Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Thursday, June 12, 2014

256 Assaults of different types. Reviews are also a type of assaults.

256 Assaults of different types. Reviews are also a type of assaults.

హింసలు పలు రకాలు. సమీక్షలు కూడ హింసలే.

చర్చనీయాంశాలు-- హింసలు, సమీక్షలు, మంత్రివర్గసమావేశాలు, ఆంధ్రప్రదేశ్


శేషాంధ్ర ప్రదేశ్ ప్రధమ మంత్రివర్గ సమావేశం, విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి సభామందిరంలో , 12.6.2014 నాడు ఘనంగా జరిగినట్లు మీడియా చెప్తున్నది.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

మంత్రివర్గ సమావేశాలకు, 16 వ నంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేయవలసిన అవసరం ఏమిటి?

శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏడు గంటలపాటు మంత్రి వర్గం సమావేశం నిర్వహించారట. మన మంత్రి వర్గ సమావేశాలలో మంత్రులు మాట్లాడేది చాలా తక్కువ. ముఖ్యమంత్రి మాట్లాడేది చాలా ఎక్కువ. ఈ ఆచారానికి అనుగుణంగా, శ్రీచంద్రబాబు నాయుడు గారు, ఏడు గంటలూ తనదైన శైలిలో, వేగంతో, మంత్రులను, అధికారులను ఉద్ బోధించి ఉంటారని (శ్రీబాబుకి శ్రీమోడీ గురువా, లేక శ్రీ మోడీకి శ్రీబాబు గురువా కాలమే నిర్ణయిస్తుంది), వేరే చెప్పనక్కరలేదు.

సారాంశం

హింస అనేది కేవలం కత్తులతోనో, కర్రలతోనో మాత్రమే చేయగలిగిన అతి కష్టమైన ఎవరెస్టాధిరోహణ కార్యం కాదు. కొన్నిసార్లు ఉద్ బోధలు, సమీక్షలు కూడ హింసను చక్కటి కళగా తీర్చి దిద్ది ప్రదర్శిస్తాయి.

255 Can this be the proper method for developing agriculture in Andhra Pradesh?



255 శేషాంధ్ర వ్యవసాయమంత్రి వ్యవసాయాన్ని అభివృధ్ధి చేసే పధ్ధతి ఇదేనా

చర్చనీయాంశాలు-- వ్యవసాయం, రాజధాని, భూసేకరణ, అధికార వికేంద్రీకరణ, మంగళగిరి


శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖామాత్యులు. 12.6.2014 నాటి ఈనాడు లో ప్రచురించబడిన వీరి సుభాషితమును మనం గుర్తుంచుకొని తీరవలసినదే.

రాజధానికి 20000 ఎకరాల సాగుభూమి

రాజధానికోసం రైతులనుండి దాదాపు 20 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఒక మంచి రాజధానిని నిర్మించుకోగలం. రైతుల మనసుల్లో ఆనందం నింపటమే నాపని. ... ....


రాజధాని కోసం 20000 ఎకరాల సాగుభూమిని సేకరిస్తే ఎంత మేరకు ప్రజలకు నష్టం వాటిల్ల వచ్చు?

సేకరించే భూమి పల్లపు భూమి అయితే ఎకరానికి 30 క్వింటాల్స్ వరి పండుతుందనుకుంటే, 20 వేల ఎకరాలకు 20000 x 30 = 6,00,000 క్వింటాల్స్ లేక 6 కోట్లకిలోల వడ్లు, షుమారు 3 కోట్ల కిలోల బియ్యం ఉత్పత్తి ప్రతి సంవత్సరం ప్రజలు నష్టపోతారు.

సేకరించే భూమి ప్రత్తి లేక మిరప పండించే భూమి అయినా నష్టం ఇంతే ఉంటుంది.

ఒక లెక్క-- ఎకరానికి 8 క్వింటాల్స్ పత్తిపండుతుంది అనుకుంటే, 20 వేల ఎకరాలకు, 20000 x 8 = 1,60,000 క్వింటాల్స్ పత్తి. ఎకరా కి 6 క్వింటాల్సే పండే నాసి రకం భూమి అనుకున్నా, 20000 x 6 = 1,20,000 క్వింటాళ్ళ ప్రత్తి, ప్రతి ఏటా నష్టపోతాము.

20000 వేల ఎకరాల సాగు భూమిని సేకరించమని ఈయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చి ఉంటే, ఈ పుల్లారావు గారు అభ్యంతరం పెట్టి ఉండవలసినది. అపుడే ఆయన వ్యవసాయ మంత్రిగా తన విధిని సరిగా నిర్వహించినట్లయ్యేది.

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అసలు అధిక పరిమాణంలో భూమి ఎందుకో అర్ధం కావటం లేదు. నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలో క్వారీ భూములు, కంప పెరిగిన బీడు భూములు, భారీగా ప్రభుత్వానికి ఉన్నాయి. ఒకవేళ మంగళగిరి , నాగార్జున యూనివర్సిటి ప్రాంతాలు రాజధానిగా అన్నిటికన్నా గొప్పవి అని మాటవరసకు అనుకున్నా, 20 అంతస్తుల భవనాలను నిర్మించుకుంటే, పది ఎకరాలలోనే సచివాలయాన్ని, శాసన సభ, శాసన మండలి భవనాలను, శాసన సభ్యులకు, మంత్రులకు క్వార్టర్లను కూడ నిర్మించు కోవచ్చు.

రాష్ట్రస్థాయి డైరక్టరేట్లకు నేను పోస్టు నంబర్ 252 లో సూచించిన విధంగా, click to go to 252
మూతబడనున్న ఇంజనీరింగు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల భవనాలను టెండర్లద్వారా కొనుగోలు చేసి, వాటిని వాడుకోవచ్చు.

ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి కార్యాలయం వచ్చి, జిల్లాల వారందరికీ, మారు మూల ఉన్నవారితో సహా, తాము రాష్ట్ర పాలనలో భాగం పంచుకుంటున్నామన్న భావం కలుగుతుంది. అధికార వికేంద్రీకరణ అంటే ఇదే.

Wednesday, June 11, 2014

254 What is common among Resu Gurram, Legend and Manam?

254 What is common among Resu Gurram, Legend and Manam?

రేసు గుర్రం, లెజెండ్, మనం అనే మూడు సినిమాల మధ్య సమాన ధర్మం ఏమిటి?

చర్చనీయాంశాలు- తెలుగు సినిమాలు, విభజన


Telugu films are meant for Telugu audiences, there is no regional barrier for them and that was proved with the recent films. ... These films have become the highest grossers for the respective actors --Sunil Narang, Global Cinemas, Distributor of Legend and Manam, owner of some Multiplexes.

తెలుగు సారం- తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులకొరకు ఉద్దేశించ బడతాయి. వారి మధ్య ప్రాంతీయ అడ్డంకులేమీ లేవు. ఇటీవలి సినిమాలు ఈ విషయాన్నే ఋజువు చేశాయి. ... ఈ సినిమాలు సంబంధించిన నటులకు అత్యధిక వసూళ్ళ చిత్రాలుగా మారాయి. --సునీల్ నారంగ్, డిస్ట్రిబ్యూటర్ లెజెండ్, మనం చిత్రాలు. మరియు కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమాని.
This is proof that cinema is completely independent of politics. When a film releases, the audience just wants entertainment. -- N.V. Prasad, President of Telugu Film Chamber of Commerce.

తెలుగు సారం-- సినిమా అనేది పూర్తిగా రాజకీయాలకు అతీతమైనది అనటానికి ఇది ఋజువు. ఒక చిత్రం విడుదలైనపుడు, ప్రేక్షకులు కోరేది కేవలం వినోదం. -- ఎన్ వీ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు.


రాష్ట్ర విభజన జరిగాక తెలుగు చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని కొందరు భావించారు. కానీ అలాజరగలేదు. పైన వ్రాసిన రేసుగుర్రం, లెజెండ్, మనం సినిమాలు, ఒక్కోటి దాదాపు 50 కోట్లు చొప్పున వసూలు చేస్తున్నాయి, కాబట్టి తెలుగు సినీ పరిశ్రమకు ఢోకా లేదు, అని పైవారి భావం.

అల్లు అర్జున్ కో, బాలకృష్ణకో, ఇంకో నాగార్జునకో ఎవరికో ఎవరికో ఈ విధానం కెరియర్ బెస్ట్ వసూళ్ళు కలిగించ వచ్చేమో కానీ, ప్రజలకు సంబంధించినంత వరకు ఇది దారిదోపిడీయే.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు



తెలుగు చిత్రపరిశ్రమకు పట్టిన చీడ తెగులుకు విభజనకు సంబంధం లేదు.

పై మూడు సినిమాలు 50 కోట్లు చొప్పున కొల్లగొట్టటాన్ని చూసినపుడు, నేటి బడా నిర్మాతలు, పంపిణీదారులు, తమ దోపిడి విద్యనుఎంత పరిపక్వం చేయగలిగారో అని ఆశ్చర్యపోక తప్పదు.

ప్రతి పట్టణంలో అత్యధిక సంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేసి, వేరే ఇతర సినిమాను విడుదల కానీకుండా, విడుదల అయిన వాటిని తీసేయించి, తమ సినిమాను విడుదల చేసి, పట్టణంలో మరి వేరే ఇతర దిక్కుమాలిన సినిమాలు ఏమీ లేవు, ఈదిక్కుమాలిన సినిమానే చూడక తప్పదు, అనే స్థితిని కల్పించినపుడు, 50 కోట్లేమి కర్మ ఎన్ని కోట్లైనా వసూలు అవుతాయి. ఇది గుత్తస్వామ్య దోపిడీ వ్యవస్థకి సంకేతమే తప్ప, ఇంక దేనికీ సంకేతం కాదు.

వినోదం కోసం జనం ఏదిక్కుమాలిన సినిమానైనా చూడటం ఒక పతనం కాగా, వారికి ఆ దిక్కుమాలిన సినిమాల్లో కూడ తమకు నచ్చిన తక్కువ దిక్కుమాలిన సినిమాను ఎంచుకునే స్వేఛ్ఛను కూడ లేకుండా చేయటాన్ని ఏమనాలి.

వ్యభిచారం, జూదం, సినిమాలు (నట, విట, జూదగాళ్ళకు) ఒక సమాన ధర్మం ఉంది. ఈమూడు వర్గాలకు జాతి, మత, కుల, ప్రాంతీయ, భాషా, హద్దులు ఉండవు.

కనుకనే బ్రెజిల్ లో వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలు జరిగినా, కానెస్ లోనో , లాస్ ఎంజెలెస్ లో నో, షాంఘైలోనో చిత్రోత్సవాలు జరిగినా, చైనాలోని మకాలుదీవి లో జూద పండుగలు జరిగినా, జాతి, మత, కుల, ప్రాంతీయ, భాషా, హద్దులు లేకుండానే విజయవంతమవుతాయి.

బ్రెజిల్ వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను చూడటానికి వచ్చిన ప్రేక్షకుల వినోదపు అవసరాలను తీర్చటానికి, అక్కడి వ్యభిచారిణులు, ఆంగ్లభాషలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారంటే, క్యాష్ ప్రపంచాన్ని క్యాష్ పరిపాలిస్తున్నట్లు అర్ధం అవుతుంది.

ప్రక్క ప్రక్కన ఎన్నో శతాబ్దాలుగా జీవిస్తూ, ఒకే భాష మాట్లాడుకునే 13 జిల్లాల వారికి, 10 జిల్లాల వారికి మధ్య చిచ్చు రేపింది ఎవరు. క్యాష్. క్యాష్. క్యాష్.

253 Madness cured, but please wind this pestle around my head!



253 పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి. చర్చనీయాంశాలు: 253, Ganga River, Indian Rivers, Uma Bharti, Water Pollution, గంగానది


కొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడు అని ఒక సామెత ఉంది. భవతీ భిక్షాందేహి అని అన్నం కొరకు భిక్షాటన కొరకు వెళ్ళే వాడు సమయ పాలన చేయాలి. వేళకాని వేళలో వెళ్తే అన్నం దొరకదు, సరికదా కొన్ని సార్లు తిట్లు తినాల్సి వస్తుంది.



గంగానదిని శుధ్ధిచేయటానికి కంకణం కట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు, ఆయన సహచర గంగా శుభ్రీకరణ మంత్రిణి ఉమాభారతి గారు, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉరుకుతున్నారు.

గంగానదిలో ఉమ్మి వేస్తే జైలు, జరిమాన శిక్షలు ఈ అతి ప్రమాదకరం కోవలోకి వస్తాయి. నదీ జలాల పవిత్రత యందు ప్రజలను విద్యావంతులను చేయవలసిన అవశ్యకత ఉంది. అలా చైతన్యవంతులైన ప్రజలు ఎవరూ బలవంతం చేయకుండానే ఉమ్మి వేయటం మానేస్తారు. మిగిలిన మొండి ఘటాలు, కావాలని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వారిని దిద్దటానికి జరీమానాలు, అరెస్టులు చేపట్టవచ్చు. ముందూ వెనుకా చూడకుండా, రూల్స్ ను జనం మీదికి రుద్దినపుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఏ అమాయకుడో ఆ శిక్షకు బలి అవుతాడు.

గంగానదిని కలుషితం చేస్తున్న వాటిలో ఏమాత్రం లాభం చేకూర్చని, అత్యంత ప్రమాదకరమైన కాలుష్యకారకం, మునిసిపల్ కాలువలను నదిలోకి వదలటం. ఇది దాదాపుగా గంగానదియొక్క రెండువేల కిలోమీటర్ల ప్రవాహ మార్గమంతా జరుగుతుంది. మునిసిపాలిటీలకు, కార్పోరేషన్లకు, పంచాయితీలకు కూడ నదులు, ఉపనదులు తప్ప వేరొక దిక్కులేదు. ఈసమస్యకు ఏకైక పరిష్కారం ఏమిటంటే, నదులకు సమాంతరంగా, రకరకాల మురుగులను తమలో కలుపుకుని సముద్రం వరకు తీసుకుపోటానికి, లేక దారిలో ఉన్న ట్రీట్ మెంటు ప్లాంట్లలోకి వదలటానికి ప్రత్యేక కాలువలను త్రవ్వుకోవాలి. ఇది కొన్ని వందల కోట్లు ఖర్చైనా, ప్రజారోగ్యానికి, వాతావరణానికి, టూరిజానికి, ఇతర అవసరాలకు కలిగే లాభంతో పోలిస్తే ఖర్చు చాల తక్కువ క్రిందే లెక్క. ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్ధాల విషయంలో, గంగానదిలోకి కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలకి ఉన్న నిబంధన ఏమిటంటే వారు స్వంత ట్రీట్ మెంట్ ప్లాంటు లను నెలకొల్పుకొని, అలా ట్రీట్ అయిన జలాలనే నదులలోకి వదలాలి. దీనిని కాగితం మీదనైనా పాటించే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు.

ఇంకా ఉంది. ఇంకోసారి వ్రాస్తాను.

Tuesday, June 10, 2014

252 Chandra Babu Naidu is repeating his past mistakes

252 Chandra Babu Naidu is repeating his past mistakes

252 చంద్రబాబు నాయుడు గారు తన గత తప్పులను తిరిగి తిరిగి చేస్తున్నారు.

చర్చనీయాంశాలు- 252, చంద్రబాబు, రాజధాని, అభివృధ్ధి, విభజన

వ్యక్తులుగానీ, పాలకులు గానీ, సమాజాలు కానీ తప్పులు చేయవచ్చు, వాటికి పశ్చాత్తాప పడవచ్చు, తమ తప్పులను దిద్దుకోవచ్చు.

తాము తప్పులు చేసేదాకా వేచి యుండి, వాటినుండి నేర్చుకునే కన్నా , ఇతరులను గమనించి, వారు అప్పటికే చేసిన తప్పులనుండి నేర్చుకోటం, మనకి ఎక్కువ మేలు చేస్తుంది.

ఉదాహరణ

గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగు దేశం ప్రభుత్వాలూ, కేంద్రం ఇచ్చిన నిధులను, రాష్ట్రప్రభుత్వ 23 జిల్లాల నిధులను, తీసుకెళ్ళి హైదరాబాదు నగరంలో కుమ్మరించారు. ఆతరువాత కెసీఆర్ వచ్చి అన్నీ మావే అన్నాడు. బిజేపీ, సోనియా గాంధీ అందరూ కుమ్మక్కయ్యి ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయమైన విభజనకు గురిచేశారు.

సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబుతో సహా, అన్ని పార్టీల నేతలూ, మరల ఈ తప్పును చేయమన్నారు. మొత్తం నిధులను రాజధానిపై ఖర్చుచేయమన్నారు.

చంద్రబాబునాయుడు గారికి విజయం తలకెక్కాక బుధ్ధి మారిపోయినట్లుంది. ఆయనకు, ఆయన బంధువులకు, సహనేతలకు, ఏమి బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో కానీ, విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని అంటున్నారు. పది సంవత్సరాలకాలంలో రాజధాని అభివృధ్ధి కోసం నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు.

భూసేకరణ కోసం ఊగిపోతున్నారు. సేకరణ చేసిన భూముల్లోనే రైతులకు వాటాలిస్తానంటున్నారు. వాటి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి రైతులు లాభపడతారంటున్నారు.

విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పరిధిలో జరిగిన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ లు, వ్యాపారాలపై సీబీఐ దర్యాప్తు చేయించటం పోయి ఆయనే అగ్నికి ఆజ్యం పోయటం దురదృష్టకరం.

కొత్తరాష్ట్రంలో కొత్తజిల్లాలు

కృష్ణా జిల్లా, తూగో జిల్లా, కర్నూలు, అనంతపురం, వంటి జిల్లాలను విభజించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించవలసిన అవసరం ఉంది.

విభజించాక ఇరవయి నుండి ఇరవయిమూడు జిల్లాలు వస్తాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో రాష్ట్రస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. అత్యధిక ప్రజలకు నిత్యం పని ఉండని గనులశాఖలను మూలన ఉన్నా సరిహద్దు జిల్లాలలోనూ, అత్యధిక పేద ప్రజలు రాజధానికి తిరగాల్సిన శాఖలను భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అధికార వికేంద్రీకరణ తేలిక అవుతుంది.

మూతబడిన (లేక మూతబడటానికి సిధ్ధంగా ఉన్న ) ఇంజనీరింగు లేక డిగ్రీ కాలేజీ భవనాలు



మూతబడిన (లేక మూతబడటానికి సిధ్ధంగా ఉన్న ) ఇంజనీరింగు లేక డిగ్రీ కాలేజీ భవనాలను ప్రతిజిల్లాలోనూ ఒక కాంప్లెక్సును టెండరులు లేక వేలం ద్వారా న్యాయమైన ధరకు కొనవచ్చు. వాటికి ఉండే ఆడిటోరియాలను, హాస్టళ్ళను రకరకాల పధ్ధతులలో వాడుకో వచ్చు. నాలుగు లక్షల కోట్లు ఎందుకో. విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరిలలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్లకు చావు దెబ్బ కొట్టచ్చు.

పటాటోపాల నేతలు రాష్ట్రపాలకులుగా పనికిరారు.

చంద్రబాబు, జగన్ వంటి పటాటోపాల నేతలు మనకు నాయకులుగా పనికిరారు. వీళ్లకి ప్రాధాన్యతలు తెలియవు.

Sunday, June 8, 2014

251 Will the astrologers and vastu persons decide the future of Andhra Pradesh?

251 Will the astrologers and vastu persons decide the future of Andhra Pradesh?
251 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రభవిష్యత్ ను జ్యోతిష్కులు మరియు వాస్తయ్యలు నిర్ణయిస్తారా?

చర్చనీయాంశాలు: 251, జ్యోతిష్యం, వాస్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, వేణుగానం, ఈశాన్యం, గడియారాలు, దైనిక్ భాస్కర్



ఆంధ్రప్రదేశ్ 2014 సంవత్సర, 1826 రోజుల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేలికగా పూర్తిచేసుకోవాల్సిన ప్రమాణ స్వీకారోత్సవం ఒక జాతరగా చేయబూనటం, నిధులను వృధా చేయటం అందరికీ తెలిసినదే.

ప్రమాణ స్వీకారం చేయాల్సిన జూన్ 8వతేదీనే కాక, సమయం రాత్రి 7.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాలని జ్యోతిష్కులు నిర్ణయించారట. ఈనాటి హిందూ పత్రిక, ఈముహూర్తాన్ని ఎంతో గొప్ప ముహూర్తంగా ప్రస్తుతించింది. కప్పగంతుల సుబ్బరామశర్మ అనే సిధ్ధాంతిగారు ఈ ముహూర్తాన్ని, శ్రీమోడీగారి ప్రమాణ స్వీకార ముహుర్తం కన్నా మెరుగైనది అన్నారట. కనకదుర్గా దేవాలయ స్థానాచార్యులు శ్రీ శివప్రసాద శర్మగారి ప్రకారం, రాజు పట్టాభిషేకంలో అతి ముఖ్యమైన విషయం మంచి ముహూర్తాన్ని ఎంచుకోటమేనుట.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు



ఇంత గొప్పవిషయాన్ని గుడ్డిగా నమ్మిన క్రీ.పూ. 326 క్రీ.శ. 1858 మధ్యకాలపు భారతీయరాజులు ఎంత మంది జ్యోతిష్కులకు రత్న కంకణాలను తొడిగారో? వాళ్ళు తుమ్మినా, దగ్గినా జ్యోతిష్కులను సంప్రదించేవారని ప్రతీతి. మరి రెండవ ప్రతాప రుద్రుడు ఏ జ్యోతిష్కుడిని నమ్ముకున్నాడో, తన రాజ్యాన్ని కోల్పోటమే కాకుండా, ఢిల్లీ సుల్తాన్ సైన్యం చేత బందీగా తీసుకెళ్ళ బడుతూ నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అళియ రామరాజు, సదాశివరాయలు, అచ్యుతరాయలు, వీళ్ళంతా జ్యోతిష్యం మీద, వాస్తుమీద నమ్మకాలు ఉన్నవాళ్ళే. మరి హంపీకి ఆగతి ఎందుకు పట్టిందో!!

దేవగిరి రాజ్యాన్ని శంకర మహాదేవుడు అనే గొప్ప దేశభక్తుడు , పరాక్రమశాలి అయిన యాదవరాజు పాలించే వాడు. దేవగిరి జ్యోతిష్కులు అసమర్ధులో ఏమో, వారు నిర్ణయించిన ముహూర్తానికే యుధ్ధం చేసినా, శంకరమహాదేవుడిని ఢిల్లీ సుల్తానులు తోలు ఒలిపించి, గడ్డితో నింపిన తిత్తిని హోయసల రాజ్యంలో తిప్పినట్లుగా చారిత్రిక కథనాలు ఉన్నాయి.

మే జూన్ నెలలలో ఆంధ్రప్రదేశ్ లో వహన వర్షాలు ఎక్కువ, సాయంకాలం పూట పడుతూ ఉంటాయి. వేడెక్కిన భూమిపైకి సముద్రంనుండి చల్లని గాలులు వీయటం, ఆవిరి అయిన సముద్రజలాలు ఘనీభవించి వడగళ్ళవానలు వంటివి పడుతూ ఉండటం పరిపాటి. అదిన్నీకాక ఋతుపవనాలు కూడ సమీపంలో ఉంటాయి. కరక్ట్ గా రాత్రి 7.27 నిమిషాలకే సుడిగాలి వచ్చి పెద్దవాన పడితే దానిని శుభశకునంగా మనపండితులు వర్ణించటం ఖాయం. కానీ ఇంటికి తిరిగి వెళ్ళె ప్రజలు అట్టై బుట్టై అన్నట్లుగా అయిపోతారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, నరేంద్రమోడీలు, సీమాంధ్ర ప్రజలపై రుద్దిన ఈ విభజనకు ఆమాత్రం కష్టాలు పడకపోతే ఎలా. విగుంతే సింగపూర్ కావద్దూ.



ఈనాటి హిందీ అభ్యాసం

దైనిక్ భాస్కర్



దైనిక్ భాస్కర్ ఒక అగ్రశ్రేణి హిందీ దిన పత్రిక. నవభారత్ టైమ్స్ మరియు దైనిక భాస్కర్ నుండి మనం రోజుకి రెండు మూడు వార్తలను చదివి ఆకళింపు చేసుకున్నా హిందీలో ఎంతో ప్రగతి సాధిస్తాము. ఉత్తరాది వారితో సంభాషించటంలోనూ, వారితో వ్యాపార లేఖలను, సందేశాలను మార్చుకోటంలో ఎంతో నైపుణ్యం వస్తుంది.

దైనిక్ భాస్కర్ చదవటానికి లింక్: http://m.bhaskar.com/regular/index.php కి వెళ్లటానికి క్లిక్ ఈరోజు దైనిక్ భాస్కర్ లో ఒక ఆసక్తి కరమైన అంశం కనపడింది, తెలుగు వాళ్ళ బెనిఫిట్ కొరకు అనువదించి, నా గాడిద బుధ్ధిలో భాగంగా వ్యాఖ్యానిస్తున్నాను.


1- घर में जो घडिय़ां बंद पड़ी हों, उन्हें या तो घर से हटा दें या चालू करें। बंद घडिय़ां हानिकारक होती हैं। इनसे नकारात्मक ऊर्जा निकलती है। घर के पूर्वोत्तर कोण में तालाब या फव्वारा शुभ होता है। इसके पानी का बहाव घर की ओर होना चाहिए न कि बाहर की ओर।

తెలుగు సారం: ఇంటిలో ఆగిపోయిన గడియారాలేమయినా పడి ఉంటే, వాటిని తిరిగి నడిచేలాగానన్నా చేయండి, లేదా ఇంట్లోంచి నెట్టేయండి. వీటినుండి నకారాత్మక శక్తి బయటకి వస్తుంది. ఇంటికి ఈశాన్యంలో నీటికొలను కాని, ఫౌంటేయిన్ కానీ ఉంటే శుభం. వీటినుండి ప్రవహించే నీళ్ళు ఇంటిలోపలికి ప్రవహించాలి. ఇంటి బయటకు ప్రవహించకూడదు.

2- वास्तु के अनुसार घर में बांसुरी रखना बहुत शुभ माना गया है। कृष्ण की बांसुरी सम्मोहन, खुशी और आकर्षण का प्रतीक मानी गई है। मान्यता है कि बांसुरी में से गुजर कर नकारात्मक ऊर्जा शुभ ऊर्जा में बदल जाती है। साथ ही बांसुरी शांति व समृद्धि का प्रतीक है। घर के मुख्य द्वार के समीप बांसुरी अवश्य लटकाएं।

2. వాస్తు ప్రకారం, ఇంటిలో వేణువులు ఉంచుకోటం ఎంతో శుభంగా భావించ బడుతుంది. శ్రీకృష్ణుడి వేణువు సమ్మోహనకరం, ఆనందం మరియు ఆకర్షణకు ప్రతీక గా గుర్తించబడింది. గుర్తింపు ఏమిటంటే, మురళి నుండి నకారాత్మక శక్తి శుభ శక్తిగా మారి బయటకి వస్తుంది. అంతే కాక పిల్లనగ్రోవి శాంతి, సమృధ్ధి కి ప్రతీక. ఇంటి ముఖ ద్వారం నుండి ఫ్లూట్ ను తప్పనిసరిగా పక్కకి నెట్టేయండి. (ముఖ ద్వారం సమీపంలో వేణువులు ఉండకూడదని భావం కావచ్చు).


వైబీరావు గాడిద వ్యాఖ్యలు



మా ఇంట్లో ఈశాన్యంలో ఉండిన మునిసిపల్ పంపు నీటి గుంటను నేను 1992 లో నీళ్ళురాకపోటంతో, ఎవరైనా పిల్లలు పడిపోయి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటారేమోనని పూడ్పించాను. ఆప్రదేశం సమీపంలో నే, వాన నీళ్ళు బయటకు పోటానికి ఈశాన్యం ప్రహరీగోడకు తూము పెట్టించాను. ఇంత రివర్సు వాస్తుచేసినా , నాగాడిద బుధ్ధి మనిషి బుధ్ధి కావటానికి జరగవలసిన చెడు జరగలేదు. తత్ ఫలితంగా మనకు మేలు గానీ, కీడు గానీ, జరిగిన సూచనలు ఏనాడూ కనపడలేదు. నాగాడిద బుధ్ధి అలానే స్థిరంగానే ఉన్నది.

మాఇంట్లో 1993 నుండి పది దాకా వేణువులు ఉండేవి. నాకు కోరిక, తీరిక, ఓపిక ఉన్న ప్పుడు సాధన చేస్తూ ఉండే వాడిని. పిల్లులకు వేణునాదానికి కొన్నిసార్లు ఏదైనా సంబంధం ఉండేదేమో, అప్పుడప్పుడు పిల్లులు వేణువు శబ్దం వినగానే దూరంనుండి కూడ వస్తూఉండేవి. అయితే వేణువు శబ్దాలకు, పిల్లుల రాకపోకలకు కార్యకారణ సంబంధం ఎస్టాబ్లిష్ కాలేదు. దానికి చేయవలసిన డబుల్ బ్లైండెడ్ అన్ బయాస్ డ్ స్టడీ పరిశోథనలను చేయవలసిన తీరిక మనకి లేదు.

నిశ్చయం: గడియారాలకు, వేణువులకు, నీటిగుంటలకు మనకు మంచి జరగటానికీ, చెడు జరగటానికీ సంబంధం లేదు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |