Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Tuesday, April 1, 2014

194 Amir's Mercedez

194 Amir's Mercedez

Topics for discussion: Amir Khan, సినిమాలు, కార్లు, ముఖేష్ అంబానీ, మహాభారతం, ఎర్రన, satyamev jayate, నరేంద్రమోడీ


సత్యమేవజయతే అనేది బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ గారు వారంవారం హోస్ట్ చేసే ఒక టివి కార్యక్రమంట. దేశంలోని సాంఘిక సమస్యలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను చూపిస్తుందట. బాగానే ఉంది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయిట. ఎందుకో ఏమిటో, ఈ దేశంలో అన్నీ విచిత్రాలే.


ఇపుడు ఇంకొక గొప్ప మరొక విచిత్రం జరిగింది. శ్రీ ఆమీర్ ఖాన్ గారు ఆత్మరక్షణ కొరకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక మెర్సిడెజ్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నారుట. ఇలాంటి కార్లు దేశంలో మూడే ఉన్నాయిట.

మొదటిది, దేశ ప్రధాన మంత్రి యైన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు గారి దొడ్లో కట్టేసి ఉంటుందట.

రెండోది వణిక్ సార్వభౌమ శ్రీముఖేష్ అంబానీ గారి చావిట్లో పడి ఉంటుందట.

మూడోదే గొప్ప సంఘసేవకుడైన మన ఆమీర్ ఖాన్ గారు ఊరేగే ఈ దివ్యరధం.

ఈనాటి పద్యం

ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన కవీంద్రుడు. శ్రీమదాంధ్ర మహా భారతం. ఆరణ్యపర్వం. షష్ఠాశ్వాసం, 135 వ పద్యం. అడవుల పాలైన పాండవులను ఓదార్చటానికి, వ్యాసుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజుకి నీతి బోధ చేస్తున్నాడు. ముద్గలుడు అనే ముని కథ్ చెప్పాడు. ముద్గలుడు ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్ధుడైన దుర్వాసుడు, ముద్గలుడికి బొందితో స్వర్గానికి వెళ్ళే వరాన్ని ఇచ్చాడు.

దేవదూత ముద్గలుడిని స్వర్గానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. ముద్గలుడు , ఆదేవదూతలను స్వర్గం ఎలా ఉంటుంది, అక్కడి ప్రత్యేకతలు ఏమిటి అని అడిగాడు. దేవదూత చెప్పిన పలు పద్యాలలో ఇవి కొన్ని.

తేట గీతి.
ఇందుఁ జేసిన పుణ్యంబు లెల్ల నందుఁ
గుడుచుఁ గాని మర్త్యున కందు గడఁగి పుణ్య
మాచరింపంగఁ గాదు పుణ్యావసాన
మగుడు భూమికి త్రోతురు మగుడ నతని.

కంద పద్యం
కడు మరగిన సౌఖ్యంబులు,
విడుచుటఁ జిత్తంబు దుఃఖ వివశముగ మహిం
బడుఁ జూవె పుణ్యలోకం,
బెడలిన మనుజుండు తేజ మేది యబలుడై.

కంద పద్యం

తన తక్కువ యునికియు న
న్యుని యున్నత శీలతయుఁ గనుంగొని చిత్తం
బున నెరియుచునికి గలుగును,
జననుత సురలోకవాస జనులకు నెల్లన్.

వచనం.
బ్రహ్మ లోకంబునం దక్కఁ దక్కిన పుణ్యలోకంబులందెల్ల నిదియ మేరయై చెల్లు. ... ... ...

ఈ వివరాలు ముద్గలుడికి నచ్చలేదు. పుణ్యం క్షీణించగానే క్రిందికి తోసేస్తారు, అనగానే, అది వాంఛనీయం కాదని అర్ధం అయ్యింది. పైగా, పాతపుణ్యాల ఫలాలను అనుభవించటమే కాని, కొత్తపుణ్యాలు చేసుకునే అవకాశం స్వర్గంలో ఉండదుట. (భూలోకంలో ఉంటుంది అని వేరే చెప్పనక్కరలేదు).

ముద్గలుడు, దేవదూతను వెనక్కి పంపించి, ఇంకా ఘోర తపస్సు చేసి, ఇంకా ఉన్నత లోకాలను పొందాడు.


ఆమీర్ ఖాన్ గారి మెర్సెడెజ్ బెంజి బుల్లెట్ ప్రూఫ్ కారు దీని ముందెంత? శ్రీనరేంద్రమోడీగారికి కూడ గుజరాత్ ప్రభుత్వ ఖర్చుతో బుల్లేట్ ప్రూఫ్ సువ్ (sports utility vehicle) అమరింది. శ్రీవారు గోవా వెళ్ళినపుడు భద్రత కొరకు ఈ బుల్లెట్ కారును కూడ తీసుకెళ్ళారు.

193 Modi Eenadu Interview

193 Modi Eenadu Interview

Topics for Discussion, చర్చ విషయాలు, चर्चांश: Narendra Modi, నరేంద్రమోడీ, ఈనాడు, స్వామి వివేకానంద, పోర్ బందర్, అద్వానీ, జశోదాబెన్



ఈనాడు దినపత్రిక 1.4.2014 మంగళవారం, మొదటి పేజీ పతాక శీర్షికలో ''ఆరు పదుల దురాగతాలపై... విముక్తగీతమై ... వస్తున్నా ! '' అని బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ గారితో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది.
తెలుగు భాషలో అత్యధిక సర్కులేషన్ గల అగ్రశ్రేణి దిన పత్రిక ప్రచురించ తగ్గ ఇంటర్వ్యూ యేనా అనే సందేహం విజ్ఞులైన పాఠకులకు కలగక మానదు. ఈఇంటర్వ్యూకి పెయిడ్ ఇంటర్వ్యూలకి ఉండవలసిన కొన్ని లక్షణాలైనా ఉన్నాయని చెప్పక తప్పదు.

సాధారణంగా శ్రీ నరేంద్రమోడీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వరని, ఇచ్చినా మధ్యలోనే లేచిపోతూ ఉంటారని, మీడియా వారిని చీపురు పుల్లల్లాగా చూస్తారని ప్రతీతి. మరి ఈనాడు పేపర్ వారిపై శ్రీవారికి ఎందుకు అమిత దయ ఎందుకు కలిగిందో ఏమో.

పెయిడ్ ఇంటర్వ్యూల ప్రధాన లక్షణం ఏమిటంటే, అసౌకర్యకరమైన ప్రశ్నలు అడగక పోవటం. పేషెంటు కోరిన మందులనే వైద్యుడు ప్రిస్క్రైబ్ చేసినట్లుగా, ఇంటర్వ్యూ ఇచ్చేవారు జవాబు ఇవ్వదలుచుకున్న ప్రశ్నలనే మీడియా వారు అడుగుతూ ఉంటారు.

సరే భారత ప్రజలకి మోడీ గారు చెప్పిందే భాగ్యం అన్నట్లుగా, ఆ పత్రిక వారు అడిగిన ప్రశ్నలలో కొన్నిటిని, వాటికి శ్రీ మోడీజీ ఇచ్చిన జవాబులను పరిశీలిద్దాము. అదే సమయంలో అడగాల్సిన విషయాలను వదిలి వేయటం గురించి కూడ ఆలోచిద్దాము.

''వారసత్వ బలం లేదు.. ఆక్సఫర్డ్, హార్వర్డ్ చదువుల్లేవు. హార్డ్ వర్క్ ను నమ్ముకొని .. పట్టుదలను పెంచుకొని .. ప్రజల్ని చదివి .. చాయ్ కొట్టు నుంచి ఎదిగి .. అనుభవమే అంతస్సూత్రంగా .. సంకల్పమే ఆయుధంగా .. ప్రధానమంత్రి పదవికి ప్రయత్నిస్తున్న సాహసి. .. కురువృధ్ధ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ధీశాలి. యువతరంతో కలసి నవభారత నిర్మాణానికి కలలు కంటున్న కార్యశీలి. సామాన్యుడు కూడా సై అనటానికి చోటుందని మన ప్రజాస్వామ్య బలాన్ని చాటుతున్న బాటసారి. నరేంద్ర మోడీ!''


వైబీరావు గాడిద వ్యాఖ్యలు:-=

అగ్రశ్రేణి పత్రికలు భట్రాజుల్లాగా మారక పోతే వాటికి ప్రకటనలు ఎక్కడనుండి వస్తాయి. మీడియా తో పాటు ఇతర వ్యాపారాలను కూడ చేస్తున్నప్పుడు సహజంగా ఎక్కడో అక్కడ ఏదో ఒక పొరపాటు చేయటం, లేక ఏదో ఒక మారుమూల చట్టంలోని ఏదో ఒక మారుమూల సెక్షన్ లను తెలిసి గానీ, తెలియక గా ని అతిక్రమించటం జరగవచ్చు. ఎందుకైనా మంచిదని , అధికారంలోకి రావటానికి అవకాశం ఉన్నవారిని మంచి చేసుకోటం మేలు కదా. ఈవిషయంలో ఈ ఇంటర్వ్యూని ప్రచురించిన అగ్రశ్రేణి పత్రికను నిందించటం న్యాయం కాదు. పెట్టుబడి దారీ విధానంలో మీడియా ఎలా ప్రవర్తించాలో, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ మీడియా ఎలా ప్రవర్తిస్తుందో అలాగే భారతీయ మీడియా కూడ ప్రవర్తిస్తుంది. లేకపోతే మనుగడ కష్టం. దీనినే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనచ్చు.




అడగని మొదటి ప్రశ్న: గుజరాత్ లో సీనియర్ బిజేపీ నేతలను మీరెందుకు పొమ్మనకుండా పొగ పెట్టారు. గుజరాత్ లో శ్రీ కేషూభాయి పటేల్, శంకర్ సింగ్ వాఘేలాలు పార్టీని వదలి ఎందుకు వెళ్ళారు?




అడగని రెండవ ప్రశ్న: మీరింకా అఖిలభారత స్థాయి నేతగా స్థిర పడలేదు. జాతీయ స్థాయిలో మీకన్నా ఎంతో సీనియర్ నేతలైన మురళీ మనోహర్ జోషీ, లాల్జీ టాండన్ లను వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారి నియోజక వర్గాలనుండి ఎందుకు బయటకు పంపేశారు?


అడగని మూడవ ప్రశ్న: బిజెపి భీష్ముడు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారిని భోపాల్ నియోజక వర్గంనుండి పోటీ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు?


అడగని నాలుగవ ప్రశ్న: ఆయారాం గయారాం రాజకీయాలను బిజెపి ప్రోత్సహిస్తున్నది అనటానికి సూచన రాజస్థాన్ లోని బర్మర్ నియోజక వర్గంనుండి లోక్ సభకు పోటీచేయటానికి కాంగ్రెస్ నుండి దూకిన సోనారాం చౌధరికి టికెట్ ఇవ్వటం, మీ కన్నా ఎన్నో రెట్లు సీనియర్, దేశ ఆర్ధిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవశాలి శ్రీ జస్వంత సింగును గెంటి వేయటం ఎంతవరకు సమంజసం?

అడగని ఐదవ ప్రశ్న: మీరింత వరకు లోక్ సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎన్నికయ్యి ఆసభలు ఎలా పనిచేస్తాయో చూడలేదు. కేంద్రంలో కనీసం ఒక్క సంవత్సరమైనా మంత్రిగా పనిచేసి కేంద్ర క్యాబినెట్ ఏవిధంగా పనిచేస్తుందో ఆకళింపు చేసుకోలేదు. యకాయకి స్వర్గానికి నిచ్చెనలు వేయాలనే, బొందితో స్వర్గానికెళ్ళాలనే కోరిక త్రిశంకుకు, కాశీ మజిలీ కథల్లో ఒక వేశ్యకు కలిగినట్లుగా డైరక్టుగా ప్రధాని కావాలనే కోరిక ఎంత వరకు సమంజసం?




(ఇటువంటి కోరిక రాహుల్ గాంధీ, అరవింద్ కెజ్రీవాల్ , జయలలితలకు కూడ ఉండకూడదు).
శ్రీఅద్వానీ గారినో, మురళీ మనోహర్ జోషీ గారినో ప్రధానమంత్రిని కానిచ్చి, మీరు ఏదైనా కీలక శాఖకు కేంద్రమంత్రి గా వ్యవహరిస్తూ ప్రణాలికా బధ్ధంగా సమన్వయంతో, సఖ్యతతో, ముందుకు వెళ్ళచ్చు. సీనియర్ నేతల నెత్తులపై నుండి తొక్కుకుంటూ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ మీరేమి సాధిస్తారు అని శ్రీ మోడీని అడిగి ఉండాల్సింది.


ఈయన యేనా చాయ్ వాలా?

అడగని ఆరవ ప్రశ్న: చాయ్ కొట్టునుండి ఎదిగిన మీరు మీ చాయ్ వాలా జీవితాన్ని ఎందుకు మర్చిపోయారు? చాయ్ వాలాలు అహమ్మదాబాద్ లోనే అత్యంత ఖరీదైన డిజైనర్ కుర్తాలను వేసుకుంటారా? క్షణానికో రకం బూట్లు మార్చుకుంటారా? మీవార్డ్ రోబ్ లో ఎన్ని రకాల కుర్తాలు ఎన్నేసి ఉన్నాయి? ఎన్నిరకాల బూట్లు ఎన్నేసి ఉన్నాయి?
ఇదిగోనండి మన చాయ్ వాలా గారు

ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలకు బూట్లు అవసరమా? మీకు మేకప్ మెన్లు ఎంతమంది ఉన్నారు? మీవెంట మేకప్ వ్యాన్ కూడ వస్తుందా? సాధారణంగా సినీ హీరోలకు, హీరోయిన్లకు మేకప్ మెన్ లు ఉంటారు, మేకప్ వ్యాన్ లు ఉంటాయి. చాయ్ వాలా లీడర్ కు కూడ ఉంటాయా?


అడగని ఏడవ ప్రశ్న: స్వామి వివేకానందా గారు మీ రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు. ఆయన పుస్తకాలతో ప్రభావితమైనట్లుగా చెప్పుకుంటున్నారు. స్వామి వివేకానంద గారి సంపూర్ణ రచనలను మీరు చదివారా? చదివితే ఆయన భారత్ ను కుళ్ళిన శవంతో, జల్లి ఫిష్ తో పోల్చిన విషయాన్ని ఎలా మర్చి పోయారు? స్వామీజీ క్రిస్టినా గ్రీన్ స్టైడల్ అనే యువతికి లేఖ వ్రాస్తూ నా నరాలన్నీ వేడెక్కాయని ఎందుకు వ్రాశారో మీరు చెప్పగలరా? స్వామీజి షాడ్ ఫిష్ అనే చేపలను తినటానికి భారత్ రమ్మని విదేశీ స్త్రీలను రమ్మని ఎందుకు లేఖ వ్రాశారో చెప్పగలరా?

అడగని ఎనిమిదవ ప్రశ్న: ప్రతి పేదవాడికి ఇల్లు, వృధ్ధులకు మందులు , పిల్లలకు విద్య లభించే దాకా మీకు మధుర క్షణాలు రావన్నారు. ఇళ్ళు తరువాత ఇప్పించవచ్చు. మీరు ధరించే ఖరీదైన తలపాగాలిప్పించకపోయినా, కనీసం తుండు గుడ్డలు ఇప్పించవచ్చునే. కచ్ ఎడారిలో మండు టెడారిలో గొర్రెలను కాచుకుంటూ, తిరిగేటపుడు , కనీసం నెత్తిమీద కప్పుకోటానికి పనికి వచ్చేవి. మీరు గుజరాత్ లో పేదలకు మీ అంత ఖరీదైనవి, స్టైలిష్ వి కాకపోయినా, కనీసం సాధారణ జనతా కుర్తాలు, మీ అంత ఖరీదైన షూస్ కాకపోయినా, హవాయి రబ్బర్ పాదరక్షలు ఇప్పించారా? ఇంత పేదదేశంలో గుజరాత్ ముఖ్యమంత్రికి బులెట్ ప్రూఫ్ ఆఫీస్ రూ. 150 కోట్ల ఖర్చుతో అవసరమా?


అడగని తొమ్మిదవ ప్రశ్న: మహిళా సాధికారికత గురించి మీరింత తాపత్రయ పడటం ఎంతో సమ్మోదకరం. మరి శ్రీమతి జశోదా బెన్ అనే అభాగ్యురాలు గత మూడు దశాబ్దాలుగా నిరాదరణకు గురియై కనీసం పదవ తరగతి పరీక్ష ఫీజుకు నోచుకోకుండా మగ్గుతున్నది. ఆమెకు మీ ధర్మపత్నిగా మీరు చేసే పుణ్యకార్యాలలో పాల్గొనే భాగ్యాన్ని కలిగిస్తారా?

అడగని తొమ్మిదవ ప్రశ్న: కాంగ్రెస్ , మరియు ఇతర పార్టీల అభ్యర్ధులలో నేరచరిత్రులు ఉన్నమాట నిజమే. మరి బిజేపీ లోక్ సభ అభ్యర్ధులలో కూడ నేరచరిత్రులు దీటైన సంఖ్యలోనే ఉన్నారు. నేరచరిత్రుల సంఖ్య తగ్గించటానికి మీరు చేసిన కృషి ఏమిటి? పోర్ బందర్ లో Vitthalbhai Hansrajbhai Radadiya విఠల్ భాయి హంసరాజ్ భాయ్ రదదీయ అనే 16 క్రిమినల్ కేసులున్న కాంగ్రెస్ నేర చరిత్ర ఎంపీని మీరు బిజెపి లోకి ఎలా చేర్చుకోగలిగారు? బిజెపికి నేరచరిత్రులను చేర్చుకోకూడదనే సిధ్ధాంతం లేదా? లోక్ సభలో ఈయన హాజర్ 25% కూడ లేదు. లోక్ సభ స్పీకర్ కు ఆస్తులు అప్పుల పట్టిక సమర్పించని ఇద్దరు ఎంపీలలో ఈయన ఒకరు. ఈయనకు మీరు 2014 లో టికెట్ ఇస్తారా , ఇవ్వరా?

అడగని పదవ ప్రశ్న: ఒక లోక్ సభ నియోజక వర్గంనుండి పోటీ చేయకుండా రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేయటం అంటే మీరు అభద్రతా భావంతో బాధ పడుతున్నట్లే లెక్క. మీకు వారణాసి ప్రియమైనది, అనుకుంటే వడోదారా నుండి పోటీ చేయవలసిన అవసరం లేదు. లేదు, ఉత్తర ప్రదేశ్ లో పార్టీని పటిష్ఠపరచటం మీలక్ష్యం అనుకుంటే, మీరు రాయ్ బరేలీ నుండి గానీ అమేథీ నుండి గానీ పోటీచేయాల్సింది. షహ్ జాదా ను ఆయన ఇంటిలో నే ఓడించటం నిజంగా గొప్ప ఛాలెంజి.

అడగని పదకొండవ ప్రశ్న: 2002 లో గుజరాత్ లో మారణ కాండ జరుగుతున్నపుడు, అదనపు బలగాలను పంపమని మీరు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారితో గానీ, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారితో గానీ ఫోన్ లో మాట్లాడారా? వారేమి చెప్పారు? దీని కేదైనా రికార్డు మీ కార్యాలయంలో కానీ, ప్రధాని కార్యాలయంలో కానీ, ఉపప్రధాని కమ్ హోం మంత్రి గారి కార్యాలయంలో కానీ ఉన్నదా?

ఇంకా వ్రాయాల్సింది ఉంది.

Monday, March 31, 2014

192 External Debt

192 External Debt

Topics for discussion, చర్చాంశాలు, चर्चां विषय, ایجنڈا : External Debt, భారత్ విదేశీ అప్పులు, ఋణభారం



పై అంకెలను చూస్తే ఏమి అర్ధం అవుతుంది?

ఏమీ అర్ధం కావటం లేదా? ఎందుకు అర్ధం అవుతుంది లెండి. ఈరోజు అఖిల భారత స్థాయిలో భారతీయులు, రాష్ట్ర స్థాయిలో తెలుగు వాళ్ళు ఏమీ అర్ధం కాని స్థితి లో ఉన్నారు.

1991లో భారత్ విదేశీ ఋణ భారం 83 బిడాలు. బిడా -= బిలియన్ డాలర్లు, అంటే 100 కోట్ల డాలర్లు, షుమారు రూ. 6000 కోట్లు. 83 బిడాలు రూ. 5 లక్షల కోట్లు. అది పివి నరసింహారావు గారి రాజ్యం. మన్మోహన్ సింగు గారు ఆర్ధిక మంత్రే కాని, పివి గారి కనుసన్నల్లో పనిచేయాలి. చంద్రశేఖర్ దిగి పోయాడు. భారత్ కు విదేశీ మారకం కొరత ఉండి, కొంత బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అయినా 5 లక్షల కోట్ల విదేశీ అప్పు అప్పటి ధరలలో పెద్ద అప్పుగా కనిపించినా, 2014 నాటి భారత విదేశీ అప్పుతో పోలిస్తే కోడి ఈకతో సమానమే. ఉఫ్ అంటే గాలికి ఎగిరేదేమో.

1996 వచ్చింది. దేవేగౌడ ప్రధాని అయ్యాడు. తరువాత ఐకె గుజ్రాల్ వచ్చాడు. ౧౯౯౯ నాటికి 93 బిడాల అప్పు కాస్తా 96 బిడాలకు పెరిగింది. ఇది కూడ పెద్ద పెరుగుదల కాదేమో. ఏడాదికి ఒక బిడా పెరిగినట్లు.

1999 లో వాజపేయీ రాజ్యం వచ్చింది. ఆయన ఐదేళ్ళు పాలించగా, 96 బిడాల అప్పుకాస్తా 112 బిడాలకు పెరిగింది. ఏడాదికో రెండు బిడాలు పెద్ద పెరుగుదల కాదేమో.

2004 వచ్చింది. యుపిఎ 1 పాలనలో మన్మోహన్ ప్రత్యక్ష ప్రధాని, సోనియా పరోక్ష ప్రధాని అయ్యారు. యుపిఏ 1 పాలనలో 112 బిడాల అప్పు ఐదేళ్ళలో 2009 నాటికి రెట్టింపు అయ్యి 224 బిడాలకు చేరుకుంది. సరాసరి ఏడాదికి 23 బిడాల లెక్క. ఓరి నాయనో.

2013 నాటికి చూడండి. ఇది యుపిఏ 2 పాలన. 224 బిడాలనుండి 425 బిడాలకు వెళ్ళింది. దాదాపు రెట్టింపు. ఏడాది కి షుమారు 45 బిడాలు. 425 బిడాల రూపాయల లెక్కలో చూసుకుంటే 25,50,000 కోట్ల రూపాయలు.

1991 నుండి 2013 నాటికి భారత్ విదేశీ అప్పు ఎన్ని రెట్లు పెరిగినట్లు. 5 రెట్లు పెరిగినట్లు. ఆర్ధిక సంస్కరణల ఫలితమా ఇది? భారీ పెరుగుదల అంతా యుపిఏ పాలనలోనే జరగటం గమనార్హం.


తామెంతటి ఋణ భారాన్ని మోస్తున్నామో వోటు వేయటానికి వెళ్తున్న ఈ 100 ఏళ్ళ వృధ్ధుడికి గానీ, లేక ఈ వృధ్ధుడిని మోసుకెళ్తున్న యువకుడికి గానీ తెలియదు. ఈ ఫొటో 1952 ఎన్నికల నాటిది. 2014 నాటికి వోటర్ల చైతన్యంలో ఎంత మార్పు వచ్చిందనేది చెప్పటం కష్టం.

ఒకటి మటుకు నిశ్చయం. యుపిఎ పాలనలో విదేశీ అప్పులు 5 రెట్లు పెరగటం మన వోటర్లకు తెలియదు. తెలుసుకోవాలనే కోరిక కూడ వారికి లేదు. తెలుసుకోవాలనుకున్నా తెలుసుకునే శక్తి కూడ వారికి లేదు.

మన వోటర్లకు మానసిక పరిణతి, మానసిక ధార్ఢ్యం సరిగా ఉండాలి. స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు లోక్ సభ ఎన్నికలకు తేడా ఉంది. సరియైన సమాచారం, తెలుసుకోని, విశ్లేషించుకోని వోటర్లు పాల్గొంటే ప్రజాస్వామ్యానికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.

Sunday, March 30, 2014

191 Nagma నగ్మా नगमा نگمآ

191 Nagma నగ్మా नगमा نگمآ
Topics for discussion, చర్చాంశాలు, चर्चांश, ایجنڈا: Nagma, Congress, Lok Sabha, groping, మీరట్, मेरठ, میرٹھ, ఉత్తరప్రదేశ్, Freedom Movement



ఇది మీరట్ లో అమరవీరుడు మంగల్ పాండే విగ్రహం. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి ఇతడే.


టెల్లీవుడ్, బాలీవుడ్ లో గతంలో మెరిసిన తార నగ్మా నేడు, జయప్రద వలెనే, ఈమె కూడ ఉత్తరప్రదేశ్ నుండే పోటీ చేస్తుంది. మీరట్ నియోజక వర్గం. రాజధాని ఢిల్లీకి 70 కిలోమీటర్లు ఈశాన్యం. ఆటవస్తువులు, సంగీత వాయిద్యాలు తయారు అవుతాయి.



రామాయణంలో మీరట్



రావణాసురుడి మామ గారు మాయాసురుడు, మండోదరి తండ్రి. మాయారాష్ట్ర కాస్తా మేరఠ్, మీరట్ అయిందట. నేను రామాయణవైబి.బ్లాగ్ స్పాట్.కామ్ నా బ్లాగ్ లో, మండోదరి స్థలం రాజస్థాన్ లోని మందసార్ అని వ్రాశాను. రావణుడి అత్తగారి ఊరు రాజస్థాన్ లోనో, ఉత్తర ప్రదేశ్ లోనో ఉంటే, ఆయన లంక ఎక్కడో 2000 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న శ్రీలంకలో ఉండటం అసాధ్యం. రావణుడి లంక రాజస్థాన్ నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మధ్యభారత్ లోనే ఉండి ఉండాలి. భారత పురాతత్వ శాఖ వారు పూనుకుంటే తప్ప అసలు రావణ లంక మధ్య భారత్ లో బయట పడదు. రావణుడి లంకను, సంబంధించిన ప్రదేశాలను టూరిస్టు స్పాట్ లు గా మార్చి శ్రీలంక డబ్బు చేసుకుంటున్నది. రావణ లంకను అధికం గా దర్శించే టూరిస్టులు ఎక్కువగా భారతీయులే.

మీరట్ చరిత్ర

ఇక్కడ సింధూ నాగరికత శిథిలాలు కూడ బయట పడ్డాయి. ఇక్కడ అశోకుడు నాటించిన స్థంభ శాసనం యొక్క ముక్క లండన్ మూజియంలో ఉంది. మీరట్ నగరం ఘజ్నీ, ఘోరీ, తైమూరు అందరి చేత కూడా దాడి చేయబడి , తైమూర్ చేతిలో లక్షమంది రాజపుత్రులు తమ తలలను భారత మాతకు సమర్పించిన దివ్య వీర స్థలం. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయిన పుణ్యభూమి మీరట్. ఆవుకొవ్వు, పందికొవ్వుతో చేసిన తూటాలను నోటితో కొరికటానికి నిరాకరించినందుకు 85 మంది సిపాయిలు 10 ఏళ్ళ కఠిన కారాగారానికి గురియైన ధీర స్థానం. శ్రావణకుమారుడిని దశరధుడు శబ్దభేది విద్యతో పొరపాటున జంతువుగా భ్రమించి బాణమేసి చంపిన ప్రదేశంట.

మీరట్ అభివృధ్ధి



మీరట్ నుండి ఢిల్లీకి రోజుకి 27 జతల రైళ్ళు నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సికిందరాబాదుకి గానీ, విజయవాడకి గానీ, విశాఖకి గానీ, ఇలాంటి 27 జతల రైళ్ళు ఉన్నాయా?

మీరట్ జనాభా 14 లక్షలు వేగం గా పెరుగుతున్నది కాని, ఉపాధి కల్పనలో భారత్ లో కిందినుండి పదో స్థానంట. మాల్స్, ఫ్లైవోవర్స్ , అపార్టుమెంటులు వీటినే అభివృధ్ధిగా భావించే వక్ర మేథస్సు కల దేశం కదా ఇది. వీటికి మీరట్ లో కొదువ లేదు. మీరట్ కత్తులకు, కత్తెరలకు ప్రసిధ్ధి. ఈపరిశ్రమ ఇపుడు వెనుకడుగు వేసి ఉండాలి.

మీరట్ లో నేటి సంస్కృతి

అది అలా ఉండగా, గజరాజ్ సింగ్ అనే కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ. గారు నగ్మా గారి ముఖాన్ని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడుట. ఎం.ఎల్.ఎ. గారికి ఎక్కడ కోపం వస్తుందో, తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాడేమోనని కాంగ్రెస్ భయపడిందో ఏమిటో ఆ గజేంద్రుడిపై చర్య తీసుకోలేదు. గజేంద్రుడిని విమర్శించటానికి సాహసించిన ప్రమోద్ కాత్యాన్ అనే కాంగ్రెస్ నాయకుడిని పార్టీనుండి బహష్కరించారట.

ఒక సభలో ఆమెను తడమటానికి (గ్రోపింగు) ప్రయత్నించిన ఒక ఆగంతకుడిని ఆమె చెంప పగుల కొట్టిందిట. మరల ఇలా జరిగితే నేను మీరట్ కు రాను అన్నదిట. తన భద్రతకోసం ప్రత్యేక బౌన్సర్లను నియమించుకున్నదట.

విచిత్రమేమిటంటే, ఇవన్నీ అబధ్ధాలే. ఇది ఒక రాజకీయకుట్ర అని ఆమె అంటున్నది.
I do not know why I am being targeted like this. How can I get groped or molested every single day? Of course, I am campaigning and the rallies have their ups and downs, but this is ridiculous. I was not groped or molested --- I really do feel that this could be a political conspiracy.

తెలుగు సారం: నన్ను ఎందుకు టార్జెట్ చేస్తున్నారో నాకు తెలియదు. ప్రతిరోజూ నేను తడమ బడటం, మొలెస్ట్ చేయబడటం ఎలా కుదురుతుంది? నేను ప్రచారం చేస్తున్నాను, రాలీలు అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇది విచిత్రం, హాస్యాస్పదం. నేను గ్రోప్ చేయబడలేదు. మొలెస్ట్ చేయబడలేదు. --- ఇది ఒక రాజకీయ కుట్ర అయి ఉండచ్చని నేను అనుకుంటున్నాను.

వైబీరావు గాడిద వ్యాఖ్య



ఇలాంటి ప్రదేశం నుండి నగ్మా గారు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి లోక్ సభలో ఏమి చేస్తారు? మంగళ్ పాండే పుట్టిన దేశానికి ఏమిటీ ఈదుర్గతి?

ఈ నాటి పాట. చిత్రం మిస్సమ్మ.


ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి||
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే....అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె అలిగి ||
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె చొరవ||
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి||

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే విసిగి || తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి|| ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి ||

190 Part 1 of ratirAju Cupid Eros Amor भाग १ रतिराज मन्मथ భాగం ౧ , రతిరాజు మన్మథుడు




TOPICS FOR DISCUSSION: Self-control, sex, instincts, homosexuality, lgbt, స్వలింగ సంపర్కం

Artha, the Open Source Thesaurus defines ''instinct'' as an inborn pattern of behavior often responsive to specific stimuli.
తెలుగు సారం: ఇన్ స్టింక్ట్ = బాహ్య ప్రేరణలకు, వ్యక్తులు అంతః జనితంగా , ప్రతిస్పందించే ప్రవర్తనా సరళి.

ఆకలి, నిద్ర, మైధునం, విశ్రాంతిని కోరటం, మరణానికి భయపడటం, ఇవన్నీ ఇన్ స్టింక్ట్ తరగతిలోకే వస్తాయి.

కొద్ది రోజుల క్రితం మ్యారేజెస్ (సేమ్ కపుల్స్ యాక్ట్) 2013 ప్రకారం, ఇంగ్లండు స్వలింగ వివాహాలను (గే వివాహాలను లేక లెస్బియన్ వివాహాలను) అనుమతించింది. 29.03.2014 నాడు ఇంగ్లండులో మొదటి సేమ్ సెక్స్ మ్యారేజ్ రికార్డు అయ్యింది. ఉత్తర ఐర్లండు (రాజధాని బెల్ ఫాస్ట్ యునైటెడ్ కింగ్ డమ్ లో భాగమే) లో మాత్రం ఇది ఇంకా చట్టం కాలేదు. అయితే వారు ఇంగ్లండు, వేల్స్ మొ|| ప్రాంతాలలో జరిగిన వాటిని మాత్రం పౌర భాగస్వామ్యాలుగా గుర్తించుతారట.


స్వలింగ సంపర్కాన్ని, ముఖ్యంగా భారత్ లో స్వలింగ సంపర్కాన్ని, సమర్ధించటం గానీ, వ్యతిరేకించటం గానీ ఈ వ్యాస లక్ష్యం కాదు. సమర్ధించుకోటానికి స్వలింగ సంపర్కీయులకు సంఘాలున్నాయి. వ్యతిరేకించుకునే వారు కూడ కొంత మేరకు సంఘటితులయ్యే ఉన్నారు.

ఇన్ స్టింక్ట్ అనే పదాన్ని మనం జననార్తి అని అనువదించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. స్వలింగ సంపర్కాన్ని, మనం జననార్తి అనవచ్చా అనేది కూడ చర్చనీయమే. భిన్న లింగ సంపర్కం ఏవిధంగా అయితే జననార్తి అయ్యిందో స్వలింగ సంపర్కం కూడ జననార్తి అవ్వాలి అనే అభిప్రాయం ఉంది.

నిర్వచనం కోణం లోంచి చూసినపుడు జననార్తులు మనకి పుట్టుకతో రావాలి. ఇవి అంటించుకునే వస్తువులు కాకపోవచ్చు. అలా అనకుంటే, కాఫీ తాగటం , మద్యం తాగటం, సిగరెట్లు తాగటం, పొగాకు నమలటం జననార్తులా? అంటించుకునేవా? ఆకలయితే అన్నం తినటం, దాహమయితే మంచినీళ్ళు కానీ, లేక ఎదురుగా ప్రత్యక్ష మరణ కారకం కాని ఏద్రవం కనిపించినా త్రాగటం కూడ జననార్తే అవుతుంది. మినరల్ వాటర్ ని కోరటం, పిజ్జాలను హ్యాంబర్గర్లను , జీడిపప్పు పకోడీలను కోరటం జననార్తి అనచ్చా?

నిధులు బాగా ఉన్న ప్రభుత్వ సంస్థలలోనూ, కార్పొరేట్ సంస్థల్లోనూ వివిధ స్థాయిల్లో అధికారులు మీటింగులు జరుగుతూ ఉంటాయి. వీటిని మీటింగులతో పాటు ఈటింగులు అని కూడ అనచ్చు. ముఖ్యాధికారి (కారుల) జిహ్వా చాపల్యాన్ని బట్టి జీడి పప్పు పకోడీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు పెట్టచ్చు. లేదా, ఉప్పు బిస్కెట్లతో సరిపెట్టచ్చు.

మటన్ బిరియానీ తినాలనే కోరిక వలెనే స్వలింగ సంపర్కాన్ని కూడ చాపల్యం అనచ్చా.

చాపల్యానికీ, జననార్తికీ మధ్యలో మనం మరో రెండు పదాలను కూడ జోడించు కోవచ్చు. 1. డీవియేషన్ = విచలనం, నామ్ (లేక నార్మ్) లేక స్టాండర్డు నుండి దూరంగా జరిగి పోటం. 2. వ్యాధి. కొన్ని సార్లు మానసికం కావచ్చు, కొన్ని సార్లు శారీరికం కావచ్చు, లేదా రెండూ కూడ కావచ్చు.

స్వలింగ సంపర్కాన్ని జననార్తి అనాలా, చాపల్యం అనాలా, విచలనం అనాలా, వ్యాధి అనాలా?


భారత్ లో స్వలింగ సంపర్కం ఐపీసీ (భారతీయ శిక్షా స్మృతి) 377 సెక్షన్ ప్రకారం నేరం. సురేష్ కుమార్ కౌశల్ vs. నాజ్ ఫౌండేషన్ కేసు CIVIL APPEAL NO.10972 OF 2013 లో సుప్రీం కోర్టు డిసెంబర్ 2013 లో సెక్షన్ 377 చెల్లుతుందని ధృవీకరించింది.

జనవరి 2014 లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, నాజ్ ఫౌండేషన్ వారు ఫైల్ చేసిన స్పెషల్ రివ్యూ పిటీషన్ ను కూడ తిరస్కరించారు. ఈ సందర్భంగా , సుప్రీంకోర్టు బెంచి వారు చెప్పిన విషయం గమనార్హం.
While reading down Section 377, the High Court overlooked that a miniscule fraction of the country’s population constitutes lesbians, gays, bisexuals or transgenders, and in the more than 150 years past, less than 200 persons have been prosecuted for committing offence under Section 377, and this cannot be made a sound basis for declaring that Section ultra vires Articles 14, 15 and 21."

తెలుగు సారం: సెక్షన్ 377 ను చదివే సందర్భంలో , హై కోర్టు దేశంలో అతికొద్ది ప్రజలు లెస్బియన్ లు (స్త్రీ స్వలింగ సంపర్కులు), గే స్ (పురుష స్వలింగ సంపర్కులు), ద్విలింగులు, లింగమార్పితులు అన్న విషయాన్ని చూడలేదు. గత 150 ఏళ్ళలో , సెక్షన్ 377 క్రింద విచారింపబడిన వారి సంఖ్య 200 కన్నా తక్కువే. కనుక రాజ్యాంగం 14, 15 మరియు 21 ప్రకారం ఈ సెక్షన్ చెల్లదు అని ప్రకటించటానికి ఇది బలమైన ఆధారం కాలేదు.


శిక్ష పడిన వారి సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, పరస్పరామోదంతో స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నవారి సంఖ్య ఎంతో మనకి తెలియదు. గ్రామాల సంగతి చెప్పలేము కాని, పట్టణాలలో, నగరాలలో తగిన సంఖ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. డిసెంబరు 2013 శ్రీ సింఘ్వీ , ముఖోపాధ్యాయ గార్ల తీర్పు ముందు, హైకోర్టు తీర్పు ఆధారంగా స్వలింగీయులు కొంత మేరకు బయటకు వచ్చారు. ఇప్పుడు అది నేరం గా ప్రకటించబడింది కాబట్టి, సమాజంలో ఈ అలవాటు తిరిగి రహస్యంగా జరిగే అవకాశం ఉంది.

సమాజానికి పారదర్శకత అనేది ముఖ్యం అని నా నమ్మకం. స్వలింగ సంపర్కం ఒక ఫ్యాషన్ గా మారాలని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. ప్రకృతి విరుధ్ధ డీవియేషన్ (విచలనమే )కా వచ్చు, వ్యాధే కావచ్చు, లేదా చాపల్యమే కావచ్చు, జననార్తే కావచ్చు, ఏదైనా రహస్యం ఎంత కాలం?

నా పరిచయస్థులలో కూడ స్వలింగ సంపర్కులు ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజం చెప్పటాన్ని ప్రోత్సహించటం సమాజానికి ఎంతో అవసరం. బయటకు రావటం లేదు కాబట్టి భారత్ లో ఫలానా అలవాటు లేదు అని ప్రకటించుకోటం సత్యానికి న్యాయం చేయదు.

నేను గతంలో ఒకసారి నాబ్లాగ్ పోస్టులో వ్రాశాను. ఈ ప్రాబ్లెమ్స్ ఆఫ్ తెలుగు బ్లాగును నాలుగేళ్ళలో సుమారు 4000 మంది చూడగా (చదివారు అని చెప్పలేం), హైదరాబాదు నుండి అచ్చతెలుగులో వ్రాయబడిన గే హోమోసెక్సుయల్ బ్లాగును రోజుకి 6000 మంది చదువుతున్నారు. వేల సంవత్సరాల చరిత్ర గలిగిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి రోజుకి సరాసరి భక్తుల సంఖ్య 50000 నుండి 1,00,000 ఉంటుంది. కొద్ది సంవత్సరాలు కూడ అవని ఈ గే బ్లాగ్ కి రోజుకి 6000 మంది అంటే మాటలా. రోజుకి 6,00,000 మంది విజిట్ చేసే భారతీయ సెక్సు సైట్లు కూడ ఉన్నాయి.

ఒక జననార్తి, అలవాటు, చాపల్యం, వ్యాధి, స్వశరీర జనితమైనదైనా, అంటించుకున్నదైనా, వాంఛనీయమైనా, అవాంఛనీయమైనా, ప్రజలు నిర్భయంగా చెప్పటాన్ని ప్రోత్సహించక పోతే రాజుగారి దేవతావస్త్రాలు, మోసపూరిత నేతగాడి కథ లాగా అయిపోతుంది.

ఇంకా వ్రాయవలసినది చాలా ఉన్నది. ఇంకో సారి. కవర్ కాని వాటిని కవర్ చేద్దాం. వీటికి స్వసంపర్కం (హస్త స్ఖలనం, స్త్రీ హస్త స్ఖలనం), వాయరిజం (ఇతరులు సెక్స్ చేసుకుంటే చూడాలనుకోటం) జోడించి పరిశీలించటం మెరుగుగా ఉంటుంది.

Saturday, March 29, 2014

189 Discomfort with chat shows




A 46 mb video blue film in which a Hindi heroine took part is in wide circulation on internet. It is not clear whether the Video was placed on Net, with her consent or not, but the Video is extremely hardcorde. This dancing Diva is said to do item numbers in Hindi film. But the reports say that she has lost interest in performing in item numbers. But her popularity is reported to be in tact. Hey, what a people!

Approx. in Telugu language: ఒక హిందీ నటీ మణి నటించిన 46 ఎం.బీ.ల బ్లూ వీడియో కొన్నేళ్ళుగా ఇంటర్నెట్ లో చలామణీ లో ఉన్నది. అది నెట్ లో ఆ నటీమణి అనుమతితో పెట్టబడిందో లేదో తెలియదు కానీ బహు భయంకరంగా ఉన్నది.

ఆ డాన్సింగ్ దీవా (తెలుగు లో నృత్య దేవత లేక నాట్య దివ్వె అనచ్చేమో), హిందీ చిత్రాలలో ఐటమ్ నంబర్లుకూడ చేసేదిట. ఐటం నంబర్లు చేయటంలో ఆసక్తి తగ్గిందిట. కానీ జనాదరణ మాత్రం పదిలంగా ఉందిట. అహో, ఏమి జనం.

This madirAkshi (A Diva with eyes filled with liquor) is said to be not interested in being interviewed by adults. She prefers to be interviewed only by 10 year old children. Why? If the interviewers are elders, they will ask penetrating questions on personal matters, whereas childen do not know how to ask questions, and hence she can manage comfortably. But that TV channel must know why an Item Girl should be present in programs intended for children.

Same in Telugu language: ఈ మదిరాక్షికి (మదిర= మద్యం నిండిన కన్నులు కలది, ఒక అర్ధం.) పెద్దవాళ్ళ చేత టీవీ ఛానెళ్ళ లో ఇంటర్వ్యూ చేయబడటం ఇష్టం ఉండదుట. 10 సంవత్సరాల పిల్లకాయలు ఇంటర్వ్యూ చేస్తేనే సంతోషిస్తుందిట. ఎందుకు? పెద్దవాళ్ళయితే ఎక్కువగా వ్యక్తిగత విషయాలు గుచ్చి గుచ్చి అడుగుతారుట. పిల్లలకి ఏమి అడగాలో తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ లను ఈజీగా మేనేజ్ చేస్తుందన్న మాట. అసలు కిడ్స్ కోసం చేసే ప్రసారాలలో ఐటం గాల్స్ ఎందుకో ఆ ఛానెల్స్ వారికే తెలియాలి.


ఎన్నికల సభలు, నరేంద్రమోడీ గారి చాయ్ పర్ చర్చా కూడ ఈతరహావే అనచ్చు. సాధారణంగా నరేంద్రమోడీ గారు జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇవ్వక, ఇవ్వక ఇచ్చినా ఆసౌకర్యకరమైన ప్రశ్న అడగగానే లేచిపోయే అవకాశం ఉందిట. పార్టీ కార్యకర్తల చేత ఎంపిక చేయ బడ్డ అమాయక యువతీయువకులు అడిగే ముందుగా తయారు చేయించి ఇవ్వబడ్డ ప్రశ్నలకు జవాబు ఇవ్వటం, దీనిని చాయ్ పర్ చర్చా అని ఎలా అనగలం. శ్రీ మోడి గారి చాయ్ పర్ చర్చా కార్యక్రమం నిజాయితీగా జరగాలంటే ప్రశ్నలు ఎవరు అడిగినా జవాబు అడగటానికి సిధ్ధ పడాలి. అసౌకర్య కరమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఉన్న వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే ఆ తరువాత అదే ప్రశ్నను మరల మరల అడగటం జరగదు. చచ్చిన పామును ఎవరు చంపుతారు. తన వాదనలో నిజం ఉందనుకున్నప్పుడు వాదించినా తప్పులేదు. ఆజవాబును ప్రశ్న అడిగేవాడు ఒప్పుకోకున్నా నష్టమేమీ ఉండదు. ఒప్పుకోకున్నా నష్టమేమీ ఉండదు. మన టీవీల ప్రేక్షకులకు బాలురకు తేడా ఏమీ ఉండదు. జనం తమవిచక్షణా ఘన శక్తిని గానీ, విచక్షణా రాహిత్యాన్ని గానీ బయట పెట్టకోరు.

ప్రాధమికంగా నటీమణుల ప్రవర్తనకు రాజకీయ నాయకుల ప్రవర్తన కూ భేదమేమీ ఉండదు. అందుకే నటీమణులు సినిమాల్లో అవకాశాలు తగ్గగానే, ఎంపీలుగా, ఎంఎల్ఎ లు గా అవతారమెత్తుతున్నారు.

విశ్రాంత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మార్కండేయ కట్జూ గారు ఒక సారి భారతీయులలో 90% మంది మూర్ఖులని అన్నారు. తరువాత విమర్శలకు తలఒగ్గి తన వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు. పార్టీ అగ్రనేతల ముఖం చూసి నటీనటులకు, క్రికెటర్లకు, వోట్లు వేస్తున్నారని అనుకోవాలా లేక హీరో హీరోయిన్ల ముఖం చూసి పార్టీలకు వోట్లు వేస్తున్నారా అన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.

ఒకసారి ఒక హాలీవుడ్ నటీమణి ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ షా గారిని అడిగిందిట. మనమిద్దరమూ పెళ్ళి చేసుకుంటే, మనకు పుట్టే పిల్లలకి మీ మేధస్సు, నా అందం వస్తుంది , అవునా అని. దానికి షా నవ్వి ఇలా అన్నారుట. అమ్మా తారామణీ, అలా కాకుండా, వాళ్ళకి నీ బుధ్ధీ, నా అందం వచ్చిందనుకో. సత్యానాశ్ అయిపోతుంది.

ఇతర అర్హతలు చూడకుండా సినీ నటులని గెలిపించే వారు ఒక కోణం లోంచి చూస్తే మూర్ఖులే. ఎందుకంటే, కార్యకర్త స్థాయి నుండి పైకి వచ్చిన నేత ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా తన నియోజక వర్గ ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే, వారికి మరల తన ముఖం చూపాలి కాబట్టి. సినీ నటులు తాము ఆల్ ఇండియా నేతలము లేక ఆల్ తెలుగూస్ నేతలము అనుకుంటారు కాబట్టి వారికి ఒక నియోజక వర్గం అంటూ ఉండదు. హీరో హీరోయిన్లుగా కోట్లు జనాన్ని వెర్రివాళ్ళను చేసి దోచుకున్నదే కాకుండా, జనం తమకు ఏదో బాకీ పడ్డారని హీరో హీరోయన్లు అనుకుంటారు.

ఒకాయన తిరుపతి నుండి, స్వస్థలమైన పగోజి నుండి పోటీ చేశాడు. తిరుపతిలో గెలిచి స్వస్థలం లో నే ఓడి పోయాడు. తరువాత ఆ తిరుపతి జనాలను ముంచేసి తన పార్టీని ఏట్లో కలిపి కాంగ్రెస్ లో చేరిపోయి రాజ్యసభలోకి దూరిపోయాడు. తిరుపతి జనం ఉపఎన్నికలలో ఆనటుడిని వదిలించుకున్నారు.

తెనాలి రామకృష్ణ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలు వికటకవిని తనకు ముఖం చూపించద్దన్నాడు కాబట్టి నెత్తి మీద ఒక కుండ బోర్లించుకొని సభకు వెళ్ళాడు. మన నాయకులకు ఆ ఎగ్గు లేదు కదా.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |