Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Saturday, November 2, 2013

036 The Flames of Prices, NannechODA's poetic Glory दामों के दावाग्नि ज्वालाए और, नन्नॆचोड महाकवी के कविता वैभव ధరల మంటలు -- నన్నెచోడ కవితా వైభవం


The manner at which prices of vegetables are flaring in India, should enflame the mind of every Indian with the exception of the Finance Minister of India. Of course, Mr. Chidambaram has already made clear that it is not the duty of his Government to control prices. But he considers that it is his duty to ensure that Indian Stock Exchanges boom and Sensex climbs up to over 20000. తోటకూర కట్ట రూ. 15/-. దొండకాయలు పావుకిలో రూ. 15/-.

ఇవి 3-11-2013 దీపావళి నాటి గుంటూరు కూరగాయల ధరలు. టపాకాయలు ఎలాగో కొనలేము. బ్రతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని అంటారు. ప్రస్తుతం, జనంలో పలువురికి బలుసాకు ఎక్కడ దొరుకుతుందో, ఎలా వండుతారో లేక నూరుకొని తాగుతారో తెలియదు కనుక, కనీసం ఆకులలములు తిని బ్రతకాలనుకునే వారికి తోటకూర కూడ దొరకని పరిస్థితి వచ్చింది. ఇటీవల ఎడతెగక కురిసిన వర్షాలతో ఆకుకూరల తోటలు మునిగి పోటం వల్ల ఈస్థితి వచ్చి ఉండవచ్చు. ఒక్క నెలలో పరిస్థితి మెరుగు కావచ్చు.

పూర్వం మునులు ఆకులు మాత్రమే తిని తపస్సు చేసే వారంటారు.

పరమేశ్వరుని పెండ్లాడాలనుకున్న పార్వతి, (హైమవతి _ హిమవత్ పుత్రి_ హిమవత్ పర్వతము యొక్క కుమార్తె) ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది, అంటారు. అందుకే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది అంటారు.

నన్నెచోడ మహాకవి కవితా వైభవం



నన్నెచోడ మహాకవి విరచిత కుమార సంభవం కావ్యం నుండి. షష్ఠాశ్వాసం. 90 వపద్యం. వచనం.
అట్లు గౌరి నగంబు నందు, పరమేశ్వరుం గోరి ఘోరతపంబు సేయం దొడంగి విహిత స్నానార్చనా హోమాది నిత్యకర్మంబుల, శాకాహార ఫలాహార పర్ణాహార జలాహార మారుతాహార నిరాహారాది మహాతపో వ్రతంబుల , నంద వాసాభ్రక వాసైక పాదాంగుష్ఠోర్ధ్వ బాహూర్ ఊర్ధ్వముఖాధోముఖా గ్నిముఖ పంచాగ్నిమధ్యాది అనేకోగ్ర తపంబులం, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ జప సమాధులను , షడంగ యోగంబుల, మనోవాక్కాయ కర్మంబుల, నతినిష్ఠానుష్ఠానంబులం బరమేశ్వరాధన తాత్పర్యయై , నిరంతారానంత తపోవృత్తిం బ్రవర్తించుచుండెనంత.

ఆహారానికి సంబంధించి నంత వరకు, తపో ___అంశాలు


ప్రథమదశ: శాకాహారం, కాయగూరలు.
ద్వితీయదశ: ఫలాహారం, పండ్లు మొదలగునవి.
జలాహార: మంచినీళ్ళు మాత్రమే.
మారుతాహార: గాలి ఆహారం.
నిరాహార : అసలు ఆహారమే లేకుండా.
ఆది మహాతపో వ్రతంబుల == మొదలైన గొప్ప తపోవ్రతములతో.


ఈ ధరల దెబ్బకు, ఏ గడ్డి పాకల్లో ఏ నారీ మణులు ఏఏ స్థాయిల్లో ఈఈ మహా తపో వ్రతాలు చేస్తున్నారో, హిమాద్రి తనయవలె తపః పునీత లవుతున్నారో మనకు తెలియదు.
చాలా మంది పట్టించుకోరు గానీ, మన వ్యవసాయం, కూరగాయలు--తోటలపెంపకాలు కుదేలవటానికి, పట్టణాలు విస్తరించి వ్యవసాయభూములను స్వాహా చేయటమే ముఖ్యకారణం.
సోనియా మాత, మన్మోహన్ సింగ్ మామయ్య, ఆహార భద్రత బిల్లు పెట్టామని డప్పు కొట్టుకుంటున్నారు. తోటకూర భద్రత బిల్లు, పాలకూర భద్రత బిల్లు, ఎప్పుడు ప్రవేశ పెడ్తారో?

To continue. सशेष. ఇంకా ఉంది.

03౫ భాగం 1, తెలుగు సినిమాల్లో హాస్య పద్య కవిత్వం Poetry of Comedy and Farce in Telugu films तॆलुगु फिल्मों मे हास्य पद्य कवित्व।

మహాకవి శ్రీశ్రీ సినీరంగంలోకి ప్రవేశించి మార్క్సిజానికి తిలోదకాలిచ్చారంటారు. పెట్టుబడిదారీ సమాజంలో ఏవ్యక్తికీ స్వాతంత్ర్యం ఉండదు. బ్రతుకు తెరువు కోసం కవైనా, గాయకుడైనా, నటైనా, ఎవరైనా, బానిసత్వం చేయాల్సిందే. ఎదురు తిరిగితే ఉపవాసాలే గతి.
అయితే అన్నం కొరకు కాక మందు సీసాల కొరకు ఊడిగం చేసే కవులు, రచయితలు ఉన్నారంటారు. కొందరి విషయంలో, కొన్ని చోట్ల, కొన్ని సమయాల్లో , మందు కూడా నిత్యావసర వస్తువుగా మారే అవకాశం ఉంది.
ఏది ఏమయితేనేం, మనం ప్రస్తుత వెబ్ పేజీ విషయంలో, కవిత్వాన్ని కవిత్వ కోణంలోంచి మాత్రమే చూసి రసానందాన్ని పొందుదాము.
సందర్భం: మామగారికి షష్టి పూర్తి. అల్లుళ్ళు ఆయనను ఆనందింప చేస్తున్నారు. చిత్రం కులగోత్రాలు. పద్యాల రచయిత శ్రీశ్రీ. గాయకులు. మొదటి పద్యం పిఠాపురం అనుకుంటాను. రెండవది మా. రచనను గానాలు మించి పద్యాల అందాలను ఇనుమడింప చేశాయి.


సంభాషణ:--
అత్తయ్యనీ మామయ్యనీ చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉన్నారు.

లాగా ఏంటి బ్రదర్! సాక్షాత్తూ ఆ పార్వతీ పరమేశ్వరులే వచ్చి కూర్చున్నారు.
కానీ, బ్రదర్ కరక్ట్.
ఈశుభ సమయంలో నాదొక చిన్న కానుక.
ఏది బ్రదర్ , ఎక్కడ బ్రదర్.
కూర్చో బ్రదర్ .
ఓహో సీక్రెట్టా!
పద్యం: --

మామా, (ఆఆఆఆ) శత్రుభయంకర
నామా (ఆఆఆఆ) అందానికి చందమామా
(మామామ ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ)
బలమున గామా నీవేకద మాభీమా (ధీమా)
కులధామా విశ్వదాభిరామా మామా . ఆఆ ఆఆ .
సదానందం! శభాష్, మామకు తగ్గ అల్లుడవనిపించావ్.
బ్రదర్ కందం అందంగా చదివావ్. కానీ యతి లేదు.
నీకు మతిలేదు బ్రదర్.
ఆషామాషీ కాదు, పెద్ద కవి చేత వ్రాయించాను.
లేడీస్ అండ్ జెంటిల్ మెన్. ఏదో చిన్నవాడిని. ఈశుభసమయంలో మామామ గారికి నాదీ ఒక చిన్న కానుక.
ఏమీ లేదు, మామ గారి మీసంపై సీసం.
సూర్యకాంతం: అదేంటబ్బాయ్ బంగారంలాటి మామగారి మీసంపై సీసం పోస్తానంటావ్?
వదినెగారూ, సీసం అంటే ఆ సీసం కాదు.



సీసపద్యం.

కారు మబ్బుల బారు సౌరు నే లెడితీరు
కోర మీసము పొందు కోరుకొందు

మృగరాజు జూలునే తెగనాడ జాలు
(మామా) నీ ఘన మీసము పసందు కనుల విందు

గండు చీమల దండు కదలాడి నటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు

మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
తేటగీతి.
ఎవరు మోయుచున్నారు ఈ అవని బరువు
ఆదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
(యా, అయితే మరి ఏదయ్యా!)
మామ మీసాలె భువికి శ్రీ రామ రక్ష
ఆఆఁ ఆఆఁ .
షేరింగ్ ఎలా?

ఎందుకో నాకు తెలియదు, పైపద్యాల mp3 లకొరకు వేటాడటం చాల క ష్టమై పోయింది. చివరికి telugump3.org అనే సైట్ లో దొరికింది. కావలసిన వారు స్వంత బాధ్యతపై డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈసైట్ కొంత సౌలభ్యంగానే ఉన్నది.


Added on 27.6.2015.
I have today visited the above site to download a Telugu MP3 song. I am sad to find that the quantity and quality of the site changed. There are a number of forced advertisements of Adult category. Now, it is extremely difficult to do download Telugu songs at the above site. I apologise to my readers.

ఈ రోజు నేను పై సైట్ ను ఒక తెలుగు ఎమ్ పీ ౩ పాట డౌన్ లోడ్ చేయటానికి విజిట్ చేయటం జరిగింది. బహుశా యాజమాన్యం మారి ఉండచ్చు. లేక యాజమాన్యం యొక్క స్వభావం మారి ఉండచ్చు. ఇప్పుడు అక్కడ తెలుగు పాటలను డౌన్ లోడ్ చేయటం చాల కష్టంగా మారింది. ఫోర్స్డ్ యాడ్స్ ప్రకటనలకు బలవంతపు క్లక్ లు, చాటుమాటున చిరుతపులలుల వలె పొంచి ఉండే క్లిక్ లు ఉన్నాయి. ఈనాటినుండి నేను పై సైట్ ను నా పాఠకులకు సూచించలేక పోతున్నాను. నా పాఠకులకు నేను చేసిన పొరపాటుకు నా క్షమాపణలు.
దీన్లో కొన్ని తప్పులు దొర్లాయి. సరిదిద్దటానికి ప్రయత్నించ గలను.

Friday, November 1, 2013

#034 సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప వాడా, జవహర్ లాల్ నెహ్రూ గొప్ప వాడా

సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప వాడా, జవహర్ లాల్ నెహ్రూ గొప్ప వాడా అనే ప్రశ్న 2014 ఎన్నికల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత సంతరించు కుంటున్నది.

Question: బిజెపీ వాదించి నట్లుగా నెహ్రూ కన్నా పటేల్ గొప్పనా?



జవాబు:

ఎవరి గొప్ప తనాలు వారికి ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నది వారసత్వ యుధ్ధము. నెహ్రూ గారి పేరు చెప్పుకొని కాంగ్రెస్ వోట్లు అడుగుతూ, నెహ్రూ వంశాంకురాలను అడ్డుపెట్టుకొని , కొందరు కాంగ్రెస్ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. నెహ్రూ కుటుంబం పేరు చెప్తే వోట్లు రాలవు అనే పరిస్థితి వచ్చినప్పుడు , వారు నెహ్రూను వదిలేసి మరొకరిని పట్టుకుంటారు. ఎందుకైనా మంచిదని, పటేల్ ను కూడా గొప్ప లౌకిక వాదిగా ప్రధాని మొదలగు వారు చిత్రిస్తున్నారు.

పటేల్ వారసత్వానికి తాము హక్కుదారులము, అని బిజెపీ భావిస్తున్నది. బిజెపి ప్రధాని అభ్యర్ధి శ్రీనరేంద్ర మోడీ ఆశిస్తున్న పటేల్ లౌకిక వాదం, తీవ్రవాద హిందూత్వ స్వభావానికి చెందినది. కానీ వాస్తవం ఏమిటంటే పటేల్ తీవ్ర వాద హిందూత్వం యొక్క సమర్ధకుడు కాడు. పటేల్ ఆచరణ వాది , ఆచరణశీలి. నమో గారి వలె కబుర్లరాయుడు కాదు.

Question: మీరు అమాయకుడైన నమో గారిపై అన్యాయమైన కబుర్ల రాయుడు అనే అరోపణ చేస్తున్నారు. నిరూపించక పోతే మీ తల వెయ్యి వక్కలవుతుంది.



నెహ్రూగారు స్వాప్నికుడు (కలలు గనే వాడు), పటేల్ గారు ఆచరణవాది అయినట్లే మోడీగారు కబుర్ల రాయుడు అవటంలో వింతేమీ లేదు. ఒక ఋజువు:

రాజకీయనేతలు, సోనియాతో సహా, ఏరోటి దగ్గర ఆ పాటలు పాడటంలో నిపుణులు. మోడీజీ ఒక పాట పాడారు. దేవాలయాల కన్నా శౌచాలయాలు (టాయ్ లెట్లు) ముఖ్యం. శ్రీవారు ఇటీవల అంగరంగ వైభవంగా , అడ్వాణీగారితో కలిసి ఒక శంకుస్థాపన చేశారు. రూ.2500 కోట్ల ఖర్చు. 576 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహం. అహో సొగసు చూడ తరమా!

విగ్రహారాధన గురించి వేరేచోట వ్రాశాను. ఇక్కడ శౌచాలయాలను కవర్ చేద్దాం. రూ.2500 కోట్లకు ఎన్ని శౌచాలయాలు వస్తాయి? ఒక్కో మరుగుదొడ్డి రూ.10,000 అనుకుంటే లక్షకు 10 వస్తాయి. కోటికి వెయ్యి. రూ.2500 కోట్లకు 25 లక్షలు. గుజరాత్ లో 18618 గ్రామాలు ఉన్నాయి. 25 లక్షలను 18618 తో భాగహారం చేస్తే , ప్రతి గ్రామానికి 134 టాయ్ లెట్లు వస్తాయి.

ఒక్కో మరుగుదొడ్డి ఖరీదు రూ.10,000 కాదు, రూ. 20,000 అనుకున్నా ప్రతి గ్రామానికి 67 టాయ్ లెట్లు వస్తాయి.

Question: టాయ్ లెట్ల సంగతి సరే , పటేల్ గొప్పనా, నెహ్రూ గొప్పనా?



గుండెకాయ గొప్పదా,కాలేయం గొప్పదా, మెదడు గొప్పదా, ఊపిరి తిత్తులు గొప్పవా మీరు చెప్పండి. అంతేకాదు, మనవాదన మమతా బెనర్జీ గారికి తెలిస్తే ఆమె తోక త్రొక్కిన త్రాచు వలె ఛెంగు మని లేచి , వారిద్దరి కన్నా నేతాజీ బోస్ గొప్పవాడు అంటుంది. ఆక్షణంలో ఏప్రాంతం వోట్లు కావాలా అనేదాన్ని బట్టి నినాదాలు మారుతూ ఉంటాయి.

టంగుటూరి ప్రకాశం గారు, బూర్గుల రామకృష్ణారావు గారు, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు (ఇంకా ఎందరో చరిత్ర కెక్కని వారు), పటేల్, నెహ్రూ, నేతాజీలకు తీసిపోరు. అయితే వారిని జాతీయ స్థాయిలొ ఎందుకు స్మరించరు? ఎందుకంటే వారు జాతీయ స్థాయిలో పదవులకొరకు ప్రయత్నించలేదు కాబట్టి.

అమ్మహనీయులందరూ స్వర్గస్థులై తారామండలాలకు చేరుకున్నారు. అల్డీబెరాన్ (రోహిణి) గొప్పదా, స్పైకా (చిత్త) గొప్పదా, రెగ్యులస్ (మఖ) గొప్పదా అంటే ఏమి చెప్పగలం?

వారి సిధ్ధాంతాల్లో ఉన్న , ఆచరణల్లో ఉన్న , అభిప్రాయ భేదాలను మనం సరిగా అర్ధం చేసుకొని, అవసరమైన సవరణలను చేసుకొని ముందుకు వెళ్ళటం అవశ్యం.

Wednesday, October 30, 2013

#033 ముందు రాజధానుల సంగతి తేల్చాలి First the Problem of States Capital should be settled


Telugu language & script: ముందు రాజధానుల సంగతి తేల్చాలి. First the problem of Capital should be settled. స్వల్పకాలిక దృష్టితో చూసినపుడు, విభజన వల్ల సీమాంధ్ర, తెలంగాణ రెండూ ఎక్కువగా నష్టపోతాయా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూసినపుడు రెండిటికీ లాభమే. When we view from the angle of 'short term', it appears as though owing to the bifurcation of United Andhra Pradesh,-- both Telangana and Residual Andhra Pradesh will lose. But when viewed from a long term perspective, both will benefit.

ఇద్దరికీ లభించే లాభాలు Benefits available to both the States


కేంద్రం ఏదైనా ప్రాజెక్టును , పథకాన్ని, రాష్ట్రాని కొకటి చొప్పున ఇవ్వాలనుకు న్నప్పుడు, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, మూడు రాష్ట్రాలు, ముగ్గురికీ మూడు వస్తాయి.
కేంద్ర ప్రభుత్వ శాఖల, సంస్థల, కార్పొరేషన్ల, కంపెనీల, బ్యాంకుల, బీమా కంపెనీల, ప్రాంతీయ కార్యాలయాలు రాష్ట్ర రాజధానుల్లో ఏర్పరుస్తూ ఉంటారు. రాష్ట్రం మూడు లేక నాలుగు చిన్న రాష్ట్రాలుగా విడిపోయినపుడు, మనకు మూడు లేక నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు వస్తాయి. ప్రైవేటు కంపెనీలు, విదేశీ సంస్థలు _కంపెనీలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలతో పైరవీలు చేసుకోటానికి రాష్ట్ర రాజధానుల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఏవిధంగా చూసినా రాష్ట్ర రాజధానులుగా ఉండే నగరాలకు అభివృధ్ధి అవకాశాలు ఎక్కువ. ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఈకారణాల వల్లనే సీమాంధ్ర ప్రజలు హైదరాబాదుకు పరుగెత్తటం జరిగింది. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో, అక్కడ భూమాఫియాలు చెలరేగుతాయి. హైదరాబాదులో భూములపై పట్టు సాధించటానికి తెలంగాణా భూస్వామ్య కులాలకు , కోస్తాంధ్ర భూస్వామ్య కులాలకు, రాయలసీమ భూస్వామ్య కులాలకు, జరుగుతున్న కుమ్ములాటే, తెలంగాణా ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం.

తెలంగాణకు Benefits to Telangana


మూడు ప్రాంతాల గురించి ఆలోచించే బాధ తప్పుతుంది, కాబట్టి తెలంగాణ పై ఏకాగ్రతతో పని చేయచ్చు.
కొన్నాళ్ళ వరకు హైదరాబాదు ఆదాయం పెరుగుదల నెమ్మదించదు. అయితే అది 23 జిల్లాల ప్రజలతో వచ్చే floating population, floating demand, ల మార్కెట్లను కోల్పోతుంది. పాత హైదరాబాదు రాష్ట్రానికి రాయచూర్, గుల్బర్గా, నాందేడ్, పర్భానీ, బీదర్, మొదలగు కర్నాటక, విదర్భ ప్రాంతాల మార్కెట్లు ఉండేవి. 1956లో ఆజిల్లాలను తెలంగాణా కోల్పోయింది. ఇప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర మార్కెట్లను కూడా కోల్పో బోతుంది, కాబట్టి హైదరాబాదు మాల్స్, ఉస్మాన్ గంజి, బేగం బజార్, రాష్ట్రపతి రోడ్, వంటివి నిస్తేజం అవుతాయి.
అయితే హైదరాబాదు నగరంపై ట్రాఫిక్ వత్తిడి తగ్గు తుంది. నీటి సరఫరా మెరుగవుతుంది. సిటీ బస్సులు ఖాళీ అవుతాయి. ధ్వని కాలుష్యం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గుతుంది.

రాయలసీమకు


వాతావరణ సూచన , రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుంది అనేదాన్ని బట్టి ఉంటుంది.

అసలు కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఎక్కడ అనేది పరిష్కరించ కలుగుతుందని నేను అనుకోను. ప్రస్తుతానికి నేతలందరూ గుంభనంగా ఉన్నారు. మంత్రిణులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి మాత్రమే విజయవాడ అన్నారు. విజయవాడ పరిసరాల్లో భూమి కొరత తీవ్రంగా ఉన్నది. గుంటూరు_ కర్నూలు, రోడ్, రైలు మార్గాల దుస్థితిని లెక్కలోకి తీసుకుంటే , కర్నూలు_విజయవాడ_విశాఖల్లో ఏది రాజధాని అయినా రాష్ట్రప్రజలకు నరకయానం తప్పదు.

కర్నూలుని రాజధాని చేస్తే అక్కడికి కోస్తాంధ్రుల వలస తప్పని సరి అవుతుంది. అప్పుడైనా ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పైకెగయక మానదు. ఆపనేదో ఇప్పుడే చేసుకుంటే అచ్చమ్మ పెళ్ళి లో బుచ్చమ్మ శోభనంలాగా, తెలంగాణాతో పాటు రాయలసీమ సమస్యలు కూడా పరిష్కార మార్గం పట్తాయి.

కోస్తాంధ్రకు


రాజధాని ఉన్నా, లేకున్నా, కోస్తాంధ్రకు ఒక్క రాష్ట్రం లేక రెండు రాష్ట్రాలు లాభదాయకం. 1.ఉత్తరాంధ్ర, విశాఖ లేక రాజమండ్రి రాజధానిగా. 2.దక్షిణాంధ్ర. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఏవైనా రాజధానికి అర్హమైన ప్రదేశాలే. నెల్లూరును వారు కోరితే రాయల సీమలో కలిపినా వారికి ఇబ్బంది ఉండదు.

కొత్త రాష్ట్రం అభివృధ్ధి పథంలో దూసుకు వెళ్లటం మటుకు నిశ్చయం. హైదరాబాదు చుట్టూ తిరగ వలసిన అవసరం తప్పుతుంది.

సారాంశం
______

ఏది ఏమైనా అన్ని ప్రాంతాల తెలుగు వారు ఏకమై ఐకమత్యంగా చర్చించుకొని చిన్నరాష్ట్రాల దారి పట్టటం మేలు. కెసీఆర్&కో, దానికి దాసురాలైన సోనియా , మరియు కేంద్రాల పెత్తనం నుండి బయట పడాలంటే ఐకమత్యం అవసరం.

#032 అతివిగ్రహారాధన జబ్బు ailment of excess idol worship

అతివిగ్రహారాధన జబ్బు తెలుగు వాళ్ళకు మాత్రమే ఉందనుకుంటే మనం భ్రమ పడ్డట్లే. ఇది భారత జాతి మొత్తానికీ ఉంది. ప్రపంచం మొత్తానికీ ఉందన్నా తప్పు లేదేమో.

మూఢ విశ్వాసాలు భారతీయులకు మాత్రమే ఉంటాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. సైన్స్ పరంగా ఎంతో అభివృధ్ధి చెందాయని, మనం అనుకునే పాశ్చాత్య దేశాల శాస్త్రజ్ఞులు కూడా రకరకాల మూఢ విశ్వాసాలతో బాధ పడటాన్ని మనం గమనించ వచ్చు. మూఢ విశ్వాసాలను అమలులో పెట్టే తీరులో భేదం ఉండవచ్చు.

పాశ్చాత్య దేశాలకు, మనకు, ఒక పోలిక కూడా ఉంది. (వాళ్ళు, మనం, అందరం ఆర్యుల రక్తం కలిసిన వాళ్ళం కదా). పోలిక ఏమిటంటే, అమలు చేసుకునే టప్పుడు , ఎంత ఖర్చైనా సరే, వాళ్ళూ వెనకాడరు, మనమూ వెనకాడం. ముఖ్యంగా మన క ష్టార్జితం కాకుండా లంచార్జితమో, జనం డబ్బో, అయితే ఇంక చెప్పాలా భోగం!

పటేల్ విగ్రహానికి 2500 కోట్లా?



నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న వాడు. అయ్యగారు దేశ ప్రధాని అయితే, కొన్ని ట్రిలియన్ల భారత ప్రజా ద్రవ్యం వ్యయం చేసే అధికారం చేతిలోకి వస్తుంది. ఒక మధ్య శ్రేణి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే , కేవలం సర్దార్ పటేల్ విగ్రహారాధనకు రూ. 2500 కోట్లు ఖర్చు చేయటానికి సిధ్ధం అవుతున్నాడంటే, గుజరాత్ ప్రజలు ఎంత పేదలో ఆయనకు తెలియదనుకోవాలా? లేక విగ్రహారాధన వ్యామోహాన్ని ప్రజల్లోకి కైపెక్కించి తన సామ్రాజ్యాన్ని స్థిరీకరించు కోవాలనుకుంటున్నాడా?

సర్దార్ పటేల్ ను స్మరించుకోటంలో తప్పు లేదు. ఆయన స్మృతి ప్రజల్లో కలకాలం ఉండాలంటే, ఆయన ఆలోచనలను, ఆదర్శాలను, ఆచరణలోకి తెచ్చుకోటం సదా వాంఛనీయమే. విగ్రహాలతో ఆపని జరుగదు కదా. విగ్రహాలు దండలు వేయటానికి పనికి వస్తాయి. క్షీరాభిషేకాలు చేసుకోటానికి పనికి వస్తాయి. పక్షులు గూళ్ళు పెట్టుకోటానికి పనికి వస్తాయి. ద్వేషించే వాళ్ళు, చెప్పుల దండలు వేయటానికి పనికి వస్తాయి.

మాయావతి కూడా ఇలా విగ్రహాల వ్యామోహంలో పడిపోయి ఉత్తర ప్రదేశ్ లో కొన్ని వందలకోట్లు ఖర్చు చేసింది.

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టగానే ఆయనపై భారత ప్రజలకు, తెలుగు ప్రజలకు , గౌరవం ఎంత శాతం పెరిగింది?

రష్యాలో బోల్షవిక్ విప్లవం కొత్త మోజు ఉన్న కాలంలో, మార్క్స్, లెనిన్, స్టాలిన్, విగ్రహాలను భారీ ఖర్చుతో ఏర్పాటు చేశారు. సోవియట్ విఛ్ఛిన్నానంతరం, వాటిని కూలగొట్టి , ఆ కంచును తుక్కు కింద వేలం వేయగా , ఆ తుక్కు భారత్ కు దిగుమతి అయ్యి , కరిగించబడి, పంజాబ్ లో water taps తయారీకి ఉపయోగ పడ్డాయి.

ఇరాక్ లో సద్దాం హుస్సేన్ విగ్రహానికి అమెరికా వారు ఏమి గతి పట్టించారో , మరువ లేని దృశ్యం.

ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని ఆయన బ్రతికి ఉండగానే విజయవాడ కెనాల్ రోడ్ లో నెలకొల్పారు. ఆయన బ్రతికి ఉండగానే వేరే బ్యాచ్ వారు ఆ విగ్రహాన్ని కాలువలోకి తోశేశారు.

హైదరాబాదు టాంకుబండుపై ఎన్టీఆర్ పెట్టించిన విగ్రహాలకు తెరాస వారు ఏమి గతి పట్టించారో అందరికీ తెలుసు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహారాధన నడుస్తున్నది.

కలకాలం ఒక్కరీతి గడువదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా ఆని రంగుల రాట్నం సినిమాలో ఒక పాట ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని వేల గాంధీ , కొన్ని వందల నేతాజీ విగ్రహాలు దీనావస్థలో ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు మటుకు తత్ పార్టీ వాళ్ళు రంగులు వేయటం వంటి పనులు చేస్తున్నారు.

దేవుళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రస్తుతం షిర్దీ శాయిబాబా , అయ్యప్పల శకం నడుస్తున్నది.

విగ్రహారాధనలతో ప్రధాన సమస్య ఏమిటంటే, అవి వనరుల వృథాకు దారి తీస్తాయి. ఏటా షిర్దీ యాత్రలపై మనం ఎన్ని లక్షల లీటర్ల డీజెల్ వ్యయం చేస్తున్నామో, తలుచుకుంటే, భారత్ ఇంధన దిగుమతులు ఎందుకు అదుపు తప్పాయో అర్ధం అవ్వచ్చు.

Tuesday, October 29, 2013

031 Musings on Beauties of Telugu language poetry ఎర్రన కవితా సౌందర్యం


Errana, also known as Erra Preggada, was a Telugu Poet of 14th CE. His main works are completing the Unfinished Volume 3 Book of Forests of Telugu Maha Bharata. His second equally great work was Hari Vamsa (The Clan of Lord Hari). Errana is a part of the Trinity of Great Telugu Poets who translated Vyasa's Sanskrit Mahabharata into Telugu. The Telugu Mahabharata has about 25,000 verses, as against nearly 1,15,000 verses in Vyasa's Sanskrit original.

ఎర్రన కవితా సౌందర్యం. The Lyrical Beauties of Errana's poetry


కవిత్రయంలో ఎర్రన (ఎఱ్ఱాప్రగ్గడ) మూడవ వాడని మనందరికీ తెలుసు. నన్నయ కాలధర్మం పొందగా, అరణ్య పర్వం అసంపూర్ణంగా మిగిలింది. తిక్కన తత్ శేషభాగాన్ని ముట్టుకోకుండా, విరాట పర్వం నుండి మిగిలిన ౧౫ పర్వాలను పూర్తి చేయటం విదితం.

తిక్కన వదలిన అరణ్య పర్వ శేషాన్ని ఎర్రన పూర్తి చేశాడు.

ఇప్పుడు ఎర్రన కవితా సౌందర్యాన్ని చూద్దాం.

ఆంధ్ర మహాభారతం. అరణ్య పర్వం. సప్తమాశ్వాసం (7వ భాగం).

ఘట్టం: రామాయణం. సీత అగ్ని ప్రవేశం. శ్రీరాముడు, సీతతో ఏమన్నాడో అవధరించండి. Context: Narration of Ramayana in Mahabharata's Book of Forests (Aranya Parva). Ravana was slain by Shri Rama. Shri Rama's wife was brought into his presence. Seeing his wife after a gap of one year, Shri Rama ought to have embraced her. But, instead he was asking her to go to anywhere she like.
ఆటవెలది.
పరగ కుక్క వాత పడిన హవ్యము భంగి
అయ్యె నీతెఱంగు అరయ నిపుడు
కాన ఇచట తడయ కాదు చెచ్చర నీకు
ఇష్టమైన యెడకు ఏగు మతివ.


Analysis


కుక్క ముట్టుకున్న హవ్యము అంటే కుక్క ముట్టుకున్న హోమద్రవ్యము. సీతను రాముడు ఇలా అనవచ్చా?
అయితే ఈ నీచోపమ ఎర్రనది కాదు. వ్యాసుడిదే. వ్యాస భారతం, అరణ్య పర్వం, ౨౭౪ ఆధ్యాయం చూద్దాం.
13వ శ్లోకం. సువృత్తామ్ అసువృత్తాం వా అపి అహం తవామ్ అథ్య మైథిలి,
నోత్సహే పరిభోగాయ శ్వా అవలీఢం హవిర్ యదా.


శ్వా అంటే కుక్క. హవిర్ అంటే యజ్ఞ ద్రవ్యాన్ని. సువృత్తం వా, అసువృత్తం వా, అనటం గమనించండి. అంటే నీవు, సుశీల వైనా సరే, దుశ్శీల వైనా సరే, నేను నిన్నామోదించను, అని సూచన.
ఎర్రనకు మూలానుగుణంగా వెళ్ళే బాధ్యత ఉంది కాబట్టి ఆయనను ఏమీ అనలేం.

పురాణోపన్యాసకులు వాడే చలిమిడి లాగా తొక్కిన వివరణ ఒకటి ఉంది. సీత యొక్క పాతివ్రత్య మహిమను ప్రపంచానికి నిరూపించేటందుకే శ్రీరాముడు కఠినపు మాటలాడి సీతను అగ్ని ప్రవేశించాడు.



ybrao a donkey's views which are not intended to be imposed on others.


సీత పాతివ్రత్యాన్ని ప్రపంచానికి నిరూపించటమే శ్రీరామ ధ్యేయమే అయితే, అయనే అగ్ని ప్రవేశం చేసి ఉండ వలసినది.

సీతా మహాసాధ్వి యొక్క పాతివ్రత్య గరిమను లోకానికి ప్రకటించే లక్ష్యంతో నేను అగ్ని ప్రవేశం చేస్తున్నాను. ఓ ఇంద్రా, ఓ జాతవేదా మీరు నన్ను దహించకుండా, వెనక్కు పంపి, సీతా పవిత్రతను లోకానికి ఉద్ఘాటించండి అని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ, రాముడు నిప్పుల్లోకి దూకి ఉండాల్సింది.

సీత ప్రత్యుత్తర పద్యాలలో ఒకటి మచ్చుకు

ఉత్పలమాల.
నాదగు బుద్ధి నీదగు చరణ స్మరణంబ యొనర్చు కాని యొం
డేదియు ఎన్నడున్ తలపదు ఇట్టిద ఒండొక చందమైన ఇ
మ్మేదినియున్ కృశానుడు సమీరుడు శీతకరుండు అర్కుడు న్
కాదన క ఈక్షణంబ నను కాల్చరె వేల్పులు చూచి సైతురే.

030 Premature old age of poetic rhythm and prosody in Telugu language ఛందో కవిత్వము యొక్క అకాల వృధ్ధాప్యము

017 తెలుగు ఛందో కవిత్వం అస్తమించిందా?

ఛందోబధ్ధమైన తెలుగు కవిత్వానికి కాలం చెల్లిందేమో అనే అభిప్రాయం పలువురిలో ఉంది.

కర్ణుడి చావుకు పది కారణాలు లాగా, ఛందో కవిత్వ అకాలవృధ్ధాప్య జనిత మరణోన్ముఖతకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దృశ్య శ్రవణ సౌఖ్యాలకు అలవాటు పడి బానిసలైన విద్యా వంతులు తమ అక్షరాస్యతను కోల్పోటం కూడా ఒక ముఖ్య కారణం. ఇవన్నీ social environment సాంఘిక వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అనుకుందాం, కాబట్టి ఛందోకవిత్వ దోషమేమీ లేదనుకుందాం.

ఛందోకవిత్వం యొక్క స్వంత బలహీనతలు చక్క దిద్ద బడక పోతే అది ఇంకా అధిక పతన యాన వేగంతో ముందుకు వెళ్లుతుంది. కాబట్టి ఛందోభిమానులు, సృజనకారులు, దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలి.

బలహీనతలకు కొన్ని ఉదాహరణలు: ప్రాస కోసం పాకులాడటం. కృత్రిమ యతులను సృష్టించటం. తగినంత పదజాలాన్ని vocabulary సమకూర్చుకోకుండా పదాలనే కృత్రిమంగా మార్చటానికి పూనుకోటం.

దీర్ఘ సమాసాలను వాడటం సబబా?



రసభంగం కానంత వరకు, పఠనా సౌలభ్యానికి అభ్యంతరకరం కానంత వరకు దీర్ఘ సమాసాలు ఆమోద యోగ్యమేనేమో అనిపిస్తుంది. నన్నయ, శ్రీనాథుడు, పోతన మొదలగు మహాకవులెందరో దీర్ఘసమాసాలను వాడి కూడా ప్రజల నాలుకల్లో జీవిస్తున్నారు.
శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు! భక్త పాలనకళా సంరంభకున్! దానవో
ద్రేక స్తంభకు! కేళీలోల విలసద్ దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు నందాంగనా డింభకున్!

సారాంశం
______

ఛందో కవితా కర్తలు పెరగాలి. పాఠకులూ పెరగాలి. ఒక నందనం విరబూయాలి.

Monday, October 28, 2013

#029 వీరేశలింగం గారి కవితా శైలి

వీరేశలింగం గారి కవితా శైలి. ఈక్రింది పద్యాలు, అభాగ్యోపాఖ్యానము అని 1898 లో ప్రచురించ బడిన 18 పేజీల గ్రంధం లోనివి.

సందర్భము


పాండవులు వనవాసం చేస్తున్నారు. ధర్మరాజు విచారంతో ఉన్నాడు. ఆయనను ఊరడించటానికి, ఒక పరిహాసకుడు, ఈకథను ఆయనకు చెప్పాడు. ఇందులో కులాల ప్రస్థావన, పాండవుర కాలం నాటిది లేక, భారతం తన లిఖిత స్వరూపాన్ని సంతరించుకున్న గుప్తుల కాలం నాటిది కావచ్చు. వీరేశలింగం గారి 1898 నాటికి చాతుర్వర్ణ్యాల ప్రస్తావన కొంత ఉన్న ప్పటికీ ఈవ్యంగ్యం భారత ధర్మరాజును సంతోష పెట్టటానికి ఉద్దేశించినదే అవుతుంది. అభాగ్యోపాఖ్యాన కాలం నాడి సమాజంలో వివిధ వర్గాల లక్షణాలు వర్ణించారు.

బ్రాహ్మణులు

వెలయాలి నింటనే విడియించి దానిచే తిట్టులు తన్నులు తినెడి వారు,
తల్లి పోయిననాడు దాని ఇంటనే యుండి పని యున్నదిదె వత్తుననెడి వారు,
కన్నెరికము చేయు కార్యంబునకు పూర్వులార్జించు మాన్యమ్ము లమ్ము వారు,
భోగకాంతలు గాక పొరుగు వారల భార్యలను జేరి సౌఖ్యంబు గనెడు వారు,

విలువ సారాయి సీసాల కొలది త్రావి
ఒడలు తెలియక వీధుల బడెడి వారు
నగుచు మర్యాదలను గాంచు రనవరతము
బ్రాహ్మణోత్తములా దివ్య పట్టణమున.

క్ష త్రియులు

కురుబలముం గనుంగొనుచు కోటి తురంగ జనంబుతోడ ను
త్తరుడరదంబు డిగ్గి పురి తట్టునఁ బారియుఁ గ్రీడి ప్రేరణన్
మరలగఁ బోరికేగుటకు నవ్వుచు నుందురు పోటుబంటులై
పిరికి తనంబునం బురిని బేరు వహించిన రాజ పుంగవుల్.

వైశ్యులు


బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కు కలిపి
నేతి లో నంటి పండ్లను నెరయ పిసికి
తప్పు తూనిక తూచుచు తక్కువగను
కొలుచు చునుకోమటులు సొమ్ము కూర్చు కొండ్రు.

శూద్రులు


కూట సాక్ష్యంబు బ్రాహ్మణ గురులవలన
బాగు గానేర్చు కొని పాటు పడుట మరచి,
జూదములు దొంగతనముల శూరలగుచు,
శోభ కాంతురు పురలోన శూద్ర జనులు.

Sunday, October 27, 2013

028 Limits to criticisms between Jagan and Chandra Babu Naidu జగన్ మరియు చంద్ర బాబు నాయుడుల మధ్య విమర్శలకు పరిమితి అవసరం.


Wont's Mr. Jaganmohan Reddy and Mr. Chandra Babu Naidu have any secret understandings? Mr. Naidu said on 27.10.13 that Jagan had a secret understanding with Ms. Sonia Gandhi and that Jagan had permission of Sonia Gandhi, to say "Will you go to Italy?".

On 26.10.2013, in the "Samaikya SankhArAvam" Rally for United Andhra Pradesh, Mr. Jaganmohan Reddy was reported to have asked Ms. Sonia Gandhi whether she should like to go back to Italy. 26.10.2013 సమైక్య శంఖారావం హైదరాబాదు సభలో "ఇటలీ వెళ్తారా" అని జగన్ సోనియాను అడిగిన విషయం పాఠకులకు విదితం.

27.10.13 శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. సోనియా అనుమతితోనే జగన్ సోనియాపై ఆవిమర్శ చేశారుట. ఇదంతా వారిద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగమేనట.

సోనియా జగన్ లమధ్య రహస్య ఒప్పందాలు ఉంటే ఉండ వచ్చు. కానీ ప్రతి దాన్నీ రహస్య ఒప్పందంలో భాగం అంటే ఎలా? అలా అనుకుంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారికీ, నరేంద్ర మోడీకి ఏరహస్య ఒప్పందాలున్నాయో ఎవరికి తెలుసు? శ్రీ చంద్రబాబు నాయుడు గారికీ, శ్రీకిరణ్ కుమార్ రెడ్డి గారికీ , ఏమి రహస్య ఒప్పందాలున్నాయో ఎవరికి తెలుసు?

సోనియా, జగన్, శ్రీ చంద్రబాబు నాయుడు ల మధ్య అవినీతి లో ఉండే అంతరాలు స్వల్పమైనవా, సంక్లిష్టమైనవా అనేది తెలిసేది, సరియైన విచారణలు జరిగితే కదా .

శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి దానినీ ప్రజలు నమ్మాలని కానీ, నమ్మకూడదని కానీ ఏమీలేదు. భారీగా వోట్లు వచ్చినంత మాత్రాన నమ్మారని కూడా ఏమీలేదు. ప్రజలు, ముఖ్యంగా పేదలు, చిన్నరైతులు తమ బాధల్లో తామున్నారు.

ఈ సందర్భంగా మనం వేమన గారిని స్మరించుకోవాలి.
తప్పు లెన్ను వారు తండోప తండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ.


Added on 16th Jan. 2016

Both Mr. Chandra Babu Naidu and Mr. Y. Jaganmohan Reddy have let down the people of Residual Andhra Pradesh.

To be re-written. पुनः समीक्षा करने का है. పునః సమీక్షించ వలసి ఉన్నది.

027 What for, were the showers of flowers? पुष्प वर्ष क्यों ? श्री राम ने क्या घना घन कार्य किया ? ఎందుకో పుష్ప వర్షం ? ఏమి ఘన కార్యం జరిగిందని


What for were the showers of flowers from the sky? Did Shri Rama kill any invading foreigner? తపస్సు చేస్తున్న శూద్ర మునిని చంపిన శ్రీరాముడు

ఈ పద్యాలు తిక్కన కవిబ్రహ్మ వ్రాసిన నిరవచనోత్తర రామాయణం, 10వ ఆశ్వాసం లోనివి.
మత్తేభం.
నరనాధుండిటు లెట్టకేలకు విలీనంబైన చిత్తంబు సు
స్థిరభావంబున బట్టుకొల్పి కొని నిశ్చింతాత్ము నత్తాపసున్
శరణార్ధి స్ఫుట రక్ష కోరి తునిమెన్ సంరంభ శూన్యాంగుడై
కరవాలంబు మృదుక్రియం బెరికి రేఖాహీన దీన స్థితిన్.


అపుడు కుసుమ వర్ష మాకసంబెల్లను
పొదివె దేవ దుందుభులు సెలంగె
హరిహరాది దివిజు లంతరిక్షంబున
నిలిచి సంస్తుతించి రెలమి మిగుల.

సారాంశము
_______



సందర్భం. రాముడు అప్పటికే సీతను అడవికి పంపాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు , చనిపోయిన తన కొడుకు శవాన్ని తీసుకొని రాముడి కొలువుకు వచ్చాడు. ఏడుస్తున్న ఆబ్రాహ్మణుడిని చూసి రాజగురువు వశిష్ఠుడు ఇలా అన్నాడు.

ఇప్పుడు శూద్రుడొక్కడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. అందుకే ఈ బాలుడి మరణం సంభవించింది. నీవు ఏ మాత్రం కృప, సందేహం లేకుండా, ఆ శూద్రుడిని చంపిరా. అప్పుడే ఈ బాలుడు బ్రతుకుతాడు.



రాముడు ఆబాలుడి శరీరాన్ని తైలంలో నిలువ ఉంచమని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు. పుష్పక విమానం ఎక్కాడు. దండకారణ్యంలో ఆశూద్రుడిని గాలించి పట్టుకొని, కత్తి దూసి ఆశూద్ర ముని తల నరికాడు.

పరిశీలన
_____
1. శ్రీరాముడు ఏమి ఘనకార్యం చేశాడో కానీ పూల వర్షం కురిసిందట. దేవ దుందుభులు మ్రోగాయిట. హరిహరాదులు, మొ. దేవతలు అంతరిక్షంలో నిలబడి రాముడిని చాలా పొగిడారు. 2.ఎందుకో? హరి అంటే విష్ణువు. హరుడు అంటే శివుడు. హరి, శ్రీరాముడిగా అవతారమెత్తి, మానవ రూపంలో భూమిపై ఉంటే , ఆకాశంలో ఎలా ఉంటాడు. ఒకేసారి రెండు చోట్ల ఉండటం దేవతలకు సాధ్యమే అనేవాళ్ళుంటారు.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |