Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, February 28, 2014

161 Traditions of slavery

161 I am your slave, I sat down at your feet. బాంచను దొరా కాల్ మొక్కుతా! मै आप के गुलाम हूँ. आपके पैरों के नीचे बैठा हूँ.
చర్చనీయాంశాలు: तॆलंगाण, తెలంగాణ, telangana, Andhra Pradesh, लोक सभा

MPs hailing from Telangana prostrated at the feet of Ms. Sonia Gandhi and Sushma Swaraj immediately after passing of the Telangana Bill.


లోక్ సభలో తెలంగాణ బిల్ పాస్ కాగానే తెలంగాణ ఎంపీలు శ్రీమతి సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ పాదాల మీద పడ్డారు.

तेलंगाना के सांसद तेलंगाना बिल् लोक सभा मे पास् होने का बाद तुरंत सुश्री सोनिया गांधी और सुषमा स्वराज के चरणों पर गिर गया.

They did not say openly, but their action is an indication to say "We are your slaves. We sat down at thy feet." వారు నోటితో చెప్పలేదు కానీ వారి చర్యల అంతరార్ధంగా గోచరమయ్యేది ఏమిటంటే ''మేము మీ బానిసలం. కాల్ మొక్కుతాం (దొరసానుల్లారా). ''.

वे खुले तौर पर नहीं कहा, फिर भी उनके कारवायी की मतलब यह हो सकते है कि '' हम आपके गुलामी हैं. हम आपकी चरणों की प्रणाम कर रहे हैँ.''

The serfdom started in 1323 from the moment Kakatiya Emperor Pratapa Rudra II committed suicided jumping into the Narmada River from the boat in which he was imprisoned. 1323 లో ఉలుగ్ ఖాన్ చేత బంధించబడి ఢిల్లీ తీసుకెళ్ళబడుతూ పడవలో నర్మదా నదిని దాటించబడుతున్న సమయంలో కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాప రుద్రుడు నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకున్ననాటి నుండి, ఈ బానిసత్వం మొదలయ్యింది.

यह दासत्व उस् दिन शुरू हुआ जिस् दिन काकतीय साम्राट द्वितीय प्रतापरुद्र ने नाव से कूद कर आत्महत्या कर लिया. उस वखत उन को दिल्ली सुल्तान के सरदार् उलुगखान बन्दी बनाकर दिल्ली ले जा रहा था. नरमदा नदी पार करने का समय पर यह घटना हुआ.

Clarification. స్పష్టీకరణ स्पष्टीकरण


Loving a country, region, religion, language is not anybody's/any groups personal property whether he belongs to that particular country, region, religion, language or not. ఒక దేశాన్ని , ప్రాంతాన్ని, మతాన్ని, భాషను ప్రేమించటం ఏ ఒక్క వ్యక్తి/వ్యక్తుల బృందం యొక్క స్వంత ఆస్తి కాదు. ఆవ్యక్తి/బృందం ఆ దేశానికి, ప్రాంతానికి, మతానికి, భాషకు చెందిన వాళ్ళైనా, కాకపోయినా సరే.

एक देश, क्षेत्र, धर्म, भाषा को प्यार करना किसी एक व्यक्ती/ समूह् का अधिकार या संपत्ती नहीँ होते हैँ. प्यार करनेवाला अनिवार्यतः उसी देश, क्शेत्र, धर्म, भाषा वाले होने का जरूरत नहीँ है.

Examples - ఉదాహరణలు - उदाहरण


A British ruler Thomas Monro, how much did he love Rayala Seema? ఒక ఆంగ్ల జాతీయుడు థామస్ మన్రో, రాయలసీమను ఎంత ప్రేమించాడు?

एक अंग्रेजी शासक थामस् मनरो ने रायल सीमा को कितना प्यार किया?

A British ruler Charles Philip Brown, how much did he love Telugu language? ఒక ఆంగ్ల పాలకుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషను, వేమనను ఎంత ప్రేమించాడు?

एक अंग्रेजी शासक छार्लॆस् फिलिप ब्रौन तॆलुगु भाषा को कित्ना प्यार किया?

A British Engineer Sir Arthur Cotton, how much did he love Godavari and Krishna Rivers? ఒక ఆంగ్ల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి, కృష్ణా నదులను ఎంత ప్రేమించాడు.

एक अंग्रेजी इंजनियर् सर् आर्थर् काटन् गोदावरी, कृष्णा नदियों को कितना प्यार किया?

Reverse can also happen. విపర్యయం విరుధ్ధంగా కూడ జరగచ్చు. उल्टा पल्टा हो सक्ते.



Ambhi falling at the feet of Alexander.
అంభి అలెగ్జాండర్ కాళ్ళ మీద పడటం.
अंभी अलॆग्जांडर का पैर पर गिरना.

Jayachandra inviting Mohd. Ghori to invade India.
జయచంద్రుడు మహమ్మద్ ఘోరీని భారత్ పై దాడి చేయమని ఆహ్వానించటం.
जयचंद्र महम्म्द घोरी को भारत् पर आक्मण करने के लिये आमंत्रित करना.

Mir Zafar inviting Robert Clive to attack Surajuddaula. Mir Qasim backstabbing Mir Zafar.
మీర్ జాఫర్ సురాజుద్దౌలా మీద దాడి చేయమని రాబర్ట్ క్లైవ్ ను ఆహ్వానించుట. మీర్ ఖాసిం మీర్ జాఫర్ కి వెన్ను పోటు పొడుచుట.
मीर जफर सूरजुद्दौला पर हमला करने के लिऎ रॉबर्ट क्लाइव को आमंत्रित करना. मीर खासीम मीर् जाफर् को हड्डी मारना.

One personal experience of 1982-83. ఒక స్వంత అనుభవం. एक व्यक्तिगत अनुभव


I used to work in a remote Telangana village as a Bank Manager. నేను తెలంగాణలో ఒక అతి కుగ్రామంలో బ్యాంక్ మేనేజర్ గా పనిచేసే వాడిని. मैं एक बैंक मैनेजर के रूप में एक दूरस्थ तेलंगाना गांव में काम करते थे.

First 15 days after taking charge, I was shocked to find that poor people used to come to the Bank in large numbers and fall down at my feet. మేనేజర్ గా ఛార్జి తీసుకున్నాక మొదటి 15 రోజులు, గ్రామాల్లోని పేదలు వచ్చి నాకాళ్ల మీద పడుతుంటే షాక్ తింటంతో నాకు గడిచి పోయింది. नौकरी के प्रभार् लेने का बाद पहले पंद्रह दिन झटकों से बित गया. गाऒँ से गरीब लोग अधिक संख्या मे आकर मेरे पावॊं पर गिरते थे.

While falling they used to say "I am your slave, I fall at your feet." వాళ్ళు కాళ్ళమీద పడుతూ పడుతూ ''బాంచను దొరా, కాల్ మొక్కుతాం '' అంటుండే వాళ్ళు. ''पैरॊं पर गिरते गिरते उन लोग कहते थे मै आप का गुलाम हूँ. मै आपका पाव पकडता हूं.''

It used to cause me great misery. అది నాకు చాలా దుఃఖాన్ని కలిగించేది. वह मुझे बहुत दुःख पैदा कर्ते थे.

It became my daily work to stop people doing that. I went on offering them chairs, benches. I used to get teas for all of them. It took nearly six months of effort to make them feel that all are equal and that nobody should fall on anybody's feet. అలా కాళ్ళ మీద పడే ఆ పేదలని ఆపటం నాకు దైనిక కృత్యం గా మారింది. వాళ్ళకి నేను కుర్చీలు, బెంచీలు చూపించి కూర్చో బెట్టే వాడిని. నేలమీద చతికిల బడటాన్ని నిషేధించటం జరిగింది. వాళ్ళు నాతో సమానమని నిరూపించుకోటానికి షుమారు ఆరునెలల సమయం పట్టింది. ఎవరూ వేరొకరి పాదాలమీద పడకూడదని నచ్చచెప్పటానికి చాలా ప్రయత్నించ వలసి వచ్చింది.

उस पैर् पकडने का काम रोकना मेरा नित्य कृत्य होगया. मुझे उन लोगों को कुर्सियों या बॆंचीयों पर बिठाकर पानी, चाय पिलाना आदत हो गया. ''किसी आदमी दूसरे आदमी का पैर पकडने का जरूरत यहा नहीँ होगा'' इस संदेश् पाप्युलर् करने के लिये मुझे छे महीने लगा. बहुत कोशिश करना पडा.

Habit at most of the Government Offices in that area. ఆ ప్రాంతంలో చాల ప్రభుత్వ కార్యాలయాలలో విస్తృతంగా ప్రబలియున్న్ అలవాటు. उस क्षेत्र के अधिकांश सरकारी दफ्तरों में आदत.


Mali Patels, Police Patels, Patvaris (village revenue officials), sarpanches, middlemen used to bring villagers along with them. మాలీ పటేళ్ళూ, పోలీస్ పటేళ్లూ (మునసబులు), పట్వారీలు (కరణాలు), సర్పంచిలు, మధ్యవర్తులైన పైరవీకారులు, జనాలను ప్రభుత్వ కార్యాలయాలకు తోలుకెళ్తుండే వాళ్ళు. पटेल् , पट्वारी , सर्पंच, पैरवीकार, दलाल ग्रामीणों को सरकारी दफतरों को ले जाकर, बडे अधिकारियो से बात करते थे. अधिकारी सफेद कपडेवाले बडे लोगों को कुरसी या बॆंच परा बिठाते थे. गरीब जन खाली कुर्सी या बॆंच को देखने के बाद भी उन पर बैठना मना था.

I hope that situation there might have improved substantially by now. ఇప్పటికి అక్కడ పరిస్థితులు కొంతైనా మారి ఉంటాయని ఆశిస్తున్నాను. वहाँ की स्थिति अब तक काफी सुधार हो गया होगा , यह मेरा उम्मीद है.

This ybrao a donkey's last hope. ఈ వైబీరావు గాడిద ఆఖరి ఆశ यह वैबीराव गधा का निर्णायक अंतिम आशा


Those who fell down at the feet of Sonia Gandhi and Sushma Swaraj in Lok Sabha and outside, will not insist after coming back to their Constituencies, that people should fall down on their feet and continue the "I am your slave, I fall down at your feet" tradition.

ఇపుడు ఎవరైతే లోక్ సభలో, బయట, సోనియా గాంధీ మరియు సుష్మా స్వరాజ్ ల కాళ్ళమీద పడి ''మేము మీకు జీవితాంత ఋణ పడి ఉంటాం'' అని ప్రతిజ్ఞలు చేశారో, వారు తమ తమ నియోజక వర్గాలకు వచ్చాక, గ్రామీణులను రప్పించుకొని, తమ కాళ్ళమీద పడేయించుకొని, ''బాంచలం దొరా కాల్ మొక్కుతాం '' అనే ఆచారాన్ని కొనసాగించరని ఆశిస్తున్నాను.

जिन लोग लोक सभा मे और बाहर, सोनिया गांधी और सुष्मा स्वराज की पादों पर गिर कर ''हम अपने जीवन के अंत तक आप के लिए आभारी रहते हैं '' यह शपथ लिये , उन लोग , अपने निर्वाचन क्षेत्रों को वापस आने के बाद, फिर पांच साल के लिये निर्वाचित होने के बाद, ग्रामीणों को अपने पाव पर नहीं गिरवाना चाहिये. मै आप का गुलाम हूँ, मै आप का पाव पर गिरता हूँ , यह नहीँ कहने देना. इस आदत सिर्फ् लोक सभा या राज्य सभा मे रहना शोभित होगा. गाओं को नही फैलना उत्तम रहेगा.

There are some errors in translation. I shall try to correct them soon. If anybody's feelings are hurt, I invite them to write adverse comments. I shall try to correct myself.

160 Sehbas nIhArika 160 Sehbas Niharika!! సెహ్ బాస్ నీహారికా!!

Mega Princesses do not make Realtime Heroines. Nor vice versa. Here is a story of a Real Life Heroine, who saved 72 bonded laborers from the clutches of a brick kiln owner.

చర్చనీయాంశాలు: వెట్టిచాకిరీ, శ్రామికవర్గం, రంగారెడ్డి జిల్లా, ఒడిషా

Who is Niharika ? నీహారిక ఎవరు? नीहारिका कौन है?


Niharika is a Revenue Inspector in Medchal Mandal. నీహారిక మేడ్చల్ మండలంలో ఒక రెవిన్యూ ఇన్స్పెక్టర్. नीहारिका ऎक् राजस्व निरीक्षक है.

What is her speciality? ఆమె ప్రత్యేకత ఏమిటి? उसकी विशेषता क्या है?


This information is based on a first-page news report published in Hans India English Daily dated 26th Feb. 2014. ఈ సమాచారం 26.2.2014 నాటి హాన్స్ఇండియా ఆంగ్లదినపత్రిక వారి మొదటి పేజీ వార్తపై ఆధారపడి వ్రాస్తున్నది. यह जानकारी 26 फ़रवरी 2014 दिनांक हान्स इंडिया अंग्रेजी दैनिक में प्रकाशित प्रथम पृष्ठ समाचार रिपोर्ट पर आधारित है.

We should, first thank the Hans India Daily which care prominently published this news whereas other newspapers ignored it for their own reasons. ముందుగా మనం ఈ వార్తను మంచి ప్రముఖమైన ప్రదేశంలో ప్రచురించినందుకు హాన్స్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మిగిలిన పత్రికల వారు, వారి కారణాలు ఉండచ్చు, ఈ వార్తను పట్టించుకోకుండా వదలి వేశాయి. अन्य अखबारों ने, अपने ही कारणों से, इस समाचार् को नजर नहीँ दिया, नहीँ छापा. हान्स इंडिया प्रमुखता से यह खबर प्रकाशित किया. इसीलिये, पहले, हम हान्स इंडिया को धन्यवाद कहना चाहिऎ.

http://www.thehansindia.com/posts/index/2014-02-26/72-bonded-labourers-rescued-87394 కి వెళ్ళటానికి క్లిక్. को जाने केलिऎ क्लिक्.

What is the importance of this news? ఈ వార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటి? इस खबर् का महत्व क्या है?


72 Odisha bonded laborers. 72 మంది ఒడిషా రాష్ట్ర వెట్టి కార్మికులు. 72 ओडिशा बंधुआ मजदूर.

Working as bonded laborers in a brick kiln in GowDavalli village, 6 kilometers distant from Medchal. మేడ్చల్ కి ఆరు కిలోమీటర్ల దూరంలోని గౌడవల్లి గ్రామంలోని ఇటుక బట్టీలో వెట్టి కార్మికులుగా పని చేస్తున్నారు. मेडचाल से 6 किलोमीटर दूर गौडवल्ली गांव में एक ईंट भट्ठे में बंधुआ मजदूर के रूप में काम कर रहे हैँ.

Two women bonded laborers in those 72 are pregnant. ఆ 72 మంది వెట్టి కార్మికులలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు కూడ ఉన్నారు. उन 72 में दो महिलाओं बंधुआ मजदूर गर्भवती हैं.

Among the 72, there are 24 children. ఆ 72 మందిలో 24 మంది పిల్లలు కూడ ఉన్నారు. उन 72 मे 24 बच्चे भी शामिल् हैँ.

When their family members asked for some rest to them, the brick kiln owner assaulted them. They are critically injured. కూలీలు ఆ స్త్రీలకు కొంత విశ్రాంతిని కోరితే, యజమాని ఆ స్త్రీలపై దాడి చేశాడు. ఆ స్త్రీలకు తీవ్ర గాయాలు అయినాయి. जब उनके परिवार के सदस्यों उन्हें कुछ आराम के लिए भट्ठी मालिक को पूछा, तो ईंट भट्ठी मालिक उन्हें हमला कर दिया. वे गंभीर रूप से घायल हो गए हैं.

Names of the pregnant women: Sakuntala, pUrNamideep. ఆ గర్భిణీ స్త్రీల పేర్లు: శకుంతల, పూర్ణమి దీప్. गर्भवती महिलाओं का नाम: शकुंतला, पूर्णमीदीप्.

Receiving the information, NGOs International Justice Mission (IJM), Association for Rural Development (ARD), and the Revenue Inspector Medchal Niharika raided the brick kiln. సమాచారం అందుకున్న రెండు ప్రభుత్వేతర సేవా సంస్థలు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజెఎమ్), అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (ఎ ఆర్ డీ) మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడ్చల్, ఆ ఇటుకబట్టిని చెక్ చేశారు. समाचार् मिलने पर्, तुरंतु, ऎन् जी वोस् इंटर्नेषनल् जस्टिस् मिषन् (ऐ जॆ ऎम), असोसियेषन् फर् रूरल् डॆवलप् मॆंट (ARD), और मॆड्चल् राजस्व निरीक्षक नीहारिका ने उस् भट्टी चॆक् करने केलिऎ गया.

They rescued all the bonded laborers and arranged for their safe return to their native place - Orissa State, Balangir District, Belpada village. వారు వెట్టి కార్మికులందరిని రక్షించి, వారిని భద్రంగా స్వస్థలానికి (ఒడిషా, బాలాన్ గిర్ జిల్లా, బెల్ పాదా గ్రామం), పంపటానికి తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నారు. वे सभी बंधुआ मजदूरों को बचाया. और् उनके स्व-स्थान सुरक्षित् जाने के लिए व्यवस्था किया.

The owner of the brick kiln Shri Tiruapati Rao is reported missing. ఇటుక బట్టీ యజమాని తిరుపతిరావు కనిపించటంలేదుట. ईंट भट्ठी मालिक श्री तिरुपति राव के गुमशुदगी की रिपोर्ट है.

What next? తరువాత ఏమిటి? आगे क्या?


We have about 11 State Seemandhra Ministers, who are under bondage to Congress. మాకు ఒక 11 మంది సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ కట్టుబానిసలు ఉన్నారు.हमारे राज्य मे ग्यारह सीमांध्र मंत्री, कांग्रॆस् की गुलामी मे हैँ.

7 Central Ministers are serving as bonded laborers in New Delhi. One Minister among them is a hereditary slave. న్యూ ఢిల్లీలో ఏడుగురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కట్టు బానిసలుగా ఉన్నారు. అందులో ఒకాయన వంశపారంపర్య బానిస. 7 सीमा आंध्र केंद्रीय मंत्रियों ने नई दिल्ली में बंधुआ मजदूर के रूप में सेवा कर रहे हैं. उनमें से एक मंत्री वंशानुगत गुलाम है.

Ms. Niharika should try to liberate these seven Central Ministers and eleven State Ministers. నీహారిక గారు ఈ ఏడుగురు కేంద్ర మంత్రులను, పదకొండు మంత్రి రాష్ట్రమంత్రులను కూడ బానిసత్వం నుండి విముక్తి చేసేందుకు ప్రయత్నించి ఆంధ్ర ప్రజలకు మహోపకారం చేయాలి. सुश्री निहारिकाजी, इन सात केंद्रीय मंत्रियों और ग्यारह राज्य मंत्रियों को भी आजाद कराने के लिए प्रयास करना चाहिए.

Added on 13th April 2016



If the Congress Ministers of Undivided Andhra Pradesh in Delhi could not show the courage to get themselves discharged, people of Residual Andhra Pradesh have discharged them in the 2014 Elections. The Mega Star dad of our Mega Princess is also one of them.

(To continue. सशेष. ఇంకా ఉంది.).

Wednesday, February 26, 2014

159 Elite Schools

159. Difference between elite schools and Municipal Schools ఘరానా స్కూళ్ళకి, మునిసిపల్ స్కూళ్ళకి భేదం.
చర్చనీయాంశాలు: విద్య, ఘరానా స్కూళ్ళు, మునిసిపల్ పాఠశాలలు, వెంకటేష్, తెలుగు సినిమాలు
ఫొటో వికీపీడియా వారి దయతో.

ముందుగా మనం హాన్స్ ఇండియా వారికి, వారి జర్నలిస్ట్ మంజులతా కళానిథి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు సారం పాఠకుల సౌకర్యార్ధం ఈ వైబీరావు గాడిద జోడిస్తున్నాడు. అనువాద లోపాలు గాడిదవే. హాన్స్ ఇండియాలో ప్రచురణ తేదీ 19.02.2014. ఒరిజినల్ చూడాలంటే లింకు:-- http://www.thehansindia.com/posts/index/2014-02-19/I-punctured-my-teachers%E2%80%99-scooter-tyres--86591 కి వెళ్ళటానికి క్లిక్

యాజ్ టోల్డ్ టు మంజులతా కళానిథి అని చివరలో ఉంది. దీని అర్ధం శ్రీవెంకటేష్ గారు చెప్తూ ఉంటే Ms. Kalanithi గారు వ్రాసుకొని పత్రికలోకి ఎక్కించారు. సంభాషణ ను టేప్ చేశారో లేదో తెలియదు. సాధారణంగా హీరోలు తమకు తీరికలేదు అంటూ ఉంటారు. జర్నలిస్టులు బ్రతిమిలాడి, మీరు ఊరికే మాట్లాడండి, మేము వ్రాసుకొని మా పత్రికలో వేసుకుంటాం అని ఎడిటర్ జీ తమకు అప్పగించిన పనులు పూర్తిచేసుకొని వస్తూ ఉంటారు.

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు



నాకు గౌ శ్రీ వెంకటేష్ యందు గానీ మరి ఏ ఇతర హీరో హీరోయిన్లయందు గాని రాగ ద్వేషాలులేవు. ఈమధ్య సర్వశ్రీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, సుబ్రహ్మణ్యస్వామి, మణిశంకర్ అయ్యర్ ల విద్యాభ్యాస చరిత్రను అధ్యయనం చేసి ఇక్కడ ప్రచురించే భాగ్యం కలిగింది. రాహుల్, మోడీలు ప్రధాని అభ్యర్ధులు కాబట్టి అధ్యయనం చేసే అవసరం కలిగింది. అదే సందర్భంలో హాన్స్ ఇండియా పత్రికను తిరగేస్తున్నపుడు, కాకతాళీయకంగా ఈవార్త నాకళ్ళ బడింది. యాదృఛ్ఛికంగా నేను థియేటర్ లో చూచిన ఆఖరు సినిమా ధృవ నక్షత్రం నాకు గుర్తుకు వచ్చింది. అది శ్రీ వెంకటేష్ ది కావటంతో ఆసక్తితో ఈ ఇంటర్వ్యూను చదివాను.

ఏవో బాల్య శ్రీకృష్ణలీలలు. ఎందుకింత ఫస్ చేస్తున్నారు?


సాధారణ వ్యక్తి చేయటానికి సెలబ్రిటీ చేయటానికీ హస్తి మశకాంతరం (ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా) ఉంది. మనకి గీతావచనం ఏమిటంటే
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
  స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 0321

శ్రేష్ఠులైన వాళ్ళు ఏమి చేస్తే సాధారణ ప్రజలు అది చేస్తారు. సినీనటులు ఏది చేస్తే యువతీయువకులు అది చేస్తారు. మన శ్రేష్ఠులు ఇలైట్ స్కూల్ లో చదువుతూ ఏమి చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?

I was born in Chennai and my first childhood memories are definitely dominated by the beach city. Although my father Dr Daggubati Ramanaidu was (and is) a prolific producer, movies were not really discussed at home. We were a family of five including my parents, my elder brother Suresh Babu and my younger sister Lakshmi.
తెలుగుసారం:--నేను చెన్నైలో పుట్టాను. నాప్రథమబాల్య స్మృతులు బీచ్ నగరం (చెన్నై) చేత డామినేట్ చేయబడి ఉంటాయి. మాతండ్రి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ధారాళమైన నిర్మాతే అయినప్పటికి ఇంటిలో సినిమాలు నిజంగా చర్చించబడలేదు. మేము తల్లిదండ్రులతో సహా ఐదుగురికుటుంబం. మా పెద్దన్న సురేష్ బాబు. చిన్నచెల్లెలు లక్ష్మి.

I did my schooling at Don Bosco, Egmore, Chennai. My parents were happy to get me admission in that elite school and I also felt I was lucky to study there. I was a hyper-energetic kid who you could term as a mischief maker.

నేను డాన్ బాస్కో,ఎగ్మూరు, చెన్నై స్కూల్లో చదివాను. ఆ ఇలైట్ స్కూల్ లో ప్రవేశం పొందినందుకు నాతల్లిదండ్రులు సంతోషించారు. అక్కడ చదవటాన్ని నేను కూడ అదృష్టం గానే భావించాను. నేను అతి శక్తివంతుడైన బాలుడిని. నన్ను మీరు మిస్ఛీఫ్ మేకర్ గా అనచ్చు.

I was a sort of rebel who never used to like the system, especially where teachers were partial to some students because they scored better marks. I always believed that teachers should be like parents who shower the same love and affection on all kids regardless of their accomplishments.

నేను వ్యవస్థను ఇష్టపడని ఒక తరహా తిరుగుబాటు దారుడిని. ముఖ్యంగా టీచర్లు ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్ధుల ఎడల పక్షపాత ధోరణి చూపినపుడు ఈతిరుగుబాటు తనం ఎక్కువగా ఉండేది. విద్యార్ధుల ఎకాంప్లిష్ మెంట్లు (మార్కులు మొ||) గురించి పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పిల్లల యెడల ఎలాంటి ప్రేమ చూపుతారో టీచర్లుకూడ పిల్లలను సమానంగా చూడాలని నేను ఎల్లప్పుడూ నమ్మాను.

So naturally I used to do crazy things like puncturing scooter tyres of teachers who’ve been nasty to me in class.

కాబట్టి సహజంగా నేను, నాయెడల నేస్టీగా ఉన్న టీచర్ల స్కూటర్ల టైర్లను పంచర్ చేయటం వంటి క్రేజీ పనులు చేస్తూ ఉండే వాడిని.

I was also instinctively protective of my friends (giving them proxy attendance etc) and therefore my entire class adored me and my teachers hated me.

నేను నా ప్రకృతి కనుగుణంగా నా సహవిద్యార్ధుల రక్షణ చేపట్టే వాడిని. వారు లేనపుడు వారి తరఫున నేను అటెండెన్స్ పలికేవాడిని. కాబట్టి మా క్లాస్ మొత్తం నన్ను ఆరాధించేది. నాటీచర్లు నన్ను ద్వేషించే వాళ్ళు.

During class elections, the students would elect me but within weeks, my teachers would throw me out of the post and the class. Eventually they relented and I was elected as house caption in my Class X.

క్లాస్ లో ఎన్నికలు జరిగినపుడు విద్యార్ధులు నన్ను నాయకుడిగా ఎన్నుకునేవాళ్ళు. కాని కొద్దివారాలలోనే మాటీచర్లు నన్ను ఆపోస్టు లోంచి ఊడ బీకేవాళ్ళు. క్లాసులోంచి కూడ పంపించేసే వాళ్లు. చివరికి వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకున్నారు. నేను పదవ తరగతిలో హౌస్ కెప్టెన్ గా ఎన్నుకోబడ్డాను.

Although I was an average student academically, I was active in sports and co-curricular activities.

నేను తరగతిలో విద్యా కోణంలో సరాసరి విద్యార్ధినే అయినప్పటికీ క్రీడల్లో మరియు ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో చురుకుగా ఉండేవాడిని.

I had my own gang and I used to play every game – hockey, volley ball, basketball, poker, cricket, marbles, kites basketball… Surprisingly, the only activity I wasn’t interested in those days was dramatics!

నా గ్యాంగ్ నాకుండేది. హాకీ, వాలీబాల్, బేస్కెట్ బాల్, పోకర్, క్రికెట్, మార్బుల్స్, గాలిపటాలు, ప్రతి ఆటను ఆడుతూ ఉండేవాడిని.

I was not somebody who enjoyed being confined to some indoor spaces. Instead, it was the big, spacious playground where I could shriek with joy that appealed to me.

నేను గదులలోపల స్థల పరిమితులకు లోబడి ఉండేవాడిని కాదు. దానికి బదులుగా పెద్ద విశాలమైన ఆటమైదానం నన్ను ఆనందంతో తబ్బిబ్బయ్యేలాగా చేసేది. నాకు బాగా నచ్చేది.

I did my graduation in Commerce at Loyola College in Chennai. My best memories are of my transition from riding a bicycle to a two-wheeler and then a car.

నేను నాగ్రాడ్యుయేషన్ కామర్స్ (బి.కాం) చెన్నై లయోలా కాలేజీ లో చేశాను. నాకు అత్యుత్తమమైన జ్ఞాపకం ఏమిటంటే సైకిల్ నుండి బైక్ కి, దానినుండి కారుకి మారటం.

I used to enjoy vrooming on bikes but after I injured myself while riding on a bike, my dad ordered me to stop riding a bike only to gift me a car to drive to college.

నేను బైక్ మీద వేగంగా శబ్దం చేసుకుంటూ (vroom) తిరిగి ఆనందించే వాడిని. కాని నేను బండి నడుపుతూ గాయ పడ్డాక మానాన్న గారు బైక్ నడపటం మానేయమని ఆజ్ఞాపించి కాలేజీకి వెళ్ళటానికి, నాకు కారును బహుమతిగా ఇచ్చారు.

Although I was given many comforts, I was never arrogant of our status or wasteful with money.

నేను ఎన్నో సౌకర్యాలు ఇవ్వబడ్డప్పటికీ, నా స్టేటస్ గురించి నేను గర్వంతో ఉండేవాడిని కాదు. డబ్బును వేస్ట్ చేసేవాడిని కాదు.

Loyola days were filled with college fests, student rock shows, seminars etc. My friends had a music band.

లయోలా కాలేజీ రోజులు కాలేజీ పండుగలు, విద్యార్ధి రాక్ షోలు, సెమినార్లు మొ|| నిండి ఉండేవి. నాస్నేహితులకి మ్యూజిక్ బ్యాండ్ ఉండేది.

I never really had the urge to be part of the band but I used to enjoy acting like a manager – making promos for the shows, selling tickets etc. I guess the producer’s gene often resurfaced in me on occasions.

నాకు ఆబ్యాండ్ లో పాలు పంచుకోవాలనే కోరిక నిజంగా ఉండేది కాదు కానీ నేను ఆబ్యాండ్ కి మేనేజర్ వలె పనిచేయటాన్ని ఎంజాయ్ చేసేవాడిని. షోస్ ని ప్రమోట్ చేయటం, టికెట్లు అమ్మటం మొ|| చేసేవాడిని. నాలో ఉన్న (సినీ)నిర్మాత జీన్లు సందర్భాలను బట్టి నా ఉపరితలంపై వచ్చేవి.

I was basically a listless guy and loved taking one day at a time with no big dreams.

ప్రాధమికంగా నేను ఒక లిస్ట్ లెస్ గయ్. పెద్దగా కలలు కలకుండా ఒకరోజును ఒకసారి తీసుకోటాన్ని ఇష్టపడేవాడిని.

The only dream, or rather wish, I had was to go to the US to study.

నాకు ఉండిన ఒకే కల, రాదర్ కోరిక ఏమిటంటే చదువుకోటానికి అమెరికాకు వెళ్ళటం.

Even the idea of living away in a different country away from family and all on my own gave me a heady feeling, as though it was an adventure I wanted to try.

వేరే దేశంలో కుటుంబానికి దూరంగా ఉండటం అనే భావం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. అది ఒక గొప్ప సాహసకృత్యం లాగా కనిపించి నేను ప్రయత్నించాలని కోరుకునే వాడిని.

So when I suggested that I wanted to go to the US, dad gave me the go ahead.

కనుక, నేను అమెరికాకు చదువుకోటానికి వెళ్తాననగానే మానాన్నగారు ముందుకు వెళ్ళమని సిగ్నల్ ఇచ్చారు.

I studied at Monterey Institute of International Studies in California.

మాంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, క్యాలిఫోర్నియాలో నేను చదివాను.

After I finished my MBA, I was keen on coming back to India and turning into a producer or do something behind the screens but I guess destiny had something else in store for me. A few years after I returned to India, I was launched as an actor and the rest is history.

నా ఎంబిఎ పూర్తి చేసుకున్నాక, నేను వెనక్కిరావాలని, నిర్మాతగా మారాలని, లేక తెర వెనుక ఏదైనా చేయాలని అసక్తితో ఉండే వాడిని. కాని నాకు విధి వేరే విధంగా స్టోర్ చేసింది. కొద్ది సంవత్సరాల తరువాత నేను భారత్ కి తిరిగి వచ్చాను. ఒక నటుడిగా లాంచ్ చేయబడ్డాను. మిగిలినది చరిత్ర.

(As told to Manju Latha Kalanidhi) మంజులతా కళానిథికి చెప్పిన విధంగా.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


డాన్ బాస్కో, చెన్నై, డూన్ స్కూల్ డెహ్రాడూన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, హైదరాబాదు వంటి ఇలైట్ స్కూల్ లో చదివిన వాళ్ళకి, ధనవంతుల పిల్లలు కనుక టీచర్ల స్కూటర్ల టైర్లు పంక్చర్ చేయటం వంటి టాంట్రంస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మునిసిపల్ స్కూళ్ళలో చదివే పేదపిల్లలకి ఉండదు.

అయితే మునిసిపల్ స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడ మంచి జ్ఞాపకాలే పోగవుతాయి. నేనూ, మాతమ్ముడూ కూడ 1960-62 ప్రాంతంలో బాపట్లలో మునిసిపల్ పాఠశాలల్లో చదివాము. నా కన్నా మాతమ్ముడికి ఎక్కువ ఆనందకరమైన అనుభవాలు వచ్చాయి. నాకు కూడ కొన్ని సంతోషకరమైన అనుభవాలు వచ్చాయి. వీటిని గురించి స్వంత డబ్బా అని పాఠకులు అనుకుంటే అనుకోవచ్చు కాక. కాని బాపట్ల చరిత్ర, మునిసిపల్ స్కూళ్ళచరిత్ర వ్రాసేటపుడు, సీరియస్ చరిత్ర రచయితలకి, చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కూడ ఉపకరించవచ్చు. అలా కాకపోయినా మునిసిపల్ స్కూళ్ళ విద్యను ఇలైట్ స్కూళ్ళ విద్యను (ఆనాటి 1961 + ఈనాటి 2011) పోల్చి చూసుకోటానికి పనికి వస్తుంది. కొన్ని ఉదాహరణలు
౧. బాపట్ల మునిసిపల్ హైస్కూల్ లో ఆరవ తరగతిలో చేరటానికి నేను 1960 ఎండా కాలంలో ఎంట్రెన్స్ పరీక్ష వ్రాశాను. అప్పటిలో మునిసిపల్ స్కూళ్ళలో చేరటానికి విపరీతమైన డిమాండు ఉండేది. అందుకని ఎంట్రెన్స్. ఆ ఎంట్రెన్స్ లో నా రోల్ నంబర్ 139. ఎంట్రెన్స్ ఫలితాలను చెప్పటానికి స్కూల్ పాత ఆఫీస్ బిల్డింగులో మైకు పెట్టి నంబర్లు చదివారు. ఈఎంట్రెన్స్ వ్రాయటానికి నేటి ఈమ్ సెట్ కు ఉన్నట్లుగా గైడ్లు ఉండేవి. ఒక గైడ్ పేరు మూర్తి గైడ్. ఇంకొక గైడ్ పేరు విజయసాధని. ఆగైడ్ లో ముఖ్యాంశాలో జి.కె. ఒకటి. ఒకగైడ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు భీమసేన్ సచార్ అని ఉండగా రెండవ దానిలో శ్రీనగేష్ అని ఉన్నది. అప్పటి కొత్తాంధ్ర ప్రదేశ్ కి భీమ్ సేన్ సచార్ ప్రధమ గవర్నర్. శ్రీనగేష్ రెండవ గవర్నర్. గైడ్ల ప్రింటింగ్ సమయంలో గవర్నర్ మారినట్లున్నాడు. ఒకగైడ్ వాడు సకాలంలో update చేశాడు. రెండోవాడు పాతపేరే ఉంచాడు.

క్రీడలకి ప్రాముఖ్యత




౨. బాపట్ల మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో చక్కటి బేస్ బాల్ గ్రౌండు ఉండేది. ఖాదర్ వలీ అనే సీనియర్ విద్యార్ధి క్రీడలలో మేటిగా ఉండి స్కూల్ విద్యార్ధులకు నేతగా ఉండేవాడు. గ్రెగ్ మెడల్ అని జిల్లాస్థాయి క్రీడా మెడల్ సాధించి తెచ్చినట్లు నాకు గుర్తు. మాచేత కూడ మంచి మంచి ఆటలు ఆడించి చిన్నచిన్న ప్రైజులు (దువ్వెనలు వంటివి) ఇచ్చినట్లు గుర్తు.

హెడ్ మాస్టర్ పై ప్రేమ, ఉద్యమాలు




౩. ఆహైస్కూల్ హెడ్ మాస్టర్ పాపం చాల మంచి పేరు కలిగి ఉండే వాడు. ఆయనను ఎందుకో తొలగించి కొత్తవాడిని వేరెవడినో అనర్హుడిని పెట్టారు. విద్యార్ధులు ఊరేగింపులు సమ్మెలు జరిపి మరల పాత హెడ్ మాస్టర్ ను తెచ్చుకున్నారు. ఆఊరేగింపుల్లో పాల్గొనే భాగ్యం నాకు కూడ కలిగింది. ఇక్కడ సారం ఏమిటంటే టీచర్లకి విద్యార్ధులకి మధ్య ప్రేమానుబంధాలు స్కూటర్ల టైర్లకు పంచర్లు వేసేదాకా వెళ్ళకూడదు, అని నా విజ్ఞప్తి.

ఏనుగు లవడా కాయలు, నీలం సంజీవ రెడ్డి




౪. ఆస్కూల్ ఆటస్థలం ప్రక్కనే ఒకపెంకుటిల్లు ఎత్తైన అరుగులపై ఉండేది. ముందువైపున పెద్దపెద్ద చెట్లు పెద్దపెద్ద కాయలతో ఉండేది. ఆకాయలని ఏనుగులవడా కాయలు అనేవాళ్ళు. ఆచెట్లపై ఉన్నవేదికపై 1962 ఫిబ్రవరి 19 నాడు పోలింగ్ జరిగిన సార్వత్రిక ఎన్నికల కొరకు అప్పటి కొత్తాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీనీలం సంజీవరెడ్డి బహిరంగసభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇప్పటిలాగే ఆరోజలలో కూడ భారీ ఏర్పాట్లు ఉండేవి.

చేనేత పని




౫. ఆస్కూల్ లో నేత పని నేర్పటానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అంకితభావం కలిగిన ఒక క్రాఫ్ట్ టీచరు ఉండేవాడు. నేను అక్కడ చదివిన మూడేళ్ళలో నాకు నేతనేయటం రాకపోయినా తకిలీతో దూదినుండి దారం తీయటం, అంగుళం గ్రాఫ్ కాగితం మీద వన్-అప్-వన్ వన్-డౌన్, టూ అప్ టూ డౌన్ వంటివి డిజైన్ ప్లాట్ చేయటం నేర్పారు. అది చేనేతలో పడుగు, పేకకు సంకేతం కావచ్చు.

హిందీ నేర్చుకోటం




౬. చక్కటి బోధనా సామర్ధ్యం కలిగిన హిందీ టీచర్ ఒకరు ఉండేవాడు. వచ్చిన రోజు పాఠాలు బాగా చెప్పేవాడు కానీ, పాపం ఆయనకు ఏమి సమస్యలు ఉండేవో కానీ స్కూలుకి అప్పుడప్పుడు మాత్రమే వస్తుండే వాడు. కానీ ఆయన బోధనా ప్రభావం వల్లనే కాబోలు, నాకు హిందీ మీద అభిరుచి ఏర్పడింది. ఆపట్టణంలో ఒక హిందీ ప్రేమీ మండలి ఉండేది. వాళ్ళు హిందీ పరిచయ్ (ప్రాథమికకి ముందు) అని ఒక పరీక్ష కూడ ఏదో వ్రాయించారు.

ఇండ్ల దగ్గర ప్రైవేట్లు


ఇళ్ళ దగ్గర ప్రైవేట్ల వ్యామోహం ఆరోజుల్లో కూడ ఉండేది. ఒక టీచర్ గారింట్లో కరెంటు ఉండేది కాదు. అందులో రాత్రిపూట చదువుకోటానికి పిల్లలు పుస్తకాలతో పాటు లాంతర్లు కూడ తీసుకొని గురువుగారంటికి వెళ్ళి అక్కడ రాత్రిపూట చదువుకొని కొందరు రాత్రిపూట అక్కడే పండుకునే వాళ్ళు. అయితే ర్యాంకుల పధ్ధతి లేదు.

మీ వ్యాఖ్యలకి స్వాగతం. ఘాటుగా విమర్శించినా, తిట్టినా ఫరవాలేదు. కానీ బూతులు వ్రాయకండి. మహిళలు చదవలేరు.

త్వరలో కొన్ని అనుభవాలను ఇక్కడేవ్రాస్తాను.

158 Nagarjuna Sagar as Capital of AP आंध्र प्रदेश के राजधानी के लिये नागार्जुन सागर ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నాగార్జున సాగర్

158 Divakar Reddy is correct. శ్రీ జె.సీ. దివాకర్ రెడ్డి ఒక విధంగా కరెక్టే చెప్పారు.
చర్చనీయాంశాలు: సీమాంధ్ర, విభజన, bifurcation, నాగార్జునసాగర్, మాచర్ల, ఆంధ్రప్రదేశ్ రాజధాని


కొత్తాంధ్ర ప్రదేశ్ కి రాజధానిగా మాచర్ల మ్యాచ్ అవుతుంది అని శ్రీ జె.సీ. దివాకర్ రెడ్డి చెప్పిన మాటలు అర్ధవంతమే.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాదు నుండి నాగార్జునసాగర్ కు తరలించాలని ఈవైబీరావు గాడిద 1982 ప్రాంతంలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో ఒక వ్యాసం వ్రాశాడు. ఎవరైనా స్పందిస్తారని ఆశ పడ్డాడు. ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పడు మారిన పరిస్థితులలో స్పష్టీకరణ:


మూడు రాష్ట్రాలే మెరుగు. కర్నూలు, వి-గుం-తె, విశాఖ మూడు రాష్ట్రాలకు మూడు రాజధానులుగా సరిపోతాయి. అందరి కోరికలు తీరుతాయి. తాత్కాలిక రాజధానిగా దొనకొండతో పాటు నాగార్జునసాగర్ ను కూడ పరిశీలించ వచ్చు.

మాచర్ల-నాగార్జునసాగర్ ప్రతిపాదనలలో లాభాలు





మాచర్లకు 17 కిలోమీటర్లదూరంలో నాగార్జున సాగర్ దక్షిణ తీరాన విజయపురి సౌత్ నుండి పశ్చిమంగా లాంచీలరేవు వరకు ఉన్న ప్రదేశమంతా రాజధానికి అనువైనదే. అక్కడ చాల వ్యవసాయం జరగని చిట్టడవులు (తుప్పలు, పాము పుట్టలతో నిండిన వేస్ట్ లాండ్) ఉన్న భూమి ఉన్నది. ఇది ప్రభుత్వభూమేనని నానమ్మకం.

భూమి దాదాపు ఉచితం. భూసేకరణ తప్పనిసరియైనా మార్కెట్ విలువ తక్కువ కాబట్టి పదిరెట్లు పరిహారం ఇచ్చినా ప్రజలు ఆనందించి ఆడి కార్లు కాకపోయినా నానో కార్లు కొనుక్కుంటారు.

తాగునీటి కొరత ఉండదు.

పర్యాటక స్థలంగా నాగార్జునసాగర్ అభివృధ్ధి చెందుతుంది.

నాగార్జునసాగర్, నంది కొండ బౌధ్ధ విహారం, కి పర్యాటక స్థలంగా అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. పనిలో పనిగా సీమాంధ్ర రాజధానికి కూడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడుతుంది. ఒకవేళ మూడు రాష్ట్రాలను సాధించు కోగలిగితే రాష్ట్రాల రాజధానులు విశాఖ, వి-గుం-తె, కర్నూల్ లకు తరలి వెళ్ళినా, నాగార్జున కొండకు కూడ విమానాశ్రయం అవసరం కాబట్టి వృధా ఉండదు.

మాచర్లనుండి 17 కిలో మీటర్లు డబల్ లైన్ రైలు మార్గం వేసుకోవాలి. నిజానికి ఈరైలు మార్గాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్టుని నిర్మించినపుడే వేసి ఉండవసినది. ఈరైలు మార్గం పర్యాటక స్థలం అయిన ఎత్తిపోతల జలపాతాన్ని కూడ కవర్ చేస్తుంది.

మిరియాలగూడ నుండి హిల్ కాలనీకి కూడ షుమారు ౩౦ కిలోమీటర్ల రైలు మార్గం వేసుకోవాలి.

ఆతరువాత హిల్ కాలనీ నుండి కృష్ణా నదిపై ప్రాజెక్టు దిగువలో రైలు వంతెనను నిర్మించుకోవాలి.

వినుకొండ నుండి మాచర్లకి డబల్ లైన్ రైలు మార్గాన్ని యుధ్ధ ప్రాతిపదికపై నిర్మించుకొని విద్యుదీకరణ చేసుకోవాలి.

ఒంగోలు వినుకొండ రైలు మార్గాన్ని చేపట్టాలి.

శ్రీ దివాకర్ జీ అన్నట్లుగా సోనియా గాంధీ పిచ్చియమ్మేనా?


పిచ్చియమ్మ యందుకవుతుంది. తెలివిగలదే. తన కుమారుడి భవిష్యత్ కొరకై రాచబాటలు వేసుకుంటున్నది. కెసిఆర్ కుటుంబంతో ఫొటోలు దిగింది ఎందుకు? అవసరమైతే తనకు గానీ, రాహుల్ కి గానీ తెలంగాణలో పోటీచేయవలసి వస్తే కెసీఆర్ కుటుంబ సభ్యులు గెలిపిస్తాడని. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలని కార్ల్ మార్క్స్ అన్నారు కానీ, పనిలో పనిగా రాజకీయ సంబంధాలన్నీ అవసరార్ధ సంబంధాలని ఉండాల్సింది.

భింద్రన్ వాలే వంటి ఉగ్రవాదిని పెంచి పోషించిన శ్రీమతి ఇందిరాగాంధీ. చివరికి ఆఉగ్రవాదికే బలయై పోయింది. కెసీఆర్ కుటుంబాన్ని పెంచి పోషించిన శ్రీమతి సోనియాగాంధీకి ఏమి జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.

దివాకర్ జీ ని అభినందించాలి


శ్రీదివాకర్ జీ వ్యాపారాలు, ఇతర గుణగణాలు ఎలా ఉన్నా, ఆయనను మనం ఒకవిధంగా అభినందించక తప్పదు. ఆయన సోనియా ఇంటి ముందు పడిగాపులు కాయటం లేదు. దిగ్ విజయ సింగ్ కాళ్ళు పట్టుకోటం లేదు.

శ్రీ టిజి వేంకటేశ్ భయం



కోస్తాలో రాజధానిని అభివృధ్ధిని ఏర్పాటు చేస్తే, అభివృధ్ధి చెందాక మళ్ళీ తమను అక్కడనుండి తరిమి కొడతారు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


ఈభయంలో న్యాయం లేదని అనలేము. కర్నూలునుండి 1957లో రాజధానిని మార్చకుండా ఉంటే, ఇప్పటికల్లా కర్నూలు మరో హైదరాబాదుగా తయారు అయి ఉండేది. తెలంగాణ వారు ఉద్యమం చేసినట్లుగానే రాయలసీమ వారు కూడ ఉద్యమం చేసి కోస్తావారిని వెళ్ళగొట్టటానికి ప్రయత్నించేవారు.

We can't say that there is no justice in this apprehension. Had Kurnool continued as Capital without shifting to Hyderabad, by this time Kurnool would have developed to the size of Hyderabad. RayalaSeema people too would have started a movement to drive away Coastal Andhra People, just as their Telangana brotheren are doing now.

ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అక్కడికి శ్రామికులు వలస వెళ్ళటం మానవహక్కుల్లో ఒకటి. ఈమానవహక్కును ఏప్రభుత్వమూ హరించలేనిది. అయితే ఈ వలసలు వెళ్ళినపుడు చాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి మనం పరిష్కారాలను వెతుక్కోవాలి. ఈచర్చకు ఇంకో పోస్ట్ అవసరం అవుతుంది.

Labor migrating to areas wherever livelihood is available is a human right. This right cannot be taken away by any Government. But when people migrate, many problems arise. We have to find out solutions for tackling them. We need a separate blog post for discussing the solutions.

కార్మికుల వలసకు, నాయకులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలు, జూదగాళ్ళు, వేలకొలది ఎకరాల భూములను కొనేయటానికి తేడా ఉంది. విజయవాడ పరిసరాలలో కొన్నిచోట్ల వ్యవసాయభూమే ఎకరం రూ. 10 కోట్లు చేస్తున్నది.

There is great difference between the migration of labor for livelihood and purchase of thousands of acres of land by leaders, film stars, industrialists and speculators.

ఈగాడిదకు గుర్తున్నంత వరకు విజయవాడలో శ్రీరాజశేఖర్ రెడ్డికి రాజ్ యువరాజ్ అని రెండు సినిమా హాళ్ళు ఉండేవి. ఇపుడు అవి జగన్ చేతిలో ఉన్నాయో లేవో నాకు తెలియదు. మనం నిరసించాల్సింది ఈవేలాది ఎకరాలను కొని పారేయటాన్నే. ఇలా కొని పారేసిన వాళ్ళు రాజధాని విజయవాడలో ఉండాలి, లేక విశాఖలో ఉండాలి, లేక తిరుపతిలో ఉండాలి వంటి ఉద్యమాలను పెంచి పోషిస్తు ఉంటారు.

As far as this donkey can remember, Mr. Rajasekhar Reddy used to own two theaters known as Raj and Yuvraj in Vijayavada. I do not know whether they are now in the hands of Mr. Jaganmohan Reddy or not. What we should resent is purchase of thousands of acres. Those who purchase thousands of acres start movements like Capital should be in Vijayavada, Capital should be in Vizag, or Capital should be in Tirupati.

తమకు అందనిది, తమకు చెందినది కానీ ఇతరులచేతుల్లో పడ్డది అనే భావనకూడ తెలంగాణ ఉద్యమానికి మూలం. భవిష్యత్ లో ఇటువంటి ఉద్యమాలు కొత్తరాజధానిలో కూడ వచ్చి తీరుతాయి. The root cause for Telangana movement is the idea that a thing which belonged to the people of Telangana fell into the hands of others. We are going to get this type of movements even in future Capital Cities.

అందుకే మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అని నేను వాదిస్తున్నది. మన నేతలకి తాము ముఖ్యమంత్రి అయి కోట్లు కొల్లగొట్టాలనే యావ తప్ప చిన్నరాష్ట్రాలలోని లాభాలను గుర్తించటం, స్నేహపూర్వకంగా సమష్ఠిగా అందరు కలసి తమ కోరికలను తీర్చుకోటం తెలియదు.

For this reason only, I am arguing that we need three States and three Capitals. Our leaders are more eager to become Chief Ministers and loot crores of people's money, rather than to understand the benefits of small States and working unitedly to achieve them.

ఇప్పుడు చూడండి. సిగ్గులేకుండా సీమాంధ్ర నేతలు సోనియా బంట్రోతుల చుట్టూ ముఖ్యమంత్రి పదవి కొరకు ఎలా తిరుగుతున్నారో. See now, how these shameless Seemandhra leaders are revolving around the chaprasis of Sonia Gandhi!!

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. We have a proverb in English. People get the Government they deserve. ప్రజలు తమ అర్హతకు తగిన ప్రభుత్వాన్ని పొందుతారు.

సీమాంధ్ర ప్రజలు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి అర్హులు? ఎటువంటి నేతలను పొందటానికి అర్హులు? What type of people are Seemandhra? What type of Government they deserve? What type of leaders they deserve to get?

A caution to Seemandhra slaves of Ms. Sonia Gandhi. శ్రీమతి సోనియా గాంధీ కట్టుబానిసలుగా మారిన సీమాంధ్ర నేతలకు భవిష్యత్ దర్శన సూచిక सोनियाजी की सीमांध्र दास केलिये एक चेतावनी | सावधानी




అడియాస కొలువు గొలువకు निरर्थक सेवा में प्रवेश न करें
గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్ मंदिर् के ट्रस्टी न बनें
విడువక కూరిమి సేయకు लगातार दुष्ट व्यक्तियों से दोस्ती न करें
మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతీ. अकेले जंगल में उद्यम मत करो, ओ सुमती!

Do not enter into a service, which will be futile. Do not undertake trusteeships of temples. Do not continuously befriend wicked persons. Do not venture alone into a forest.

అధరము కదలియు గదలక चुप्पी साधे रहने वाले
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ अधिकार मद/व्याधी से मधुरभाषण नहीँ कर्ने वाले
నధికార రోగపూరిత
బధిరాంధకశవము జూడ బాపము సుమతీ. वय्क्ती का लास् भी देखना पाप है. ओ सुमती (Oh wise person!).

It will be a great sin to see the corpse of a person who remains tight-lipped without sweet words, owing to arrogance of power. The adjective badhirAndhaka used to the arrogant person, describes him as a deaf and blind person whose eyes and ears are closed owing to excess pride.

Sunday, February 23, 2014

157 donakonda

157 Donakonda as Capital of Residual Andhra Pradesh
157 శేషాంధ్ర రాజధానిగా దొనకొండ

చర్చనీయాంశాలు: bifurcation, విభజన, రాజధాని, ప్రకాశం జిల్లా, దొనకొండ

ఈనాడు పత్రిక వారు మొదటి పేజీలో వ్రాసిన దాని ప్రకారం ఐఎఎస్ అధికారులు దొనకొండను రాజధానిగా సిధ్ధం చేస్తున్నారు.

రాయలసీమ వారు ఇప్పటికే చెప్పారు, కర్నూలు రాజధానిగా ఉండాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని.

కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్ గారు, పళ్ళంరాజుగారు, రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇతర ఉత్తరాంధ్ర నేతలు విశాఖను రాజధానిగా కోరుకుంటారని వేరే చెప్పనక్కరలేదు.

కేంద్ర మంత్రిణులు పనబాకలక్ష్మి, పురందరేశ్వరి, రాష్ట్రమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా వర ప్రసాద్, పార్ధసారధి మొ|| వి-గుం-తె కోరుకుంటారు కదా.

ఈకుమ్ములాట మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి. మననేతలంతా మెడబట్టి గెంటించుకోవాలి. ఇది తప్పేలాగా లేదు.

శాశ్వత ఏర్పాటు


నేను ఇంతకు ముందే వ్రాశాను. మూడు రాష్ట్రాలు, మూడు రాజధానులు. అనివార్యం. ఈ సమస్యను మనమే పరిష్కరించుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలతో బేరాలాడుకోవాలి.

రాజధాని రొటేషన్ తాత్కాలిక ఏర్పాటు


ప్రస్తుతానికి రెండేళ్ళ కొకసారి మూడు ప్రాంతాల మధ్య రొటేషన్ చేసుకోటం మంచిది. ఇదికూడ నేను ఇప్పటికే వ్రాసాను. పోస్ట్ నంబర్ 152 చూడండి.

దొనకొండ




మన ఐఎఎస్, ఐపీఎస్, అధికారులకు, పారిశ్రామిక వేత్తలకు, నేతలకు, జడ్జీలకు, పటాటోపాలు ఎక్కువ. బంగళాలు, విమానాలు, హెలికాప్టర్లు, మాల్స్, ఎసీలు, కాల్ గరల్స్ కావాలి. అవన్నీ దొనకొండలో దొరుకుతాయా?

రియల్ ఎస్టేట్ లో స్తబ్ధత


దొనకొండలో రాజధానిని పెట్టటం మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒకముఖ్య లాభాన్ని గమనించవచ్చు. విశాఖ, వి-గుం-తె, ఒంగోలు, తిరుపతి, కర్నూలు లో విపరీతంగా పెరిగన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ లు కొంత శమిస్తాయి.

ప్రస్తుతం పైనగరాలలో రిజిష్ట్రేషన్లు బాగా తగ్గాయి. రేట్లను విపరీతంగా పెంచేయటం వల్ల పేదలు, దిగువ మధ్యతరగతి వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోటం లేదు. రియాల్టర్లు కూడ పూర్తిగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇంకా బ్యాంకులు (బంకులా?) పారిశ్రామికాభివృధ్ధి, వాణిజ్యాభివృధ్ధి పేరుతో కార్పోరేట్లకు తక్కువ వడ్డీకి కుమ్మరిస్తే, దారి మళ్ళించటానికి వారు సిధ్ధమే. రాజకీయ ఒత్తిళ్ళతరువాత ఫ్రెష్ రౌండ్లు మొదలవుతాయి.

ఈలోపల ఈ దొనకొండ ఏమవుతుందో చూడాలి.

156 Chidambaram Economics

156 Need to recognise degradation of Indian Economic affairs సంస్కరణల వల్ల భారతీయ ఆర్ధిక వ్యవస్ తీవ్రంగా దిగజారిన విషయాన్ని గుర్తించ వలసిన అవసరం
చర్చనీయాంశాలు: భారత్, ఆర్ధికరంగం, Indian Economics, Finance Minister, RBI


సీమాంధ్ర ప్రజలను మాయాజూదంతో వనవాసానికి పంపటంలో ప్రముఖపాత్ర వహించిన కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీచిదంబరం గారు, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ గారిని వెంటేసుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో జరిగిన జీ20 దేశాల ఆర్ధిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంకుల సమావేశానికి హాజరై వచ్చారు.

ఈసందర్భంగా కొన్ని శ్రీవారి సువార్తలను చూద్దాం.
The communique has been drawn by the deputies sitting together and our concerns have been fully reflected in the communique.

ఆ సందేశపత్రం డెప్యూటీలందరు కూర్చొని తయారు చేశారు. దానిలో మన కన్ సరన్స్ (మనల్ని అభద్రతకు గురి చేస్తున్న, బాధిస్తున్న అంశాలు) అన్నీ కూడ ప్రతిబింబించాయి.

కమ్యూనిక్ (ప్రకటన)తో మీరు తృప్తి పడ్డారా అంటే అవును అన్నారు.

”...when countries withdraw from quantitative easing they should keep in mind the spillovers on the developing countries,”
''...దేశాలు క్వాంటిటేటివ్ ఈజింగ్ నుండి ఉపసంహరించుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ ఉపసంహరణ యొక్క చిమ్ముళ్ళు, వొలుకుళ్ళు (spillovers ప్రభావం) అభివృధ్ధి చెందుతున్న దేశాలమీద పడతాయని గుర్తుంచుకోవాలి...''

''...Emerging economies followed the advice of the IMF when the major economies went through a period of downturn after the 2008 global financial crisis...''
''..2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వచ్చి అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు పతనోన్ముఖం అయినపుడు అభివృధ్ధి చెందుతున్న దేశాల ఆర్ధిక వ్యవస్థలు అంతర్జాతీయ ద్రవ్యనిథి (ఐఎమ్ఎఫ్) సలహాలను పాటించాయి... ''

''...So when they (developed world) sought our cooperation during the economic downturn it is only fair that they cooperate with developing countries during the economic recovery...''
''..కనుక వాళ్ళు(అభివృధ్ధిచెందిన అమెరికా మొ||) మన సహకారం అడిగినపుడు మనం (అభివృధ్ధిచెందుతున్న దేశాలు) ఇచ్చాం. కాబట్టి వాళ్ళు మన ఆర్ధిక వ్యవస్థలు కోలుకోటానికి సహకరించాలి. .. ''

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


అభివృధ్ధి చెందిన దేశాలతో వ్యవహరించటం అంటే మాయాజూదంతో సీమాంధ్ర ప్రజలను కట్టుబట్టలతో అడవులపాలు చేసినంత తేలిక కాదు.

ఈసందర్భంగా జర్మనీ ఆర్ధిక మంత్రి శ్రీ Wolfgang Schaeuble వోల్ఫ్ గాంగ్ షావూబుల్ గారి వ్యాఖ్యల్లో కొంత చేదునిజాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏమన్నాడంటే భారత్ ఆర్ధిక సమస్యలకు అభివృధ్ధి చెందిన దేశాలు మాత్రమే కారణం కాదు, అంతర్గత కారణాలు కూడ ఉన్నాయి.

క్వాంటిటేటివ్ ఈజింగ్ యొక్క చిమ్ముళ్ళు ఒలుకుళ్ళు అంటే ఏమిటి What is the meaning of the spill overs of quantitative easing?




ఈసందర్భంగా మనం కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం:-- ౧. భారత్ ఆర్ధిక సంస్కరణలకు ముందు చమురు, యంత్ర పరికరాల దిగుమతులకు విదేశీ అప్పులపై ఆధారపడి ఉండేది. 1991 చంద్రశేఖర్ గారు ప్రధాని అయిన కాలంలో విదేశ మారకం కరువై కొంత బంగారాన్ని లండన్ లో తాకట్టు పెట్టవలసి వచ్చింది. దీనికి సరియైన పరిష్కారం ఎగుమతులను పెంచుకోటం.

౨. తరువాత ఆర్ధిక మంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కష్టపడి ఎగుమతులను పెంచుకోటం ఇష్టం లేక సంస్కరణలు అంటూ ఊదరకొట్టి విదేశీ పెట్టుబడులకు గేట్లు ఎత్తేశారు. విదేశీ పెట్టుబడులకోసం అడుక్కుంటూ దేశాలు తిరగటం మొదలు పట్టారు.

౩. ఆదే సమయంలో అమెరికా, యూరప్ లలో ఆర్ధికవ్యవస్థలో ఆదేశాల కేంద్ర బ్యాంకులు తమ దేశ ఆర్ధిక సంస్థలకు లూజుగా డబ్బులు అప్పులిచ్చే అలవాటు ఉండేది. యూరో అమెరికన్ ఆర్ధిక సంస్థల వద్ధ తేరగా వచ్చిన ఫెడరల్ రిజర్వు డబ్బులు ఉండటంతో వారు చైనా, భారత్ మొ|| దేశాల్లోకి డాలర్లను యూరోలను కుమ్మరించారు. అంబానీ మొ|| భారతీయ ఘరానా పెట్టుబడిదారులు తమషేర్ల ధరలను విపరీతంగా పెంచేసి ప్రపంచ బిలియనీర్లలో చేరి పోయారు.

ఇప్పుడు అమెరికా, యూరప్ లలో క్లిష్ట పరిస్థితి వచ్చింది. అదేపనిగా వారి ఆర్ధిక సంస్థలకు అప్పులు, పెట్టుబడులు సమకూర్చటం కుదరదు, వాటిని ఉపసంహరించాలని గుర్తించారు. ఇందులో తప్పేముంది?

అమెరికా, యూరప్ సెంట్రల్ బ్యాంకులు నిధుల విడుదల తగ్గించటమో, తమ వడ్డీరేట్లను పెంచటమో చేసినపుడల్లా ముంబాయిలో షేర్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంటాయి. రూపాయి మీద వత్తిడి పెరిగి రూపాయి బాహ్యవిలువ డౌన్ అవుతు ఉంటుంది.

చిదంబరం గారు అనే అభినవ గిరీశం గారు అడిగేదేమిటంటే, మీరు మీ ఆర్ధిక సంస్థలకు ఉద్దీపనాలు తగ్గించకండి. మీ ఆర్ధిక సంస్థల దగ్గరి డాలర్లను, యూరోలను మీరు లాక్కుంటే, వారు భారత్ లోని డాలర్లను, యూరోలను వెనక్కి తీసుకుంటారు. మా రూపాయి, మా షేర్ మార్కెట్లు దెబ్బతింటాయి. మా వృధ్ధి రేటు డౌన్ అవుతుంది.

హనుమంతుడి ముందరా కుప్పిగంతులు?

సీమాంధ్ర ఎంపీల, కేంద్రమంత్రుల, ఆంధ్రప్రదేశ్ శాసనసభ విజ్ఞప్తులను కేంద్రం ఎంత పట్టించుకుంది? భారత్ విజ్ఞప్తులను అమెరికా యూరప్ లు ఎందుకు పట్టించు కుంటాయి.

గుడిలో లింగాన్ని మాత్రమే మింగేవాడొకడుంటే, గుడినే మింగేశే వాళ్ళుంటారు, చిదంబరం గారూ.
(తిరగ వ్రాయ వలసినది, జోడించ వలసినది, ఇంకా ఉంది.)

Saturday, February 22, 2014

155 Aam Admi Party (AAP) Trajectory


155 Govt and Police Officials joining AAP will make no difference ప్రభుత్వ మరియు పోలీసు అధికారులు ఆప్ లో చేరితే వచ్చే తేడా పెద్దగా ఉండదు
చర్చనీయాంశాలు: భారత్, ఆమ్ ఆద్మీ, లక్ష్మీనారాయణ


సత్యం కంప్యూటర్స్ స్కాం, మరియు జగన్ కేసులను పరిశోథించిన సీబీఐ అధికారి శ్రీ వివి లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి రాష్ట్రంలో (బహుశా శేషాంధ్రలోనేమో, తెలంగాణ కాకూడదనేమీ లేదు) ఆ పార్టీకి సారథ్యం వహిస్తారని వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా కొన్ని వైబీరావు గాడిద వ్యాఖ్యలు


ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు ఉద్యోగాలు మానేసి రాజకీయాలలోకి దూకటం ఇది మొదటిసారీ కాదు, చివరిసారీ కాదు. కాగ్ లు, త్రివిధళాల అధికారులు, కూడ రాజకీయాలలో చేరి ఉన్నత పదవులను అలంకరించిన సంఘటనలు చాలా జరిగాయి.

ప్రభుత్వఉన్నతాధికారులు, ఘరానా పారిశ్రామికవేత్తలు, ఘరానా వ్యాపారులు, సినీనట నటీమణులు, క్రికెటర్లు మొ|| నానా జనం కూడ బూర్జువాల కిందే లెక్క. వీళ్లు సాధారణ కార్యకర్తలుగా చేరి మెట్లు మెట్లుగా ఎదిగి పార్టీలలో లోక్ సభ, రాజ్యసభ, మంత్రులు, గవర్నర్లు మొ|| ఉన్నత పదవులనలంకరించితే అభ్యంతరం పెట్టేవారుండరు. పెద్ద పెద్దవాళ్ళు వచ్చి పెద్ద్ పెద్ద పదవులను ఎగరేసుకు పోటం, తమకు ఆజ్ఞలు ఇవ్వటం, ఉద్బోధలు చేస్తుంటే అప్పటికే పార్టీలలో ఉన్న కార్యకర్తలకి, ద్వితీయశ్రేణి నేతలకు కడుపులో మండుతూ ఉంటుంది. కొన్ని సార్లు వెంటనే తమ బాధను బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అగ్ని పర్వతంలా కుములుతూ ఉంటారు. సమయం చూసుకొని బ్రద్దలు అవుతూ ఉంటారు.

బయటనుండి వచ్చే వారికి ఉన్నత పదవులను ఇచ్చే విషయంలో పార్టీలలో నియమావళులు ఉండాలి. ఇందులో నాలుగు రకాల విభాగాలను మనం చేసుకోవచ్చు.
౧. పార్టీ ఆహ్వానంపై వచ్చి, పార్టీల బలవంతం మీద పార్టీలలో చేరే వారు.
౨. తమంత తాముగా వచ్చి, పార్టీ అగ్రనేతలను బ్రతిమిలాడి , టాప్ స్థానాలను పొందే వారు.
౩. పార్టీ మరీ శైశవ దశలోనో, శిథిల దశలోనో వచ్చి పార్టీలలో చేరి పార్టీల పునరుథ్థానానికి తోడ్పడే వారు.
౪. పార్టీ విజయ పథంలో పయనిస్తున్నపుడు ఆలాభంలో షేర్ కొరకు వచ్చి చేరేవారు.

ఇంకా ఎన్నో విభాగాలను చేయవచ్చు. ఎన్ని విభాగాలను చేసుకున్నా, తమ నియమావళిలో స్పష్టంగా ప్రకటించి వెబ్ సైట్లలో పెట్టాలి. సాధారణంగా ప్రతిపార్టీ తమ అగ్రనేతలకు అపరిమితమైన అధికారాలను కట్టుబెడుతూ ఉంటుంది. వర్కింగ్ కమీటీలు, ఎగ్జిక్యూటివ్ కమీటీలు కూడ తమ వద్ద అపరిమితమైన అధికారాలను ఉంచుకుంటాయి. నియంతృత్వాలు ఉద్భవించటానికి అనుకూలమైన నిబంధనలన్నీ బైలాలలో పొందు పరుస్తూ ఉంటారు. దీని వల్ల పార్టీలలో అంతరంగ ప్రజాస్వామ్యం ఉండదు. ఉదాహరణకి, పార్టీ అగ్రనేత వర్కింగ్ కమిటీలో సభ్యులను భారీగా నామినేట్ చేయటం, వారు కూడ వోటు హక్కును కలిగి ఉండటం. పేరుకు వర్కింగ్ కమీటీలు, ఎగ్జిక్యూటివ్ కమీటీలే కానీ అవి అగ్రనేతలయొక్క బంట్లతో నిండిఉంటాయి.

ఆం ఆద్మీ పార్టీ కూడ దీనికి భిన్నంగా ఉన్నట్లు కనిపించటంలేదు. ఫలితంగా ఆం ఆద్మీ పార్టీలో కూడ నియంతృత్వ లక్షణాలు బయట పడుతున్నాయి.

ప్రభుత్వ, పోలీసు అధికారులు తమ పదవులలో , అప్పటికే అధికారాలను, అవినీతిని, డబ్బును జుర్రుకొని ఉంటారు కాబట్టి మరల వారికే అవకాశాలా అని ద్వితీయ శ్రేణి నేతలు వితర్కించుకుంటూ ఉంటారు.

If Mr. Lakshmi Narayana, an Additional DGP in Indian Police Service, really has an ambition to join politics, he will probably join Bharatiya Janata Party (BJP), and not AAP.

1. He loves Swami Vivekananda greatly. He wants to produce thousands of Swami Vivekanandas in 21st Century India. (దీనిలో వ్రాయాల్సింది చాలా ఉంది. త్వరలో.)

154 Political Forecasting

154 Political Forecasting is as hazardous as crossing Niagara on a thin wire
రాజకీయ భవిష్యత్ అంచనాలను కట్టటం నయాగరాను తీగెపై నడుస్తూ దాటటం వలె ప్రమాదభరితమైనదే
చర్చనీయాంశాలు: భారత్, సుష్మా స్వరాజ్, బిజెపి, రాహుల్, తెలంగాణ, అద్వానీ, vidisha

తెలంగాణ వారి చిన్నమ్మ వురఫ్ alias సుష్మాస్వరాజ్ గారు చాలా దూరదృష్టి గల నేత. ఆమె తెలంగాణ బిల్లు లోక్ సభలో పాస్ అయ్యాక ప్రసంగిస్తూ చిన్నమ్మను మరచి పోవద్దని కోరారు. దీనిలో అంతరార్ధాన్ని నేను సరిగా ఊహించలేక పోయాను.
Telangana's Chinnamma alias Sushma Swaraj is a leader of great foresight. She requested people and leaders of Telangana, not to foreget their Chinnamma. This happened when she spoke in Lok Sabha after the Telangana Bill was passed in Lok Sabha. I could not understand its deeper meaning at that time.

సోనియాతో సమానంగా తనను గౌరవించమనో , గుళ్ళు కట్టమనో కోరుకుంటున్నదేమో అనుకున్నాను. ఆమె తనకు అవసరమైతే పోటీ చేయటానికి తెలంగాణ అక్కరకు వస్తుంది అనే దూరదృష్టితో తెలంగాణ అనే గొర్రె పొట్టేలును పోషిస్తున్నదని ఊహించలేక పోయాను. I thought that our Chinnamma was expecting and requesting to be honored on par with Ms. Sonia Gandhi, or perhaps, build a temple to Chinnamma a la temple for Sonia. But I could not gauge that she was feeding and fattening the ram of TelangaNa, with a prospicience of getting a rescue, by contesting from Telangana.

ఇపుడు హాన్స్ఇండియా 23.02.14 ప్రచురించిన Ms. అనితా సాలూజా Anita Saluja గారు న్యూఢిల్లీనుండి పంపిన వార్తను బట్టి చిన్నమ్మగారు తెలంగాణ నుండి పోటీ చేయటానికి సిధ్ధం అవుతున్నది. http://www.thehansindia.com/posts/index/2014-02-23/Chinnamma-ready-to-contest-from-Telangana-87123 కి వెళ్ళటానికి క్లిక్.

బహుశా ''విదిశ'' సుష్మా స్వంత నియోజకవర్గంకు అదనంగా తెలంగాణ నుండి పోటీ చేస్తుందేమో. Probably ''Vidisha's'' Sushma, may be contesting from Telangana, in addition to her own constituency.
"Mera kya hai, mein to Telangana chali jaungi (what is there, I can even go to Telangana)'' అన్నారుట.
తెలుగుసారం: ''నాదేముంది, నేను తెలంగాణ వెళ్ళిపోతాను'' అన్నారుట.
हिन्दी: वह क्या है, मै तो तॆलंगाणा चली जाऊंगी.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


మనసులో ఉన్న విషయాలే జోకులుగా బయటకి రావచ్చును. దీని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ (మనస్తత్వ శాస్త్రవేత్త) గారే స్వర్గంలోంచి కిందికి దిగివచ్చి, చెప్పాలి. Thoughts which reside in our sub-conscience may ooze out as jokes when we talk. Only Sigmond Freud can come down from heaven and explain such behaviors.

నా గాడిద దృష్టికి తెలంగాణకు వెళ్ళటం అనేది ప్రీప్లాన్ డ్ preplanned గా కనిపిస్తున్నది. To my donkey's vision, Sushma's going to Telangana appears to be a pre-planned idea.

నేను ముందుగా ఎందుకు ఊహించలేక పోయాను అంటే నా దృష్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఉన్నది. Why I could not predict it earlier was because my concentration was more on Sonia Gandhi and Rahul Gandhi.

సోనియా రాహుల్ లకి, సుష్మా కన్నా రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయవలసిన ఆవశ్యకత ఎక్కువగా ఉన్నది. సోనియా గుల్బర్గా నుండి పోటీచేస్తే రాహుల్ మెదక్ నుండో కరీంనగర్ నుండో, సిధ్ధిపేటనుండో పోటీ చేస్తారేమో నని అనుకున్నాను.
Sonia and Rahul have a greater need to contest from two Constituencies, than Ms. Sushma Swaraj. I thought that if Ms. Sonia Gandhi contests from Gulbarga, Rahul would contest from Medak/Karimnagar/Siddhipet.

ప్రస్తుతం హిందీ బెల్ట్ లో బిజెపి పరిస్థితి పటిష్ఠంగా ఉన్నది కాబట్టి సాధారణంగా సుష్మాకు తెలంగాణ నుండి పోటీచేయవలసిన పరిస్థితి రాకూడదు. అయినా ముందు జాగ్రత్తేమో.
BJP has strong positions in Hindi belt at present. Hence, there should not be any need for Ms. Sushma Swaraj to contest from Telangana. Yet, it may be a precautionary step.

ఎంత మంది మద్ధతుదారులు, బంట్లు ఉన్నా, ఎన్ని ప్రత్యేక విమానాలు, హెలీకాప్టర్లూ అద్దెకి తీసుకున్నా, రెండు దూరప్రదేశాలనుండి పోటీ చేయటం అనేది ఎంతో ఖర్చు మరియు చాకిరీతో కూడుకున్న పని. ఒళ్ళూ గుల్ల, ఇల్లూ గుల్ల. నేలమాళిగల్లో నల్లడబ్బు మూలుగుతూ ఉండే బూర్జువా పార్టీలకు అది సమస్యకాక పోవచ్చేమో, కాని జాతికి మటుకు అది డబల్ ఖర్చు. రెండిటిలో గెలిచి, ఒకదానిని అట్టే పెట్టుకుంటే, ఉపఎన్నికలొక తలనొప్పి.
In spite of having numerous supporters, devoted flunkeys, special hired planes and helicopters, contesting from geographically distant constituencies is frought with expensive and hazardous. It may not be a problem for thouse bourgeois parties which have treasures rotting in underground chambers, but it will be a double expense for the Nation. If the candidate wins in both constituencies and chooses retain one seat, byelection for the second will become another avoidable headache.

నాకు విచారం కలిగించింది సుష్మా తెలంగాణ నుండి పోటీ చేయటం కాదు.
What gave me great distress, was not Ms. Sushma Swaraj's contesting from Telangana.

సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడులు ఎల్.కె. అద్వానీగారి అనుంగు శిష్యులు. అద్వానీ గారికి చేయిచ్చి, వారిద్దరు నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్, గడ్కారీల వర్గంలో చేరి పోయి నట్లు కనిపిస్తున్నది.
Sushma Swaraj and Venkaiah Naidu are two dear disciples of Mr. L.K. Advani. They seem to have given a hand to Shri Advaniji and joined the group of sarvaShri Narendra Modi, Rajnath Singh and Gadkari.

మోడీ గారి విషయంలో అద్వానీ గారిప్పటికే పశ్చాత్తాపపడ్డారు. ఇప్పుడు ఇంక సుష్మా , వెంకయ్యల విషయంలో ఈ పశ్చాత్తాపం వెలువడుతుందా లేదా చూడాలి. Advani might have already had some remorse in case of Mr. Narendra Modi. Now, we have to wait and see if he will have an occasion to regret for Sushma and Venkaiah.


రాజకీయాలలో అసంభవమేమీ ఉండదు కదా. వెన్నుపోట్లు సర్వసహజమే కదా. అద్వానీ గారి వయస్సు ఎనభయిల్లో కాక అరవయిల్లో ఉంటే బిజేపీ ఎలా ఉంటుందో. కానీ, ఇప్పటికి నాకు ఒక సందేహం ఉన్నది. బిజేపీ ఎన్నికలముందు కాకపోయినా ఎన్నికల తరువాతైనా చీలీపోతుందేమో. ఇదంతా ఎన్నికల తరువాత ఏవర్గం ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాన్ని బట్టి ఉండచ్చు.
Nothing can be impossible in politics. Backstabbing is common in elections. If Advaniji is in his sixties instead of the present eighties, BJP might have been different. I still entertain a doubt. BJP may get split after election, if not earlier. All this depends on which group will capture how many seats at the outing.

153 questions of yaksha


English: Recollect the film Maya Bazar 1957, in which NTR acted as Sri Krishna, ANR as Abhimanyu, and SVR as Ghatotkacha. In the same way recollect the Telugu film Pandava Vanavasam, in which NTR acted as Bhima, Savitri as Draupadi, Kanta Rao as Krishna, and Satyanarayana as Ghatotkacha. In both the films, the common theme is Pandavas' exile to Forest. Another key climax scene is 'Wedding of Sasirekha (d/o Balarama and his wife Rohini)'. This wedding of Sasirekha is not in Vyasa's Sanskrit Mahabharata, or its Telugu version Errapraggada's Andhra Mahabharata. It may be in some other Telugu books. It may also be intellectual creativity of Film Script Writers, Producers and Directors. I do not wish to find fault with them. Because, they have conflicting objectives of 'Informing', 'Entertaining', and 'Profit making'.

Introduction పరిచయం


ఎన్ టీ ఆర్ కృష్ణుడుగా, ఎ ఎన్ ఆర్ అభిమన్యుడుగా, ఎస్ వీ ఆర్ ఘటోత్కచుడుగా, సావిత్రి శశిరేఖగా వచ్చిన మాయా బజార్ సినిమాను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్ టీ ఆర్ భీముడిగా, సావిత్రి ద్రౌపదిగా, కాంతారావు కృష్ణుడిగా, సత్యనారాయణ ఘటోత్కచుడిగా నటించిన పాండవ వనవాసం సినిమాను గుర్తుకు తెచ్చుకోండి.
ఈరెండు సినిమాల నేపథ్యం పాండవులు అడవిలో నివసించటం. రెండు సినిమాలలో కీలక క్లైమాక్స్ ఘట్టం శశిరేఖా పరిణయం. ఇది వ్యాసుడు వ్రాసిన సంస్కృత మహాభారతంలో కానీ, కవిత్రయం వ్రాసిన తెలుగు మహాభారతంలో కానీ లేదు. ఇతర పుస్తకాలలో ఉండచ్చు. కొంత సినీ రచయితల, దర్శకుల మేథస్సు కావచ్చు. వారిని నేను తప్పు పట్టను. సినిమాల లక్ష్యం వ్యాపారం, వినోదం- తద్వారా ప్రేక్షకాదరణ. కళయొక్క స్థానం నంబర్ 3.

మాయాబజార్ లో భీముడికి, ధర్మరాజుకి, బహుశా అర్జునుడికి ప్రాముఖ్యత లేదు. పాండవవనవాసంలో కథ అంతా భీముడి చుట్టు తిరుగుతుంది.

మాయాబజార్ సినిమాలో ఈ యక్షప్రశ్నలు ఘట్టాన్ని చూపలేదు. పాండవ వనవాసం సినిమాలో స్వల్పంగా చూపినట్లున్నారు.

నర్తనశాల సినిమాలో (ఇది వనవాసం కాదు, అజ్ఞాత వాసానికి చెందినది), ముక్కామల విరాటరాజు, గుమ్మడి ధర్మరాజు కంకుభట్టు మథ్య జరిగిన సంభాషణల్లో హాస్యం కోసం ఒకటి రెండు యక్షప్రశ్నలను చొప్పించారు. అది దర్శకుడియొక్క మేథస్సుకు నిదర్శనం.

యక్షప్రశ్నల ప్రాముఖ్యత


తెలివైన మానవుడికి సదసద్విచారం (ఏది మంచి ఏది చెడు తేడా తెలుసుకునే శక్తి), నిత్యానిత్యవిచారం (ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తేడా తెలుసుకునే శక్తి), మిథ్యామిథ్యవిచారం (ఏది మాయ, ఏది నిజం తేడా తెలుసుకునే శక్తి) అవసరం.

ప్రాచీన మానవుడి కన్నా ఆధునిక మానవుడికి ఇవి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ప్రాచీన మానవుడి ముందు ఉండే ఆకర్షణలు (pulls and temptations) బలహీనమైనవి. ఆధునిక మానవుడి ముందు ఉండే ఆకర్షణలు బలమైనవి. మహమ్మద్ అలీలాగ , మైక్ టైసన్ లాగా అవి బాక్సింగ్ గుద్దులను మానవుడిమీద గుద్దుతూ ఉంటాయి.

నిత్యానిత్యవిచారం, సదసద్విచారం లేక పోతే, లక్షకోట్లు సంపాదించి వైయస్ రాజశేఖర రెడ్డిగారు వాటిని సరిగా అనుభవించకముందే, స్వర్గస్థులైనట్లుగా ఉంటుంది. మనిషి బందీ అయిపోతాడు.


యక్ష ప్రశ్నలలో కొన్ని స్టాక్ ప్రశ్నలు ఉన్నా ఆలోచనలు రేకెత్తించేవే. సదస్విచారాన్ని ప్రేరేపించేవే. మచ్చుకి ఒక ప్రశ్న, తెలుగు మామూలు భాషలో:
ప్రశ్న: బ్రతికి ఉండి కూడ చచ్చిన వాడితో సమానం ఎవరు? జవాబు: దేవుడు, అతిథి, తండ్రి తాతలు, సేవకులు వీళ్ళకి అన్నం పెట్టకుండా తాను తినేవాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య


అప్పుడూ, ఇప్పుడూ ఇది 100% సత్యమే. దేవుడు ఒక ఊహ. దేవుడికి నైవేద్యం పెట్టటం అంటే ఏపటానికో విగ్రహానికో పెట్టటం అనే అర్థంలో నేడు రూఢి అయ్యింది. దేవుడు తింటాడా? పటం, విగ్రహాలు తింటాయా? నిరక్షరాస్యుడు నమ్మటంలో అర్థం ఉంటుంది. వేదవేదాంగవిదులైన పండితులు నమ్మకూడదు. తింటాడనే నమ్మకం భారత ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీగారికి కూడ ఉంది. అందుకే ఆయన వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంటే పాలక్యారేజీ తీసుకొని ఢిల్లీలో వినాయకుడి గుళ్ళకి వెళ్ళాడు.
మరణించిన పితృదేవతలు మనం పెట్టే తిండి ని తింటారనుకోటం కూడ ఋజువుల్లేని ఊహే. అర్ధం, బ్రతికున్న తండ్రి తాతలకు పెట్టమనే. తాతలనాటి బొచ్చె తరతరాలు చేయవద్దని.
అతిథులకు పెట్టటం మనకి అలవాటు తప్పింది. మనమే హోటళ్ళకి వెళ్ళి టిఫిన్ ప్యాకెట్లు కొనుక్కోవలసిన కర్మ పట్టింది. ఇంట్లో చేసుకున్నా గ్యాస్, నిత్యావసరవస్తువులు ధరలు పెరిగిపోయి అతిథులకి పెట్టే స్థాయినుండి కిందికి దిగజారి పోయాం. బిజేపి వాళ్ళు ప్రచారంచేసే, కానీ ఆచరణలో పట్టించుకోని సిసలైన హిందూత్వ ప్రకారం, ప్రతిరోజు మనం అన్నం తినబోయే ముందు ఒక కొత్తవాడిని వెతికి పట్టుకుని వెతికి తెచ్చుకొని, వాడిని గౌరవించి వాడి పక్కన కూర్చోని వాడితో కబుర్లుచెప్తూ భుజించాలి. బిచ్చగాళ్ళకి వేయటం కాదు.

సేవకులకు అన్నం పెట్టటం నా దృష్టిలో అతిథికి అన్నం పెట్టటం కన్నా ముఖ్యమైనది. అలాపెట్టకపోతే మనం శ్రమదోపిడీ చేసిన వాళ్లమవుతాం. దీనిలో మళ్ళీ పెట్టుబడిదారీ ఎకనామిక్స్ వస్తుంది. జీతం ఇస్తున్నాంగా, ఇంక మనతో సమానంగా భోజనం పెట్టాలా, లెక్కలెయ్యి, అని పెట్టుబడిదారీ విధానం చెప్తుంది.

ఇది నేడెందుకు కుదరదు అంటే, పెట్టుబడిదారీ విధాన మహిమ. అందు వల్ల పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం మనమందరం జీవన్మృతులమే.

పాండవులు వనవాసం చేసినపుడు ఈయక్షప్రశ్నల ఘట్టం ఎప్పుడు వస్తుంది?


ఇంచు మించుగా చివర. ధర్మరాజుకి దాహం వేస్తుంది. తమ్ముళ్ళు చెట్టెక్కి చూస్తారు. కొంతదూరంలో ఒక సరస్సు (చెరువు) కనిపిస్తుంది. నకులుడు నీళ్ళు తేవటానికి వెళ్తాడు. సరస్సుకి కాపలా కాస్తున్న యక్షుడు నకులుడికి అడ్డు పడి నాప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీళ్ళను ముట్టుకోవద్దంటాడు. నకులుడు పట్టించుకోకుండా చెరువులోకి దిగుతాడు. యక్షుడి మాయవల్ల మూర్ఛపోతాడు.

తరువాత సహదేవుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

తరువాత అర్జునుడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

తరువాత భీముడు వెళ్తాడు. అలాగే మూర్ఛపోతాడు.

వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోటంతో ఆందోళనతో ధర్మరాజు స్వయంగా వెళ్తాడు. సరస్సు ఒడ్డున మూర్ఛపోయిన తమ్ముళ్ళు, యక్షుడు కనిపించారు. ధర్మరాజుకి జూద వ్యసనం ఉంది కానీ, కొన్నిసార్లు తెలివిగా ప్రవర్తిస్తాడు. యక్షుడిని మెప్పించేలా జవాబులు చెప్పి, ప్రవర్తించి, తమ్ముళ్ళందరినీ విడిపించుకుంటాడు. క్లుప్తంగా, ఇదీ కథ.

నేనేదో అరటి పండు వలిచి పెట్టినట్లుగా మీనోట్లో పెట్టి, మీక స్పూన్ ఫీడింగ్ చేస్తాను అని ఆశించకండి. శ్లోకాలను, పద్యాలను అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి. వాటిని సమకాలీన పరిస్థితులతో పోల్చండి. శ్రధ్ధావాన్ లభతే విద్యా.

ఇవన్నీ మేమెందుకు చదవాలి, ఇది మాసిలబస్ లో లేదే


భారతంలోగాని, రామాయణంలో ఉన్నవి గానీ, గురువులు చెప్పినవి కానీ నూటికి నూరు పాళ్ళు ఆచరించాలని లేదు. సత్యాసత్య విచారం, చేసుకున్న తరువాత, మంచివి, ఆచరణీయం అనుకున్నవాటినే ఆచరించుకోవాలి. సంస్కారం వల్ల మానవుడు మెరుగైన మానవుడుగా తయారుఅయ్యి తాను సుఖపడి చుట్టూ ఉన్న వారిని సుఖపెట్ట కలుగుతాడు.

సత్యాసత్య విచార, నిత్యానిత్య విచార విద్యకి సిలబస్ లు ఉండవు. ఈవిచారాన్ని సరిగా చేసుకోనివాడు స్వామీ వివేకానందలాగా అయిపోయి మేకను బలిఇవ్వగానే దుర్గామాతకు ఆనందం కలుగుతుందనుకుంటాడు. తాబేళ్ళను తినటానికి డాక్టర్లు అనుమతించలేదే అని బాధ పడతాడు.

వ్యాసుడు


వ్యాస భారతం, అరణ్యపర్వం లో 314వ ఆధ్యాయంలో మనం ఈ యక్ష ప్రశ్నలను చూడవచ్చు. We can see these questions of yaksha, in Chapter 314 of vyasa mahabharata.
స దదర్శ హతాన్భ్రాతృఁల్లోకపాలానివ చ్యుతాన్।
యుగాంతే సమనుప్రాప్తే శక్రవైశ్రవణోపమాన్ ॥ 1
వినికీర్ణధనుర్బాణం దృష్ట్వా నిహతమర్జునం।
భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్గతాయుషః ॥ 2
సదీర్ఘముష్ణం నిఃశ్వస్య శోకబాష్పపరిప్లుతః।
తాందృష్ట్వా పతితాన్భ్రాతౄన్సర్వాంశ్చింతాసమన్వితః। 3
నను త్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం వృకోదర।
సుయోధనస్య భేత్స్యామి గదయా సక్థినీ రణే ॥ 4
వ్యర్థం తదద్య మే సర్వం త్వయి వీరే నిపాతితే।
మహాత్మని మహాబాహో కురూణాం కీర్తివర్ధనే ॥ 5
మనుష్యసంభవా వాచో విధర్మిణ్యః ప్రతిశ్రుతాః।
భవతాందివ్యవాచస్తు తా భవంతు కథం మృపా ॥ 6
దేవాశ్చాపి యదాఽవోచన్మూతకే త్వాం ధనంజయ।
సహస్రాక్షాదనవరః కుంతి పుత్రస్తవేతి వై ॥ 7
ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వశః।
విప్రనష్టాం శ్రియం చైషామాహర్తా పునరోజసా ॥ 8
నాస్య జేతా రణే కశ్చిదజేతా నైష కస్యచిత్।
సోయం మృత్యువశం యాతః కథం జిష్ణుర్మహాబలః ॥ 9
అయంమమాశాం సంహత్య శేతే భూమౌ ధనంజయః।
ఆశ్రిత్యయం వయం నాథం దుఃఖాన్యేతానిసేహిమ ॥ 10
రణే ప్రగల్భౌ వీరౌ చసదా శత్రునిబర్హణౌ।
కథం రిపువశం యాతౌ కుంతీపుత్రౌ మహాబలౌ।
యౌ సర్వాస్త్రాప్రతిహతౌ భీమసేనధనంజయౌ ॥ 11
అశ్మసారమయం నూనం హృదయం మమ దుర్హృదః।
యమౌ యదేతౌ దృష్ట్వాఽద్య పతితౌ నావదీర్యతే ॥ 12
శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞాస్తపోయుక్తాః క్రియాన్వితాః।
అకృత్వా సదృశం కర్మ కిం శేధ్వం పురుషర్షభాః ॥ 13
అవిక్షతశరీరాశ్చాప్యప్రమృష్టశరాసనాః।
అసంజ్ఞా భువి సంగంయ కిం శేష్వమపరాజితాః ॥ 14
సానూనివాద్రేః సంసుప్తాందృష్ట్వా భ్రాతృన్మహామతిః।
సుఖం ప్రసుప్తాన్ప్రస్విన్నః ఖిన్నః కష్టాం దశాం గతః ॥ 15
ఏవమేవేదమిత్యుక్త్వా ధర్మాత్మా స నరేశ్వరః।
శోకసాగరమధ్యస్థో దధ్యౌ కారణమాకులః ॥ 16
ఇతికర్తవ్యతాం చేతి దేశకాలవిభాగవిత్।
నాభిపేదే మహాబాహుశ్చింతయానో మహామతిః ॥ 17
అథసంస్తభ్య ధర్మాత్మా తదాఽఽత్మానం తపఃసుతః।
ఏవంవిలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
బుద్ధ్యా విచింతయామాసవీరాః కేన నిపాతితాః ॥ 18
నైషాం శస్త్రప్రహారోస్తి పదం నేహాస్తి కస్యచిత్।
భూతం మహదేదం మన్యే భ్రాతరో యేన మే హతాః ॥ 19
ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వా జలం।
`భ్రాతౄణాం న్న్యసనం ఘోరం సమమేవ మహాత్మనాం' ॥ 20
స్యాత్తు దుర్యోధనేనేదముపాంశు పరికల్పితం।
గాంధారరాజరచితం సతతం జిహ్మవుద్ధినా ॥ 21
యస్ కార్యమకార్యం వా సమమేవ భవత్యుత।
కస్తస్య విశ్వసేద్వీరో దుష్కృతేరకృతాత్మనః ॥ 22
అథవా పురుషైర్గూఢైః ప్రయోగోఽయందురాత్మనః।
భవేదితి మహాబుద్ధిర్బహుధా సమచింతయత్ ॥ 23
ఆచార్యం కింను వక్ష్యామి కృపం భీష్మమహం ను కిం।
విదురం కింను వక్ష్యామి బృహస్పతిసమం నయే ॥ 24
అంబాం చ కింను వక్ష్యామి సర్వదా దుఃఖభాగినీం।
దృష్ట్వా మాం భ్రాతృభిర్హీనం పృచ్ఛంతీం పుత్రగృద్ధినీం ॥ 25
యదా త్వం భ్రాతృభిః సర్వైః శక్రతుల్యపరాక్రమైః।
సార్ధం వనం గతో వీరైః కథమేకస్త్వమాగతః' ॥ 26
కస్య కింను విషేణేదముదకం దూపితం యథా।
మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే।
ముఖవర్ణాః ప్రసన్నా మే భ్రాతౄణామిత్యచింతయత్ ॥ 27
ఏకైకశశ్చౌఘబలానిమాన్ పురుషసత్తమాన్।
కోఽన్యః ప్రతిసమాసేత కాలాంతకయమాదృతే ॥ 28
ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్।
పాతుకామశ్చ తత్తోయమంతరిక్షాత్స శుశ్రువే ॥ 29

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-30
అహం బకః శైవలమత్స్యభక్షో
నీతా మయా ప్రేతవశం తవానుజాః।
త్వం పంచమో భవితా రాజపుత్ర
న చేత్ప్రశ్నాన్పృచ్ఛతో వ్యాకరోపి ॥ 30
మా తాత సాహసంకార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 31

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 32
రుద్రాణాం వా వసూనాం వామరుతాం వా ప్రధానభాక్।
పృచ్ఛామి కో భవాందేవో నైతచ్ఛకునినా కృతం ॥ 32
హిమవాన్పారియాత్రశ్చ వింధ్యో భలయ ఏవ చ।
చత్వారః పర్వతాః కేన పాతితా భువి తేజసా ॥ 33
త్వయాఽతీవ మహత్కర్మ కృతం చ బలినాంవర।
వినిఘ్నతా మహేష్వాసాంశ్చతురోపి మమాత్మజాన్' ॥ 34
యాన్న దేవాన గంధర్వానాసురాశ్చ న రాక్షసాః।
విపహేరన్మహాయుద్ధే కృతం తే తన్మహాద్భుతం ॥ 35
న తే జానామి యత్కార్యం నాభిజానామి కాంక్షిత్తం।
కౌతూహలం మహజ్జాతం సాధ్వసం చాగతం మమ ॥ 36
యేనాస్స్యుద్విగ్నహృదయః సముత్పన్నశిరోజ్వరః।
పృచ్ఛామి భగవంస్తస్మాత్కో భవానిహ తిష్ఠతి ॥ 37

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-38
యక్షోఽహమస్మి భద్రం తే నాస్మి పక్షీ జలేచరః।
మయైతే నిహతా సర్వే భ్రాతరస్తే నివారితాః ॥ 38
వైశంపాయన ఉవాచ। 39
తతస్తామశివాం శ్రుత్వావాచం స పరుషాక్షరాం।

యక్షస్ బ్రువతో రాజన్నాకంపత తదాఽఽస్థితః ॥ 39
విరూపాక్షం మహాకాయం యక్షం తాలసముచ్ఛ్రయం।
జ్వలనార్కప్రతీకాశమధృష్యం పర్వతోపమం ॥ 40
సేతుమాశ్రిత్య తిష్ఠంతం దద్రశ భరతర్షభః।
మేఘగంభీరనాదేన తర్జయంతం మహాస్వనం ॥ 41
ఉవాచ యక్షః కౌంతేయం భ్రాతృశోకప్రపీడితం' ॥ 42
ఇమే తేభ్రాతరో రాజన్వార్యమాణఆ మయాఽసకృత్।
బలాత్తోయం జిహీర్షంతస్తతో వై మృదితా మయా।
న పేయముదకం రాజన్ప్రాణానిహ పరీప్సతా ॥ 43
పార్థ మా సాహసం కార్పీర్మమ పూర్వపరిగ్రహః।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతఃపిబ హరస్వ చ ॥ 44

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 45
న చాహం కామయే యక్ష తవ పూర్వపరిగ్రహం ॥ 45
కామం నైతత్ప్రసంసంతి సంతో హి పురుషాః సదా।
యదాత్మనా స్వమాత్మానం ప్రశంసేత్పురుషర్షభ।
యథాప్రజ్ఞం తు తే ప్రశ్నాన్ప్రతివక్ష్యామి పృచ్ఛ మాం ॥ 46

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-47 yaksha started questioning yudhishthira.
కింస్విదాదిత్యమున్నయతి కే చ తస్యాభితశ్చరాః।
కశ్చైనమస్తం నయతికస్మింశ్చ ప్రతితిష్ఠతి ॥ 47

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 48
బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యాభితశ్చరాః।
ధర్మశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి ॥ 48

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-29
కేన స్విచ్ఛ్రోత్రియో భవతి కేన స్విద్విందతే మహత్।
కేన స్విద్ద్వితీయవాన్భవతిరాజన్కేన చ బుద్దిమాన్ ॥ 49

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 50
శ్రుతేన శ్రోత్రియో భతి రతపసా విందతే మహత్।
ధృత్యా ద్వితీయవాన్భవతి బుద్ధిమాన్వృద్ధసేవయా ॥ 50

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-51
కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 51

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 52
స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ।
మరణం మానుషో భావః పరివాదోఽసతామివ ॥ 52

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-53
కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 53

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 54
ఇష్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ।
భయం వై మానుషో భావః పరిత్యాగోఽసతామివ ॥ 54

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-55
కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజుః।
కా చైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతివర్తతే ॥ 55

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 56
ప్రాణో వై యజ్ఞియంసామ మనో వై యజ్ఞియం యజుః।
ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతివర్తతే ॥ 56

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-57
కింస్విదావపతాం శ్రేష్ఠం రకింస్విన్నివపతాం వరం।
కింస్విత్ప్రతిష్ఠమానానాం కిస్విత్ప్రసవతాంవరం ॥ 57

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 58
వర్షమావపతాం శ్రేష్ఠం బీజం నివపతాం వరం।
గావః ప్రతిష్ఠమానానాం పుత్రః ప్రసవతాం వరః ॥ 58

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-59
ఇంద్రియార్థాననుభవన్బుద్ధిమాఁల్లోకపూజితః।
సంమతః సర్వభూతానాముచ్ఛ్వసన్కో న జీవతి ॥ 59

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 60
దేవతాతిథిభృత్యానాం పితౄణామాత్మనశ్చ యః।
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్న స జీవతి ॥ 60

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-61
కింస్విద్గురుతరం భూమేః కింస్విదుచ్చతరం చ స్వాత్।
కింస్విచ్ఛీఘ్రతరం వాయోః కింస్విద్బహుతరం తృణాత్ ॥ 61

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 62
మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చతరస్తథా।
మనః శీఘ్రతరం వాతాచ్చింతా బహుతరీ తృణాత్ ॥ 62

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-63
కింస్విత్సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చేంగతే।
కస్యస్విద్ధృదయం నాస్తికాస్విద్వేగేన వర్ధతే ॥ 63

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 64
మత్స్యః సుప్తో న నిమిషత్యండం జాతం న చేంగతే।
అశ్మనో హృదయంనాస్తి నదీ వేగేన వర్ధతే ॥ 64
యక్ష ఉవాచ। యక్షుడు అన్నాడు. yaksha said. 65
కింస్విత్ప్రవసతో మిత్రం కింస్విన్మిత్రం గృహే సతః।
ఆతురస్ చ కిం మిత్రం కింస్విన్మిత్రం మరిష్యతః ॥ 65

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 66
విద్యా ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః।
ఆతురస్య భిషఙ్భిత్రం దానం మిత్రం మరిష్యతః ॥ 66

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-67
కోఽతిథిః సర్వభూతానాం కిం స్విద్ధర్మం సనాతనం।
అమృతం కింస్విద్రాజేంద్రకింస్విత్సర్వమిదం జగత్ ॥ 67

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 68
అతిథిః సర్వభూతానామగ్నిః సోమో గవామృతం।
సనాతనోఽమృతో ధర్మో వాయుః సర్వమిదం జగత్ ॥ 68

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-69
కింస్విదేకో విచరతే జాతః కో జాయతే పునః।
కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్ ॥ 69

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 70
సూర్య ఏకో విచరతే యంద్రమా జాయతే పునః।
అగ్నిర్హమస్య భైషజ్యం భూమిరావపనం మహత్ ॥ 70

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-71
కింస్విదేకపదం ధర్మ్యం కింస్విదేకపదం యశః।
కింస్విదేకపదం స్వర్గ్యం కింస్విదేకపదం సుఖం ॥ 71

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 72
దాక్ష్యమేకపదం ధర్మ్యం దానమేకపదం యశః।
సత్యమేకపదం స్వర్గ్యం శీలమేకపదంసుఖం ॥ 72

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-73
కింస్విదాత్మా మనుష్యస్ కింస్విద్దైవకృతః సఖా।
ఉపజీవనం కిస్విదస్ కింస్విదస్య పరాయణం ॥ 73

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 74
పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృతః సఖా।
ఉపజీవనం చ పర్జన్యో దానమస్ పరాయణం ॥ 74

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-75
ధన్యానాముత్తమం కింస్విద్ధనానాం స్యాత్కిముత్తమం।
లాభానాముత్తమం కింస్యాత్సుఖానాం స్యాత్కిముత్తమం ॥ 75
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతం।
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ॥ 76

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-77
కింస్విద్ధర్మపరంలకే కశ్చ ధర్మః సదాఫలః।
కిం నియంయ న శోచంతి కైశ్ సంధిర్న జీర్యతే ॥ 77

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 78
ఆనృశంస్యం పరం ధర్మాత్రేతాధర్మః సదాఫలః।
మనో యంయ న శోచంతి సంధిః సద్భిర్న జీర్యతే ॥ 78

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-79
కింను హిత్వాప్రియో భవతి కింను హిత్వా న శోచతి।
కింను హిత్వాఽర్థవాన్భవతి కింను హిత్వా సుఖీ భవేత్ ॥ 79

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 80
మానం హిత్వాప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి।
కామం హిత్వాఽర్థవాన్భవతి లోమం హిత్వా సుఖీ భవేత్ ॥ 80

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-81
కిమర్థం బ్రాహ్మణే దానం కిమర్థం నటనర్తకే।
కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు ॥ 81

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 82
ధర్మార్థం బ్రాహ్మణే దానం యశోర్థం నటనర్తకే।
భృత్యేషు సంగ్రహార్థం చ భయార్థం చైవ రాజసు ॥ 82

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-83
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 83

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 84
అజ్ఞానేనావృతోలోకస్తమసా న ప్రకాశతే।
లోభాత్త్యజతిమిత్రాణి సంగాత్స్వర్గం న గచ్ఛతి ॥ 84

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-85
మృత కథం స్యాత్పురుషః కథం రాష్ట్రం మృతం భవత్।
శ్రాద్ధం మృతంకథం వా స్యాత్కథం యజ్ఞా మృతో భవేత్ ॥ 85

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 86
మృతో దరిద్రః పురుషో | మృతం రాష్ట్రమరాజకం।
మృతమశ్రోత్రియం శ్రాద్ధం | మృతో యజ్ఞస్త్వదక్షిణః ॥ 86

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-87
కా దిక్కిముదకంపార్థ | కిమన్నం కించ వై విషం।
శ్రాద్ధస్ కాలమాఖ్యాహి | తతః పిబ హరస్వ చ ॥ 87

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 88
సంతో దిగ్జలమాకాశం గౌరన్నం బ్రాహ్మణం విషం।
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష మన్యసే ॥ 88

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-89
తపః కింలక్షణం ప్రోక్తం కో దమశ్చ ప్రకీర్తితః।
క్షమా చ కా పరా ప్రోక్తా కా చ హ్రీః పరికీర్తితా ॥ 89

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 90
తపః స్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః।
క్షమా ద్వంద్వసహిష్ణుత్వంహీరకార్యనివర్తనం ॥ 90

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-91
కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్కః శమశ్చ ప్రకీర్తితః।
దయా చ కా పరా ప్రోక్తా కిం చార్జవముదాహృతం ॥ 91

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 92
జ్ఞానం తత్త్వార్థసంబోధః శమశ్చిత్తప్రశాంతతా।
దయాసర్వసుఖైపిత్వమార్జవం సమచిత్తతా ॥ 92

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-93
కః శత్రుర్దుర్జయః పుంసాం కశ్చవ్యాధిరనంతకః।
కీదృశశ్చ స్మృతః సాధురసాధుః కీదృశః స్మృతః ॥ 93

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 94
క్రోధః సుదుర్జయః శత్రుర్లోభోవ్యాధిరనంతకః।
సర్వభూతహితః సాధురసాధుర్నిర్దయః స్మృతః ॥ 94

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-95
కో మోహః ప్రోచ్యతే రాజన్కశ్ మానః ప్రకీర్తితః।
కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చశోకః ప్రకీర్తితః ॥ 95

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 96
మోహో హిధర్మమూఢ్తవంమానస్త్వాత్మాభిమానితా।
ధర్మనిష్క్రియతాఽఽలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే ॥ 96

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-97
కిం స్థైర్యమృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతం।
స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే ॥ 97

యుధిష్ఠి ఉవాచ। 98
స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్యమింద్రియనిగ్రహః।
స్నానం మనోమలత్యాగో దానం వై భూతరక్షణం ॥ 98

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-99
కః పండిః పుమాన్జ్ఞేయో | నాస్తికః కశ్చ ఉచ్యతే।
కో మూర్ఖః కశ్చకామః స్యాత్ | కో మత్సర ఇతి స్మృతః ॥ 99

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 100
ధర్మజ్ఞః పండితో జ్ఞేయో | నాస్తికో మూర్ఖ ఉచ్యతే।
కామః సంసారహేతుశ్చ | హృత్తాపో మత్సరః స్మృతః ॥ 100

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-101
కోఽహంకార యఇతిప్రోక్తః కశ్చ దంభః ప్రకీర్తితః।
కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్పైశున్యముచ్యతే ॥ 101

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 102
మహాఽజ్ఞానమహంకారో దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయః।
దైవం రదానఫలం ప్రోక్తం పైశున్యం పరదూషణం ॥ 102

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-103
ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పరవిరోధినః।
ఏషాం నిత్యవిరుద్ధానాం కథమేకత్ర సంగమః ॥ 103

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 104
యదా ధర్మశ్భార్యా చ పరస్పరవశానుగౌ।
తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః ॥ 104

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-105
అక్షయోనరకః కేన ప్రాప్యతే భరతర్షభ।
ఏతన్మే పృచ్ఛతః ప్రశ్నం తచ్ఛీఘ్రం వక్తుమర్హసి ॥ 105

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 106
రబ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించనం।
పశ్చాన్నాస్తీతి యోబ్రూయాత్సోక్షయంనరకం వ్రజేత్ ॥ 106
వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యా యో వై ద్విజాతిషు।
దేవేషు పితృధ్రమేషు సోఽక్షయంనరకం వ్రజేత్ ॥ 107
విద్యమానే ధనే లోభాద్దానభోగవివర్జితః।
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్సోక్షయం నరకం వ్రజేత్ ॥ 108

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-109
రాజన్కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా।
బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్సునిశ్చితం ॥ 109

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 110
శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ శ్రుతం।
కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయః ॥ 110
వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః।
అక్షీణవృత్తో న క్షీణో వృత్తతస్తు హతో హతః ॥ 111
పఠకాః పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్రచింతకాః।
సర్వే వ్యసనినో మూర్ఖా యః క్రియావాన్స పండితః ॥ 112
చతుర్వేదోఽపి దుర్వృత్తః స శూద్రాదతిరిచ్యతే।
యోఽగ్నిహోత్రపోర దాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 113

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-114
ప్రియవచనవాదీ కిం లభతే
విమృశితకార్యకరః కిం లభతే।
బహుమిత్రకరః కిం లభతే
ధర్మే రతః కిం లభతే కథయ ॥ 114

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 115
ప్రియవచనవాదీ ప్రీయో భవతి
విమృశితకార్యకరోఽధికం జయతి।
బహుమిత్రకరః సుఖం వసత
యశ్చ ధర్మరతః స గతిం లభతే ॥ 115

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-116
కోమోదతేకిమాశ్చర్యం| కః పంథాః కా చ వార్తికా।
వద మే చతురః ప్రశ్నాన్ | మృతా జీవంతు బాంధవాః ॥ 116

యుధిష్ఠిర ఉవాచ 117
పంచమేఽహని షష్ఠే వా శాకం పచతి స్వే గృహే।
అనృణీ రచాప్రవాసీ చస వారిచర మోదతే ॥ 117
అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయం।
శేషాః స్థావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం ॥ 118
తర్కోఽప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా
నైకో మునిర్యస్య మతం ప్రమాణం।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గతఃస పంథా ॥ 119
పృథ్వీ విభాండం గగనం పిఘానం
సూర్యాగ్నినా రాత్రిదివేంధనేన।
మాసర్తుదర్వీపరిఘట్టనేన
భూతాని కాలః పచతీతి వార్తా ॥ 120

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-121
వ్యాఖ్యాతా మే త్వయా | ప్రశ్నా యథాతత్వం పరంతప।
పురుషం త్విదానీంవ్యాఖ్యా| అహి యశ్చ సర్వధనీ నరః ॥ 121

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 122
దివం స్పృశతి భూమిం చ శబ్దః పుణ్యేన కర్మణా।
యావత్స శబ్దో భవతి తావత్పురుష ఉచ్యతే ॥ 122
తుల్యే ప్రియాప్రియే యస్ సుఖదుఃఖే తథైవ చ।
అతీతానాగతే చోభే సవై పురుష ఉచ్యేత ॥ 123
`సమత్వం యస్య సర్వేషు నిస్పృహః శాంతమానసః।
సుప్రసన్నః సదా యోగీ స వై సర్వధనీ నరః' ॥ 124

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-125
వ్యాఖ్యాతః పురుషో రాజన్యశ్చ సర్వధనీ నరః।
తస్మాత్త్వమేకం భ్రాతృణాం యమిచ్ఛసి స జీవతు ॥ 125

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 126
శ్యామో య ఏష రక్తాక్షో బృహత్సాల ఇవోత్థితః।
వ్యూఢోరస్కో మహాబాహుర్నకులో యక్ష జీవతు ॥ 126

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-127
ప్రియస్తే భీమసేనోఽయమర్జునో వః పరాయణం।
త్వం కస్మాన్నకులం రాజన్సాపత్నం జీవమిచ్ఛసి ॥ 127
యస్ నాగసహస్రేణ దశసంఖ్యేన వై బలం।
తుల్యంతం భీమముత్సృజ్య నకులం జీవమిచ్ఛసి ॥ 128
తథైనం మనుజాః ప్రాహుర్భీమసేనం ప్రియం తవ।
అథ కనానుభావేన సాపత్నం జీవమిచ్ఛసి ॥ 129
యస్య బాహుబలంసర్వేపాండవాః సముపాసతే।
అర్జునం తమపాహాయ నకులం జీవమిచ్ఛసి ॥ 130

యుధిష్ఠిర ఉవాచ। ధర్మరాజు అన్నాడు yudhishThira said:- 131
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః।
తస్మాద్ధఱ్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్ ॥ 131
ఆనృశంస్యం పరో ధర్మః పరమార్థాచ్చమే మతం।
ఆనృశంస్యం చికీర్షామి నకులో యక్ష జీవతు ॥ 132
ధర్మశీలః సదా రాజాఇతిమాం మానవా విదుః।
స్వధర్మాన్న చలిష్యామి నకులో యక్ష జీవతు ॥ 133
కుంతీ చైవ తు మాద్రీ చ ద్వే భార్యే తు పితుర్మమ।
ఉభే సపుత్రే స్యాతాం వై ఇతిమే ధీయతే మతిః ॥ 134
యథా కుంతీ తథా మాద్రీ విశేషో నాస్తి మే తయోః।
మాతృభ్యాం సమమిచ్ఛామి నకులో యక్ష జీవతు ॥ 135

యక్ష ఉవాచ। yaksha said యక్షుడు అన్నాడు|అడిగాడు:-

యస్ తేఽర్థాచ్చ కామచ్చ ఆనృశంస్యం పరం మతం।
తస్మాత్తే భ్రాతరః సర్వే జీవంతు భరతర్షభ ॥ 136.

315 వ ఆధ్యాయంలో యమ ధర్మరాజు తన పుత్రుడైన ధర్మరాజుకు తన నిజరూపాన్ని చూపించి వారి వనవాసం పూర్తి కావస్తున్నదని, అజ్ఞాత వాసంలో వారినెవరు గుర్తు పట్టరని దీవించాడు.

Great Poet YerrapragaDa మహాకవి ఎర్రాప్రగడ


ఎర్రాప్రగడ, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం, 423 వ పద్యం నుండి 459 వ పద్యం వరకు.

వ్యాసుడు: ముంబాయి వెర్షన్ లో 314 ఆధ్యాయం. కొన్ని ఇతరవెర్షన్లలో 297వ ఆధ్యాయం.

423. కందం. దినకరు నెయ్యది నడపును,
దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు రద్దే
వుని యస్తమించుటేమిట,
ననఘ తదాధారభూతమెద్ది యొకో,

424. తే.గీ. అనిన ధర్మజుడిట్లను నబ్జహితుని,
నడపు బ్రహ్మంబుసురకోటి నడచుఁ గొలిచి
ధర్మువున నస్తమితుఁ డగుఁ దపనుఁ డమ్మ
హాత్మునకు సత్యమాధారమండ్రు బుధులు.

అనిన విని యక్షుండిట్లనియె.

కందం. ఏమిట శ్రోత్రియుఁడనఁజను,
నెమిటఁ గడు మహిమ వడయు నిమ్ముగఁ బురుషుం
డేమిట సహాయయుతుఁడగు, నేమిటనగు బుధ్ధిమంతుఁ డర్పడఁ జెపుమా.
అనిన నతండిట్లనియె.

కందం. శ్రుతము వలన శ్రోత్రియుఁడగు,
నతుల తపోయుక్తిఁ (లేక తపోవృత్తి) గడు మహత్వము వడయున్
ధృతిచే సహాయయుతుఁ డగు,
నతిశయముగ బుధ్ధిమంతుడగు బుధసేవన్.

వచనం. అని చెప్పిన అప్పార్ధివోత్తమున కప్పురుషుండు వెండియు నిట్లనియె.

తేటగీతి. ఏమి కతమున భూదేవుఁ డెసగు దేవ,
భావమున నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు నసాధుత్వ మెద్దానఁ జెందు
మానుషుండగు నాతడేదానఁ జెపుమ.

చంపకమాల. అనవుడు ధర్మజుండనియె నధ్యయనంబున దేవభావముం
గను నవనీసుపర్వుఁ డధిక వ్రతశీలత సాధుభావ మా
తనికి విశిష్ట వృత్తి దిగఁ ద్రావి యసాధు వనంగ నుండు శౌ
చనియతి లేక మృత్యుభయసంగతి నాతడు మానుషుండగున్.

కందం. నావుడు నతడాతనితో
జీవన్మృతుడెట్టివాడు సెప్పు మనుటయున్
దేవాతిథిపితృభృత్యజ
నావళులకు నిడక కుడుచు నతడని చెప్పెన్.

౪౩౩. విని మగుడంగ వాఁడు పృథివీపతిఁ జూచి ధరిత్రికంటె వ్రేఁ
కన జనుదాని నాకసము కంటె కడుం బొడవైనదాని గాడ్పునకును నెక్కుడై జనము పొంపిరి వోయెడుదానిఁ బూరి కం
టెను దరచైన దానని ఘటింపఁగ జెప్పుము నాకు నావుడున్.
౪౩౪.వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కిట్లనియె.

౪౩౫. ఆ.వె. తల్లి వ్రేఁగు సువ్వె ధరణికంటేను నాక,
సంబు కంటె పొడవు జనకు డరయ
గాడ్పు కంటె మనసు గడు శీఘ్రగతి తృణో
త్కరము కంటె చింత గరము తరచు.


౪౩౬.వ. అనిన అంబర చరుండు మరియు నిట్లనియె.
౪౩౭. తే. మొనసి నిద్రించియును గన్ను మూయ దెద్ది
పుట్టియును చేతనత్వంబు పొరయ దెద్ది
యరయ రూపు గల్గియు హృదయంబు లేని
దెద్ది వేగంబు కతనమున నెద్ది వొదలు.


౪౩౮. అనినఁ గన్ను మూయదు సుప్తమయ్యు మీను
పుట్టియును గ్రుడ్డు చేతనఁ బొరయకుండు
హృదయరహితంబు రారూప మేఱు రయము
కతన వర్ధిల్లు నని చెప్పెఁ గౌరవుండు.


౪౩౯. చెప్పిన అయ్యక్షుం డతనితో తెరువు నడుచు వానికి రోగార్తునకు గృహస్తునకు మృతి పొందిన వానికి ఎవ్వరు సుట్టంబు లనిన అప్పుడమి ఱేఁడన్నలువురకుం గ్రమంబున సార్ధంబును, వైద్యుండును, సద్భార్యయును, కృతంబైన ధర్మంబును బరమ మిత్రులని నిర్దేశించుటయు , నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె.


౪౪౦. కందం. ఎయ్యది దర్మువునకుఁ గుదు
రెయ్యది యాశ్రయము కీర్తి కిమ్మగు మార్గం
బెయ్యది సురలోకమునకు,
నెయ్యది సుఖమునకు నిక్క యేర్పడఁ జెపుమా.


౪౪౧. వ. అని యడుగుటయు.


౪౪౨. కందం. అమరగ దాక్షిణ్యము ధ
ర్మమునకు కుదురండ్రు కీర్తి మహిమ నెలవు దా
నము సత్యము సురపురి మా
ర్గము శీలము సంశ్రయము సుఖంబుల కెల్లన్.


౪౪౩. వచనం. అని యుధిష్ఠిరుం డెరింగించిన వెండియు.


౪౪౪. చంపకామాల. నరునకు నాత్మ యెవ్వఁడు ఘనంబుగ దైవికమైన చుట్టమె
వ్వరతనికిం దదీయ మగు వర్తన మేమిట నిర్వహించు భూ
వర యతడేమి వూని యనవద్యతఁ బొందు నెఱుంగఁ జెప్పు మీ
నరుదుగ నన్న నక్కురుకులాగ్రణి యాతనితోడ నిట్లనున్.


౪౪౫. తేటగీతి. ఆత్మజుఁడు సువ్వె పురుషున కాత్మ యయ్యె
నాతనికి భార్య దైవిక మైన చుట్ట
మతని జీవిక పర్జన్యు కతనఁ జెల్లు
నతఁడు దానము గొనియాడి యతిశయిల్లు.


౪౪౬. చంపకమాల. అనవుడు మేటి ధర్మమగు నట్టిది యెయ్యది యేది యెప్పుడున్
తనియఁగ బండి యుండు నెనకంబున నెయ్యది నిగ్రహించినం
దనరుఁ బ్రమోదసిధ్ధి నియతంబుగ నెవ్వరి తోడి సంధి యెం
దును వికలంబు గాదు పరితోష మెరల్ప నుపన్యసింపుమా.


౪౪౭. వచనం. అని దివ్యుండు వలికిన నా దివ్యబోధనుం డిట్లనియె.


౪౪౮. ఆటవెలది. విను మహింస మేటి యనఁ జను ధర్మంబు
యాగకర్మ మెపుడు నమరఁ బండి
యుండు మనసు క్రొవ్వు ఖండింపఁగా మోద
మెసగు సుజన సంధి యెడల దెందు.


౪౪౯. తేటగీతి. అనిన నతఁడు లోకమునకు నెయ్యది దిక్కు
జలము నన్నంబు నెద్దాన సంభవించు
విషమనంగ నెయ్యది శ్రాధ్ధవిధికి నెద్ది
సమయ మనిన నిట్లని చెప్పె జన విభుండు.


౪౫౦. తేటగీతి. సజ్జనులు దిక్కు సూవె యీ సర్వమునకు
నభము ధరణియు జలము నన్నమ్ము నుద్భ
వించు నెలవులు విషమగు విప్రధనము
లనఘ శ్రాధ్ధకాలము బ్రాహ్మణాగమంబు.


౪౫౧. వచనం. అని తెలిపిన నయ్యక్షుండు ధర్మ నందనుతో మనుజుండెయ్యది పరిత్యజించి సర్వజన ప్రియుండును నిశ్శోకండును నర్ధవంతుండును సుఖియును నగు ననిన నమ్మహీపతి యిట్లనియె.


౪౫౨. తేటగీతి. సర్వ జన సమ్ముతుండగు గర్వ ముడిగి
క్రొధ మడఁచి శోకమునకుఁ గుదురు గాఁడు
వినవె యర్ధాఢ్యుఁ డగు లోభ మొనర విడిచి
తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుఁ గాంచు.


౪౫౩. వచనం. అనిన యనంతరంబ యద్దివ్యుండతనితోఁ బురుష శబ్ద వాచ్యుండెట్టి వాఁడు మఱి సర్వధని యగు వాఁ డెవ్వండు నిశ్చయింపు మనినఁ బాండవ జ్యేష్ఠుండిట్లనియె.


౪౫౪. కందం. దివి ముట్టి ధరణి యంతట
నివిడి మెఱయు చుండు నెవ్వని యశోరమ య
ట్టి విశిష్ట చరిత్రుఁడు య
క్షవరా పురుషుండు నాఁ బ్రకాశత నొందున్.


౪౫౫. ఆటవెలది. ప్రియము నప్రియంబుఁ బెల్లగు సౌఖ్యదుః
ఖములు భూత భావి కార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధని యనఁ
బరగుఁ జువ్వె యట్టి భవ్యుఁ డనఘ.


౪౫౬. వచనం. అని వివరించిన విని యుధిష్ఠిరు దసఁ బ్రసాద మధురబైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు మహాత్మా మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి నీవలనం బ్రీతుండ నైతి నీతమ్ముల యందొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు మనిన నతడు.


౪౫౭. సీసం. శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సాలప్రాంశు నున్నత లలితబాహు
నకులుని బ్రతికింపు నావుడు యక్షుండు భీమ ఫల్గును లతి భీమ బలులు
ప్రియులు నీకెంతయుఁ బృథివీశ వీరిలో నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి
తనుడు ధర్మాత్మజుం డనియెడు మాతండ్రి యగు పాండు విభునకు మగువ లిరువు


ఆటవెలది. రందు గొంతి కొడుకు లైన మువ్వురిలోన, నేను బ్రతికినాఁడ నింక మాద్రి
తనయు లిరువురందు నొక్కుండిప్డు,
బ్రతుక వలదె చెపుమ పాడి తెఱఁగు.


౪౫౮. ఆటవెలది. ధర్మనందనుండు ధర్మాత్ముఁడని యెప్డు
దగిలి జగము నన్నుఁ బొగడు చుండు
నట్ట యేను ధర్మహానికి నోర్వజు
మ్మెత వచ్చెనేని యింత నిజము.


౪౫౯. వచనం. అనిన నతండు నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి, నీ తమ్ములందఱు లబ్ధ జీవితులయ్యెద రనిన నక్షణంబ విగత క్షుత్ పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కనిన తెఱంగున సముత్థితు లైనం జూచి విస్మితుండై ధర్మపుత్రుండి ట్లనియె.


౪౬౦. చంపకమాల. నిను నొక యక్షమాత్రుఁడని నెమ్మి నమ్మఁగ నేర నయ్యెదన్
జననుత నీవు నిక్కముగ శక్రుడవో యలకాధిపుండవో
యనలుఁడవో సమీరుఁడవొ యట్లునుగాక జగన్నుతుండు మజ్జనకుఁడు నైన ధర్ముఁడవొ సత్కృపఁ జెప్పుము నాకు నావుఁడన్.


౪౬౧. వచనంబు. అమ్మహాత్ముండు మందస్మితననుండై.

౪౬౨. మత్తకోకిలము.
ఏను ధర్ముఁడఁజువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
దానముం దపమున్ శమంబును దాంతియున్ యశముం పరి
జ్డానయుక్తియు నాదు మూర్తులు సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమ ధార్మికున్ నినుఁ జూచు వేడుక వచ్చితిన్.


౪౬౩. వచనం. నన్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబులైన వరంబు లిచ్చెద నడుగు మనినఁ బాండవాగ్రజుండు సంభ్రమ భక్తి పరుండగుచు దండప్రణామంబు సేసి యద్దేవోత్తముం బ్రస్తుతించి దేవా మదీయాశ్రమ వాసుండైన భూసుర వరు నరణి యొక్క హరిణంబు చేత నపహృతంబయ్యె నతనికం గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే యనినఁ బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు.


౪౬౪. కందం. వినుమేను నీమనోగతి,
యనఘా యెఱుగంగవేఁడి యరణీ హరణం
బొనరించితి మృగ మెక్కడి
దని యమ్మహనీయ వస్తు వతనికి నిచ్చెన్.


౪౬౫. వచనం. ఇచ్చి మఱియు నిట్లనియే. పదమూఁడవ యేడు నరుదెంచె నింక మీరజ్ఞాత వాసంబు సలుప వలయు నందు మీరెవ్వ రెక్కడ నేరూపంబనం జరియింపం గోరిన నయ్యైరూపంబు లలవడియెడు నెట్లున్నను మిమ్మెవ్వరు నెఱుంగ కుండనట్లుగా వరంబిచ్చితి నింక నొండెయ్యది వలసిన నడుగు మనిన నమ్మనుజేశ్వరుండిట్లనియె.


౪౬౬. మత్తకోకిలము.

ఆదిదేవుండ వైన నీవు దయామతిం బొడసూపి న
న్నాదరించుటఁ జేసి ధన్యుఁడనైతి నింతకు నెక్కుడొం
డేది కలునె యైన నామది యెల్లవాఁడును గ్రోధమోహాదులం బెడఁబాసి ధర్మువు నంద నెక్కొనఁ జేయవే.

౪౬౭. వచనం. అనిన నద్దేవుండతనికి నవ్వరంబొసంగి యంతర్హితుండయ్యెఁ గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబు కరిగి ధరణీదేవునకు నరణీ ప్రదానంబు సేసి తత్ ప్రయుక్తాశీర్వాదంబులు గైకొని పరమానందంబునం బొందిరని యిట్లు పాండు తనయుల వనవాస ప్రకారంబు సవిస్తర మధురంబుగా నుపన్యసించి.


౪౬౮. కందం. అనఘుఁడు గృష్ణద్వైపా
యన శిష్యుఁడు బోధనిధి సమంచిత మేధా
ఘనునకుఁ బారిక్షితునకు
ననవరానంద సుఖ సమగ్రత యొసఁగెన్.

ఇక్కడితో ఆరణ్య పర్వం అయిపోయింది. ఈసందర్భంగా ఎర్రన చెప్పిన పద్యాలు కూడ అవశ్య పఠనీయాలే. నాకు వదలి వేయ బుధ్ధి కావటంలేదు.

౪౬౯. సీసం. భవ్యచరిత్రుఁ డాపస్తంభసూత్రుండు శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడు సూరనార్యునకును బోతమాంబికకును
నందనుఁడిల బాకనాటిలో నీలకంఠేశ్వర స్థానమై యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు ధన్యుండు ధర్మైక తత్పరాత్ముఁ

తేటగీతి. డెఱ్ఱనార్యుండు సకల లోకైక విదితుఁ
డయన నన్నయ భట్ట మహాకవీంద్రు
సరస సారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
జెందుటయు సాధుజన హర్ష సిధ్ధిఁ గోరి.

౪౭౦. కందం. ధీరవచారుఁడు తత్కవ
తారీతియుఁ గొంత దొప దద్రచనయకా
రణ్యపర్వ శేషమున్
బూరించెఁ గవీంద్ర కర్ణ పుట పేయముగాన్.

౪౭౧. కందం. వీరావతార విమలా
చార మహోదార శుభవిచార సుజనమం
దార నవకీర్తి మౌక్తిక
హార హర పదాబ్డ మధుకరాత్మ విహారా.

౪౭౨. తరలము.
అమిత వైభవ లోబ మోహ మదాది దుర్లభ మంజువి
భ్రమ విలాసిత కామినీ జన పంచ బాణ నిరంతరా
నమద శేష నృపాల మౌళి పినధ్ధ ముగ్ధమణి ప్రభా
క్రమ సమంచిత విస్ఫురత్ పదకాంతి నిర్జిత పంకజా.

గద్యం. ఇది సకల సుకవి జన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందారణ్య పర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణ యుధ్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ చరిత్రంబును సూర్యుండు గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ గర్ణు జన్మంబును, నింద్రుడు విప్రరూపంబునఁ గర్ణు కవచకుండలంబులు హరించుటయు నారణేయంబును యక్ష ప్రశ్నలును ధర్ముండు ధర్మజునకు వరంబు లొసంగుటయు, నన్నది సర్వంబును సప్తమాశ్వాసము.
శ్రీమదాంధ్ర మహా భారతమునందలి యారణ్య పర్వము సమాప్తము.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


వ్యాసుడు 89 శ్లోకాలు వాడుకున్నాడు (47 వశ్లోకం నుండి 136వ శ్లోకం వరకు). ఎర్రాప్రగడ మొత్తం 36 పద్యాలు (42౩ నుండి 459 వరకు) వాడుకున్నాడు. అంటే షుమారు రెండున్నర రెట్లు కుదించినట్లు.

ఇలా పద్యాల సంఖ్యను కుదించే క్రమంలో కొన్ని ప్రశ్నలు, జవాబులు కవర్ కాలేదు. అంతే కాక పద్యకవిత్వావసరమైన ఛందస్సును పాటించ వలసి రావటం వల్ల కొంత కుదింపు జరిగి ఉండ వచ్చు. మొత్తం మీద ఎర్రన అనువాదం శైలీభేదం ఉన్నప్పటికి నన్నయకి ఏమాత్రం తీసిపోదు.

కొంత స్వంత గోల


నిజమైన బ్లాగులు (వెబ్ లాగులు) అంటేనే కొంత స్వంత గోల ఉండాలి.

ఎర్రన శ్రీవత్స గోత్రీకుడు. మేము కూడ శ్రీవత్స గోత్రీకులమే.

సగోత్రీకులు బంధువులు కారని పరిశోథకులు చెప్పారు.

సరదాగా రెండు విషయాలు వ్రాస్తున్నాను.

1. పై పద్యాలలో, ఎర్రన శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ సంతత ధ్యాన సంసక్త చిత్తుఁడ నని చెప్పాడు. ఎర్రనయందు నాకింత భక్తి ఉన్నప్పటికి ఆయనకున్న శివభక్తి నాకు అంటలేదు. అదేమి చిత్రమో, నేను నాస్తికుడ నయ్యాను.

2. నేను పూర్వాశ్రమంలో (పూర్వ జన్మ అని కూడ అనచ్చు. నా దృష్టిలో ప్రతి వృత్తీ కూడ ఒక జన్మయే. పలు జన్మలు పొందిన అదృష్టం నాకు కూడ కలిగింది.) ఒక ప్రభుత్వరంగ బ్యాంకు అధికారిగా పనిచేసిన కాలంలో మా ఒక బాస్ కూడ శ్రీవత్స గోత్రీకుడే. ఆయన బ్యాంకులో ఏవైనా ప్రారంభించాల్సి వచ్చినపుడు హిందూ(త్వ) పధ్దతిలో పురోహితులచేత పూజలు చేయించే వాడు. పూజ చేసే పురోహితులు పూజకు కూర్చున్న ఆయనను గోత్రమడిగినపుడు శ్రీవత్స గోత్రమని చెప్పేవాడు. మన పూజా మంత్రాలలో ''ఇష్ట సంకల్పాది సిధ్ధ్యర్ధం, పుత్రపౌత్రాది వృధ్ధ్యర్ధం వంటి'' సబ్మిషన్స్ ఉంటాయి.

ఒకరోజు ఏదో సంభాషణ వచ్చినపుడు నేను హాస్యానికి ఆయనతో అన్నాను. ''మీ గోత్రం, మాగోత్రం ఒకటే. బ్యాంకు ఖర్చుతో మీ వంశం(పుత్ర పౌత్రాభివృధ్ధి)తో పాటు మా వంశం కూడ అభివృధ్ధి చెందుతుంది లేండి '' అన్నాను. ఆయన నవ్వి ఊరుకున్నాడు.

తిరగవ్రాయాల్సినది ఉంది. ఈయక్ష ప్రశ్నలపై వ్యాఖ్యలను, విమర్శలను, సందేహాలను ఆహ్వానిస్తున్నాను. నేను గొప్ప నిపుణుడనేమీ కాదు. నాశక్తి కొద్ది ప్రయత్నిస్తాను. ఇందులో ఏముంది అనుకోకండి. ఈయక్ష ప్రశ్నలపై 1000 పేజీల పుస్తకం వ్రాయ వచ్చు. నాకాభాగ్యం కలుగుతుందో లేదు. ౧౧-౧౪ శతాబ్దాలకి చెందిన ఎందుకంటే కవిత్రయానికి ఉన్న శ్రధ్ధ ౨౧ శతాబ్దానికి చెందిన మనకెలా వస్తుంది?

152 Residual Andhra Pradesh Capital

152 Temporary arrangements for Residual Andhra Pradesh State Capital శేషాంధ్ర రాజధానికి తాత్కాలిక ఏర్పాట్లు
చర్చనీయాంశాలు: bifurcation, Capital of Andhra Pradesh, రాజధాని, తెలంగాణ, సీమాంధ్ర

''There is no purpose of staying back in Telangana State after division. It is in the best interests of Seemandhra people that the administration of the new State should be carried out from Andhra Pradesh and not Telangana. ... We cannot live here facing abuse and humiliation."
కొమ్మినేని.ఇన్ఫో అనే వెబ్ సైట్ వారు వ్రాసినది: కాంగ్రెస్ సీనియర్ నేత,శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే హైదరాబాద్ నుంచి వెళ్లిపోదామని అంటున్నారు. విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం కరెక్టు కాదని ఆయన వాదిస్తున్నారు.హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. ఇక్కడ ఉండడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు. వీర సమైక్యవాది అయిన పాలడుగు వెంకటరావు ఇప్పుడు మరీ ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు. పది ,పదిహేను రోజులలో మొత్తం ఖాళీ చేసి వెళ్లి పోవడం ఎలా సాధ్యమో వెంకట్రావు చెప్పాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


నేను గతంలో చేసిన పరిశోథనలను బట్టి, పెట్టుబడిదారి రాజకీయాలలో ఉండి కూడ అర్ధవంతంగా మాట్లాడే అతి కొద్దిమంది రాజకీయవేత్తలలో శ్రీ పాలడుగు వెంకట రావు ఒకరని తేలింది. పైనా వ్రాసిన కొమ్మినేని.ఇన్ఫో వారు వ్రాసిన వార్త ఈవిషయాన్నే ధృవీకరిస్తున్నది. నేను వ్రాద్దామనుకున్నదే శ్రీవెంకట రావు చెప్పటం వల్ల నాపని తేలికయింది. పది, పదిహేను రోజులలో కాకపోయిన వీలైనంత త్వరగా వచ్చేయటం మంచిది. ఈసందర్భంగా నేను కొన్ని సూచనలు చేయ దలుచుకున్నాను.

దీర్ఘకాలిక లక్ష్యాలు


మూడు రాష్ట్రాలు: ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ. ఈలక్ష్యంకొరకు సమష్టిగా కేంద్రం లో ఏపార్టీలు అధికారంలో ఉన్నా వారి మీద వత్తిడి తెచ్చుకోవచ్చు. విశాఖ, వి-గుం-తె, కర్నూల్ లను ప్రాంతీయ రాజధానులు గా అభివృధ్ధి చేసుకోటం. అంటే, ఏప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఫైళ్ళను, కాగితం దస్త్రాలను వీలైనంత వరకు ఆప్రాంతాలలోని స్టోర్ చేసుకోటం. అథికార వికేంద్రీకరణ చేసుకొని ప్రాంతీయ రాజధానులలోనే ఎక్కువ నిర్ణయాలను తీసుకోటం.

స్వల్పకాలిక తాత్కాలిక ఏర్పాట్లు


రాజధాని కొరకు మనకుమ్ములాటలను ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ తన్నుకొని చులకన అయ్యే కన్నా, మనం ఈక్రింది తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు.

శేషాంధ్ర రాజధాని


౧. ప్రతి రెండేళ్ళకు కర్నూలు, విశాఖ, వి-గుం-తె, కర్నూలు మధ్య రాజధానిని రొటేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కాశ్మీరులో ఎండకాలం రాజధాని శ్రీనగర్ లోను, చలికాలం రాజధాని జమ్ములోను పెట్టుకుంటు ప్రతి ఆరునెలలకు ఒకసారి దస్త్రాలను తరలించుకు పోతున్నారు. మంచుకొండలలోనే వారు ప్రతి ఆరు నెలలకొకసారి వారా పని చేయగలుగుతున్నపుడు మనం రెండేళ్ళకొకసారి తరలించుకు వెళ్ళలేమా. గవర్నర్ కు తాను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండే స్వేఛ్ఛనివ్వ వచ్చు. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వ బంట్రోతు కాబట్టి ఆయన రాజభవన్ ఎక్కడుండాలో కేంద్రప్రభుత్వం, ఆయన నిర్ణయించుకుంటారు. హైకోర్టు విషయంలో ఒక మెయిన్ హైకోర్టు, రెండు బెంచీలు సంపాదించుకో గలిగితే బాగుంటుంది. మెయిన్ హైకోర్టు ఎక్కడుండాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు వదలి వేయవచ్చు.

శేషాంధ్ర ముఖ్యమంత్రి పదవి


ఏపార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి పదవిని రెండేళ్ళ కొకసారి క్యాలెండర్ సంవత్సరం ప్రాతిపదికన రొటేట్ చేసుకోవచ్చు.
ఉదాహరణ:
2014, 2015 క్యాలండర్ సంవత్సరాలు అంటే 2014 జనవరి నుండి 2015 డిసెంబర్ వరకు: ఉత్తరాంధ్రకు చెందిన వారు ముఖ్యమంత్రి. టీడీపీ గెలిచినా కూడ ఉత్తరాంధ్రకు చెందిన వారినే ముఖ్యమంత్రి కానివ్వాలి. కాకపోతే టీడీపి ఉత్తరాంధ్ర నేత ముఖ్యమంత్రి అవుతాడు.

2016, 2017 క్యాలండర్ సంవత్సరాలు: అంటే 2016 జనవరి నుండి 2017 డిసెంబర్ వరకు: దక్షిణాంధ్రకు చెందిన వారు ముఖ్యమంత్రి. టీడీపీ గెలిస్తే టీడీపి దక్షిణాంధ్రవాడు మొ||

2018, 2019 క్యాలండర్ సంవత్సరాలు: 2018 జనవరి నుండి 2019 డిసెంబర్ వరకు: రాయలసీమ నేత ముఖ్యమంత్రి. ఏపార్టీ గెలిచినా ఏరియా రిజర్వేషన్ ను మరచి పోరాదు.

ఈ ఏరియా రిజర్వేషన్ లలోనే బీసీ, ఎస్ సీ, ఎస్ టీ లకు కూడ కొంత రిజర్వేషను చేసుకోవచ్చు.

మంత్రి పదవుల పంపిణీ


రాష్ట్రానికి గరిష్ఠంగా ౩0 మంది మంత్రులు ఉండవచ్చు అనుకుంటే ప్రతి ప్రాంతానికీ పది చొప్పున. ప్రతి ప్రాంతంలో బీసీ, ఎస్ సీ, ఏస్ టీ రిజర్వేషన్ లను మరువరాదు.

శాఖల కేటాయింపులు



శాఖలను ప్రాధాన్యతలు బట్టి A,B,C లుగా వర్గీకరించుకోవాలి. ఉదా: మొత్తం ౩0 శాఖలలో 9 A కేటగిరి శాఖలు, 9 B కేటగిరి శాఖలు, 12 సీ కేటగిరి శాఖలు ఉన్నాయనుకుందాం.
రాయలసీమ: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను గులాబి అందాం.
ఉత్తరాంధ్ర: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను సంపంగి అందాం.
దక్షిణాంధ్ర: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను మల్లె అందాం.

ఈగులాబీలను, సంపంగులను, మల్లెలను, మూడు ప్రాంతాల వారూ రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకవసరం అంటే ఒకే ప్రాంతంవారు గులాబీలను స్వంతం చేసుకొని మిగిలిన వారిని అన్యాయం చేయకుండా. గతంలో రైల్వే శాఖను బెంగాల్, బీహార్ వారు స్వంతం చేసుకొని రైల్ ప్రాజెక్టులను కొట్టేసిన సంగతి మరువరాదు,

ఇవన్నీ చెప్పటానికి తేలికే, కాని ఆచరణలో కష్టం


అనే వారికి జవాబు: మనం తన్నుకొని ఢిల్లీ వెళ్తే అక్కడ ఎవరు అధికారంలో ఉంటారనేదాన్నిబట్టి దిగ్విజయ్ సింగ్ చేతో, కమల్ నాథ్ చేతో, సుష్మా స్వరాజ్ చేతో, మోడీ గారి చేతో మెడ బెట్టి గెంటించు కోవలసి వస్తుంది. అది నయమా, లేక మన సమస్యలను మనమే పరిష్కరించుకొని, మన 25 మంది ఎంపీల బలంతో గర్వంగా ఢిల్లీ వీధుల్లో తిరగటం నయమా.

మరి బిల్డింగులు


విశాఖలో మొదటి రొటేషన్ రాజధానిని నడుపు కోటానికి ఆంధ్రాయూనివర్సిటీ వారి నుండి కొన్ని భవనాలను తీసుకోవచ్చు. మూతబడిన ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలను, మూసివేసిన సినిమా హాళ్ళను, కొన్ని కల్యాణ మంటపాలను, అద్దెకి తీసుకోవచ్చు. రెండేళ్ళంటే ఎవరైనా ఇస్తారు.

మొదటి రొటేషన్ విశాఖలో రాజధాని ఉన్న కాలంలో కర్నూలులో, వి-గుం-తె లలో కొన్ని భవనాలను నిర్మించుకోవచ్చు. నైట్ లాండింగ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మూసివేసిన సినిమా హాళ్ళను, ఇంజనీరింగు కాలేజీలను అద్దెకి తీసుకోవచ్చు. కర్నూలు తుంగభద్రా తీరంలో కొన్ని రేకుల షెడ్లు వేసుకోవచ్చు. కొన్ని భవనాలను అద్దెకి తీసుకోవచ్చు. వి-గుం-తె లో నాగార్జున యూనివర్సిటీ వారిని కొన్ని భవనాలను అడుక్కోవచ్చు. దాని ఎదురుగా నిర్మించబడుతున్న డూప్లెక్స్ ఇళ్ళను, సింగపూర్ ఎపార్టుమెంట్లను అద్దెకి తీసుకోవచ్చు. రెండేళ్ళేగా.

కోరిక ఉంటే మార్గం ఉంటుంది. సింహం నోటిలోకి ఆహారం అదంతట అదే వచ్చి పడదు. అది తిరిగి వెతుక్కోవాలి.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |