Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, July 11, 2014

296 Scarcity of Great humans


296 గొప్ప మానవులకు, నేడు కరువు వచ్చిందేమో.
చర్చనీయాంశాలు: 296, హరిశ్చంద్రుడు, మార్కండేయపురాణం, రాణా ప్రతాప్, పురుషోత్తముడు, గరిమెళ్ళ
సుభాషితాలు, సూక్తులు చదవటానికి బాగుంటాయి. ఆచరణకు అసాధ్యాలు కావు కానీ, దుస్సాధ్యాలు. ఆచరణా కోణంలోంచి చూస్తే, తాము చెప్పిన విషయాలను చిత్తశుధ్ధితో ఎన్ని కష్టాలు వచ్చినా ఆచరించిన వాళ్ళు, చరిత్రపుటలలో లేక పురాణాలలో మిగిలిన వాళ్ళు శతాబ్దానికి ఒక్ఖళ్ళు కూడ కనపడరు. ఈ సంస్కృత సూక్తిని తీసుకోండి. దీని కర్త ఎవరో, నాకు ఇంటర్నెట్ లో ఎంత గాలించినా దొరకలేదు. దీనిని ఇంటర్నెట్లో పెట్టిన పుణ్యాత్ముడు మటుకు దొరికాడు. వీరి పేరు శ్రీ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారు. వీరి బ్లాగ్ చూడటానికి click. వీరికి ధన్యవాదాలు.

आपन्नोऽपि हि सुजन: सुजन:
हीनस्तु विपदि कीदृक् स्यात् ?
भिन्नोSपि कनककलश:कनक:
भिन्नस्तु मृद्घट: कीदृक्?

भलामानुस, कठिनाइयों में भी सज्जन ही रहेगा. खल नहीँ बनेगा, दिखेगा। सुवर्ण भांड टूटने के बाद भी मिठ्ठी का नहीँ बनेगा, दिखेगा।

Apanno-api hi sujanaha sujanaha
hInastu vipadi kIdruk syat?
bhinno-api kanaka kalaSaha kanakaha
bhinnastu mrid-ghaTha kI-druk?
A virtuous person remains virtuous, even in adversities. A golden pot does not become an earthen pot, even if it is broken.

ఆపన్నో (అ)పి హి సుజనః సుజనః
హీనస్తు విపది కీదృక్స్యాత్
భిన్నో(అ) పి కనకకలశః కనకః
భిన్నస్తు మృద్ఘటః కీదృక్?

ఆపన్నోపి = ఆపదలు వచ్చినా , సుజనుడు సుజనుడు గానే ఉంటాడు. బంగారు కుండ పగిలిపోయినా మట్టి కుండ గా మారదు కదా.


ఇపుడు ఈ సూక్తిని ఆచరించి చూపిన వారిని గురించి ఆలోచిద్దాము.

హరిశ్చంద్రుడు


మార్కండేయ పురాణం హరిశ్చంద్రుడు (మనకి సత్యహరిశ్చంద్ర నాటకాల్లో , సినిమాల్లో కనిపించే, మరియు భారత ప్రభుత్వం వారి సత్యహరిశ్చంద్ర ఫేమ్). ఈయన సత్యం కోసం చివరికి కాటి కాపరిగా, తలారిగా మారి తన భార్య చంద్రమతినే గొడ్డలితో నరకవలసిన పరిస్థితి వచ్చినా ఎదురు నిలిచాడు.

ఆయితే వ్యాస మహాభాగవతం సంస్కృతం Part 9, Chapter 7, Verses 7 to 26 (i.e. 20 verses) నవమ స్కంధం, ప్రకారం, యముడికి ఇచ్చిన మాటనిలుపుకోలేక చివరికి నరబలికి పూనుకొని నవ్వుల పాలయ్యాడు. తెలుగు వాళ్ళకి చాలమందికి ఈ హరిశ్చంద్రుడి గురించి (ఇద్దరు హరిశ్చంద్రులు ఒకటే) గురించి తెలియదు. మార్కండేయ పురాణం సత్యమా, మహాభాగవతం సత్యమా, రెండిటినీ వ్యాసుడు గారే వ్రాసారే.

పురుషోత్తముడు


అలెగ్జాండర్ పురుషోత్తముడిని బంధించి నిన్నేం చేయాలో చెప్పమన్నాడుట. పురుషోత్తముడు సాటిరాజును ఎలాగౌరవించాలో అలా గౌరవించు అన్నాడుట. అంతే తప్ప మన అభినవ భీష్మఅద్వానీ గారిలాగా, అభినవ ద్రోణ శ్రీమురళీ మనోహర్ జోషీ గారిలాగా రాజీ పడి పోలేదు.

శ్రీ రాణా ప్రతాప్

ఈయన చరిత్ర భారతీయ మధ్యయుగ చరిత్రలో సువర్ణాక్షరాలతో ప్రకాశిస్తు ఉంటుంది. అక్బర్ సేనల దాడికి అడవుల పాలయ్యాడు. అయిన ఎన్నడూ దీనుడుకాక నిజమై రాజపుత్ర వీరుడి లాగా జీవించి, భారతీయ కీర్తి పతాకను ప్రపంచంలో అగ్రస్థాయికి తీసుకెళ్ళాడు.

షహీద్ భగత్ సింగ్


నవ్వుతూ, తాను చెప్పాలనుకున్నది చెప్పి ఉరికంబం ఎక్కాడే తప్ప, దైన్యంతో బ్రిటీష్ వారిని తన ప్రాణం కొరకు ప్రాధేయపడలేదు. (అండమాన్ జైల్లో స్వర్గీయ వీర సావర్కార్ బ్రిటీష్ వారికి సహకరించటానికి సిధ్ధ పడ్డారని కథనాలు ఉన్నాయి.)

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం



ముఖ్యమంత్రి పదవి పోయింది. రాజమండ్రి , చెన్నయి లలో నెలకు రూ. పదివేలు వచ్చే ఆస్తులు పోయాయి. తిండికే ఇబ్బంది వచ్చింది. ఆయన రాజమండ్రి రైల్వే ప్లాట్ ఫారమ్ లో ఒక బెంచి పై కూర్చొని ఉండగా, ఎవరో అభిమాని ఆయనకు భోజనం కారేజీ పంపారు. దానిని ఆయన తినపోతుండగా, ఎవరో ఒక భిక్షుకుడు ఆయనను తిండికై యాచించాడు. ఆభోజనం క్యారేజీని, ఆయన ఆ భిక్షుకుడికి ఇచ్చి తాను నిరాహారంగా మరోచోటికి వెళ్ళిపోయారుట. అచిరకాలంలోనే వారు స్వర్గస్థు లయ్యారుట.

స్వర్గీయ గరిమెళ్ళ సత్యనారాయణ


మాకొద్దు ఈ తెల్లదొరతనం అనే గీతాన్ని రచించిన స్వాతంత్ర్య యోధుడు. తెల్ల దొరలను ఎదిరించటంలో, ప్రకాశం గారికి దీటు వచ్చే మేటి ఘనాపాఠి. కానీ, చివరి రోజులలో, హోటల్ పెట్టుకొని బ్రతుకుతెరువును అన్వేషించ వలసి వచ్చింది. కానీ చెక్కుచెదరని శౌర్యధనుడు.

ఇంకా ఎందరో ఉన్నారు. అట్టివారిలో కీర్తి శేషులు తిరుమల రామచంద్ర గారొకరు.

మన అజ్ఞాత వీరులలో ఎక్కువ మంది అండమాన్ లోని సెల్యులార్ జైలులోగానీ, బయటకు వచ్చాక దుర్భర దారిద్ర్యంలో కానీ కన్ను మూశారు.

మా మాతామహుడు స్వాతంత్ర్యఉద్యమంలో స్వర్గీయ అయ్యదేవర కాళేశ్వరరావు గారి అనుచరుడిగా పాల్గొన్నారు కానీ, జైలుకి వెళ్ళలేదు. తన ఆస్తిని మొత్తాన్ని కోల్పోయి భార్యా పిల్లలను దుర్భర దారిద్ర్యంలోకి తోసి స్వాతంత్ర్యం రాకముందే స్వర్గస్థులయ్యారు. మా మతామహి మమ్మల్నందరిని పరుల ఇండ్లలో వంటలు చేస్తూ మమ్మల్ని పెద్ద చేసింది.

అందు వల్ల ఆపన్నత్వం, సజ్జనత్వం అనేవి, అతి గొప్ప ఐశ్వర్యాలలో ముఖ్యమైనవి. దేవుడు ఉన్నట్లు సాక్ష్యాలు లేవు కాబట్టి, ఇవి భగవద్దత్తం అనలేము. వంశ పారంపర్యం అని కూడ అనలేం. ఎవరికి వారు సాధించుకోవాల్సిందే.

Thursday, July 10, 2014

295 Sleep is NOT ONLY a human right, but also a natural right, we should n't grudge!! It should not be curbed.


295 నిద్ర మానవ హక్కు మాత్రమే కాదు, అది సహజహక్కు కూడ.


చర్చనీయాంశాలు: 295, నిద్ర, రాహుల్ గాంధీ, లోక్ సభ, ధరల పెరుగుదల


కంటి నిండా నిద్ర మానవ హక్కులలో ఒకటి. అది ఏ చట్టమో ప్రసాదించిన కేవల చట్టపరమైన హక్కు మాత్రమే కాకుండా, సహజసిధ్ధమైన హక్కు కూడ. మధ్యాహ్నం కునుకుని సియస్టా అని కూడ అంటారు. చైనా లో దీనికి మంచి ప్రోత్సాహం ఉంది.

సాధారణంగా స్త్రీ బాల వృధ్ధులు ఇంటిలో మధ్యాహ్నం పూట నిద్ర పోతూ ఉంటారు. ఎండా కాలం ఇది మరీ ఎక్కువ.

ఆయుర్వేదం ప్రకారం పగటి నిద్ర వాతాన్ని ప్రకోపింప చేసి, ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. పైగా, సాధారణంగా పగటి నిద్ర ఎక్కువైతే , రాత్రి పూట నిద్ర పట్టదు. అందు వల్ల పగలంతా దేహశ్రమ చేసి రాత్రిపూట కంటి నిండా నిద్రపోగలిగిన వాడికి ముఖేష్ అంబానీ కన్నా, చందా కొచ్చర్ కన్నా, ఇన్ ఫో సిస్ కొత్త సీ ఈ ఓ విశాల్ సిక్కా కన్నా ఎక్కువ జీతం వచ్చి , వాడు అద్భుతంగా సుఖపడుతున్నట్లు లెక్క.

శ్రీరాహుల్ గాంధీ ఇటీవలే యూరప్ ను, దక్షిణ అమెరికాను అలికేసి వచ్చారు. ఈసందర్భంగా నా పోస్టు నంబర్ 290 వొడల్ తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్ క్లిక్ click చూడండి.

శ్రీవారు చాల అలసి పోయి ఉండాలి. అందుకని పాలక బిజెపి శ్రీరాహుల్ గాంధీ నిద్రను డిస్టర్బ్ చేయరాదు. పైగా ''నిద్దురా పోరా సామీ, నా ముద్దూ మురపాల సామీ'' అని జోల పాడితే బాగుంటుంది.

కోడలు దిద్దిన కాపురం లో ఎన్ టీ ఆర్ ను నిద్ర పుచ్చినట్లుగా నిద్ర పుచ్చాలి. నిద్దురపోరా సామీ..

అహా.. నిద్దురపోరా సామీ.. నా ముద్దూ మురిపాల సామీ.. Sleep! My Lord! The Lord of my kisses and cuddles!

చలి రాతిరి తీరేదాకా.. తెల తెలవారే దాకా Till the cold night ends... till it dawns

నిద్దురపోరా సామీ... ఈ...Sleep! My Lord! The Lord of my kisses and cuddles!


మాయదారి మల్లెమొగ్గలు మత్తు జల్లుతాయేమో.. The deceptive jasmines may spray their bewitching scents on you!

జిత్తుమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమో...The cunning foxes may snatch you away

మాయదారి మల్లెమొగ్గలు మత్తు జల్లుతాయేమో..The deceptive jasmines may spray their bewitching scents on you!

జిత్తుమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమో...The cunning foxes may snatch you away


హోయ్.. సొందురూనీ చూపు తగిలి కందిపోతావేమో...hoy! You may get blushed when moon's looks hit you,

హోయ్.. సందురూనీ చూపు తగిలి కందిపోతావేమో...hoy! You may get flushed when moon's looks hit you,

ఈ చిన్నదాని చెంగు మాటున మోము దాచి.. ఆదమరచి..Hide your face behind this young damsel...forgetting yourself!


నిద్దురపోరా సామీ.. నా ముద్దూ మురిపాల సామీ..Sleep! My Lord! The Lord of my kisses and cuddles!


వైబీరావు గాడిద అభిప్రాయం



ఈసందర్భంగా మనం శ్రీరాహుల్ గాంధీని తప్పు పట్టవలసిన పనిలేదు. చిన్నబాబు తప్పేం లేదు.

అల్లాయుద్దీన్ ఖిల్జీ కాలం నాటినుండే మన దేశంలో ధరలు పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినపుడు 36 కోట్లు ఉన్న జనం, 120 కోట్లకు పెరిగినపుడు ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి?

ఇంకా 100 పేజీలు ఉంది, ఇంకోసారి.

Wednesday, July 9, 2014

294 Car first? Or Home first?


294 మొదట కారా? లేక మొదట ఇల్లా?


చర్చనీయాంశాలు: 294, జీవిత లక్ష్యాలు, కార్ల కొనుగోలు, ఇళ్ళ కొనుగోలు, బాలీవుడ్ హీరోలు


భారత్ లో ప్రతి పది మందిలో నలుగురు పేదవాళ్ళని ప్రధానమంత్రి గారి ఆర్ధిక సలహాదారు రంగరాజన్ గారు తేల్చి చెప్పారు. అయ్యగారి లెక్క ప్రకారం, నగరాలలో రోజుకి 47 రూపాయలు ఖర్చు చేయలేని వాళ్ళంతా బీదవాళ్ళే. ఇపుడు 120 కోట్లమంది భారతీయులలో 48 కోట్ల పేదలు లెక్క తేలినట్లు. అంటే మిగతా 72 కోట్ల మంది ధనవంతులా? స్వామి వివేకానంద, జవహర్ లాల్ నెహ్రూ వంటి వాళ్ళు గుర్రపు స్వారీ చేసినట్లు వారి జీవిత చరిత్రలు చెప్తాయి.

నా చిన్నప్పుడు మాగ్రామంలో, ఇళ్ళ ముందు గేదెలు, ఆవులు, దూడలు , గొర్రెలు, మేకలు కట్టేసి ఉండేవి. కాలగమనంలో వాటిలో చాల భాగం కనుమరుగు కాగా, కొంత కాలం ఇళ్ళముందు సైకిళ్ళు కనిపించేవి. సైకిళ్ళను పట్నంలో పాలు పోసి వస్తూ వస్తూ, గడ్డిమోపులో, ఎరువులు సంచులో వెనకాల వేసుకుని తెచ్చుకునే వాళ్ళు.



నేను, మా తాతల గ్రామానికి వెళ్ళి ముఫ్ఫయి ఏళ్ళు దాటాయి. బహుశా ఇపుడు అక్కడ ఇళ్ళ ముందు బైకులు నిలిపి ఉంటాయి. పాలుపోయటం వంటివి మారతాయని నేననుకోను. అదనంగా ఏమి వచ్చి ఉండచ్చంటే, విజయవాడ సమీపంలో ఉండి జాతీయ రహదారి దగ్గరలోనే ఉండటం ప్రతి ఎకరం భూమీ కోట్లలోకి వెళ్ళటం వల్ల, గ్రామాల్లో కోటీశ్వరులు చాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి అయ్యారు. నాలుగెకరాలు ఉన్నవాడు ఒక ఎకరం ఉన్నా, ఇంటి ముందు బైకును పెట్టుకోటం, పాలు పోయటం మానేసి, ఒక కారు కొనుక్కొని ఇంటిముందు కట్టేసుకుంటున్నాడు. తండ్రికి తెలియకుండా కొడుకు, కొడుక్కి తెలీకుండా తండ్రి చెరో పబ్బుకో బారుకో వెళ్తున్నారు. ఒకళ్ళు కత్రీనా కైఫ్ వంటి సుందరీమణి కొరకు వెతుక్కుంటే, ఇంకోళ్ళు దీపికా పాదుకొనే వంటి పొడుగుకాళ్ళ పట్టి కొరకు వెతుక్కుంటున్నారు. మరీ చికాగ్గా ఉన్నరోజు షిర్దీ శాయిబాబాను ప్రార్ధిస్తున్నారు. ప్రభుత్వం ఋణ మాఫీ పథకాన్ని ఆలస్యం చేయటం పై విరుచుకు పడుతున్నారు.


ఇపుడు చాలా తెలంగాణ, సీమాంధ్ర పట్టణాలలో, నగరాలలో, ఇళ్ళ ముందు గేదెలు లాగా కార్లు కట్టేసి ఉంటున్నాయి. అపార్టుమెంట్లలో కిరాయికి ఉండే వాళ్ళకి గ్యారేజీ పెద్ద సమస్య కాకపోవచ్చు. పోర్షన్లలో కిరాయికి ఉండే వాళ్ళకి తాము ఫైనాన్సు పెట్టి కొన్న బండైనా ఇంటిముందు నిలిపి ఉంచక తప్పటం లేదు. స్వంత ఇళ్ళు ఉన్నవాళ్ళుకూడ కొంతమంది పోర్టికోలు, గ్యారేజీలు, ఖాళీస్థలం లేక రోడ్డు మీదే వదిలేస్తున్నారు. ఇంకోరకం వాళ్ళు బధ్ధకస్తులు, ప్రతిసారీ గేటుతీసి కారును లోపల పెట్టటానికి బధ్ధకంతో రోడ్ల మీదే వదిలేస్తున్నారు.

స్వంత ఇల్లు కొనకముందే కారు కొని పారేసి సినిమా హాళ్లచుట్టూ, గుళ్ళచుట్టూ ఎక్కువమంది తిరుగుతున్నారని ఋజువు చేయాలంటే, ఇంటింటికి సర్వే చేయించాల్సి ఉంటుంది.

ఇల్లు కొనేదాక ఆగచ్చుగా అంటే, అందాకా ఆగేదెట్టాగా?

రంగరాజన్ గారి పదిలో నాలుగు పోగా, మిగిలిన ఆరుగురిలో ఎంతమందికి ఫైనాన్సు లేకుండా కార్లు కొనుక్కునే శక్తి ఉంది, ఫైనాన్సు తీసుకుని కార్లుకొని ఇన్స్టాల్ మెంట్లు కట్టే శక్తి ఉంది, మెర్సిడెజ్ బెంజి లాంటి కారుని స్వంత డబ్బులతో కొనుక్కునే శక్తి ఉంది, ఎంతమంది శక్తి ఉన్నా ఫైనాన్స్ తోనే కొంటున్నారు, ఇవన్నీ భేతాళుడు విక్రమార్కుడిని అడగాల్సిన ప్రశ్నలు.



బాలీవుడ్ నటుడు సిధ్ధార్థ్ మల్హోత్రా , స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర విఖ్యాతుడు, కారులేక కొంత అసౌకర్యానికి గురి అయి , ఏ మారుతీ ఆల్టో కారునో కొనుక్కోక, మెర్సిడెజ్ బెంజ్ నే కొనేసి, తన కిరాయి ఇంటి ముందు కట్టేసుకున్నాడుట.

ఆయన ఒకరోజు ముంబాయిలో దుప్పట్లో దిండ్లో కొనటానికి వెళ్తే, కొనటం పూర్తయ్యాక , దుకాణదారు అతడిని సినీహీరోగా గుర్తుపట్టి, తన పని వాళ్ళని కొన్నసరుకుని అయ్యగారి కారులో పెట్టమని పురమాయించాడుట. కానీ అయ్యగారు ఆ షాపుకి ఆటోపై వెళ్ళినందువల్ల కారు లేదని చెప్పుకోటానికి నామోషి అయ్యి , ''నాకింకా వేరే షాపింగు ఉంది, ఈ దిళ్ళని దుప్పట్లని ఆటోలో లోడ్ చేయమ''ని చెప్పి అక్కడనుండి బయట పడ్డాడట.

ఏక్ విలన్ అని ఇంకో సినిమా హిట్ అయినాక డబ్బులు వర్షించి ఉంటాయి. ఇపుడు మెర్సిడెజ్ కొన్నాడు. ఆసందర్భంగా, దక్కన్ క్రానికల్ వారు ప్రచురించిన, ఈ శ్రీ సిధ్ధార్ధుడి* (సిధ్ధార్ధ మల్హోత్రుడి) మాటలు చూడండి:

*సిధ్ధార్ధుడు అంటే తీరిన కోరికలు గలవాడు. ఎక్కడైనా మానవుడి కోరికలు ఎన్నటికైనా తీరుతాయా?


"...I have managed to buy a Mercedes. I am happy though commuting in a car is more time-consuming. How I wish I could ride on my bike. I do so sometimes and since I wear a helmet, no one recognises me. ..."

తెలుగు సారం: నేను ఒక మెర్సిడెజ్ కొనుక్కో గలిగాను. కారులో తిరగటం , కొంత టైము తిన్నా, నేను సంతోషంగానే ఉన్నాను. నాబైక్ మీద తిరగ గలగటాన్నే నేను ఎంతో కోరుకుంటాను. నేను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. నేను హెల్మెట్ ధరిస్తాను కాబట్టి ఎవరూ నన్ను గుర్తు పట్టరు.

''...That is a dream, for all of us newcomers in the city. Mercedes mili, ghar nahi mila! I have done just three films, so I am not in a position to buy a flat for myself here in Mumbai. I am saving money for that. ...''

తెలుగు సారం: ''...నగరానికి వచ్చే మాలాంటి కొత్తవాళ్ళందరికీ, అది ఒక కల. మెర్సిడెజ్ అయితే దొరికింది గానీ, ఇల్లు దొరకలేదు. నేను మూడు సినిమాలే చేశాను, కనుక నేను ముంబాయిలో ఒక ఫ్లాట్ కొనే స్థితిలో లేను. నేను దానికొరకు డబ్బు పొదుపు చేస్తున్నాను. ...''




వైబీరావు గాడిద అభిప్రాయం



మెర్సిడెజ్ ఒక తెల్ల ఏనుగేమోనని నా అభిప్రాయం. ఏమారుతీ ఆల్టోనో, ఇంకో బుల్లి ముండనో కొనుక్కొని ఉంటే, జేబుకి తేలికగా ఉండటమే కాకుండా, ముంబాయి రోడ్లలో తిరగటం తేలికయ్యేదేమో. కొన్ని లక్షల కార్లలో ఒకకారుగా ఉండేది కాబట్టి ఎవరైనా గుర్తు పట్తారేమో నన్న భయం తగ్గేదేమో. మెర్సిడెజ్ కి చిన్న సొట్టపోయినా రిపేరు లక్ష అవచ్చు. మారుతికి చిన్న సొట్ట అయితే పదివేలతో పోయేదేమో.

ఇవన్నీ మనబోటి సాధారణ పాఠకులకెలాగా తెలుస్తాయి. మనబోటి వాళ్ళు ఆలోచించాల్సింది, కిలో 45 రూపాయలు పెట్టి పాలిష్ బియ్యం కొనుక్కోటం నయమా, లేక కిలో 50 రూపాయలు పెట్టి సప్తమిశ్రమం మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి కొనుక్కోటం నయమా, అనే ప్రశ్నపై. ఈసారి కృష్ణా డెల్టాక్రింద వరి ఉండదు కాబట్టి కోస్తా వారు మెల్లమెల్లగా పాలిష్ బియ్యం తగ్గించుకొని, కిలోపాతిక రూపాయలకి లభించే ఇడ్లీ రవ్వను కొనుక్కుని రోజూ ఇడ్లీలు తినటమా, లేక సప్త మిశ్రమం గోధుమ రొట్టెలు తినటం నయమా?

పాపం ఉదయ్ కిరణ్ అనే స్వర్గీయ తెలుగు హీరో, ఇల్లు ముందు కొనుక్కోకుండా, కార్లు ముందు కొనుక్కొని బాధల పాలైనట్లు చరిత్ర చెప్తుంది.

ఎవరికైనా నా దృష్టిలో ఇల్లు ప్రధమప్రాధాన్యం కావాలి.

ఈసమస్యను మార్క్సిజం ఎలా పరిష్కరిస్తుంది??

జవాబు: ఇల్లు (క్వార్టర్) ఉచితం, మరియు గ్యారంటీ. వంశ పారంపర్య హక్కు ఉండదు. వ్యక్తిగత కార్లు కుదరదు. కుటుంబకార్ల విషయాన్ని దేశం పురోగతి చెందాక ఆలోచించ వచ్చు అనే అభిప్రాయము ఉన్నా, నాదృష్టిలో సిసలైన మార్క్సిజంలో కుటుంబ వ్యవస్థయే ఉండదు. కాబట్టి కుటుంబానికొక కారు ప్రశ్న తలెత్తక పోవచ్చు. శిశువులు తల్లుల కడుపులో పడీ పడకముందే వారికొరకు ఇళ్ళు, హాస్పిటల్ బెడ్ లు, హాస్టల్ బెడ్ లు, రూంలు, వాళ్ళు పెరుగుతున్నకొలదీ వారికి క్వార్టర్లూ నిర్మించాల్సి ఉంటుంది. అఛ్చేదిన్ అంటే అవి. నరేంద్ర మోడీగారు చెప్పేవి, అరుణ్ జైట్లీ గారు చెప్పేవీ కావు.

Tuesday, July 8, 2014

293 Indian Parliament may need breath-analysers at entrances


293 లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశ ద్వారాల వద్ద శ్వాస పరీక్షా యంత్రాల అవసరం ఉందేమో.
చర్చనీయాంశాలు: 293, లోక్ సభ, TMC, BJP, Rail Budget, Breath-analysers, బిజెపి, మద్యం


ప్రజాస్వామ్యంలో చట్టసభలంటే చాల పవిత్రమైన వ్యవస్థల క్రింద లెక్క. కానీ భారత్ లో (మిగతా దేశాల సంగతి మనకి అంతగా అవసరం లేదు) చట్టసభల పరిస్థితి చూస్తుంటే మనం ఆటవిక సమాజంలో ఉన్నామా అనే అనుమానం కలుగక మానదు. ఋజువు: రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టాక, లోక్ సభలో ధరల పెరుగదల పై తృణమూల్ సభ్యులు ఆందోళన వెలిబుచ్చటానికి పూనుకున్నారు.

వారు కొంత వోవర్ యాక్షన్ చేసి ఉండ వచ్చు. ''నరేంద్ర మోడీ చోర్ హై'' అని నినాదాలు చేయటం మొదలు పెట్టారు. గత ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ధరల పెరుగుదలకి నరేంద్ర మోడీ బాధ్యత లేదు అనేది అందరికి తెలుసు. ఆయనని దొంగ అనటం తప్పే కావచ్చు. అంతలోనే బిజెపి సభ్యులకి ఆగ్రహం ముంచుకు వచ్చి తృణమూల్ సభ్యులపై దాడి చేసారుట.

ఈ దాడి చేయబడిన వారిలో తృణమూల్ మహిళా సభ్యురాళ్ళు ఇద్దరు ఉన్నారు. వారు చెప్పిన దాని బట్టి చూస్తే దాడిచేసిన బిజెపి సభ్యులు మద్యం మత్తులో ఉన్నారు.

బిజెపి సభ్యులు ఈ ఆరోపణలను ఖండించారనుకోండి.


ఈరోజు నవభారత్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఈహిందీ వార్తా భాగాన్ని చదవండి. మొత్తం చదవాలనుకునే వారికి లింకు: క్లిక్ click
''...टीएमसी सांसद काकोली घोष ने इस हंगामे पर कहा, 'हम रेल बजट के विरोध में शांति से नारे लगा रहे थे। बीजेपी के शराब पिए हुए एक सांसद अपने पांच-छह साथियों के साथ हम पर हमला करने के लिए आए। उन्होंने महिलाओं को गंदी गालियां भी दीं।' उधर, बीजेपी सांसद राजभर ने काकोली घोष के इन आरोपों को झूठा करार दिया। तृणमूल की दूसरी महिला सांसद शताब्दी रॉय ने कहा कि हम लोकसभा में शांति से विरोध कर रहे थे, तभी दो बीजेपी सांसद ने हम पर हमला किया और धमकाया। उन्होंने कहा कि उन्हें शक है कि ये सांसद नशे में थे।...''

తెలుగు సారం: తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కాకోలీ ఘోష్ ఈ హంగామా గురించి ఇలా అన్నారు: ''మేము రైల్వే బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సభలో నినాదాలు చేస్తున్నాము. మద్యం తాగి ఉన్న ఒక బిజెపి సభ్యుడు, తన ఐదారుగురు సహచరులతో పాటు మా మీద దాడి చేయటానికి వచ్చాడు. వాళ్ళు మహిళలను మురికి తిట్లుకూడ తిట్టారు.''. అటునుండి చూస్తే, బిజేపీ సభ్యుడు రాజభర్ గారు , శ్రీ కాకోలీ ఘోష్ గారి ఈ ఆరోపణలను అబధ్ధాలని కొట్టి పారేశారు. తృణమూల్ యొక్క రెండవ మహిళా సభ్యురాలు శతాబ్దీ రాయ్ గారు ఇలా అన్నారు: ''మేము లోక్ సభలో శాంతియుతంగా మా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాము. అప్పుడు ఇద్దరు భాజపా సభ్యులు మాపై దాడి చేశారు మరియు బెదరగొట్టారు. వారు (తృణమూల్ మహిళా సభ్యురాళ్ళు అనుకోవాలి): ఆ సభ్యులు మద్యం మత్తులో ఉన్నారని మాకు అనుమానం.''


వైబీరావు గాడిద అభిప్రాయం



మామూలుగా రోడ్డు మీద పోయే బైకుల వారిని, చిన్నకార్లవారినే, పోలీసులు ఎక్కడ బడితే అక్కడ ఆపి బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షించి చలానాలు వ్రాసి జరీమానాలు వేస్తూ ఉంటారు. పనిలో పనిగా తమ జేబులు కూడ నింపుకుంటూ ఉంటారు.

లోక్ సభలో మద్యం మత్తులో ఉన్న సభ్యులు దాడులకి దిగారు అనేది చాల తీవ్రమైన ఆరోపణ. ఏమాత్రం సహించరానిది. అప్పటికప్పుడే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ గారు బ్రీత్ ఎనలైజర్లను తెప్పించి, పార్టీల తేడాలు చూపకుండా, లింగ వివక్ష చూపకుండా, ఆ తొక్కుడు లో పాల్గొన్న సభ్యులు, సభ్యురాళ్ళ నందరినీ, ఆల్కహాల్ కంటెంట్ పరీక్షింప చేస్తే నిజానిజాలు బయట పడేవి.

బిజెపి సభ్యులందరూ సాధువులు, సంతుల క్రింద లెక్క. వారు మద్యపానానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండాలి. మిగిలిన పార్టీల సభ్యులు అందరూ సాధు సంత్ లు కాకపోయినా, ప్రజలందరికి బోధలు చేసే అధికారం ఉన్నవారే కాబట్టి, వారు కూడ మద్యానికి పదివేల కిలోమీటర్ల దూరంలో ఉండాలి. మా శీలాన్నే శంకిస్తూ మమ్మల్నందరినీ తాగుబోతుల క్రింద పరిగణిస్తున్నారా, అని సభ్యులు అవమాన భారంతో బాధ పడనక్కర లేదు. మూసలోపోసి కరిగించబడిన బంగారం ఉష్ణోగ్రతకు గురి యైనా, ప్రకాశించటం మానదు కదా. బంగారానికి విలువ అగ్ని లేక నైట్రిక్ యాసిడ్ పరీక్షకు గురియైనప్పుడేకదా.

సుమిత్రా మహజన్ గారు బ్రీత్ ఎనలైజర్ లను ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదో, వివరిస్తే బాగుంటుంది.

Monday, July 7, 2014

292 India has to look into its roots with Latvia, Lithuania, Estonia, Sudovia, Old Prussia and Balkans.


292 భారత్ లాట్వియా, లిథుయేనియా, ఎస్టోనియా, సుడోవియా, పాత ప్రష్యా, మరియు బాల్కన్ దేశాలతో ఉన్న తన మూలాలను అధ్యయనం చేయాలి.
చర్చనీయాంశాలు: 292, లాట్వియా, లిథుయేనియా, సుడోవియా, ఎస్టోనియా, బాల్కన్స్, సంస్కృతం, ఆర్యులు


ఈమధ్య ఒక మిత్రుడు తనకు ఉండే ఒక సందేహాన్ని వేరొక మిత్రుడు చాలా చక్కగా నివృత్తి చేశాడని చెప్పాడు. దురదృష్ట వశాత్తు ఆ సందేహాన్ని ఎలాంటి సమాచారంతో, వివరణలతో నివృత్తి చేశాడో అడగటానికి వీలు చిక్కలేదు. సందేహం ఏమిటంటే: భారత దేశంలో ఉండే వైశ్యులు ఆర్యులమని చెప్పుకుంటారు, నిజంగా ఆర్యులేనా?

ఈ ప్రశ్నకు జవాబివ్వటానికి ఎక్కడా చరిత్రరచన శాస్త్రానికి, ఆధునిక సైన్సుకి నిలిచే సరియైన సాక్ష్యాధారాలు లేవు. ఆ నివృత్తి కర్త ఎలా ఈ ప్రశ్నకు జవాబిచ్చాడో గానీ, ఈ ప్రశ్నకు ఎవరూ జవాబివ్వలేరు.

నిజానికి వైశ్యులే కాదు, భారత్ లో ఏ కులం వారు, తెగ వారు కూడ ఫలానా ఆర్యులు, ద్రావిడులు, మంగోలులు, ఇంకొకళ్ళు అనిచెప్పటానికి సాక్ష్యాలు లేవు. వర్ణ సంకరం జరగకూడదని (ఉదాహరణ: మహా భారతంలో, భగవద్గీతలో , అర్జున విషాదయోగంలో అర్జునుడు) కొన్ని వర్గాల వారు ఆరాటపడి కులాంతర వివాహాలు జరగకుండా రకరకాల నియమాలు పెట్టి ప్రజలను నానారకాలుగా వేధించినా, మిక్సింగ్ జరిగిపోయింది. నేడున్న భారతీయులందరు హైబ్రిడ్ విత్తనాల లాంటి వాళ్ళే. వీళ్ళు ఫలానా, వాళ్ళు ఫలానా అని, రంగు బట్టో, ముక్కు బట్టో, జుట్టు బట్టో పెదవులను బట్టో చెప్పటానికి వీలులేదు. భారతీయుల రక్తంలో ఆర్య, ద్రావిడ, ఆఫ్రికన్, మంగోల్, చైనీస్, గ్రీకు (యవన), సెమిటిక్ (పశ్చిమాసియా ప్రాంత) మొ|| నానా జాతుల రక్తం కలసి ఉంది. ఇలా అన్నీ కలసి ఉండటానే, మనం ఎన్ని కష్టాలు వచ్చినా, నిబ్బరంతో ఎదుర్కో గలుగుతున్నాం; హాయిగా తన్నుకోగలుగుతున్నాం.

ఆర్యులు మధ్య ఆసియానుండి భారత్ పై దాడి చేశారని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ మధ్యఆసియా ప్రాంతాన్ని మనం ఉక్రెయిన్, కజకిస్థాన్, మొ|| సోవియట్ రష్యా విభజిత దేశాలుగా భావించాలి.

ఆర్యులు ధృవ ప్రాంతాలనుండి వచ్చారని స్వర్గీయ లోక మాన్య బాలగంగాధర తిలక్ గారు అభిప్రాయ పడ్డారు.

ఈసందర్భంగా నేను చేసిన అధ్యయనాలు, ఉత్తరధృవానికి అత్యంత సమీపంలో ఉన్న నార్వే, స్వీడన్ దేశాలనుండి (లోకమాన్య తిలక్ గారి అభిప్రాయానికి అనుగుణంగా ) ఆర్యులు బయలుదేరి వాటికి ఆగ్నేయంగా ఉన్న బాల్కన్స్ దేశాల్లో ఉన్న లాట్వియా, లిథుయేనియా, సుడోవియా, ఎస్టోనియా దేశాల్లోకి వచ్చినట్లు, అక్కడనుండి దక్షిణంగా వెళ్ళి పోలెండు, రుమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్ దేశాల మీదగా, ఇరాన్ (పర్షియా) కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఇరాన్ నుండి భారత్ కు అక్కడనుండి, ఇండోనేషియా, మలేసియా, థాయ్ లాండ్, కాంబోడియా, వియత్నాం, దక్షిణ చైనా సముద్రతీరం వరకు వెళ్ళినట్లు కనిపిస్తుంది.

ఈ సిధ్ధాంతానికి భిన్నంగా, ఆర్యులు భారత్ లోనే జన్మించి ప్రపంచం మొత్తాన్ని జయించారనే మతవిశ్వాసాల కనుగుణమైన నమ్మకం కూడ ఉంది.

లాట్వియన్, లిథుయేనియన్, సుడోవియన్, ఎస్టోనియన్, ఓల్డ్ ప్రష్యన్ మొ|| దేశాల భాషల పదజాలములు , వాక్యనిర్మాణములు, సంస్కృతానికి చాల దగ్గరగా ఉంటాయి. ఆంగ్లం, సంస్కృతాలు కూడ ఇండో యూరోపియన్ ప్రొటోటైప్ అనే ప్రాచీన స్కాండినేవియన్, నార్త్ యూరోపియన్ (నార్వే, స్వీడన్, ఉత్తర జర్మనీ, డెన్మార్క, ఫిన్ లాండ్, బాల్కన్స్ దేశాల అతి ప్రాచీన భాష)నుండి పుట్టటాన, అవి సోదర భాషలు గా అయ్యాయి. ఫాదర్-పితృ, మదర్-మాతృ, బ్రదర్-భ్రాతృ, అస్తి-ఈజ్, వయం-వుయ్ (వి), అస్మాకం-అజ్, యువం-యు, ఇలాగ ఆంగ్లంయొక్క అత్యవసర మూల పదాలన్ని ఇండో యూరోపియన్ ప్రొటోటైప్ కి చెందినవే. వీటిని ఆంగ్లం తెలిసిన కొందరు సంస్కృత పండితులు గుర్తించి, సంస్కృతంలోంచే ఆంగ్లం పుట్టింది అనే సిధ్ధాంతాన్ని లేవదీశారు.

దురదృష్టవశాత్తు యూరప్ మొత్తం రోమన్ కేథలిక్కుల దాడికి గురైంది. ఇంగ్లండుకూడ ఫ్రాన్సు, జర్మనీ లనుండి దాడులకు గురి అయ్యింది. ఇంగ్లీషులోకి ఫ్రెంచి, మొ|| భాషల పదాలు జొరబడి, ఇండో యూరోపియన్ ప్రొటోటైపు పదాలను మూలకి నెట్టాయి. లాట్వియన్,లిథుయేనియన్, సుడోవియన్, ఎస్టోనియన్, ఓల్డ్ ప్రష్యన్ (ఈ ఓల్డ్ ప్రష్యా బాల్కన్స్ లోనిది. దీనికి జర్మనీలోని బిస్మార్కుగారి ప్రష్యాకి, ఇరాన్ లోని పర్షియాకి ఏసంబంధం లేదు), భాషల్లోకి కూడ ఆంగ్లపదాలు బాగా చొరబడి, ఇండోయూరోపియన్ మూలాలను వెనక్కి నెట్టేశాయి. అయినా కూడ, బాల్కన్స్ దేశాలు ముఖ్యంగా లాట్వియన్లు, కొంతమేరకు లిథుయేనియన్లు తమ పూర్వ సంస్కృతిని మర్చిపోలేదు. కేథలిక్కులు ప్యాగన్ గా ఛీ కొట్టిన (క్రిస్టియానిటిలో క్రీస్తుని నమ్మని వారంతా ప్యాగన్ లే. ఇస్లాంలో అల్లాని నమ్మని వారంతా కాఫిర్ లే. ఆర్య మతంలో ఆర్య దేవతలను నమ్మని వారంతా మ్లేఛ్ఛులే), తమ ప్రాచీన జానపద సంస్కృతిని వారు పునరుధ్ధరించుకోవాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.

ఈసందర్భంగా, లాట్వియా లిథుయేనియా భాషలతో మనకుగల దగ్గర సంబంధాన్ని అధ్యయనం చేయాలనుకునే వారు నా బ్లాగ్ ఇండోయూరోపియన్ డిక్షనరీవైబీ.బ్లాగ్ స్పాట్.కామ్http://indoeuropeandictionaryyb.blogspot.in/ కి వెళ్ళటానికి క్లిక్ ను అధ్యయనం చేయవచ్చు. అక్కడ లాట్వియన్ అనే యూజర్, లాట్వియన్ భాషలోంచి, ఏరి జోడించిన వేయికి పైగా పదాలను గమనించ వచ్చు.

ఈసందర్భంగా లిథుయేనియాలోని అతిథి సత్కారాల సంప్రదాయాన్ని అధ్యయనం చేద్దాం. ఈ కోట్ దక్కన్ క్రానికల్ దినపత్రిక, టాబ్లాయిడ్ పేజీ నంబరు 27, తారీకు 5.7.2014 శనివారం, నుండి సేకరించినది. శీర్షిక పేరు టిపుల్. ఈ శీర్షికను నిర్వహిస్తున్నది మినీ రెబిరో అనే మహిళామణి. శీర్షిక లక్ష్యం, మద్యం యొక్క రసికత్వ విద్యను ప్రోత్సహించటం కావచ్చు.
ఈ శీర్షికలో, పైభాగంలో వ్రాసిన మూడు ఐటమ్స్ లో , కుడివైపు చివరిది డీసీ కరస్ పాండెంట్ గారు వ్రాసినది, మన లిథుయేనియా అంశం.
ఇపుడు ఆంగ్లంలో కోట్ చేస్తాను.


Krupnika defines Lithuania.



Krupnik (Polish), or Krupnikas (Lithuanian), is a traditional sweet alcoholic drink similar to a liqueur, based on grain spirit (usually vodka) and honey, popular in Poland and Lithuania. At 40% ABV, it is a pale yellow-gold spirit with a flowery nose. The mouth-feel is thinner than most sweet liqueurs, and it tastes very much like it smells, except it also tastes very alcoholic. Honey is the main ingredient, but the highlight involves all those spices and 50 different herbs. It may served hot, at room temperature or chilled.

In Lithuania, it is common practice to bring a gift if you are visiting someone's home. An appropriate gift is a bottle of Krupnika. However, whether or not you have brought some, your host should produce a bottle of Krupnika on your arrival and pour you a shot. Tradition has it that you look your host in the eye and say "I sveikata" (cheers), then down that shot. Casually pour a shot for the person to your left, and they should likewise address you before taking the shot. The bottle goes around the table in this way until it is finished. Apparently in Lithuania, a drunk guest is a happy guest. Nobody's complaining.

తెలుగు సారం: కృప్నిక్ (పోలిష్ భాష) లేక కృప్నికాస్ (లిథుయేనియన్ భాషలో) ఒక సంప్రదాయిక , మధుర మద్యం , ధాన్యం ఆధారిత సారాయి (సాధారణంగా వోడ్కా), మరియు తేనె ఆధారితమైనది, పోలెండ్, లిథుయేనియా దేశాలలో జనాదరణ పొందినది. 46% ఆల్కాహాల్ తో, పాలిపోయిన బంగారు పసుపు రంగుతో, ఈ మద్యం పుష్ప సౌరభం కలిగి ఉంటుంది. ఇతర మధుర మద్యాలతో పోలిస్తే నోరంత థిన్నర్ ఫీల్ అవుతుంది. (వైబీగాడిద వివరణ: పల్చన అంటే బహుశా ఇతర స్వీట్ మద్యాలతో పోలిస్తే తక్కువ చిక్కగా ఉండటం వల్ల నోరంతా తక్కువ నిండినట్లు ఫీల్ అవుతుందేమో అని మనం అర్ధం తీసుకోవచ్చేమో. తాగే వాళ్ళకే తెలియాలి). అది ఎలా వాసన వస్తుందో, అలాటి రుచినే కలిగి ఉంటుంది; మినహాయింపుగా, అదనపు ఆల్కాహాలిక్ రుచి కలిగి ఉంటుంది. (వైబీగాడిద: 46% కదా. యూరియాలో నత్రజని శాతంలాగా). ముఖ్య పదార్ధం తేనెయే. అయితే హైలైట్ ఏమిటటే, ఇంకా పలు సుగంధ ద్రవ్యాలు, 50 దాకా మూలికలు కలుస్తాయి. దీనిని వేడిగానూ, గది ఉష్ణోగ్రతలోనూ, శీతలీకరించి గానీ సేవించ వచ్చు.

లిథుయేనియాలో, అతిథులు తమకు ఆతిథ్యం ఇచ్చేవారి ఇళ్ళకు వెళ్ళేటపుడు, ఏదో ఒక బహుమతి తీసుకెళ్ళే కామన్ ఆచారం ఉంది. ఒక కృప్నికా సీసా చక్కని బహుమతిగా అమరుతుంది. మీరు కృప్నికా సీసాను మీ ఆతిథ్యదాత ఇంటికి తీసుకెళ్ళినా, తీసుకువెళ్ళకపోయినా, మీరు వెళ్ళగానే, మీ ఆతిథ్యదాత గారు కృప్నికా బాటిల్ ను తెరిచిమీముందు ఒక షాట్ పోసి మీకు ఆఫర్ చేయాలి. సంప్రదాయం ప్రకారం, మీరు మీ ఆతిథ్యదాత గారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి, ''ఐ స్వీకతా (ఛియర్స్)'' అనాలి. అపుడు ఆ షాట్ మద్యాన్ని గొంతులోకి దించుకోవాలి. మీకు ఎడమప్రక్కన కూర్చున్నవారి గ్లాసులోకి కృప్నికాను పోసాక, వారు కూడ అలాగే '' ఐ స్వీకతా '' చెప్పాలి. ఆసీసా అలా రౌండు తిరిగి టేబుల్ చుట్టి వస్తుంది (సీసా ఖాళీ అవచ్చు). లిథుయేనియాలో త్రాగిన అతిథి సంతృప్తుడు గనుక హేపీ గెస్ట్ క్రింద సహించబడతాడేమో. ఫిర్యాదులేమీ ఉన్నట్లు లేవు.

ఇంకా ఉంది.


వైబీరావు గాడిద అభిప్రాయం



త్వరలో వ్రాస్తాను. ఈలోగా ఓపిక ఉన్నవారు, శ్రీరాముడు సీతకు తాగించిన మద్యాన్ని వాల్మీకి రామాయణంలోనూ, శ్రీకృష్ణుడు తన అష్టపత్నులకు త్రావించిన మద్యాన్ని, అర్జునుడు ద్రౌపది, సుభద్రలకు అందించిన మద్యాన్ని మహాభారతంలో ఆదిపర్వం ఖాండవ దహనం ముందు ఆధ్యాయంలో, ఈకృప్నికతో పోల్చి పరిశీలించుకోవచ్చు. ఈ మూడు మద్యాలు కూడ తేనె ఆధారితాలే.

291 Left leaders can never behave like Regional leaders


291 వామ పక్షనేతలు ప్రాంతీయనేతల వలె మాట్లాడటం వామపక్ష సిధ్ధాంతాలకు వ్యతిరేకం.
చర్చనీయాంశాలు: 291, వామపక్షాలు, రాయలసీమ, సిపిఎమ్, సిపిఐ, కోస్తా, రామ్ టెక్


ఆంధ్ర ప్రదేశ్ సీపీఎమ్ ప్రధానకార్యదర్శి, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ బివిరాఘవులుగారు ''ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు '' అనే సభలో అన్నట్లుగా పత్రికలలో వచ్చిన వార్తను చూడండి.







''...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే అయినప్పటికీ, అక్కడి ప్రజలకు సమన్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ...''

English gist: "...Though Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, Opposition Leader Jaganmohan Reddy, both belong to Rayalaseema, there is no faith that justice will take place to those people. ..."







వైబీరావు గాడిద అభిప్రాయాలు



ఈ మాటలు ఒక ప్రాంతీయ పార్టీ నేత మాట్లాడవలసినవే కానీ, అఖిల భారత పార్టీకి చెందిన నేత మాట్లాడవలసినవి కాదు. ముఖ్యంగా వామ పక్షనేతలు మాట్లాడ వలసినవి కాదు.

అఖిలభారత పార్టీల నేతలు ప్రాంతీయ సమన్యాయం కొరకై కృషి చేయటంలో, వాదించటంలో తప్పు లేదు. కానీ, ముఖ్యమంత్రులు ఒక ప్రాంతానికి చెందిన వారు కాబట్టి వారు ఆప్రాంతానికి దోచిపెట్టటం, అభివృధ్ధి ప్రాజెక్టులను మళ్ళించటం సరియైన పధ్దతి కాదు. ఇలాంటి తమ నియోజక వర్గాలకు నిధులను , ప్రాజెక్టులను దోచిపెట్టే పధ్ధతిని అమలు చేసి, మనకి ఆదర్శంగా ఉండాల్సిన అగ్రనేతలైన సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు, తమతమ నియోజక వర్గాలలో తమ విజయాలను ఖాయం చేసుకున్నారు , కానీ తాము చేస్తున్న విద్రోహం తమను ప్రాంతీయ నేతల స్థాయికి దిగజారుస్తున్న సంగతి మర్చిపోయారు.
ఈ పధ్ధతులకు స్వర్గీయ పివి నరశింహారావు కొంత మినహాయింపు గా ఉండేవారు. అందుకే, ఆయన ఒకే నియోజక వర్గం నుండి రెండు సార్లు గెలవటం కష్టమైపోయి మహారాష్ట్ర రామ్ టెక్ నుండి పోటీ చేసినట్లు గుర్తు.






నిజంగా అఖిల భారత నేతగా జీవించటం వేరు, నటించటం వేరు


శ్రీ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండగా, కొందరు తెలంగాణ నేతలు ఆయనను కలిసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అడుగగా, నేను భారత దేశానికి మంత్రిని కానీ, తెలంగాణకు మంత్రిని గాను అన్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత ఆమహనీయుడే, తనకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బంగారు పళ్ళెంలో లభిస్తుందనే ఆశ కలిగే సరికి ప్రాంతీయనేతగా మారిపోయి ప్లేటు మార్చేశాడు.









వామ పక్షాలకు వామ పక్షాల సిధ్ధాంతాలు ప్రాధాన్యం కావాలి, ప్రాంతీయ రెచ్చ గొట్టుడులు కాదు



వామ పక్ష పార్టీల ప్రధాన సిధ్ధాంతం సామ్యవాదం. ఇందులో కీలకం ప్రైవేటు ఆస్తిని నిర్మూలించటం. ధనం యొక్క పాత్రను సమూలంగా పెరికి వేయటం. అసమానతలను కూకటి వేళ్ళతో పెకలించటం. ప్రాంతీయవాదం పై దృష్టి పెరిగిన కొద్దీ మూలసిధ్ధాంతం మూల పడుతుంది. దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్ వలెనే, కమ్యూనిస్టులు కూడ మైనారిటీ వోట్లకోసం తహతహలాడుతూ కొంత మతాన్ని నెత్తిన రుద్దుకోటం జరుగుతున్నది. ఫలితంగా, హిందువులందరు, బిజెపి దిశగా వెళ్ళటం జరిగింది. కమ్యూనిజం ప్రకారం మతం అనేది పేదలు తమ బాధలను మర్చిపోవటానికి పెట్టుబడిదారులు వాడే మత్తు మందు. భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తులు, గుడులు, చర్చీలు, మశీదులు మొ|| ప్రార్ధనా మందిరాలు కట్టిస్తుంటే, పేదలు వాటిలోకి వెళ్ళి ఉన్నాడో లేడో నిర్ధారించబడని దేవుడిని ఎలుగెత్తి ప్రార్ధించుకుంటూ, తమ కష్టాలు ఏనాటికైనా తీరతాయిలే అనే ఆశతోనే చివర రోజులు గడపటం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు మతాన్ని ఇంటిలోపల జరిగే ప్రార్ధనలకే పరిమితం చేయించే దిశలో ప్రజలకు నచ్చచెప్పాలి. దీని వల్ల సామూహిక స్థలాలలో మతవైషమ్యాలు పెరగవు.

ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేది కూడ భూస్వాములు, పెద్ద వర్తకులు, పారిశ్రామిక వేత్తలు, ఘరానా డాక్టర్ లాయర్ యాక్టర్ వంటి ప్రొఫెషనల్సే. వామపక్షాలు వీటికి దూరంగా ఉండాలి. ఉదాహరణకు, సిపిఐ శ్రీనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో అతిగా పాల్గొని చివరికి ఏమి సాధించారు? ఆంధ్రలో వామ పక్షాల స్థితి ఎలా ఉందో తెలంగాణలో కూడ అలానే ఉంది. శ్రీరాఘవులు గారు ఈ సత్యాన్ని గ్రహించక పోతే ఎండమావులలో నీళ్ళున్నాయనుకుని పరుగెత్తి సృహ కోల్పోయి నట్లవుతుంది. శక్తియుక్తులను ప్రాంతీయ, కుల, మత, స్థానిక సమస్యలపై వృధా చేసుకోకుండా, ఏకోన్ముఖంగా కృషి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న: వామ పక్షాల ఐక్యత అవసరమా?


దేశంలో ఒకటే వామ పక్షం (లేక వామ పక్షాల ఫ్రంటు) ఉంటే ప్రజలు దానితో అసంతృప్తి చెందితే ఎవరికి పట్టం కట్టాలి? బెంగాల్ లో జరిగిందిదే. ప్రధాన ప్రతి పక్షం కూడ వామ పక్షమే అయితే, ఎవరు గెలిచినా కర్షక కార్మిక వర్గమే అధికారంలోకి వస్తుంది కాబట్టి, శ్రామిక వర్గ నియంతృత్వం (dictatorship of proletariat) సాక్షాత్కారమవుతుంది. అందుకని శ్రీ ప్రకాశ్ కారత్ గారు, శ్రీ సీతారాం ఏచూరి గారు, శ్రీరాఘవులు గారు, శ్రీ నారాయణ గారు, ఈ వామ పక్షాల ఐక్యత, ఒకే తాటి క్రిందికి రావాలి అనే అరిగిపోయిన రికార్డును వదిలేసి వామపక్షాలమధ్యే ప్రధానపోటీ అనే కొత్త సిధ్ధాంతానికి ఊపిరి పోయాలి. భూస్వామ్య పార్టీలను, పారిశ్రామికవేత్తల పార్టీలను, రంగంనుండి తప్పుకునేలాగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి.

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లా లు రాయలసీమ కన్నా ఎక్కువ అభివృధ్ధి చెందాయా?



జవాబు: ఇది ఒక భ్రమ. ఈనాలుగు జిల్లాలలో జనాభా వత్తిడి అధికంగా ఉండటం వల్ల, గ్రామాలు దగ్గర దగ్గరగా ఉండటం, గ్రామాలు పట్టణాలుగా మారటం జరిగినందు వల్ల, వీధిలైట్లూ, ఇళ్ళల్లో లైట్లూ ఎక్కువగా వెలుగుతూ ఉండటం, జనాభాకు తగినట్లుగా అధిక సంఖ్యలో దుకాణాలు ఎక్కువగా ఉండటం, రహదారుల వెంట ధాబాలు, వైన్ షాపులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఏదో అభివృధ్ధి జరిగిందన్న భ్రమ కలుగుతుంది. ఇళ్ళు, జనం ఎక్కువగా ఉంటే అభివృధ్ధి జరిగింది, ఇంక ఈప్రాంతంలో పేదలు లేరు, లేక ఈపేదలకు ఏమీ చేయనక్కరలేదు అనుకుంటే, అది ఘోర తప్పిదమవుతుంది.

ఈమధ్య నేను, బాగా అభివృధ్ధి చెందిన జిల్లాలుగా ముద్రబడిన తూగోజీ, పగోజీ లలోని అమలాపురం, తణుకు పట్టణాలలో ఇళ్ళు , అపార్టుమెంట్ల నిర్మాణాలపై ఒక సర్వే చేశాను. దానిలో బయట పడిన విషయం విస్మయకరమైనది.

దేశంలో వ్యవసాయయోగ్యమైన భూమికి కరువుగా ఉన్నందున, అందులోను గోదావరి డెల్టా వంటి గ్యారంటీ సాగునీరు ఉన్న భూములకు డిమాండు విపరీతంగా ఉన్నందున భూముల ధరలకు, కౌళ్ళకు రెక్కలు వచ్చాయి. కొన్ని చోట్ల ఎకరం కోటి రూపాయల దాకా పోయింది. కాని వరిసాగు చేస్తే బురదలోకి తాము దిగాల్సిరావటం భూస్వాములకు, మధ్యస్థాయి రైతులకు రుచించలేదు. వారు తెలివిగా, తమ భూములలో ఒక ఎకరాని అధిక ధరకు అమ్ముకొని కొన్ని లక్షలరూపాయలు వస్తే, వాటిలో ఒక 20 లక్షలు దాకా ఖర్చు చేసి తణుకు, అమలాపురం, భీమవరం, రావులపాలెం, రాజమండ్రి వంటి పట్టణాలలో, ఫ్లాట్లు, ఇండిపెండెంట్లు ఇళ్ళు తీసుకొని పిల్లలను ఘరానా ప్రైవేటు స్కూళ్ళలో చేర్చి , ఇంట్లో ఏసీలు బిగించుకొని ఘరానా జీవనం మొదలు పెట్టారు. పొలం అమ్మిన డబ్బులను వడ్డికి తిప్పుతూ, లేక బ్యాంకుల్లోనో, చిట్ ఫండ్లలోనో వేసి నెలవారీ వడ్డీ తింటం, నెలకు 6 వేలు 7 వేలు వచ్చే ఇస్త్రీ గుడ్డలు నలగని ఉద్యోగాలు, వృత్తుల్లోకి దిగటం జరుగుతున్నది. గ్రామాలలో, మిగిలిన పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలురైతులు కౌలు చెల్లించలేక చస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఋణ మాఫీలు వంటివి ఇస్తే వాటిని కూడ పట్టణాల లోని యజమానులు స్వాహా చేస్తున్నారు.

కోస్తా జిల్లాలలోని (కొందరు) భూస్వాములకి, వ్యాపారులకి, పారిశ్రామిక వేత్తలకి మన చంద్రబాబు నాయుడిగారాలాగా, నరేంద్రమోడీగారి లాగా '' షో '' ఎక్కువ, కోతలు ఎక్కువ, పని చేయటం తక్కువ. సినిమా రంగంలోకి వాళ్ళు ప్రవేశించి, థియేటర్లను గుత్తగా కొని, లేక కిరాయికి తీసుకోటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం, ఏసీ నాన్ వెజ్ హోటళ్ళు, ఫిలిమ్ సిటీలు, హోయ్ హోయ్ ఎమ్యూజ్ మెంటు పార్కులు కట్టటం, రీయింబర్స్మెంటు కాలేజీలు కట్టటం, డొనేషన్లు కట్టి పిల్లలను డాక్టర్లు చేయించటం, మొ|| నానావిధ టక్కుటమార విద్యలలో వాళ్ళు రాటు తేలిపోయారు. అందు వల్లనే చంద్రబాబుగారు ఇలాగా 'రాజధాని విజయవాడ సమీపంలో ఉంటుంది' అనగానే భూములు నాలుగు రెట్లుపెరిగాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే లక్షణం ఎక్కువ.

ఈ లక్షణాలన్నీ పేట్రేగి పోయినపుడు కోస్తా జిల్లాలలో అందరూ ధనవంతులే, అనే అభిప్రాయం కలగక మానదు. సత్యం తత్ విరుధ్ధం. రాయలసీమలో వలెనే, ఉత్తరాంధ్రలో వలెనే, తెలంగాణలో వలెనె, మధ్యాంధ్రలో, దక్షిణాంధ్రలో కూడ దరిద్రం తాండవిస్తున్నది. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అనే స్వభావం వల్ల, ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత బయట పడటం లేదు.

కాబట్టి వామ పక్షాలు తమ కమ్యూనిస్టు సిధ్ధాంతాల కనుగుణంగా ప్రైవేటు ఆస్తి నిర్మూలనకు, అన్ని వ్యాపారాలను, పరిశ్రమలను ప్రభుత్వరంగంలోనే నడిపి, ప్రతి పౌరుడికి తిండి, గుడ్డ, క్వార్టర్స్, ఫ్రీ ప్రయాణం, వృధ్ధాప్యంలో భద్రత, పని చేసే శక్తి ఉన్నవారందరికి పని గ్యారంటి, ఖాళీగా ఉండకుండా పనిచేయాల్సిన బాధ్యత (పెట్టుబడి దారీ విధానంలో డబ్బుంటే సోమరిగా తిరగచ్చు) వంటి సరియైన సిధ్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి.

ప్రభుత్వం ప్రతిదీ ఉచితంగా ఇస్తే, ధరల పెరుగదల అనే ప్రసక్తే ఉండదు. అసలు ధరలే ఉండవు. ఇంక ధరల పెరుగదలకి వ్యతిరేకంగా ఉద్యమాల అవసరం ఉండదు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కా?



ముందుగా కొంత చరిత్ర. తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలి అనే ఉద్యమం షుమారు 1913 ప్రాంతంలో బాపట్లలో ప్రారంభం అయినపుడు, రాయలసీమ వారికి చెన్నై దగ్గరగా ఉండేది కాబట్టి, వారు ఉద్యమంలో పాల్గొనటానికి ముందుకు రాలేదు. నాటి రాయలసీమ నేతలు రాయలసీమకు రాజధానిని డిమాండుచేయటం వల్ల, శ్రీబాగ్ ఒప్పందం జరిగి, రాయలసీమకు రాజధానిని వాగ్దానం చేయటం జరిగింది. దానిని నిలుపుకోటం కొరకు కర్నూలు లో రాజధానిని, గుంటూరులోహైకోర్టును నెలకొల్పుకోటం జరిగింది. నిన్ని మొన్న పేపర్లో వచ్చిందాన్ని బట్టి ఆకాలంలో కూడ భూస్పెక్యులేటర్లు రాజధాని ఉంటుందనుకున్న విజయవాడ, గుంటూరు, కర్నూలుల లో ధంధాలకు దిగి భూముల రేట్లను పెంచి వేయటం జరిగిందట.

ఆకాలంలో మీటర్ గేజీ గుంటూరు నుండి ధోన్ కి రైలు. అక్కడనుండి ధోన్ నుండి కర్నూలుకి రైలు. అన్నీ పొగబండ్లే. గుంటూరు కర్నూలు మధ్య రోడ్డు ప్రయాణం వాగులు, వంకలు, అడవులు, దొంగలతో భీబత్సంగా ఉండేవి. ప్రజలు, నేతలు, అధికారులు సీమ నుండి కోస్తాకి ప్రయాణాలలో నానా బాధలు పడి ఉంటారు.

మంత్రి పదవుల కొరకు, కీలక శాఖలపై పట్టుకొరకు భూకులాల మధ్య కుమ్ములాట జరిగి ఉండాలి. ఎందుకంటే, చిత్తూరు జిల్లాలోని భూకులానికీ, పగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాలోని భూకులానికి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండాలి. అనంతపురం, కర్నూలు భూకులాల వారు, తెలంగాణ అగ్ర భూకులంతో సంబంధం కలిగి ఉండాలి. మొత్తానికి ఈ కులాల మధ్య ఇంబ్యాలెన్స్ లో ఏమిజరిగిందో గానీ, ఉమ్మడి రాష్ట్ర అగ్ర భూకులం వారు తమ పెత్తందారీ తనం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినట్లు కనిపిస్తుంది. ఆతరువాత తెలంగాణలోని రెండవ అగ్రభూకులానికీ, మొదటి అగ్రభూకులానికీ, చిత్తూరు & మధ్య కోస్తాలోని అగ్రభూకులానికి హైదరాబాదులోని భూముల కబ్జా కొరకు ,సెటిల్ మెంట్ల కొరకు కుమ్ములాటలు మొదలయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేకాంధ్ర ఉద్యమం, మరల రెండవ తెలంగాణ ఉద్యమం లేచాయి. దీనికి సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ల, అరుణ్ జైట్లీల స్వార్ధం తోడయి సయామీస్ కవలలని వాళ్ళు చావుదెబ్బతినేలాగా విడతీసినట్లయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు అనే నినాదం సరియైనది కాదు (శ్రీబాగ్ ఒప్పందమే సరియైనది కాదు). అప్పుడే రెండు రాష్ట్రాలను (ఆంధ్ర, రాయలసీమ) కోరుకొని, ఉద్యమాలు చేసుకొని, కర్నూలు, విజయవాడ రాజధానులుగా రెండు రాష్ట్రాలను ఏర్పరుచుకుని ఉంటే ఎవరికి వారు ఈనాటికి ఎంతో కొంత అభివృధ్ధి సాధించే వాళ్ళు. రెండు రాష్ట్రాల అవతరణలు కొంత ఆలస్యం జరిగినా మొత్తానకి పని అయ్యేది. ఒక భార్యా భర్తలకు ఇద్దరు పిల్లలు ఉండకూడదని లేదు కదా. అలాగే ఒకే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు.

17 జిల్లాల సీమాంధ్రకు రాజధాని కావటానికి ఇఛ్ఛాపురం , శ్రీకాకుళం నుండి కల్యాణదుర్గం, రాయచోటి వరకు, తడ, సూళ్ళూరు పేటల వరకు ప్రతి పట్టణానికి అర్హత ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారి, రైలు సౌకర్యం ఉన్నవాటికి ఇంకా ఎక్కువ అర్హత ఉంది. ఈకోణంలోంచి చూస్తే గుత్తి , గుంటకల్, కర్నూలు, రేణిగుంట, కడప, ప్రొద్దటూరు, మైదుకూరు, ఒంగోలు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాజమండ్రీ, తాడేపల్లిగూడెం, ఏలూరు, (ఈలిస్టు నేను పూర్తి చేయలేను) అందరూ అర్హులే. కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతులే కాదు. ఈనాలుగు నగరాలూ ఎందుకు అనర్హాలు అంటే, ఇక్కడ ఇప్పటికే జనాభా విపరీతంగా పెరిగిపోయి ఇసకేస్తే రాలటంలేదు. లక్షరూపాయలకు సూదిమొనంత స్థలం కూడ లభించటం లేదు. లక్షరూపాయలు పెట్తే మనం విజయవాడలో, మంగళగిరిలో, గుంటూరులో ఒక చెట్టును కొనగలమేమో అనే పరిస్థితి వచ్చింది.

లేదా డజన్ల కొద్దీ ఉన్న ఈ నగరాల్లో ఏనగరమూ అర్హం కాకపోవచ్చు.

రాయలసీమలో ఎక్కడ రాజధాని పెట్టినా వలస సమస్య వస్తుంది



రాయలసీమలో ఎక్కడ రాజధానిని పెట్టినా లక్షలాది మంది నిరుద్యోగులు ఆపట్టణానికి (మాట వరసకి కర్నూలు) వలసవెళ్తారు. కనీసం ఇడ్లీబండి వేసుకునో, పండ్లమ్మి బతకచ్చనో, అందరూ రాయలసీమ రైళ్ళు ఎక్కుతారు. ఈ వలస దిగుమతులను రాయలసీమ వారు తట్టుకోలేరు. అప్పుడైనా వారు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం, కోస్తా ఆంధ్రులు గోబ్యాక్, అని స్లోగన్లు ఇచ్చి మరల కొందరు యువకులను ఆత్మహత్యలకు ప్రేరేపించవలసి వస్తుంది. తరువాత ఈ కోస్తాంధ్రుల నందరిని కర్నూలునుండి ఎలా గెంటి వేయాలా అని ఆలోచించే, కెసీఆర్, హరీష్ రావు, కెటీఆర్ వంటి ప్రబుధ్దులు తయారవుతారు.

కోస్తా భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కర్నూలు (లేక కడప లేక ఏదైనా) లో విపరీతంగా భూములు కొని, కబ్జాలు చేసి, కొత్త నగరాన్ని నిర్మిస్తారు. కానీ అదే సమయంలో రాయలసీమ భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు గుండెకోత మొదలవుతుంది. ముల్కీలు, పెద్దమనుషుల ఒప్పందాలు, కోర్టుతీర్పులు, వంటివి నాలుక గీచుకోటానికి కూడ పనికిరావు. ఇంక వీళ్ళే కాక, బెంగుళూరు, చెన్నయి, ముంబాయి, ఢిల్లీ నుండి కూడ పెట్టుబడిదారులు కూడ వచ్చి కర్నూలులో వాలతారు. కర్నూలు నగరం , నేటి హైదరాబాదు లాగానే రావణాకాష్టం లాగా మారుతుంది. ఉదాహరణకి కుమారి జయలలిత గారికి హైదరాబాదులో భూములు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆమె కర్నూలులో భూములు కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకోటేమిటంటే, ఈరోజు ఎకరం 20 లక్షలు చేసే భూమిని కర్నూలు రైతు కోటి రూపాయలు వస్తుందని అమ్ముకున్నా తరువాత దుఃఖమే మిగులుతుంది. తరువాత ఆభూమి వందకోట్లు అవుతుంది. అయ్యో నేను కోటికి అమ్ముకున్నానే అని ఆరైతు వంశానికి చెందిన వారంతా బాధ పడాలి.

చంద్రబాబు గారు కమ్మ, కాపు కులాల మధ్య సమతౌల్యాన్ని సాధించారా?



అలాగని పత్రికలలో వచ్చింది. తన కులంవారు లేకపోతే చంద్రబాబు బ్రతకలేడు. అలాగని కాపుల మద్దతు పొంది నిలుపుకోక పోతే, ఈసారి వనవాసమే గతి అవుతుంది. అందుకని ఆయన తనకులానికి, తన మద్దతుదారులకు పెద్దపీట వేస్తూనే, కాపులను సంతృప్తి పరుస్తున్నట్లుగా నటించాడు. నిజానికి చంద్రబాబు పార్టీకి 29.1% వోట్లు వస్తే జగన్ కి 28.9% సీట్లు వచ్చాయి. తేడా కేవలం రెండు శతాంశ పాయింట్లే. కానీ, సీట్లలో 35 సీట్లదాకా తేడా వచ్చింది. అంటే ప్రజాదరణలో ఇరువురికీ పెద్ద తేడాలేదు. అయితే జాగ్రఫికల్ స్ప్రెడ్ లో తేడా ఉంది. నేనేం జగన్ అభిమాని నేమీ కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాగా తయారయిందే అనే చింత కాల్చి వేస్తున్నది. పీపుల్ గెట్ దీ గవర్నమెంట్ దే డిజర్వు అని సర్దుకు పోవాలేమో. పీపుల్ గెట్ దీ ఆపోజిషన్ దే డిజర్వు అని కూడ వ్రాసుకోవచ్చు.

సరియైన స్లోగన్



ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు (ఇది కాదు,కింద చూడండి.).
మెరుగైనది:

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాయలసీమకూ హక్కు.

ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితులను చూస్తుంటే, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమలు, బేషరతుగా కలసి ఒకే రాష్ట్రంగా కొనసాగటం దాదాపు అసాధ్యం. వచ్చే పదేళ్లలో మనం ఎన్నో ఉద్యమాలను, బందులను చూడాల్సి రావచ్చు.

ఏ ప్రాంత పట్టణాన్ని రాజధాని చేసినా మిగిలిన వాళ్ళు బందులు మొదలుపెట్తారు. బస్సులను కాలుస్తారు (తెలుగు వాళ్ళకి చేతైన మహావిద్యలలో బస్సులను కాల్చటం గొప్పది).



ఏకైక మార్గం



పదేళ్ల తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించి స్టేడియాలను ఆక్రమించుకొని, మూసేసిన సినిమా హాళ్ళను, ఇంజనీరింగు కాలెజీలను టెండర్లు పిలిచి లీజుకు తీసుకుని, తక్షణమే, పాలనను నార్మల్ టెంపరేచర్ కి తేవటం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , శాసనమండలి, సమావేశమయి మూడురాష్ట్రాలను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపి, చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి, చిరంజీవి, మొ|| వారందరు ఢిల్లీ వెళ్ళికూర్చుని చెప్పులు అరగతీసుకొని (నేను నా చేతివేళ్ళను, లాప్ టాప్ కీ బోర్డును, స్క్రీన్ ను అరగతీస్తున్నట్లుగా) మూడు ప్రత్యేక రాష్టాల ఏర్పాటు బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో వీలైనంత తొందరగా, గతంలో వాడిన ఆర్టికిల్ 3 ప్రకారమే పాస్ చేయించుకోటం చేయాలి.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమైనా నిధులను విదిలిస్తే, వాటిని మూడు ప్రాంతాల్లో మూడు పట్టణాలకు కొత్త రాష్ట్రాలజనాభా దామాషాలో పంచుకొని నిర్మాణాలను మొదలు పెట్టుకోటం. మూడు పట్టణాలలోనూ, రాష్ట్రస్థాయికార్యాలయాలను ఏర్పాటు చేసుకొని అంతిమ విభజనకు స్నేహపూర్వకంగా, సర్వసన్నధ్ధంగా ఉండటం.

ఈనాటి స్లోగన్



కలలో, కథల్లో నైనా కలిసి ఉండటం చేతకాని వాళ్లు, స్నేహపూర్వకంగా, పూర్తి స్థాయి ముందస్తు వ్యూహంతో విడిపోటం నేర్చుకోవాలి.

Sunday, July 6, 2014

290 Comforts, luxuries and pleasures are like honey on moustaches


290 వొడల్ తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్
చర్చనీయాంశాలు: 290, పద్యకవిత్వం, పెద్దన, మనుచరిత్ర, రాహుల్ గాంధీ, ప్రియాంక

శ్రీమతి ప్రియాంక వధేరా గాంధీగారు, శ్రీ రాహుల్ గాంధీగారు అమేథీ ఎన్నికల ప్రచారంలో ఇటికరాళ్ళ గుట్టలపై దూకు కుంటూ వెళ్ళి వోటర్లతో మరీమరీ షేక్ హేండ్లిచ్చి, కౌగలించుకున్నంత పనిచేసి వాళ్ళచేత వోట్లు కొట్టించుకున్నారు.

ఇప్పుడు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు , శ్రీ రాహుల్ గాంధీ గారు ఏమి చేస్తున్నారు?

జవాబు: మొదట వచ్చిన వార్తల ప్రకారం వారు యూరప్ లో పర్యటిస్తున్నారు. యూరప్ అంటే సహజం గా తాతగారి, అమ్మమ్మ గారి ఊరైన ఇటలీ అయి ఉండచ్చు. లేదా తాము రహస్య నంబర్ల ఖాతాలో ఏమైనా డబ్బులు దాచుకొని ఉంటే, స్విట్జర్ ల్యాండ్, ఐలాండ్ ఆఫ్ మ్యాన్, లండన్ (కూడటాక్స్ హావెనే), లగ్జెంబర్గ్, కేమాన్ ఐలాండ్స్, బెర్మూడా, బ్రిటీష్ వర్జిన్ ఐలెండ్స్ ఇలా ఏవైనా కావచ్చు. సహజంగా అక్కడ కొంత కులాసాగా తిరగటానికి, తాగి పండుకోటానికి, వసతులు కూడా ఉంటాయి.

రియో డి జెనిరోలో వరల్డ్ కప్ ఫుట్ బాల్ ప్రారంభం అయినాక, వస్తున్న వార్తలను బట్టి, శ్రీరాహుల్ గాంధీ, శ్రీ రాబర్ట వధేరా కలిసి రియో డి జెనిరోలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను తిలకిస్తున్నారు. ఇంతవరకు ఫొటోలయితే బయటకు రాలేదు.
ఈరోజునుండి లోక్ సభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అమేథీ నుండి ఎన్నికైన, శ్రీరాహుల్ గాంధీ లోక్ సభ బడ్జెట్ సమావేశం మొదటి రోజు సభకి హాజరు కా దలుచుకుంటే, ఇప్పటికల్లా భారత్ కు వెనక్కి వచ్చి ఉండాలి. కావాలంటే మరల వెళ్ళ వచ్చు.

బ్రెజిల్ లో కూడ నల్ల, ఎర్ర, తెల్ల, ఆకుపచ్చ డబ్బులు ఉన్నవాళ్ళకి, వాటిని విసిరేయటానికి సిధ్ధంగా ఉన్నవాళ్ళకి అందుతున్న సౌఖ్యాలకు కొదువ లేదు. అక్కడ వ్యభిచారిణులకు ఆంగ్లంలో ఎలా మాట్లాడి ధన దేశాలనుండి వచ్చే రసిక శేఖరులనెలా ఆకట్టుకోవాలో, ప్రత్యేకంగా శిక్షణా సంస్థలు ఏర్పడి హావభావ మందహాసాలలో , హోయలు మీరటంలో బాగా ట్రెయినింగు ఇచ్చాయిట. భారతీయ రసికశేఖరులకు ఏమైనా ప్రత్యేక ట్రీట్ మెంటు ఉంటుందా, లేక అక్కడ కూడ ముల్కీ రూల్సు ఏమైనా ప్రవేశ పెట్టారేమో తెలియదు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎంతమంది ఫుట్ బాల్ చూడటానికి బ్రెజిల్ వెళ్ళారో మనకు తెలియదు. వారిలో ఎంతమంది రసికాగ్రేసరులో అసలే తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ఉందా? అనేవాళ్ళు ఆలోచించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. భారతీయ రసికాగ్రేసరులలో ఎందరు కండోములను నమ్ముకుంటారో, ఎంతమంది దేవుడిని నమ్ముకుంటారో మనకి తెలియదు. ప్రవరుల్లాగా ఉండే వాళ్ళని మనం రసికాగ్రేసరులు అనలేం కాబట్టి, వెళ్ళిన వాళ్ళు ప్రవరులైనా కావాలి, రసికాగ్రేసరులైనా కావాలి, లేక బండరాళ్ళైనా కావాలి.

ఈనాటి పద్యం

ఆంధ్రకవితా పితామహ, అల్లసాని పెద్దనా మాత్యుడు. కావ్యం మను చరిత్ర.

సందర్భం: హిమాలయా పర్వతాలమీద, కాళ్ళకు రాసుకున్న పాదలేపనం కరిగిపోటంతో, ప్రవరుడు చిక్కుకొని దారీతెన్నూ లేక తిరుగుతున్న సందర్భంలో అతడికి వరూధిని అనే అప్సర తారసిల్లింది. వరూధిని ప్రవరుడిపై మోజుపడి అతడిని వశం చేసుకోవాలని చూసింది. పరిపరి విధాల నచ్చచెప్పటానికి ప్రయత్నించింది.


... అనుచుఁ దన్నొడఁ బఱచు నయ్యమరకాంత
తత్తఱముఁ జూచి, యాత్మ నతండు దనకు
సిగ్గు, వెగటును బొడమ, నిస్పృహతఁ దెలుపు
నొక్క చిఱునవ్వు నవ్వి యయ్యువిద కనియె.

(ప్రవరుడికి సిగ్గు, వెగటు కలిగాయి. నిసృహతో ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. అయ్యమరకాంత == ఆ అప్సర. త్రికసంధి. అయ్యువిద== ఆ కాంత. త్రిక సంధి. అల్లసాని వారికి (తిక్కనకు కూడ) త్రిక సంధులంటే మహా మక్కువ. )


"ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయినినా వచించెదవు మేలోహో ! త్రయీధర్మముల్
పాపంబుల్, రతిపుణ్యమంచు నిఁక నేలా తర్కముల్ ? మోక్షల
క్ష్మీ పథ్యాగమసూత్ర పంక్తి కివె పో మీ సంప్రదాయార్థముల్.

(ఈ పాండిత్యం నీకు తప్ప మరి ఎవరికైనా ఉన్నదా? కామ శాస్త్ర ఉపాధ్యాయిని లాగా మాట్లాడుతున్నావే. బహుశా ఈ త్రయీధర్మాలు ధర్మ, అర్ధ , కామాలు కావచ్చు. (వేరేవైనా కావచ్చు.) ఇవేమో పాపాలు, రతి మాత్రమే పుణ్యం అంటూ ఎందుకీ తర్కాలు? మోక్షలక్ష్మి కి దారి (పథం) చూపే మార్గాలే సంప్రదాయమైన ధర్మార్ధకామాలు.)
నాలుగిటినీ కలిపే చూడాలని కాబోలు భావం. ఈవిషయంలో మహాత్ములైన వ్యాఖ్యాతల గ్రంధాలను పరిశీలిస్తేగానీ వ్రాయలేము.


తరుణీ ! రేపును మాపు హవ్యముల చేతం దృప్తుఁడౌ వహ్ని స
త్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు ? నా
కరణుల్ దర్భలు నగ్నులుం బ్రియములైన ట్లన్యముల్గా, వొడల్
తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్"

(హవ్యాలంటే యజ్ఞగుండంలో వేసే సమిథలు, నేయి మొ||. హవ్యాలచేత తృప్తి పరచబడిన అగ్నిదేవుడు దయతో ఇచ్చే సుఖాలు తెలుసుకోటం నీకు సాధ్యమా? నాలాంటి వాళ్ళకి దర్భలు, అగ్నులు ప్రియమైనట్లుగా మిగిలినవి ఉండవు. శరీరం స్థిరమా? చెప్పకు!! ఇలాంటి తుఛ్ఛ సుఖాలు మీసాలమీద తేనెల లాటివి. మీసాలమీద పడ్డ తేనె బొట్లను ఎంతనాకినా పూర్తిసుఖము దొరకదు అని భావము కాబోలు.)

మాకు తెలిసింది మీకు తెలీదు, మీకు తెలిసింది మాకు తెలీదు, అనే అర్ధం కూడ ఉందేమో.

ప్రవరుడు తన తపః శక్తిని వినియోగించి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.



వైబీరావు గాడిద అభిప్రాయం



రియో డి జెనిరోలో మీసాలమీద తేనెలు వెతుక్కునేవాళ్ళు వెనక్కి ఎప్పుడు వస్తారు అనేది పార్లమెంటు సమావేశాల హాజరు బట్టి తెలుస్తుంది.

Saturday, July 5, 2014

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?

289 Should the future of Telugu people, always be quarrelling? Can't we put an end to it?
289 తెలుగు ప్రజల భవిష్యత్ తన్నుకోటమేనా? దానికి మనం ముగింపుపాడలేమా?
చర్చనీయాంశాలు: 289, తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమ, రాజధాని, హరీష్ రావు, కెటిఆర్, కెసిఆర్

సీమాంధ్ర ప్రజలపై శ్రీ కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్ లు పగబట్టినట్లుగా కనిపిస్తున్నది. వాళ్ళు నోరు తెరిస్తే సీమాంధ్ర ప్రజలపై విషం కక్కుతున్నారు. వారి ప్రతిచర్య యొక్క గమ్యం, తెలంగాణ అభివృధ్ధి కన్నా, సీమాంధ్ర ప్రజలను వేధించటమే లక్ష్యం గా కనిపిస్తుంది. వారికి, శ్రీచంద్రబాబునాయుడికి మధ్య పాత పదవీ కుళ్ళు ఏదైనా ఉంటే ఉండవచ్చు. అలాంటివేమైనా ఉంటే వాళ్ళూ వాళ్ళూ చూసుకోవాలి. హైదరాబాదులో శ్రీ చంద్రబాబుకి బినామీ ఆస్తులు ఉన్నాయనీ, తాను ముఖ్యమంత్రి అయితే వాటన్నిటినీ బయట పెడతామనీ గతంలో కెసీఆర్ అన్నారు. ఇపుడా పని చేయవచ్చు కదా? జగన్ అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపై చర్య తీసుకోవచ్చు కదా? శ్రీచంద్రబాబు గారు కూడ కెసీఆర్ ధంధాలను బయట పెడతానన్నారు. ఆపని చేసి తెలంగాణ ప్రజలను రక్షించ వచ్చు కదా. చేయరెందుకు?

కెసీఆర్ కుటుంబం, ఒకే ప్రాంతం ప్రజలపై పగబట్టినట్లుగా వ్యవహరించటం సమంజసం కాదు. ఈవిషయంలో, కేంద్ర హోమ్ మంత్రి గారు ఇరు ప్రాంతాల వారిని తన్నుకోవద్దని సలహా ఇచ్చారే కానీ, పార్లమెంటులో తమ రాజకీయ స్వార్ధం కోసం, అతిఘోరమైన తడిగుడ్డతో గొంతును కోసే విభజన బిల్లును పాస్ చేయించి, సీమాంధ్ర ప్రజలను హైదరాబాదులో సరియైన కార్యాలయం లేని వాళ్ళుగా రోడ్డున పడేయటంలో, అఖిల భారత బిజేపి నేతలయైన తమకు, అఖిల భారత కాంగ్రెస్ నేతలకు పాత్ర ఉందని మర్చిపోయారు. ఈసందర్భంగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తనను తెలంగాణకు చిన్నమ్మగా చెప్పుకోటాన్ని మర్చిపోరాదు.

ఇపుడు కెసీఆర్ భారత్ లో తెలంగాణను ఒక నిజాం రాజ్యంగా మార్చేశాడు. భారత దేశం ఒక దేశం, ఈ దేశంలో ప్రజలు ఎక్కడనుండి ఎక్కడకైనా పొట్టకోసం వలస వెళ్ళవచ్చు, పరిమితికి లోబడి చిన్న చిన్న ఆస్తులను సమకూర్చుకోటానికి రాజ్యాంగం అనుమతిస్తున్నది, అని ఆయన మర్చిపోయాడు. నియంత్రించ వలసిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాలు అనేవి స్వతంత్ర దేశాలు కావు. ఒక రాష్ట్రంలో ఉండే భూమి అంత ఆ ఒక్క రాష్ట్ర ప్రజలది కాదు. ఆభూమి మొత్తం భారత దేశానికి చెందినవి. ఒక నగరానికి వచ్చిన వివిధ ప్రాంతాలవారు, అక్కడ వివిధ రకాల పన్నులను చెల్లిస్తున్నప్పుడు, ఆ పన్నులతో చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ఫలితాన్ని అందరూ అనుభవించాలి తప్ప, ఆప్రదేశంలో 1956 కు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. ఈ దేశంలో అందరూ ముల్కీలే. తెలంగాణా ముల్కీలనీ, సీమాంధ్రముల్కీలని, బీహార్ ముల్కీలని, ఉత్తరప్రదేశ్ ముల్కీలని ప్రత్యేకంగా ఉండరు.

కెసీఆర్ -హరీష్ రావు-కెటీఆర్ ల ప్రవర్తన, రైల్లో టవలు పరుచుకొని సీటుని ఆక్రమించుకొని పండుకున్నవాళ్ళు, మిగతావాళ్ళను గెంటి వేయటానికి బోగీతలుపులు వేయటానికి ప్రయత్నించినట్లుగా ఉన్నది.
తెలంగాణలో బండిలాగే కూలి వాడి కొడుక్కి సీమాంధ్రనుండి వచ్చినా, బీహార్ నుండి వచ్చినా, ఝుంజున్ను నుండి వచ్చినా, వాళ్ళు 1956 ముందు వచ్చారా తరువాత వచ్చారా అనేదానితో సంబంధం లేకుండా సర్వసమాన ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వాల్సిందే. అందరూ ముల్కీలే. ఇక్కడ నిజాం రాజ్యంలేదు.

కేంద్ర ప్రభుత్వానికి ఈ మౌలిక సూత్రం మీద విశ్వాసం ఉంటే, వెంటనే కెసీఆర్ దుష్ట చర్యలను నలిఫై చేస్తూ , రాజ్యాంగ పరిస్థితిని స్పష్టం చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి. లేకపోతే , దేశంలో, ప్రతిరాష్ట్రంలోనూ కెసీఆర్ లాంటి నిజాములు తయారయి, స్వంత రాజ్యాలను నెలకొల్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకుంటే, సోవియట్ యూనియన్ వలె , భారత్ కూడ విఛ్ఛిన్నం బాట పట్టే అవకాశం ఉంది.

తోటకూర దొంగిలించిన నాడే పిల్లవాడికి మంచి చెడు నేర్పితే, వాడు మంచి పౌరుడుగా రూపు దిద్దుకునే అవకాశం ఉంటుంది. బాగా చేసావురా అని మెచ్చుకుంటే, తాను చేస్తున్న పని సరియైనదే అనుకొని అతడు మరీ పేట్రేగి పోయే అవకాశం ఉంది.

కేంద్రానికి దేశప్రజలు ఎక్కడినుండి ఎక్కడకైనా స్వేఛ్ఛగా వలస పోవచ్చు, అక్కడి ప్రజలతో సమానంగా జీవీస్తూ, హక్కులను, బాధ్యతలను రెండిటినీ స్వీకరిస్తూ సంచరించే హక్కు ఉన్నది అనే మౌలిక సూత్రం పై నమ్మకం లేక పోతే ఆవిషయమే స్పష్టం చేస్తే బాగుంటుంది. సీమాంధ్ర ప్రజలు ఏనుయ్యో గొయ్యో చూసుకుంటారు.

దీనిని , ఎవరి మనోభావాలైనా దెబ్బతింటున్నాయో గమనించి తిరగ వ్రాయవలసి ఉన్నది.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |