What for were the showers of flowers from the sky? Did Shri Rama kill any invading foreigner? తపస్సు చేస్తున్న శూద్ర మునిని చంపిన శ్రీరాముడు
ఈ పద్యాలు తిక్కన కవిబ్రహ్మ వ్రాసిన నిరవచనోత్తర రామాయణం, 10వ ఆశ్వాసం లోనివి.
మత్తేభం.
నరనాధుండిటు లెట్టకేలకు విలీనంబైన చిత్తంబు సు
స్థిరభావంబున బట్టుకొల్పి కొని నిశ్చింతాత్ము నత్తాపసున్
శరణార్ధి స్ఫుట రక్ష కోరి తునిమెన్ సంరంభ శూన్యాంగుడై
కరవాలంబు మృదుక్రియం బెరికి రేఖాహీన దీన స్థితిన్.
అపుడు కుసుమ వర్ష మాకసంబెల్లను
పొదివె దేవ దుందుభులు సెలంగె
హరిహరాది దివిజు లంతరిక్షంబున
నిలిచి సంస్తుతించి రెలమి మిగుల.
సారాంశము
_______
సందర్భం. రాముడు అప్పటికే సీతను అడవికి పంపాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు , చనిపోయిన తన కొడుకు శవాన్ని తీసుకొని రాముడి కొలువుకు వచ్చాడు. ఏడుస్తున్న ఆబ్రాహ్మణుడిని చూసి రాజగురువు వశిష్ఠుడు ఇలా అన్నాడు.
ఇప్పుడు శూద్రుడొక్కడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. అందుకే ఈ బాలుడి మరణం సంభవించింది. నీవు ఏ మాత్రం కృప, సందేహం లేకుండా, ఆ శూద్రుడిని చంపిరా. అప్పుడే ఈ బాలుడు బ్రతుకుతాడు.
రాముడు ఆబాలుడి శరీరాన్ని తైలంలో నిలువ ఉంచమని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు. పుష్పక విమానం ఎక్కాడు. దండకారణ్యంలో ఆశూద్రుడిని గాలించి పట్టుకొని, కత్తి దూసి ఆశూద్ర ముని తల నరికాడు.
పరిశీలన
_____
1. శ్రీరాముడు ఏమి ఘనకార్యం చేశాడో కానీ పూల వర్షం కురిసిందట. దేవ దుందుభులు మ్రోగాయిట. హరిహరాదులు, మొ. దేవతలు అంతరిక్షంలో నిలబడి రాముడిని చాలా పొగిడారు. 2.ఎందుకో? హరి అంటే విష్ణువు. హరుడు అంటే శివుడు. హరి, శ్రీరాముడిగా అవతారమెత్తి, మానవ రూపంలో భూమిపై ఉంటే , ఆకాశంలో ఎలా ఉంటాడు. ఒకేసారి రెండు చోట్ల ఉండటం దేవతలకు సాధ్యమే అనేవాళ్ళుంటారు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.