Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, November 22, 2013

070 Like bifurcation, formation of AP in 1956 also appears to be some selfish design విభజన వలెనె 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కూడ స్వార్ధ రాజకీయాల వల్లనే జరిగిందా?




bifurcation, విభజన, రాష్ట్రచరిత్ర, ప్రకాశం, కులాలు

రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణా వాగ్దానం, 2004 లో అధికారం లోకి రావటానికి, గులాబీ కండువా కప్పుకున్న శ్రీమతి సోనియా గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కుట్ర అని అర్ధం అవుతుంది. ఆవాగ్దానాన్ని, అమ్మగారి గులాబి కండువాని పట్టించుకోకుండా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ధృతరాష్ట్రుల్లాగా కళ్ళు మూసుకోటం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలు నానా బాధలు పడుతున్నారు.

తన్నుకున్నది దుర్యోధనుడు, కర్ణుడు, ధర్మరాజు, భీమార్జునులే అయినా, 18 అక్షౌహిణీల సైన్యం , వేల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు, ప్రాణాలు కోల్పోయాయి. లక్షలాది మంది స్త్రీలు విధవ లయ్యారు. గీతలో అర్జునుడు భయపడ్డట్లుగా వర్ణ సంకరం జరగలేదు కానీ, అతి భయంకర విధ్వంసం జరిగి ఉండాలి.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విభజన రాజకీయాలు కూడ, జన నష్టానికి, బస్సుల వంటి ప్రజల ఆస్థుల విధ్వంసానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు 1956లో ఏమి జరిగి ఈ కృత్రిమ జరాసంధుడి కాయంలాంటి అతుకులబొంతను తయారు చేశారు, అనే విషయాలు, కూడా పరీశీలనాంశాలే. విశాలాంధ్రలో తమకు సంక్షేమం ఉండదనే భయంతో, తెలంగాణా ప్రజలు గానీ, రాయలసీమ ప్రజలు కానీ ఉన్నప్పుడు, అసలు విశాలాంధ్రనే ఏర్పాటు చేయకూడదు.

కన్న తండ్రి లాగా పాలించే నిజాం ప్రభువు, జాగీర్ దారులు, దొరలు, పటేల్ పట్వారీలు, వారికి ఉండగా, ఆవునుండి దూడలను వేరు చేసినట్లుగా, సర్దార్ పటేల్ వారిని ఎందుకు విడతీశాడో ఏమిటో?

తెలంగాణా ప్రజలకు, నేతలకు, నిజాం బానిసత్వం కొనసాగుతున్నప్పుడు, బూర్గుల రామకృష్ణారావు వంటి త్యాగశీలురైన నేతలు, ఎందుకు తొందర పడ్డారో అర్ధం కావటంలేదు.

1953 నాటి కర్నూలు లో సౌకర్యాలు లేని మాట నిజమే అయినా కొద్ది కాలం ఓర్చుకుంటే, కొత్తరాజధానిని పట్టాలపైకి ఎక్కించటం సాధ్యమయ్యేదే.

ఆ ప్రయత్నం చేయకుండా, హైదరాబాదుకు ఉరకటంలో ప్రజాహితం కాకుండా, కులరాజకీయమేదో జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది.

షరతులతో కూడిన విలీన ఒప్పందాలు , కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలన్న సిధ్ధాంతానికి అనుగుణమైనవి.

మిగిలిన పెద్ద మనుషులు గూడు పుఠాణీ చేసుకొని, ఆచరణలో సాధ్యంకాని ఒప్పందాలు చేసుకొని , ఆపెద్దమనుషులు తమ ఆశలను తీర్చుకొని, తమ భయాలను వదిలించుకుంటే, నేటి ప్రజలు, నానా బాధలు పడటం ఎంతవరకు సమంజసం?

తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటారా, పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటారా? ముఖ్యమంత్రులు అటు పెద్దమనుషుల ఒప్పందాలను అమలు చేయకుండా, చట్టాలనీ అమలు చేయకుండా, నియంతలై పోయి, వేలకోట్ల ఆస్తులను సంపాదించుకొని తమ వారసులను బాగు చేసుకున్నారు. మరి ప్రజల సంగతి ఏమిటి?

1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రకాశంగారి పాత్ర ఎందుకు లేదో అర్ధం కాదు. ఆయనను మూలకూర్చోపెట్టి ముసలమ్మను చేశారా?

పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు పెట్టిన వారి పేర్లు:


తెలంగాణ తరఫున: బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జెబి నరసింగరావు.

ఆంధ్ర తరఫున: బెజవాడ గోపాల రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు.

పై పేర్లను గమనించినప్పుడు, ఈకాలం వలెనే, ఆకాలంలో కూడా, తెలంగాణ లో కులం నంబరు 1కి 50% వచ్చింది. ఆంధ్రాలో కూడ కులం నంబరు 1కి 50% వచ్చింది.


నీలం సంజీవ రెడ్డి జాతీయ స్థాయిలోకూడ, గ్రూపు రాజకీయాలకు పేరొందిన వాడు. ఆంధ్ర ప్రదేశ్ లో అతిస్వార్ధ రాజకీయాలకు నాంది పలికిన వాడిలో ఒకడిని గా గుర్తించ వచ్చు. తాడి తన్ను వాడిని తల దన్ను వాడు ఉండునట్లు, గుడిని మింగేవాడుంటే= గుళ్ళో లింగాన్ని కూడ మింగేవాడున్నట్లు, నీలం సంజీవరెడ్డిని, కాసు బ్రహ్మానంద రెడ్డిని గిరికీలు కొట్టించ కలిగింది, ఇందిర ఒక్కతే.

మర్రి చెన్నారెడ్డి స్వార్ధరాజకీయం గురించి తెలియని వారు లేరు. ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గిరీ ఇవ్వజూపగానే తెలంగాణా ఉద్యమాన్నీ నీరు గార్చ గలిగిన వాడు.

నీలం సంజీవరెడ్డి, చెన్నా రెడ్డి కలసి తమ స్వార్ధం కొరకు చేసిన కుట్రలో, తెలుగు వారందరు ఏకంకావాలి అనే నినాదాన్ని తెచ్చి ఆటలాడుకున్నారా. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ప్రధమ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు.

కోస్తాలో భూకులం నంబర్ 2 వారి పాత్ర ఏమిటో తెలియదు. ఈభూకులం నంబర్ 2 వారిని అదుపులో పెట్టటానికి, తెలంగాణ భూకులం నంబర్ 1, ఆంధ్ర భూకులం నంబర్ 1 ఏకమై ప్రజలను గొర్రెలుగా మార్చారా?

వీటిని పరిశోథించాలంటే, ప్రఖ్యాత అపరాధ పరిశోథకుడు షెర్లాక్ హోం (సర్ ఆర్ధర్ కానన్ డాయిల్ విరచితం) గారికి కూడ కుదురుతుందో లేదో అనుమానమే.

ప్రకాశంగారి అసంపూర్ణ ఆత్మ కథను, తెన్నేటి విశ్వనాథంగారు ప్రజల ముందుకు తెచ్చారు. దానిని పరిశీలిస్తే గానీ అసలేం జరిగిందో కొద్దిగా తెలియవచ్చు. దానిని కూలంకషంగా పరిశీలించిన పాఠకులు ఎవరైనా ఉంటే, తమ వ్యాఖ్యను ఇక్కడ వ్రాస్తే బాగుంటుంది.

069 Narendra Modi should tell clearly how he is going to handle Adhar Cards నరేంద్ర మోడీ ఆధార్ కార్డులతో ఏమి చేయబోతున్నాడో చెప్పాలి

069 శ్రీనరేంద్రమోడీ ఆధార్ కార్డుల భవిష్యత్ నిర్ణయించాలి


Narendra Modi, BJP, Adhar Cards, నరేంద్రమోడీ, బిజెపి, ఆధార్ కార్డులు

బిజెపి, శివసేన వంటి పార్టీలు మెజారిటీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉండగా, కాంగ్రెస్, సమాజవాది, ఆర్ జెడి (లాలు యాదవ్), టిడిపి , అన్నాడిఎమ్ కె వంటి పార్టీలు మైనారిటి మత తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయని దేశ పరిస్తితులను గమనిస్తున్న వారికి అర్ధమవుతుంది.

అన్నాడిఎమ్ కె, శివసేన, తెరాస, వంటి పార్టీలు ప్రాంతీయ దురభిమానాలను, విద్వేషాలను పెంచి పోషిస్తూ ఉన్నాయి.

సమాజవాది, ఆర్ జెడి (లాలు యాదవ్), కాంగ్రెస్, బిఎస్ పి, వంటి పార్టీలు కుల దురభిమానాలను, విద్వేషాలను పెంచి పోషిస్తూ ఉన్నాయి.

తమ కులంతో, మతంతో, ప్రాంతంతో, ఏమి చేసుకుంటారో ప్రజలు నిర్ణయించుకుంటారు.

ప్రస్తుతం ప్రజలను పీడిస్తున్న ఆధార్ కార్డ్ సమస్యను , తమ పార్టీ ఎలా హ్యాండిల్ చేయబోతున్నదో మోడీగారు స్పష్టంగా చెప్పాలి. గ్యాస్ తో దాని లంకెను బలవంతంగా కొనసాగిస్తారా? వృధ్ధులు ఎదుర్కుంటున్న బయోమెట్రిక్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కార్డులకు అవసరమైన వేలు ముద్రలు, ఛాయాచిత్రాలు, మొ|| వానిని ఇళ్ళ వద్ద సేకరిస్తారా? బ్యాంకు ఖాతాల సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కిరాయికి ఉంటూ, తరచుగా ఇళ్ళు మారే వారి పరిస్థితి ఏమిటి?

వీటి జవాబులను మోడీజీ సిధ్ధం చేసుకొని , సవివరంగా తన వెబ్ సైట్ లో పెట్టాలి. సభల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.

కుల, మత, ప్రాంత, సమస్యలను ప్రస్తావించటం తగ్గించుకోవాలి.

ఉర్దూలో ఒక సామెత ఉంది. జాన్ హై తో జహాన్ హై. తెలుగు: ప్రాణం ఉంటే కదా మిగిలిన విషయాలు. ప్రస్తుతం గ్యాస్ తో ప్రాణాలు ముడిపెట్టుకొని ఉన్నాయి.

Thursday, November 21, 2013

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

068 Won't there be a yoga of running an idli/dOSa cart? ఇడ్లీ, దోశ బండి నడుపుకునే యోగం కూడ ఉండదా? PART 1.

bifurcation, livelihood, విభజన, బ్రతుకుతెరువు

Question: మీవ్రాతలు చూస్తుంటే, మీరు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం లాగ కనిపిస్తుంది. నిజమేనా?



నిజం కాదు. ప్రత్యేక తెలంగాణను నిరంకుశ పధ్ధతుల్లో ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అవసరం. వివిధప్రాంతాలవారు, నెలకొకసారి సమావేశమయి కొంత ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, ఒక అవగాహనకు వచ్చాక, అన్ని ప్రాంతాల ప్రజలు ఏర్పాట్లను చర్చించాక, వారే స్నేహపూర్వక విభజనను కోరుకుంటారు. లేదా సమైక్యంగా ఉందామనుకుంటారు.

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ శ్రీ ఆసిఫ్ ఇబ్రహీం , 21-11-2౦1౩ నాడు, ఢిల్లీలో జరిగిన డీజీపీల మూడవ సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారో చూడండి.
“The demand for a separate statehood to Telangana has triggered counter-agitations. The situation emerging on this front is likely to throw up new challenges to the security forces as well as intelligence agencies at both the state and national levels."


కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో, సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని అధికారంలోకి వచ్చింది. 2౦౦4లో ఆమె ఎన్నికల ప్రసంగం.
“Muje Telangana ke jasbath ka yehsahs hai, mein jaanthi hoon jithni tarakki hone chahiye thi, utna nahi hooyi, rojgaar ke jithne mathen milna cayihe the nahi mile,, mein aapp ke jasabaathon ki katthir karthi hoon, aagar iss pradesh mein, aur kendra mein apni sarakari bani,tho hum apki ummedonko poori karneka hur koshish karenge..


ఈ వాగ్దానం ఆమె ఆరునెలలలో పూర్తి చేస్తానందిట. ఆరు నెలల సంగతి మర్చిపోయి 2౦౦4 నుండి 2౦1౩ వరకు సోనియా మాత నిద్రపోయింది. 1999 నుండి 2౦1౩ వరకు బిజెపి నిద్ర పోయింది . కాబట్టి, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ, ఒళ్ళో పెడుదునా దళ్ళో పెడుదునా అన్నట్లుగా బిల్లు, బిల్లు అని ఉరికితే ఎలా? జాతీయ స్థాయిలో పాలించే వాళ్ళకి ముందు చూపు ఉండాలి. విదేశీయురాలైన సోనియాకు పాపం ఈ ముందు చూపు లేదు అనుకున్నా, శ్రీ మన్ మోహన్ సింగుకు, చిదంబరానికి, సుశీల్ కుమార్ షిండేకి ఉండాలి కదా.

తెలంగాణాను ఏర్పరచటానికి ఆమె చేసిన ప్రయత్నం ఏమిటి? ఆమె అన్ని ప్రాంతాలవారినీ 2౦౦4లోనే ఒకచోట సమావేశం చేయించి, ఇరువురికీ ప్యాకేజీలను ఆఫర్ చేసి ఒప్పించి ఉండాల్సింది. గులాబీ కండువా కప్పుకునే ముందు ఆమె సీమాంధ్ర ప్రజలను సంప్రదించిందా? లేదు. తరువాతైనా సంప్రదించిందా? లేదు. తెరాస నేత కెసీఆర్ చేత ఆపార్టీని కాంగ్రెస్ లో ఎలాగైనా విలీనంచేయంచుకోవాలనే యావ తప్ప, కాంగ్రెస్ అధిష్టానానికి వేరొక చోదనం లేదు.

గులాబీ కండువాను కప్పుకోటం ద్వారా సోనియా మాత పులిపై స్వారి మొదలు పెట్టినట్లయ్యింది. కదిలితే తెరాసా నేతలు, టీజాక్ నేతలు మింగటానికి సిధ్ధంగా ఉన్నారు.

ఇప్పుడు కూడ సోనియా మాత సీమాంధ్రలో ఎందుకుపర్యటించలేక పోతున్నది? ఆమెకు అనారోగ్యం అనే కారణం చెల్లదు. ఎందుకంటే,ఆమె కర్నాటక వెళ్ళి కాంగ్రెస్ ను గెలిపించి నందుకు వారికి థాంక్స్ చెప్పింది.

Question ప్రశ్న: మరి సీమాంధ్ర నేతలు ఎందుకు నిద్రపోయారు?

Answer జవాబు:


శ్రీరాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కావాలి. సీమాంధ్రలో కాంగ్రెస్ టిక్కెట్లు పొందిన వారందరు, ఆయన అనుయాయులు కావటం వల్ల అందరూ, టీడీపీని ఓడించి సింహాసనాన్న సాధించుకోవాలనే తపనతో నిద్ర పోయారు.

Question: అయితే మీ వైబీరావు గాడిద అభిప్రాయం ఏమిటి?

Answer: జవాబు


సోనియా స్వార్ధం, వాజ్ పేయి అద్వానీ స్వార్ధం, రాజ్ నాధ్ సింగ్ నరేంద్రమోడీల స్వార్ధం, రాజశేఖర్ స్వార్ధం, కిరణ్ స్వార్ధం, కేసీఆర్ స్వార్ధం,జానా జైపాల్ స్వార్ధం, వంటి వాటికి మనం అలవాటు పడ్డాం.

అయ్యా, ఒక నాస్తికుడిగా, మార్క్సిస్టుగా, నేను శ్రామిక వర్గ పక్షపాతినే కాని కానీ ప్రాంతీయ రాగద్వేషాలతో నాకు సంబంధం లేదు. శ్రామిక వర్గకోణంలోంచి చూసినప్పుడు, పొట్టకోసం వలసపోటం, అనివార్యం. వెళ్ళినచో ట స్వల్పంగా కొన్ని పరిమితులకు లోబడి, చిన్న ఇల్లు, కొద్దిగా పొలం సేకరించుకోవచ్చు. ఇది , దేవుడు ఇచ్చిన అనలేం కానీ, భూగోళంలో మనకు సహజ సిధ్ధంగా లభించే ఒక మానవ హక్కు. అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, వంటి దేశాలు, ఈమానవ హక్కుకు భంగం కలిగిస్తున్న విషయం విదితమే. వారి అమానుషత్వాన్ని వ్యతిరేకించ వలసిన బాధ్యత భారతీయులందరిపైనా, ముఖ్యంగా శ్రామికులందరి పైనా ఉంది.

ప్రాంతీయ కుమ్ములాటలతో మనలో మనం తన్నుకుంటుంటే, ఇంక అంతర్జాతీయ మానవ హక్కులను ప్రస్తావించే తీరిక, ఓపిక, కోరిక, మనకు ఎక్కడ ఉంటాయి?

Question: ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పండి.

Answer:జవాబు:


ఆంధ్ర ప్రదేశ్ వైశాల్యం చాలా ఎక్కువ. హైదరాబాదు నుండి విశాఖకు షుమారు 75౦ కిలోమీటర్లు. హైదరాబాదు నుండి రోడ్ ద్వారా అనంతపూర్ కు 476, హిందూపూర్ కు 411 లేక 462 కిలోమీటర్లు. చిత్తూరుకు 572 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు. ఇలాంటి దూరాలను రైల్లో ప్రయాణించినా, బస్సుల్లో ప్రయాణించినా విపరీతమైన ఖర్చు. ప్రాణాలు గాలిలో దీపం. పైగా, ఒకే రోజు హైదరాబాదు వెళ్ళి తిరిగి రాలేరు. హైదరాబాదులో లాడ్జింగ్ ఖర్చులు ఎవరిస్తారు? లేదా బంధువుల నెత్తిన పడాలి. దూరం కోణం నుంచి చూసినా, రాష్ట్రాన్ని 4 లేక 5 చిన్నరాష్ట్రాలను చేయటం అవసరం.


కాబట్టి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాష్ట్రాలు అవసరం.

Question ప్రశ్న: మరి హైదరాబాదు సంగతి ఏమిటి?

Answer, జవాబు:


హైదరాబాదు తెలంగాణా వారిది మాత్రమే అనుకోటం అర్ధం లేదు. శాతవాహన ఆంధ్రులకాలం నుండి, తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉన్నాయి. చాళుక్యుల కాలంలోనూ అంతే. కాకతీయుల కాలంలోనూ అంతే. బహమనీల కాలంలోనూ అంతే. కొంతకాలం గజపతులు గోదావరీ తీరం వరకు ఆక్రమించినా, విజయనగరరాజులు, గోల్కొండ నవాబులు, కోస్తాను, రాయలసీమను తిరిగి ఆక్రమించారు.

బ్రిటీష్ వారికి నిజాం నవాబులు సర్కారులను బ్రిటీష్ వారికి కప్పంగా, ఇచ్చేశాడు. దక్షిణ సర్కారులను వారికి బలవంతంమీద అమ్మివేశాడు. తరువాత, బ్రటీష్ సైన్య పోషణ కొరకు రాయలసీమను దత్తం చేశాడు. అందుకే వీటికి దత్తమండలాలు అనే పేరు వచ్చింది.

బ్రిటీష్ గవర్నర్ మదరాస్ నుండి, దత్తమండలాలను, సర్కారులను పాలించటంతో, సీమాంధ్రులకు మదరాసు ప్రయాణం అవసరం అయ్యింది. కలకత్తా మద్రాస్ రైలు మార్గం ఏర్పడక ముందు అంటే 1905 ముందు విశాఖ నుండి మదరాసు వెళ్ళాలంటే, ఓడలో వెళ్లవలసి వచ్చేది.

హైదరాబాదు నుండి కర్నూలుకు 182 కిలోమీటర్లు. హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు 31౦ కిలోమీటర్లు కాగా గుంటూరుకు 2 70 లేక 3౦ 2 కిలోమీటర్లు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే , హైదరాబాదుపై ఆప్రక్కనున్న వరంగల్ వారికో,మెదక్ వారికో ప్రత్యేక హక్కులు ఉన్నాయనుకోటం ఒక భ్రమ.

హైదరాబాదులో 1956కు ముందు, వజీర్ సుల్తాన్ వారి చార్ మినార్ సిగరెట్ల ఫ్యాక్టరీ తప్ప పెద్ద పరిశ్రమలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ పెద్దరాష్ట్రంగా అవతరించాక, కేంద్రం మొత్తం 20 జిల్లాల అభివృధ్దిని దృష్టిలో ఉంచుకొని, అఖిలభారత నిధులను వెచ్చించి BHEL, HAL, HMT, BDL, ECIL, HCL, IDPL, DRDL, DLRL, DMRL, MIDHANI, NUCLEAR FUEL COMPLEX, HYDERABAD CENTRAL UNIVERSITY, ICRISAT, ENGLISH & FOREIGN LANGUAGES UNIVERSITY, వంటి పలు సంస్థలను స్థాపించారు తప్ప కేవలం తెలంగాణ 1౦ జిల్లాలనుద్దేశించి స్థాపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ, రాష్ట్రం యొక్క 2౦ జిల్లాల నిధులను వ్యయం చేసి హైదరాబాదును అభివృధ్ధి చేసింది. ఐటీ రంగాన్న అభివృధ్ధి చేసింది. ఆనాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రాంతీయ దృక్పథం ఉండి ఉంటే, విశాఖ, విజయవాడ, కర్నూలు, నగరాల్లో కూడ ఐటీ హైటెక్ సిటీ లను నెలకొల్పి ఉండేవాళ్ళు. ఇప్పడు కెసీఆర్ &కో, కోదండరాం&కో, ఇప్పుడు జైపాల్ రెడ్డి&కో, ప్రతి దాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూడటం గమనార్హం.

2౩ జిల్లాల జనం, 28రాష్ట్రాల జనం ఒకచోట చేరటం వల్ల హైదరాబాదు మార్కెట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రం మొత్తం నుండి వసూలయిన పన్నులను, వ్యాపార సంస్థల, కంపెనీల హైదరాబాదు కార్యాలయాలు, నగరంలో చెల్లించటం వల్ల హైదరాబాదు పన్నుల ఆదాయం విపరీతంగా పెరిగింది. అది మొత్తం 1౦ తెలంగాణ జిల్లాల బలం అనే భ్రమ ఏర్పడింది.

తెలంగాణ నేతలు తమ స్వార్ధం కొరకు, తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్రమైన కోరికను లేవదీశారు. హైదరాబాదునుండి, 1౦ జిల్లాలకు చెందని తెలుగు వాళ్ళను తరిమేస్తే, ఉద్యోగాలన్ని మనవే. డబల్ ప్రమోషన్లు కొట్టేయచ్చు. కెసీఆర్ ఇంక్రిమెంట్లుకూడా వాగ్దానం చేశాడు. ఇళ్ళస్థలాలు, అపార్టమెంట్లు అగ్గువకు కొనేయచ్చు. సాగర్లో, శ్రీశైలంలో, మొత్తం నీళ్ళన్నిటినీ ఆపేయచ్చు. జారాలనుండి, ఆదిలాబాదు వరకు కృష్ణ నీటిని పారించ వచ్చు. కర్నాటక నీటిని వదిలతేకదా, జూరాలకు నీరు వచ్చేది, అనే ప్రాథమిక విషయాన్ని కూడ మర్చి పోయారు. జూరాల్లో నీళ్ళుంటే కదా ఆదిలాబాదుకి వెళ్ళేది.

ఇప్పుడు హైదరాబాదు భారతీయులది అందరిదే తప్ప కేవలం తెలుగు వారిదో, తెలంగాణవారిదో కాదు. పైగా శ్రామిక హక్కుల మానవహక్కు సిధ్ధాంతం సరిగా అమలు కావాలంటే, హైదరాబాదే కాదు, 1౦ లేక 2౦ లక్షలు జనాభా దాటిన ప్రతినగరాన్నీ కేంద్రపాలిత ప్రాంతం చేయటం అవసరం. పాకిస్థాన్ ప్రేరిత తీవ్ర వాదాన్ని అరికట్టాలన్నా, నగరాల కన్నిటికీ కామన్ పోలీస్ వ్యవస్థ అవసరం. అంతేకాదు, 2౦ లక్షల జనాభా దాటిన నగరాల పెరుగుదలను అరికట్టటం కూడ అవసరమే. అంటే అక్కడ 2౦ లక్షల జనాభాకి ఎటువంటి INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలో అన్నే INFRASTRUCTURE మౌలిక సౌకర్యాలు ఉండాలి. ఎక్కువ ఉంటే జనాభ్ పెరిగి నీళ్ళు, డ్రైనేజీ, సమస్యలు వస్తాయి. ఆనగరాల స్థానంలో కొత్త చిన్న నగరాలను అభివృధ్ధి చేసుకోవాలి.

Question ప్రశ్న: ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఎన్నాళ్ళు ఉండాలి?



ఎన్నాళ్ళో ఉండనవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర,రాయలసీమలకు అసౌకర్యం. హైదరాబాదు శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు, కావాలనుకుంటే, ఉత్తర దక్షిణ తెలంగాణాలు తమతమ రాజధానులను హైదరాబాదులో ఏర్పరుచుకోవచ్చు.

Question: మరి నదీజలాల సంగతి ఏమిటి?



జూరాల్లో కృష్ణానదిలో, శ్రీరాంసాగర్ గోదావరిలో నీళ్ళే లేనప్పుడు పంపకం అనేది ఊహా జనితమైన వివాదం కాబోతున్నది. నదీజలాల విషయంలో, రాయలసీమ, తెలంగాణ, సీమాంధ్రల పరిస్థితి చాలా దీనంగా ఉండబోతున్నది. కాగితం మీద 8౦౦ టీయంసీలు 1౦౦౦ టీయంసీలు వంటి లెక్కలు ఉన్నా వాస్తవ జలాలు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు దాటి దిగువకు రావు. రెండు నదులు వరదల సమయంలో మురుగు కాలువలు గా వాడపడతాయి.

Question ప్రశ్న: మరి ఏమిటి దిక్కు?



బంగాళాఖాతంలోని సముద్ర జలాలను శుధ్ధి చేసి, సాగు, తాగు నీటి అవసరాలను కోస్తాజిల్లాలు తీర్చుకోవాలి. అంతేకా దు, ఎగువన తెలంగాణాకు, రాయలసీమకు సప్లయి చేయాలి.

Question ప్రశ్న: మరి బొగ్గు, ఇనుము, సున్నపురాయి సంగతి ఏమిటి



ఇవి శాశ్వత వనరులు కావు. వాడేస్తే వట్టి పోతాయి. గుంటలు మిగులుతాయి. సూర్య శక్తి తప్పమార్గం లేదు. మనకు భూమి కరువు కాబట్టి బంగాళాఖాతంలో కి రోడ్లను,తేలే ప్లాట్ ఫారాలను నిర్మించుకొని, సూర్యశక్తి స్టేషన్లను అభివృధ్ధి చేసుకోవాలి. దురదృష్ట వశాత్తు ఈదౌర్భాగ్య ప్రభుత్వం మంగళ్ యాన్ మీద వేలకోట్లు తగలేస్తున్నది తప్ప సూర్యశక్తి, సముద్రజలాల శుధ్ది విషయం పట్టించుకోవటంలేదు.

చిన్న రాష్ట్రాలను సమర్ధించటం అనేది అఖిల భారత అవసరం.

ఇంకా సుదీర్ఘంగా వ్రాయవలసి ఉంది. సశేషం.

067 Great honor conferred by tikkana to brihannala. బృహన్నలకు తిక్కన చేసిన గొప్ప గౌరవం.


మహాభారతం, తిక్కన, సినిమాలు, వ్యాసుడు, పద్యకవిత్వం

అర్జునుఁడు పేడి రూపమున విరటుఁగొల్వ వచ్చుట.

పాండవుల అరణ్యవాసం ముగిసింది. అజ్ఞాతవాసం మొదలవ్వాలి. పాండవులు ఎలా ముందుకు వెళ్ళాలో, ఒకరితో నొకరు చర్చించుకొని, విరటుడి కొలువులో చేరాలని నిర్ణయించుకున్నారు. తమ ఆయుధాలను ఒక స్మశానంలో, ఒక శమీ వృక్షం పైన దాచి, ఒక్కొక్కరుగా విరాటనగరంలోకి ప్రవేశించి, విరటుడి కొలువుకూటానికి చేరుకుంటున్నారు.

ధర్మజుడు కంకుభట్టుగా కొలువు సంపాదించాడు. భీముడు , వలలుడిగా వంటవాడి పని సంపాదించాడు. ఇప్పుడు అర్జునుడు, బృహన్నల వేషంలో విరటుడి కొలువులోకి ప్రవేశించాడు. అతడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి విరటుడు, సభాసదులు ముగ్ధులయ్యారు. విరటుడు అంటున్నాడు.
తిక్కన విరచిత ఆంధ్రమహాభారతం, విరాట పర్వం, ప్రథమాశ్వాసం, 231వ పద్యం.
మత్తేభం (పద్యం యొక్క ఛందస్సు).
వనితావేషము గలిగియు న్న యది చెల్వం బాఁడు చందంబు గా
దు నిరూపింప మహానుభావతయు నిర్దోష త్వమున్ రాజసం
బును శోభిల్లెడు నెవ్వడే నొకజగత్ పూజ్యుండు క్రీడార్ధమి
ట్లొనరం దాల్చిన రూపుగావలయు మీ రూహింపుఁడా యట్లగున్.


ఆఁడు చందంబు = స్త్రీ పధ్ధతి కాదు. ఇక్కడ అరసున్నా వినియోగాన్ని గమనించండి. మనం అరసున్నాల వాడకాన్ని మానేసి ఒక వందేళ్లు అయి ఉంటుంది. అరసున్న తీసి వేస్తే, ఆకాలంలో, ఆడు= ఆటలాడు అనే అర్ధం తీసేవారేమో.

మహానుభావతయు, నిర్దోష త్వము, రాజసము , జగదేక పూజ్యుడు -అర్జునుడిని ఎంత చక్కగా వర్ణించాడో గమనించండి.

విరాటరాజు అభిప్రాయంతో సభాసదులు కూడ ఏకీభవించారు.

బృహన్నల విరటుడితో నిన్ను కొలువటానికి వచ్చానన్నాడు.
విరటుడు:
ఉత్పలమాల పద్యం.
ఆయతబాహులున్ వెడఁదయైన సమున్నత వక్షమున సరో
జాయతలోచనంబులుఁ బ్ర్ససన్న ముఖంబు ను ఉదాత్త రేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీ యును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే.

శార్దూలపద్యం.
మత్ కోదండచయంబులోన నొక సమ్మానా ర్హ చాపంబు భా
స్వత్ కాండంబులు హేమచంద్రక కన ద్ వర్మంబు నీకెంతయు న
సత్కారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం
పత్ కల్యాణునిఁ జేసి వైభవము దర్పంబునన్ విజృంభింపఁగన.

కంద పద్యం.
ఏము నిను మత్స్యరాజ,
శ్రీ మహిమకు నెల్ల యుక్తు జేయఁ దలంపం
గా మామనోరథమునకు,
నీమాట విరుధ్ధమయ్యె నిది యెట్లొక్కొ.


చివరి కందం చూడండి. విరటుడు , బృహన్నలను, మత్స్యరాజ్య లక్ష్మికి పట్టాభిషిక్తుడిని చేస్తానంటున్నాడు. మా మనోరధానికి విరుధ్ధంగా మాట్లాడుతున్నావు. ఇది ఎట్లాగా! అని ఆశ్చర్యపోతున్నాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య: అంతా ఉట్టిదే. రాజుల మాటలు అలాగే ఉంటాయి, మన నేతల మాటల్లాగా. ఇదిగో ఐఐటీ, అదిగో అంతర్జాతీయ విమానాశ్రయం, విమానం ఎక్కటానికి రెడీ కాండి లాగా.

సరే , ఏదో బృహన్నల వివరణ ఇచ్చుకున్నాడు, డాన్స్ మాస్టర్ నౌకరీ ఇవ్వమన్నాడు. కానీ బృహన్నలతో, విరటుడు ఎంతో సగౌరవంగా వ్యవహరించాడు. ఉత్తరను రప్పించాడు. బృహన్నలను గురువుగా పరిచయం చేసి, గురువుతో ఎలా మెలగాలో హితవు చెప్పాడు.

నాగరికత్వంబునకుఁ చిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితంబగు తాంబూలంబు వెట్టి చిత్రంబులగు చీనాంబరంబులిచ్చి మణి మయంబులగు నాభరణంబు లొసంగి, సంభావించి, యవ్విభుండు,

.... .... ....(కొన్ని పద్యాలు)
అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని గురువుకి చక్కగా చెప్పి , ఉత్తరకు గురువుయొక్క విలువను బోధించాడు.

ఆటవెలది పద్యం.
ఎల్ల చుట్టములు తల్లియుఁ దోడును,
జెలియుఁ బరిజ నంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్క కొఱఁతయు లేదిందుఁ,
జేరి బ్రతుకు బుధ్ధి గౌరవమున.

చుట్టాలు, తల్లి , తోడు, స్నేహితురాలు, సహచరులు, అన్నీ నీకు గురువే, 'బుద్ధిగా గౌరవంతో బ్రతుకు' అని చక్కగా ఆదేశించాడు. బృహన్నలను ఎంతో గౌరవించాడు.


తిక్కన ఇంత విశదంగా ఈ ఘట్టాన్ని 27 పద్యాల్లో చిత్రించి మనకు సాక్షాత్కరింప చేశాడా. వ్యాసుడు దీన్ని 1౦ శ్లోకాల్లో తేలగొట్టాడు. పైగా విరటుడిచేత బృహన్నలను అవమానింపచేశాడు అనలేం కానీ , రాజులు డాన్స్ మాస్టర్లతో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తింపచేశాడు.

వ్యాస మహాభారతం. విరాటపర్వం. 1౦వ ఆధ్యాయం. మొత్తం 1౩ శ్లోకాలు. 5,6,7 శ్లోకాలు, విరటుడు బృహన్నలను పొగిడిన పొగడ్తలు.
విరటుడు బృహన్నలతో అంటున్నాడు.

సర్వోపపన్నః పురుషో మనోరమః; శ్యామో యువా వారణయూధపోపమాః
విముచ్య కంబూ పరిహాటకే; శుభే విముచ్య వేణీమ్ అపిన్ అహ్య కుండలే

శిఖీ సుకేశః పరిధాయ చాన్యధా; భవస్వ ధన్వీ కవచీ శరీ తదా
ఆరుహ్య యానం పరిధావతాం భవాన్; సుతైః సమో మే భవ వా మయా సమః

వృథ్ధో హ్య అహం వై పరిహార కామః; సర్వాన్ మత్స్యాంస త్రసా పాలయస్వ
నైవంవిధాః క్లీబ రూపా భవన్తి; కదం చనేతి ప్రతిభాతి మే మనః .


సారాంశం: నా కొడుకుతో సమానంగా ఉండు. నేనేమో వృధ్దుడినైపోయాను. నాభారం తగ్గించు కోవాలనుకుంటున్నాను. ఈ మత్స్య రాజ్యం మొత్తాన్ని నీవే రక్షించు. పాలించు. నా దృష్టిలో నీ వంటి వ్యక్తి నపుంసకుడు అయ్యే అవకాశమే లేదు.

విరటుడి పొగడ్తలకు అర్జునుడు సోల కాలేదు. నాట్యాచార్యుడి ఉద్యోగం చాలన్నాడు.

పదో శ్లోకంలో, విరాటుడు బృహన్నలతో:
దదామి తే హన్త వరం బృహన్నలే; సుతాం చ మే నర్తయ యాశ్చ తాదృశీః
ఇదం తు తే కర్మ సమం న మే మతం; సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి.


నీ ఇష్ట ప్రకారమే కానీలే అని ఊరు కోకుండా, 'సముద్రనేమిం పృథ్వీం తవమ్ అర్హసి'. సముద్రం వరకు ఈభూమి మొత్తాన్ని పాలించటానికి నీవు అర్హుడివి, అన్నాడు. అని ఊరుకున్నాడా? 11వ శ్లోకం చాలా కీలకం.
బృహన్నలాం తామ్ అభివీక్ష్య మత్స్యరాట్;
కళాసు నృత్తే చ తదైవ వాదితే
అపుంస్త్వమ్ అపి అస్య నిశమ్య చ స్థిరం;
తతః కుమారీ పురమ్ ఉత్సర్జ తమ్.


నృత్య,వాద్యాది కళలలో బృహన్నలను పరీక్షించి చూశాడు. నిజంగా నపుంసకుడో కాదో అని పరీక్షింపచేసి, నపుంసకుడే అని స్థిర పర్చుకున్నాడు. అప్పడు అంతఃపురం లోకి పంపాడు.

వైబీరావు గాడిద వ్యాఖ్య: విరటుడు బృహన్నల పురుషత్వాన్ని పరీక్షింపచేయటం (ఎలా? గదిలోకి పంపి, బట్టలు విప్పదీయించ, స్త్రీలచేత పరీక్షింపచేసి ఉండచ్చు). ఇది తప్పు అనికూడ అనలేము. అంతఃపురంలోకి, కొత్తవాళ్లను ఏపరీక్షలూ లేకుండా పంపటం ప్రమాదకరంకదా.

స్వర్గీయ కిషోర్ మోహన్ గంగూలీ, వ్యాసుడి సంస్కృత భారతాన్ని ఆంగ్లం లోకి అనువదించాడు. ఆ అనువాదం:
The king of the Matsyas then tested Brihannala in dancing, music, and other fine arts, and consulting with his various ministers forthwith caused him to be examined by women. And learning that this impotency was of a permanent nature, he sent him to the maiden‴s apartments. And there the mighty Arjuna began giving lessons in singing and instrumental music to the daughter of Virata, her friends, and her waiting-maids, and soon won their good graces. And in this manner the self-possessed Arjuna lived there in disguise, partaking of pleasures in their company, and unknown to the people within or without the palace.


తిక్కన వ్రాసిన, ఉత్తరకు హితబోధలు మొ|| వ్యాసుడు వ్రాయలేదు. వ్యాసుడు వ్రాసిన నపుంసకత్వ పరీక్షను తిక్కన వదిలేశాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ప్రధానంకాదు. తిక్కన కోణం లోంచి చూసినపుడు, నీవు ఈ భూమండలం మొత్తాన్నీ పాలించటానికి అర్హుడివి అన్నాక, మాస్త్రీల ముందు , నీగుడ్డలు విప్పి నీ నపుంసకత్వాన్ని ఋజువు చేసుకో అనటం అర్ధవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి తొలగించి ఉండవచ్చు. గురువుకి తాంబూలం ఇవ్వటం, వస్త్రాలు,నగలు ఇవ్వటం, వంటివి తిక్కన చొప్పించినవి ఎంతో సొంపుగా ఉన్నాయి.

రాజుల అంతఃపురాలలో, నపుంసకులను కాపలా పెట్టటం, వివిధసేవలకు వినియోగించుకోటం ఆనాటి ఆచారం. నపుంసకత్వ పరీక్షలు కూడ ఆచారమే. ఈనాడు ప్రభుత్వోద్యోగాలకు కు, కొన్న కంపెనీల్లో ఉద్యోగాలకు ,వైద్య పరీక్షల్లాగా. అక్బర్ జనానాలో, 5000 మంది దాకా స్త్రీలు ఉండే వారట. నిజాం నవాబు జనానాలో కూడ అంతే. విజయనగర రాజులు కూడా ఏమీ తక్కువ తిన లేదు. అంతఃపురంలోకి చొరబడితే శిక్ష ఏమిటో పరిశీలంచాలంటే,మల్లీశ్వరి సినిమా చూడండి.

ముగింపు

నర్తనశాల చిత్రంలో బృహన్నల అవతారంలో స్వర్గీయ ఎన్ టీ ఆర్ ను గుర్తుకు తెచ్చుకోండి.
.

RELATED LINKS

Was Arjuna (Brihannala) used to sell old sarees in Dance Room (nartana SAla)? क्या अर्जुन (बृहन्नल) नर्तन शाला में पुराने शारी बेचते थे ? అర్జునుడు (బృహన్నల) నర్తనశాలలో ఉన్నప్పుడు అక్కిడి పాత చీరెలను అమ్ముకునే వాడా ? Click to go to Post No. 072.

Tuesday, November 19, 2013

066 గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! A wedding cannot be stopped by hiding pestle stone




bifurcation, విభజన, మనుచరిత్ర, పెద్దన, పద్యకవిత్వం
తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు,అంటారు. అల్లసాని పెద్దనామాత్యుడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. ఈమహాకవి విరచితమైన మనుచరిత్ర ప్రబంధం తెలుగువారు నిత్యం కాకపోయినా, నెలకొకసారి కనీసం ఒక్క పద్యాన్నైనా చదువ తగిన గ్రంధరాజము.

పైపద్యం, మనుచరిత్ర పంచమాశ్వాసంలో, 17 వపద్యం. అల్లిక జిగిబిగియే కాక, పైపద్యం లో మనమేమి గమనించవచ్చు? జవాబు: సుందరమైన తెలుగు నుడికారం. నాలుగవ లైనులో వాడిన ఈలోకోక్తిని చూడండి. 'గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!'

ఈసామెత తెలుగు వారిలోకి 16వ శతాబ్దం నాటినుండే ఎలా ప్రవేశించింది?

ఆకాలంలో తెలుగువారిలో వోలికాశపడి కానీ, ఇతరకారణాల వల్లకానీ, బాలలను అతివృధ్దులకు ఇచ్చి వివాహంచేసే ఆచారం ఉండేది. రెండు మూడేళ్ళలోనే ఆవృధ్ధుడు గతించటం, అబ్బాల విధవ పుట్టింటికి చేరటం జరిగేది. ఇలా జరగటం ఆఇంటి ఇల్లాలికి ,అంటే పెళ్లి కూతురు తల్లికి ఇష్టం ఉండేది కాదు. ఆమె నిరసనలను ఇంటి యజమానిగానీ, బంధువులుగానీ పట్టించుకోకుండా పెళ్ళిని ముందుకు నెట్టుకెళ్ళేవారు. ఆతల్లి ఏడుస్తూ కూర్చునేది.

ఆనాటి వివాహాల్లో ఒకానొక దశలో గుండ్రాయి అవసరం పడేది. దాన్ని ముందుగా సిధ్ధం చేసుకోటం జరగనిచోట, అప్పటికప్పుడు, పెళ్ళి పందిరిలో గుండ్రాయి కొరకు వెతికేవాళ్ళు. దొరకకపోతే, వివాహం కొన్ని నిమిషాలు ఆలస్యం అయ్యేది. ఒకపెళ్ళిలో, పెళ్ళికూతురు తల్లి ఏంచేసిందంటే, గుండ్రాయి దొరకకుండా, దానిని దాచిపెట్టింది. అలాగైనా ఆపెళ్ళి ఆగిపోతుందని, ఆ అమాయక తల్లి ఆశ. ఆపెళ్ళికూతురు తండ్రి, బంధువులు మొండి ముండా కొడుకులు, ఎక్కడి నుండో మరో గుండ్రాయిని తెచ్చి ఆపెండ్లిని పూర్తి చేశారు. అలాగా, 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా', అనే సామెత వ్యాప్తమయ్యింది.

మనుచరిత్రలో ఈసామెతను వాడిన సందర్భం


బ్రహ్మ మిత్రుడు అనే పండితుడు, తన శిష్యులకు ఆయుర్వేదాన్ని నేర్పే వాడు. ఇందీవరాక్షుడు అనే రాజు , బ్రహ్మ మిత్రుడి దగ్గరకు వెళ్ళి తనకు ఆయుర్వేదాన్ని నేర్ప వలసినదిగా ప్రార్ధించాడు.

గురువుకి రాజులపై ఏవో దురభిప్రాయాలుండటం వల్ల ఆయన దానిని కొంత కటువుగానిరాకరించాడు. ఇక్కడ పెద్దన పద్యం అవశ్యం పఠనీయం, కమనీయం.
గురువు, బ్రహ్మ మిత్రుడు : నటవిట గాయక గణికా
కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
గటు వీ శాస్త్రము వల ది
చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్‌?


రాజు, ఇందీవరాక్షుడు :
తేటగీతి. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
యించుకించుక మీవంటి యెఱుక గలుగు
పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు.


గురువు, బ్రహ్మ మిత్రుడు :
కందం. ధన రాజ్య రమా మదమునఁ
గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
టెను నేరము గలదే? ననుఁ
గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్‌.


రాజు, ఇందీవరాక్షుడు :

తేటగీతి. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
వెజ్జుఁదన మేల? (యని మది లజ్జవొడమి).


ఇందీవరాక్షుడు ఇంటికెళ్ళి నిద్ర పోలేదు. మారువేషంలోతిరిగి వచ్చి గురువుగారిని మభ్యపెట్టి ఆయుర్వేదాన్ని బాగానే నేర్చుకున్నాడు. అంతటితో ఆగి, ఇంటికెళ్ళి ఉంటే బాగుండేది.

కానీ రాజులకుండే నోటి దురుసుతనం , అహంకారం ఆపని చేయనివ్వ లేదు.
శార్దూలం. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!


రాజు గురువుని 'గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా' అని హేళన చేశాడు. గురువుకి కడుపులో మండి పోయింది.

మత్తేభం. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.

వచనం. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర
ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున
విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని
కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు
మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి
గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా
మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె
జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి.


గుటగుటలు గురువుతోనా! అని గురువు ఇందీవరాక్షుడిని రాక్షసుడివై పొమ్మని శపించాడు.

తరువాతి కథ ఇంకోసారి.

పై సామెతను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి గారి శాసనసభ ప్రోరోగ్ మంత్రాంగానికి వర్తింప చేయవచ్చా?

పరిశీలన:
ముందుగా, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రే అయినప్పటికీ , లోలోపల ఏస్వార్ధాలున్నప్పటికీ, మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి ధైర్యాన్ని అభినందించి తీరాలి. కిరణ్ కుమార్ రెడ్డి

కాకపోతే రాష్ట్ర విభజనను అడ్డుకోటానికి ఆయన వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో అనుమానాస్పదం.
పైన వ్రాసిన బాల్య వివాహం కథలో , పెళ్లికూతురు తల్లి గుండ్రాయిని దాచకుండా, ఏనుయ్యో గొయ్యో చూసుకొని ఉంటే వివాహం కనీసం మైల కారణం వల్లనైనా ఆగేది. గ్రామస్థులు కూడ చొరవ తీసుకుని ఆపించి ఉండే వాళ్ళేమో. ఆమె గుండ్రాయిని దాచటం వల్ల పెళ్ళిని కొన్ని నిమిషాలు ఆలస్యం చేయించకలిగింది కానీ మొండి ముండాకొడుకు మొగుడి, ఇంకా పెద్ద ముండాకొడుకులు బంధువుల మనసులను మార్చలేక పోయింది.

ముఖ్యమంత్రిగారు కూడ, రెండు నెలలక్రితమే శాసనసభను సమావేశం చేయించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు తీర్మానం చేయించి, శాసనసభను ప్రోరోగ్ చేయించి, మర్నాడు తాను రాజీనామా చేసి ఉంటే, బహుశా, పరిస్థితులు భిన్నంగా టర్న్ తీసుకొని ఉండేవేమో.

రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియా భటులు (హోం మంత్రి, గోం మంత్రుల బృందం), రాజ్ నాధ్ సింగ్- సుష్మా స్వరాజ్ వంటి భాజపా నేతలు, పైన వ్రాసిన పెళ్ళికూతురి తండ్రి, బంధువులకు ఏమాత్రం తీసి పోలేదు. మొండి ముండాకొడుకులు అనటానికి సభ్యత అడ్డు వస్తుంది. బిజెపి అండ చూసుకొని కాంగ్రెస్ ఇలా చెలరేగి పోతున్నది. ఎప్పుడో బిజెపి వాగ్దానం చేశానంటున్నది. సీమాంధ్రలో ఎక్కడన్నా సభలను పెట్టి తెలుగు ప్రజలకు నచ్చచెప్పిందా.

దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టు వైఖరి కూడ, ఈబలవంతపు పెళ్ళి తంతును (ఇక్కడ బలవంతపు విడాకులు) ముందుకు తీసుకు వెళ్ళేది గా ఉన్నది. సుప్రీంకోర్టు ఎడల అగౌరవాన్ని వ్యక్తం చేయకుండా, వారి తీర్పులను విమర్శించటం తప్పుకాదు కనుక మనం మరి కొంత పరిశీలన చేయవచ్చు.

రాష్ట్ర విభజన అంశం ఇంకా పక్వానికి రాలేదు,తగిన సమయంలో వస్తే పరిశీలిస్తాం అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం లాగా కనిపిస్తుంది.

కేంద్రం, గోం, హోం మంత్రిగారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ సింగ్ గారు, అందరూకూడ , ఇంక కొద్ది రోజుల్లో బిల్లు నిశ్చయం అని బల్లగుద్ది చెప్తున్నారు. కేంద్రం సీమాంధ్రకు వాతలు పెట్టటానికి శలాకలను ఎర్రగా కాలుస్తున్నది. టీలీడర్లు డప్పులు కూడ వాయిస్తున్నారు. న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళటానికి ఇంతకన్నా తగిన సమయం ఇంకేమి ఉంటుంది? వాతలు పెట్టాక, శరీరం అంతా కవురు కట్టాక, ఎంత శాతం కాలింది అని లెక్క కట్టేదాకా ఆగాలా? అప్పుడు బర్నాల్ పూసి యాంటీ బయటిక్కులు రాస్తే సరిపోతుందా? అన్యాయం జరిగిం తరువాత ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోటంకన్నా ముందుగా నివారించటం మేలు కాదా.

సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అధిష్ఠానం వాతలు పెట్టటంలో, బిజేపీ నేతలు వాతలు పెట్టటంలో, సీమాంధ్రనేతల పాత్ర తక్కువేమీ లేదు.

ఆంధ్రప్రదేశ్ సభాపతి కొన్న నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. వారి మనస్సులో ఏమి తంత్రాలు దాగియున్నాయో మనుకు తెలియదు. ఇప్పుడు శ్రీవారి స్వార్ధ ప్రణాళికలు బయటికి వస్తాయేమో మనం చూడాలి. ఏపుట్టలో ఏపాము ఉంటుందో ఎవరికి తెలుసు?

065 ఎవరికి వారే యమునాతీరే!

065 ఎవరికి వారే యమునాతీరే!
bifurcation, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర
image courtesy gisserver.nic.in

సీమాంధ్ర నేతలు ఎవరి కోణంలో నుంచి వారు చూడటంలో తప్పు లేదు. కానీ అందరూ కలసి ఐకమత్యంగా వ్యవహరించాలి కదా.

ఉదాహరణ: శ్రీకాకుళ నేత, కేంద్ర మంత్రి,కిషోర్ చంద్ర దేవ్ సార్. రాష్ట్రానికి రాజధానికి భౌగోళికంగా మధ్యలో ఉండనక్కర లేదుట. విశాఖను రాష్ట్ర రాజధానిగా చేయాల్సిందేట. వీరు రాయలసీమ వారిపై కొంత దయ దలిచారు. కావాలనుకుంటే రాయలసీమ వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుకో మన్నారు.

కేంద్రమంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి లకు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య కావాలిట. రాయలసీమ, విశాఖ నివాసుల అభిప్రాయాలతో వారికి నిమిత్తం లేదు.

రాజధాని విషయంలో, కర్నూల్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డి గారి అభిప్రాయం ఇంతవరకు బయటికి రాలేదు. దివాకర్ రెడ్డి గారు రాయల తెలంగాణ అంటున్నారే తప్ప రాజధాని విషయం చెప్పటంలేదు. శ్రీ దివాకర హృదయం, హైదరాబాదునుండి బెంగుళూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఎలా లాభదాయకంగా నడపవచ్చా అనేదానిపై లగ్నం అయి ఉంటుంది. రాయలసీమ నేతలు రాయలసీమ భవిష్యత్ గురించి కాకుండా, హైదరాబాదులో తమ ఆస్తుల భవిష్యత్ గురించి, ఆలోచించటం మానేయటం అవసరం. విశాఖలో, విజయవాడలో పాగా వేయటం ఎలాగా అని ఆలోచించే కన్నా, సీమ భవిష్యత్ గురించి, ఆలోచించటం అవసరం.

రాయలసీమ ఫౌండేషన్ కి చెందిన శ్రీ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి గారు ,ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-11-2013 సంచికలో 'శ్రీబాగ్: నేటి కర్తవ్యాలు' అనే సంపాదక పేజీ వ్యాసం ద్వారా, రాయలసీమ భవతవ్యం పై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

వీటన్నిటిని బట్టి మనకు తేలేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజ్వరిల్లుతుంది. రాయలసీమలో రాజధానిని పెట్టినా, పెట్టక పోయినా, ఇది అనివార్యం. ఎందుకంటే, రాయలసీమలో రాజధానిని పెట్తే, కర్నూలైనా, ఇంకో నగరమైనా, కోస్తానుండి వచ్చే లక్షలాది మంది ఉద్యోగార్ధులను , వాణిజ్య వేత్తలను, పారిశ్రామికులను తట్టుకోలేదు. రాజధానిలో తమ పొట్ట నిండే మార్గాలు దొరుకుతాయని వారాసించటం తప్పు కాదు. 1953 నుండి కర్నూలే రాష్ట్ర రాజధానిగా కొనసాగి ఉన్నా ఇది జరిగేదే. కర్నూలుకి జరగాల్సిన మేలుకీళ్ళు హైదరాబాదుకి చేరాయి.

పైవన్నీ పరిశీలించటం ద్వారా మనం గుర్తించాల్సిన విషయాలు.

ముద్దొచ్చి నప్పుడే చంకకెక్కాలి. కేంద్రం, కాంగ్రెస్, బిజేపి, ఆంధ్రప్రదేశ్ ను 2 రాష్ట్రాలుగా చేయటానికి కత్తులు నూరుతున్నప్పుడు, తెలుగు వాళ్ళకు కలిసి ఉండే శుభ లక్షణాలు లేనప్పుడు, మెరుగయిన పధ్ధతి ఏది? అందరూ కలసి 4 లేక 5 రాష్ట్రాలను కోరటం మంచి దారి. అస్సాం 7 ఈశాన్య రాష్ట్రాలుగా విభజించ బడ్డప్పుడు, లేని అభ్యంతరం,ఇప్పుడు ఉండ నవసరం లేదు.

కాబట్టి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని పార్టీలు, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హైదరాబాదును Union Territory కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, హైదరాబాదు లోని ఎన్ జీ వో లకు నగరంలో ఉండటానికి అవసరమైన ఆప్షన్లను ఇవ్వటం, నదీజలాల పంపిణీ, ప్రాజెక్టులకు నీటి విడుదలకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పరిపాలక వ్యవస్థను ఏర్పరచటం, కొత్తరాజధానుల నిర్మాణానికి ఆర్ధిక సహాయం, మొ|| డిమాండ్లకు ఈ నాలుగు లేక అయిదు రాష్ట్రాల డిమాండు అదనం గా ఉండాలి.

కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికీ, బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకి, భవిష్యత్ దృష్టి అవసరం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కలాగ ఉండరు. ఏనేతలైనా విజృంభించి, సీమాంధ్రప్రదేశ్ ని, మరో కాశ్మీర్ గానో, శ్రీలంకగానో, మార్చే అవకాశం ఉంది. హైదరాబాదుని మరొక పాకిస్థాన్ గా టీలీడర్లు తీర్చి దిద్దే అవకాశాలున్నాయి. సీమాంధ్ర మరియు తెలంగాణ మధ్య అంతర్యుధ్ధాలు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక దౌర్భాగ్యపు ఆదర్శం గా తయారు అయ్యే అవకాశాలు పుష్కలం.

ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశ హితం కాకుండా, పార్టీల స్వల్పకాలిక రాజకీయ లాభాల కొరకు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అశాంత చెలరేగి, దేశఐక్యతకే భంగకరం కావటం అనివార్యం.

Monday, November 18, 2013

064 శ్రీశ్రీ, విశ్వనాథ తప్ప మిగిలిన వారిని మహాకవి అనకూడదా? Shouldn't we call great poets mahAkavis?



పద్యకవిత్వం,భావకవిత్వం,అమలిన శృంగారం, అవార్డులు, సాహిత్యం, బిరుదులు



కీర్తి శేషులు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారిని ఆచార్య అని అనకుండా 'మహాకవి' అని నేను నా బ్లాగ్ పోస్టులో వ్రాయటం ఎంతవరకు సమంజసం, అనే ప్రశ్న ఉదయించింది.

మహా కవి అంటే గొప్ప కవి. ఏది గొప్ప, ఏది గొప్ప కాదు అనేదానికి నిర్వచనాలు లేవు. గొప్ప అనటానికి వందలకొలది దస్త్రాలు వ్రాయవలసిన పని లేదు. గంగి గోవు పాలు గరిటెడయిన చాలు, కడివడైన నేమి ఖరము పాలు అని వేమన అన్నాడు.

సర్వజ్ఞనామధేయం సింగభూపాలునికే ఉర్వింజెల్లును అన్నట్లుగా, మహాకవి నామధేయం కేవలం శ్రీశ్రీకి, విశ్వనాధ సత్యనారాయణ లకే చెల్లుతుంది, ఇతరులను మహాకవులనరాదు , అని ఎక్కడా లేదు.

భారత రత్న అవార్డు ,అవార్డే తప్ప బిరుదు కాదు. అయినా బిరుదుల్లాగా పేర్లకు ముందు తగిలిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర భారత రత్న పొందిన వారు మాత్రమే భారత రత్నలు అనటం కూడ అర్ధం లేదు. భారతప్రభుత్వం నిజమైన రత్నాలను గుర్తించ లేకపోతే , ఆపని ప్రజలు చేయాల్సి వస్తుంది. అయితే ఎవరు సర్కారీ భారతరత్నలో, ఎవరు డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకున్న భారతరత్నలో, ఎవరు ప్రజల నాలుకలమీద నడయాడే సత్తెకాలం సత్తెయ్య భారతరత్నలో అర్ధంకాని గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత సర్కారీ బిరుదులను సర్కారీ బిరుదులు గానే ఉండనిచ్చి , ప్రజలు క్రొత్త టైటిల్స్ ని వెతకాలి.

రాయప్రోలు సుబ్బారావు గారిని మహాకవి అనకూడదు, ఆచార్య అనాలి, అనే వారు ఉన్నారు.

ఆచార్య అనే పదం రూఢి అర్ధంలో మనకు రెండు సూచనలను ఇస్తుంది.

మొదటిది: కొన్ని ఉత్తర భారత దేశం విశ్వవిద్యాలయాలు, శాస్త్రి= bachelor, ఆచార్య=Master, వాచస్పతి= Ph.D. వంటి డిగ్రీలను ఇస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి -శాస్త్రి, ఆచార్య రంగా గారి -ఆచార్య ఈతరహాకి చెందినవే. కొన్ని విశ్వవిద్యాలయాలు తమ ప్రొఫెసర్లను ఆచార్య అంటున్నాయి. రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా తమను విశ్రాంతాచార్యులు అంటున్నారు.

రెండవది: రాయప్రోలు వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతిగా 25 ఏళ్ళు పనిచేశారు. అందుచే వారిని ఆచార్య అనటం ఒప్పే. వారికి అభినవ నన్నయ అనే బిరుదు , కనిపిస్తున్నది. రాయప్రోలు వారు భావ కవిత్వంలో, విరహ కవిత్వంలో, అమలిన శృంగార భావాల వ్యక్తీకరణల్లో ఉద్దండులు.

మహాకవి అనవచ్చును. ఆచార్య అనవచ్చును. ఎలా అయినా అనవచ్చును. స్పష్టత వచ్చిందనుకుంటాను.
మనుస్మృతి 8వ ఆధ్యాయం, 1 నుండి 150 శ్లోకాలు. లా విద్యార్ధులకు ఉపయోగం.
Click.
or లేక ఇంకొక హోస్ట్ ayyo.x10.mx. నుండి.
Click.

063 Sachin should donate 10 crore each to Indian aged mothers and pregnant mothers. భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ రూ.1౦ కోట్లను వృధ్ధమాతల, గర్భిణీ స్త్రీల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. ఇవ్వడనుకోండి

అవార్డులు, సమాజం, క్రీడలు, క్రికెట్, మార్క్సిజం



భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన భారతరత్న అవార్డును, ఆఖరి టెస్టును, ముందుగా తన మాతృశ్రీకి, తరువాత భారత్ లోని మాతృశ్రీలందరికి అంకితం చేయటం కూడ, మీడియాలో తాటికాయలంత అక్షరాలతో ప్రాచుర్యం పొందాయి.

శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన మాతృశ్రీని గౌరవించుకోటం ముదావహం. అది ఆయన వ్యక్తిగత విషయం కూడాను.

భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ తన భారతరత్న అవార్డును, భారత్ లోని మాతృశ్రీలందరికి అంకితం చేయటం, ఒక ముఖ్యమైన ప్రశ్నను, ఈ రచయిత వైబిరావు గాడిదబుధ్ధి లేవదీసింది.

భారతీయ మాతృశ్రీలు ఈ అంకితం చేయబడిన భారతరత్న, క్రికెట్ ల భారాన్ని మోయగలరా? భారతీయ యువ గర్భిణీ స్త్రీలకు, ఏ ఆధారమూ లేని వృధ్దమాతలకు, భారత రత్న నాలుక గీచుకోటానికి కూడ పనికి రాదు. ఇవాళ్ళా రేపూ టంగ్ క్లీనర్లు కూడ ఐదు రూపాయలు లేనిది రావటం లేదు.

భారత రత్న శ్రీ సచీన్ టెండూల్కర్ సార్ చెమటోడ్చో, ఓడ్చకుండానో, కొంతభాగం చెమటోడ్చి, కొంతభాగం ఓడ్చకుండా, ఒక వెయ్యి కోట్లదాకా కూడబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఒక పది శాతం చెమట ఓడ్చనిది అనుకుంటే, ఒక 1౦౦ కోట్లు అవుతుంది.

డబ్బు పిల్లలు పెట్తుంది అంటారు.

ఆ 1౦౦ కోట్లు పెట్టే పిల్లలు ఏడాదికి 1౦ కోట్లు అనుకుంటే, టెండూల్కుడు, ఆ 1౦ కోట్లను వృధ్ధమాతల, గర్భిణీ స్త్రీల సంక్షేమానికి విరాళంగా ఇవ్వ వచ్చు.

టెండూల్కుడు, రిటైరయిన మర్నాడు, ప్రొద్దున్నే తనకు ఏమి చేయాలో తోచలేదని చెప్పినట్లు, మీడియా టాంటాం కొట్టింది. తాను ఒక గౌరవనీయ రాజ్యసభ సభ్యుడనని, ఆయన, మీడియా కూడ మర్చి పోయింది. టెండూల్కుడు, రాజ్యసభ సభ్యుడిగా తని విధులను నిజాయితీగా నిర్వహించ దలుచుకుంటే ఇరవయి నాలుగు గంటలు సరిపోవు. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు వివిధరూపాలలో నెలకు ఒక లక్ష రూకలదాకా ముట్టుతాయి. అవి వృధ్ధమాతృశ్రీలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చినా మహోపకారమే.

పరిమితులకు మించి సమీకరించే లక్ష్మీపతులకు భవిష్యత్ వివేకం అవసరం. వారు సమాజానికి చిన్న వాటా అయినా ఇవ్వకపోయినా ఇబ్బందేమీ లేదు. దేశంలో నిజమైన మార్క్సిస్టు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చినపుడు మొత్తం లాక్కొని ప్రజలపరం చేస్తుంది.

Sunday, November 17, 2013

062 కార్ల్ మార్క్స్ గెలిచాడు Karl Marx has won.

062 కార్ల్ మార్క్స్ గెలిచాడు Karl Marx has won. Karl Marx, కార్ల్ మార్క్స్, రాయప్రోలు సుబ్బారావు, విభజన, bifurcation, పద్యకవిత్వం, దేశభక్తి కవిత్వం

కార్ల్ మార్క్స్ గెలిచాడు- అంటున్నారు ఆయన ఏమి చెప్పాడేమిటి?

ఆయనేం చెప్తాడు లేండి పాపం, ఉన్న మాటే అన్నాడు. మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే నన్నాడు.

తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ సోదరుల మధ్య సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలని మీ అభిప్రాయమా?

సోదరులు అనే మాట, నూతన సంవత్సర శుభాకాంక్షలు Wish you happy new year లాగా అతిగా వాడబడి అరిగి పోయింది. కొందరు యువకులు ఏ సినిమాలో అంటించుకున్నారో గానీ, కనిపించిన ప్రతి వాళ్ళనీ పరిచయం ఉన్న వాళ్ళైనా, లేనివాళ్ళైనా, అంకుల్ అనో, ఆంటీ అనో పిలుస్తూ ఉంటారు. ఈపిలుపుల్లో నిజాయితీ, సీరియస్ నెస్ ఉండదు.

ప్రపంచ రాజ్యాలైయినా, భారతదేశమైనా, తెలుగు గడ్డ అయినా, మానవ ప్రవర్తనను నిర్దేశించేది పెట్టుబడి దారీ విధానం. తన నీడను ఏవ్యక్తైనా, ఎలా తప్పించుకోలేడో, అలాగే పెట్టుబడి దారీ విధానాన్ని ఎవరూ అతిక్రమించలేరు.

తెలుగు జాతి మనది, నిండుగ వెలుగజాతి మనది, వంటి పాటలు కేవలం భావావేశ సంజనితాలే తప్ప సమాజపు నగ్న సత్యాలకు ప్రతి బింబాలు కావు.

మనం పట్టించుకోం గానీ, మనలో కనీసం నాలుగు రకాల వ్యక్తులు ఉన్నారు.

మెదడు వీరులు. మెదడు పరిసరాలను, వాతావరణాన్ని, పరిశీలించి మనకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటుంది. మెదడు తన తెలివి తేటలను ఉపయోగించి ఇది చేయి, అది చేయద్దు అని చెప్తూ ఉంటుంది. మెదడువీరులు కేవలం మెదడు మాటలే వింటారు. హృదయం చెప్పేదాన్ని పట్టించుకోరు.

సాంకేతికంగా ఆలోచిస్తే హృదయం అని మనం భావించే గుండెకాయ (heart) రక్తాన్ని శరీరం నుండి పంపు చేసుకొని ఊపిరితిత్తులకు పంపించి, ఆక్సిజన్ తో శుధ్ధి చేయించి, వెనక్కు తెచ్చుకుని తిరిగి ఆపాదమస్తకం శరీర భాగాలకు పంపించే ఒక గొప్ప పంపు మాత్రమే. కానీ తాత్వికులు, ఈ హృదయానికి దయ, ప్రేమ, కృతజ్ఞత, సానుభూతి (sympathy, empathy) వంటి ఉదాత్తమైన గుణాలను అంటగట్టారు.

హృదయవీరులు మెదడు చెప్పే దాన్ని పట్టించుకోరు. తమకు ఉండే దయ, ప్రేమ, కృతజ్ఞత, సానుభూతి (sympathy, empathy) వంటి ఉదాత్తమైన గుణాలు అందరికీ ఉండాలని ఆశిస్తారు. పెట్టుబడి దారీ విధానం మనపై విధించే పరిమితులను గుర్తుంచుకోరు. తమ భావావేశంలో తాము కొట్టుకు పోటమే తప్ప, లోకరీతులను గమనించరు. కవులు మనకి హృదయవీరులలో అగ్రగణ్యులు. వారు వ్రాసే కవితలు , పద్యాలు, కొంతకాలం ప్రజలను పెట్టుబడిదారీ వాస్తవాలను, తమ రాగ ద్వేషాలను మరచి పోయేలాగ చేస్తుంది. ఆసమయంలో, ప్రజలు మెదడు ఇచ్చే సలహాలను వినిపించుకోకుండా, హృదయం చెప్పినట్లుగా నడచు కుంటూ, పోరాటాలు చేస్తారు. త్యాగాలు చేస్తారు. కొన్నిసార్లు ప్రాణాలనే అర్పించుతారు.

నేతలు మెదడు వీరులు, సామాన్యప్రజలు హృదయవీరులు అయితే పలు సమస్యలు తలెత్తుతా యి. ప్రస్తుతం, సీమాంధ్ర, తెలంగాణలో జరుగుతున్నది ఇదే.

అయితే లోకంలో 100% మెదడు వీరులు గానీ, 100% హృదయవీరులు గానీ ఉండటం చాలా అరుదు.

మూడవ రకం వారు, 70% మెదడు వీరులు, 30% హృదయవీరులు. వీరులు ఎక్కువగా వ్యాపార తత్వం కలిగి, అప్పుడప్పుడు భావావేశాలు కలిగి, చందాలు అవీ ఇస్తు ఉంటారేమో కానీ,ప్రాధమికంగా ఎత్తులు, జిత్తులు, వీరి సహజ స్వభావం.

నాలుగవ రకంవారు, 40% మెదడు, 60% హృదయం, ఉండి భావావేశాల పాలు ఎక్కువ. కనుక వీరిని మంచి ఐడియాలతో ఉత్సాహపరచ కలిగినప్పుడు సత్ఫలితాలను రాబట్ట కలుగుతాము. గాంధీ గారు లక్షల మంది భారతీయులను లాఠీ దెబ్బలను తినగలిగేలాగా, జైళ్ళలో నూనె గానుగలను తిప్పే లాగా, మండుటెండలే రాళ్ళు పగలగొట్టేలాగా చేయగలిగింది, ఈనైపుణ్యంతోనే.

ద్వేషంతో కూడిన భావాలతో వారి మస్తిష్కాలను కిర్రెక్కించినప్పుడు, దుష్ ఫలితాలను రాబట్ట కలుగుతాము . కెసిఆర్&కో, కోదండరాం &కో తెలంగాణ యువకులను ఉద్రేకపరచి ట్యాంకుబండుపై విగ్రహాలను పడకొట్టించిందీ, వందలమంది యువకులచేత ఆత్మ హత్యలు చేసుకునేలాగా ప్రేరేపించింది, ఈనైపుణ్యంతోనే.

తెలుగు వాళ్ళలో అత్యధికులు నాలుగో రకం అని వేరుగా చెప్ప నవసరంలేదు.

ఇప్పుడు కవుల భావావేశాన్ని అధ్యయనం చేద్దాం.

ప్రబోధము.

మహాకవి: రాయప్రోలు సుబ్బారావు.


సీసం. అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వ
    విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగా
    పలు శస్త్రశాలలు నిలుపునాడు,
విద్యానగర రాజవీధులన్‌ కవితకు
    పెండ్లి పందిళ్ళు కప్పించునాడు,
పొట్నూరికి సమీపమున ఆంధ్రసామ్రాజ్య
    దిగ్జయస్తంభ మెత్తించునాడు,

తేటగీతి. ఆంధ్రసంతతీ కేమహితాభిమాన
దివ్యదీక్షాముఖ స్ఫూర్తి తీవరించె,
ఆ మహావేశ మర్థించి యాంధ్రులార!
చల్లు డాంధ్ర లోకమున నక్షతలు నేడు.

ఇక్కడ, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు, నాలుగు ప్రాంతాలకీ గొప్ప గొప్ప ఉదాహరణలు ఇచ్చారు. అమరావతి, దక్షిణ కోస్తా. ఓరుగల్లు, తెలంగాణ. విద్యా నగరం, రాయలసీమ. పొట్నూరు ఉత్తరాంధ్ర.

అమరావతిలో బౌధ్ధుల విశ్వవిద్యాలయాలు, ప్రజలకు ఉపయోగపడినట్లుగా దాఖలాలేమీ లేవు. నాగార్జునుడి కాలం లో కొంత మేరకు చవక లోహాలను బంగారంగా మార్చే ఆల్ కెమీ (రసవాదం) అభివృధ్ధి చెంది ఉండవచ్చు. ఆవిశ్వ విద్యాలయాలను నిర్వహించటానికి, భిక్షువులను పోషించటానికి, రాజులు ప్రజలపై పన్నులు బాది ఉంటారు.

ఓరుగల్లు శస్త్రశాలలు తుగ్లక్ బానిస జునాఖాన్ ముందు ఎందుకూ పనికి రాలేదు. అంతేకాదు రెడ్డి దండనాధులు ,వెలమ దండనాధులు తన్నుకొని, రెండవ ప్రతాపరుద్రుడికి సహాయం చేయకపోటం వల్ల , జునాఖాన్ రెండవ ప్రతాపరుద్రుడిని బందీగా ఢిల్లీ తీసుకెళ్ళ గలిగాడు. రెండవ ప్రతాపరుద్రుడు దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

ఇంక విద్యానగరం విషయానికి వస్తే, విజయనగర రాజుల కాలంలో, హంపీలో పన్నెండు వేలమంది దాకా వేశ్యలు ఉండేవారుట. వారినుండి రాబట్టిన సుంకాలతో సైనికుల జీతాల చెల్లింపుజరిగేదిట. కవితకు పెళ్లి పందిళ్లకు వరహాలను ఎక్కడినుండి తెచ్చే వాళ్ళో మనం ఊహించోకోవాలి.

పొట్నూరు జయస్తంభం కూడ, రాయల జైత్రయాత్రకు చిహ్నంగా వర్ణించు కోవచ్చు కానీ, ఆజైత్రయాత్రల వల్ల బహమనీలను కానీ, ఢిల్లీ సుల్తానులను గానీ ఎదుర్కున్నా రా అంటే , అదేమీ లేదు. రాజుల సైన్యాలు జైత్రయాత్రలకు వెళ్తూ ఉంటే దారి వెంట ఉండే పంట పొలాలు నాశనమౌతాయి తప్ప, ప్రజలకు ఒరిగింది ఏమీలేదు.


సీసం.  తనగీతి అరవజాతిని గాయకులనుగా
    దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి,
తనపోటులు విరోధితండంబులకు సహిం
     పనివిగా మెఱసిన తెనుగు కత్తి,
తన యందములు ప్రాంతజనుల కభిరుచివా
     సన నేర్ప నలరిన తెనుగురేఖ,
తనవేణికలు వసుంధరను సస్యశ్యామ
     లను జేయ జెలగిన తెనుగు భూమి,

తేటగీతి. అస్మదార్ద్రమనోవీధి నావహింప
జ్ఞప్తి కెలయించుచున్నాడ! చావలేదు
చావలే దాంధ్రజనమహోజ్జ్వల చరిత్ర
హృదయములు చీల్చి చదువుడో సదయులార!

మొదటి పాదం త్యాగరాజు, శ్యామశాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వాగ్గేయకారులను ఉద్ధేశించింది. ఇది బాగానే ఉంది. రెండు,మూడు,నాలుగు పాదాలు, ఊకదంపుడు అనలేము కానీ, 'ఆంధ్రజనమహోజ్జ్వల చరిత్ర' లో అత్యున్నత ఘట్టాలని కూడా కీర్తించ లేము.


సీసం. కృష్ణాతరంగ పంక్తిన్‌ త్రొక్కి త్రుళ్ళింత
     నాంధ్రనౌకలు నాట్యమాడునాడు,
ఇంటింట దేశిసాహిత్యదీపములతో
     నాంధ్రతేజస్సు తీపారునాడు,
సుకుమార శిల్పవస్తు ప్రపంచమునందు
    నాంధ్రనైపుణి పంతమాడునాడు,
సమర సేనావ్యూహ జయపతాకలక్రింద
    నాంధ్ర పౌరుషము చెండాడునాడు,

తేటగీతి.
చూచి, సంతోషమున తలలూచి, గర్వ
మాచి ఆంధ్ర పుత్రీ పుత్రు లందగలరు
శాంతి, అందాక లేదు విశ్రాంతి మనకు;
కంకణ విసర్జనల కిది కాల మగునె?

ఈ ఆంధ్రనౌకలు నాట్యమాడటం, కొన్న పడవలను ఉద్దేశించిందే తప్ప వాటి సైజును అతిగా ఊహించటం కష్టం. పెద్దపెద్ద నౌకలు వచ్చే స్థాయిలో నీళ్ళు ఉండే జీవనది కృష్ణానది కాదు. దేశి సాహిత్యదీపాలు,ఊహించుకోటానికి సుందరంగా ఉన్నాయే తప్ప మనకెక్కడా దొరకవేమి? శిల్పనైపుణి విషయంలో మనం అగ్రగణ్యులమే అనే విషయంలో సందేహం లేదు. ఈ జయపతాకలు, ఆంధ్రపౌరుషము, తురుష్కులముందు, యూరోపియన్ల ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి?

061 కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి శ్రీజైపాల్ రెడ్డికి సమన్యాయం అంటే తెలియదా? Doesn't Shri Jaipal Reddy know the meaning of equitable justice?


The Union Minister of Science and Technology, apparently does not know about the meaning of Equitable Justice, or Natural Justice. He has a great reputation of getting by heart an English Dictionary. But Dictionaries have their own ways. They cannot hide the 'class (vargam)' character of persons. Persons belonging to bourgeoisie landed classes know only domineering oppressive behaviors. They, therefore, do not know anything about natural justice.

నిఘంటువును కంఠస్థం చేశారని చెప్పబడే, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి శ్రీజైపాల్ రెడ్డికి సమన్యాయం అంటే తెలియదంటే ఆశ్చర్యపడ నవసరంలేదు. (చంద్రబాబు నాయుడు గారికి సమన్యాయం అంటే బాగా తెలుసా అంటే, ఆయన అవకాశవాదం గురించి తెలిసిన వాళ్ళు ఆయనను సీరియస్ గా తీసుకోటం మానేసి చాలాకాలం అయ్యింది). నిఘంటువులదారి, నిఘంటువులదే. నిఘంటువులు వర్గలక్షణాలను దాచిపెట్టలేవు. శ్రీజైపాల్ రెడ్డి గారు, తెలంగాణలో, మహబూబ్ నగర్ జిల్లా- నల్గొండజిల్లా సరిహద్దుల్లో, మాడుగుల గ్రామంలో పెత్తందారీ భూస్వా మ్య సామాజిక వర్గం నంబర్ 1 లో జన్మించారు. తెలంగాణాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఏగ్రామంలో నైనా సమన్యాయం ఉందా, అని ప్రశ్నించుకుంటే, ఆభూస్వామ్య వర్గాలవారికి, గ్రామ పెత్తందార్లకు, సమన్యాయం అంటే ఎందుకు తెలియదో అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో, తెలంగాణా గ్రామాల్లో ఎన్నికల వ్యూహం అంటే అర్ధం గ్రామ పెత్తందార్లతో సత్సంబంధాలను నెరపుకోటం, వారి ద్వారా నగదును, మద్యాన్ని, బ్యాంకు ఋణాలను పంపిణీ చేయించుకోటం, ఐదేళ్ల కొకసారి జనానికి కనిపించి చేతులూపటం, అంతవరకే. పెత్తందార్లు ఏమి చేసినా, శాసన సభ్యులు, లోక్ సభ సభ్యులు పట్టించుకోరు. గ్రామాల్లో పెత్తందార్లకు వైరి పక్షం వారికి కూడా, సమన్యాయంపై ప్రేమ కాకుండా, పెత్తందార్ల పైరవీల్లో ఎలావాటా కొట్టాలా, అనే దృష్టి ఉంటుంది. ఈకోణంలోనుంచే, పెత్తందార్ల బాధితులను పెత్తందార్లపైకి రెచ్చగొట్టి తమాషా చూడటం జరుగుతుంది, తప్ప న్యాయం జరగదు. సాధారణంగా పెత్తందార్లు, వారి వైరి వర్గం వారు కూడా ఒకే కులానికి చెంది ఉంటారు. చివరికి వారూ వారూ ఏకమైతే, వెనుకబడిన తరగతి, దళిత తరగతి కి, చెందిన బాధితులు వెర్రి వాళ్ళు అవుతారు.

కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి శ్రీజైపాల్ రెడ్డి గారి దృష్టిలో సమన్యాయం అంటే, సోనియా మాత తరఫున తాము పెత్తందార్లుగా వ్యవహరించటం. గ్రామ పెత్తందార్లు, మండల పెత్తందార్లు, శాసనసభా నియోజక వర్గ పెత్తందార్లు, లోక్ సభ నియోజక వర్గ పెత్తందార్లు, తెలంగాణ ప్రాంత పెత్తందార్లు, రాష్ట్ర పెత్తందార్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు సోనియా మాతకు మధ్యలో ఇంఛార్జీ పెత్తందార్లు, ఇదీ నిచ్చెన.

తెలంగాణ గ్రామాల్లో, మనం ఒక విచిత్రాన్ని చూడచ్చు. భూస్వామ్యకులం నంబర్ 1 పెత్తందార్లు, ఉండే గ్రామంలో భూస్వామ్యకులం నంబర్ 2 కుటుంబాలు సాధారణంగా కనపడవు. ఏగ్రామంలో నయినా, సాధారణంగా, కులం నంబర్ 1 అయినా ఉంటుంది. లేక కులం నంబర్ 2 అయినా ఉంటుంది. వెనుకబడిన తరగతి, దళిత తరగతి కి, చెందిన బాధితులు వెర్రి వాళ్ళు అన్ని గ్రామాల్లో ఉంటారు. కనుక గ్రామ రాజకీయాలు ఒకేకులంలోని వైరి వర్గాల మధ్య జరుగుతాయి.

కాబట్టి శ్రీ జైపాల్ రెడ్డి, సమన్యాయం అనే పదాన్ని ఎగతాళి చేయటంలో ఆశ్చర్యం లేదు.

15.7.2014 నాడు జోడించినది.

జైపాల్ రెడ్డిగారికి అన్యాయం ఇపుడు గుర్తుకు వచ్చిందే.



పోలవరం గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ, పార్లమెంటు బిల్ పాస్ చేయగానే శ్రీజైపాల్ రెడ్డిగారికి ఏదో ఘోర అన్యాయం జరుగుతున్నట్లు గుర్తుకు వచ్చింది. అసలు న్యాయం ఏమిటి. తెలంగాణ వారు కోరింది 1956 ముందరి తెలంగాణ. 1956 ముందర భద్రాచలం ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. న్యాయం ప్రకారం చూస్తే, భద్రాచలం డివిజన్ మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ కి బదిలీ చేస్తే 1956 ముందర స్థితి వస్తుంది. అలా చేయకుండా భద్రాచలాన్ని ఖమ్మంలో ఉంచటం ద్వారా తెలంగాణ యెడల కాంగ్రెస్, బిజెపి లు పక్షపాతం చూపినట్లయింది.

నిర్వాసితులయ్యే గిరిజనులకు అన్యాయం జరగకుండా పునరావాసం, పరిహారాల చెల్లింపు, అన్నిరకాలుగా వారిని ఆదుకోటం శేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేయకపోతే, తెలంగాణ నేతలు అపుడు గిరిజనులకు ఆపద్బాంధవులు లాగ అవతరించ వచ్చు. మన తెలంగాణ రెడ్డి దొరలు, వెలమ దొరలు, గిరిజనుల యెడల ఎంత ప్రేమాభిమానాలను కలిగి యున్నారో కదా.

Saturday, November 16, 2013

#060 సర్దార్ పటేల్ కు , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రిలకు భారతరత్న రద్దు చేయాలి. Govt. should cancel Bharat Ratna Awards conferred on Sardar Patel, Netaji, Ambedkar, Khan Abdul Gaffar Khan, and Lal Bahadur Sastry.


అవార్డులు, పటేల్, నేతాజీ



సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు మన జాతికి మార్గదర్శకులు. తమ కర్తవ్య నిర్వహణలో, జాతిసేవకు, తమజీవితాలను అంకితం చేసిన మహనీయులు. ఇట్టి మహనీయులు భారతరత్న గుర్తింపు పొందని వారనేకులు ఉన్నారు. భారతరత్న గుర్తింపును వారు పొందినా, పొందకపోయినా, జాతి వారిని మర్చిపోయినా, వారి ఔన్నత్యానికి భంగం కలుగదు.

క్రికెటర్లు కేవలం ఆటగాళ్ళు. వారికి ఖేల్ రత్న వంటి క్రీడలకు సంబంధించిన అవార్డులు ఉన్నాయి. అది కాక వారు తమ సేవలకు కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలలోకూడ తాము చేసిన సేవలకన్నా అధికంగానే ఆదరణనను పొందుతున్నారు.

సచీన్ టెండూల్కర్ భారతీయ క్రికెటర్ లు అందరిలోకీ గొప్పవాడా అంటే ప్రశ్నార్ధకమే. ఎన్ని సార్లు విఫలమౌతూ పోయినా, క్రికెట్ కంట్రోల్ బోర్డ్ , సచీన్ కి అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళింది. అందు వల్ల టెండూల్కర్ 200 టెస్టులను పూర్తి చేయటంలో ఘనత ఏమీ లేదు. సునీల్ గవాస్కర్ , సర్దేశాయ్, పోలీ ఉమ్రీఘర్, వాడేకర్, వంటి వారితో పోలిస్తే సచీన్ ఎదుర్కున్న బౌలర్లు అరివీర భయంకరులు కాదు. గవాస్కర్ కొట్టిన సెంచరీల్లో కొన్ని హెల్మెట్ ధరించకుండా, గాయాలకు భయపడకుండా చేసినవి ఉన్నాయి. విదేశాల్లో చేసినవి ఉన్నాయి. ఆకాలంలో రోజూ క్రికెట్ మాచ్ లు ఉండేవి కావు. అందువల్ల ఆటగాళ్ళకు ఎక్కువ మాచ్ లు ఆడే అవకాశాలు, ఎక్కువ సెంచరీలు చేసే అవకాశాలు దొరికేవి కావు.

గ్రౌండ్లు చిన్నవిగా ఉండి బౌండరీ లైన్లు కుంచించుకు పోవటం, పిచ్ లను బ్యాటింగ్ కు అనుకూలంగా తయారుచేయటం, మాచ్ ఫిక్సింగులు జరగటం వంటి పలుకారణాల వల్ల నేటి బ్యాట్స్ మెన్లు అధికసెంచరీలు చేయటం, భారీస్కోర్లను నమోదు చేయటం జరుగుతున్నది. టీం కొరకు కాకుండా వ్యక్తిగత రికార్డుల కొరకు ఆడే సంస్కృతి ప్రబలటం వల్ల హీరోలు సెంచరీలు చేస్తున్నారు, టీంలు జీరో లవుతున్నాయి.

సచీన్, గవాస్కర్, ద్రావిడ్, కపిల్, బేడీ, వంటి వారి మధ్య మెరిట్ లో స్వల్ప భేదమే ఉందని మనం గుర్తించక పోతే, ఘోరమైన అన్యాయాన్ని సహించిన వాళ్ళమౌతాం.

అంతే కాదు, ఫలానా వ్యక్తికి పద్మ అవార్డు వచ్చింది, కాబట్టి వాడు గొప్పవాడు అనుకునే స్థితి ఏర్పడినపుడు వ్యక్తి బిరుదుకు అలంకారం కావటంపోయి, బిరుదే అతనికి అలంకారం అవుతుంది. వీడికి ఈబిరుదు ఎందుకు ఎలా వచ్చిందా, అని వితర్కించుకునే పరిస్థితి రాకూడదు.

ఫలానా వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు రాలేదు, అని ప్రజలు బాధ పడాలే తప్ప వీళ్లకు ఈ బిరుదులు వచ్చాయంటే, వీళ్ళేదో ఇన్ ఫ్లూయన్స్ ఉన్న మహా పెద్ద మనుషులు అయి ఉంటారు లేక పైరవీ చేసుకొని ఉంటారు, అని సందేహించే స్థితి రాకూడదు.

వ్యవసాయం, లోహశిల్పి, దారుశిల్పి, వంటి నిర్మాణాత్మక వృత్తులను విస్మరించి, ఉత్పత్తి శూన్యం, వనరులను వృధా చేసే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం అర్ధం లేదు. ఇచ్చిరిపో,
ఎన్నో క్రీడలను విస్మరించి క్రికెట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వటం అర్ధం లేదు. ఇచ్చిరిపో,
ఎందరో గవాస్కర్ వంటి విశ్రాంత భీష్ములను విస్మరించి సచిన్ ను నెత్తిన పెట్టుకోటం వేలం వెర్రి అవుతుంది తప్ప వివేకం అవదు. Sunil Gavaskar సునీల్ గవాస్కర్

సచీన్ కి భారతరత్న ఇవ్వాలంటే, గవాస్కర్ కూ, సచీన్ పది రెట్లు ఎక్కువ మెరిట్ కలిగిన వాడవ్వాలి. వారిద్దరి మధ్య అంత తేడా లేదు కదా. సచిన్ గవాస్కర్ కన్నా గొప్ప క్రికెటర్ అనుకున్నా వారి గొప్పతనంలో అంతరం ఏది. గవాస్కర్ 10 అనుకుంటే, సచిన్ 11-12 దాటలేడు.

సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారినీ, --- సచీన్ ను, లతామంగేష్కర్ ను ఒకే గాట కట్టేయటం అంటే సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి లను అవమానించటమే.

కాబట్టి, తక్షణం, సర్దార్ పటేల్ , నేతాజీ, అంబేద్కర్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి లకు ఇచ్చిన భారతరత్నలను రద్దుచేయాలి.

నిజమైన భారతరత్నాలకు ఏ అవార్డులు అవసరం లేదు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |