Snake die, nor should the stick break !!! साँप मर जाय, लठी भी न टूटे !!! సాంప్ భీ మర్ జాయ్, లాఠీ భీ న టూటే !!! కర్ఱ విరగకూడదు, పాము చావకూడదు. అనేది తెలుగు సామెత. ఇది ఉర్దూ సామెతకు భిన్నంగా ఉన్నది.
In Urdu language, there is a proverb. ఉర్దూలో ఒక సామెత ఉంది. امپ بھی مر جاءََے لاٹھی بھی نا ٹوٹے.
సాంప్ భీ మర్ జాయ్, లాఠీ భీ న టూటే. పాము చావాలి. కఱ్ఱ విరగ కూడదు. రాజకీయ పార్టీల తీరు ఈ విధంగానే ఉంటుంది. పేకాటాడేవాళ్ళు తమ దగ్గర ఏమి ముక్కలు ఉన్నాయో, తమకు ఏ ముక్కలు కావాలో ఎలా చెప్పరో, అలాగే, రాజకీయ పార్టీలు కూడా తమకేమి కావాలో చెప్పరు. తమకు కావాల్సింది అధికారం అని అందరికీ అర్ధం అవుతుంది.
Everybody understands that Mr. Chandra Babu Naidu wants power at any costs. చంద్ర బాబు నాయుడిగారికి కావాల్సింది అధికారం అని అందరికి అర్ధం అవుతుంది.
హోం మినిస్ట్రీ వాళ్ళు , మంత్రుల బృందం వాళ్ళు తాము ఆంధ్రప్రదేశ్ ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలను సేకరించలేదు, అనే విమర్శనుండి తప్పించుకోటానికి ప్రతిపక్షాలకు లేఖలు వ్రాశారు. ఇది రాష్ట్రపతిని సంతృప్తి పరచటానికి పనికి వస్తుంది. మంత్రుల బృందం వాళ్ళు ఏమి చేయాలో ముందే నిర్ణయించ బడి ఉన్నది. వారు సోనియామాత గీసిన గీటు దాట లేరు. ఈస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు ఏమి వ్రాసి ఇచ్చినా, కాంగ్రెస్ దాన్ని ఒక కఱ్రగా ఉపయోగించుకొని ప్రతిపక్షాలను ఆకఱ్ఱతోనే కొట్తుంది. సమస్యను పరిష్కరించాలనే కోరిక వారికీ లేదు, వీరికీ లేదు.
పార్టీలలో అంతరంగిక ప్రజాస్వామ్యం ఉంటే , గ్రామస్థాయి యూనిట్ల అభిప్రాయం, మండల స్థాయి యూనిట్ల అభిప్రాయం, జిల్లాస్థాయి యూనిట్ల అభిప్రాయం, క్రోడీకరించి తమకు ఏమి కావాలి అనే డిమాండ్ల ను రెండు మూడు ఎంపికకు వీలైన ప్యాకేజీలుగా తయారు చేసి కేంద్రానికి ఇవ్వ గలిగే వాళ్ళు.
ఇప్పుడు రాజకీయ పార్టీలు తాము పట్టిన కుందేళ్ళకు మూడు కాళ్ళో, పదికాళ్ళో, తెలియని పరిస్థితిలో ఉన్నాయి. అంతేకాదు, మన రాజకీయపార్టీలకు, మఠాలకూ భేదం లేదు. మఠాల్లో, తన తరువాత, ఎవరు పీఠాధిపత్యం వహించాలో మఠాధిపతి నిర్ణయిస్తాడు. మన పార్టీలలో ఆఅవసరంకూడా లేదు. అది ముందరే అందరికీ తెలుస్తుంది. గ్రామస్థాయి యూనిట్ల నిర్వాహకులు వారు సర్పంచులైనా, మరొకరైనా, కేవలం వోట్లు కొనటానికి ఉపయోగించే బ్రోకర్లుగాను, సభలకు జనాన్ని సమీకరించే గొఱ్ఱెలకాపర్లుగాను తప్ప వేరు విధంగా ఉపయోగపడటం లేదు.
This environment has to change. ఈ వాతావరణం చాలా మారాలి.
Added on 27.01.2016. दिनांक २७.१.२०१६, जुडा हुआ है। ౨౭.౧.౨౦౧౬ నాడు జోడించబడింది.
Mr. Chandra Babu Naidu got his desire fulfilled, by hook or crook. What really helped Mr. Naidu was: the dissatisfaction of the Residual Andhra Pradesh people with the Congress with its bourgeoisie rule.
But, the people of Residual Andhra Pradesh did not realise that they were replacing one millstone with another mill-stone. Now, they must be repenting for their haste in selecting Mr. Naidu. As they sow, they will reap.
To continue. सशेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.