చందమెరిగి మాట చక్కగా చెప్పిన
ఎవ్వడైన మాట మారికేల పలుకు
చందమెరింగి యుండు సందర్భెమెరుగుమీ
విశ్వదాభిరామ వినుర వేమ.
అవతల వారి పధ్దతిని తెలుసు కొని, తాము చెప్ప దలుచుకున్న దాన్ని చక్కగా చెప్పి నప్పుడు ఎవరేనా మాట వింటారు. ఎదురు తిరగరు. కాబట్టి చెప్ప వలసిన విధము తెలుసుకో. (దేశము, కాలము, మానము, మొదలగు) సందర్భం తెలుసుకో.
పరిశీలన.
------
సుమతీ శతక కారుడు కూడా , ఇటువంటి పద్యాన్నే చెప్పాడు.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.
౨౧వ శతాబ్దం. 17-10-2013.
---------------------
దిగ్విజయ్ సింగ్ గారు తాను ఆంధ్రప్రదేశ్ లో తాను మంటలను చల్లార్చ టానికి ఉన్నాడో, రేపటానికి ఉన్నాడో , అర్ధం చేసుకోలేని అయోమయం లో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆయన మాటల వల్ల సీమాంధ్ర ప్రజలు తమకు కాంగ్రెస్ చేస్తున్న గాయాలను మర్చి పోదామనుకున్నా మర్చి పొలేని పరిస్థితి వస్తుంది.
మామూలుగా రాజకీయవాదులు ఏరోటి పాటలు అక్కడ పాడుతూ ఉంటారు.
కేంద్ర మంత్రిణి పురందేశ్వరి సమైక్యాంధ్రను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూనే క్రొత్తాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. విజయవాడను రాజధాని చేయాలని ఆమె అక్కడి వర్తక సంఘాలను కలిసి నట్లు వార్తలు వచ్చాయి. ఆమె విజయవాడను రాజధానిగా ప్రతిపాదించే ముందు , రాయలసీమ నేతలను , ఉత్తరాంధ్ర నేతలను సంప్రదించిందో లేదో తెలియదు. ఆమె స్వనామీగా కానీ, బినామీగా కానీ ఏమైనా భూములు కొన్నదో లేదో తెలియదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.