులు, 'కాళిదాసు కవిత్వం కొంత, తమపైత్యం కొంత' అన్నట్లుగా, స్వంత అభిప్రాయాలను విపరీతంగా చొప్పించినట్లు తోస్తుంది. ఈవిషయంలో వారు నియంతలైన రాజుల వత్తిడులకు గురియైనట్లు కనిపిస్తుంది. మచ్చుకు, వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 14వ సర్గను చూద్దాము.
వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 14వ సర్గలో సందర్భం: సీతారామ లక్ష్మణులు పంచవటి అడవిలోకి ప్రవేశించారు. అక్కడ వారికి జటాయువు తటస్థపడ్డాడు. అప్పటికింకా సీతాపహరణం జరగలేదు. దశరధుడి గాఢ మిత్రుడనని, తనను పితృసమానునిగా తలచమని, చెప్పిన జటాయువుని రామలక్ష్మణులు అతడి పరిచయ వివరాలు అడిగారు. పురాణ ప్రబోధకులు ఇక్కడ మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో అని, జటాయువు తల్లి వినత,తండ్రి కశ్యపుడు, సవతి తల్లి కద్రువకు సంబంధించిన కథనే కాక, సృష్ట్యాది మొత్తాన్ని చొప్పించారు. 5వ శ్లోకం నుండి 34వ శ్లోకం వరకు 30 శ్లోకాలు వాడేశారు.
రామస్య వచనం శ్రుత్వా సర్వభూతసముద్భవమ్ ।
ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ ॥ 3.14.5 ॥
పూర్వకాలే మహాబాహో యే ప్రజాపతయో ఽభవన్ ।
తాన్మే నిగదతః సర్వానాదితః శృణు రాఘవ ॥ 3.14.6 ॥
కర్దమః ప్రథమస్తేషాం విశ్రుతస్తదనన్తరః ।
శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ ॥ 3.14.7 ॥
స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రుతశ్చైవ మహాబలః ।
పులస్త్యశ్చాఙ్గిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా ॥ 3.14.8 ॥
దక్షో వివస్వానపరో ఽరిష్టనేమిశ్చ రాఘవ ।
కశ్యపశ్చ మహాతేజాస్తేషామాసీచ్చ పశ్చిమః ॥ 3.14.9 ॥
ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతమ్ ।
షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః ॥ 3.14.10
కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః ।
అదితిం చ దితిం చైవ దనుమప్యథ కాలికామ్ ।
తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి ॥ 3.14.11 ॥
తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్ ।
పుత్రాంస్రైలోక్యభర్తఽన్ వై జనయిష్యథ మత్సమాన్ ॥ 3.14.12 ॥
అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ ।
కాలికా చ మహాబాహో శేషాస్త్వమనసో ఽభవన్ ॥ 3.14.13 ॥
అదిత్యాం జజ్ఞిరే దేవాస్త్రయస్త్రింశదరిన్దమ ।
ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరన్తప ॥ 3.14.14 ॥
దితిస్త్వజనయత్పుత్రాన్ దైత్యాంస్తాత యశస్వినః । తేషామియం వసుమతీ పురాసీత్ సవనార్ణవా ॥ 3.14.15 ॥
దనుస్త్వజనయత్ పుత్రమశ్వగ్రీవమరిన్దమ ।
నరకం కాలకం చైవ కాలికాపి వ్యజాయత ॥ 3.14.16 ॥
క్రౌఞ్చీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీమ్ । తామ్రాపి సుషువే కన్యాః పఞ్చైతా లోకవిశ్రుతాః ॥ 3.14.17 ॥
ఉలూకాన్ జనయత్ క్రౌఞ్చీ భాసీ భాసాన్ వ్యజాయత । శ్యేనీ శ్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః ॥ 3.14.18 ॥
ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః ।
చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామినీ ॥ 3.14.19 ॥
శుకీ నతాం విజజ్ఞే తు నతాయా వినతా సుతా ॥ 3.14.20 ॥
దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసమ్భవాః ।
మృగీం చ మగమన్దాం చ హరిం భద్రమదామపి ॥ 3.14.21 ॥
మాతఙ్గీమపి శార్దూలీం శ్వోతాం చ సురభిం తథా । సర్వలక్షణసమ్పన్నాం సురసాం కద్రుకామపి ॥ 3.14.22 ॥
అపత్యం తు మృగాః సర్వే మృగ్యా నరవరోత్తమ ।
ఋక్షాశ్చ మృగమన్దాయాః సృమరాశ్చమరాస్తథా ॥ 3.14.23 ॥
హర్యాశ్చ హరయో ఽపత్యం వానరాశ్చ తరస్వినః । తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతామ్ ॥ 3.14.24 ॥
తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః ।
మాతఙ్గాస్త్వథ మాతఙ్గ్యా అపత్యం మనుజర్షభ ॥ 3.14.25 ॥
గోలాఙ్గూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్ సుతాన్ ।
దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్ సుతాన్ ॥ 3.14.26 ॥
తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత ।
రోహిణీం నామ భద్రం తే గన్ధర్వీం చ యశస్వినీమ్ ॥ 3.14.27 ॥
రోహిణ్యజనయద్గా వై గన్ధర్వీ వాజినః సుతాన్ ।
సురసా ఽజనయన్నాగాన్ రామ కద్రూస్తు పన్నగాన్ ॥ 3.14.28 ॥
మనుర్మనుష్యాన్ జనయద్రామ పుత్రాన్ యశస్వినః ।
బ్రాహ్మణాన్ క్షత్త్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనజర్షభ ।3.14.29 ॥
ముఖతో బ్రాహ్మణా జాతా, ఉరసః క్షత్రియా తథా|
ఊరుభ్యాం జహ్నురే వైశ్యాః, పదాభ్యాం శూద్రాః ఇతి శృతిః. 3.14.30 ॥
సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాననలాపి వ్యాజాయత ॥
వినతా చ శుకీ పౌత్రీ కద్రూశ్చ సురసా స్వసా ।3.14.31 ॥
కద్రూర్నాగం సహస్రస్యం విజజ్ఞే ధరణీధరమ్ ॥
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడో ఽరుణ ఏవ చ ।3.14.32 ॥
తస్మాజ్జాతో ఽహమరుణాత్ సమ్పాతిస్తు మమాగ్రజః ॥
జటాయురితి మాం విద్ధి శ్యేనీపుత్రమరిన్దమ ॥ 3.14.33 ॥
సో ఽహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి ।
ఇదం దుర్గం హి కాన్తారం మృగరాక్షససేవితమ్ ।
సీతాం చ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే ॥ 3.14.34 ॥
జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముదా పిరష్వజ్య చ సన్నతో ఽభవత్ ।
పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్ జటాయుషా సఙ్కథితం పునః పునః ॥
సా తత్ర సీతాం పరిదాయ మైథిలీం
సహ ఏవ తేన అతిబలేన పక్షిణా
జగామ తామ్ పంచవటీం సలక్ష్మణో
రిపూన్ దిధక్షన్ శలభాన్ ఇవ అనలః. 3-14-36.
పై వాటిల్లో, మచ్చుకి ఈ శ్లోకాలను పరిశీలిద్దాము.
మనుర్మనుష్యాన్ జనయద్రామ పుత్రాన్ యశస్వినః ।
బ్రాహ్మణాన్ క్షత్త్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభ ।3.14.29 ॥
ముఖతో బ్రాహ్మణా జాతా, ఉరసః క్షత్రియా తథా|
ఊరుభ్యాం జహ్నురే వైశ్యాః, పదాభ్యాం శూద్రాః ఇతి శృతిః. 3.14.30 ॥
షుమారు తెలుగు అనువాదం:
మానవ శ్రేష్ఠుడైన ఓరామా! కశ్యపుడి భార్యయైన మను (మను మాత అనచ్చేమో) మనుష్యులను, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను, జన్మింపచేసింది. బ్రాహ్మణులు ముఖం నుండి, క్షత్రియులు వక్షంనుండి, వైశ్యులు తొడలనుండి, శూద్రులు పాదాలనుండి ఉద్భవించినట్లుగా మనకు శృతి.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు:
3.14.30 శ్లోకం http://valmikiramayan.net (దేశిరాజు హనుమంతరావు గారి సైట్) లో ఉన్నది. కానీ కృష్ణశర్మ గారి http://readramayana.org సైట్ లో లేదు.
రీడ్ రామాయణా ఆర్గ్ సైట్ వారు ఈ శ్లోకాన్ని కావాలనే మనో భావాలను దెబ్బ తీస్తుందని కత్తిరించారా, లేక వారు ఆధారపడ్డ ప్రింటెడ్ మూలప్రతిలో లేదా, తెలియదు. వారు కత్తిరించి ఉంటే, తిరిగి దానిని తమ సైట్ లోని రామాయణంలో పునః ప్రవేశపెట్టటం న్యాయం. మనో భావాలను దెబ్బతీస్తుంది అనుకుంటే, ఒక గమనికను జోడించ వచ్చు. శ్లోకాలను తమ అభిమతానుసారం జోడించటం, కత్తిరించటం, చేస్తే, ప్రాచీన గ్రంథాలు తమ ఆకారం కోల్పోతాయి. గత శతాబ్దాలలో పురాణ ప్రబోధకులు చేసింది ఇదే. ఇంక వారికీ మనకు తేడా ఏమి ఉంటుంది.
పాఠాంతరాలు ఇప్పటికే ఒక సమస్యగా ఉంది. మనం ఇంకా కొత్త పాఠాంతరాలకు కారణభూతులం కావలదు.
ముఖంలోంచి బ్రాహ్మణులు, వక్షంలోనుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు వచ్చారని నిర్ణయించటం, దానిని ఒక గద్దచేత చెప్పించటం, నిశ్చయంగా అన్యాయమే. కానీ శ్లోకాన్ని పీకే కన్నా దానికింద నోట్స్ వ్రాయటం వల్ల జరిగిందేమిటో ప్రజలకు అర్ధం అవుతుంది.
ఒకవేళ రీడ్ రామాయణా ఆర్గ్ సైట్ వారి వద్ద ఉన్న మూల గ్రంధంలో అంటే శ్రీ కృష్ణశర్మ గారి వద్ద ఉన్న మూల గ్రంథంలో ఈశ్లోకం లేకపోతే, వారు తమ వద్ద ఉన్న మూలగ్రంథం యొక్క ఆఒక్క పేజీ స్కాన్ చేసి తమ వెబ్ సైట్ లోఉంచటం న్యాయం.
చివరిగా: జటాయువు గారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మను గారి చేత జన్మింప చేయ బడ్డారని చెప్పారు. బాగానే ఉంది. మరి యూరోపియన్లు, అమెరికన్లు, ఆఫ్రికన్లు, చైనీయులు, జపనీయులు, మొ|| ఇతర దేశాలవారు ఎక్కడనుండి వచ్చారు? కేవలం నాలుగు కులాల వారి గురించే చెప్పటం ఎందుకు? ఐదోకులం, ఆరోకులం, ..... వెయ్యోకులం వారి సంగతి ఏమిటి?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.