Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Monday, January 13, 2014

117 Psoriasis self-care

117 Psoriasis self-care సోరియాసిస్ స్వంత శ్రధ్ద
చర్చనీయాంశాలు: ఆరోగ్యం, చర్మం,

సోరియాసిస్ (బొల్లి) నయం కాదు, అనే ఒక నిరాశాపూరితమైన అభిప్రాయం ఉంది. అది నిజమైనా కాకపోయినా, వైద్యరంగంలో జరుగుతున్న పరిశోథనలను దృష్టిలో ఉంచుకుంటే నిరాశపడ వలసిన అవసరం నాకు కనిపించదు. భయంకర కలరా, మశూచి, పోలియో వంటి వ్యాధులే భారత్ నుండి పారిపోక తప్పలేదు. మన కర్తవ్యం: వ్యాధి ఉపశమనానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, మన ఇతర పనులు ఉత్సాహంగా చేసుకుంటూ ఉండటమే. ఇతరులు ఏమన్నా పట్టించుకోకుండటమే.

డిస్ క్లెయిమర్

నేను వైద్యుడిని గాని, మందులతయారీ దారుని గాని, విక్రేతను గానీ కాదు. జనహితం కోసం సత్యాన్వేషణ చేస్తున్నవాడిని మాత్రమే. కనుక ఇందులో వ్రాస్తున్న విషయాలనువైద్య సలహాలుగా భావించరాదు. అర్హులైన డాక్టర్లతో సంప్రదించుకోటం డబ్బు, సమయం ఉన్నవారికి ఆవశ్యకం. లేనివారి మనశ్శాంతి కొరకు వ్రాస్తున్నాను.

ఇటీవల చూసిన ఒక లింకు

Click to go to హెల్త్.ఇండియా.కామ్ కు వెళ్ళటానికి
దీనిలో వ్రాసిన సూచనలు ప్రాథమికంగా బాగానే ఉన్నాయి. ఈ హెల్త్.ఇండియా.కామ్ వెబ్ పేజీకి 26 వ్యాఖ్యలు వచ్చాయి. వీటిని చూశాను. వీరందరు బాధితులే. వీరు పరిష్కారాలు కోరుతున్నారు. కొందరు 3 నెలలనుండి బాధపడుతుండగా, ఒకరు 20 ఏళ్ళనుండి బాధ పడుతున్నారు. ఒకరు ఆపిల్ సైడర్ స్వల్పంగా తాగటం గురించి ప్రస్తావించారు.

ఈవెబ్ పేజీలో ఇచ్చిన కొన్ని సూచనలు


*వైద్యసలహాతో , శరీరం బరువు తగ్గించుకోటం.
*యోగ.
*వాసనలేని షాంపూల వాడకం.
*ఉదయం 9 గంటలముందు, 15 నిమిషాలు సూర్యరశ్మినిపొందటం.
ఫ్లాక్స్ విత్తనాల వినియోగం పై పార్వతిక్రిష్ణన్ అనే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గారి రైట్ అప్ కు లింకు: Click to go to ఫ్లాక్స్ విత్తనాల వినియోగం పై పార్వతిక్రిష్ణన్ అనే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గారి రైట్ అప్

నన్ను ముఖ్యంగా ఆకర్షించిన అంశం

ఉపశమనానికి అవిసె విత్తనాల వినియోగం


ఆంగ్లం ఫ్లాక్స్ సీడ్స్. దీనికే మరొక పేరు లిన్ సీడ్ ట. బ్రౌన్, తెలుపు, ఎరుపు రంగులు ఉంటాయి. చిట్కా వైద్యవినియోగం: ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్లు, విరేచనాలు, కడుపులోమంట, కొన్ని ప్రత్యేక వ్యాధులు(ట).
పైన ఇచ్చిన హెల్త్.ఇండియా.కామ్ లింకులో, అవిసె విత్తనాలకు సంబంధించిన సూచన కోట్ చేస్తున్నాను.
...
- One home remedy that seems to have helped many people is the intake of flax seeds (Alsi). The omega 3 fatty acids in flax seeds apparently modify the chain of events that cause Psoriasis. Just before breakfast and dinner every day, roast and grind the seeds. Mix with two spoons of water and eat the paste.
... షుమారు తెలుగు అనువాదం: చాలమందికి సహాయం చేసినట్లుగా కనిపిస్తున్న ఇంటి దినుసు , అవిసె గింజలను లోపలికి తీసుకోటం. ఈ ఫ్లాక్స్ గింజల్లో ఉన్న ఒమేగా 3 ఫాటీ కొవ్వు ఆమ్లాలు సోరియాసిస్ కు దారితీసే గొలుసుసంఘటనలను మార్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు, రాత్రి డిన్నర్ కు ముందు ప్రతిరోజు ఈగింజలను వేయించి నూరాలి. వీటిని రెండు స్పూన్ల నీళ్ళలో కలిపి పేస్ట్ గా చేసి తినాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్య

ఈసలహా పని చేసినా పనిచేయకున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, నష్టదాయకం కాకపోవచ్చు. అవిసె గింజలు పెద్ద ఖరీదైనవి కూడ కాదు. ప్రయత్నించి చూడచ్చేమో.

116 Musings on Scholars and Ignoramuses.


116 Who is scholar and who is ignoramus? ఎవరు పండితుడు? ఎవరు శుంఠ? చర్చనీయాంశాలు: bifurcation, విభజన, తెలంగాణ, సీమాంధ్ర, స్వామి వివేకానంద

జైపాల్ రెడ్డి



కేంద్రమంత్రి శ్రీ జైపాల్ రెడ్డి గారి మాటల్లో చూద్దాం:
టంగుటూరి ప్రకాశం పంతులు, బోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ఉద్దండులు పుట్టిన చోట ఇప్పుడంతా పరమ శుంఠలు జన్మించారు.

వ్యాఖ్య:జైపాల్ కూడ ఈగడ్డమీదే పుట్టాడుకదా.
భారత దేశంలో పుట్టినవారు ఎక్కడైనా ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఎక్కడో పంజాబ్‌లో పుట్టిన షీలా దీక్షిత్ ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రి కాలేదా అని ప్రశ్నిస్తూ సీమాంధ్రులకు శక్తి ఉంటే తెలంగాణాకు ముఖ్యమంత్రి కావచ్చు
వ్యాఖ్య: సీమాంధ్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కావటం సంగతి అలాఉంచండి. జైపాల్ లాంటి రెడ్డిశ్రీలు, కెసీఆర్ లాంటి వెలమశ్రీలు, ఎప్పటికైనా తెలంగాణలో జన్మించిన బీసీని కానీ, దళితుడిని కానీ ముఖ్యమంత్రి కానిస్తారా? కళ్లుకాయలు కాచేలా వేచి ఉండటమేనా వారు చేయవలసిన పని?

వైబీరావుగాడిద వ్యాఖ్యలు
తిట్లు, శాపనార్ధాలు మామూలుగా చంద్రబాబుగారి రాజకీయపాఠశాలలో నేర్పిస్తారు. ఈవ్యాధి కెసీఆర్ కి ఆయనద్వారా సోనియా రాజకీయపాఠశాలకి వ్యాపించినట్లుగా కనిపిస్తుందికాని, భారతీయలకీ తిట్లరోగం మహాభారత కాలంనుండీ ఉన్నది.
మహాభారతంలో భీముడు, కర్ణుడినుద్డేశించి
నన్నయ ఆంధ్రమహాభారతం, 6వ ఆశ్వాసం, 57వ పద్యం.
తేటగీతి.
ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్య
మైన అంగరాజ్యంబు నీ కర్హమగున
మంత్ర పూతమై గురుయజ మాన భక్ష్య
మగుపురోడాశ మదికుక్క కర్హ మగునె.

అప్పటికి భీముడికి కర్ణుడికి లేక పాండవులకు కర్ణుడికి వైరములేదు. అయినా భీముడు కర్ణుడిని తిడ్తున్నాడు. కుక్క యజ్ఞపాయసాన్ని తినటానికి ఎలా అర్హం కాదో నీవు అంగరాజ్యానికి అలా అర్హుడవుకావు , అని భీముడు కర్ణుడిని తిడ్తున్నాడు.


మనం ఈ 150వ జన్మదినోత్సవ శుభసందర్బంలో, తిట్లపురాణంలో స్వామీ వివేకానందగారికి ప్రథమ స్థానం ఇవ్వాలి.

వాళ్ళంతా రాస్కెల్స్, కుచ్చితులు, కలియుగ రాక్షసులు


సందర్భం: స్వామీ వివేకానందగారు, శ్రీహరిదాస్ విహారీదాస్ దేశాయి గారికి లేఖవ్రాశారు. ఈయన, జునాగఢ్ సంస్థానానికి దివాన్. తారీకు: 22.8.1892. వ్రాసింది ముంబాయి నుండి.
"... Poor fellows! Whatever the rascally and wily priests teach them — all sorts of mummery and tomfoolery as the very gist of the Vedas and Hinduism (mind you, neither these rascals of priests nor their forefathers have so much as seen a volume of the Vedas for the last 400 generations) — they follow and degrade themselves. Lord help them from the Raakshasas in the shape of the Brahmins of the Kaliyuga..."

షుమారు సారం: పాపం దరిద్రులు ! రాస్కెల్స్ , మోసగాళ్ళు అయిన పురోహితులు ఏమి బోధించినప్పటికి, చొప్పదంటు కర్మలను, అర్ధరహితమైన ప్రవర్తనను, వేదసారం మరియు హిందుయిజంగా బోధించినప్పటికి, (తెలుసుకోండి, ఈరాస్కెల్స్ అయిన పురోహితులు , వాళ్ళ తాతముత్తాతలు, గత 400 తరాలుగా వేదాలయొక్క ఒకసంపుటంకూడ చూసి ఉండరు). -ఆదరిద్రులు (పురోహితులు బోధించే చెత్తనే) పాటిస్తారు, తమనితాము దిగజార్చుకుంటారు. కలియుగ రాక్షసులైన ఈబ్రాహ్మణులనుండి వారిని ఆభగవంతుడే రక్షించాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్య
పురోహితులు రాస్కెల్ స్, కుచ్చితులు, కలియుగ రాక్షసులు. తానేమో గొప్ప ప్రబోధకుడు. పురోహితులు చేసేవన్ని చెత్తపనులు. మరి స్వామీజీ తన ఆఖరురోజుల్లో క్రిస్టీనా గ్రీన్ స్టైడెల్ అనే యువతికి వ్రాసిన లేఖలో ఏమని డబ్బా కొట్టుకున్నారు? ఈదుర్గపూజ సందర్భంగా మేము ఒక మేకను బలి ఇచ్చాం. టపాకాయలు కాల్చాం. తన ప్రాణ రక్షణ కోసం మేకను బలి ఇచ్చే స్వామీజీ చేయించిన పనిని గొప్పపని అనాలా చెత్త పని అనాలా? కానీ బేలూరి మఠ్ వారి అధికారిక వెబ్ సైట్ ప్రకారం, స్వామి వివేకానందా గారి మేకను బలి ఇద్దామంటే, శారదా మాత అంటే రామకృష్ణ పరమహంస భార్య, అరటిపండ్లను నివేదన చేసే ఆచారాన్ని ప్రవేశపెట్టింది. ఈయన గురువుగారు , ఇంకా తెలివైన వాడు. కాళికాదేవికి మేకను బలి ఇస్తే అభ్యంతరంలేదు. కానీ అష్టమినాడు మాత్రమే బలి ఇవ్వాలి. ఆమేక మాంసాన్ని పరమహంసగారు తన నుదుటికి అద్దుకొని ఆరగిస్తారు. ఈపరమహంసగారు గదాధరుడనే బ్రాహ్మణశ్రేష్ఠుడుట.
ఇంకొక ఉదాహరణ: వాళ్ళంతా క్రాంకులు
స్వామి వివేకానంద గారు ఆల్బర్టా సర్జెస్ గారికి వ్రాసినలేఖ. తారీకు 5.12.1895. అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక ఓడనుండి వ్రాశారు.

"...In your country, Alberta, the Vedantic thought was introduced in the beginning by ignorant "cranks", and one has to work his way through the difficulties created by such introductions ..."
షుమారు భావం: మీదేశంలో, ఓ ఆల్బర్టా, వేదాంతిక ఆలోచనలను మొదట ప్రవేశపెట్టిన వాళ్ళు అజ్డానులైన క్రాంకులు (పిచ్చివెధవలు). వారిచే ప్రవేశపెట్టబడిని ప్రథమవివరణలలోంచి (introductions) వచ్చే కష్టాల్లోంచి పనిచేసుకుంటూ వెళ్ళాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్య
వివేకానందగారి ముందు కొద్దిమంది భారతీయులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తమకు తెలిసిన వేదాంత తత్వవిచారాలను అక్కడివారికి పరిచయం చేయాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఆంగ్లభాషా ప్రావిణ్యలేమి వల్లకానీ, వాక్చాతుర్యలేమి వల్లకానీ, వారు అందులో కృతకృత్యులు అయి ఉండకపోవచ్చు. అంతమాత్రానే వారిని క్రాంకులు (పిచ్చివెధవలు) అనాలా. ఈ ఆల్బర్టా అనే అమ్మాయికి వివేకానందా గారు లేఖ వ్రాసిన సమయానికి కేవలం 19 ఏళ్ళే. స్వామీజీ వ్రాసిన వన్నీ నిజమే అని ఆ అమ్మాయి అనుకొని ఉంటుంది. జైపాల్ రెడ్డిగారు సీమాంధ్రనేతలను శుంఠలు అన్నట్లుగా, కొందరైనా తెలంగాణ ప్రజలు నమ్మినట్లుగా.

ఎవరు రెలిజియస్ ఫెనెటిక్ స్ (మత పిచ్చి, అహంకారం కలవారు) ఎవరు కాదు?

భారతీయులలో క్రైస్తవమత ఫెనెటిజం ప్రబలటానికి యూరోపియన్ ల ప్రోత్సాహం, ఇస్లాం మత ఫెనెటిజం ప్రబలటానికి జిన్నా వంటివారు ఎంతకారకులో, హిందూమత ఫెనెటిజం ప్రబలటానికి వివేకానందగారు కూడ అంతే కారకులు అనే విషయాన్ని సర్వశ్రీ సోనియా, మన్మోహన్, మోడీ, అద్వానీ వంటి వారు గ్రహించక పోవటం దురదృష్టకరం. ఫలితంగా, స్వామీజీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా, సర్వశ్రీ మన్మోహన్, సోనియాల ప్రబోధం వోట్లకొరకు చేసినదో, లేక ఆఉత్సవ నిర్వాహకులు అడిగారు కాబట్టి ఏదో మర్యాదకోసమో చేసినవైనాయి తప్ప, వాస్తవాలు తెలుసుకొని చేసినట్లు కనిపించవు.

ప్రజలలో, పరిశీలకులలో ప్రబలి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, కాంగ్రెస్, సమాజవాది, ఆర్ జె డీ, బి ఎస్ పీ వంటి పార్టీలు పరోక్షంగా మైనారిటీ మతతత్వాన్ని పోషిస్తు ఉండగా, బిజెపి మెజారిటి మతతత్వాన్ని పోషిస్తున్నది. ఏపార్టీకా పార్టీ అద్దంలో చూసుకుంటే, తమప్రతిబింబం కనపడుతుంది.

నిజమైన పండితులు, మేధావులు వెలువరించే అభిప్రాయాలకు భారత్ విలువ ఇచ్చేరోజులు రావాలంటే, ప్రజలు పండితులు, మేధావులుగా మారాలి.

శుంఠలు, రాస్కెల్స్, క్రాంకులు, అని తమకు ముందు ఉన్నవారిని, తమపోటీదారులని తిట్టిపోసేవారిని ప్రజలు నమ్మినంతకాలం ఈదేశం బాగుపడదు.

115 herbal cures


115 Six important herbs which every Telugu home should have ప్రత తెలుగు ఇంటిలోనూ ఉండ వలసిన ఆరు ఆయుర్వేద ఔషథమూలికలు
చర్చనీయాంశాలు: ఆరోగ్యం, ఆయుర్వేదం, మూలికా వైద్యం, గృహవైద్యం

ఆధునిక వైద్యం

ఆధునిక వైద్యం బడావ్యాపారం గా మారి ప్రతిదానికి స్పెషలిస్టులు, అతి లేబరేటరీ పరీక్షలు, స్కానింగులు, ఎం ఆర్ ఐలు, రక్తం ప్యాకెట్లు కొనటం ఎక్కువయ్యాక, తెలుగు వారి జీవితాలు, ఆరోగ్యకార్డులు ఉన్నా లేకున్నా, దుర్భరంగా మారాయి. ఘరానా ప్రైవేటు హాస్పిటల్ కి నిలువుగా నడుచుకుంటూ వెళ్ళినవాడు అడ్డంగా శవమై ఇంటికి రావటం, ఇళ్ళూ వాకిళ్ళూ పొలాలూ ఆటోలూ తాకట్టుపెట్టుకోటమో, అమ్ముకోటమో జరిగాక, రోగులు, వారి వారసులు వీథిన పడటం చూస్తున్నాము. పక్కింటి వాళ్ళు ఘరానా హాస్పిటల్ కు వెళ్తే మనం వెళ్ళక పోటం అవమానంగా ఫీల్ అవటం అలవర్చుకున్నాము.

హోమియోపతి

హోమియో వైద్యం చూద్దామంటే, అది హుళక్కి అని చాలా మందికి తెలియదు. సైంటిఫిక్ హోమియోపతి, నక్షత్రం హోమియోపతీ అని రకరకాల పేర్లతో ప్రకటనలు విడుదల చేస్తూ బాదుతున్నారు. హోమియో మందులను అతిగా పల్చన చేయటం వలన వాటిలో పంచదార, సారాయి తప్ప వేరేదేమీ ఉండదని చాలా మందికి తెలయదు. తాయిత్తు కట్టించుకోటానికి, హోమియో వాడటానికి తేడా ఏమీ ఉండదని తెలుసుకోవలసిన అవసరం ఉంది. హోమియో వైద్యవిద్యార్ధులు, వైద్యులు ఈవిషయం పై ఆలోచిస్తే మేలే కానీ, ప్రయోజనం ఉండదేమో. ఎందుకంటే, అప్పటికే హోమియో విద్యపై పెట్టుబడి పెట్టటం జరిగి పోతుంది. ఇంక వెనక్కి వెళ్ళటం కష్టమౌతుంది. అందుకనే, హోమియో వైద్యవిద్యార్ధులకు అలోపతి పాఠ్యాంశాలను, ప్రాక్టికల్స్ ను కూడ నేర్పితే వారు అవసరానుగుణంగా అలోపతి మందులను వాడగలుగుతారు.

హోమియో వైద్య విద్య - అలోపతి సబ్జెక్టులు

ఈమధ్య ఆయుష్ శాఖ జాతీయ స్థాయి ఉన్నతాధికారులు హోమియో వైద్య సిలబస్ లో అలోపతి సబ్జెక్టులను చేర్చరాదని నిర్ణయించారట. మహారాష్ట్రలో హోమియో వైద్యులు హోమియో మందులతో పాటు అలోపతి మందులను వాడటం ఎక్కువట. ఆంధ్రప్రదేశ్ లో తక్కువట. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు హోమియో వైద్యులు ప్రాథమిక అలోపతి మందులను తక్షణ శమనకాలుగా వాడటానికి అలోపతి సబ్జెక్టును చదవటమే మేలేమో. అలా చదవటం వల్ల, ఎట్టి పరిస్థితులలో పేషెంట్లను అలోపతి పెద్ద స్పెషలిస్టు వైద్యశాలలకు పంపాలో హోమియో వైద్యుడు నిర్ణయించుకో గలుగుతాడేమో. ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ హోమియో వైద్యుల అభిప్రాయం ఏమిటో రిఫరెండం జరగాలేమో.

ఆయుర్వేదం

ఆయుర్వేదం విషయానికి వస్తే ఆమందుల్లో రసవైద్యం డామినేషన్ ఎక్కువ. 76%శాతం మందుల్లో పాదరసం, గంధకం, సీసం, మొ. విష పదార్ధాలతో నిండి ఉండటం వల్ల మన శరీరం క్రమ క్రమంగా విషపూరితం అవుతుంది. ఆసవాల్లో, అరిష్టాల్లో భూమిలో వాసినకట్టుకట్టి 40రోజులు సహజపరిస్థితుల్లో పులిసి ఔషథాల్లో సారాయి అదంతట అదే ఉత్పత్తి(self-generated alcohol) కావాలి. కానీ కొందరు మందుల కంపెనీలవాళ్ళు 40రోజుల దాకా ఆగలేక ప్రభుత్వ కోటాలో వచ్చే ఆల్కాహాల్ ను కలిపేస్తున్నారు. కేరళ పంచకర్మల పేరుతో కూడ పిండుకోటం ఎక్కువైంది.

గృహ మూలికా వైద్యమే దిక్కు

ఈస్థితిలో మనకు కొంత మేరకైనా మూలికా వైద్యం ఇంట్లో వాడే దినుసులు, కాయలు, గింజలు, ఆకులు, పూలు, వేళ్ళు (మూలము అంటే వేరు) మొ. మూలికలే దిక్కుగా మారాయి. ఇవి బజారులో పచారీ కొట్లో చాలా చౌకగా దొరుకుతాయి. రోగాలు తగ్గినా తగ్గక పోయినా సైడ్ ఇఫెక్ట్స్ ఉండవు.

డిస్ క్లైమర్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు దొర్లుతు ఉంటాయి. కాబట్టి ఇందులోని విషయాలను నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ గా భావించరాదు. అర్హుడైన వైద్యుడు అందుబాటులో లేనపుడు, మనం దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు, మనం కొన్ని సిధ్ధాంతాలకు కట్టుబడి జీవించాలనుకున్నప్పుడు, ఈచిట్కాలు ఆసరాగా నిలుస్తాయి తప్ప, వీటిని వైద్య సలహాలుగా భావించరాదు. అన్ని వైద్యవిధానాలలో వలెనే, మూలికల వాడకంలోనూ, సమర్ధనలు (claims) ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రీయమైన క్లినికల్ రికార్డులు లేవు. ఈవిషయంలో మనం చాల ముందుకు వెళ్ళాలి. అందుకే, చాలా వాటికి నేను క్లెయిమ్స్ చివర 'ట' తగిలించాను. కొన్ని మూలికలను నేను వాడైనా సరే, నిజానిజాలను అనుభవించి ధృవీకరించ దలుచుకున్నాను. అయితే ఒక వ్యక్తికి సత్ఫలితం ఇచ్చిన మూలిక మరొకరికి అంతే సత్ఫలం ఇవ్వాలని లేదు. ఆహార విహారాలలో భేదాలు ఉంటాయి. ఇంటి వాతావరణంలో తేడా ఉంటుంది.

ప్రతి ఇంటిలోను ఉండవలసిన ఆరు ముఖ్యమైన ఆయుర్వేద ఔషథ మూలికలు

కరక్కాయ



మొదటిది కరక్కాయ. సంస్కృతంలో హరీతకి. ఆంగ్లంలో టెర్మినేలియా చెబ్యులా లేక మైరోబాలాన్. కరక్కాయ తల్లి వంటిది, అనే సామెత అతిశయోక్తి కాదేమో. జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, మూత్రమండలం. ఆధునిక ఇంగ్లీషు వైద్యంలో వాడే మందులతో పోల్చాలంటే, దీనిని డైయూరెటిక్ కింద లెక్కించ వచ్చు. అంటే మూత్రం సాఫీగా పోయేలా చేస్తుంది. ఆహారనాళంలో (గొంతు, ఈసోఫాగస్ నుండి గుదం వరకు పొట్ట, క్లోమం, కాలేయం, గాల్ బ్లాడర్, స్ప్లీన్, డుయోడినం, జెజునం, చిన్నప్రేవులు, పెద్దప్రేవుల ద్వారా మలాశయం వరకు ఆహారం ప్రయాణించే మార్గం) ఆహారం వేగంగా ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతుందిట. మలవిసర్జనకు సహాయం చేయటంలో, దీనికి సునాముఖి తరువాత రెండవ స్థానం ఇవ్వ వచ్చు. పొట్టను శుభ్రం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది. మల విసర్జనకు తోడ్పడుతుంది కాబట్టి , ప్రేగులలో హానికారక బాక్టీరియాను పెరగనివ్వదు, మొలల వ్యాధిని నయం చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. శరీరంలో అధికంగా ఉన్న ద్రవాలను ఇది బయటకు పోయేలా చేస్తుంది లేక లోపలే ఆరబెట్తుందిట. బహుశా ఇందుచేతనే, ఇది దగ్గుకి,జలుబుకి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఉష్ణవీర్యం కాబట్టి, ఆవునేయితో వాడమని ఒకసలహా ఉంది. కనుక పొడి చర్మంతో బాధపడుతూ, ద్రవాల కొరత శరీరాలు ఉన్నవాళ్ళు కరక్కాయ వాడకపోటం క్షేమం. గర్భిణీ స్త్రీలు కూడ వాడకపోటం మంచిది అనే అభిప్రాయం ఉంది. పూర్వకాలంలో కరక్కాయ అధికంగా వాడబడటంవల్ల, కరక్కాయ వైద్యుడు అని చులకన చేయటం జరిగేదిట. అయితే ఆంగ్లవైద్యంలో లూప్ డైయూరెటిక్స్ కి మంచి స్థానమే ఉంది కాబట్టి, మనం కరక్కాయను మరీ చులకనచేయనవసరం లేదు.

తానికాయ


తానికాయ ఆంగ్లనామం టెర్మినేలియా బెలిరికా. జీర్ణ, శ్వాస వ్యవస్థ. యాంటి హేల్మెంతిక్ అంటే నులిపురుగుల నివారిణి. యాంటి స్పాస్మోడిక్ తెరలుతెరలుగా వచ్చే నొప్పులనివారిణి. యాంటీ పైరెటిక్ అంటే జ్వరనివారిణి. శ్వాస వ్యాథులు దగ్గు , క్షయ , ఆస్తమా , ఎలర్జీల ఉపశమనం. విరేచనాల నివారిణి. లివర్ టానిక్ అంటారు. కేశపోషణి (ట). కంటి చూపు మెరుగు పరుస్తుంది (ట). గుండెజబ్బులకు ఉపశమనం. కరక్కాయ వలెనే కఫాన్ని తగ్గిస్తుంది. సర్పి అనే చర్మ వ్యాధికి ఉపశమనం.

వుసిరికాయ


ఆంగ్లనామం ఫైలాంథస్ ఎంబ్లికా. సంస్కృతం లో ఆమలకం. క్రియాస్థానాలు: జీర్ణ, శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థలు. దీనికి ధాత్రి అనే సంస్కృతనామం వల్ల తల్లి అనే భావం ఉంది. కరక్కాయవలెనె, ఇదికూడ సర్వ వ్యాథినివారిణి అనే భ్రమ ఉంది. కాకపోవచ్చు. అయితే పలు వ్యాథులకు పని చేయవచ్చు. చ్యవనప్రాశలో ఒక ముఖ్యదినుసు. హెయిర్ ఆయిల్స్ లో బ్రాహ్మీ అనే మూలికతో కలిపి వాడకం ఎక్కువ. లినోయిక్ ఆమ్లం వల్ల కాలేయ వ్యాథులు తగ్గుతాయిట. వీకీపీడియా ప్రకారం, ఊపిరితిత్తులనుండి రక్తం పడటం తగ్గుతుందట. జాగ్రత్తలు: పిత్తదోషం ఉన్నవారికి, విరేచనాలను కలిగించే అవకాశం ఉందిట.

పిప్పళ్ళు


త్రికటుకాల్లో మొదటిది. కటుకం అంటే కారంగా ఉండే కారంగా ఉండే దినుసు. జీర్ణ, శ్వాస, పునరుత్పత్తి వ్యవస్థలో పని. అనులోమనం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). నొప్పి శమనకం (analgesic). నులిపురుగుల దమనకం(anthelmintic). లైంగికశక్తిని పెంచుతుందట (aphrodisiac). ఉమ్మిబహిష్కరిణి(expectorant). ఫ్లూ జ్వరశమనకం. కడుపులో పుండ్ల శమనకం. ఆస్తమా శమనకం. జలుబులు, దగ్గులు, మూర్ఛ, గొంతు వ్యాథులు, పక్షవాతం, కీళ్ళనొప్పులు, క్రిమి వ్యాధుల శమనకం. జాగ్రత్తలు: పిత్తాన్ని పెంచుతుంది. కామెర్లవారు, అతివాగుడుగాళ్ళు, వాడకపోటం మేలు.

సొంఠి (సున్నంలో నానబెట్టి ఎండబెట్టిన అల్లం).


త్రికటుకాల్లో రెండవది. జీర్ణ, శ్వాస వ్యవస్థల్లో చర్యలు. అనులోమనగుణం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). వాంతుల నివారకం (anti-emetic) నొప్పి శమనకం (analgesic). నులిపురుగుల దమనకం(anthelmintic). లైంగికశక్తిని పెంచుతుందట (aphrodisiac). చెమటను పెంచి బయటకు పంపుతుంది (diaphoretic), ఉమ్మిఉత్పత్తిని పెంచి ప్రవహించేలా చేస్తుందిట (sialogogue). ఉమ్మిబహిష్కరిణి(expectorant). ఫ్లూ జ్వరశమనకం. కడుపులో పుండ్ల శమనకం. ఆస్తమా శమనకం. జలుబులు, దగ్గులు, మూర్ఛ, గొంతు వ్యాథులు, పక్షవాతం, కీళ్ళనొప్పులు, క్రిమి వ్యాధుల శమనకం. పటికబెల్లం తో వాడినపుడు పిత్త శమనకంట. తేనెతో వాడితే కఫశమనకం ట. అల్లం రసాన్ని బొడ్డుపై రుద్దుకుంటే, విరేచనాలనుండి ఉపశమనం కలుగుతుందట. యాంటీ కోయాగ్యులెంట్, (రక్తాన్ని గడ్డ కట్టకుండా చేసి రక్తాన్ని పల్చగా ఉంచేది). సుగుణం: రక్తనాళాల్లో అడ్డంకులవల్ల గుండె జబ్బులు, బీపీలతో బాధపడేవాళ్ళకి ఇది ఉపయోగపడాలి.

మిరియాలు


త్రికటుకాల్లో మూడోది. దీపనం అంటే ఆకలిపెంచేది. అనులోమనగుణం అంటే కడుపులోని వాయువులను గుదం ద్వారా బయటకు పంపేది(carminative). కఫహరం అంటే కఫాన్ని తగ్గించేది. ఊపిరితిత్తులు కఫంతో నిండినపుడు శమనం కలిగిస్తుందిట (decongestant) పిత్తాన్ని తగ్గిస్తుందా అనే విషయంలో, భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ముఖదుర్గంధహరం అంటే నోటి దుర్వాసన తగ్గించేది. వస్తిశోధకం అంటే మలాశయాన్ని శుభ్రం చేసేది. పాచకం అంటే జీర్ణక్రియలో సహకరించేది. రుచ్యం అంటే నోటి అరుచితగ్గించి రుచిని పెంచేది. కీళ్ళనొప్పుల శమనకం. ఫ్లూ జ్వరశమనకం. కొవ్వుని, లావుని తగ్గిస్తుందట.

(ఈబ్లాగ్ పోస్ట్ ను రివైజ్ చేయవలసి ఉన్నది).

Wednesday, January 8, 2014

114 A Great Caste System

114 Swami Vivekananda tried to justify caste system and the superiority of Brahmins, what a great intellect! వివేకానందగారు కులవ్యవస్థను సమర్ధించిన విధం బెట్టిదన
చర్చనీయాంశాలు: కులవ్యవస్థ, స్వామి వివేకానంద, మీడియా

హాన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక. ఈపత్రికవారు స్వామీ వివేకానందగారి 150వ జయంతి సందర్భంగా ఒక పూర్తి పేజీ కేటాయిస్తూ వ్యాసాలను ప్రచురించటం గమనించదగినవిషయం. 7.1.2014 సంచికలో కులవ్యవస్థపై శ్రీవివేకానందగారి పాత వ్యాసాన్నిపునః ప్రచురించారు. ఈవ్యాసం పేరు THE GREAT INIAN CASTE SYSTEM. చదువుటకు ఆసక్తి ఉన్నవారికి లింక్:- Click to go to HansIndia 7.1.2014 Article

సారాంశం

భారతీయ కులవ్యవస్థను పాశ్చాత్యులు అర్ధం చేసుకోలేక పోయారు.

వ్యాసంలోని ప్రతి వాక్యాన్నీ ఇక్కడ చర్చించడం పాఠకులకు విసుగు కలిగిస్తుంది. ఆసక్తిగల పాఠకులు ప్రశ్నలు వేస్తే, జవాబులు ఇవ్వటం ద్వారా 'బోర్' ను తగ్గించవచ్చు.

కొన్ని వాక్యాలను ఇక్కడ మచ్చుకు తీసుకుందాము.

"We believe in Indian caste as one of the greatest social institutions that the Lord gave to man. What caste really is, not one in a million understands,"
భగవంతుడు మనుష్యులకిచ్చిన అతిగొప్ప సాంఘిక సంస్థలలో భారతీయ కులవ్యవస్థ ఒకటి, అని మేము నమ్ముతాము. అసలు కులం అంటే నిజంగా ఏమిటో, పది లక్షలమందిలో ఒకడు కూడ అర్ధం చేసుకోరు.

వైబీరావుగాడిద వ్యాఖ్య

గొప్ప నమ్మకమే. భారతీయ కుల వ్యవస్థను భగవంతుడు ఇవ్వటం ఏమిటి? అసలు అతగాడు ఉంటే కదా ఇవ్వటానికి. ఉండెనుపో, భగవంతుడు కులవ్యవస్థను తయారుచేసి ఇవ్వాలనుకుంటే భారతీయులకే ఎందుకు ఇస్తాడు? అమెరికా వాడికి, ఇంగ్లాండు వాడికి, చైనా వాడికి ఎందుకు ఇవ్వడు? కులంపేరుతో భారతీయులు మాత్రమే తన్నుకు చావాలని, భగవంతుడిగారి కోరికనా? చాతుర్ వర్ణవ్యవస్థను తయారు చేసింది ఆర్యులు. వర్ణం అంటే రంగు. ఉత్తర యూరప్ నుండి వచ్చిన ఆర్యులకు రంగుపిచ్చి. వర్ణ సంకరం జరగకూడదు (భగవద్గీతలో అర్జునుడి భయం అదే), అంటే రంగులు కలగా పులగం కాకూడదు. ఆర్యుల ప్రకారం, బ్రాహ్మణులు తెలుపు. క్షత్రియులు ఎరుపు. వైశ్యులుపసుపు. శూద్రులు నలుపు. బ్రాహ్మణులు దేవుడి తలకాయలోంచి పుట్టారు. క్షత్రియులు రొమ్ముల్లోంచి పుట్టారు. వైశ్యులు తొడల్లోంచి పుట్టారు. శూద్రులు పాదాల్లోంచి పుట్టారు. తెలుపు, ఎరుపు, పసుపు రంగు గల ఆర్య స్త్రీలను, అనార్యులైన నలుపు, బ్రౌన్ భారతీయులు వివాహం చేసుకుంటే అది విలోమ వివాహం అవుతుంది, కాబట్టి నిషిధ్ధం. సంతానం చండాలురుగా తీర్మానించబడి గ్రామం వెలుపల నివాసం ఉండాలి. ఇలాగనీ ఆర్యుల ప్రాచీన గ్రంధాలన్ని గడగట్టి, భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ, మత్తవే దండము నెక్కి చాటుచుండగా, ఈవ్యవస్థ గొప్పది ఎలాగయ్యిందో స్వామివివేకానందగారికే తెలియాలి. ఆవ్యాసాన్ని ప్రచురించి హాన్స్ ఇండియా వారికి తెలియాలి.


Every individual is a centre for the manifestation of a certain force. This force has been stored up as the resultant of our previous works; and each one of us is born with the force at his back. This is the great truth which the Lord Sri Krishna, the revealer of the Gita, has tried to explain: and upon this great truth is established the Varnashrama system and the doctrine of Swadharma, etc., of the Hindu Religion.
ఒకానొక శక్తి సాకృతం కావటానికి ప్రతి వ్యక్తీ ఒక కేంద్రం. ఈశక్తి గతజన్మల కర్మల పోగైన ఫలితంగా (సంచిత కర్మలు అనచ్చేమో) స్టోర్ చేయబడింది. మనలో ప్రతి ఒక్కరూ మన వెనకాల ఈశక్తితో పుట్తాము . గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈగొప్ప సత్యాన్నే మనకు వివరించాలని ప్రయత్నించాడు. ఈగొప్ప సత్యం పైనే హిందూ మతం యొక్క వర్ణాశ్రమ వ్యవస్థ, స్వధర్మాచరణ సిధ్ధాంతం ఆధార పడి ఉన్నాయి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ఆహా , అర్ధం అయ్యింది, మనందరి వీపులమీదా, పూర్వజన్మల మూట ఉంటుందన్నమాట. పాశ్చాత్యుల వీపులమీద కూడ ఈమూట ఉంటుందా, లేక భారతీయుల వీపులమీది మాత్రమే, ఈమూట ఉంటుందా? గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈమూటను భారతీయుల వీపులపైనే పెట్టాటానికి ఎందుకు అవతరించాడు? యూరోపియన్ ల వీపులపై ఎందుకు పెట్టలేదు?
The basis of the lndia's social order is the caste law. I am born for the caste; I live for the caste. Born in the caste, the whole life must be lived according to caste regulation. In other words, in the present day, the Western man is born individualistic, while the Hindu is socialistic. Our castes and our institutions have been necessary to protect us as a nation. Each one of them is the embodiment of the experience of centuries.
భారత సాంఘిక వ్యవస్థ యొక్క పునాది కుల సిధ్ధాంతము. నేను కులము కొరకు పుట్టాను; నేను కులం కొరకు జీవిస్తాను. కులంలో పుట్టినందుకు, సకల జీవితం కులం యొక్కనియంత్రణలో జీవించబడాలి. మరో మాటలో చెప్పాలంటే, వర్తమాన ప్రపంచంలో పాశ్చాత్య మానవుడు వ్యక్తి కేంద్రంగా కలవాడు. హిందువు సామ్యవాది. మన కులాలు, మన సంస్థలు (వ్యవస్థలు?) మనల్ని ఒక జాతిగా రక్షించటానికి అవసరం. వాటిలో ప్రతి ఒకటీ, కొన్ని శతాబ్దాల అనుభవం యొక్క ప్రాపంచిక రూపమే.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

అర్ధం అయ్యింది స్వాములవారూ! మనల్ని ఒకజాతిగా రక్షించింది కులమే.
స్వాములవారి ఈ వ్యాసాన్ని అర్ధంచేసుకోటానికి ప్రయత్నించటం అంటే గొంగట్లో వెంట్రుకలు లెక్కపెట్టటమే అవుతుంది. అయినా ఆఖరుగా ఒక అంశాన్ని పరిశీలిద్దాము.
In Europe, it is everywhere victory to the strong and death to the weak. In the land of Bharata, every social rule is for the protection of the weak. Such is our ideal of caste, as meant for raising all humanity slowly and gently towards the realisation of that great Ideal of spiritual man, who Is non-resisting, calm, steady, worshipful, pure and meditative.
యూరప్ లో , ప్రతిచోటా విజయం బలవంతుడిదే, మరణం బలహీనుడిదే. భారతభూమిలో ప్రతి సాంఘికనియమం కూడ బలహీనుడి రక్షణకే. మన కుల ఆదర్శం ఎలాంటిదంటే, అది సకల మానవాళినీ నెమ్మదిగా, మృదువుగా ఆధ్యాత్మిక మానవుడి గొప్ప ఆదర్శ సాధనకు పైకెత్తి వేయటానికి ఉద్దేశించింది. ఆధ్యాత్మిక మానవుడు అడ్డుచెప్పకుండాఉండేవాడు (non-resisting), నిశ్చలంగా (calm), స్థిరంగా ఒడుదుడుకులు లేకుండా ఉండేవాడు (steady), పూజలు చేస్తూఉండేవాడు (లేదా పూజించే స్వభావంగలవాడు) (worshipful), స్వఛ్ఛతగలవాడు (pure), ధ్యానముద్రలో ఉండేవాడు (meditative). (ఈ ఆదర్శాలన్నీ సాధించటానికి సకల మానవాళినీ కులవ్యవస్థ లిఫ్ట్ చేస్తుందని స్వాములవారి భావం).

వైబీరావుగాడిద వ్యాఖ్య

పైకోటేషన్ లలో అనువాద లోపాలుంటే అవి నావే, పాఠకులు క్షమించాలి. కుల వ్యవస్థలో ఇంత లిఫ్టింగ్ గుణం ఉందని వివేకానందాగారు చక్కగా చెప్పినా, నాకు తెలియక పోటం నాదురదృష్టం. ఇంత గొప్పకుల వ్యవస్థ శూద్రుడైన శంబూకుడు తపస్సు చేస్తుంటే, ఆర్తత్రాణపరాయణుడైన శ్రీరామచంద్రుడు తలనరికి వేస్తే ఎందుకు రక్షించ లేక పోయింది. శంబూకుడు బలహీనుడు కాదా? ఇంత గొప్పకులవ్యవస్థను అమలుచేసిన ధర్మరాజు గారు, ముందుగా కుక్కలకు ఆహారాన్నివేసి, ఏమైనా మిగిలితే చండాలురపైకి విసిరివేసే వాడు. చండాలురు బలహీనులుకాదని భీష్ముడు, దర్మరాజుగారి అభిప్రాయమా? బలహీనులను భారతీయకులవ్యవస్థ రక్షించిన కథను ఒక్కటైనా హాన్స్ ఇండియా వారు ప్రచురిస్తే , వారు వివేకానందాగారి వ్యాసాన్ని ప్రచురించినందుకు మంచి సార్ధకత లభిస్తుంది.

113 Sending back

113 Resolution asking not to divide, is also expression of Assembly's Opinion. విభజన వద్దని తీర్మానించటం కూడ శాసనసభ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే.
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, శాసనసభ


కేంద్రం నుండి వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు సవాలక్ష లోపాలతో కూడి ఉన్నది. ఆలోపాలను సవరించాలంటే, శాసనసభకు చర్చకే ఐదేళ్లు పట్తుంది. ఆబిల్లు తన లక్ష్యాలనే చెప్పలేదు. ఆర్ధికాంశాలను స్పష్టీకరించలేదు. డీమ్ డ్ టుబీ deemed to be అనే రాక్షస క్లాజ్ ఉంది. నిధులన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాదు అభివృధ్ధికి ఖర్చుచేశాయి. ఇప్పుడు అప్పులేమో జనాభా నిష్పత్తిలో పంచుకోవాలిట. హైదరాబాద్ అభివృధ్ధికై చేయబడిన అప్పును, చీపురుపల్లె వాసులు, రాయదుర్గం వాసులు, నల్లమలకొండల్లో నివసించే చెంచు ప్రజలు ఎందుకు నెత్తినేసుకోవాలి? విభజన కేంద్రం కోరికపై జరుగుతున్నది. సీమాంధ్ర ప్రజలు కోరటంలేదు. అలాటప్పుడు రాజధాని నిర్మాణఖర్చును కేంద్రం భరించాలి. కానీ కేంద్రం ఎంత కేటాయించబోతుందో, బిల్లులో ఏర్పాట్లు ఏవి? పది సంవత్సరాలు (2004 to 2014) నిద్రపోయి, ఆఖరు క్షణంలో తయారు చేసిన బిల్లులో అన్నీ లోపాలే.

ఏఅంశం గురించైనా శాసనసభ చర్చించకపోతే, దానిని చర్చించినట్లుగా భావిస్తారట. ఇంతకన్నా వేరే అన్యాయం వేరొకటి ఉంటుందా? సభలో గందరగోళం చెలరేగి చర్చ జరగకుండా వాయిదాలు పడినప్పుడు దానిలో ఆ గలాటాలో పాల్గొనని సభ్యుల తప్పేమి ఉంటుంది?

లోక్ సభలో కూడ ఈసమస్య

లోక్ సభలో కూడ ఈసమస్యఉంది. ఏచర్చలేకుండా వేలకోట్లరూపాయల కేటాయింపుల బిల్లులు గిలోటిన్ అవుతూ ఉంటాయి. అంటే ఆమోదించినట్లుగా భావించబడుతూ పాసయి పోతూ ఉంటాయి. కొన్ని సార్లు సరియైన చర్చ లేకుండానే, సభ్యులు మూజువాణీ వోటుతో బిల్లులని పాస్ చేస్తూ ఉంటారు.

బిల్లును వెనక్కు పంపాలని శ్రీమతి విజయమ్మ గారు చేసిన డిమాండు

బిల్లును వెనక్కు పంపాలని శ్రీమతి విజయమ్మ గారు చేసిన డిమాండులో తప్పున్నట్లుగా తోచదు. బిల్లు కాపీలు అందరికి చేరి, సభ్యులు ఇప్పటికే దానిని ఇళ్ళవద్ద చదివి ఉన్నప్పుడు, అది చర్చించటానికి అనర్హం, తిప్పి పంపటమే సరియైనది, అని మెజారిటీ సభ్యులు భావించనపుడు, ఎవరైనా ఒక సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, చర్చించి గానీ, చర్చించకుండా గానీ (విషయాన్ని అంతా ఇప్పటికే బయట చీల్చి చెండాడటం జరిగింది కాబట్టి), బిల్లునుతిప్పి పంపిస్తూ తీర్మానం చేస్తే, స్పీకర్ కు దానిని తిప్పి పంపవలసిన బాధ్యత ఉంటుంది. తీర్మానం ఓడిపోతే చర్చ ఎలాగో ఉంటుంది.

కేంద్రం మొండితనం

రాజకీయ స్వార్ధ కారణాల వల్ల కేంద్రంలోని అధికార పార్టీ, ముఖ్య ప్రతిపక్ష పార్టీ, రెండూ తెలంగాణను ఏకపక్షంగా ఇచ్చేసి కెసీఆర్ అనుగ్రహం పొందాలనే ఆరాటంతో ఉన్నాయి. సభ బిల్లును చర్చించినా, చర్చించక పోయినా, తిప్పి పంపినా పంపకపోయినా కేంద్రమంత్రివర్గం, రాష్ట్రపతి సోనియా మొండి నిర్ణయాన్ని అమలు పరిచి తీరుతారు. శాసనసభలో చర్చకు బిల్లును పంపటం అనేది ఒకనటన. శాసనసభపై గౌరవం ఉంచిచేస్తున్న పనికాదు. డీమ్ డ్ టుబీ క్లాజే దీనికి నిదర్శనం. రాష్ట్రపతికి కూడ తన కుమారుడికి బెంగాల్లో, కుమార్తెకు గెలిచేచోటా కాంగ్రెస్ టికెట్లు కావాలి. అందుకని ఆయనకూడ చిన్న చిన్న అభ్యంతరాలను చెప్తాడే తప్ప రాష్ట్రంలోని ఉభయపక్షాలకు న్యాయం చేయాలనే తపనను చూపడు. బ్రిటీష్ రాణికి వలెనే, మనరాష్ట్రపతి పాత్ర కూడ రబ్బర్ స్టాంపు పాత్రే. హంగ్ పార్లమెంట్ ఏర్పడ్డప్పుడే ఆయనకు కొంత విలువ తాత్కాలికంగా వస్తుంది.

దురదృష్టవశాత్తు ఈవిషయంలో, సుప్రీంకోర్టు ధోరణికూడ విచిత్రంగా ఉన్నది. అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగాకనిపిస్తున్నప్పుడు, అన్యాయాన్ని సరిదిద్దటానికి ముందుగా చర్యలు ఆదేశించటంపోయి, జరిగింతరువాత రండి, అన్యాయం జరిగిందో లేదో అప్పుడు చూస్తాం అనటం సమంజసంగా నా గాడిద బుర్రకు తోచటంలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసాక, మళ్ళీ వాటిని అతికించటం ఎలాజరుగుతుంది. మానభంగం జరగబోతున్నదని ముందుగా సూచనలు కనిపిస్తున్నప్పుడు, అయిన తరువాత రండి, అప్పడు మానభంగం జరిగినట్లు ఋజువు చేసుకోండి, అంటే పోయిన మానం రాదు కదా. జరగబోయే నష్టం కొన్నిసార్లు irretrievable injustice (పునరుధ్ధరించటానికి వీలు కాని అన్యాయం) అవ్వచ్చు. అప్పుడు కూడ ముందు దిద్దుబాటు ఆదేశాలు ఇవ్వకపోటం న్యాయమా?

రాష్ట్ర ప్రజలు కోల్పోతున్న సువర్ణావకాశం

ఎలాగో విభజన తప్పనప్పుడు, సీమాంధ్రను మూడు రాష్ట్రాలుగా విభజన చేయాలనే తీర్మానాన్ని చేసి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలను సాధించుకోటం, మేలు. ఇది భవిష్యత్ లో రాబోయే పలు సమస్యలను రాకుండా చేస్తుంది. మూడు రాష్ట్రాల వల్ల కొన్ని కొత్త సమస్యలు వచ్చినా, ముందు రవాణా సమస్య పరిష్కారమౌతుంది. ప్రజలకు రాజధానులు అందుబాటిలోకి వస్తాయి. ముగ్గురికి మూడు హైకోర్టులు సాధించుకోవాలి. మూడు రైల్వే జోన్లు సాధించుకోవాలి. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండ, అన్ని ప్రాంతాలు అభివృధ్ది చెందుతాయి.

తెలంగాణ మేధావుల ఉగ్రవాదం


క్షీణాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఉమ్మడి హైకోర్టు, హైదరాబాదులో పనిచేయాలని బిల్లులో తాత్కాలిక ఏర్పాట్లు ఉన్నాయి. దీనికే, విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు (గోవా లోకాయుక్త) మండి పడుతున్నారు. శ్రీవారు తాను ఎంతో బాధ్యతాయుతమైన ఉచ్చతర పదవిలో పని చేశానని, లోకాయుక్త వంటి ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో పని చేస్తున్నాని మర్చిపోతున్నారు. క్షీణాంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదులో ఉండటం సీమాంధ్ర ప్రజలకు సౌకర్యం కాదు. అది కొద్దికాలంలోనే దాని నిర్ణీతప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఈకొద్దిసమయంకూడ, శ్రీసుదర్శన్ రెడ్డిగారు సంయమనం చూపలేకపోటం దుఃఖకరమే.

శ్రీకోదండరాం


వీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. వీరికి కూడ క్షీణాంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు హైదరాబాదులో ఉండటం నచ్చటంలేదు. పేరు తెలంగాణ హైకోర్టు అనే ఉండాలిట. ఆహా!

కవితావేశమా, బెదిరింపా


కెసీఆర్ పుత్రిక కవిత అన్నారుట.
తెలంగాణ అంశాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిసారీ క్రికెట్‌ ఆటతో పోల్చుతున్నారు. ఆయన బ్యాట్‌ పడితే బంతులకు బదులు బాంబులు వేస్తాము.
గతంలో కరీంనగర్ ఎంపీ శ్రీపొన్నం ప్రభాకర్ కిరణ్ హెలీకాప్టర్ ను మావోయిస్టుల సహాయంతో పేల్చి వేస్తామని బెదిరించారు.

మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామని వేరే చెప్పనవసరంలేదు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |