Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Monday, November 25, 2013

074 Vivekananda's cigars-begging-demanding వివేకానంద చుట్టలు, బిచ్చాలు, బేరాలు,బెదిరింపులు, తిట్లు

దేవుడా! నాడబ్బులు ఎక్కడున్నాయ్! అని ఒక నల్ల బోండాం విచిత్రవేష స్వామి బాధ!

చర్చాంశాలు: వివేకానంద, సమాజం, ధూమపానం, దేశ చరిత్ర


స్టర్డీ గారు లండన్ లో సంస్కృత పండితులు. భారతీయ వేదాంతాన్ని ప్రేమించిన వాడు. వివేకానందగారు మొదటిసారు అమెరికాలో ఉండగా, ఆయనను ఇంగ్లండుకు ఆహ్వానించి, భోజన వసతి సౌకర్యాలు కల్పించి, రాజయోగ వంటి పుస్తకాల డ్రాఫ్టును స్వామీజీచేత వ్రాయించుకున్నవాడు. తరువాత స్వామీజీ యూరప్ లో ప్రముఖుల అతిథిగా సంచరించి, తిరిగి అమెరికా వెళ్ళక భారత్ కు మరలి వచ్చి , స్వదేశంలో ఘన సన్మానాలు పొందుతూ , విదేశీయులకు ఆతిథ్యం ఇస్తూ, ప్లేగు వ్యాధితులకు సేవాకార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, కొన్నాళ్ళు ఆనందంగా ఉంటున్న కాలంలో, మధుమేహం, ఇతర వ్యాధులు బయట పడ్డాయి. దేశంలో ప్లేగు భయం కూడ ఉంది. అందుకని మతప్రచారం నెపంతో, వైద్యం కొరకు తిరిగి అమెరికా వెళ్ళాడు.

స్వామీజీ ఇంగ్లండులో , అమెరికాలో, యూరప్ లో, తిరిగిన కాలంలో యోగా చేసిన వారు 150ఏళ్లు రోగాలు లేకుండా బ్రతుకుతారని చెప్పేవాడు. ఇక్కడేమో స్వామీజీకి 35ఏళ్ళకే జీవన శైలి రోగం పట్టుకొని చికిత్స కోసం మరల అమెరికా స్టీమర్ ఎక్కవలసి వచ్చింది.

దీనిని విదేశీయులు జీర్ణించుకోలేక పోయారు. 150ఏళ్లు రోగాలు లేకుండా బ్రతకాల్సిన హిందూ యోగికి 35ఏళ్ళకే రోగాలు రావట మేమిటని వారు విస్తుపోయారు. స్వామీజీ ఆహార విహారాలు, మద్యం, చుట్టపీకెలు మొ|| వాటిపై అనుమానాలు మొదలు అయ్యాయి. ఫలితంగా, స్టర్డీ గారు తన అనుమానాలకు వివరణకోరుతు స్వామీజీకి లేఖవ్రాసినట్లు , భావించ వచ్చు. నవంబరు 1899లో, స్వామీజీ అమెరికా రెండవ సందర్శన సమయంలో , స్టర్డీ గారికి వ్రాసిన జవాబు ఈ అనుమానాలకు తావిస్తున్నది. ఈజవాబు పూర్తి పాఠం ఇక్కడ పెట్టటం కుదరదు. కానీ ప్రతి భారతీయుడు, ముఖ్యంగా వివేకానంద భక్తులైన ప్రతి తెలుగు వాడూ, చదివి తీర వలసిన లేఖ ఇది.

తన ఇంటిలోనే ఆతిథ్యమిచ్చి, తనభార్య చేత మూడు పూటలా భోజనాలు పెట్టించిన స్టర్డీకి లభించిన ప్రతిఫలం ఇది.
"...I remember your place at Reading, where I was fed with boiled cabbage and potatoes and boiled rice and boiled lentils, three times a day, with your wife's curses for sauce all the time. I do not remember your giving me any cigar to smoke — shilling or penny ones. Nor do I remember myself as complaining of either the food or your wife's incessant curses, though I lived as a thief, shaking through fear all the time, and working every day for you. ... "

సుమారు తెలుగు అనువాదం: ... రీడింగ్ లో మీ ఇంటి వద్ద నేను ఉన్న సమయంలో, నాకు గుర్తుకు ఉన్నంత వరకు, నేను ఉడికించిన క్యాబేజీ, బంగాళదుంపలు, పప్పు, రోజుకు మూడు సార్లు వడ్డింప బడ్డాను. దాంతో పాటు, అన్ని వేళల్లో కూడ, మీ ఆవిడ సాస్ (నంజుడు వంటి ఆధరువు) వడ్డిస్తూ , తిట్లను కూడ వడ్డించేది. మీరు షిల్లింగ్ చుట్టలను కానీ, పెన్నీ చుట్టలను కానీ నాకు ఇచ్చినట్లుగా గుర్తుకు రావటం లేదు. మీఇంట్లో ఉన్న సమయంలో నేను, దొంగలాగా నిరంతరం వణుకుతూ, ప్రతిరోజూ మీ కోసం పని చేస్తూ బ్రతికాను. మీఆవిడ తిట్ల దండకాన్ని గురించి కానీ, ఆహారాన్ని గురించి కానీ నేను మీకు ఫిర్యాదు చేసినట్లు నాకు గుర్తుకు రావటం లేదు. ...


అదే నవంబర్ 1899 స్వామీజీ , స్టర్డీగారికి వ్రాసిన ఉత్తరంలో:
"...I remember Mrs. Sturdy giving me a dinner and a night's lodging in her place, and then the next day criticising the black savage — so dirty and smoking all over the house. ..."

సుమారు తెలుగు అనువాదం: ...మిసెస్ స్టర్డీగారు (వివరణ: మీ భార్య) నాకు రాత్రి డిన్నర్ పెట్టి, పడక ఏర్పాటు చేసి, మర్నాడు ప్రొద్దుననే నన్ను నల్ల జంగిలీ - ఇల్లంతా పొగతో నింపేసిన మురికిగాడు అని తిట్టిన తిట్లను నేను మరచి పోలేను. ...


వైబీరావు గాడిద వ్యాఖ్య: శ్వేత జాతి స్త్రీలకు నల్లజాతి సన్యాసులపై ఏహ్యభావం ఉంటే ఉండచ్చు. అది వారిఅనువంశిక జబ్బు. అదే సమయంలో ఒక హిందూ సన్యాసి ఎంతో ఇంద్రియనిగ్రహంతో, ఆదర్శప్రాయంగా మెలగ వలసిన వాడు, ఆతిథ్యదాత ఇల్లంతా పొగతో నింపి వేయచ్చా?
వివేకానంద సంపూర్ణ రచనలు, సంపుటం 7, సంభాషణలు-డైలాగులు, 33 మతం-నాగరికత-మహిమలు , లాసట్టి అకాడమీ, మెంఫిజ్, అమెరికా లో ప్రసంగం యొక్క రిపోర్ట్. Complete-Works / Volume 7 / Conversations and Dialogues / CONVERSATIONS AND DIALOGUE XXXIII , RELIGION, CIVILISATION, AND MIRACLES, (The Appeal-Avalanche) నుండి.
...There was a touch of pathos in the speaker's voice and a murmur of sympathy ran around the group of listeners. Kananda (American reporters generally spelt his name as Vive Kananda in those days.) knocked the ashes from his cigar and was silent for a space....

సుమారు తెలుగు అనువాదం : ఉపన్యాసకుడి గొంతు రుధ్ధమయ్యింది. కొందరు శ్రోతల్లో సానుభూతితో కూడిన గుసగుస ఉన్నది. కానంద (అమెరికన్లు వివేకానంద పేరును ఆకాలంలో ఉచ్చరించే తీరు) తన చుట్టనుండి బూడిదను దులుపుకున్నారు. కొంత తడవు (space ను స్థలం గా అనువదించటం అర్థవంతం కాకపోవచ్చు.) మౌనంగా ఉన్నారు.


వైబీరావు గాడిద వ్యాఖ్య: ఉపన్యాసాలు ఇచ్చే సమయంలో కూడ, స్వామీజీ చుట్టలను పీకేవాడు అని అర్ధం అవుతుంది. బహిరంగ స్థలాల్లో, హిందూ సన్యాసులు బోధనలు చేసేటప్పుడు ప్రవర్తించ వలసిన విధం అదేనా?


C/O GEORGE W. HALE, ESQ., 541 DEARBORN AVENUE, CHICAGO,(Beginning of?) 1894,స్వామి రామకృష్ణానందకి వ్రాసిన లేఖలో.
Here a cigar costs one rupee. Once you get into a cab, you have to pay three rupees, a coat costs a hundred rupees; the hotel charge is nine rupees a day.

ఇక్కడ ఒక చుట్ట రూపాయి ఖరీదు చేస్తుంది. గుర్రపు బండి కిరాయి 3 రూపాయలు. కోటు వంద రూపాయలు. హోటల్ లో రోజుకు తొమ్మిది రూపాయలు.


వైబీరావు గాడిద వ్యాఖ్య. హోటల్ కిరాయిలో తొమ్మిదోవంతు, చుట్ట ఖర్చు. కొంత అధికమే.

అలసింగకు (మదరాసులో వివేకానంద శిష్యుడు, అమెరికా వెళ్ళటానికి డబ్బులు ఇచ్చిన వాడు) వ్రాసిన లేఖ. (కొందరికి స్వామీజీ ఖాళీజేబుతో అమెరికా వెళ్ళాడనే అభిప్రాయం ఉంది. సరికాదు).
You remember, you gave me £170 in notes and £9 in cash. It has come down to £130 in all!! On an average it costs me £1 every day; a cigar costs eight annas of our money.

నీవు నాకు 170 పౌండ్లు ఇచ్చిన సంగతి నీకు గుర్తు ఉండి ఉంటుంది. అది ఇప్పుడు 130 పౌండ్లకు పడి పోయింది. నాకు రోజుకు సుమారు ఒక పౌండు ఖర్చవుతుంది. ఒక చుట్ట 8 అణాలు, మన డబ్బుల్లో.


వైబీరావు గాడిద వ్యాఖ్య: తరువాత స్వామీజీ, ఇంకొక లేఖలో అలసింగను, ఇంకా డబ్బులు పంపించమని గద్దించటం చుట్టల్లెఖ్ఖల్లో అంచనా వేయచ్చు. డబ్బు లన్నీ చుట్టలకి, హోటళ్ళకి, కోట్లకీ, ఖర్చయి ఉంటాయి. ధనిక స్త్రీలకు బోధన కదా మరి.


27-12-1899 లాస్ ఏంజలిస్ నుండి మేరీ హేల్ కు వ్రాసిన లేఖలో.
...the person healing me insisted on my smoking! So I am having my pipe nicely and am all the better for it. In plain English the nervousness etc. was all due to dyspepsia and nothing more. ...

...నాకు వైద్యం చేస్తున్న వ్యక్తి నేను పొగత్రాగాలని గట్టిగా నొక్కిచెప్పాడు. కనుక నేను పైపు ను చక్కగా పీలుస్తున్నాను. అందువల్ల మెరుగుగా ఉన్నాను. ప్లెయిన్ ఇంగ్లీషులో చెప్పాలంటే, నెర్వస్ నెస్ మొ|| కేవలం అజీర్ణం వల్లనే. అంతకన్నా ఎక్కువ లేదు....



వైబీరావు గాడిద వ్యాఖ్య: రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అయ్యింది!


స్వామీజీ 16-3-1899 నాడు బేలూరు మఠం నుండి అమెరికాలోని మేరీ హేల్ కి వ్రాసిన లేఖలో ఒక భాగం చూడండి. ఇందులో స్వామీజీ మేరీహేల్ ను డబ్బుల కొరకు అడుగుతున్నారు. హాస్యం చేస్తున్నట్లు కనిపించినా పరోక్షంగా డబ్బులకొరకు దేవిరించటం కనిపిస్తుంది.


...By the by, Mary, I heard a few months ago, when I was rather worrying over your long silence, that you were just hooking a "Willy", and so busy with your dances and parties; that explained of course your inability to write. But "Willy" or no "Willy", I must have my money, don't forget. Harriet is discreetly silent since she got her boy; but where is my money, please? Remind her and her husband of it. If she is Woolley, I am greasy Bengali, as the English call us here — Lord, where is my money?

I have got a monastery on the Ganga now, after all, thanks to American and English friends. Tell Mother to look sharp. I am going to deluge your Yankee land with idolatrous missionaries.

Tell Mr. Woolley he got the sister but has not paid the brother yet. Moreover, it was the fat black queerly dressed apparition smoking in the parlour that frightened many a temptation away, and that was one of the causes which secured Harriet to Mr. Woolley; therefore, I want to be paid for my great share in the work etc., etc. Plead strong, will you?

సుమారు తెలుగు అనువాదం: ఈసందర్భంగా, మేరీ, నేను కొద్ది నెలలక్రితం విన్నాను. ఆసమయంలో నీ దీర్ఘకాల నిశ్శబ్దం (వివరణ: ఆమెనుండి ఉత్తరాలు రాలేదు) గురించి ఆదుర్దా పడుతున్న సమయంలో, నీవు ఒక 'విల్లీ' కొరకు గాలం వేస్తున్నావని విన్నాను(హుక్ = అనువాద వివరణ: వధువులు వరుల కొరకు ప్రయత్నించటం. ఆకాలంలో అమెరికా లో ఆచారం. విల్లీ అనేది వరుడి పేరు. Willies అయి ఉండవచ్చు.) అందుకని నీవు నీ నాట్యాలు, విందులతో తీరికలేకుండా ఉండి ఉంటావు. అది నీవు నాకు లేఖ వ్రాయలేక పోటాన్ని వివరిస్తుంది. కానీ విల్లీ అవనీ, విల్లీ కాకపోనీ ( విల్లీతో పెళ్ళి కుదిరినా కుదరక పోయినా అని భావం) నా డబ్బులు నాకు రావాలని మర్చి పోకు. హారియట్ [(వివరణ: ఇంకో యువతి. హేల్ చెల్లెలు కావచ్చు.)] తెలివిగా మౌనం వహించింది. ఎందుకంటే ఆమె బాయ్ (భర్త లేక వరుడు) ఆమెకు లభించాడుగా, (వివరణ: నాతో పని అయి పోయింది అని భావం). కానీ నా డబ్బులు ఎక్కడ ఉన్నాయ్ , దయయుంచి చెప్పండి.(వివరణ: హారియట్ కు భర్త లభించినందుకు నాకు రావలసిన ప్రతిఫలం రాలేదు అని భావం). ఆమెను, ఆమె భర్తను దాని గురించి గుర్తు చేయండి. ఆమె వూలీ అయితే, ఇంగ్లీషువాళ్ళు మమ్మల్ని అన్నట్లుగా నేను, గ్రీజీ (జిడ్డు) బెంగాలీని. దేవుడా నా డబ్బులు ఎక్కడున్నాయ్?

చివరికి నా అమెరికన్ మరియు ఆంగ్ల స్నేహితుల వల్ల నాకు గంగాతీరంలో ఒక మఠం లభించింది. అమ్మకు ఇంకా చురుకుగా చూడమని చెప్పండి. (వివరణ: ఇక్కడ అమ్మ అంటే మేరీ హేల్ గారి తల్లి). మీ యాంకీదేశాన్ని విగ్రహారాధక మతప్రచారకులతో ముంచెత్త బోతున్నాను. (వివరణ: నా డబ్బులు నాకివ్వకపోతే ఇంకా సన్యాసులను పంపుతానని భావం).

మిస్టర్ వూలీగారికి చెప్పండి, మీకు సిస్టర్ లభించింది, కానీ బ్రదర్ కి డబ్బులు చెల్లించలేదు.

Moreover, it was the fat black queerly dressed apparition smoking in the parlour that frightened many a temptation away, and that was one of the causes which secured Harriet to Mr. Woolley; therefore, I want to be paid for my great share in the work etc., etc. Plead strong, will you?

ఇవి చాలా కీలకమైన వాక్యాలు. వీటిని సమర్ధవంతంగా అనువదించే శక్తి నాకు లేదు. ప్రయిత్నిస్తాను. 'పైగా,లావు-నల్లని-విచిత్రంవేషధారి పొగత్రాగుతూ హాల్లో నిల్చుని ఆకర్షణలను భయపెట్టటం పారద్రోలటం , హారియట్ కు మిస్టర్ వూలీ భద్రంగా లభించటానికి కారణాల్లో ఒకటి. కాబట్టి జరిగిన పనిలో, నాగొప్పవాటా మొ|| మొ|| కి నాకుచెల్లింపు జరగవలసినదే. (మేరీ) నాతరఫున నీవు గట్టిగా వాదిస్తావా?


వైబీరావు గాడిద అదనం వ్యాఖ్య: ఇక్కడ వివేకానంద తనను తానే కించ పరచుకుంటున్నాడు. విచిత్ర వేషం అంటే కాషాయ బట్టలు, వీపుపై వేళ్ళాడే తలపాగా, నడుముకి కాషాయ బెల్ట్. నల్ల బోండాం తనే. చుట్ట పీకుడు తనే. డబ్బులెందుకు రావాలి? హారియట్ కు, మేరీకి వరుణ్ణి చూసినందుకు.

2. ఆకాలంలో అమెరికన్ ధనిక యువతులకు, మధ్యతరగతి యువతులకు, వరాన్వేషణ చాలా సమస్యగా ఉండేది. కొరికలకు తగ్గవాడు రావాలిగా. స్వామీజీ అమెరికన్ యువతుల, ఆడపిల్లల తల్లుల ఈ అవసరాన్ని చక్కగా అర్ధంచేసుకున్నాడు. వారికి క్రీస్తుతో పనికాలేదో ఏమో, హిందూ సన్యాసులకు ఏవో దివ్య శక్తులు ఉంటాయని విన్నారో ఏమో, స్వామీజీని ఆశ్రయించినట్లు కనిపిస్తుంది. అందుకే స్వామీజీ, హాస్యంగానే కావచ్చు, డబ్బులు ఏదో బాకీ ఉన్నట్లుగా డిమాండు చేస్తున్నారు. చుట్ట పీకె నల్లబోండాం విచిత్ర వేష స్వామీ ఎంత పని చేశావు?

చివరకి ఈ డబ్బులు స్వామీజీ కన్ను మూయక ముందు వచ్చినట్లు లేవు.

73 Was Swami Vivekananda an addict of cigars? స్వామీ వివేకానంద చుట్టపీకెల రాయుడా? Part 1



చర్చాంశాలు: స్వామి వివేకానంద, సమాజం, ధూమపానం

చికాగో సర్వమతమహాసభకు హాజరైన భారతీయుల చిత్రం. మధ్యలో వ్యక్తే స్వామి వివేకానంద..

వివేకానందగారి గురించి మొదటిసారి వ్రాస్తున్నాం కాబట్టి, ఉపోద్ఘాతం introduction



స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను (Complete Works of Swami Vivekananda) అధికారికంగా శ్రీరామకృష్ణ మఠం వారు ప్రచురించారు. పలువురు ఇతరులు కూడ ప్రచురించారు. ఇది కాక, అంతర్జాలంలో కూడ శ్రీరామకృష్ణ మఠం వారి అధికారిక వెబ్ సైట్లలో ఇవ లభ్యంఅవుతున్నాయి. ఇవకాక రెండు మూడు లక్షల వ్యక్తులు కూడ, స్వామీ వివేకానంద సూక్తులను భారీగానే ఇంటర్నెట్లో ప్రపంచ ప్రజల కొరకు ఉంచారు. చదివిన వారు ఎంతో ప్రభావితం అవుతున్నారు. సంతోషమే.

కేంద్రప్రభుత్వం, పలు రాష్ట్రప్రభుత్వాలు, ఈ సంవత్సరాన్ని వివేకానంద 150వ జయంతిగా పండుగలు చేసుకుంటున్నాయి. రూ. 1500 కోట్లనుండి రూ. 2000కోట్లదాకా వ్యయం చేస్తున్నారు. టీషర్టులపై స్వామి వివేకానంద చిత్రాలను ముద్రించి కళాశాలల్లో పంచి పెట్తున్నారు. పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తున్నారు. స్వామీ వివేకానందగారిని యువకులకు రోల్ మాడెల్ (నమూనా ఆదర్శ పురుషుడు)గా పరిచయం చేస్తూ, ఆయన లాగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

ప్రబోధించేవారిలో రాష్ట్రపతి, ప్రధాని, వంటి నేతలే కాక, న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఎఎస్ అధికారులు కూడ ఉంటున్నారు. వీరిలో ఎంత మంది శ్రీ స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను కూలంకషంగా చదివారో నేను చెప్పలేను. ఇళ్ళల్లో బీరువాల్లో అందంగా పేర్చుకునేవాళ్ళు కూడా ఉన్నారు.

ఈ సందర్బంగా మనం స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలలో (Complete Works of Swami Vivekananda) కొన్నటినైనా లోతుగా పరిశీలించి 'టంగుటూరు మిరియాలు నిజంగానే తాటికాయలంత ఉంటాయా' లేక మామూలు గానే ఉంటాయా తెలుసుకోటం తప్పుకాదనుకుంటాను.

స్వామీ వివేకానంద గారి రచనల్లో ఎపిజిల్స్ epistles(లేఖలు) ముఖ్యమైనవి. శ్రీవారు విదేశీయులకు, ముఖ్యంగా విదేశీ స్త్రీలకు వ్రాసినవి ఉన్నాయి. స్వదేశీయులకు వ్రాసినవీ ఉన్నాయి. స్వదేశీయులకు వ్రాసిన వాటిల్లో ,స్త్రీలకు వ్రాసినవి తక్కువ.

లేఖల్లో కొన్ని కీలకమైన ప్రదేశాల్లో కత్తిరింపులకు గురియైనాయి. అది కాక స్వామీ వివేకానంద గారు ఇతరులకు వ్రాసిన లేఖలే కాక స్వామి వారికి ఇతరులు వ్రాసిన లేఖలు ప్రచురించబడలేదు. పూర్తి వాస్తవ చిత్రం దృశ్యమానం అవ్వాలంటే, inbox లోపలికి-పెట్టె, outbox బయటికి పెట్టె రెండు ఉండాలి. inbox లోపలికి-పెట్టె ఉత్తరాలు ఎక్కడో నేలమాళిగల్లో మూలుగుతూ ఉండ వచ్చు. అవి ఇంక బయటికి వస్తాయని అనుకోలేము. లభ్యమైనవాటిని పరిశీలించి మనం కొంతవరకైనా సత్యాన్ని అన్వేషించ గలగాలి.

సన్యాసులను మనం ప్రాథమికంగా రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు.
1. పీఠాధిపతులు, జగద్గురువులు, పరమహంసలు, శంకరాచార్యలు, సరస్వతులు, భారతులు, మొ|| వీరు ప్రాథమికంగా స్థిర నివాసులు. చాతుర్మాస్యం అంటూ అప్పుడప్పుడూ క్యాంపులు నడిపినా, మౌలికంగా వీరు స్థిర నివాసులు.
2. చర సన్యాసులు. వీరిని కొందరు బైరాగులు అంటారు. ఆంగ్లంలో mendicants అనచ్చు.

పీఠాధిపతులకు స్థిరాదాయం, వివిధపేర్లతో నెపాలతో ప్రభుత్వ గ్రాంట్లు , ప్రజల ముఖ్యంగా వ్యాపారుల విరాళాలు, విదేశీ విరాళాలు, వద్దంటే డబ్బు లాగా వచ్చి పడుతు ఉంటాయి.

బైరాగులకు భిక్షాటనయే దిక్కు. పట్టెడన్నం దొరకటమే గొప్ప. ఈ పట్టెడన్నం కొరకే వారు పాపం నెత్తికి శాయిబాబాలాగా గుడ్డ చుట్టుకోటం, ఆయనను అనుకరించటం, నేడు జరుగుతున్నది. సత్రాల్లో, మఠాల్లో, ఫుట్ పాత్ లపై, గుడిమెట్లపై పండుకోటం, వాన,ఎండ,చలి, వంటి వాటిని తట్టుకోటం కోసం అనుకోండి, రకరకాల వ్యక్తులతో కలిసి తిరగవలసిరావటం వల్ల అనుకోండి, చుట్టలు, గంజాయి వంటి దురలవాట్లు అంటుకుంటాయి. ఈవిషయంలో వారిని పెద్దగా తప్పు పట్ట వలసిన అవసరం లేదు.

పీఠాధిపత్య సన్యాసుల్లో మనకి ఇంజనీర్లు, డాక్టర్లు, వంటి విద్యాధికులు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే స్కూల్ , కాలేజీ డ్రాప్ అవుట్ లే ఎక్కువ.

పీఠాధిపత్య సన్యాసుల్లో అహంభావం జాస్తి. పలువురు తాము బోధించటానికే పుట్టాము అనుకుంటూ ఉంటారు. సమాజం తమ కాళ్ళకు మొక్కాలి అనుకుంటారు. దేశనేతల చేతనైనా సరే, న్యాయాధీశులచేత నైనా సరే మ్రొక్కించు కుకోటానికి వెనుకాడరు.

ఇవన్ని తరువాత లోతుగా కవర్ చేసుకుందాము.

స్వామీ వివేకానంద గారి చుట్టలు



పీఠాధిపత్య సన్యాసులు, ముఖ్యంగా 120కోట్ల భారతీయులను పైకెత్తి లేపిన వాడుగా కీర్తించబడే శ్రీ స్వామీ వివేకానంద గారికి దురలవాట్లు ఉండకూడదని మనం ఆశించటం తప్పా? సన్యాసులకు, తప్పనిసరిగా ఉండాల్సిన గుణం ఇంద్రియ నిగ్రహం. సన్యాసి అంటే ఇంద్రియజిత్ లేక జితేంద్ర క్రింద లెక్క.

చుట్టపీకెలు చిన్న అలవాటే కావచ్చు. కానీ చుట్టపీకెల వంటి చిన్న అలవాటునే వదిలించుకో లేని వారు, జాతికి మార్గ దర్శకత్వం ఎలా వహించ కలుగుతారు?

శ్రీ స్వామీ వివేకానంద గారు త్వరగా అంటే 39 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. మధుమేహం (షుగర్ వ్యాధి) ముఖ్య కారణంగా చెప్పబడ్డా ఇతర జబ్బులు కూడ, చాలానే ఉన్నాయి. ఈజబ్బులు రావటానికీ, విషమించటానికీ, తొందరగా 39 ఏళ్లకే స్వర్గస్థులవటానికీ , చుట్టపీకెలు కూడా కారణభూతమని మనం ఎందుకు అనుకోకూడదు?

సాక్ష్యాలు, ఋజువులు, మిగిలింది రాబోయే పోస్టుల్లో.

072 అర్జునుడు పాతచీరెలు అమ్ముకునేవాడా? Was Arjuna a rag seller?




చర్చాంశాలు:

వ్యాస భారతం, మహాభారతం, తిక్కన, నర్తనశాల, mahabharata, పద్యకవిత్వం

1963లో విడుదలైన, నర్తనశాల సినిమా చూచిన వారికి గుర్తు ఉంటుంది. ధర్మరాజు మిక్కిలినేని, కంకుభట్టు వేషంలో విరటుడి ఆస్థానంలో రాజుతో జూదం ఆడుతూ ఉండేవాడు.

దండమూడి రాజగోపాలరావు భీముడిగా నటించాడు. విరాట పర్వ అజ్ఞాతవాసంలో పేరు వలలుడు. విరటుడి దగ్గర వంటవాడు.

అర్జునుడిగా ఎన్ టీ ఆర్. విరాట పర్వ అజ్ఞాతవాసంలో పేరు బృహన్నల. విరటుడి దగ్గర నాట్యాచార్యుడు.

విరాట పర్వం లో నకులుడి అజ్ఞాతవాసం పేరు దామగ్రంధి. విరటుడి గుర్రాలశాలకు అధిపతి. నటుడు కొమ్మినేని రాజగోపాలరావు.

విరాట పర్వం లో సహదేవుడి అజ్ఞాతవాసం పేరు తంత్రీపాలుడు. విరటుడి గోశాలకు అధిపతి.



విరాట పర్వం లో ద్రౌపది అజ్ఞాతవాసం పేరు సైరంధ్రి. నటి సావిత్రి.



కీచకుడిగా స్వర్గీయ ఎస్.వీ.రంగారావు. ఇండోనీషియన్లకు బాగా నచ్చాడు. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు గా గుర్తింపు పొందాడు. బృహన్నలగా ఎన్ టీ ఆర్ కు ఎందుకో గుర్తింపు దొరకలేదు.

ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం.



పాండవులు అజ్ఞాతవాసం చేసినపుడు జీతం సరిపోయేదా? విరటుడు, ధర్మరాజుని, బృహన్నలని తన సభలో మొదటిసారి చూసినపుడు, 'నా రాజ్యం మీకిచ్చేస్తాను. మీరు ఈభూమండలం మొత్తం పాలించటానికి అర్హులు. మీరు నారాజ్యాన్ని పాలిస్తూ, నారాజ్యాన్ని రక్షించండి'. అన్నాడు. మరి ఏమయ్యిందో ఏమో,జీతం ఎంత తక్కువ ఇచ్చాడో ఏమో, అసలు ఇచ్చాడో లేదో ఏమో, పాండవులు సాధారణ నౌకర్లలాగ ప్రవర్తించారు. తిక్కన కొంతవరకు పాండవులను, వ్యాసుడి కన్నా కొంత ఉదాత్తంగానే, ఉదారంగానే చిత్రించాడనాలి.

భీముడి విషయంలో కొద్దిగా వంకర కనిపిస్తుంది. వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు . అంటే ఏమిటి? విరటుడి వంటశాలలో మిగిలిన మాంసాన్ని అమ్మే బాధ్యతను విరటుడు భీముడికి అప్పగించినట్లున్నాడు. అసలు మిగిలిన మాంసాన్ని విరటుడు అమ్మమని చెప్పటమే అర్ధంలేదు. మన భీముడుగారు, అమ్మరా నాయనా అంటే, అమ్మే నెపంతో, కొంత భాగాన్ని సోదరులకు ఇచ్చేవాడుట. ధర్మరాజు దానిని ఎలా తిన్నాడో ఏమిటో. మామూలుగా మనకి ఇలాంటివి రెస్టారెట్లలో జరుగుతూ ఉంటాయి.
విరాట పర్వం, ద్వితీయాశ్వాసం, 2వ పద్యం.
వచనం. దేవా! వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబులఁ జులుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు
వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు .
వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు .
నకులుండు దురగంబుల గ్రాసంబులం గనిన ధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు .
సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన సమయంబున సముపార్జితంబులగు పదార్థంబులన్నియు నన్నలవశంబు చేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపుచుండు .
ద్రౌపది తన్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచును చితంపు నడవడి మెలుగుచుండు.


వ్యాసుడు. వ్యాసభారతం. విరాటపర్వం. 12వ ఆధ్యాయం శ్లోకాలు 5 నుండి 9 వరకు.
5 అజ్ఞాతం చ విరాటస్య విజిత్య వసు ధర్మరాజ
భ్రాతృభ్యః పురుషవ్యాఘ్రో యదార్హం సమ ర్పయచ్ఛతి
6 భీమసేనో ఽపి మాంసాని భక్ష్యాణి వివిధాని చ
అతి సృష్టాని మత్స్యేన విక్రీణాతి యుధిష్ఠిరే
7 వాసాంసి పరిజీర్ణాని లబ్ధాన్ అంతఃపురే ఽర్జునః
విక్రీణాన్ శ్చ సర్వేభ్యః పాండవేభ్యః ప్రయచ్ఛతి


వైబీరావు గాడిద వ్యాఖ్య.



విక్రీణాన్ అనే పదాన్ని చూడండి. లభించిన పాతచీరెలను (వాసాంసి పరిజీర్ణాని లబ్ధాన్ ) అమ్మటం, ఆడబ్బుని తన సోదరులకు ఇవ్వటాన్ని గమనించండి. మన అర్జునుడు గారికి ఉన్న పది నామాల్లో 'ధనంజయుడు'ఒకటి. రాజ్యాలపై దండెత్తి కొట్టుకొచ్చిన డబ్బు మధ్యలో నిల్చుంటాను కనుక తనకు ఆపేరు వచ్చిందని శ్రీవారే స్వయంగా చెప్పుకున్నారు. అలాంటి ఘనాఘన్ ధనంజయుడికి ఈ పాతచీరెలమ్ముకునే గతి ఏమిటి.

అందుకే తెనాలి రామకృష్ణ మహాకవి, శ్రీకృష్ణదేవరాయల సమ్ముఖంలో చెప్పిన చాటువు గుర్తుకు వస్తుంది.
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాల్పడి రకటా
సంజయా విధినేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.


8 సహదేవోఽపి గోపానాం వేషమ్ ఆస్తాయ పాండవః
దధి క్షీరం ఘృతం చైవ పాణ్డవేభ్యః ప్రయచ్ఛతి
9 నకులొ ఽపి ధనం లబ్ధ్వా కృతే కర్మణి వాజినామ్
తుష్టే తస్మిన్ నరపతౌ పాండవేభ్యః ప్రయచ్ఛతి
10 కృష్ణాపి సర్వాన్ భ్రాతౄంస తాన్ నిరీక్షంతీ తపస్వినీ
యదా పునర్ అవిజ్ఞాతా తదా చరతి భామినీ


పాపం అమాయకురాలు ద్రౌపది మటుకు తన ఐదుగురు భర్తలను జాగ్రత్తగా ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేది. ఐదుగురు భర్తలకు సేవలు చేయటం అంటే మాటలా? ఇది యజమానురాలు సుధేష్ణకు చేసే సేవకు అదనం.

సారాంశం ఏమిటి? పాఠకులే ధైర్యంగా చెప్పాలి.

Sunday, November 24, 2013

071 Tweets of our leaders మన నాయకుల ట్వీట్లు వారి పాట్లు


We know Yudhishthira, Nala, Balarama etc. as Great Gamblers. Those were our ancestors. But our today's leaders are Great Dhanamjayas (Those who conquer treasures and stand amidst the heaps).
ధర్మరాజు, నలుడు, బలరాముడు, మొ|| మన పురాణ కాలపు నేతలు జూదగాళ్ళు గా పరిచితులు. ఆధునిక నేతలు పలువురు ధనంజయులు. అంటే, జయించిన ధనం మధ్యలో నిలబడే వాళ్ళు. Prostrating before Temple Sacred Flag Posts, worshipping in Shiva Temples, Wearing ochre robes, Wearing skull caps and performing namaz in mosques, moving around with bibles in hands, are additional qualifications of our politicians. ధ్వజస్తంభాలకు మొక్కటం, శివాలయాల్లో పూజలు చేయటం, బుక్కాయ్ లు, కాషాయాలు ధరించటం , మెదడు టోపీలు ధరించి నమాజులు చేయటం , బైబిలు చేతిలో పెట్టుకొని తిరగటం, ఇవన్నీ అదనపు అలంకారాలు.

పోతన గారిలా సహజ పాండిత్య గరిమతో అలరారే నేతలలో మన విశ్రాంత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ గారు అగ్ర గణ్యులు. వారిచే రచించబడినుట్లుగా తోచుచున్న ఈ హిందీ కవితను చూడండి. https://twitter.com/AtalBVajpayee అనే ట్విట్టర్ అడ్రెస్ లో ఇది దొరికింది. ఇది నిజఝంగా శ్రీవారి ట్వీట్ అడ్రస్సో కాదో మనకు తెలీదు. దీన్ని మాన్యశ్రీ లాల్ కృష్ణ అద్వానీగారిది లాగా కనిపించే మరో ట్విట్టర్ అడ్రెస్ https://twitter.com/LKAdvaniBJP రీట్వీట్ చేసింది . కవిత చూస్తుంటే వాజ్ పేయీ గారిది వలెనే కనిపిస్తుంది.

సినీ నటులు, క్రికెటర్లు, నేతలు, వంటి సెలబ్రిటీ ల వెబ్ సైట్లు, బ్లాగ్ లు, ఫేస్ బుక్ లు, ట్విట్టర్లు, మొదలగు వాటికి సంబంధించి నంత వరకు, ఒక్కో పేరుపై స్వల్పభేదాలతో 1 నుండి 1౦౦ దాకా మనకి దర్శనమిస్తాయి. ఏవి అసలువో, ఏవి నకిలీవో కనిపెట్టటం కష్టం.

బిజెపి నేత రాజనాధ్ సింగ్ గారికి సంబంధించినంత వరకు https://twitter.com/BJPRajnathSingh సరియైనదిలాగా కనిపిస్తుంది. లోతుగా పరిశోథిస్తేగానీ తెలియదు.

శ్రీమతి సుష్మా స్వరాజ్. https://twitter.com/SushmaSwarajbjp కరెక్ట్ లాగా కనిపిస్తుంది. లోతుగా పరిశోథిస్తేగానీ తెలియదు.

వాజ్ పేయీ గారి కవితా ఝరి


कौरव कौन,
कौन पांडव,
टेढ़ा सवाल है|
दोनों ओर शकुनि
का फैला
कूटजाल है|
धर्मराज ने छोड़ी नहीं
जुए की लत है|

తెలుగు లిపిలో.
కౌరవ్ కౌన్
పాండవ్ కౌన్
టేఢా సవాల్ హై
దోనోం అవుర్ శకుని
కా ఫైలా
కూట్ జాల్ హై
ధర్మరాజ్ నే ఛోడీ నహీఁ
జూయే కీ లత్ హై.


తెలుగులో భావం:
కౌరవు లెవరు? పాండవు లెవరు? ఇది కఠిన ప్రశ్న. टेढ़ा మంచి పదం. ఎన్నో అర్ధాలున్నాయి. ఇక్కడ కఠినమైన tortuous ఎగుడుదిగుడులతో బాధ కలిగించే అనే అర్ధాన్ని తీసుకున్నాను. దోనోం అవుర్ శకుని కా ఫైలా కూట్ జాల్ హై అంటే ఇవి రెండు శకునిగారి చేత పరచబడ్డ కూటజాలములు (గారడీ). ధర్మరాజుగారు మటుకు తన జూద వ్యసనాన్ని మటుకు వదలలేదు.

తెలుగు సరిగా చదవి అర్ధం చేసుకో లేని వారి కొరకు,ఆంగ్లంలో: Who are kauravas? Who are Pandavas? This is a tortuous question. All this is wicked magic spread by Sakuni. YudhishThira has not abandoned his addiction to gambling with dice.

వాజ్ పేయీ గారి దృష్టిలో ఈ శకుని, ఈధర్మరాజు ఎవరో మనకు తెలియదు.

ఈట్వీట్ బయటకు వచ్చిన సమయం, సందర్భం: నరేంద్ర మోడీగారు భాజపా ప్రధాని మంత్రి అభ్యర్ధిగా ప్రకటించబడ్డ నేపథ్యం. ఇది ఆ పదవిపై ఆశ పెట్టుకున్న అద్వానీగారికి అశనిపాతం (పిడుగుపాటు) అయ్యింది. పై న ఇచ్చిన అద్వానీగారి ధృవీకరించ బడవలసి ఉన్న ట్విట్టర్ అడ్రెస్ లో శ్రీవారు చేసిన ట్వీట్లను బట్టి చూస్తే , వారు తీవ్ర నిరాశకు గురియైనట్లు కనిపిస్తుంది. ఒక ట్వీట్ లో వారు నరేంద్ర మోడీని అత్యంత విష సర్పంతో (venomous snake) పోల్చారు.
.

వాజ్ పేయీ గారిపై శ్రీఅద్వానీజీ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే పై ట్వీట్ ను ఎంచుకొని రీట్వీట్ చేసినట్లు కనిపిస్తుంది.
.

పత్రికల్లో, టీవీల్లో వచ్చిందానికన్నా, శ్రీఅద్వానీగారి నిరాశ ఫైలాన్ తుఫాన్ లాగ అతి తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది తీరం దాటాక నీరస పడ్డట్లుగా అద్వానీగారు కూడ నీరస పడి పోయి, మోడీ గారి ఇంద్రజాలంలోకి సాలెగూడు లోకి వచ్చి వేదికలపై చేతులు కలుపుతున్నారేమో అనిపిస్తుంది. తానే విషసర్పంగా ట్వీట్ చేసిన వారిని కౌగలించుకోవచ్చా?

పాఠకులు నాతో ఏకీభవించ వలసిన పని లేదు. మీ అభిప్రాయాలను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను.

ఇంకా ఉంది.

Friday, November 22, 2013

070 Like bifurcation, formation of AP in 1956 also appears to be some selfish design విభజన వలెనె 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కూడ స్వార్ధ రాజకీయాల వల్లనే జరిగిందా?




bifurcation, విభజన, రాష్ట్రచరిత్ర, ప్రకాశం, కులాలు

రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణా వాగ్దానం, 2004 లో అధికారం లోకి రావటానికి, గులాబీ కండువా కప్పుకున్న శ్రీమతి సోనియా గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కుట్ర అని అర్ధం అవుతుంది. ఆవాగ్దానాన్ని, అమ్మగారి గులాబి కండువాని పట్టించుకోకుండా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ధృతరాష్ట్రుల్లాగా కళ్ళు మూసుకోటం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలు నానా బాధలు పడుతున్నారు.

తన్నుకున్నది దుర్యోధనుడు, కర్ణుడు, ధర్మరాజు, భీమార్జునులే అయినా, 18 అక్షౌహిణీల సైన్యం , వేల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, ప్రాణాలు కోల్పోయాయి. లక్షలాది మంది స్త్రీలు విధవ లయ్యారు. గీతలో అర్జునుడు భయపడ్డట్లుగా వర్ణ సంకరం జరగలేదు కానీ, అతి భయంకర విధ్వంసం జరిగి ఉండాలి.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విభజన రాజకీయాలు కూడ, జన నష్టానికి, బస్సుల వంటి ప్రజల ఆస్థుల విధ్వంసానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు 1956లో ఏమి జరిగి ఈ కృత్రిమ జరాసంధుడి కాయంలాంటి అతుకులబొంతను తయారు చేశారు, అనే విషయాలు, కూడా పరీశీలనాంశాలే. విశాలాంధ్రలో తమకు సంక్షేమం ఉండదనే భయంతో, తెలంగాణా ప్రజలు గానీ, రాయలసీమ ప్రజలు కానీ ఉన్నప్పుడు, అసలు విశాలాంధ్రనే ఏర్పాటు చేయకూడదు.

కన్న తండ్రి లాగా పాలించే నిజాం ప్రభువు, జాగీర్ దారులు, దొరలు, పటేల్ పట్వారీలు, వారికి ఉండగా, ఆవునుండి దూడలను వేరు చేసినట్లుగా, సర్దార్ పటేల్ వారిని ఎందుకు విడతీశాడో ఏమిటో?

తెలంగాణా ప్రజలకు, నేతలకు, నిజాం బానిసత్వం కొనసాగుతున్నప్పుడు, బూర్గుల రామకృష్ణారావు వంటి త్యాగశీలురైన నేతలు, ఎందుకు తొందర పడ్డారో అర్ధం కావటంలేదు.

1953 నాటి కర్నూలు లో సౌకర్యాలు లేని మాట నిజమే అయినా కొద్ది కాలం ఓర్చుకుంటే, కొత్తరాజధానిని పట్టాలపైకి ఎక్కించటం సాధ్యమయ్యేదే.

ఆ ప్రయత్నం చేయకుండా, హైదరాబాదుకు ఉరకటంలో ప్రజాహితం కాకుండా, కులరాజకీయమేదో జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది.

షరతులతో కూడిన విలీన ఒప్పందాలు , కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలన్న సిధ్ధాంతానికి అనుగుణమైనవి.

మిగిలిన పెద్ద మనుషులు గూడు పుఠాణీ చేసుకొని, ఆచరణలో సాధ్యంకాని ఒప్పందాలు చేసుకొని , ఆపెద్దమనుషులు తమ ఆశలను తీర్చుకొని, తమ భయాలను వదిలించుకుంటే, నేటి ప్రజలు, నానా బాధలు పడటం ఎంతవరకు సమంజసం?

తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటారా, పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటారా? ముఖ్యమంత్రులు అటు పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేయకుండా, చట్టాలనీ అమలు చేయకుండా, నియంతలై పోయి, వేలకోట్ల ఆస్తులను సంపాదించుకొని తమ వారసులను బాగు చేసుకున్నారు. మరి ప్రజల సంగతి ఏమిటి?

1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రకాశంగారి పాత్ర ఎందుకు లేదో అర్ధం కాదు. ఆయనను మూలకూర్చోపెట్టి ముసలమ్మను చేశారా?

పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు పెట్టిన వారి పేర్లు:


తెలంగాణ తరఫున: బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జెబి నరసింగరావు.

ఆంధ్ర తరఫున: బెజవాడ గోపాల రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు.

పై పేర్లను గమనించినప్పుడు, ఈకాలం వలెనే, ఆకాలంలో కూడా, తెలంగాణ లో కులం నంబరు 1కి 50% వచ్చింది. ఆంధ్రాలో కూడ కులం నంబరు 1కి 50% వచ్చింది.


నీలం సంజీవ రెడ్డి జాతీయ స్థాయిలోకూడ, గ్రూపు రాజకీయాలకు పేరొందిన వాడు. ఆంధ్ర ప్రదేశ్ లో అతిస్వార్ధ రాజకీయాలకు నాంది పలికిన వాడిలో ఒకడిని గా గుర్తించ వచ్చు. తాడి తన్ను వాడిని తల దన్ను వాడు ఉండునట్లు, గుడిని మింగేవాడుంటే= గుళ్ళో లింగాన్ని కూడ మింగేవాడున్నట్లు, నీలం సంజీవరెడ్డిని, కాసు బ్రహ్మానంద రెడ్డిని గిరికీలు కొట్టించ కలిగింది, ఇందిర ఒక్కతే.

మర్రి చెన్నారెడ్డి స్వార్ధరాజకీయం గురించి తెలియని వారు లేరు. ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గిరీ ఇవ్వజూపగానే తెలంగాణా ఉద్యమాన్నీ నీరు గార్చ గలిగిన వాడు.

నీలం సంజీవరెడ్డి, చెన్నా రెడ్డి కలసి తమ స్వార్ధం కొరకు చేసిన కుట్రలో, తెలుగు వారందరు ఏకంకావాలి అనే నినాదాన్ని తెచ్చి ఆటలాడుకున్నారా. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ప్రధమ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.

కోస్తాలో భూకులం నంబర్ 2 వారి పాత్ర ఏమిటో తెలియదు. ఈభూకులం నంబర్ 2 వారిని అదుపులో పెట్టటానికి, తెలంగాణ భూకులం నంబర్ 1, ఆంధ్ర భూకులం నంబర్ 1 ఏకమై ప్రజలను గొర్రెలుగా మార్చారా?

వీటిని పరిశోథించాలంటే, ప్రఖ్యాత అపరాధ పరిశోథకుడు షెర్లాక్ హోం (సర్ ఆర్ధర్ కానన్ డాయిల్ విరచితం) గారికి కూడ కుదురుతుందో లేదో అనుమానమే.

ప్రకాశంగారి అసంపూర్ణ ఆత్మ కథను, తెన్నేటి విశ్వనాథంగారు ప్రజల ముందుకు తెచ్చారు. దానిని పరిశీలిస్తే గానీ అసలేం జరిగిందో కొద్దిగా తెలియవచ్చు. దానిని కూలంకషంగా పరిశీలించిన పాఠకులు ఎవరైనా ఉంటే, తమ వ్యాఖ్యను ఇక్కడ వ్రాస్తే బాగుంటుంది.

069 Narendra Modi should tell clearly how he is going to handle Adhar Cards నరేంద్ర మోడీ ఆధార్ కార్డులతో ఏమి చేయబోతున్నాడో చెప్పాలి

069 శ్రీనరేంద్రమోడీ ఆధార్ కార్డుల భవిష్యత్ నిర్ణయించాలి


Narendra Modi, BJP, Adhar Cards, నరేంద్రమోడీ, బిజెపి, ఆధార్ కార్డులు

బిజెపి, శివసేన వంటి పార్టీలు మెజారిటీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉండగా, కాంగ్రెస్, సమాజవాది, ఆర్ జెడి (లాలు యాదవ్), టిడిపి , అన్నాడిఎమ్ కె వంటి పార్టీలు మైనారిటి మత తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయని దేశ పరిస్తితులను గమనిస్తున్న వారికి అర్ధమవుతుంది.

అన్నాడిఎమ్ కె, శివసేన, తెరాస, వంటి పార్టీలు ప్రాంతీయ దురభిమానాలను, విద్వేషాలను పెంచి పోషిస్తూ ఉన్నాయి.

సమాజవాది, ఆర్ జెడి (లాలు యాదవ్), కాంగ్రెస్, బిఎస్ పి, వంటి పార్టీలు కుల దురభిమానాలను, విద్వేషాలను పెంచి పోషిస్తూ ఉన్నాయి.

తమ కులంతో, మతంతో, ప్రాంతంతో, ఏమి చేసుకుంటారో ప్రజలు నిర్ణయించుకుంటారు.

ప్రస్తుతం ప్రజలను పీడిస్తున్న ఆధార్ కార్డ్ సమస్యను , తమ పార్టీ ఎలా హ్యాండిల్ చేయబోతున్నదో మోడీగారు స్పష్టంగా చెప్పాలి. గ్యాస్ తో దాని లంకెను బలవంతంగా కొనసాగిస్తారా? వృధ్ధులు ఎదుర్కుంటున్న బయోమెట్రిక్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కార్డులకు అవసరమైన వేలు ముద్రలు, ఛాయాచిత్రాలు, మొ|| వానిని ఇళ్ళ వద్ద సేకరిస్తారా? బ్యాంకు ఖాతాల సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కిరాయికి ఉంటూ, తరచుగా ఇళ్ళు మారే వారి పరిస్థితి ఏమిటి?

వీటి జవాబులను మోడీజీ సిధ్ధం చేసుకొని , సవివరంగా తన వెబ్ సైట్ లో పెట్టాలి. సభల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.

కుల, మత, ప్రాంత, సమస్యలను ప్రస్తావించటం తగ్గించుకోవాలి.

ఉర్దూలో ఒక సామెత ఉంది. జాన్ హై తో జహాన్ హై. తెలుగు: ప్రాణం ఉంటే కదా మిగిలిన విషయాలు. ప్రస్తుతం గ్యాస్ తో ప్రాణాలు ముడిపెట్టుకొని ఉన్నాయి.

Thursday, November 21, 2013

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

bifurcation, livelihood, విభజన, బ్రతుకుతెరువు

Question: మీవ్రాతలు చూస్తుంటే, మీరు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం లాగ కనిపిస్తుంది. నిజమేనా?



నిజం కాదు. ప్రత్యేక తెలంగాణను నిరంకుశ పధ్ధతుల్లో ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అవసరం. వివిధప్రాంతాలవారు, నెలకొకసారి సమావేశమయి కొంత ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, ఒక అవగాహనకు వచ్చాక, అన్ని ప్రాంతాల ప్రజలు ఏర్పాట్లను చర్చించాక, వారే స్నేహపూర్వక విభజనను కోరుకుంటారు. లేదా సమైక్యంగా ఉందామనుకుంటారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ శ్రీ ఆసిఫ్ ఇబ్రహీం , 21-11-2౦1౩ నాడు, ఢిల్లీలో జరిగిన డీజీపీల మూడవ సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారో చూడండి.
“The demand for a separate statehood to Telangana has triggered counter-agitations. The situation emerging on this front is likely to throw up new challenges to the security forces as well as intelligence agencies at both the state and national levels."


కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో, సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని అధికారంలోకి వచ్చింది. 2౦౦4లో ఆమె ఎన్నికల ప్రసంగం.
“Muje Telangana ke jasbath ka yehsahs hai, mein jaanthi hoon jithni tarakki hone chahiye thi, utna nahi hooyi, rojgaar ke jithne mathen milna cayihe the nahi mile,, mein aapp ke jasabaathon ki katthir karthi hoon, aagar iss pradesh mein, aur kendra mein apni sarakari bani,tho hum apki ummedonko poori karneka hur koshish karenge..


ఈ వాగ్దానం ఆమె ఆరునెలలలో పూర్తి చేస్తానందిట. ఆరు నెలల సంగతి మర్చిపోయి 2౦౦4 నుండి 2౦1౩ వరకు సోనియా మాత నిద్రపోయింది. 1999 నుండి 2౦1౩ వరకు బిజెపి నిద్ర పోయింది . కాబట్టి, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ, ఒళ్ళో పెడుదునా దళ్ళో పెడుదునా అన్నట్లుగా బిల్లు, బిల్లు అని ఉరికితే ఎలా? జాతీయ స్థాయిలో పాలించే వాళ్ళకి ముందు చూపు ఉండాలి. విదేశీయురాలైన సోనియాకు పాపం ఈ ముందు చూపు లేదు అనుకున్నా, శ్రీ మన్ మోహన్ సింగుకు, చిదంబరానికి, సుశీల్ కుమార్ షిండేకి ఉండాలి కదా.

తెలంగాణాను ఏర్పరచటానికి ఆమె చేసిన ప్రయత్నం ఏమిటి? ఆమె అన్ని ప్రాంతాలవారినీ 2౦౦4లోనే ఒకచోట సమావేశం చేయించి, ఇరువురికీ ప్యాకేజీలను ఆఫర్ చేసి ఒప్పించి ఉండాల్సింది. గులాబీ కండువా కప్పుకునే ముందు ఆమె సీమాంధ్ర ప్రజలను సంప్రదించిందా? లేదు. తరువాతైనా సంప్రదించిందా? లేదు. తెరాస నేత కెసీఆర్ చేత ఆపార్టీని కాంగ్రెస్ లో ఎలాగైనా విలీనంచేయంచుకోవాలనే యావ తప్ప, కాంగ్రెస్ అధిష్టానానికి వేరొక చోదనం లేదు.

గులాబీ కండువాను కప్పుకోటం ద్వారా సోనియా మాత పులిపై స్వారి మొదలు పెట్టినట్లయ్యింది. కదిలితే తెరాసా నేతలు, టీజాక్ నేతలు మింగటానికి సిధ్ధంగా ఉన్నారు.

ఇప్పుడు కూడ సోనియా మాత సీమాంధ్రలో ఎందుకుపర్యటించలేక పోతున్నది? ఆమెకు అనారోగ్యం అనే కారణం చెల్లదు. ఎందుకంటే,ఆమె కర్నాటక వెళ్ళి కాంగ్రెస్ ను గెలిపించి నందుకు వారికి థాంక్స్ చెప్పింది.

Question ప్రశ్న: మరి సీమాంధ్ర నేతలు ఎందుకు నిద్రపోయారు?

Answer జవాబు:


శ్రీరాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కావాలి. సీమాంధ్రలో కాంగ్రెస్ టిక్కెట్లు పొందిన వారందరు, ఆయన అనుయాయులు కావటం వల్ల అందరూ, టీడీపీని ఓడించి సింహాసనాన్న సాధించుకోవాలనే తపనతో నిద్ర పోయారు.

Question: అయితే మీ వైబీరావు గాడిద అభిప్రాయం ఏమిటి?

Answer: జవాబు


సోనియా స్వార్ధం, వాజ్ పేయి అద్వానీ స్వార్ధం, రాజ్ నాధ్ సింగ్ నరేంద్రమోడీల స్వార్ధం, రాజశేఖర్ స్వార్ధం, కిరణ్ స్వార్ధం, కేసీఆర్ స్వార్ధం,జానా జైపాల్ స్వార్ధం, వంటి వాటికి మనం అలవాటు పడ్డాం.

అయ్యా, ఒక నాస్తికుడిగా, మార్క్సిస్టుగా, నేను శ్రామిక వర్గ పక్షపాతినే కాని కానీ ప్రాంతీయ రాగద్వేషాలతో నాకు సంబంధం లేదు. శ్రామిక వర్గకోణంలోంచి చూసినప్పుడు, పొట్టకోసం వలసపోటం, అనివార్యం. వెళ్ళినచో ట స్వల్పంగా కొన్ని పరిమితులకు లోబడి, చిన్న ఇల్లు, కొద్దిగా పొలం సేకరించుకోవచ్చు. ఇది , దేవుడు ఇచ్చిన అనలేం కానీ, భూగోళంలో మనకు సహజ సిధ్ధంగా లభించే ఒక మానవ హక్కు. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, వంటి దేశాలు, ఈమానవ హక్కుకు భంగం కలిగిస్తున్న విషయం విదితమే. వారి అమానుషత్వాన్ని వ్యతిరేకించ వలసిన బాధ్యత భారతీయులందరిపైనా, ముఖ్యంగా శ్రామికులందరి పైనా ఉంది.

ప్రాంతీయ కుమ్ములాటలతో మనలో మనం తన్నుకుంటుంటే, ఇంక అంతర్జాతీయ మానవ హక్కులను ప్రస్తావించే తీరిక, ఓపిక, కోరిక, మనకు ఎక్కడ ఉంటాయి?

Question: ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పండి.

Answer:జవాబు:


ఆంధ్ర ప్రదేశ్ వైశాల్యం చాలా ఎక్కువ. హైదరాబాదు నుండి విశాఖకు షుమారు 75౦ కిలోమీటర్లు. హైదరాబాదు నుండి రోడ్ ద్వారా అనంతపూర్ కు 476, హిందూపూర్ కు 411 లేక 462 కిలోమీటర్లు. చిత్తూరుకు 572 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు. ఇలాంటి దూరాలను రైల్లో ప్రయాణించినా, బస్సుల్లో ప్రయాణించినా విపరీతమైన ఖర్చు. ప్రాణాలు గాలిలో దీపం. పైగా, ఒకే రోజు హైదరాబాదు వెళ్ళి తిరిగి రాలేరు. హైదరాబాదులో లాడ్జింగ్ ఖర్చులు ఎవరిస్తారు? లేదా బంధువుల నెత్తిన పడాలి. దూరం కోణం నుంచి చూసినా, రాష్ట్రాన్ని 4 లేక 5 చిన్నరాష్ట్రాలను చేయటం అవసరం.


కాబట్టి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాష్ట్రాలు అవసరం.

Question ప్రశ్న: మరి హైదరాబాదు సంగతి ఏమిటి?

Answer, జవాబు:


హైదరాబాదు తెలంగాణా వారిది మాత్రమే అనుకోటం అర్ధం లేదు. శాతవాహన ఆంధ్రులకాలం నుండి, తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉన్నాయి. చాళుక్యుల కాలంలోనూ అంతే. కాకతీయుల కాలంలోనూ అంతే. బహమనీల కాలంలోనూ అంతే. కొంతకాలం గజపతులు గోదావరీ తీరం వరకు ఆక్రమించినా, విజయనగరరాజులు, గోల్కొండ నవాబులు, కోస్తాను, రాయలసీమను తిరిగి ఆక్రమించారు.

బ్రిటీష్ వారికి నిజాం నవాబులు సర్కారులను బ్రిటీష్ వారికి కప్పంగా, ఇచ్చేశాడు. దక్షిణ సర్కారులను వారికి బలవంతంమీద అమ్మివేశాడు. తరువాత, బ్రటీష్ సైన్య పోషణ కొరకు రాయలసీమను దత్తం చేశాడు. అందుకే వీటికి దత్తమండలాలు అనే పేరు వచ్చింది.

బ్రిటీష్ గవర్నర్ మదరాస్ నుండి, దత్తమండలాలను, సర్కారులను పాలించటంతో, సీమాంధ్రులకు మదరాసు ప్రయాణం అవసరం అయ్యింది. కలకత్తా మద్రాస్ రైలు మార్గం ఏర్పడక ముందు అంటే 1905 ముందు విశాఖ నుండి మదరాసు వెళ్ళాలంటే, ఓడలో వెళ్లవలసి వచ్చేది.

హైదరాబాదు నుండి కర్నూలుకు 182 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు కాగా గుంటూరుకు 2 70 లేక 3౦ 2 కిలోమీటర్లు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే , హైదరాబాదుపై ఆప్రక్కనున్న వరంగల్ వారికో,మెదక్ వారికో ప్రత్యేక హక్కులు ఉన్నాయనుకోటం ఒక భ్రమ.

హైదరాబాదులో 1956కు ముందు, వజీర్ సుల్తాన్ వారి చార్ మినార్ సిగరెట్ల ఫ్యాక్టరీ తప్ప పెద్ద పరిశ్రమలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ పెద్దరాష్ట్రంగా అవతరించాక, కేంద్రం మొత్తం 20 జిల్లాల అభివృధ్దిని దృష్టిలో ఉంచుకొని, అఖిలభారత నిధులను వెచ్చించి BHEL, HAL, HMT, BDL, ECIL, HCL, IDPL, DRDL, DLRL, DMRL, MIDHANI, NUCLEAR FUEL COMPLEX, HYDERABAD CENTRAL UNIVERSITY, ICRISAT, ENGLISH & FOREIGN LANGUAGES UNIVERSITY, వంటి పలు సంస్థలను స్థాపించారు తప్ప కేవలం తెలంగాణ 1౦ జిల్లాలనుద్దేశించి స్థాపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ, రాష్ట్రం యొక్క 2౦ జిల్లాల నిధులను వ్యయం చేసి హైదరాబాదును అభివృధ్ధి చేసింది. ఐటీ రంగాన్న అభివృధ్ధి చేసింది. ఆనాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రాంతీయ దృక్పథం ఉండి ఉంటే, విశాఖ, విజయవాడ, కర్నూలు, నగరాల్లో కూడ ఐటీ హైటెక్ సిటీ లను నెలకొల్పి ఉండేవాళ్ళు. ఇప్పడు కెసీఆర్ &కో, కోదండరాం&కో, ఇప్పుడు జైపాల్ రెడ్డి&కో, ప్రతి దాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూడటం గమనార్హం.

2౩ జిల్లాల జనం, 28రాష్ట్రాల జనం ఒకచోట చేరటం వల్ల హైదరాబాదు మార్కెట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రం మొత్తం నుండి వసూలయిన పన్నులను, వ్యాపార సంస్థల, కంపెనీల హైదరాబాదు కార్యాలయాలు, నగరంలో చెల్లించటం వల్ల హైదరాబాదు పన్నుల ఆదాయం విపరీతంగా పెరిగింది. అది మొత్తం 1౦ తెలంగాణ జిల్లాల బలం అనే భ్రమ ఏర్పడింది.

తెలంగాణ నేతలు తమ స్వార్ధం కొరకు, తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్రమైన కోరికను లేవదీశారు. హైదరాబాదునుండి, 1౦ జిల్లాలకు చెందని తెలుగు వాళ్ళను తరిమేస్తే, ఉద్యోగాలన్ని మనవే. డబల్ ప్రమోషన్లు కొట్టేయచ్చు. కెసీఆర్ ఇంక్రిమెంట్లుకూడా వాగ్దానం చేశాడు. ఇళ్ళస్థలాలు, అపార్టమెంట్లు అగ్గువకు కొనేయచ్చు. సాగర్లో, శ్రీశైలంలో, మొత్తం నీళ్ళన్నిటినీ ఆపేయచ్చు. జారాలనుండి, ఆదిలాబాదు వరకు కృష్ణ నీటిని పారించ వచ్చు. కర్నాటక నీటిని వదిలతేకదా, జూరాలకు నీరు వచ్చేది, అనే ప్రాథమిక విషయాన్ని కూడ మర్చి పోయారు. జూరాల్లో నీళ్ళుంటే కదా ఆదిలాబాదుకి వెళ్ళేది.

ఇప్పుడు హైదరాబాదు భారతీయులది అందరిదే తప్ప కేవలం తెలుగు వారిదో, తెలంగాణవారిదో కాదు. పైగా శ్రామిక హక్కుల మానవహక్కు సిధ్ధాంతం సరిగా అమలు కావాలంటే, హైదరాబాదే కాదు, 1౦ లేక 2౦ లక్షలు జనాభా దాటిన ప్రతినగరాన్నీ కేంద్రపాలిత ప్రాంతం చేయటం అవసరం. పాకిస్థాన్ ప్రేరిత తీవ్ర వాదాన్ని అరికట్టాలన్నా, నగరాల కన్నిటికీ కామన్ పోలీస్ వ్యవస్థ అవసరం. అంతేకాదు, 2౦ లక్షల జనాభా దాటిన నగరాల పెరుగుదలను అరికట్టటం కూడ అవసరమే. అంటే అక్కడ 2౦ లక్షల జనాభాకి ఎటువంటి INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలో అన్నే INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలి. ఎక్కువ ఉంటే జనాభ్ పెరిగి నీళ్ళు, డ్రైనేజీ, సమస్యలు వస్తాయి. ఆనగరాల స్థానంలో కొత్త చిన్న నగరాలను అభివృధ్ధి చేసుకోవాలి.

Question ప్రశ్న: ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఎన్నాళ్ళు ఉండాలి?



ఎన్నాళ్ళో ఉండనవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర,రాయలసీమలకు అసౌకర్యం. హైదరాబాదు శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు, కావాలనుకుంటే, ఉత్తర దక్షిణ తెలంగాణాలు తమతమ రాజధానులను హైదరాబాదులో ఏర్పరుచుకోవచ్చు.

Question: మరి నదీజలాల సంగతి ఏమిటి?



జూరాల్లో కృష్ణానదిలో, శ్రీరాంసాగర్ గోదావరిలో నీళ్ళే లేనప్పుడు పంపకం అనేది ఊహా జనితమైన వివాదం కాబోతున్నది. నదీజలాల విషయంలో, రాయలసీమ, తెలంగాణ, సీమాంధ్రల పరిస్థితి చాలా దీనంగా ఉండబోతున్నది. కాగితం మీద 8౦౦ టీయంసీలు 1౦౦౦ టీయంసీలు వంటి లెక్కలు ఉన్నా వాస్తవ జలాలు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు దాటి దిగువకు రావు. రెండు నదులు వరదల సమయంలో మురుగు కాలువలు గా వాడపడతాయి.

Question ప్రశ్న: మరి ఏమిటి దిక్కు?



బంగాళాఖాతంలోని సముద్ర జలాలను శుధ్ధి చేసి, సాగు, తాగు నీటి అవసరాలను కోస్తాజిల్లాలు తీర్చుకోవాలి. అంతేకా దు, ఎగువన తెలంగాణాకు, రాయలసీమకు సప్లయి చేయాలి.

Question ప్రశ్న: మరి బొగ్గు, ఇనుము, సున్నపురాయి సంగతి ఏమిటి



ఇవి శాశ్వత వనరులు కావు. వాడేస్తే వట్టి పోతాయి. గుంటలు మిగులుతాయి. సూర్య శక్తి తప్పమార్గం లేదు. మనకు భూమి కరువు కాబట్టి బంగాళాఖాతంలో కి రోడ్లను,తేలే ప్లాట్ ఫారాలను నిర్మించుకొని, సూర్యశక్తి స్టేషన్లను అభివృధ్ధి చేసుకోవాలి. దురదృష్ట వశాత్తు ఈదౌర్భాగ్య ప్రభుత్వం మంగళ్ యాన్ మీద వేలకోట్లు తగలేస్తున్నది తప్ప సూర్యశక్తి, సముద్రజలాల శుధ్ది విషయం పట్టించుకోవటంలేదు.

చిన్న రాష్ట్రాలను సమర్ధించటం అనేది అఖిల భారత అవసరం.

ఇంకా సుదీర్ఘంగా వ్రాయవలసి ఉంది. సశేషం.

067 Great honor conferred by tikkana to brihannala. బృహన్నలకు తిక్కన చేసిన గొప్ప గౌరవం.


మహాభారతం, తిక్కన, సినిమాలు, వ్యాసుడు, పద్యకవిత్వం

అర్జునుఁడు పేడి రూపమున విరటుఁగొల్వ వచ్చుట.

పాండవుల అరణ్యవాసం ముగిసింది. అజ్ఞాతవాసం మొదలవ్వాలి. పాండవులు ఎలా ముందుకు వెళ్ళాలో, ఒకరితో నొకరు చర్చించుకొని, విరటుడి కొలువులో చేరాలని నిర్ణయించుకున్నారు. తమ ఆయుధాలను ఒక స్మశానంలో, ఒక శమీ వృక్షం పైన దాచి, ఒక్కొక్కరుగా విరాటనగరంలోకి ప్రవేశించి, విరటుడి కొలువుకూటానికి చేరుకుంటున్నారు.

ధర్మజుడు కంకుభట్టుగా కొలువు సంపాదించాడు. భీముడు , వలలుడిగా వంటవాడి పని సంపాదించాడు. ఇప్పుడు అర్జునుడు, బృహన్నల వేషంలో విరటుడి కొలువులోకి ప్రవేశించాడు. అతడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి విరటుడు, సభాసదులు ముగ్ధులయ్యారు. విరటుడు అంటున్నాడు.
తిక్కన విరచిత ఆంధ్రమహాభారతం, విరాట పర్వం, ప్రథమాశ్వాసం, 231వ పద్యం.
మత్తేభం (పద్యం యొక్క ఛందస్సు).
వనితావేషము గలిగియు న్న యది చెల్వం బాఁడు చందంబు గా
దు నిరూపింప మహానుభావతయు నిర్దోష త్వమున్ రాజసం
బును శోభిల్లెడు నెవ్వడే నొకజగత్ పూజ్యుండు క్రీడార్ధమి
ట్లొనరం దాల్చిన రూపుగావలయు మీ రూహింపుఁడా యట్లగున్.


ఆఁడు చందంబు = స్త్రీ పధ్ధతి కాదు. ఇక్కడ అరసున్నా వినియోగాన్ని గమనించండి. మనం అరసున్నాల వాడకాన్ని మానేసి ఒక వందేళ్లు అయి ఉంటుంది. అరసున్న తీసి వేస్తే, ఆకాలంలో, ఆడు= ఆటలాడు అనే అర్ధం తీసేవారేమో.

మహానుభావతయు, నిర్దోష త్వము, రాజసము , జగదేక పూజ్యుడు -అర్జునుడిని ఎంత చక్కగా వర్ణించాడో గమనించండి.

విరాటరాజు అభిప్రాయంతో సభాసదులు కూడ ఏకీభవించారు.

బృహన్నల విరటుడితో నిన్ను కొలువటానికి వచ్చానన్నాడు.
విరటుడు:
ఉత్పలమాల పద్యం.
ఆయతబాహులున్ వెడఁదయైన సమున్నత వక్షమున సరో
జాయతలోచనంబులుఁ బ్ర్ససన్న ముఖంబు ను ఉదాత్త రేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీ యును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే.

శార్దూలపద్యం.
మత్ కోదండచయంబులోన నొక సమ్మానా ర్హ చాపంబు భా
స్వత్ కాండంబులు హేమచంద్రక కన ద్ వర్మంబు నీకెంతయు న
సత్కారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం
పత్ కల్యాణునిఁ జేసి వైభవము దర్పంబునన్ విజృంభింపఁగన.

కంద పద్యం.
ఏము నిను మత్స్యరాజ,
శ్రీ మహిమకు నెల్ల యుక్తు జేయఁ దలంపం
గా మామనోరథమునకు,
నీమాట విరుధ్ధమయ్యె నిది యెట్లొక్కొ.


చివరి కందం చూడండి. విరటుడు , బృహన్నలను, మత్స్యరాజ్య లక్ష్మికి పట్టాభిషిక్తుడిని చేస్తానంటున్నాడు. మా మనోరధానికి విరుధ్ధంగా మాట్లాడుతున్నావు. ఇది ఎట్లాగా! అని ఆశ్చర్యపోతున్నాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య: అంతా ఉట్టిదే. రాజుల మాటలు అలాగే ఉంటాయి, మన నేతల మాటల్లాగా. ఇదిగో ఐఐటీ, అదిగో అంతర్జాతీయ విమానాశ్రయం, విమానం ఎక్కటానికి రెడీ కాండి లాగా.

సరే , ఏదో బృహన్నల వివరణ ఇచ్చుకున్నాడు, డాన్స్ మాస్టర్ నౌకరీ ఇవ్వమన్నాడు. కానీ బృహన్నలతో, విరటుడు ఎంతో సగౌరవంగా వ్యవహరించాడు. ఉత్తరను రప్పించాడు. బృహన్నలను గురువుగా పరిచయం చేసి, గురువుతో ఎలా మెలగాలో హితవు చెప్పాడు.

నాగరికత్వంబునకుఁ చిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితంబగు తాంబూలంబు వెట్టి చిత్రంబులగు చీనాంబరంబులిచ్చి మణి మయంబులగు నాభరణంబు లొసంగి, సంభావించి, యవ్విభుండు,

.... .... ....(కొన్ని పద్యాలు)
అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని గురువుకి చక్కగా చెప్పి , ఉత్తరకు గురువుయొక్క విలువను బోధించాడు.

ఆటవెలది పద్యం.
ఎల్ల చుట్టములు తల్లియుఁ దోడును,
జెలియుఁ బరిజ నంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్క కొఱఁతయు లేదిందుఁ,
జేరి బ్రతుకు బుధ్ధి గౌరవమున.

చుట్టాలు, తల్లి , తోడు, స్నేహితురాలు, సహచరులు, అన్నీ నీకు గురువే, 'బుద్ధిగా గౌరవంతో బ్రతుకు' అని చక్కగా ఆదేశించాడు. బృహన్నలను ఎంతో గౌరవించాడు.


తిక్కన ఇంత విశదంగా ఈ ఘట్టాన్ని 27 పద్యాల్లో చిత్రించి మనకు సాక్షాత్కరింప చేశాడా. వ్యాసుడు దీన్ని 1౦ శ్లోకాల్లో తేలగొట్టాడు. పైగా విరటుడిచేత బృహన్నలను అవమానింపచేశాడు అనలేం కానీ , రాజులు డాన్స్ మాస్టర్లతో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తింపచేశాడు.

వ్యాస మహాభారతం. విరాటపర్వం. 1౦వ ఆధ్యాయం. మొత్తం 1౩ శ్లోకాలు. 5,6,7 శ్లోకాలు, విరటుడు బృహన్నలను పొగిడిన పొగడ్తలు.
విరటుడు బృహన్నలతో అంటున్నాడు.

సర్వోపపన్నః పురుషో మనోరమః; శ్యామో యువా వారణయూధపోపమాః
విముచ్య కంబూ పరిహాటకే; శుభే విముచ్య వేణీమ్ అపిన్ అహ్య కుండలే

శిఖీ సుకేశః పరిధాయ చాన్యధా; భవస్వ ధన్వీ కవచీ శరీ తదా
ఆరుహ్య యానం పరిధావతాం భవాన్; సుతైః సమో మే భవ వా మయా సమః

వృథ్ధో హ్య అహం వై పరిహార కామః; సర్వాన్ మత్స్యాంస త్రసా పాలయస్వ
నైవంవిధాః క్లీబ రూపా భవన్తి; కదం చనేతి ప్రతిభాతి మే మనః .


సారాంశం: నా కొడుకుతో సమానంగా ఉండు. నేనేమో వృధ్దుడినైపోయాను. నాభారం తగ్గించు కోవాలనుకుంటున్నాను. ఈ మత్స్య రాజ్యం మొత్తాన్ని నీవే రక్షించు. పాలించు. నా దృష్టిలో నీ వంటి వ్యక్తి నపుంసకుడు అయ్యే అవకాశమే లేదు.

విరటుడి పొగడ్తలకు అర్జునుడు సోల కాలేదు. నాట్యాచార్యుడి ఉద్యోగం చాలన్నాడు.

పదో శ్లోకంలో, విరాటుడు బృహన్నలతో:
దదామి తే హన్త వరం బృహన్నలే; సుతాం చ మే నర్తయ యాశ్చ తాదృశీః
ఇదం తు తే కర్మ సమం న మే మతం; సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి.


నీ ఇష్ట ప్రకారమే కానీలే అని ఊరు కోకుండా, 'సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి'. సముద్రం వరకు ఈభూమి మొత్తాన్ని పాలించటానికి నీవు అర్హుడివి, అన్నాడు. అని ఊరుకున్నాడా? 11వ శ్లోకం చాలా కీలకం.
బృహన్నలాం తామ్ అభివీక్ష్య మత్స్యరాట్;
కళాసు నృత్తే చ తదైవ వాదితే
అపుంస్త్వమ్ అపి అస్య నిశమ్య చ స్థిరం;
తతః కుమారీ పురమ్ ఉత్సర్జ తమ్.


నృత్య,వాద్యాది కళలలో బృహన్నలను పరీక్షించి చూశాడు. నిజంగా నపుంసకుడో కాదో అని పరీక్షింపచేసి, నపుంసకుడే అని స్థిర పర్చుకున్నాడు. అప్పడు అంతఃపురం లోకి పంపాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య: విరటుడు బృహన్నల పురుషత్వాన్ని పరీక్షింపచేయటం (ఎలా? గదిలోకి పంపి, బట్టలు విప్పదీయించ, స్త్రీలచేత పరీక్షింపచేసి ఉండచ్చు). ఇది తప్పు అనికూడ అనలేము. అంతఃపురంలోకి, కొత్తవాళ్లను ఏపరీక్షలూ లేకుండా పంపటం ప్రమాదకరంకదా.

స్వర్గీయ కిషోర్ మోహన్ గంగూలీ, వ్యాసుడి సంస్కృత భారతాన్ని ఆంగ్లం లోకి అనువదించాడు. ఆ అనువాదం:
The king of the Matsyas then tested Brihannala in dancing, music, and other fine arts, and consulting with his various ministers forthwith caused him to be examined by women. And learning that this impotency was of a permanent nature, he sent him to the maiden‴s apartments. And there the mighty Arjuna began giving lessons in singing and instrumental music to the daughter of Virata, her friends, and her waiting-maids, and soon won their good graces. And in this manner the self-possessed Arjuna lived there in disguise, partaking of pleasures in their company, and unknown to the people within or without the palace.


తిక్కన వ్రాసిన, ఉత్తరకు హితబోధలు మొ|| వ్యాసుడు వ్రాయలేదు. వ్యాసుడు వ్రాసిన నపుంసకత్వ పరీక్షను తిక్కన వదిలేశాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ప్రధానంకాదు. తిక్కన కోణం లోంచి చూసినపుడు, నీవు ఈ భూమండలం మొత్తాన్నీ పాలించటానికి అర్హుడివి అన్నాక, మాస్త్రీల ముందు , నీగుడ్డలు విప్పి నీ నపుంసకత్వాన్ని ఋజువు చేసుకో అనటం అర్ధవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి తొలగించి ఉండవచ్చు. గురువుకి తాంబూలం ఇవ్వటం, వస్త్రాలు,నగలు ఇవ్వటం, వంటివి తిక్కన చొప్పించినవి ఎంతో సొంపుగా ఉన్నాయి.

రాజుల అంతఃపురాలలో, నపుంసకులను కాపలా పెట్టటం, వివిధసేవలకు వినియోగించుకోటం ఆనాటి ఆచారం. నపుంసకత్వ పరీక్షలు కూడ ఆచారమే. ఈనాడు ప్రభుత్వోద్యోగాలకు కు, కొన్న కంపెనీల్లో ఉద్యోగాలకు ,వైద్య పరీక్షల్లాగా. అక్బర్ జనానాలో, 5000 మంది దాకా స్త్రీలు ఉండే వారట. నిజాం నవాబు జనానాలో కూడ అంతే. విజయనగర రాజులు కూడా ఏమీ తక్కువ తిన లేదు. అంతఃపురంలోకి చొరబడితే శిక్ష ఏమిటో పరిశీలంచాలంటే,మల్లీశ్వరి సినిమా చూడండి.

ముగింపు

నర్తనశాల చిత్రంలో బృహన్నల అవతారంలో స్వర్గీయ ఎన్ టీ ఆర్ ను గుర్తుకు తెచ్చుకోండి.
.

RELATED LINKS

Was Arjuna (Brihannala) used to sell old sarees in Dance Room (nartana SAla)? क्या अर्जुन (बृहन्नल) नर्तन शाला में पुराने शारी बेचते थे ? అర్జునుడు (బృహన్నల) నర్తనశాలలో ఉన్నప్పుడు అక్కిడి పాత చీరెలను అమ్ముకునే వాడా ? Click to go to Post No. 072.

Tuesday, November 19, 2013

066 గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! A wedding cannot be stopped by hiding pestle stone




bifurcation, విభజన, మనుచరిత్ర, పెద్దన, పద్యకవిత్వం
తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు,అంటారు. అల్లసాని పెద్దనామాత్యుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. ఈమహాకవి విరచితమైన మనుచరిత్ర ప్రబంధం తెలుగువారు నిత్యం కాకపోయినా, నెలకొకసారి కనీసం ఒక్క పద్యాన్నైనా చదువ తగిన గ్రంధరాజము.

పైపద్యం, మనుచరిత్ర పంచమాశ్వాసంలో, 17 వపద్యం. అల్లిక జిగిబిగియే కాక, పైపద్యం లో మనమేమి గమనించవచ్చు? జవాబు: సుందరమైన తెలుగు నుడికారం. నాలుగవ లైనులో వాడిన ఈలోకోక్తిని చూడండి. 'గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!'

ఈసామెత తెలుగు వారిలోకి 16వ శతాబ్దం నాటినుండే ఎలా ప్రవేశించింది?

ఆకాలంలో తెలుగువారిలో వోలికాశపడి కానీ, ఇతరకారణాల వల్లకానీ, బాలలను అతివృధ్దులకు ఇచ్చి వివాహంచేసే ఆచారం ఉండేది. రెండు మూడేళ్ళలోనే ఆవృధ్ధుడు గతించటం, అబ్బాల విధవ పుట్టింటికి చేరటం జరిగేది. ఇలా జరగటం ఆఇంటి ఇల్లాలికి ,అంటే పెళ్లి కూతురు తల్లికి ఇష్టం ఉండేది కాదు. ఆమె నిరసనలను ఇంటి యజమానిగానీ, బంధువులుగానీ పట్టించుకోకుండా పెళ్ళిని ముందుకు నెట్టుకెళ్ళేవారు. ఆతల్లి ఏడుస్తూ కూర్చునేది.

ఆనాటి వివాహాల్లో ఒకానొక దశలో గుండ్రాయి అవసరం పడేది. దాన్ని ముందుగా సిధ్ధం చేసుకోటం జరగనిచోట, అప్పటికప్పుడు, పెళ్ళి పందిరిలో గుండ్రాయి కొరకు వెతికేవాళ్ళు. దొరకకపోతే, వివాహం కొన్ని నిమిషాలు ఆలస్యం అయ్యేది. ఒకపెళ్ళిలో, పెళ్ళికూతురు తల్లి ఏంచేసిందంటే, గుండ్రాయి దొరకకుండా, దానిని దాచిపెట్టింది. అలాగైనా ఆపెళ్ళి ఆగిపోతుందని, ఆ అమాయక తల్లి ఆశ. ఆపెళ్ళికూతురు తండ్రి, బంధువులు మొండి ముండా కొడుకులు, ఎక్కడి నుండో మరో గుండ్రాయిని తెచ్చి ఆపెండ్లిని పూర్తి చేశారు. అలాగా, 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా', అనే సామెత వ్యాప్తమయ్యింది.

మనుచరిత్రలో ఈసామెతను వాడిన సందర్భం


బ్రహ్మ మిత్రుడు అనే పండితుడు, తన శిష్యులకు ఆయుర్వేదాన్ని నేర్పే వాడు. ఇందీవరాక్షుడు అనే రాజు , బ్రహ్మ మిత్రుడి దగ్గరకు వెళ్ళి తనకు ఆయుర్వేదాన్ని నేర్ప వలసినదిగా ప్రార్ధించాడు.

గురువుకి రాజులపై ఏవో దురభిప్రాయాలుండటం వల్ల ఆయన దానిని కొంత కటువుగానిరాకరించాడు. ఇక్కడ పెద్దన పద్యం అవశ్యం పఠనీయం, కమనీయం.
గురువు, బ్రహ్మ మిత్రుడు : నటవిట గాయక గణికా
కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
గటు వీ శాస్త్రము వల ది
చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్‌?


రాజు, ఇందీవరాక్షుడు :
తేటగీతి. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
యించుకించుక మీవంటి యెఱుక గలుగు
పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు.


గురువు, బ్రహ్మ మిత్రుడు :
కందం. ధన రాజ్య రమా మదమునఁ
గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
టెను నేరము గలదే? ననుఁ
గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్‌.


రాజు, ఇందీవరాక్షుడు :

తేటగీతి. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
వెజ్జుఁదన మేల? (యని మది లజ్జవొడమి).


ఇందీవరాక్షుడు ఇంటికెళ్ళి నిద్ర పోలేదు. మారువేషంలోతిరిగి వచ్చి గురువుగారిని మభ్యపెట్టి ఆయుర్వేదాన్ని బాగానే నేర్చుకున్నాడు. అంతటితో ఆగి, ఇంటికెళ్ళి ఉంటే బాగుండేది.

కానీ రాజులకుండే నోటి దురుసుతనం , అహంకారం ఆపని చేయనివ్వ లేదు.
శార్దూలం. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


రాజు గురువుని 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా' అని హేళన చేశాడు. గురువుకి కడుపులో మండి పోయింది.

మత్తేభం. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.

వచనం. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర
ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున
విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని
కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు
మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి
గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా
మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె
జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి.


గుటగుటలు గురువుతోనా! అని గురువు ఇందీవరాక్షుడిని రాక్షసుడివై పొమ్మని శపించాడు.

తరువాతి కథ ఇంకోసారి.

పై సామెతను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి గారి శాసనసభ ప్రోరోగ్ మంత్రాంగానికి వర్తింప చేయవచ్చా?

పరిశీలన:
ముందుగా, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రే అయినప్పటికీ , లోలోపల ఏస్వార్ధాలున్నప్పటికీ, మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి ధైర్యాన్ని అభినందించి తీరాలి. కిరణ్ కుమార్ రెడ్డి

కాకపోతే రాష్ట్ర విభజనను అడ్డుకోటానికి ఆయన వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో అనుమానాస్పదం.
పైన వ్రాసిన బాల్య వివాహం కథలో , పెళ్లికూతురు తల్లి గుండ్రాయిని దాచకుండా, ఏనుయ్యో గొయ్యో చూసుకొని ఉంటే వివాహం కనీసం మైల కారణం వల్లనైనా ఆగేది. గ్రామస్థులు కూడ చొరవ తీసుకుని ఆపించి ఉండే వాళ్ళేమో. ఆమె గుండ్రాయిని దాచటం వల్ల పెళ్ళిని కొన్ని నిమిషాలు ఆలస్యం చేయించకలిగింది కానీ మొండి ముండాకొడుకు మొగుడి, ఇంకా పెద్ద ముండాకొడుకులు బంధువుల మనసులను మార్చలేక పోయింది.

ముఖ్యమంత్రిగారు కూడ, రెండు నెలలక్రితమే శాసనసభను సమావేశం చేయించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు తీర్మానం చేయించి, శాసనసభను ప్రోరోగ్ చేయించి, మర్నాడు తాను రాజీనామా చేసి ఉంటే, బహుశా, పరిస్థితులు భిన్నంగా టర్న్ తీసుకొని ఉండేవేమో.

రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియా భటులు (హోం మంత్రి, గోం మంత్రుల బృందం), రాజ్ నాధ్ సింగ్- సుష్మా స్వరాజ్ వంటి భాజపా నేతలు, పైన వ్రాసిన పెళ్ళికూతురి తండ్రి, బంధువులకు ఏమాత్రం తీసి పోలేదు. మొండి ముండాకొడుకులు అనటానికి సభ్యత అడ్డు వస్తుంది. బిజెపి అండ చూసుకొని కాంగ్రెస్ ఇలా చెలరేగి పోతున్నది. ఎప్పుడో బిజెపి వాగ్దానం చేశానంటున్నది. సీమాంధ్రలో ఎక్కడన్నా సభలను పెట్టి తెలుగు ప్రజలకు నచ్చచెప్పిందా.

దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టు వైఖరి కూడ, ఈబలవంతపు పెళ్ళి తంతును (ఇక్కడ బలవంతపు విడాకులు) ముందుకు తీసుకు వెళ్ళేది గా ఉన్నది. సుప్రీంకోర్టు ఎడల అగౌరవాన్ని వ్యక్తం చేయకుండా, వారి తీర్పులను విమర్శించటం తప్పుకాదు కనుక మనం మరి కొంత పరిశీలన చేయవచ్చు.

రాష్ట్ర విభజన అంశం ఇంకా పక్వానికి రాలేదు,తగిన సమయంలో వస్తే పరిశీలిస్తాం అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం లాగా కనిపిస్తుంది.

కేంద్రం, గోం, హోం మంత్రిగారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ సింగ్ గారు, అందరూకూడ , ఇంక కొద్ది రోజుల్లో బిల్లు నిశ్చయం అని బల్లగుద్ది చెప్తున్నారు. కేంద్రం సీమాంధ్రకు వాతలు పెట్టటానికి శలాకలను ఎర్రగా కాలుస్తున్నది. టీలీడర్లు డప్పులు కూడ వాయిస్తున్నారు. న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళటానికి ఇంతకన్నా తగిన సమయం ఇంకేమి ఉంటుంది? వాతలు పెట్టాక, శరీరం అంతా కవురు కట్టాక, ఎంత శాతం కాలింది అని లెక్క కట్టేదాకా ఆగాలా? అప్పుడు బర్నాల్ పూసి యాంటీ బయటిక్కులు రాస్తే సరిపోతుందా? అన్యాయం జరిగిం తరువాత ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోటంకన్నా ముందుగా నివారించటం మేలు కాదా.

సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అధిష్ఠానం వాతలు పెట్టటంలో, బిజేపీ నేతలు వాతలు పెట్టటంలో, సీమాంధ్రనేతల పాత్ర తక్కువేమీ లేదు.

ఆంధ్రప్రదేశ్ సభాపతి కొన్న నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. వారి మనస్సులో ఏమి తంత్రాలు దాగియున్నాయో మనుకు తెలియదు. ఇప్పుడు శ్రీవారి స్వార్ధ ప్రణాళికలు బయటికి వస్తాయేమో మనం చూడాలి. ఏపుట్టలో ఏపాము ఉంటుందో ఎవరికి తెలుసు?

065 ఎవరికి వారే యమునాతీరే!

065 ఎవరికి వారే యమునాతీరే!
bifurcation, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర
image courtesy gisserver.nic.in

సీమాంధ్ర నేతలు ఎవరి కోణంలో నుంచి వారు చూడటంలో తప్పు లేదు. కానీ అందరూ కలసి ఐకమత్యంగా వ్యవహరించాలి కదా.

ఉదాహరణ: శ్రీకాకుళ నేత, కేంద్ర మంత్రి,కిషోర్ చంద్ర దేవ్ సార్. రాష్ట్రానికి రాజధానికి భౌగోళికంగా మధ్యలో ఉండనక్కర లేదుట. విశాఖను రాష్ట్ర రాజధానిగా చేయాల్సిందేట. వీరు రాయలసీమ వారిపై కొంత దయ దలిచారు. కావాలనుకుంటే రాయలసీమ వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుకో మన్నారు.

కేంద్రమంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి లకు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య కావాలిట. రాయలసీమ, విశాఖ నివాసుల అభిప్రాయాలతో వారికి నిమిత్తం లేదు.

రాజధాని విషయంలో, కర్నూల్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డి గారి అభిప్రాయం ఇంతవరకు బయటికి రాలేదు. దివాకర్ రెడ్డి గారు రాయల తెలంగాణ అంటున్నారే తప్ప రాజధాని విషయం చెప్పటంలేదు. శ్రీ దివాకర హృదయం, హైదరాబాదునుండి బెంగుళూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఎలా లాభదాయకంగా నడపవచ్చా అనేదానిపై లగ్నం అయి ఉంటుంది. రాయలసీమ నేతలు రాయలసీమ భవిష్యత్ గురించి కాకుండా, హైదరాబాదులో తమ ఆస్తుల భవిష్యత్ గురించి, ఆలోచించటం మానేయటం అవసరం. విశాఖలో, విజయవాడలో పాగా వేయటం ఎలాగా అని ఆలోచించే కన్నా, సీమ భవిష్యత్ గురించి, ఆలోచించటం అవసరం.

రాయలసీమ ఫౌండేషన్ కి చెందిన శ్రీ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి గారు ,ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-11-2013 సంచికలో 'శ్రీబాగ్: నేటి కర్తవ్యాలు' అనే సంపాదక పేజీ వ్యాసం ద్వారా, రాయలసీమ భవతవ్యం పై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

వీటన్నిటిని బట్టి మనకు తేలేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజ్వరిల్లుతుంది. రాయలసీమలో రాజధానిని పెట్టినా, పెట్టక పోయినా, ఇది అనివార్యం. ఎందుకంటే, రాయలసీమలో రాజధానిని పెట్తే, కర్నూలైనా, ఇంకో నగరమైనా, కోస్తానుండి వచ్చే లక్షలాది మంది ఉద్యోగార్ధులను , వాణిజ్య వేత్తలను, పారిశ్రామికులను తట్టుకోలేదు. రాజధానిలో తమ పొట్ట నిండే మార్గాలు దొరుకుతాయని వారాసించటం తప్పు కాదు. 1953 నుండి కర్నూలే రాష్ట్ర రాజధానిగా కొనసాగి ఉన్నా ఇది జరిగేదే. కర్నూలుకి జరగాల్సిన మేలుకీళ్ళు హైదరాబాదుకి చేరాయి.

పైవన్నీ పరిశీలించటం ద్వారా మనం గుర్తించాల్సిన విషయాలు.

ముద్దొచ్చి నప్పుడే చంకకెక్కాలి. కేంద్రం, కాంగ్రెస్, బిజేపి, ఆంధ్రప్రదేశ్ ను 2 రాష్ట్రాలుగా చేయటానికి కత్తులు నూరుతున్నప్పుడు, తెలుగు వాళ్ళకు కలిసి ఉండే శుభ లక్షణాలు లేనప్పుడు, మెరుగయిన పధ్ధతి ఏది? అందరూ కలసి 4 లేక 5 రాష్ట్రాలను కోరటం మంచి దారి. అస్సాం 7 ఈశాన్య రాష్ట్రాలుగా విభజించ బడ్డప్పుడు, లేని అభ్యంతరం,ఇప్పుడు ఉండ నవసరం లేదు.

కాబట్టి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని పార్టీలు, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హైదరాబాదును Union Territory కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, హైదరాబాదు లోని ఎన్ జీ వో లకు నగరంలో ఉండటానికి అవసరమైన ఆప్షన్లను ఇవ్వటం, నదీజలాల పంపిణీ, ప్రాజెక్టులకు నీటి విడుదలకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పరిపాలక వ్యవస్థను ఏర్పరచటం, కొత్తరాజధానుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం, మొ|| డిమాండ్లకు ఈ నాలుగు లేక అయిదు రాష్ట్రాల డిమాండు అదనం గా ఉండాలి.

కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికీ, బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకి, భవిష్యత్ దృష్టి అవసరం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కలాగ ఉండరు. ఏనేతలైనా విజృంభించి, సీమాంధ్రప్రదేశ్ ని, మరో కాశ్మీర్ గానో, శ్రీలంకగానో, మార్చే అవకాశం ఉంది. హైదరాబాదుని మరొక పాకిస్థాన్ గా టీలీడర్లు తీర్చి దిద్దే అవకాశాలున్నాయి. సీమాంధ్ర మరియు తెలంగాణ మధ్య అంతర్యుధ్ధాలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక దౌర్భాగ్యపు ఆదర్శం గా తయారు అయ్యే అవకాశాలు పుష్కలం.

ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశ హితం కాకుండా, పార్టీల స్వల్పకాలిక రాజకీయ లాభాల కొరకు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అశాంత చెలరేగి, దేశఐక్యతకే భంగకరం కావటం అనివార్యం.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |