The manner at which prices of vegetables are flaring in India, should enflame the mind of every Indian with the exception of the Finance Minister of India. Of course, Mr. Chidambaram has already made clear that it is not the duty of his Government to control prices. But he considers that it is his duty to ensure that Indian Stock Exchanges boom and Sensex climbs up to over 20000. తోటకూర కట్ట రూ. 15/-. దొండకాయలు పావుకిలో రూ. 15/-.
ఇవి 3-11-2013 దీపావళి నాటి గుంటూరు కూరగాయల ధరలు. టపాకాయలు ఎలాగో కొనలేము. బ్రతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని అంటారు. ప్రస్తుతం, జనంలో పలువురికి బలుసాకు ఎక్కడ దొరుకుతుందో, ఎలా వండుతారో లేక నూరుకొని తాగుతారో తెలియదు కనుక, కనీసం ఆకులలములు తిని బ్రతకాలనుకునే వారికి తోటకూర కూడ దొరకని పరిస్థితి వచ్చింది. ఇటీవల ఎడతెగక కురిసిన వర్షాలతో ఆకుకూరల తోటలు మునిగి పోటం వల్ల ఈస్థితి వచ్చి ఉండవచ్చు. ఒక్క నెలలో పరిస్థితి మెరుగు కావచ్చు.
పూర్వం మునులు ఆకులు మాత్రమే తిని తపస్సు చేసే వారంటారు.
పరమేశ్వరుని పెండ్లాడాలనుకున్న పార్వతి, (హైమవతి _ హిమవత్ పుత్రి_ హిమవత్ పర్వతము యొక్క కుమార్తె) ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది, అంటారు. అందుకే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది అంటారు.
నన్నెచోడ మహాకవి కవితా వైభవం
నన్నెచోడ మహాకవి విరచిత కుమార సంభవం కావ్యం నుండి. షష్ఠాశ్వాసం. 90 వపద్యం. వచనం.
అట్లు గౌరి నగంబు నందు, పరమేశ్వరుం గోరి ఘోరతపంబు సేయం దొడంగి విహిత స్నానార్చనా హోమాది నిత్యకర్మంబుల, శాకాహార ఫలాహార పర్ణాహార జలాహార మారుతాహార నిరాహారాది మహాతపో వ్రతంబుల , నంద వాసాభ్రక వాసైక పాదాంగుష్ఠోర్ధ్వ బాహూర్ ఊర్ధ్వముఖాధోముఖా గ్నిముఖ పంచాగ్నిమధ్యాది అనేకోగ్ర తపంబులం, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ జప సమాధులను , షడంగ యోగంబుల, మనోవాక్కాయ కర్మంబుల, నతినిష్ఠానుష్ఠానంబులం బరమేశ్వరాధన తాత్పర్యయై , నిరంతారానంత తపోవృత్తిం బ్రవర్తించుచుండెనంత.
ఆహారానికి సంబంధించి నంత వరకు, తపో ___అంశాలు
ప్రథమదశ: శాకాహారం, కాయగూరలు.
ద్వితీయదశ: ఫలాహారం, పండ్లు మొదలగునవి.
జలాహార: మంచినీళ్ళు మాత్రమే.
మారుతాహార: గాలి ఆహారం.
నిరాహార : అసలు ఆహారమే లేకుండా.
ఆది మహాతపో వ్రతంబుల == మొదలైన గొప్ప తపోవ్రతములతో.
ఈ ధరల దెబ్బకు, ఏ గడ్డి పాకల్లో ఏ నారీ మణులు ఏఏ స్థాయిల్లో ఈఈ మహా తపో వ్రతాలు చేస్తున్నారో, హిమాద్రి తనయవలె తపః పునీత లవుతున్నారో మనకు తెలియదు.
చాలా మంది పట్టించుకోరు గానీ, మన వ్యవసాయం, కూరగాయలు--తోటలపెంపకాలు కుదేలవటానికి, పట్టణాలు విస్తరించి వ్యవసాయభూములను స్వాహా చేయటమే ముఖ్యకారణం.
సోనియా మాత, మన్మోహన్ సింగ్ మామయ్య, ఆహార భద్రత బిల్లు పెట్టామని డప్పు కొట్టుకుంటున్నారు. తోటకూర భద్రత బిల్లు, పాలకూర భద్రత బిల్లు, ఎప్పుడు ప్రవేశ పెడ్తారో?
To continue. सशेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.