Telugu speaking people must know the robberies taking place in their own door-steps, of a magnitude which impoverishes them beyond repair and replenishment. తెలుగు ప్రజలు తమపై జరుగుతున్న వివిధ రకాల దోపిడీలను అర్ధం చేసుకోటం అవసరం.
Question: Prove at least one robbery ! ఏదైనా ఒక దోపిడీని నిరూపించండి
Answer: Let us take Telugu films. One cinema persons said that they collected Rs. one billion (Rs. 100 crore). We can't totally ignore their words are sheer boasting. There is a possibility of at least a part of that being correct.
Telugu: తెలుగు సినిమాలనే తీసుకోండి. ఒక సినిమా వారు తాము రూ. 100 కోట్లు వసూలు చేస్తున్నామని చెప్పుకున్నారు. వీటిని పూర్తిగా కోతలని కొట్టేయలేం. కొంతైనా నిజం ఉండే అవకాశం ఉంది.
దీనికి వేరొక అర్ధం తెలుగు ప్రజలు, కేవలం ఒక్క సినిమా విషయంలోనే, రూ. 100 కోట్లు కోల్పో బోతున్నట్లు. ఏ తెలుగు సినిమా అయినా రూ. 100 కోట్ల నుండి 100 కోట్లు వసూలు చేస్తుంది కాబట్టి, ఏడాదికి కనీసం 100 సినిమాలు విడుదులైతే , సరాసరిన రూ. 5000 కోట్లు కోల్పోతారు.
స్వఛ్ఛందంగా కోల్పోతున్నారా , నిర్బంధంగా కోల్పోతున్నారా? అలవాట్లకు బానిసలై అధిక ధరలకు సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసే వాళ్ళందరూ స్వఛ్ఛందంగా ఈ దోపిడీకి ఒప్పుకున్నట్లే. ఈ అధికధరలను నిర్మాతలు, థియేటర్ యజమానులు నిర్ణయించారా, నల్ల బజారు వారు నిర్ణయించారా అనేది అప్రస్తుతం.
Question: పైరసీల సంగతేమిటి?
పైరసీ సీడీ లతో సినిమాలు చూసేవాళ్ళు కూడా తామేమీ పత్తిత్తులం ఉలవిత్తులం అనుకోనక్కర లేదు. తమచేతికి తడి అంటకుండా లక్షలు పోగుచేసుకోటం వారి దోపిడి వ్యాపారం. సినిమా టిక్కెట్లకు చిత్ర పరిశ్రమ ఆధిక ధరలను నిర్ణయించి 100 కోట్లు _ 1000 కోట్లు పోగుచేసుకోవాలను కుంటుంటే పైరసీ పరిశ్రమ దానికి దెబ్బ కొట్తున్నది.
Question: టిక్కెట్ల ధరలు తగ్గించటం కుదరదు.
Answer:
ఎందుకు కుదరదు? లండన్ లో , సింగపూర్ లో షూటింగ్ చేయటం ఎందుకు? అరకులో తీయచ్చు. హీరోలకు కోట్లకొద్దీ పారితోషికాలు ఎందుకు? కొత్త హీరోలతో తీయచ్చు. ఒకఊరిలో 20 హాళ్ళు ఉంటే అన్నిట్లోనూ ఒకే సినిమాను జనంపైకి రుద్ది మొదటి వారం లోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలనే దుగ్ధ నేడు నసాళానికి అంటింది. హీరోల కుటుంబాల, పెద్ద నిర్మాతల ఈ రోగం వల్ల చిన్న నిర్మాతలకు చోటు లేకుండా పోతున్నది.నిజానికి ఒకటి లేక రెండు వీడియో కెమేరాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కటి సినిమాలను నిర్మించవచ్చు. కథనంలో నూతనత్వం ఉండి, బోర్ లేకుండా చూసుకుంటే నిలకడగా వసూళ్ళు పెరుగుతాయి. ఘరానా నిర్మాతలు థియేటర్లను బ్లాక్ చేసినపుడు, లోబడ్జెట్ సినిమాలు వసూళ్ళు బాగున్నా మొదటివారం లోనే బయటికి గెంటి వేయబడుతున్నాయి.
Question: పరిష్కారం ఏమిటి?
Answer:
ముందు ముందు జనం చేతుల్లో స్మార్ట్ ఫోన్లూ , టాబ్లెట్లూ పెరిగే కొద్దీ , జనం థియేటర్లకు రావటం తగ్గుతుంది. సినిమా పరిశ్రమ టిక్కెట్టేతర ఆదాయం వెతుక్కోక తప్పదు.To continue. असंपूर्ण. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.