Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Saturday, February 15, 2014

140 future alternatives for SImAndhra

140 Some methods for people of Residual Andhra Pradesh సీమాంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని మార్గాలు |పధ్ధతులు
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శేషాంధ్ర, సీమాంధ్ర, బిజెపి, కాంగ్రెస్, టీడీపి, రాజశ్రీ

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు


ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మూజువాణి వోటుతో లోక్ సభలో పాస్ చేయబడే సూచనలు కనిపిస్తున్నాయి. అడ్డు వచ్చే మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రివర్గ సభ్యులను, ఎం.పీ. లను బహిష్కరించి వారు చర్చలో గానీ, వోటింగులో గానీ పాల్గొనకుండా అడ్డుకోటం, డివిజన్ వోటింగ్ కోరకుండా చేయటం జరగచ్చు.

బిజెపి పాత్ర


బిజెపి మొదటి నుండి తెలంగాణ పక్షానే ఉంటున్నది.
టిఆర్ఎస్ తో చెలిమి చేసింది. బిజెపి అగ్ర నేతలందరు తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టమని కాంగ్రెస్ ను పొడిచిన సంగతి మనం మరువరాదు. కాంగ్రెస్, బిజెపి పోటీపడి తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం అనే పల్లవి రాజకీయ అవకాశవాదంలో భాగంగా ఒక నెల క్రింద మాత్రమే ఎత్తుకున్నది. బిజెపి అగ్రనేత కాంగ్రెస్ ఏదో విషబీజాలు నాటిందని ప్రసంగాలు చేస్తున్నారు గానీ విషబీజాలు నాటటంలో ఇరువురూ పోటీపడ్డారు.

బిజెపి ప్రతిపాదించిన సవరణల గతి


కొన్నిటిని నామమాత్రంగా కాంగ్రెస్ అమలు చేసినా, చెప్పుకోతగ్గ సవరణలు ఉండవు. బిజెపి తన తెలివి తేటలను ఉపయోగించి మూజువాణీ వోటుతో బిల్లును పాస్ చేయనిస్తుంది. మబ్బుల్లో నీళ్ళుచూసి ముంత ఒలకపోసుకోనా అనే సామెత గుర్తుకు తెచ్చుకొని తెలంగాణలో వచ్చే ఒకటి రెండు మూడు సీట్లతో సరిబుచ్చుకుంటుంది.

తాము వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామనే వాగ్దానం


ఇది వట్టి కల్లబొల్లి హామీ. అపుడు మాజిక్ ఫిగర్ 271 కి సీట్లు తక్కువ బడితే వెన్నుపోటు సార్వభౌమ చంద్రబాబును, అవినీతి సార్వభౌమ జగన్ ను, వాడుకోవాలనే పథకం తప్ప మరేమీ కాదు. అప్పటి ఆర్ధిక మంత్రిగా ఎవరుంటారో తెలియదు. బడ్జెట్ లోటు ఎంత ఉంటుందో తెలియదు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, ఐ.ఎమ్.ఎఫ్. లనుండి ఎటువంటి ఒత్తిళ్ళు వస్తాయో తెలీదు. బిజెపికి నిజంగా ఇవ్వాలనే కోరిక ఉంటే ఇవ్వగలిగేది రాజధాని నిర్మాణానికి ఆర్ధిక సాయం, హైదరాబాదును కోల్పోయిన ఫలితంగా వచ్చే రెవిన్యూ లోటును పూడ్చుకోటానికి సహాయం చేయటం. ఇది భాజపాకు ఆనాటికి సీమాంధ్ర ప్రజలతో, ఎంపీలతో కలిగే అవసరాలను బట్టి ఉంటుంది.
నరేంద్ర మోడీ రికార్డును బట్టి చూస్తే ఆయన శ్రీరామచంద్ర మూర్తి లాగ అగ్ని సాక్షిగా వివాహమాడిన ధర్మపత్నిని, '' నేను ఆయన ధర్మపత్నినే '' అని కలవరించే లాగ చేస్తున్నాడు. ప్రచురించ బడిన పరిమితమైన రిపోర్టులను బట్టి, ఆయన భార్య పైనే నిఘా ఉన్నది.

ఆయనకు తన కన్నా పదేళ్ళు సీనియర్ నేతలైన కేశూభాయ్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా వంటి వారిని భ్రష్టు పట్టించి, ఢిల్లీనుండి ముఖ్యమంత్రిగా దిగివచ్చిన చరిత్ర ఉంది.
ఆయనను పెంచి పోషించిన వాజపేయీ, లాల్ కృష్ణ ఆద్వానీలు ఇప్పటికే పశ్చాత్తాప పడుతూ ఉండవచ్చు. భవిష్యత్ లో పశ్చాత్తాప పడాల్సిన వాళ్ళలో సుష్మా స్వరాజ్, జస్వంత్ సింగ్, మురళీమనోహర్ జోషీ, అరుణ్ జైట్లీ, గడ్కారీ, వెంకయ్యనాయుడు ఎవరైనా ఉండచ్చు. అందరూ ఉండచ్చు. ఏది ఏమైనా శేషాంధ్ర ప్రజలకు సహాయం పరిమితంగానే ఉండచ్చు.

టాటా నానో కార్ల ఫ్యాక్టరీ భూ యజమానులను సత్కరించినట్లు నరేంద్రమోడీ సార్ సీమాంధ్ర ప్రజలను సత్కరిస్తారా?



బెంగాల్ నుండి విరమించుకున్న టాటాలకు నానో యూనిట్ కు గుజరాత్ లో స్థలం సేకరించటానికి శ్రీ నరేంద్రమోడీ వ్యూహం ఏమిటంటే, ఎకరం ౩ లక్షల రూపాయలు చేసే భూమికి ౩౦ లక్షలు చొ|| ఇవ్వటం. ఈఔదార్యం వల్ల అక్కడి రైతులు కోటీశ్వరులుగా మారారు. వారికి టాటాలు నానో కారును చవకగా అమ్మజూపితే, వారు మాకు నానో ఎందుకు? మేము ఆడీ కారు కొనుక్కుంటున్నామన్నారు.
ఇలా భారీ పరిహారాన్ని ఇవ్వటాన్ని నేను తప్పు పట్టటం లేదు. అటువంటి ఔదార్యాన్ని, గుజరాత్ ప్రభుత్వం తరువాత జరిగిన భూసేకరణల్లో ఎక్కడా చూపలేదు. జన్మకొక్క శివరాత్రి లాంటిదన్నమాట. ఈభాగ్యం రైతుకు కలగటం మహాశివరాత్రిలాంటిదని చెప్పనక్కరలేదు. శేషాంధ్ర ప్రజలపై అటువంటి ఔదార్యాన్ని శ్రీమోడీ చూపిస్తారని కోరటం, దురాశే అయినా, ఆశించే సాహసం చేస్తున్నాను.

రైళ్ళలో ఢిల్లీ వెళ్ళిన వారి సంగతి


సీమాంధ్ర ప్రజలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని ఢిల్లీ ప్రజలకి తెలుస్తుంది. బహుశా లాఠీలతో బాదటం, నీళ్ళు చిమ్మటం, బాష్పవాయు గోళాలను ప్రయోగించటం, గాలిలోకి కాల్పులు వంటివి జరగచ్చు. ఢిల్లీ ప్రజలు కూడ ముంబాయి ప్రజల వలె మొద్దు బారి పోయారు. ఒక ఐదు నిమిషాలు ఈవింత చూసిన తరువాత, వాళ్ళు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.

సీమాంధ్ర నుండి 8 రైళ్ళు ఢిల్లీ బుక్ చేయటానికి అయిన ఖర్చు ఎవరిచ్చారో కానీ, వారి లక్ష్యమేమిటో కాని, సామాన్యమైనది కాదు. అట్టై బుట్టై అన్నట్లుగా తోటకూర కాడల్లాగ రావచ్చు. లేక ఇతరుల ఖర్చుతో ఢిల్లీ వెళ్ళి ఆటపాటగా ఆగ్రా తాజ్, బృందావనం మొ|| చూచుకొని, కనాట్ సర్కస్ లో షాపింగులు మొ|| చేసుకుని ఖుషీగా కూడ రావచ్చు.

ఇప్పుడు సీమాంధ్ర ప్రజల దుర్గతి


కాంగ్రెస్ , బిజేపీ లను చెత్తకుండీ లో పారేయక తప్పదు. తెలుగు దేశం, జగన్ గారి వైయస్ఆర్ పీ లనూ కూడ చెత్తకుండీలో పారేయక తప్పదు. కిరణ్ తన సోదరుడి పై వచ్చిన ఆరోపణలపై, ఇంతవరకు విచారణలకు తలఒగ్గటం వంటి చర్యలేమీతీసుకోలేదు. చివరి రోజులలో కాంట్రాక్టర్లకు అంచనాలను పెంచివేసి కోట్లు పంచి పెట్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భూముల పంద్యారం కూడ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అంతే కాక ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ ల అవనీతి విషయంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా తూష్ణీంభావం వహించి పరోక్షంగా భాగస్వామి అయ్యారు. కనుక ఆయన పెట్టబోయే సమైక్యాంధ్రపార్టీ కూడ అలానే తయారయ్యే అవకాశం ఉంది.

ఆం ఆద్మీ, లోక్ సత్తా


రెండు పార్టీలు అవగాహన లేకుండా తెలంగాణ ను సమర్ధించాయి. సమన్యాయం అన్నా అవగాహన ఉన్నట్లు కనపడదు.

సారాంశం


1. ఇపుడు రెండు కొత్త పార్టీలను స్థాపించుకోవాలి. లేక సీపీఎమ్ కు, మరొక కొత్త పార్టీకి, ఒక అవకాశం ఇవ్వవచ్చు.

2. బిజెపి ఏదో ప్రేమతో న్యాయం చేస్తానంటుంది
కాబట్టి, అది కేంద్రంలో అధికారానికి వస్తే, ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ మూడురాష్ట్రాలను ఇవ్వమని అడగాలి. మూడురాష్ట్రాల రాజధానుల నిర్మాణానికీ ఆర్ధిక సాయం కేంద్ర బడ్జెట్ లోంచి చేయాలి. ఎవరో అడ్డమైన పారిశ్రామిక వేత్తలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించింది కదా. దాని బదులు మూడు చిన్న రాష్ట్రాలకు మూడు చిన్న ప్యాకేజీలనిచ్చి తన చిత్తశుధ్ధిని నిరూపించుకోవచ్చు.

ఈనాటి పాట


దేవుడమ్మ చిత్రంలోది.
రాజశ్రీ వ్రాశారు. బాలసుబ్రహ్మణ్యం గొంతు.

ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …ఎక్కడో||
Oh God! You have sat far away
And writing fate on our faces here
And seeing fun!

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
You create unnecessary illusions in us ..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
You play making us puppets
లేనిపోని|| you create ||
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
You make us believe that everything is our own ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..హ హ హ..చేసేస్తావు.. సామీ ఎక్కడో దూరాన||
In no time, you make everything fugacious! You have sat||

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది||
We think that we are growing but we never understand that our lifespan is dwindling We think that we are|| (repeat)
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
Before we open our eyes and realise the truth
మా కళ్ళముందు మాయతెరలు..కప్పేస్తావు
you cover our eyes with delusions … సామీ ఎక్కడో|| Oh Lord, you have sat||


ఇంకా ఉంది. తిరిగి ఎడిటింగ్ చేయాల్సి ఉంది.

139 Are Indian Oil Companies ignoring Supreme Court Orders?

139 Why Oil Companies are ignoring Cabinet decisions and Supreme Court orders to postpone adhar card linkage? ఎల్ పి జి గ్యాస్ సిలిండర్ల రీఫిల్స్ కు ఆధార్ లింకేజి వాయిదా వేయాలని క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని, సుప్రీం కోర్టు ఆర్డర్లను ఆయిల్ కంపెనీ లు ఎందుకు అమలు చేయటం లేదు?
చర్చనీయాంశాలు: ఆధార్, వంటగ్యాస్, గ్యాస్ బుకింగ్

వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ కు, ఆధార్ కార్డ్లకు లింకేజి వలదని సుప్రీంకోర్టు చెప్పింది. Supreme Court and some State High Courts have issued orders not to link gas cylinder refill booking to Adhar Cards.

డీ ఫ్యాక్టో భారత్ అదనపు ప్రధాని శ్రీరాహుల్ గాంధీ గారు వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12కి పెంచమని ఫర్మానా జారీ చేయగా కేంద్రమంత్రి వర్గం ఓకే చేసింది. Our De facto Additional Prime Minister Mr. Rahul Gandhi has also passed an order that the annual maximum cylinder limit should be raised to 12 from the present 9.

ఈ వ్యాసం వ్రాసేనాటికి ఆయిల్ కంపెనీలు ఇంతవరకు గ్యాస్ డీలర్లకు వినియోగదారులకు ఆధార్ లింకేజి డిమాండు చేయవద్దని ఆదేశాలు పంపలేదు. At the time of writing this post, Oil Companies have not sent any instructions to the field level (gas dealers) not to demand Adhar linkage for booking and delivering gas cylinder refills.

16-1-2014 Hans India ఆంగ్ల దిన పత్రిక వారు ప్రచురించిన వార్త ప్రకారం, కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు సహాయమంత్రిణి పనబాక లక్ష్మిగారు ఒకకుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు సరిపోతాయని, కాబట్టి 9 నుండి 6 కి తగ్గిస్తామని అన్నారు. Union Minister of State for Petroleum and Natural Gas, Ms. Panabaka Lakshmi had said that six cylinders per annum would be enough for a family and that they would reduce the max. number from 9 to 6, according to Hans India English Daily dated 16.1.2014.

ఉన్నట్లుండి వారి నేత రాహుల్ గాంధీ గారి మైండ్ లో కుటుంబాలకు ఏడాదికి 12 సిలిండర్లు అవసరమనే మెరుపు మెరవటంతో, లక్ష్మిగారు కూడ 12 సిలిండర్లకు మారారు. కేబినెట్ నిర్ణయాన్ని ప్రొసీజర్లుగా తయారు చేసి క్షేత్రస్థాయికి ఆదేశాలు పంపటానికి కొద్దిగా సమయం తీసుకుంటుందని మీడియాకు చెప్పారు. A lightning appeared suddenly in the mind of their leader Rahul Gandhi that a family needs 12 cylinders, Ms. Lakshmi also shifted to 12 cylinders. She has also informed the Media, that Oil Companies need a little time to pass on the instructions to field level.

ఇలా చెప్పికూడ 15 రోజులు దాటింది. ఇంతవరకు ఆయిల్ కంపెనీలు క్షేత్రస్థాయికి (గ్యాస్ డీలర్ల స్థాయికి) ఎటువంటి ఆదేశాలు పంపలేదు. ఫలితం ఆయిల్ కంపెనీలు డీలర్లు కలిసి పౌరులను బాదేస్తున్నారు. సిలిండరుకు రూ. 1215 వసూలు చేస్తున్నారు. Already 15 days have passed, since Ms. Lakshmi promised that. But the Oil Companies have not sent any instructions. The Oil Companies and the Gas Dealers, are conveniently for them, hammering the consumers collecting Rs. 1,215 per cylinder.

ఒకరాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఆరాష్ట్రం యొక్క భవిష్యత్ ను శాశ్వతంగా ప్రభావితం చేసే నిర్ణయం తీసుకోటానికి కేంద్ర మంత్రి వర్గానికి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లకు అరగంట కన్నా పట్టటంలేదు. A Union Cabinet which is elected for five years and which has a life of just two months left, is not taking more than half an hour to decide on truncating a State into two which decision was to have a permanent effect.

మరి ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ ఒక చిన్న ఆదేశాన్ని క్షేత్రస్థాయికి పంపటానికి ఎందుకింత సమయం తీసుకుంటున్నాయి? దీనికి జవాబివ్వ వలసిన బాధ్యత్ కేంద్ర పెట్రోలియం శాఖ కేబినెట్ మంత్రి శ్రీ వీరప్ప మొయిలీకి, సహాయ మంత్రిణి పనబాక లక్ష్మికి ఉంటుంది. Why do Oil Companies, then need unlimited time to PASS ON a minor instruction of Central Cabinet to field level? Ms. Lakshmi, the Union Minister of State for Petroleum and Natural Gas should feel responsible to answer this question.

ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేటపుడు విపరీతమైన వేగంగా కదలుతున్నాయి. వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చే కన్సెషన్లను పాస్ ఆన్ చేసేటపుడు, సుప్రీం కోర్ట్ ఆర్డర్లను అమలు చేసేటపుడు అరఅంగుళం కూడ నిల్చున్న చోటునుండి ఎందుకు కదలలేక పోతున్నాయి? దీనికి వివరణ మంత్రిణి గారే ఇవ్వాలి. Oil Companies move super fast when they increase prices. But they are unable to move even half an inch from the place they stay, while passing on instructions of the Central Government and the Supreme Court. The Minister should be able to explain this paradoxical conundrum.

Friday, February 14, 2014

138 Exile of Seemandhra

138 Exile to Seemandhras. సీమాంధ్రులకు వనవాసం, ప్రవాసం
138 Administrators and rulers need foresight. పరిపాలకులకు దార్శనికత అవసరం
చర్చనీయాంశాలు: National Integration, జాతీయ సమైక్యత, bifurcation, విభజన, కాంగ్రెస్, బిజెపి

తాత్కాలికంగా తమ పబ్బం గడుపుకోటం కాదు. పరిపాలకులకు దార్శనికత అవసరం. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే విపత్తులను ముందుగా ఊహించుకోవాలి. వాటిని సగందూరం ముందుకు వెళ్ళి ఎదుర్కొని తుత్తునియలు చేయాలి. మిసైల్ టెక్నాలజీలో మిసైల్స్ డిజైన్ చేసేవారు, అవతల నుండి మిసైల్స్ ఎంత ఎత్తులో వస్తాయి. మన మిసైల్ ఎంత ఎత్తులో ఎంతవేగంతో వెళ్ళి దానిని ఢీకొనాలి అని అంచనాలు వేసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టటానికి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం, కమల్ నాథ్ వంటి వారు కుయుక్తులు పన్ని, ఐటం నం. 20A గా దానిని దొంగచాటుగా ముందుకు నెట్టి వారు గొప్ప విజయం సాధించినట్లుగా పొంగి పోతూ ఉండవచ్చు.

తెల్ల పంచదార తినే టపుడు మహారుచిగా ఉంటుంది. తరువాత శరీరంపై తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గ్లోకౌమా వంటి వ్యాధుల వల్ల కంటి చూపు కోల్పోవచ్చు. గాంగ్రీన్ వంటివి వచ్చి పాదాలనో కాళ్ళనో నరికి వేయాల్సిన పరిస్థితులు రావచ్చు. మనకి పంచదార ఫ్యాక్టరీయో , స్వీట్ షాపో ఉంది కదా అని పంచదార, స్వీట్లు విపరీతంగా తినుకుంటూ పోతే అది కిడ్నీలను నాశనం చేసే ప్రాణాంతక వ్యాథులను నిద్ర లేపవచ్చు.

నియంతృత్వం కూడ పంచదార వంటిదే


ఇపుడు వ్రాసేవిషయాలు కాంగ్రెస్ కు, బిజేపికి, టిడీపి, తెలంగాణకి, సీమాంధ్రకి, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు అందరికీ వర్తిస్తాయి. పులులతో, పాములతో ఆడుకునే వాళ్ళు ఏదో ఒకరోజు వాటి చేతుల్లోనే చస్తారు. విభజనలతో ఆడుకునే వాళ్ళు కూడ అంతే. తమకు నియంతృత్వాధికారులున్నాయనో, కుతంత్రాలు చేసే తెలివి ఉన్నదనో, వాటిని ఉపయోగిస్తే జాతి సమైక్యతకే భంగం వాటిల్లుతుంది.

ఇపుడు చూడండి. దొంగచాటుగా విభజన బిల్లును 14.2.2014 న లోక్ సభలో ప్రవేశపెట్టిన తీరును చూచి దుఃఖం పొందిన ముగ్గురు టీడీపీ ఎంపీలు దేశం నుండే విడిపోతామంటున్నారు. ఈనాడు దిన పత్రిక తేదీ 15.2.2014 లో మొదటి పేజీలో ప్రచురించబడిన ఈవార్తను చూడండి.

ఈనాడు దినపత్రికలో ఈవార్తకు వెళ్ళటానికి లింకు: http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3
దెబ్బలు తిన్నవాళ్ళనే పార్లమెంటునుండి సస్పెండ్ చేయటం ఏమిటని సీమాంధ్ర తెదేపా ఎంపీలు తప్పు పట్తున్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేయలేనపుడు సీమాంధ్రలోని 25 మందికి ప్రత్యేక పార్లమెంటు ఇవ్వాలని, తామొక దేశంగా విడిపోతామని అన్నారు. నర్సరావుపేట తెలుగుదేశం ఎంపీ శ్రీ మోదుగుల వేణుగోపాలరెడ్డి , పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు.

... తన్నులు తిన్నవాళ్ళనే పార్లమెంటు నుండి ఎలా సస్పెండ్ చేస్తారు? వెల్ లో 57 మంది ఉంటే 41 మందిని వదిలేసి మిగతా 16 మందిపైనే ఎందుకు వేటేశారు? అప్రజాస్వామిక చర్యద్వారా 5 కోట్లమంది గొంతు కోశారు. ఈపార్లమెంటు మాకు న్యాయం చేయలేనపుడు సీమాంధ్రలోని 25 మందికి ప్రత్యేక పార్లమెంటు ఇవ్వండి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాగా మేం కూడ బయటకి వెళ్ళిపోతాం. స్పీకర్ మా సస్పెన్షన్ ఎత్తివేసి విభజన బిల్లును పెట్టలేదని చెప్పి సీమాంధ్ర ప్రజలను శాంత పర్చాలి. మేం సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్నే ప్రశ్నిస్తున్నాం. న్యాయం చేస్తే పూలల్లో పెట్టి తెలంగాణ ఇస్తాం. లేదంటే మాకు ప్రత్యేక పార్లమెంటుని ఇస్తే ఈదేశంనుండి బయటకు పోతాం. ...

వైబీరావు గాడిద వ్యాఖ్య


ఈ లోక్ సభ సభ్యుడు తాత్కాలిక దుఃఖంతో ఇలా మాట్లాడి ఉండ వచ్చు. తరువాత మనసు కుదుట పడ్డాక ఈయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకో వచ్చు.

కానీ ఈలోక్ సభ సభ్యుడికి కలిగిన భావోద్వేగమే, కేంద్ర పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బిజేపీ పార్టీల నియంతృత్వాన్ని చూచిన 5 కోట్లమంది సీమాంధ్ర తెలుగు వారిలో కొన్ని వందల మందికో కొన్ని వేలమందికో కలిగి ఉండవచ్చు. ఇలాంటి ఉద్వేగాలు కొద్ది వందల మందికో అయినా, కొద్ది వేలమందికో కలగటం చాల ప్రమాదం. అలాటి ఉద్వేగాలు కలిగే వారు అందరూ తమ దుఃఖాలను ఆవేశాలను దిగమింగి ఊరుకోరు. వారిలో వేర్పాటు వాదం బీజాలు ఏర్పడి, మొలకెత్తి కాలక్రమంలో వారిని విఛ్ఛిన్న వాదులుగా, ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది.

అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. తెలంగాణ ఇవ్వకపోతే ఇలాంటి ఉద్వేగాలను తెలంగాణ ప్రజలలో లేవనెత్తటానికి కెసీఆర్, కోదండరాం వంటి వారు ప్రయత్నించారు. మేం ఐరాసకు వెళ్తాం అన్నారు. ఈరోజు తమకు బంగారు పళ్ళెం లో తెలంగాణ ఇస్తామన్నారు కాబట్టి వారు పిత్తిన ముత్తైదువుల్లాగా శాంతి వచనాలు పలుకుతున్నారు.

వీటిని బట్టి జాతీయ స్థాయి పాలకులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? గోటితో పోయే వాటికి గొడ్డలి వాడాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ముందుగానే సంబంధించిన వారిని సమావేశపరిచి ఉభయులకి ఆమోదయోగ్యమైన పరిష్కారాలు వెతకాలి. అవి దొరకటం ఆలస్యం అయితే తాత్కాలిక ఉపశమనాలను ఇవ్వ వచ్చు. పాలితులు తాత్కాలిక ఉపశమనంతో శాంతంగా ఉన్న సమయంలో, పాలకులు నిద్ర పోకూడదు. శాశ్వత పరిష్కారాన్ని సాధించి ఉభయులు అంగీకరించేలాగా చేయాలి. ఏకపక్షంగా ముందుకు వెళ్ళకూడదు. ఒకపక్షాన్ని నెత్తిన పెట్టుకొని రెండో పక్షాన్ని అడవుల పాలు చేయకూడదు. కెసిఆర్ తరిమేయమన్నాడు ఆంధ్రవాలే భాగో భాగో అన్నాడు కాబట్టి మన్మోహన్ సింగ్, సోనియాలు ఉస్కో ఉస్కో అనకూడదు. (ఇక్కడ కేంద్ర పాలకులు చేసిందిదే. అడవులు శుభ్రం చేసుకొని రాజధాని పెట్టుకోండి. చెట్లు నరుక్కోటానికి మేం అనుమతి ఇచ్చేవిషయం మేం పరిశీలిస్తాం. అని బిల్లులో ఉంది) . అడవులకి వెళ్ళేవాడు ఎలాగైనా చెట్లను నరుక్కుంటాడు. అనుమతి పత్రం కోసం ఆగడు.

ఇపుడు పరిష్కారం


ఇదివరకు చాల సార్లు వ్రాసిందే. సీమాంధ్రుల అంగీకారంతో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ వారి అనుమతితో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఐదు రాష్ట్రాలను ఏర్పరచటమే. ఈ ప్రతిపాదనలు త్వరలో వెండితెరమీదకి వస్తాయి. విజ్ఞులైన పాఠకులు దీనిని చూడబోతున్నారు. 45 రోజులలో రాజధానిని నిర్ణయించటానికి కమిటీని నియమిస్తామన్నారుగా.

ఈనాటి సంస్కృత శ్లోకం


వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 15వ సర్గ (ఛాప్టర్), 5వ శ్లోకం.

परवान् अस्मि काकुत्स्थ त्वयि वर्ष शतम् स्थिते |
स्वयम् तु रुचिरे देशे क्रियताम् इति माम् वद ||
పర వాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే
స్వయం తు రుచిరే దేశే క్రియతామ్ ఇతి మాం వద.
సారం: పంచవటిలో లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అన్నా నేను నీ సేవకుడిని. పర్ణశాల ఎక్కడ నిర్మించాలో చెప్పు. నీ ఆజ్ఞను నేను పాటిస్తాను.

सुप्रीतः तेन वाक्येन लक्ष्मणस्य महाद्युतिः |
विमृशन् रोचयामास देशम् सर्व गुण अन्वितम् ||
సుప్రీతః తేన వాక్యేన లక్ష్మణస్య మహాద్యుతిః
విమృశన్ రోచయామాస దేశం సర్వ గుణ అన్వితమ్.
సారం: తమ్ముడి మాటలకు సుప్రీతుడైన శ్రీరాముడు మంచి స్థలాన్ని ఎంపిక చేశాడు.

स तम् रुचिरम् आक्रम्य देशम् आश्रम कर्मणि |
हस्ते गृहीत्वा हस्तेन रामः सौमित्रिम् अब्रवीत्
స తం రుచిరం ఆక్రమ్య దేశమ్ ఆశ్రమ కర్మణి
హస్తే గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిం అబ్రవీత్.
సారం: మంచి స్థలాన్ని రాముడు గుర్తించి, అందలో అడుగులేస్తూ, తమ్ముడి చేతిని తన చేతిలోకి తీసుకొని ఇలా అన్నాడు.

अयम् देशः समः श्रीमान् पुष्पितैर् तरुभिर् वृतः |
इह आश्रम पदम् सौम्य यथावत् कर्तुम् अर्हसि ||
అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైర్ తరుభిర్ వృతః
ఇహ ఆశ్రమ పదం సౌమ్య యథావత్ కర్తుమ్ అర్హసి.
సారం: ఓ సాత్వికుడా!! ఈస్థలం సమతలంగా ఉంది. పుష్పాలు. చెట్లతో నిండి ఉన్నది. ఇది ఆశ్రమం నిర్మించుకోటానికి అనువైన ప్రదేశం.

इयम् आदित्य संकाशैः पद्मैः सुरभि गंधिभिः |
अदूरे दृश्यते रम्या पद्मिनी पद्म शोभिता ||
ఇయం ఆదిత్య సంకాశౌః పద్మౌః సురభి గంధిభిః
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మ శోభితా.
సారం: ఈ ప్రదేశం సుగంధ భరితమైన పద్మాలతో నిండి ఉన్నది. సమీపంలోనే ఆదిత్య సమ్మోదితమైన పద్మ పూరితమైన సరస్సు ఉన్నది.

यथा आख्यातम् अगस्त्येन मुनिना भावितात्मना |
इयम् गोदावरी रम्या पुष्पितैः तरुभिर् वृता ||
हंस कारण्डव आकीर्णा चक्रवाक उपशोभिता |
యథా ఆఖ్యాతం అగస్త్యేన మునినా భవితాత్మనా
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైః తరుభిర్ వృతా
హంసం కారండవ ఆకీర్ణా చక్రవాక ఉపశోభితా.
సారం: భవిష్యత్ ద్రష్ట అగస్త్య మహాముని సూచించినట్లుగానే ఈప్రదేశం చెట్లు, పూవులతో శోభిల్లుతున్నది. ఇదిగో పుష్పలావితమైన గోదావరి. హంసలు, కారండవ పక్షులు, జక్కువ పక్షులతో నిండి శోభిస్తున్నది.

न अतिदूरे न च आसन्ने मृग यूथ निपीडिता ||
मयूर नादिता रम्याः प्रांशवो बहु कंदराः |
दृश्यन्ते गिरयः सौम्य फुल्लैः तरुभिर् आवृताः
న అతిదూరే న చ ఆసన్నే మృగ యూథ నిపీడితా
మయూర నాదితా రమ్యాః ప్రాంశవో పహు కందరాః
దృశ్యంతే గిర్యః సౌమ్య ఫుల్లేః తరుభిర్ ఆవృత్తాః.
సారం: ఓ సౌమ్యుడా!! (రాముడు లక్ష్మణుడిని సంబోధిస్తున్నాడు), ఆకొండలు చూడు. మరీదూరంగా లేవు. మరీ దగ్గరగా లేవు. చక్కగా పుష్పించిన తరువులతో నిండి ఉన్నాయి. జంతువుల గుంపులతో నిండి ఉన్నాయి. నెమళ్ళ క్రేంకారాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. సుందరమైన గుహలతో రమ్యంగా ఉన్నాయి.

सौवर्णै राजतैः ताम्रैः देशे देशे च धातुभिः |
गवाक्षिता इव आभान्ति गजाः परम भक्तिभिः
సౌవర్ణౌ రజతైః తామ్రైః దేశే దేశే చ ధాతుభిః
గవాక్షితా ఇవ ఆభాంతి గజాః పరమ భక్తిభిః.
సారం: ఆకొండలు చక్కగా రంగులద్దబడిన ఏనుగుల్లాగ ప్రకాశిస్తున్నాయి. బంగారం, వెండి, రాగి ఖనిజాల ధాతువులు ఆకొండలపై ఆవు కళ్ళలాగా (లేక గోడలలో గవాక్షాలలాగా) ప్రకాశిస్తున్నాయి.

सालैः तालैः तमालैः च खर्जूरैः पनसैः द्रुमैः |
नीवारैः तिनिशैः चैव पुन्नागैः च उपशोभिताः ||
సాలైః తాలైః తమాలైః చ ఖర్జూరైః పనసైః ద్రుమైః
నీవారైః తినిశైః చైవ పున్నాగైః చ ఉపశోభితాః.
चूतैर् अशोकैः तिलकैः केतकैर् अपि चंपकैः |
पुष्प गुल्म लता उपेतैः तैः तैः तरुभिर् आवृताः ||
చూతైర్ అశోకైః తిలకైః కేతకైర్ అపి చంపకైః
పుష్ప గుల్మ లతా ఉపేతేః తైః తైః తరుభిర్ ఆవృతాః
स्यन्दनैः चंदनैः नीपैः पर्णासैः लकुचैः अपि |
धव अश्वकर्ण खदिरैः शमी किंशुक पाटलैः
స్యందనైః చందనైః నీపైః పర్ణాసైః లకుచైః అపి
ధవ అశ్వకర్ణ ఖదిరైః శమీ కింశక పాటలైః.
సారం: దేవదారు వృక్షాలు, తాడిచెట్లు, తమాల వృక్షాలు (తెలుగు నాకు తెలియదు), ఖర్జూర చెట్లు, పనస చెట్లు, నీవార ధాన్యాలు (మన రాగులు, వరిగెల వంటి ధాన్యం చాల చిన్నగింజలు), తినిశె చెట్లు (ఇవేమిటో నాకు తెలియదు), పున్నాగ, మామిడి, అశోకం, తిలకం చెట్టు, మొగిలి (కేతకం), సంపంగి (చంపకం) చెట్లు, స్యందనం చెట్లు, గంధం చెట్లు, నీప చెట్లు, పర్ణాశ చెట్లు, లకుచ చెట్లు, ధవ చెట్లు, అశ్వకర్ణ చెట్లు, ఖదీర వృక్షాలు (కాచు), జమ్మి చెట్లు, కింశుక పాటలీ వృక్షాలతో శోభిల్లుతున్నాయి.

इदम् पुण्यम् इदम् रम्यम् इदम् बहु मृग द्विजम् |
इह वत्स्याम सौमित्रे सार्धम् एतेन पक्षिणा.
ఇదం పుణ్యం ఇదం రమ్యం ఇదం బహు మృగ ద్విజమ్
ఇహ వత్స్యామ సౌమిత్రే సార్ధం ఏతోన పక్షిణా.
సారం: ఈప్రదేశం పుణ్యభరితమైనది. ఇది రమ్యమైనది. ఇది బహు మృగాలు, పక్షులు (ద్విజులు - పక్షులు. రెండు జన్మలు అనగా గుడ్డు జన్మ, పక్షి జన్మ) ఉన్న ఇక్కడ మనం ఈ పక్షి (జటాయువు) తో నివసిద్ధాము.

एवम् उक्तः तु रामेण लक्ष्मणः परवीरहा |
अचिरेण आश्रमम् भ्रातुः चकार सुमहाबलः
ఏవం ఉక్తః తు రామేణ లక్ష్మణః పరవీరహా
అచిరేణ ఆశ్రమం భ్రాతుః చకార సుమహాబలః.
సారం: రాముడు ఇలా అనగానే, మహాబలశాలియైన లక్ష్మణుడు స్వల్ప సమయంలోనే అన్న కోసం ఒక పర్ణశాలను నిర్మించాడు.

పర్ణశాల వర్ణన ఇంకోరోజు.


దీనిని తిరగ వ్రాయవలసి ఉన్నది. ఇంకా చాలా ఉంది.

137 Arvind Kejriwal corrected his error

137 Aravind Kejriwal made a mistake and corrected himself by resigning. శ్రీ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ద్వారా తన తప్పును దిద్దుకున్నారు
చర్చనీయాంశాలు: Kejriwal, CPM, ఆమ్ ఆద్మీ, భారతీయ రాజకీయాలు, తిక్కన, మహాభారతం




భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కై (భవిష్యత్ లో కూడ ఇది తరచుగా జరగబోతుంది) జనలోక్ పాల్ బిల్ ను ఢిల్లీ శాసన సభలో ప్రవేశ పెట్టకుండా అడ్డుకోటంతో, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయటం చక్కటి నిర్ణయం. ఆయన, కాంగ్రెస్ నుండి మద్ధతు తీసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి కావటం పొరపాటు నిర్ణయం. అంతే కాదు, ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేయటమే పొరపాటైన నిర్ణయం.

ఆమ్ ఆద్మీ పార్టీ డెల్హీ అసెంబ్లీకి పోటీ చేయటం ఎందుకు పొరపాటు?


ఢిల్లీ అసెంబ్లీ ఒక నగర పాలక సంస్థ. ఢిల్లీ అసెంబ్లీ ఒక మునిసిపల్ కౌన్సిల్ వంటిది. అవినీతి నిర్మూలన అనేది అఖిలభారత సమస్య. అవినీతి నిర్మూలనకు మౌలిక సంస్కరణలు అవసరం. అసెంబ్లీగా పిలువబడే ఒక నగర పాలక సంస్థ అటువంటి మార్పులను అమలు లోకి తేవటం కుదరదు. ఢిల్లీకి ఉన్నది లెఫ్టినెంట్ గవర్నర్, కనీసం గవర్నర్ కూడా కాదు. అంటే కేంద్రప్రభుత్వానికి గుమాస్తాలాంటి వాడు. ఏ మౌలిక మార్పును తేవాలన్నా కేంద్ర హోమ్ శాఖను సంప్రదిస్తానంటాడు. మౌలిక సంస్కరణలు తేవాలనుకునే వాళ్ళు నగరపాలక సంస్థలకే కాదు రాష్ట్ర శాసన సభలకు కూడ పోటీ చేయటమే దండగ.

ఋజువు చేయండి


పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సిపిఎం 40 ఏళ్ళు పాలించింది. కమ్యూనిజాన్ని బెంగాల్లో ప్రవేశపెట్ట గలిగిందా? లేదు. ఎందుకంటే, మౌలిక మార్పులు తేవాలంటే రాజ్యాంగాన్ని తిరగ వ్రాయాలి. అంటే, కనీసం 2/3 మెజారిటీ కావాలి. ఎక్కడ? లోక్ సభలో, రాజ్యసభలో. చివరికే మయింది? సీపీఎమ్ తన పరువు కోల్పోయింది. అధికారాన్నీ కోల్పోయింది.

ఇప్పుడు కేజ్రీవాల్ కి ఉత్తమ మార్గం ఏమిటి?


ఆయన దేశమంతా తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని అఖిల భారత పార్టీగా ప్రమోట్ చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయావకాశాలు మెరుగు కావటంతో, గూండాలు, ఆయారాంలు గయారాంలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన సరియైన వ్యక్తులను తన పార్టీలో చేర్చుకోకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇసుక మేడ లాగా మారుతుంది.

ఆర్ధిక సిధ్దాంతాలు, విధానాలు ఏవి?


ఆం ఆద్మీ పార్టీకి ఇంతవరకు సరియైన ఆర్ధిక సిధ్ధాంతాలు లేవు. ప్రాథమికంగా బిజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఆర్ధిక సిధ్ధాంతాలు ఒకటే. స్పష్టమైన ఆర్ధిక సిధ్ధాంతాలను ఏర్పరుచుకోటమే కాదు, వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. అధికారంలోకి రావటం కన్నా, సిధ్ధాంతాలను, సైధ్ధాంతిక నిబధ్ధత ఉన్న కార్యకర్తలను , సహాయక నేతలను, ఉపనేతలను, నేతలను, ముఖ్యనేతలను సమకూర్చుకోటం అవసరం. మార్టల్స్ అయిన నాయకులు మరణించినా పార్టీలు సజీవ సంస్థలుగా కొనసాగాలి.

సిధ్ధాంతాలు పార్టీలను రిజిడ్ ఇనుప చట్రాలుగా చేయవా?


సిధ్ధాంతాలను మూడు రకాలుగా విభజించు కోటం అవసరం.
మొదటివి: ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడటానికి వీలు కానివి.
రెండవ రకం: కొంత కష్టంతో మార్చుకోటానికి వీలైనవి.
మూడవ రకం: సులభంగా మార్చుకోటానికి వీలైనవి.

మొదటిరకం సిధ్ధాంతాలు: నూటికి నూరుశాతం సభ్యులు ఏకీభవించినా, మొదటిరకం సిధ్ధాంతాలను వదలి వేయటం వీలుకానంతగా అవి గొప్ప పటిష్టంగా ఉండాలి. నూటికి నూరుశాతం సభ్యులు తమ మొదటి రకం సిధ్ధాంతాలను మార్చుకోవాలనుకుంటే కావాలనుకుంటే కొత్త పార్టీని స్థాపించుకోటమే మేలు.

రెండవ రకం సిధ్ధాంతాలు: 75శాతం లేక 66శాతం సభ్యులు మద్దతిస్తే ఈసిధ్ధాంతాలను విధానాలను మార్చుకోవచ్చు.

మూడవ రకం సిధ్ధాంతాలను, సాధారణ మెజారిటీ తో మార్చుకోవచ్చు.

కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణకి ఏమి సమాధానం


పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక వర్గం నియంతల్లా వ్యవహరించటం రివర్స్ పిరమిడ్ ఆర్కిటెక్చర్ ఉన్న ప్రతి సంస్థలోను ఉంటుంది. సిధ్ధాంతాలు, విధానాలు, క్రిందనుండి పైకి ప్రవహించాలి. అంతే తప్ప పైనుండి క్రిందికి కాదు. ఇది సఫలం కావాలంటే, తృణమూల స్థాయి సభ్యులు విజ్ఞాన ధనులుగా ఉండాలి. సిధ్ధాంతాలకు కట్టుబడేవాళ్ళుగా ఉండాలి. అపుడు వారు ఎన్నుకునే మండల (తాలూకా) , జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి నేతలు ఉత్తములుగా ఉంటారు.

ఈనాటి పద్యం


తిక్కన కవీంద్రాంధ్రీకృత శ్రీమదాంధ్ర మహాభారతం, 12వది అయిన శాంతి పర్వం, ప్రధమాశ్వాసం. 396వ పద్యం.

విషయం: అధికార పార్టీ ఓడిపోయి వేరొకపార్టీ అధికారంలోకి వచ్చినపుడు, పాతవాళ్ళు ఖాళీ చేసిన బంగళాలను కొత్తవాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇపుడ కేజ్రీవాల్ రాజీనామా చేసాడు కదా, లక్కీగా చిన్న ఇల్లు తీసుకున్నాడు కాబట్టి ఖాళీ చేయటం తేలికవుతుంది.

భారతంలో: ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. బంగళాలను ఎలాట్ చేస్తున్నాడు.

సీసపద్యం.
బహు రత్నమయ ఘనప్రాసాద మండప,
దాసదాసీజనోద్భాసితంబుఁ
దత్తుల్య వైబవ తదధిక ధన ధాన్య,
సుఖ వస్తు సంచయ సుఖకరంబుఁ
గిన్నెర వల్లభ గృహ సమానత్వమ
హావిభూతి స్ఫురణాంచితంబు
సర్వ సంపత్స్ఫూర్తి చారవామాక్షీ ప్ర
చార సంశోభిత స్థల చయంబు

తేటగీతి
నైన వాని రారాజు నిల్లనిజునకు,
దుస్ససేను మందిరము పార్ధునకు వరుస
తోడ దుర్మర్షణునియును, దుర్ముఖునియు,
నిండ్లు కవలకు సంప్రీతి నిచ్చె నృపతి.

సారాంశం


ధర్మరాజు చేసిన ఎలాట్ మెంటు: రత్నాలు పొదిగిన మండపాలు, దాసదాసీలు, ధన ధాన్యాలు, సుఖకరమైన వస్తువులతో నిండినది, సర్వసంపదలు, స్త్రీలతో శోభిల్లే రారాజు ఇల్లు (దుర్యోధనుడి బంగళా) ని అనిలజుడు అంటే భీముడికి ఇచ్చాడు. దుశ్సాసనుడి ఇంటిని అర్జునుడికి ఇచ్చాడు. దుర్మర్షణుడి (దుర్యోధనుడి తమ్ముడి) బంగళాను నకులుడికి ఇచ్చాడు. దుర్ముఖుడి (ఇంకో తమ్ముడి) బంగళాను సహదేవుడికి కేటాయించాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య


ధర్మరాజు కర్ణుడి ఇంటిని ఎవరికి ఎలాట్ మెంట్ చేసి ఉండాలి? పార్ధుడికి (అర్జునుడికి) దుశ్సాసనుడి ఇంటిని ఇచ్చాడు. అర్జునుడు చంపిన భీష్ముడి ఇంటినో, కర్ణుడి ఇంటినో ఎలాట్ చేయవచ్చు కదా. కర్ణుడు సామంతుడు కాబట్టి అతడి ఇల్లు తక్కువ తరగతి బంగళా అయి ఉండవచ్చు. భీష్మ పితామహుడి ఇల్లు ఇవ్వకపోటానికి కారణం ఉంది. భీష్ముడి ఇంకా అంపశయ్యమీదే ఉన్నాడు. ఆయన రణరంగంలో బాణాల మంచం మీద పండుకుని ఉన్నప్పటికీ భీష్ముడి బంగళా ఖాళీ కాలేదు. కనుక ఇవ్వకపోటం సముచితం. దుశ్శాసనుడు ప్రిన్స్. దుష్ట చతుష్టయంలో ఒకడు. అతడి ఇల్లు దుర్యోధనుడి ఇంటి వలె గ్రాండ్ గా ఉండి ఉండాలి. కనుక దుశ్శాసనుడి ఇంటిని అర్జునుడికి ఇచ్చి ఉండవచ్చు. ద్రోణుడు కర్ణుడు వలె సామంతుడు కాదు. ద్రోణుడు ఆచార్యుడే అయినా సేవకుడే కానీ ప్రిన్స్ కానీ, రాజు (సామంత) కానీ కాదు. కాబట్టి ఆయన బంగళా తక్కువ స్థాయికి చెంది ఉండాలి.

ఇంకా ఉంది. ఇంకో సారి.

Thursday, February 13, 2014

136 Andhra vale bhAgo

136 Fake bleeding hearts నకిలీ హృదయ రక్త స్రావాలు
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, భారతీయ రాజకీయాలు, కాంగ్రెస్, బిజెపి, అద్వానీ

12.02.2014 మరియు 13.02.2014 నాడు లోక్ సభలో జరిగిన అంశాలపై సమీక్షించుకోటం అవసరం.

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నదన్న మాటే కానీ, సీమాంధ్ర సామాన్య ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని నేను అనుకోను. సోనియా గాంధీ, బిజేపీలు ఏక పక్షంగా కెసీఆర్ కు లొంగిపోటం వల్ల సీమాంధ్రప్రజలకు గొంతుకోసినట్లయింది. లేకపోతే 1972లో తీవ్రంగా ప్రత్యేకాంధ్ర ఉద్యమం నడిపిన ప్రజలు నేడు సమైక్యాంధ్ర అని ఎందుకంటారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్షలకోట్లనిథులను హైదరాబాదులో కుమ్మరించి, దానిని 23జిల్లాలకు మార్కెట్ గా మార్చి ఒక ఆదాయ కేంద్రంగా మార్చటంలో కేవలం తెలంగాణ 10జిల్లాల ప్రజల శ్రమ కాక ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలే కాక గుల్బర్గా, రాయచూర్, మరియు కర్నాటక, పర్భాని, నాందేడ్, జాల్నా, మొ|| మరాఠా జిల్లావాసుల శ్రమకూడ ఉంది. అంటే హైదరాబాదు అఖిలభారత నగరంగా మారింది. ఇక్కడ బీహార్, ఒరిస్సా నుండి కూలీలు వచ్చి బ్రతుకుతెరువులను వెతుక్కుంటున్నారు. నిరాశ్రితులకు హైదరాబాదు ఉపాధి నగరంగా మారింది. దీనిని తానూ, నిజాం నవాబూ కలిసి నిర్మించామని కెసీఆర్ గారు ప్రచారం చేసుకుంటుంటే, అఖిలభారత నేత్రి సోనియా గాంధీగారు నిజానిజాలను వెతికి తీయాల్సిందిపోయి ఆమెయే గులాబీ కండువా వేసుకొని హైదరాబాదును కేసీఆర్ కి వ్రాసి ఇవ్వటానికి కంకణం కట్టుకోటం ఈసమస్యకు మూలం.

సుష్మా స్వరాజ్, ఎల్ కే అద్వానీలు తమగుండె ద్రవించింది అని నేడు అంటున్నారు. అసలు వాళ్లకి గుండెలు అనేవి ఉంటే కదా. వారు గుండెలు తీసిన బంట్లు.

కోస్తా భూకబ్జాదారులు, రాయలసీమ భూకబ్జాదారులు హైదరాబాదులో భూములను కొనేసి, ఆక్రమించి నేటివ్ తెలంగాణ వారిని భూమి లేని వారిగా చేయలేదా


జవాబు: దీనికీ శ్రామికుల వలసకు మనం లింకు పెట్టకూడదు. కోస్తా భూకబ్జాదారులు, రాయలసీమ భూకబ్జాదారులు, తెలంగాణ నేటివ్ భూకబ్జాదారులు, అఖిలభారత భూకబ్జాదారులు (రాష్ట్రాలవారిగా ఈపట్టీ తయారు చేయాలంటే సూపర్ కంప్యూటర్లు కావాలి), రియాల్టర్లు మధ్య జరుగుతున్న ప్రాక్సీ యుధ్ధమే నేటి తెలంగాణ ఉద్యమం. దానికి నిజమైన పరిష్కారం మార్క్సిజం మాత్రమే. హైదరాబాదులో ఒక శ్రామికుడు స్థిర పడాలంటే ఒక్కోఇంటికి 75/100 గజాల స్థలం చాలు. భూ కబ్జాదారులు, స్పెక్యులేటర్లు, రియాల్టర్లు, పారిశ్రామిక వాణిజ్యవేత్తలు వేల కొలది ఎకరాలు కొని పారేయకుంటే ఈభూమి శ్రామికుల నివాసానికి దొరికేదే. హైదరాబాదులో తెలంగాణా శ్రామికులకే కాక, సీమాంధ్ర శ్రామికులకే కాక, అఖిల భారతీయ శ్రామికులకు కూడ ఉపాధి కొరత ఉండేది కాదు. దీనిని తెలంగాణ సామాన్యప్రజలు అర్ధం చేసుకోకుండా కమ్మిన మబ్బు తెరయే కెసీఆర్ కోదండరాం ల దుర్బోధ.

ఇపుడు తెలంగాణ ప్రజలు విభజన తప్ప మరిదేనినీ ఒప్పుకోని స్థితి వచ్చింది. పోనీలే తమ్ముడు తింటే తిన్నాడు అని సర్దుకు పోయే అన్నలు భారతజాతిలో ఉన్నారు. శేషాంధ్ర ప్రజలు కూడ హైదరాబాదుని, తెలంగాణ రాష్ట్రానికి వదలటానికి వెనుకాడే వారు కాదేమో.

తెలంగాణకు హైదరాబాదు బదిలీకి, భారత్ ఒక యూనియన్ గా మనుగడకు అవసరమైన షరతు


భారతీయులు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు, స్థిరపడ వచ్చు అని రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, సీమాంధ్రులకే కాదు బీహారీలకు, ఓఢ్రులకు, గుజరాతీలకు వీరు వారని లేకుండా అందరికి లభించాలి, ఈ అఖిల భారత హక్కుకు భంగం కలగకుండా ఏవిభజనలైనా జరగాలి.

హైదరాబాదునే కాదు, 20 లక్షలు జనాభా దాటిన, త్వరలో దాటబోయే ప్రతినగరాన్ని యూనియన్ టెరిటరీగా మార్చాల్సిందే. అప్పుడే శ్రామికుల స్వేఛ్చ్ఛా సంచారం హక్కు సార్ధకం, సాధికారికం అవుతుంది.

కానీ కెసీఆర్ అండ్ కో

ధోరణి ఈ సర్దుబాటు జరగటానికి అడ్డుపడింది. కెసీఆర్ గారి నినాదం చూడండి:

తెలంగాణ జాగో - ఆంధ్రవాలే భాగో



ఈ నినాదం ఇచ్చిన కెసీఆర్ ను ఆనాడే కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసి చట్టరీత్యా ప్రాసిక్యూట్ చేసి ఉండవలసినది. ఎందుకు చేయలేదు? సోనియా గాంధీకి కెసీఆర్ మధ్య అవగాహనలు ఉన్నాయి కనుక.

ఈనినాదం ఇచ్చిన కెసీఆర్ దొరగారు తమనేదో ఉధ్ధరిస్తారని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకుంటే, అవి నిరాశలు కాకమానవు. హైదరాబాదులో భూకబ్జాలకై, కాంట్ర్టాక్టులకై, కమీషన్లకై, ముందు ముందు ఉత్తర తెలంగాణ జిల్లాల నేతలకు, దక్షిణ తెలంగాణ నేతలకు కుమ్ములాటలు, కొట్లాటలు జరగబోతున్నాయి. అంతం కాదిది ఆరంభం. పాకిస్థాన్ లో, పశ్చిమ పంజాబ్ (రావల్పిండి, లాహోర్) వారికి సింధ్ (కరాచీ) వారికి మధ్యలో జరుగుతున్న కుమ్ములాటల్లో సింధ్ ప్రజలు పడుతున్న బాధలు మనకి ఏమి నిరూపిస్తాయి? మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల స్లోగన్లు పెట్టుబడి దారీ విధానంలో, భూస్వామ్యవిధానంలో చాకలిబానలో కుందేలు పిల్లల్లా ఉడికిపోయే పేదప్రజలకు శాంతిని ఇవ్వకపోగా వారిలో పరస్పరం ద్వేషించుకునే వారిలాగా తయారుచేస్తాయి.

నా ఈసిధ్ధాంతాన్ని వాస్తవాలతో నిరూపించటం కష్టం కానే కాదు. మనం తెలంగాణలో ఏగ్రామానికైనా, సీమాంధ్రలో ఏగ్రామానికైనా వెళ్ళవచ్చు. ఆగ్రామంలో ఒక్క కులానిదే పెత్తనం ఉంటుంది. అది ప్రధమ భూకులం (భూములు ఎక్కువగా కలిగి ఉన్న కులం). రెడ్డికావచ్చు. వెలమ కావచ్చు. కమ్మ కావచ్చు. కాపుకావచ్చు. పేరేదైనా కావచ్చు. పేరు అప్రస్తుతం. రెండవ భూకులం వారు, ఇంకా ఆ గ్రామంలో ఉభయకులాల మధ్య పట్టుకోసం కుమ్ములాట జరుగుతూ ఉంటే, కుతకుత లాడుతూ ఉంటారు. వారికి సరియైన పట్టు దొరకకపోతే, తమ కులం ప్రధమ భూకులం గా ఉన్న గ్రామానికి వలస పోతారు. మరి మిగతా కులాల సంగతి ఏమిటి? ఆకులాల పెద్దల పని ఏమిటి? కుల పంచాయితీలను నిర్వహించటం, ఎన్నికలు వచ్చినపుడు అభ్యర్ధుల నుండి నగదు సంచులు, మద్యం దిగుమతి చేసుకొని, పంచినంత పంచి, మిగిలింది దాచుకోటం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, తెలంగాణా రాష్ట్రమైనా, శేషాంధ్ర రాష్ట్రమైనా ఈక్రీడ ఆగదు. ఇదంతా భూస్వామ్య రాజకీయాలలో ఒకభాగం. పట్టణాలు, నగరాలకు వచ్చినపుడు వ్యవసాయ భూమి స్థానంలో వ్యవసాయేతర భూములు రంగంలోకి వస్తాయి. బేసిక్స్ మారవు.

కర్రు గాల్చి వాతలు పెడతాను


ఈ మాటను కెసీఆర్ గారు కొన్న డజన్లసార్లు అన్నాడు. అలా అన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గుండెకాయ ఎందుకు బ్లీడింగ్ అవలేదు? సుష్మా స్వరాజ్, అద్వానీ గారి గుండె ఎందుకు ద్రవించలేదు.

కెసీఆర్, కోదండరాంల దుర్బోధలకు ప్రభావితులై కొందరు తెలంగాణ అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల మంది తెలంగాణ అమాయకులు ఆత్మహత్యలు చేసుకోటం తెరాస నేతలకు ఆనందకరం. ఎందుకంటే అది వారి శవాలమీద మరమరాలను ఏరుకునే రాజకీయాలకు, డిమాండ్లకు బలాన్ని ఇస్తుంది. ఎంతమంది ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటే, అంత భారీగా ఎక్స్ టార్షన్ లు చేసుకోవచ్చు.

మన్మోహన్ సింగ్ గారు విదేశీ పర్యటనలు, అమెరికా, లండన్ లలో సన్మానాలను తగ్గించుకుని ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతున్నది , దీనిని మనం శాంతితో, సమన్వయంతో, ఎలా సరిదిద్దగలం అని దృష్టి పెట్టుకుని హైదరాబాదు, విజయవాడ, విశాఖ, కర్నూల్ లలో ప్రజలను కలిసి ఉంటే ఏదో ఒకదారి దొరికేది.

ఇప్పుడు నా గుండె బ్లీడింగ్ అవుతున్నది అని వాపోవ వలసిన స్థితి వచ్చేది కాదు. పోనీ సుష్మా స్వరాజ్, అద్వానీ గారు తెలంగాణ, శేషాంధ్రలలో పర్యటించి స్నేహపూర్వక విభజన, రాజీకి కృషిచేశారా? స్వరాజ్ గారు మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడి ప్రజలని రెచ్చగొట్టి వెళ్ళింది.

13.2.2014 తేదీ పెప్పర్ స్ప్రే లోక్ సభకి ప్రధాని మన్మోహన్ సింగ్, డీ ఫ్యాక్టో ప్రధాని సోనియా గాంధి హాజర్ కాలేదని వార్తలు వచ్చాయి. ఇంటి చూరుకి నిప్పంటించి, గుండె పట్టుకొని బయట కూర్చోటం, దీనిని ఏమనాలి?

పరిస్థితులు సజావుగా లేనపుడు, 2014 మేలో రానున్న కొత్త లోక్ సభలో, కొత్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని వెతకచ్చు. ఒక దేశ చరిత్రలో 3 నెలలు అనేది పెద్ద సమస్యకాదు. విచిత్రమేమిటంటే తెలంగాణ బిల్లుని లోక్ సభలో ముందుకు నెట్టటానికి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కు కావటం.

2004 ఎన్నికల్లో సోనియా తెలంగాణ వాగ్దానాన్నిగులాబి కండువా వేసుకుని చేసింది. రెండవ రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ని నియమించి, వారి సూచనలను పాటిస్తూ, సామరస్యానికి కృషిచేస్తూ 2009 ఎన్నికలకల్లా తెలంగాణ ఇచ్చిఉండవలసిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె ఈవిషయంలో ఎందుకు చొరవతీసుకోలేదో, వైయస్ రాజశేఖరరెడ్డికి ఎందుకు నచ్చచెప్పలేక పోయిందో ఆదేవుడికే తెలియాలి.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరలా తెలంగాణ వాగ్దానాన్నిచేసింది. సీమాంధ్ర ప్రజలకు సీమాంధ్ర వాగ్దానాన్ని చేసిందా? చేయలేదు. ఎందుకని. పోనీ, తరువాతనైనా ఏవైనా ఆమోదయోగ్యమైన ప్రత్యేక సీమాంధ్ర ప్రతిపాదనలను వారి ముందుకు తెచ్చిందా? లేదు.

సోనియా చుట్టు ఉన్న చిదంబరం, కమల్ నాథ్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, షిండే, వంటి నేతలు ఆమెను తప్పుదారి పట్టిస్తున్నారో, లేక ఆమెయే 'నోరుమూసుకుని నేను చెప్పిన పనిచేయ' మని వారిని శాసిస్తున్నదో కానీ మనకి కనిపిస్తున్నది నిరంకుశ మొండి ప్రవృత్తి. కమల్ నాధ్ గారికి ఒక నదీ గర్భాన్ని ఆక్రమించి హోటల్ ని నిర్మించుకున్న ఖ్యాతి ఉన్నది. శ్రీచిదంబరం గారు ఆర్ధిక రంగాన్ని, దేశబ్యాంకింగ్ రంగాన్ని ఎంత భ్రష్టు పట్టించారు అనేది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త ఆర్ధికమంత్రి రంగంలోకి దిగితే గానీ తెలియదు. ముంబాయి ఆదర్శ హౌసింగ్ స్కాంలో షిండేగారి పాత్రపై శ్రీమతి సోనియా గాంధీగారి రియాక్షన్ తెలియదు.

శేషాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు పులుగడిగిన ముత్యాలు అని నేను వ్రాయదలుచుకోలేదు. కానీ సోనియా చుట్టూ ఉన్న నేతలకన్నా వారికి ప్రజలలో ఎక్కువ పలుకుబడి ఉన్నది. సోనియాని భుజంపైపెట్టుకొని మోయటంలో ముప్పు ఏమిటో, తెలంగాణ ఎంపీలకు తెలియకపోయినా, శేషాంధ్ర ఎంపీలకు ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుంది. ఈజ్ఞానోదయానికి మనం స్వాగతం చెప్పాలి.

తెలంగాణ ప్రజలు అడకత్తెరలోని పోకలు కాబోతున్నట్లే (టీ ఆర్ ఎస్ - టీ కాంగ్రెస్ మధ్య, లేక టీఆర్ఎస్ మెర్జిత కాంగ్రెస్, టీడీపీ సమర్ధిత బిజేపి మధ్య ఇరుక్కోటం), శేషాంధ్ర ప్రజలు టీడీపి (ప్లస్ రహస్య బిజెపి అవగాహన) మరియు జగన్ మధ్య ఇరుక్కుని ఊపిరాడక గిలగిల లాడబోయే రోజులు రాబోతున్నాయి. కిరణ్ కొత్త పార్టీ పెట్తే, కొత్త రాజకీయ త్రిశూలం తలెత్తి ప్రజలని బాధిస్తుంది.

కాబట్టి గుండెలు బ్లీడింగ్ కావాల్సింది తెలంగాణ ప్రజలకి, శేషాంధ్ర ప్రజలకి. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి బండరాళ్ళకి కాదు.

ఈనాటి కవిత


రచన మహాకవి శ్రీశ్రీ.


ఇలాంటి కవితలను డీ జ్యూరీ ప్రధాని మన్మోహన్ సింగ్, డీ ఫ్యాక్టో ప్రదాని సోనియా చదివి ఉంటే heart bleeding జరుగుతున్నట్లు నటించవలసిన పరిస్థితిలు తెచ్చుకునేవాళ్ళుకాదు.

బాటసారి


కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిన పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కుతెలియక-
నడిసముద్రపు నావరీతిగ
సంచరిస్తూ సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండచండం, తీవ్రతీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!

కళ్లు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్లో తల్లి ఏమని
పలవరిస్తోందో...?

చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్లదృశ్యం
కళ్లముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!
అతని బ్రతుకున కదే ఆఖరు!

గ్రుడ్డి చీకటిలోను గూబలు
ఘాకరించాయి;
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;

వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!

135 Narendra Modi's Education

135 Narendra Modi, Rahul Gandhi education comparison. నరేంద్రమోడీ రాహుల్ గాంధీ విద్యార్హతల తులనాత్మక అధ్యయనం.

చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, భారతీయ విద్య, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, భారతీయ రాజకీయాలు

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


నాకు నరేంద్రమోడీ యందు గానీ, రాహుల్ గాంధీ యందు గానీ రాగద్వేషాలు లేవు. సత్యశోథన, సత్వసాధన దృష్టితో మాత్రమే ఈ పరిశీలన వ్రాస్తున్నాను. నిష్పాక్షికంగా రచన చేయటం అనేది ఒక కత్తిమీద సాము. మనకు తెలిసో, తెలియకో, మన రచనల్లోకి మనలో మనకి తెలియకుండానే అంతర్లీనంగా ఉన్న బయాస్ లు బయటకి తొంగి చూస్తూ ఉంటాయి.

కొంత వైబీరావు గాడిద స్వంతడబ్బా కూడ అనివార్యమయ్యింది. అప్పుడప్పుడు ఈస్వంత విషయాలను ఎందుకు వ్రాయవలసి వస్తుందంటే, నేను వ్రాసిన స్వామి వివేకానంద బ్లాగ్ లో పాఠకవర్యులు, ''స్వామీ వివేకానంద జీవితంలో చాల ఘనకార్యాలు చేశారు. నీవు నీ జీవితంలో ఏమి చేశావో వ్రాయి'' అని నన్ను నిలదీయటం జరిగింది. నిజానికి స్వంతవిషయాలను వ్రాయటం కొన్ని సార్లు ఆత్మస్తుతికి, మరికొన్నిసార్లు ఆత్మనిందకు దారితీస్తుంది. ఒకసామెత కూడ ఉంది, ''నిన్ను నీవు పొగుడుకోకు, జనం నమ్మరు. నిన్నునీవు తిట్టుకోకు, జనం నమ్ముతారు.'' అని.

నరేంద్రమోడీ విద్యార్హతలు


గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎం.ఏ. పాలిటిక్స్ (రాజకీయ శాస్త్రం). దూరవిద్య - డిస్టాన్స్ ఎడ్యుకేషన్ పధ్ధతిలో (కరస్పాండెన్స్ కోర్స్).
నరేంద్ర మోడీ తన బి.ఏ. ఏకాలేజీలో చదివారో వివరాలు దొరకటం లేదు. బహుశా అది కూడ దూరవిద్య డిస్టెన్స్ మోడ్ లోనే కావచ్చు. గుజరాత్ యూనివర్సిటీ వారిని, శ్రీ నరేంద్రమోడీ విద్యవివరాలను తమ వెబ్ సైట్ లో పెట్టమని ఈ-మెయిల్ ద్వారా కోరాను. ఇంతవరకు వారా పని చేయలేదు.

(క్రింద, రాహుల్ గాంధీ బి.ఏ. చదివిన రోలిన్స్ కాలేజీ ఫ్లారిడా వారిని చూడండి. వారి వెబ్ సైట్ లో దీనిని గొప్ప విషయంగా వ్రాసుకున్నారు. ట్రినిటీ కాలేజీ కేంబ్రిడ్జి వారు, రాజీవ్ గాంధీ, భారత ప్రధాని అని ఢంకా బజాయిస్తున్నారు. ఈ ట్రినిటీ కాలేజీ రాహుల్ జీ ప్రధాని అయింతరువాత (అవుతారో లేదో), ఆయన కూడ తమ ఆలమ్నీ (పూర్వవిద్యార్ధి) అని డప్పు కొట్టుకుంటుంది. గుజరాత్ యూనివర్సిటీ వారు ఎందుకు వెనుకబడి ఉన్నారో.

సాయం కళాశాలల విద్య, దూరవిద్య అంటే మన ఐ ఎ ఎస్, ఐ పీ ఎస్ అధికారులకి, ప్రైవేటు రంగ ఉద్యోగ దాతలకి ఒక విధమైన చులకన భావం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దూరవిద్యలో చదివిన వారికి ప్రైవేటు వారు ఉద్యోగాలు ఇవ్వటానికి వెనుకాడటం గమనార్హం.

వైబీరావు గాడిద స్వంత డబ్బా


నరేంద్ర మోడీ దూర విద్య ఎం.ఏ పాలిటిక్స్ పై నాకేమీ చులకన భావం లేదు. దీనిలో కొంత సెల్ఫ్-పిటీ (తనపై తనకే జాలి) ఉంది. అదేంటంటే నాకు (ఈబ్లాగర్) గల నాలుగు డిగ్రీలు నాలుగు డిప్లోమాలలో మూడు సాయంకళాశాలలు, ఐదు దూరవిద్యద్వారా సాధించినవి. 19ఏళ్ళకే ఉద్యోగ ప్రవేశం చేయటంతో సాయం కళాశాలలను, దూరవిద్యను ఆశ్రయింపక తప్పలేదు. ఒకసారి నాకు చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది. నేను న్యాయశాస్త్ర ఎల్.ఎల్.బీ.ని సాయం కళాశాలలో పూర్తిచేసిన వెంటనే న్యాయశాస్త్రం లో సాయం కళాశాలలను ఎత్తి వేశారు. ఇప్పుడు లాయర్ అవ్వాలనుకునేవారికి భారత్ లో , డే కాలేజీ కంపల్సరీ అయ్యింది.

రాహుల్ గాంధీ విద్యార్హతలు




వీకీపీడియా ప్రకారం: Rahul Gandhi attended St. Columba's School, Delhi before entering The Doon School in Dehradun (Uttarakhand) from 1981-83. Meanwhile, his father had joined politics and became the Prime Minister on 31 October 1984 when Indira Gandhi was assassinated. Due to the security threats faced by Indira Gandhi's family from Sikh extremists, Rahul Gandhi and his sister, Priyanka were home-schooled thereafter. Rahul Gandhi joined St. Stephen's College, Delhi in 1989 for his undergraduate education but moved to Harvard University after he completed the first year examinations. In 1991, after Rajiv Gandhi was assassinated by LTTE during an election rally, he shifted to Rollins College due to security concerns and completed his B.A. in 1994. During this period, he assumed the pseudonym Raul Vinci and his identity was known only to the university officials and security agencies. He further went on to obtain an M.Phil from Trinity College, Cambridge in 1995.

తెలుగు సారం


శ్రీరాహుల్ గాంధీ సెయింట్ కొలంబియా స్కూల్ లో చదివారు. 1981-83లో డూన్ స్కూల్. ఈసమయంలో తండ్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి ప్రవేశించటం, తల్లి ఇందిరాగాంధీ హత్యకి గురికావటంతో, రాజీవ్ దేశ ప్రధాని కావటం జరిగింది. అప్పటినుండి భద్రతా కారణాలవల్ల రాహుల్ కి, సోదరి ప్రియాంకకి ఇంటి విద్య ఏర్పాటు చేశారు. 1989లో అండర్ గ్రాడ్యుయేట్ విద్య కొరకు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రవేశించారు. కానీ మొదటి సంవత్సరం పూర్తికాగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు. తండ్రి శ్రీరాజీవ్ హత్యానంతరం, 1991లో సెక్యూరిటి కారణాల వల్ల రోలిన్స్ కాలేజీ లో చేరారు. అక్కడ 1994లో బి.ఏ. పూర్తిచేశారు. ఈకాలంలో భద్రతా కారణాల వల్ల శ్రీరాహుల్ ''రావుల్ విన్సీ'' అనే కల్పిత నామాన్ని ధరించారు. ట్రినిటీ కాలేజీలో చేరి 1995లో ఎం. ఫిల్ పూర్తి చేశారు.

అగ్ర నేతల విద్య గురించి వైబీరావు గాడిద వ్యాఖ్యలు


నాయనమ్మ ఇందిరా గాంధీ విద్యార్హతల విషయంలోనే భారతీయులకు పలు సందేహాలు ఉండేవి. అయితే ''విజయం'' అన్ని అవలక్షణాలను తుడిచేస్తుంది. ప్రధానిగా శ్రీమతి ఇందిర స్థిర పడ్డాక, చుట్టూ కోటరీ (చుట్టూచేరిన భక్తబృందం) ఏర్పడ్డాక ఇటువంటి ప్రశ్నలు తగ్గాయి.

తరువాత తల్లి సోనియా గాంధీ విద్యార్హతల విషయంలోనూ భారతీయులకు పలు సందేహాలు ఉండేవి. అయితే ''విజయం'' అన్ని అవలక్షణాలను తుడిచేస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, డీ ఫ్యాక్టో భారత ప్రధానిగా (డీ జ్యూరీ ప్రధాని మన్మోహన్ సింగ్) శ్రీమతి సోనియా గాంధి స్థిర పడ్డాక, చుట్టూ కోటరీ (చుట్టూచేరిన భక్తబృందం) ఏర్పడ్డాక ఇటువంటి ప్రశ్నలు తగ్గాయి.

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి, పదవిలో తిష్ఠవేసుకునేదాకా అనుమానాలు తప్పవు. నరేంద్రమోడీకైనా అంతే.

గమనించ వలసినది


భద్రతా కారణాలు అనే మేఘాల వెనుక శ్రీరాహుల్ విద్యాభ్యాసం ఎలా నడిచిందో అనే విషయాన్ని భారతీయులకి తెలియకుండా దాచి పెట్టారు.

హార్వర్డ్ లో శ్రీరాహుల్ గాంధీ మూడు నెలల ముచ్చట



భారతీయ ప్రైవేటు కాలేజీలు, విశ్వవిద్యాలయాల వలెనే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడ డొనేషన్లకు అతీతం కాదు. అక్కడ డోనర్లకోటా ఉంది.

అంతర్జాలంలో లభ్యం అవుతున్న సమాచారాన్ని బట్టి, శ్రీ రాహుల్ గాంధీ తన మెరిట్ ద్వారా కాక డోనర్లకోటా లో ఆయూనివర్సిటీలోకి ప్రవేశం సంపాదించారు. శ్రీరాహుల్ గాంధీ హార్వర్డ్ లోకి ప్రవేశించిన సంవత్సరమే, హిందుజా అనే సంస్థవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారికి 11మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారుట. రాహుల్ ఎడ్మిషన్ కి, హిందూజా విరాళానికి మధ్య క్విద్ ప్రో కో సంబంధం లేదని నిరూపించాలంటే, శ్రీరాహుల్ గాంధీ తాను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి తన డొనేషన్ ను ఏరూపంలో ఎంత చెల్లించారో చెప్పవలసి ఉంటుంది. లేదా హార్వర్డ్ లో తన ప్రవేశానికి తన మెరిట్ స్కోర్స్ మాత్రమే కారణమని నిరూపించాల్సి ఉంటుంది. లేదా దేశాధినేతల పిల్లలకు, మాజీదేశాధినేతల పిల్లలకు, ప్రభుత్వాధినేతల పిల్లలకు, మాజీ ప్రభుత్వాధినేతల పిల్లలకు ఏవైనా రిజర్వేషన్ లు ఉన్నాయా అనేది వివరించాల్సి ఉంటుంది.

అంతర్జాల సమాచారం ప్రకారం చేరిన 3 నెలలలోనే శ్రీవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంనుండి పంపి వేయబడ్డారు. వీకీపీడియా ప్రకారం, తండ్రి రాజీవ్ హత్యకు గురి కావటం వల్ల శ్రీరాహుల్ స్వఛ్ఛందంగా హార్వర్డ్ నుండి బయటకి వచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అభ్యంతరం చెప్పే వరకు తన రెజ్యూమ్ లో రాహుల్ జీ హార్వర్డ్ లో ఇకనామిక్స్ లో మాస్టర్స్ చేసినట్లు చెప్పుకునేవారు.

శ్రీ రాహుల్ గాంధీ రోలిన్స్ కాలేజి Rollins College బి.ఎ.


ఇది అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో ఉన్నది. ఈ రోలిన్స్ కాలేజీ వారి వెబ్ సైట్ కి లింకు: http://www.rollins.edu/రోలిన్స్ కాలేజి వెబ్ సైట్ కి వెళ్ళటానికి క్లిక్.
ఈ రోలిన్స్ కాలేజి వారు మటుకు శ్రీరాహుల్ గాంధీగారు తమ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాలలో డిగ్రీ చేశారని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. స్క్రీన్ షాట్ చూడండి.

ఈకాలేజీ వారి వెబ్ సైట్ లో 'గివింగ్' అనే టాబ్ ను గమనించి ఉంటారు. శ్రీరాహుల్ జీ ఎన్ని వేల డాలర్లను వీరికి ఇచ్చారో, రాహుల్ జీ తరఫున వేరెవరన్నా ఇచ్చారో మనకి తెలియదు.

ఈకాలేజీ ఎంత సీరియస్ కాలేజీయో, ఎంత ఈజీ గోయింగ్ కాలేజీయో చెప్పటం కష్టం. ఫీల్డ్ స్టడీస్ పేరుతో ఛార్జీలు వసూలు చేసి విదేశాల్లో తిప్పటం మటుకు ఉంది. అసలు అమెరికన్ యూనివర్సిటీల్లో చాలా భాగం ఈతరహావి లాగానే కనిపిస్తున్నాయి.

యూనివర్సిటీలంటే భవనాలేననే వెర్రి భారత్ కి అమెరికానుండి వ్యాపించిందనచ్చు. ఏవి బహిరంగంగా డిగ్రీలు అమ్మే కాలేజీలు, ఏవి బహిరంగంగా ప్రకటించకుండా షో నడిపించి డిగ్రీలు అమ్మే కాలేజీలు గుర్తించటం కష్టం.

భారత దేశంలో బి.ఎ. అంటే ఒకవిధమైన చులకన భావం ఉంది.

రాహుల్ జీ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి ఎం.ఫిల్


ఈహిందూస్థాన్ టైమ్స్ వారి న్యూస్ చూడండి. http://www.hindustantimes.com/india-news/rahulgandhitakingthelead/rahul-was-awarded-cambridge-mphil-degree-in-1995/article1-1177339.aspx కి వెళ్ళటానికి క్లిక్. వార్త తేదీ Prasun Sonwalkar, Hindustan Times London, January 27, 2014

ఇందులోంచి కోట్:
In a letter to Gandhi in 2009, the former vice-chancellor, Prof Alison Richard, had regretted the controversy in India over his qualifications, and had clarified that he was a student at Trinity College from October 1994 to July 1995.
He was awarded the MPhil in Development Studies degree in 1995, she had stated in the letter.
తెలుగు సారం: అక్టోబర్ 1994 నుండి జులై 1995 వరకు, రాహుల్ గాంధీ అక్కడ విద్యార్ధిగా ఉన్నారు. 1995లో రాహుల్ జీ కి అభివృధ్ధి అధ్యయనంలో ఎం.ఫిల్ పట్టా ఇవ్వబడింది.

ట్రినిటి కాలేజీ విద్యపై వైబీరావు గాడిద వ్యాఖ్య


రాహుల్ గాంధీ ఎం.ఫిల్ ట్రినిటీ కాలేజినుండి పూర్తిచేయటం ప్రాథమికంగా నిజం లాగానే కనిపిస్తున్నది. ఈసందర్భంగా వచ్చిన ఆరోపణలలో ఒకటి, ట్రినిటీ కాలేజీకి చెల్లించవలసిన ఫీజు ఒకనంబరు ఖాతా నుండి వచ్చింది అనేది. ఈట్రినిటీ కాలేజీ వాళ్ళ ఎం.ఫిల్ ఫీజు స్ట్రక్చ్రర్ నెట్ లో ఎంత గాలించినా దొరకలేదు. విదేశీ విద్యార్ధులకు, ముఖ్యంగా వి.వి.ఐ.పీ. విద్యార్ధులకు ఎంత ఛార్జి చేస్తారో తెలియదు. మెరిట్ ఫీజు నిబంధనలు, డొనేషన్ ఫీజు నిబంధనలు విడివిడిగా ఉండి ఉండాలి. (ఆంధ్రప్రదేశ్ లో కౌన్సిలర్ కోటా, మేనేజిమెంటు కోటాలాగ).

ట్రినిటి ఎం.ఫిల్. మరియు భారతీయ యూనివర్సిటీల ఎం.ఫిల్. కు ఒక తేడా



యూజీసీ గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. చేయాలంటే స్నాతకోత్తర పీజీ డిగ్రీ ఉండాలి. ట్రినిటీలో బి.ఎ. డిగ్రీకే ఎం.ఫిల్. లో ప్రవేశం.

కేంబ్రిడ్జి, ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు మార్కెట్ ఎకనామిక్స్ ను వంటబట్టించుకున్నట్లే కనిపిస్తుంది. దివాలా ఎత్తిన బ్రిటీష్ ప్రభుత్వం నుండి గ్రాంట్లు తగ్గిపోతున్న కొద్దీ ఈరెండు ఘరానా విశ్వవిద్యాలయాలు ఫీజులు, డొనేషన్లపై దృష్టి సారించి, విదేశీ ధనిక విద్యార్ధుల సంఖ్యను భారీగా పెంచుకోటం కోసం, వారు అమెరికాకు వెళ్ళకుండా చూడటం కోసం, అర్హతలనే తగ్గించటానికి పూనుకున్నాయి. అందుకే బి.ఏ. చదివిన వారికి డైరక్టు ఎం.ఫిల్ లో ప్రవేశం. ఆరునెలలో మొక్కుబడి డిజర్టేషన్ ను తీసుకుని ఎం.ఫిల్. డిగ్రీని వండి వార్చటం గమనార్హం.

అభివృధ్ధి అధ్యయనం DEVELOPMENT STUDIES అనేది సాంకేతిక విద్య కాదు. ఈమాత్రం దానికి వేల పౌండ్లు చెల్లించి ట్రినిటీ కాలేజీ దాకా వెళ్ళాలా? ఢిల్లీ యూనివర్సిటీ లోనే ఈకోర్స్ ను పూర్తి చేయవచ్చు. లేదా ఝార్ ఖండ్ రాంచీ లేక ఒడిషా బరంపురం యూనివర్సిటీ లోనే ఈ ఎం.ఫిల్. ని పూర్తి చేసుకోటానికి తన డిజర్టేషన్ ను తయారు చేసుకొని ఉంటే, కలహాండీ జిల్లాలో ఆకలి చావులని అర్థం చేసుకోటానికి వీలయ్యేది. లేదా ఛత్తీస్ గఢ్ | ఝార్ ఖండ్ లలో మావోయిస్టు ఉద్యమాలను అధ్యయనం చేయటానికి వీలయ్యేది. ఎందుకీ విదేశీ గోల?

ఇపుడు అధ్యయనం జరగవలసినది ఏమిటంటే ట్రినిటీ కాలేజీ ఫీజును ఎవరు చెల్లించారు? ఎలా చెల్లించారు? ఏదైనా క్విద్ ప్రో కో ఏమైనా జరిగిందా. శ్రీ నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ఈవిషయాన్ని కావాలనుకుంటే పరిశోధించు కోవచ్చు.

ట్రినిటీ కాలేజీ వారు శ్రీరాహుల్ గాంధీ గారిని ఏవిధంగా పరీక్షించారు? శ్రీరాహుల్ గాంధీ సమర్పించిన డిజర్టేషన్ అసలు ఆయన వ్రాసినదేనా? వేరెవరైనా వ్రాశారా? కట్ కాపీ పేస్ట్ వంటివి ఏమైనా జరిగాయా? దీ సరోగేట్ వుమన్ అని Im Kwon-taek ఇమ్ క్వాన్ టేక్ గారి 1987 సినిమా ఒకటి వచ్చింది. సరోగేట్ ఎగ్జామ్, సరోగేట్ డిజర్టేషన్ వంటివి ఏమన్నా జరిగాయా? ఇవన్నీ ఇతిహాసపు చీకటి కోణాలు. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ఈకథలు మనకిప్పుడు ఎంతవరకు పనికి వస్తాయి అనేది ప్రశ్నార్ధకం.

సెలబ్రిటీల పిల్లకాయలు ఫ్యాషన్ డిజైనింగు, జ్యూయలరీ డిజైనింగ్, జెమాలజీ, అంతర్జాతీయ సంబంధాలు, అభివృధ్ధి అధ్యయనం వంటి కోర్సులను కూడ సీరియస్ గా చేస్తారని అనుకోటం కష్టం. తీరికేది? ఓపికేది? కోరికేది? పబ్లిసిటీ కోసం తప్ప?

EXPERIENCE అనుభవం


శ్రీనరేంద్ర మోడీ: బాల్యంలో తండ్రి వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో నడిపిన టీస్టాల్ లో తండ్రికి సహాయం చేసేవారు. తరువాత ''కారవాన్'' అనే ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం రెండేళ్ళు ఎవరికి కనపడకుండా పోయారు. వెనక్కి వచ్చాక తన అంకుల్ అహమ్మదాబాద్ సిటీబస్ స్టాండ్ లో నడిపిన క్యాంటీన్లో సహాయం చేశారు. తరువాత గీతా మందిర్ సమీపంలో సైకిల్ పై తన టీకార్ట్ ను నడిపారు. ఈసమయంలో శ్రీమోడీ తన టీకార్ట్ ను మానేసి ఆర్ ఎస్ ఎస్ లో సహాయకుడిగా చేరారు.

రాహుల్ గాంధీ అనుభవం, వికీపీడియా ప్రకారం: After graduation, Rahul Gandhi worked at the Monitor Group, a management consulting firm, in London. In 2002 he was one of the directors of Mumbai-based technology outsourcing firm Backops Services Private Ltd. తెలుగుసారం: గ్రాడ్యుయేషన్ తరువాత , రాహుల్ గాంధీ లండన్ లోని మానిటర్ గ్రూప్, ఒక మేనేజిమెంట్ కన్సల్టింగ్ ఫరమ్ లో పనిచేశారు. 2002లో ఆయన ముంబాయిలో ప్రధానకార్యాలయం కలిగిని టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ ఫరమ్ బ్యాక్ అప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

అనుభవం గురించి వైబీరావు గాడిద వ్యాఖ్యలు


దీనిని గురించి సవివరంగా ఇంకో బ్లాగ్ లో వ్రాస్తాను.

వెరోనిక్ కార్టెల్లి, కొలంబియా జాతీయురాలు


అంతర్ జాలం లో లభిస్తున్న సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 2001లో శ్రీ రాహుల్ గాంధీని బోస్టన్ విమానాశ్రయంలో 9 గంటల పాటు అమెరికన్ అధికారులు నిర్బంధించారు. కారణం: తన దగ్గర ఉన్న 1,60,౦౦౦ డాలర్లకు ఆయన సరియైన వివరణ ఇచ్చుకోలేక పోయారు. ప్రక్కనే వెరోనిక్ కార్టెల్లీ అనే కొలంబియా భామ ఉన్నది. ఆమె ఒక కొలంబియా డ్రగ్ మాఫియా పుత్రికట. నాటి భారత ప్రధాని వాజ్ పేయీ గారు చొరవ తీసుకుని శ్రీ రాహుల్ ని విడిపించారుట. అమెరికన్ అధికారులు ఎఫ్.ఐ.ఆర్. వంటి దానినేదో రికార్డు చేసుకొని వదిలేశారుట. (ఇటీవల దేవయాని ఖొబ్రగాడే అనే భారతీయ కాన్సలేట్ అధికారిని అమెరికన్లు నిర్బంధించటం, ఒక రభస కావటాన్ని గుర్తుకు తెచ్చుకోండి).

ఈవార్త సత్యమా అసత్యమా అనే దాన్ని శ్రీరాహుల్ గాంధీ నిర్దిష్టంగా ప్రకటించాల్సిఉంటుంది.

మొత్తానికి శ్రీమోడీ, శ్రీరాహుల్ భారతీయులకి తమ వంశాంకురాలను ప్రసాదించలేదు.

ఈనాటి తెలుగు పాట


చిత్రం పెళ్ళిచేసిచూడు. రచన: పింగళి నాగేంద్రారావు. పాడింది:ఘంటసాల.

ఓ... భావి భారత భాగ్య విధాతలార, యువతీ యువకులార
స్వానుభవమున చాటు నా సందేశమిదే... వరెవహ్

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలంగడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా
తాదీనా తకదీనా ...తంగిటిత తకిటతకిటతోం...
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్..
తరంపం.. పరంపం
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్ పెళ్ళి ||

నవ భావముల నవ రాగముల ఆ..ఆ..నవ జీవనమే నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. పెళ్ళి||

ఈనాటి ఫొటో, ట్రినిటీ కాలేజీ వారి దయతో





ఈబ్లాగ్ పోస్టును తిరగవ్రాయవలసి ఉన్నది. ఇంకా అదనం వ్యాఖ్యలు వ్రాయవలసినది కూడ ఉన్నది. ముఖ్యంగా డిగ్రీలకు, ఉద్యోగాలకు, వృత్తులకు మధ్య సంబంధం అవసరమా? అనే విషయం గురించి.

Tuesday, February 11, 2014

134 Mother-wife

134 Mother or wife? Mother & wife? Both? None? Country? తల్లా పెళ్ళామా? ఇద్దరూనా? ఎవరూ కాదా? దేశమా?
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, భారతీయ వివాహ వ్యవస్థ, రామాయణం, తిక్కన, గుంటూరు జిల్లా

ముందుగా స్పష్టీకరణలు, విజ్ఞప్తులు


ఒక ప్రపంచ, భారతీయ, తెలంగాణ, శేషాంధ్రప్రదేశ్ సమస్య ఏమిటంటే నాయకుల వ్యక్తిగత జీవితాలలో జరిగే విషయాలు ప్రజలకి అవసరమా, అనవసరమా? అనేది. ఇటీవల ఫ్రాన్స్ దేశంలో ఆదేశాధ్యక్షులు శ్రీ హోలెండే గారు తన మొదటి భార్యను, రెండవ భార్యను గాలికి వదిలేసి ఒకసినీనటి ఇంటి చుట్టూ రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటే మీడియా నిలేసింది. తదధ్యక్షుడు గారు ప్రైవేటు విషయాలపై రక్షణ కావాలని వాపోయారు. రెండవ భార్యగారు పత్రికా విలేఖరి, రచయిత్రి. ఆమె, ఈవ్యవహారంపై ఒక పుస్తకం వ్రాస్తానని అని, వ్రాయటానికి సిధ్ధం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మహాకవి శ్రీశ్రీ
అన్నారు


ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్‌ లోకి వస్తే ఏమైనా అంటాం…
గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ అనే వెబ్ సైట్ వారు వ్రాసిన వ్యాఖ్య సముచితంగా ఉంది. ఇది వారు నటుడు పవన్ కల్యాణ్ విషయంలో వ్రాశారు కానీ సెలబ్రిటీలకు, ముఖ్యంగా ప్రబోధాలు, ఉద్బోధనలు చేసే నేతలకు చక్కగా వర్తిస్తుంది.
గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ వారి, పైవ్యాఖ్యకు వెళ్ళటానికి లింక్:- http://greatandhrapaper.com/this-is-pawanism/కు వెళ్ళటానికి క్లిక్.

పైలింకును ఇవ్వటం, గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ వారి వ్యాఖ్యను కోట్ చేయటాన్ని, పవన్ కల్యాణ్, మరియు రజనీకాంత్ లపై నేను చేస్తున్న వ్యాఖ్యలుగా భావించరాదు. ప్రస్తుతం మన ప్రాధాన్యత భారత జాతి వర్తమాన, భవిష్యత్ లను గురించి ఆలోచించటం. పవన్ కల్యాణ్ గురించి చదువదలుచుకున్నవారు పై లింక్ కు వెళ్ళి తమ అభిప్రాయాలను అక్కడ స్వేఛ్చగా వ్రాయవచ్చు.
... దేశంలో సెలబ్రిటీలు, వారి వార్తల కోసం అర్రులు సాచే మీడియా, పైకి చిరాకు పడుతూనే, ఈ తరహా అటెన్షన్‌ కోసం ఆత్రుత పడే జనాలు పెరగని కాలంలో అన్నాడు శ్రీశ్రీ ఈ మాటలు. ఇప్పుడు ఈ మాటలు అక్షర సత్యాలై కూర్చున్నాయి. తమ తమ జీవితాల్లోకి తొంగి చూడవద్దని, అనే వీలు సెలబ్రిటీలకు లేదు. ఎందుకంటే వారికి ఆ స్టాటస్‌ వచ్చింది జనాల అభిమానం కారణంగా. జనాలు అభిమానించకుంటే సెలబ్రిటీలు వుండరు. వారికి ఈ తరహా ఆదాయమూ వుండదు. కొన్ని కావాలంటే కొన్ని వదులు కోవాలని, పబ్లిక్‌ ఇమేజ్‌ కావాలనుకుంటే ప్రయివసీ కాస్త వదులుకోక తప్పదు.

అయితే ఇక్కడ ఓ మధ్యే మార్గం కూడా వుంది. కాస్త జాగ్రత్తగా, వీలయినంత వివాదరహితంగా వుండడం. రజనీకాంత్‌ను మించిన సెలబ్రిటీ దక్షిణాది సినిమా రంగంలో మరెవరు వున్నారు. కానీ ఆయన ఈ స్టేటస్‌ వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. పైగా ఆయన హిమాలయాల పర్యటన తదితర వ్యవహారాలు బయటకు వచ్చినపుడల్లా, ఆయనపై అభిమానులకు గౌరవం రెట్టింపయ్యింది తప్ప తగ్గలేదు. సెలబ్రిటీ స్టాటస్‌ అనుభవించేవారు, తమ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వీలయినంత ఆదర్శప్రాయంగా వుంచుకోవడం అవసరం. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్‌ ఒకసారి వచ్చిన తరువాత నిలిచి వుండాలంటే ఇది చాలా అవసరం.


సెలబ్రిటీల విషయంలో, పబ్లిక్, ప్రైవేటు మధ్య విభజన రేఖ చెరిగి పోతున్నదా? ఇది న్యాయమా? ఈవిషయంపై ఇంకా ఎంతో బహిరంగ చర్చ జరగాలి.



సెలబ్రిటీలు కొంత మేరకు పబ్లిసిటీ దురద తగ్గించుకొని తాము ఆచరించని విషయాలను, ఇతరులను ఆచరించమని ప్రబోధించటం మానేస్తే, సాధారణంగా వ్యక్తిగతవిషయాలను స్పృశించ వలసిన అవసరం మీడియాకి రాకూడదు. సెలబ్రిటీలు ఈ నియమాన్ని పాటించగలిగితే మాబోటి చిన్నకారు రచయితలకు భారాన్ని తగ్గించిన వారు అవుతారు.


పై బొమ్మలు మనకేమి చెప్తాయంటే నేతలు పబ్లిసిటీ లేనిదే బ్రతుకలేరని.

ఇపుడు శ్రీ నరేంద్రమోడీ గారి మాతృప్రేమ పబ్లిసిటీ కాంక్షను ఈక్రింది చిత్రంలో చూడండి.

ఇపుడు బుధ్ధిహీన వైబీరావు గాడిద వ్యాఖ్య


మన కాబోయే ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ గారు తమ 2012 ఎన్నికల నామినేషన్ లో భార్య పేరు, ఆస్తి అప్పుల విషయాలు నింపకుండా ఖాళీగా వదలి వేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. జశోదా బెన్ అనే గుజరాత్ రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ గారు మై మోడీజీ కీ ధర్మపత్నీహూ అని ఘోషిస్తున్నది. మోడీజీ అవుననరు, కాదనరు.

మోడీ గారికి ఆమెపై ఎందుకింత నిర్దయ? దేశభక్తి ఎక్కువయి కావచ్చు. ఇంటగెలిచి రచ్చ గెలువమన్నారు.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాద్ అపి గరీయసి. ఈశ్లోకం ఏమి చెప్తుందంటే, తల్లి, జన్మభూమి స్వర్గంకన్నా గొప్పవి. శ్రీమోడీ వారు జనని సేవ, జన్మభూమి సేవ బాగానే చేస్తున్నారు. ఆమాతృదేవత మోడీజీకి సలహా ఇచ్చి ఉంటుంది. నీభార్యని అన్యాయం చేయకురా అని. ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకే కాక, ఆసంబంధాన్ని ఖాయంచేసుకున్న మోడీ సోదరులకు కూడ ఉంటుంది. మరి వారెందుకు మిన్నకున్నారో?

120కోట్ల జనాభా గల ఈభారతదేశంలో దేశసేవని పంచుకోటానికి బోల్డుమంది సిధ్ధంగా ఉంటారు. ఒక్కడే పెళ్ళాం బిడ్డలను వదలి, మిగిలిన వాళ్ళకు ఆఅవకాశం లేకుండా చేస్తే, మిగిలిన వాళ్ళు దేశసేవ చేసే భాగ్యం దొరక్క గగ్గోలు పెట్తారు.

మొదటినుండీ బ్రహ్మచర్యాన్ని చేపట్టి ఏకోన్ముఖ మార్గంలో పయనించటం వేరే విషయం. ఇక్కడ అలా జరగలేదు. మూడేళ్ళలో మూడు నెలలో ఎంతో సంసారం చదరంగం అనుబంధం ఒక రణరంగం కొంత జరిగి పోయింది. మొదటి జంటకూ మూడు రాత్రులూ ఒక పోరాటం ఎంతో కొంత జరిగి పోయి ఉంటుంది. శ్రీ విశ్వనాధన్ ఆనంద్, వంటి వారు 40 బోర్డుల మీద చదరంగం ఆడేటపుడు కూడ కొన్నిటిని డ్రాచేసుకున్నా. శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా ఆడటం మానరు. మధ్యలో స్టెప్పులు వేయటం వదిలేయరు. బోర్డుని అవతలివాళ్ళ ముఖాన కొట్టి పారిపోరు. కబీర్ గారు మగ్గం నేస్తూనే సత్యాన్వేషణ చేశారు. భక్త తుకారాంగారు కూడ పంటచేను మంచె మీద కూర్చొని కూడ తన తాన్పూరాను సవరించుకొని అభంగాలను పాడటం వదలలేదు.

మరి పెళ్ళినాటి ప్రమాణాల మాట, మంత్రాల మాట ఏమిటి? అవి భారతీయ సంస్కృతిలో భాగం కావా?
Kanyam Kanaka Sampannam kanakabharanairyutham,
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్ యుతాం, Dashtami Vishnave Thubhyam Brahmaloka Jigeeshiya.
దష్టామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషయా. Vishwambhara Sarvabhuta, Sakshinya Sarvadevata,
విశ్వంభర సర్వభూత, సాక్షిణ్య సర్వదేవతా, Kanyamimam vradasyami, Pithrunam Dharanayavai.
కన్యాం ఇమాం వ్రదస్యామి, పిత్రూణం ధారణాయవై. Kanyam Sarvalankritham Sadhvim Suseelaya Sudheemathe
కన్యాం సర్వాలంకృతాం సాధ్వీం సుశీలయా సుధీమతే Vrayatho ham prayachchami Dharmakamardha Siddhaye.
వ్రయతోహం ప్రయఛ్ఛామి ధర్మకామార్ధ సిధ్ధయే. Dharmardha Kameshu Tvayesha, Nathi Charatavya, ---- Nathi Charami
ధర్మార్ధ కామేషు త్వయేష, నాతి చరతవ్య -- నాతి చరామి.

దష్టామి విష్ణవే తుభ్యం అనటంలో వరుడిని, వధువు తండ్రి విష్ణువులాగా చూసుకుంటు కాళ్ళు కడిగి కన్యని ఇస్తాడు.

ఆఖరు లైను చూడండి. ధర్మార్ధ కామేషు లో ధర్మం, అర్ధం, కామం, మూడు పురుషార్ధాలలోనూ నీతోనే సంచరిస్తాను అనే ప్రమాణాలు ఉంటాయి.

మన విష్ణువు గారు ఏమి చేశారు


తనతో నాతి చరామి కొరకు వచ్చిన జశోదా బెన్ గారిని బాగా చదువుకోమని చెప్పి పుట్టింటిలో వదలి వేశారు. తరువాత అత్తింటి ముఖం చూడలేదు, అని అభిప్రాయం కలుగుతుంది. జశోదా బెన్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి.
...My in-laws treated me well, but would never speak about the marriage. My father paid the fees for my studies and I also got some financial assistance from my brothers to continue my education. I had lost my mother when I was two years old and I lost my father two years after I started studying again and was in class 10. ...
తెలుగు సారం
మా అత్తవారు నన్ను బాగానే చూశారు, కానీ పెళ్ళి విషయం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మా చదువుకు ఫీజు నాతండ్రిగారు చెల్లించారు. నా విద్యను కొనసాగించటానికి నా సోదరులు నాకు ఆర్ధిక సహాయం చేశారు. నేను రెండేళ్ళ వయసులో ఉండగా నాతల్లి గతించింది. నేను చదువుకోటం మొదలు పెట్టాక రెండేళ్ళకు మానాన్న గారు కన్ను మూశారు. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను.
... When he told me he would be moving around the country as he wished, I told him I would like to join him. However, on many occasions when I went to my in-laws' place, he would not be present and he stopped coming there. ...
...ఆయన నాకు నేను దేశమంతా తిరుగుతానని చెప్పినపుడు, నేను కూడ మీతో కలుస్తానని చెప్పాను. అయితే, నేను మా అత్తగారింటికి వెళ్ళిన సందర్భాలలో, ఆయన ఉండేవాడు కాదు మరియు ఆయన అక్కడికి రావటం మానేశాడు. ...

వైబీరావు గాడిద వ్యాఖ్య


దేశమంతా తిరగటం బాగానే ఉంది. ప్రతిచోటకీ వెంట తీసుకు వెళ్ళక పోటము కూడ బాగానే ఉంది. అప్పుడప్పుడు జశోదా బెన్ గారిని రమ్మని పిలువనంప వచ్చును. ఆమె అత్తింటికి వచ్చినపుడు, ఆమె వచ్చిన విషయాన్ని తనకు ఫోన్ చేయమని తల్లికో సోదరులకో చెప్పి తాను ఆ ఒక్కరోజుకు ఆమెతో ప్రేమతో సంభాషించ వచ్చును. ముఖం తప్పించినట్లుగా కనిపిస్తుంది.

దేశసేవ చేస్తూ కూడ సంసారాలు చేసే వారు మనకి పలువురు ఉన్నారు. సీపీఎమ్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్ లు ఉన్నారు. ధర్మేంద్ర హేమమాలిని దంపతులు బిజేపీ ఎంపీలు. నక్సల్స్|మావోయిస్టులలో దంపతులు ఇరువురు ఉద్యమాల్లో పాల్గొనటం సర్వసాధారణం. దేశసేవ చేసే వారు భార్యకి దూరంగా ఉండాలని హిందూ సంస్థల్లో ఎక్కడైనా నిబంధనలు ఉన్నాయేమో తెలియదు.

జశోదా బెన్ గారు ఏదైనా తప్పుచేస్తే ఆవిషయాన్ని ఆమెకే సూటిగా చెప్పవచ్చుకదా. బాగా చదువుకో అని చెప్పి పుట్టింటిలో వదిలివేసి కనీసం ముఖంచూడకుండా, ఫీజు కట్టకుండా ఉండటం న్యాయమా.

ఏమి చేస్తున్నారో చెప్పకుండా అడవుల్లో దించేయటం, శ్రీరామచంద్రమూర్తి పధ్ధతి. సీత ఎప్పుడో ఒకసారి శ్రీరామచంద్రమూర్తితో నాకు ఒకసారి వనవిహారం చేయాలని ముచ్చట పడింది. ఆముచ్చట తీర్చే వంకతో, శ్రీరామచంద్రమూర్తి గారి ఆజ్ఞతో, కనీసం చెలికత్తెలను కూడ తోడు ఇవ్వకుండా, జనకుడికి మాట మాత్రం చెప్పకుండా లక్ష్మణుడికి ఒక నియంతృత్వ ఆజ్ఞను పారేసి అడవిలో దించి పారేశారు.
నరేంద్రమోడీ, ఆయన సోదరులు, జశోదాబెన్ కు ఇంకా చదువుకోమని చెప్పారు. రామ లక్ష్మణులు సీతకు ఎందుకో చెప్పలేదు. వాల్మీకి ఆశ్రమంలో సీతకు ఆమె పిల్లలు లవకుశులు ఆశా దీపంలా నిలిచారు. మన జశోదాబెన్ గారికి ఆభాగ్యం దక్కలేదు.

ఈనాటి తెలుగు పద్యం


తిక్కన నిర్వచనోత్తర రామాయణం. 9వ ఆశ్వాసం. రెండవ, మూడవ పద్యాలు.

కందం.
జన నాధుఁ డుడుగరలు భూ,
తనయ మనంబలర గట్టి తగన్ ఒప్పించెన్
మునివరుల పత్నులకు ని,
మ్మని మణి మయ భూషణాంబరాదులు ప్రీతిన్.

తేటగీతి.
ఇవ్విధంబునఁ తన తలపించుకంత
యైన జానకి ఎరుగని యట్లు గాగ
పాలతోడ విషంబిడు పగిది ననిచి
పుచ్చి రాఘవుఁడుల్లంబు నొచ్చి మరలె.

సారం, వ్యాఖ్య: నిన్ను అడవిలో ఒంటరిగా వదలివేయ బోతున్నాము అని రాముడు సీతకు చెప్పలేదు. ఉడుగర అంటే బహుమతి అని ముఖ్యార్ధం. వధువుకి ఇచ్చే బహుమతి అని అదనపు అర్ధం. మన శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మకి ఉడుగరలు బాగా కట్టించాడు అంటే పట్టుబట్టలు దండిగా కట్టించు, బహుమతులు బాగా ఇచ్చాడనాలి. వాల్మీకి ఆశ్రమంలోని ముని పత్నులకి ఇవ్వమని మణులు, ఆభరణాలు, బట్టలు ఇచ్చాడు.

ఇక్కడ తిక్కన మంచి ఉపమానాన్ని వాడాడు. పాలతోడ విషంబిడు విధంబున అన్నాడు. స్పష్టమే కదా, కుట్ర.

ఈనాటి శ్లోకం


వాల్మీకి రామాయణం. ఉత్తరాకాండ. 46వ సర్గ (ఆధ్యాయం). 10, 11శ్లోకాలు.
वासांसि च महार्हाणि रत्नानि विविधानि च ।
गृहीत्वा तानि वैदेही गमनायोपचक्रमे ॥ 7.46.10 ॥
వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ
గృహీత్వా తాని వైదేహీ గమనాయోపచక్రమే.

इमानि मुनिपत्नीनां दास्याम्याभरणान्हम् ।
ఇమాని మునిపత్నీనాం దాస్యాంయాభరణాన్హమ్
वस्त्राणि च महार्हाणि धनानि विविधानि च ॥ 7.46.11 ॥
వస్త్రాణి చ మహార్హాణి ధనాని వివిధాని చ.

పాపం సీత అనుకుంటున్నదీ, తాను ముని ఆశ్రమాలను తాత్కాలిక సందర్శనకు వెళ్తున్నాననుకున్నది. అయోధ్యనుండి తాను శాశ్వతంగా పంపి వేయబడుతున్నానని తెలుసుకోలేక పోతున్నది. అసలు విషయం అపుడు ఆమెకు చెప్తేకదా ఆమెకు తెలియటానికి. లక్ష్మణుడికి చివరికి చెప్పక తప్పలేదనుకోండి.


లవకుశ సినిమాలో ఈ బట్టలు, నగలు తీసుకు వెళ్తున్న విషయాన్ని చూపించకుండా, అంజలీదేవిని కట్టుబట్టలతో అడవిలో విడిచినట్లుగా చూపించారు. సినిమా అప్పటికే 22రీళ్ళకు చేరింది. ఇవన్ని చూపటం కూడ కష్టం.

లవకుశ సినిమాలో ఎన్ టీ ఆర్ శ్రీరాముడు. తల్లి కౌసల్యగా కన్నాంబ నటించింది. సీతను వదలిన శ్రీరాముడిని ఆమె మందలించిన తీరు నభూతో న భవిష్యతి.

ఈనాటి పాట, లవకుశలోదే


స్వర్గీయ సదాశివ బ్రహ్మం వ్రాశారు. తెరపై జీవించింది రేలంగి, గిరిజ. మిగిలిన నటులు కూడ అజరామర కీర్తికాయులు. పేర్లు తెలియక వ్రాయలేక పోతున్నాను.

భర్త: ఒల్లనోరి మామా నీ పిల్లనీ
అబ్బా నీ పిల్లా దీని మాటలెల్ల కల్ల
సంసారమంత గుల్ల "ఒల్ల"

భార్య: ఒల్లనంట వెందుకు మామయ్య
నా వల్ల నేరమేమిర అయ్యయ్యో
దెయ్యాన్ని కొడుదునా దేవతనీ కొడుదునా
నూతులో పడుదునా గోతుల్లో పడుదునా

మొగుడు: చెయ్! చెమటకారి నాయాలా వూరుకో
సూరిగాడి ఇంటికాడ సూడలేదటే నిన్ను
మారుమాట లాడుతావా మాయదారి గుంట
నిను సూస్తె వళ్ళు మంట "నేనొల్ల"

మామగారు: అయిందాని కల్లరెందు కల్లుడా
ఓరల్లుడా మేనల్లుడ మా అప్పగొరి పిల్లడా
మీ అప్ప మొగం చూడరా మా యమ్మిని కాపాడరా "నేనొల్ల"

అత్తగారు: తప్పేమి చేసింది తమ్ముడా ఇప్పుడు
ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్ప తాగి వున్నావు చెప్పుడు మాటిన్నావు
అప్పడగ బోయింది అదీ ఒక తప్పా

మొగుడు: అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా
యిక చాలును మీ గొప్పా
నా ఆలి గుణము ఎరుగన నే

నేలుకోను తీసుకుపో "నేనొల్ల"

పెళ్ళాము: నీ తాగుబోతు మాటలింక మానరా
నే సత్తెమైన యిల్లాలిని చూడరా
నే నగ్గి ముట్టుకుంటా అరిచేత పట్టుకుంటా
తలమీద పెట్టుకుంటా

మొగుడు: చెయ్! ఎర్రి రాముడంటి వోణ్ణి కాదొలే
గొప్ప శౌర్యమైన యింటబుట్టి నానులె
అగ్గిలోన బడ్డా నువు బుగ్గిలోన బడ్డా
పరాయింట వున్న దాన్ని పంచ జేరనిస్తానా
ఒల్ల నోలె పిల్లా యింకెల్లిపో

ఈనాటి చిత్రం


ఈచిత్రం గుంటూరుజిల్లా దుర్గి శిల్పకళా పాఠశాలకు చెందినది. దుర్గి గ్రామం మాచర్ల సమీపంలో ఉన్నది.
http://guntur.nic.in/images/banner/durgistone.jpg ఈచిత్రం ఉన్న వెబ్ సైట్ కు లింకు:- http://guntur.nic.in/durgi_stonecraft.html గుంటూరుజిల్లా ప్రభుత్వ వెబ్ సైట్ కు చేరుకోటానికి క్లిక్.

ఈగాడిద ఇంకా వ్రాయాల్సింది ఇంకా కొంత ఉన్నది. ఇంకో రోజు.

Monday, February 10, 2014

133 Modi in Assam

13౩ Narendra Modi instigating regional feelings ప్రాంతీయ భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ
చర్చనీయాంశాలు: Narendra Modi, నరేంద్ర మోడీ, Prime Minister of India, Sonia Gandhi

మన నేతలు పగటి వేష గాళ్ళని వేరే చెప్పనక్కరలేదు.


జాతీయ స్థాయి నేతలుగా ఎదగాలనుకునే ప్రాంతీయనేతలకి ప్రాంతీయ దృష్టే కాకుండా జాతీయదృష్టి కూడ ఉంటే మేలు అని విజ్ఞుల నానుడి. నరేంద్రమోడీ గారు మిగతా నేతలవలెనే ఈవిషయాన్ని తుంగలో తొక్కారు.
For 23 years you have been sending Prime Ministers from here. You tell me, you made such a big investment but what did you get in return. Did you get anything?...If he being yours could not do anything for you, then what will he do for the nation.
తెలుగు సారం
మీరు గత 23 ఏళ్లుగా ఇక్కడనుండి ప్రధానమంత్రులని పంపిస్తున్నారు. (శ్రీ మన్మోహన్ సింగ్ ని రాజ్యసభకి అని భావం). మీరు చెప్పండి, మీరు అంత పెద్ద పెట్టుబడిని పెట్టారు, కానీ ప్రతిఫలంగా ఏమి పొందారు? మీకైదైనా వచ్చిందా?... ఆయన (ప్రధాని) మీవాడైనా మీకేమీ చేయలేదంటే, ఆయన జాతికి ఇంకేమి చేస్తాడు?

Among all Northeast states, Assam's condition is the worst ... Congress leaders are narrow minded. Their thinking is narrow, dreams are small and vision is shortsighted.
తెలుగు సారం: ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో, అస్సాం పరిస్థితే దిగదుడుపు. ... కాంగ్రెస్ నాయకులు ఇరుకు మనస్తత్వం గలవాళ్ళు. వాళ్ళ ఆలోచన ఇరుకు. కలలు చిన్నవి. దృష్టి ఎక్కువ దూరం పోదు.

Prime Minister ji if even a small worker from Assam would have sat in Rajya Sabha for 23 years, he would changed the face of Assam. You are sitting in Rajya Sabha for 23 years, holding the coveted post of Prime Minister and yet your own state of Assam is facing such a bad condition, then you can imagine in what bad shape will the whole country be.
ప్రధానమంత్రి గారూ, అస్సాం నుండి ఒక చిన్న కార్యకర్త రాజ్యసభలో 23 ఏళ్ళు కూర్చున్నా, అతడు అస్సాం ముఖచిత్రాన్ని మార్చిఉండేవాడు. మీరు రాజ్యసభలో 23 ఏళ్ళ నుండి కూర్చుంటున్నారు. అయినా మీ స్వంతరాష్ట్రం అయిన అస్సాం ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటున్నదంటే, అఖిలభారత దేశం ఇంకెంత దుస్థితి లో ఉందో ఊహించండి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు Comments of ybrao a donkey


This type of comments instigate regional hatred, though they may be facts. ఇటువంటి వ్యాఖ్యలు సత్యాలే అయినా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతాయి.

Every leader, be it Sonia Gandhi, Rahul Gandhi, Narendra Modi make this type of speeches, to whichever Region/State they go. ప్రతి నేతా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, ఏ ప్రాంతానికి| రాష్ట్రానికి వెళ్ళినా ఇటువంటి ఉపన్యాసాలే ఇస్తూ ఉంటారు.

తెలుగులో ఒక సామెత ఉంది. ఏ రోటి దగ్గర ఆపాట పాడటం. Telugu language has a proverb. Singing the song appropriate to the corn-grinding-stone =mortar. (Upto near 1950, corn/flour used to be ground with hand pestles on stone grinders. 2 or 3 persons used to apply the pestle in turn. While operating the pestles, they used to sing folk songs. The songs used to vary depending on the house in which the mortar is located and grinding work is done. )

అస్సాం వెళ్తే అస్సాం పాట, తమిళ నాడు వెళ్తే తమిళనాడు పాట. Assam song is sung when leaders go to Assam, and Tamil Nadu song is sung when they go to Tamil Nadu.

నరేంద్రమోడీ గారూ, అరవింద కేజ్రీవాల్ గారూ భిన్నంగా ఉండాలని కదా మనం కోరుకునేది. What do we expect? Narendra Modi and Aravind Kejriwal ought to be different.
... Prime Minister ji, you will have to reply. People of the country have the right to seek an answer from you and people of Assam have a special right to demand an answer from you ...
తెలుగుసారం
ప్రధానమంత్రిగారూ, మీరు జవాబు ఇవ్వాల్సిందే. ఈదేశ ప్రజలు మీనుండి జవాబును కోరే హక్కును కలిగి ఉన్నారు. అస్సాం ప్రజలకి మీనుండి జవాబును కోరే ప్రత్యేక హక్కుఉన్నది,

వైబీరావు గాడిద వ్యాఖ్య Comment of ybrao a donkey


గుజరాత్ లో 33 జిల్లాలు ఉన్నాయి. వికీపీడియా ప్రకారం, గుజరాత్ లోని డాంగ్ జిల్లా, గుజరాత్ లోనే కాదు, భారత దేశంలోనే మిక్కిలి వెనుకబడిన జిల్లా. నరేంద్రమోడీ గారిని మరల మరల ముఖ్యమంత్రిని చేస్తున్న వారిలో, డాంగ్ ప్రజలు కూడ ఉన్నారు. అస్సాం ప్రజలచేత మోడీగారు మన్మోహన్ సింగ్ గారిని అడిగిస్తున్న ప్రశ్నలనే, డాంగ్ జిల్లా ప్రజలచేత మోడీగారిని అడిగించ వచ్చు. Gujarat has 33 districts. Dang District in Gujarat, is the most backward district not only in Gujarat, but also in entire India. The voters of Dang are also a part of the Gujarat people who are electing Mr. Narendra Modi. Somebody can go to Dang and make Dang District people pose the same questions to Narendra Modi, which Mr. Modi is instigating people of Assam to ask.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |