ఛందోబధ్ధమైన తెలుగు కవిత్వానికి కాలం చెల్లిందేమో అనే అభిప్రాయం పలువురిలో ఉంది.
కర్ణుడి చావుకు పది కారణాలు లాగా, ఛందో కవిత్వ అకాలవృధ్ధాప్య జనిత మరణోన్ముఖతకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దృశ్య శ్రవణ సౌఖ్యాలకు అలవాటు పడి బానిసలైన విద్యా వంతులు తమ అక్షరాస్యతను కోల్పోటం కూడా ఒక ముఖ్య కారణం. ఇవన్నీ social environment సాంఘిక వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అనుకుందాం, కాబట్టి ఛందోకవిత్వ దోషమేమీ లేదనుకుందాం.
ఛందోకవిత్వం యొక్క స్వంత బలహీనతలు చక్క దిద్ద బడక పోతే అది ఇంకా అధిక పతన యాన వేగంతో ముందుకు వెళ్లుతుంది. కాబట్టి ఛందోభిమానులు, సృజనకారులు, దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలి.
బలహీనతలకు కొన్ని ఉదాహరణలు: ప్రాస కోసం పాకులాడటం. కృత్రిమ యతులను సృష్టించటం. తగినంత పదజాలాన్ని vocabulary సమకూర్చుకోకుండా పదాలనే కృత్రిమంగా మార్చటానికి పూనుకోటం.
దీర్ఘ సమాసాలను వాడటం సబబా?
రసభంగం కానంత వరకు, పఠనా సౌలభ్యానికి అభ్యంతరకరం కానంత వరకు దీర్ఘ సమాసాలు ఆమోద యోగ్యమేనేమో అనిపిస్తుంది. నన్నయ, శ్రీనాథుడు, పోతన మొదలగు మహాకవులెందరో దీర్ఘసమాసాలను వాడి కూడా ప్రజల నాలుకల్లో జీవిస్తున్నారు.
శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు! భక్త పాలనకళా సంరంభకున్! దానవో
ద్రేక స్తంభకు! కేళీలోల విలసద్ దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు నందాంగనా డింభకున్!
సారాంశం
______
ఛందో కవితా కర్తలు పెరగాలి. పాఠకులూ పెరగాలి. ఒక నందనం విరబూయాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.